ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో విజయవంతంగా ఎన్నికలు పూర్తి అయిన సంగతి తెలిసిందే. ఇవాళ(గురువారం) తెలంగాణలో విజయవంతంగా అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. అయితే రాజకీయనాయకులు ఎన్నికల్లో గెలుపుకోసం, అధికారం కోసం రకరకాల పూజలు హోమాలు చేస్తంటారనేది సాధరణ విషయమే. కానీ ఇటీవలేఓ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన మధ్యప్రదేశ్‌లోని కొందరూ రాజకీయ నాయకులకు సంబంధించి ఓ ఆసక్తికర ఘటన వెలుగులోకి వచ్చింది. పండిట్ బతుక్ ఆచార్య అనే సిద్ధాంతి, అతడి సహచరులు పోలింగ్ ముగిసిన మూడు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థుల కోసం గత రెండు నెలలుగా రహస్య పూజలు చేస్తున్నట్లు తెలిపారు.
ఆయా నాయకులంతా రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి పోటీచేస్తున్నారని అన్నారు. దాదాపు 18 మంది అభ్యర్థుల కోసం తమ శిష్యులు గత రెండు నెలలుగా రహస్య పూజలు పారాయణాలు చేస్తున్నట్లు తెలిపారు. ఆయా రాష్ట్రాల్లోని తమ శిష్యులంతా ఆయా అభ్యర్థుల విజయం కోసం శ్రద్ధగా మంత్రలు పఠిస్తూ ప్రార్థనలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఎన్నికల్లో గెలుపు కోసం పూజలు, ప్రార్థనలు చేయడం అనేవి భారత రాజకీయ నాయకులు ప్రబలంగా ఉన్న సంప్రదాయం, నమ్మకమూ కూడా.
కాగా, గత నెలలోనే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ తమ పార్టీ నాయకులు ఓట్ల కోసం ప్రజలతో మమేకమై వారికి మేలు చేసే పనులపై దృష్టి సారిస్తే..కొందరూ రాజకీయ నాయకులు గెలుపు కోసం తాంత్రిక పూజలు చేసే పనుల్లో ఉన్నారంటూ వ్యాఖ్యలు చేశారు. అది నిజం అనేలా ఈ ఆసక్తికర ఘటన తెర పైకి రావడంతో చర్చనీయాంశంగా మారింది. ఇక ఆ ఐదు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న జరగనుంది.
(చదవండి: మధ్యప్రదేశ్‌లో కలకలం రేపుతున్న పోస్టల్ బ్యాలెట్ వివాదం! అధికారులే తెరిచారని..)
Comments
Please login to add a commentAdd a comment