poojalu
-
గెలుపు కోసం పూజలు చేస్తున్న అభ్యర్థులు..ఏకంగా రెండు నెలల నుంచి..
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో విజయవంతంగా ఎన్నికలు పూర్తి అయిన సంగతి తెలిసిందే. ఇవాళ(గురువారం) తెలంగాణలో విజయవంతంగా అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. అయితే రాజకీయనాయకులు ఎన్నికల్లో గెలుపుకోసం, అధికారం కోసం రకరకాల పూజలు హోమాలు చేస్తంటారనేది సాధరణ విషయమే. కానీ ఇటీవలేఓ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన మధ్యప్రదేశ్‌లోని కొందరూ రాజకీయ నాయకులకు సంబంధించి ఓ ఆసక్తికర ఘటన వెలుగులోకి వచ్చింది. పండిట్ బతుక్ ఆచార్య అనే సిద్ధాంతి, అతడి సహచరులు పోలింగ్ ముగిసిన మూడు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థుల కోసం గత రెండు నెలలుగా రహస్య పూజలు చేస్తున్నట్లు తెలిపారు. ఆయా నాయకులంతా రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి పోటీచేస్తున్నారని అన్నారు. దాదాపు 18 మంది అభ్యర్థుల కోసం తమ శిష్యులు గత రెండు నెలలుగా రహస్య పూజలు పారాయణాలు చేస్తున్నట్లు తెలిపారు. ఆయా రాష్ట్రాల్లోని తమ శిష్యులంతా ఆయా అభ్యర్థుల విజయం కోసం శ్రద్ధగా మంత్రలు పఠిస్తూ ప్రార్థనలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఎన్నికల్లో గెలుపు కోసం పూజలు, ప్రార్థనలు చేయడం అనేవి భారత రాజకీయ నాయకులు ప్రబలంగా ఉన్న సంప్రదాయం, నమ్మకమూ కూడా. కాగా, గత నెలలోనే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ తమ పార్టీ నాయకులు ఓట్ల కోసం ప్రజలతో మమేకమై వారికి మేలు చేసే పనులపై దృష్టి సారిస్తే..కొందరూ రాజకీయ నాయకులు గెలుపు కోసం తాంత్రిక పూజలు చేసే పనుల్లో ఉన్నారంటూ వ్యాఖ్యలు చేశారు. అది నిజం అనేలా ఈ ఆసక్తికర ఘటన తెర పైకి రావడంతో చర్చనీయాంశంగా మారింది. ఇక ఆ ఐదు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న జరగనుంది. (చదవండి: మధ్యప్రదేశ్‌లో కలకలం రేపుతున్న పోస్టల్ బ్యాలెట్ వివాదం! అధికారులే తెరిచారని..) -
కార్తీక మాసం శోభను సంతరించుకున్న వరంగల్ లోని శివాలయాలు
-
గిరినాగే.. ఇలవేల్పు
పూజలు చేస్తున్న గిరిజన మహిళ రాజవొమ్మంగి మండలం లాగరాయి శివారున సంఘటన రాజవొమ్మంగి : సాధారణంగా గిరినాగు (కింగ్‌కోబ్రా) ఉందంటే చాలామంది భయంతో వణికిపోతారు. ఆ చుట్టుపక్కలకు వెళ్లేందుకే భయపడతారు. 20 మీటర్ల ఎత్తువరకూ పైకి లేచి ఒకేసారి 10, 15 మందిపై దాడి చేసే గిరినాగు గురించి మాట్లాడుకోవడానికే ధైర్యం చాలదు. అలాంటిది ఓ గిరిజన మహిళ తన పూరి గుడిసెలో ఇరుకుగా, చీకటిగా ఉన్న ఓ గదిలోకి ప్రవేశించిన గిరినాగును నాలుగు రోజులుగా పూజిస్తున్న విషయం ఆదివారం వెలుగు చూసింది. ఆరేళ్లుగా నాగదేవత కనిపిస్తుందని.. రాజవొమ్మంగి మండలం లాగరాయి శివారున ఉన్న జీడిమామిడి తోటలో పూసం సత్యవతి, అబ్బాయిదొర దంపతులు తమ ఇద్దరు పిల్లలతో నివసిస్తున్నారు. ఏటా ఉగాదికి ముందు తొమ్మిది రోజులపాటు తమ తోటలో ఉంటే పోశమ్మ గుడి వద్ద వసంత రాత్రులు అనే పండగ జరుపుతుంటారు. చివరి రోజున భారీ అన్నసంతర్పణ నిర్వహిస్తారు. పండగ రోజుల్లో ఏదో ఒక రోజు గుడి వద్ద లేదా ఇంట్లో నాగదేవత కనిపించడం ఆరేళ్లుగా జరుగుతుంది. అయితే శుక్రవారం దాదాపు ఎనిమిది మీటర్ల పొడవు మూడు అంగుళాల మందం ఉన్న భారీ సర్పం అందరూ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించి తిష్ట వేసింది. అదే గదిలో ప్రతిరోజూ సత్యవతి పూజలు నిర్వహించే పూజా మందిరం ఉంది. ఆ పామును చూసి మొదట భయానికి గురైన కుటుంబసభ్యులు, ఏటా వచ్చే నాగదేవత ఈ భారీ నాగదేవత ఒకటే అని తెలుసుకుని తమ భయాన్ని విడిచి పెట్టారు. నాలుగు రోజులుగా భారీ సర్పం పూజ మందిరంలో ఉండగానే పూజలు నిర్వహించడం స్థానికంగా సంచలనం సృష్టించింది. విషయం తెలిసిన చుట్టు పక్కల వారు అధిక సంఖ్యలో ఆ ఇంటికి వచ్చి సర్పరాజుని దర్శించుకుంటున్నారు. -
‘సన్’దోహం
అంబరాన్నంటిన రథసప్తమి వేడుకలు భక్తులతో కిటకిటలాడిన సూర్యనారాయణ మూర్తి ఆలయాలు ఆదిత్యుడికి ఘనంగా పూజలు ∙వైభవంగా రథోత్సవాలు జి.మామిడాడ(పెదపూడి) : రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన జి.మామిడాడ గ్రామంలోని సూర్యనారాయణ మూర్తి స్వామి వారి రథోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. సూర్యభగవానుడి పుట్టిన రోజైన రథసప్తమి పర్వదినం సందర్భంగా రథోత్సవం వైభవంగా నిర్వహించారు. ఉదయం 5.45 గంటలకు భక్తులు ఆలయ ప్రాంగణంలో సూర్యనమస్కారాలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు రేజేటి వెంకటనరసింహాచార్యులు ఉదయం నుంచి స్వామి వారికి ప్రత్యేక, విశేష పూజలు నిర్వహించారు. స్వామి వారిని ప్రత్యేక అలంకరణలో సిద్ధం చేసి భక్తులకు దర్శనం కల్పించారు. మధ్యాహ్నం సూర్యభగవానుని దేవేరులైన ఉష, పద్మిని, ఛాయ, సౌంజ్ఞ ఉత్సవ మూర్తులతో కలిసి పల్లకిలో ఆలయం చుట్టు ప్రదక్షిణలు చేయించి, ఆలయం బయట ఉంచిన రథంలో పెట్టారు. మధ్యాహ్నం సుమారు 2.30 గంటలకు రాష్ట్ర హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి స్వామి వారిని దర్శించుకుని రథోత్సవాన్ని ప్రారంభించారు. ఆలయ ఉత్సవ కమిటీ, గ్రామస్తులు, భక్తులు, గ్రామయూత్ సూర్యనారాయణ నామస్మరణతో ఉత్సహంగా రథాన్ని ముందుకు లాగారు. ఆలయ ఈఓ మోర్త మురళీ వీరభద్రరావు, ఆలయ «వ్యవస్థాపక ధర్మకర్త, ట్రస్ట్ బోర్డు చైర్మ¯ŒS కొవ్వూరి శ్రీనివాసా బాలకృష్ణారెడ్డి, ఉత్సవ కమిటీ వారు అన్ని ఏర్పాట్లు చేసి పర్యవేక్షించారు. ఆలయ ప్రాంగణంలో దీపారాధనలు, అమృతకుండి ప్రసాద వినియోగాలు నిర్వహించారు. ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. ఆయన జి.మామిడాడలో సూర్యనారాయణమూర్తి స్వామి వారిని దర్శించుకున్న అనంతరం విలేకర్లతో మాట్లాడారు. ఈ ఆలయాన్ని త్వరలో అభివృద్ధి చేయనున్నట్టు ప్రకటించారు. అంతర్వేదిలో రథసప్తమి వేడుకలు... మలికిపురం, సఖినేటిపల్లి : రథసప్తమి సందర్భంగా శుక్రవారం ఇంటింటా సూర్యభగవానుడికి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. లోకబాంధవుడి పుట్టినరోజును పురస్కరించుకుని ఆయనను భక్తులు భక్తిశ్రద్థలతో కొలిచారు. తొలి సంధ్యవేళ లేలేత సూర్యకిరణాలు మధ్య భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. శిరస్సు, భుజాలపై తెల్లజిల్లేడు ఆకులు, రేగిపండ్లు పెట్టుకుని, సంప్రదాయ ప్రకారం స్నానాలు చేశారు. ఇంటింటా భక్తులు క్షీరాన్నం వండి, చిక్కుడు ఆకులపై పెట్టి, శ్రీసూర్యనారాయణ స్వామికి నైవేద్యంగా సమర్పించుకున్నారు. వైష్ణవ ఆలయాల్లో భక్తులు స్వామికి పూజలు నిర్వహించారు. అంతర్వేదిలో వేకువజామున నుంచి సముద్ర స్నానాలు ఆచరించి వచ్చిన భక్తులతో శ్రీలక్షీ్మనృసింహస్వామి ఆలయం కిక్కిరిసింది. అమరగిరిమెట్టపై సూర్యభగవానునికి పూజలు పెద్దాపురం : స్థానిక అమరగిరి మెట్ట (పాండవుల మెట్ట)పై కొలువై ఉన్న సూర్యనారాయణమూర్తికి రథసప్తమిని పురస్కరించుకుని శుక్రవారం పూజలు, అభిషేకాలు నిర్వహించారు. డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప, మున్సిపల్ చైర్మన్ సూరిబాబురాజు, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు తదితరులు పాల్గొని స్వామివారిని దర్శించి, పూజలు చేశారు. వారికి ఆలయ కమిటీ నిర్వాహకులు వాణి, లక్ష్మి ఆయన వేదపండితుల మంత్రోచ్ఛరణల మ««దl్య ఘన స్వాగతం పలికారు. వేలాది మంది భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించి పూజలు చేశారు. పంచారామ క్షేత్రంలో .. సామర్లకోట : స్థానిక పంచారామ క్షేత్రంలోని సూర్యనారాయణమూర్తికి శుక్రవారం పూజలు, అభిషేకాలు, కల్యాణం నిర్వహించారు. అన్నదాన ట్రస్టు నాయకుడు బిక్కిన సాయి పరమేశ్వరరావు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో స్వామివారికి కల్యాణం నిర్వహించారు. ఆలయ అభిషేక పండితులు వేమూరి సోమేశ్వరశర్మ, వేదపండితులు కొంతేటి జోగారావు, సన్నిధిరాజు సుబ్బన్న, వెంకన్న పూజలు నిర్వహించారు. ఈవో పులి నారాయణమూర్తి, ట్రస్టు బోర్డు చైర్మ¯ŒS కంటే జగదీష్‌మోహనరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
హీరోతో పాటు గుర్తింపు ఉన్న క్యారెక్టర్లు చేస్తున్నా..
హీరో శ్రీకాంత్ కొత్తపేట : హీరోగానే కాక గుర్తింపు ఉన్న క్యారెక్టర్ పాత్రలను కూడా పోషిస్తున్నట్టు ప్రముఖ నటుడు శ్రీకాంత్ చెప్పారు. శ్రీకాంత్, తన సతీమణి ఊహతో గురువారం కొత్తపేట మండలం మందపల్లి ఉమా మందేశ్వర (శనీశ్వర) స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. విజయ చరిస్ విజ¯ŒS బ్యానర్‌పై విజయ్ నిర్మించిన ‘రారా’ అనే హారర్ మూవీలో, మరో బ్యానర్‌పై ‘నాటుకోడి’ చిత్రంలో నటించానని, ఆ రెండు సినిమాలు త్వరలో విడుదల కానున్నాయని తెలిపారు. గతంలో ‘విరోధి’ పేరుతో సొంతంగా నిర్మించిన సినిమా ఇండియ¯ŒS పనోరమ ఫిలిం ఫెస్టివల్ గుర్తింపు పొందిందన్నారు. కొంతకాలం సొంత సినిమాల నిర్మాణం, దర్శకత్వం వహించే ఆలోచన లేవన్నారు. ‘నిర్మలా కాన్వెంట్’తో సినీ అరంగేట్రం చేసిన తన తనయుడు రోష¯ŒS ప్రస్తుతం చదువుకుంటున్నాడని తెలిపారు. తన సతీమణి ఊహకు మరలా సినీరంగంలోకి వచ్చే ఉద్దేశం లేదని, గృహిణిగానే కొనసాగుతుందని చెప్పారు. శ్రీకాంత్ దంపతులు శనీశ్వరునికి ప్రత్యేక పూజలు, తైలాభిషేకం నిర్వహించారు. ప్రధార్చకులు అయిలూరి శ్రీరామమూర్తి,సత్యనారాయణమూర్తి వారికి ఆశీర్వచనాలు పలకగా దేవస్థానం చైర్మ¯ŒS బండారు సూర్యనారాయణమూర్తి ఆలయ సాంప్రదాయం ప్రకారం గౌరవ సత్కారం చేశారు. -
వాసవీ మాత.. ఆరాధ్య దేవత
పెనుగొండ (ఆచంట): జైæ వాసవీ.. జై జై వాసవాంబాయనమః స్మరణలు మార్మోగాయి. ఆర్యవైశ్యుల ఆరాధ్య దేవత వాసవీ కన్యకాపరమేశ్వరి ఆత్మార్పణ దినం సందర్భంగా ఆదివారం కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా పెనుగొండకు తరలివచ్చారు. మూలవిరాట్ నగరేశ్వర మహిషాసురమర్దనీ వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో ఆత్మార్పణ దినం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వేకువజాము నుంచి భక్తులు ఆలయానికి తరలివచ్చారు. ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో అమ్మవారికి పట్టువస్రా్తలు సమర్పించి వెండి పల్లకిపై గ్రామోత్సవం నిర్వహించారు. బజారు రామాలయం నుంచి వాసవీ దీక్షధారులు, 102 కలశాలతో మహిళలు, వాసవీ భక్తులు అమ్మవారి నామస్మరణ చేస్తూ ఆలయానికి చేరుకున్నారు. దీక్షల విరమణ వాసవీ దీక్షధారులు పెనుగొండ వాసవీ ఆలయంలో, వాసవీ ధాంలో దీక్షలు విరమించారు. మాలధారులు అధికంగా కర్నాటక, కోయంబత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు, నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాల నుంచి వచ్చారు. వేద పండితులు రామడుగుల నర్సింహమూ ర్తి ఆధ్వర్యంలో సుమారు 815 మంది దీక్షధారులు 102 హోమకుండ కృతువులో పాల్గొని దీక్షలు విరమించారు. ఆలయంలో అమ్మవారికి పంచామృతాభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోయంబత్తూరు భక్తులు అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. వాసవీ యువజన సంఘం ఆధ్వర్యంలో దీక్ష విరమణ హోమాలు నిర్వహించారు. ఈవో కె.శ్రీనివాస్, ప్రత్యేకాధికారి కుడుపూడి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో దేవాదాయశాఖకు చెందిన 15 మంది ఈవోలు, మేనేజర్లు ఏర్పాట్లను పర్యవేక్షించారు. వాసవీ క్లబ్ ఇంటర్నేషనల్ మాజీ అధ్యక్షుడు ఎన్వీ రమణమూర్తి, గ్రంధి రాము, నూలి ప్రభాకరరా వు, యువజన సంఘ నాయకులు పచ్చిపులుసు శంకర్, ఉద్దగిరి శ్రీధర్(దత్తు) తదితరులు పాల్గొన్నారు. అమ్మను కొలిస్తే మోక్షం వాసవీమాతను భక్తిశ్రద్ధలతో కొలిస్తే మోక్షం లభిస్తుందని వాసవీ పెనుగొండ పీఠాధిపతి స్వామీ కృష్ణానందపురి స్వామీజీ అన్నారు. వాసవీ ధాంలో భక్తులనుద్దేశించి మాట్లాడారు. ప్రత్యేక పూజలు, హోమాలు చేశారు. అధ్యక్షుడు డాక్టర్ పీఎన్ గోవిందరాజు, ట్రస్ట్ సభ్యులు కేఆర్ కృష్ణ, అశ్వత్ నారాయణ, పిప్పళ్ల వెంకటేశ్వరరావు, స్థానిక ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. -
రామయ్యకు నిత్యకల్యాణం
భద్రాచలం : భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామికి గురువారం నిత్యకల్యాణం చేశారు. ఉదయం సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పవిత్ర గోదావరి నది నుంచి తీర్థ జలాలను తీసుకొచ్చి భద్రుడి గుడిలో అభిషేకం చేశారు. అనంతరం నిత్యకల్యాణ మూర్తులను ఆలయ ప్రాకార మండపంలో వేంచేయింపజేసి ముందుగా విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవేత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోత్రధారణ గావించారు. స్వామివారి, అమ్మవార్ల వంశ క్రమాన్ని భక్తులకు తెలియజేశారు. అర్చకులు ఆలయ విశిష్టత గురించి భక్తులకు వివరించారు. కల్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలను స్వామివారికి విన్నవించారు. అనంతరం వేద మంత్రోచ్ఛరణల మధ్య అత్యంత వైభవోపేతంగా రామయ్యకు నిత్యకల్యాణం జరిపించారు. అర్చకులు స్వామివారి శేష వస్త్రాలను, తీర్థ ప్రసాదాలను భక్తులకు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, వేద పండితులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
రామయ్యకు ప్రత్యేక పూజలు
భద్రాచలం : భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి వారికి గురువారం ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పవిత్ర గోదావరి నది నుంచి తీర్ధ జలాలను తీసుకుని వచ్చి భద్రుని గుడిలో అభిషేకం చేశారు. అనంతరం స్వామి వారి నిత్యకల్యాణ మూర్తులను ఆలయ బేడా మండపంలో వేంచేయింపజేసి ముందుగా విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం చేశారు. స్వామి వారికి, అమ్మవారికి కంకణధారణ గావించి, స్వామి వారి, అమ్మవార్ల వంశ క్రమాన్ని భక్తులకు తెలియజేశారు. ఆలయ విశిష్టత గురించి భక్తులకు వివరించారు. కల్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలను స్వామి వారికి విన్నవించారు. అనంతరం వేద పండితుల వేద మంత్రోచ్చరణల మధ్య రామయ్యకు వైభవంగా నిత్యకల్యాణం చేశారు. అర్చకులు స్వామి వారి శేష వస్త్రాలను, తీర్ధ ప్రసాదాలను భక్తులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, వేద పండితులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
గరుడవాహనంపై రంగనాథుడు
పులివెందుల టౌన్ : పట్టణంలోని అతి ప్రాచీనమైన శ్రీరంగనాథ స్వామి ఆలయంలో నూలు పూజ పవిత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజు గురువారం శ్రీరంగనాథుడు గరుడవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉభయదారులచే ఆలయ ప్రధాన అర్చకులు కృష్ణరాజేష్‌శర్మ స్వామివారికి పూజలు జరిపించారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంచిపెట్టారు. నేడు స్వామివారు సింహవాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. -
శివాలయంలో ఎంపీ మల్లారెడ్డి పూజలు
హాలియా : కష్ణాపుష్కరాల సందర్భంగా బుధవారం నాగార్జునసాగర్‌లో పుష్కర స్నానం ఆచరించిన మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి అనంతరం శివాలయం ఘాట్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 1,500 మంది విద్యార్థులతో కలిసి సాధారణ ఘాట్‌లో స్నానం చేసి కుటుంబసభ్యులతో కలిసి పూజలు చేశారు. పుష్కరస్నానం మహాపుణ్యమన్నారు. విద్యార్థులకు సంస్కతి సంప్రదాయాలను తెలియజేసేందుకే పుష్కరాలకు తీసుకువచ్చినట్లు వివరించారు. -
పెద్దమ్మతల్లికి ప్రత్యేక పూజలు
పాల్వంచ రూరల్ : పెద్దమ్మతల్లి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండల పరిధిలోని శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయానికి జిల్లా నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు క్యూలైన్లో బారులు తీరారు. అమ్మవారి దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించారు. అర్చకులు పురాణం పురుషోత్తమశర్మ, శేషాద్రిశర్మ, రమేష్‌లు అమ్మవారిని పూలమాలలతో అలంకరించి అభిషేకాలు, సహస్రనామార్చన పూజలు నిర్వహించారు. సూపరింటెండెంట్ సత్యనారాయణ ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
శాకాంబరీ..నమో నమ :
-
వైభవంగా నిమజ్జనోత్సవం
తోటపల్లిగూడూరు: వినాయక చవితి ఉత్సవాలు ఆద్యంతం మండలంలో వేడుకగా నిర్వహించారు. మండలంలో 80 చోట్ల ఏ ర్పాటు చేసిన మండపాల్లో వినాయ విగ్రహాలను ప్రతిష్టించారు. ఏడు రోజుల పాటు ఆయా మండపాల్లో కొలువైన బొజ్జగణపయ్యలకు విశేష అభిషేకాలు, పూజలు నిర్వహించారు. నిత్యనైవేద్యాలను సమర్పించారు. మూడో రోజు నుంచి ప్రారంభమైన వినాయకుని గ్రా మోత్సవాలు, విగ్రహాల నిమజ్జనాలు సోమవారంతో ముగిశాయి. ముగింపు సందర్భంగా ఆదివారం రాత్రి తప్పెట్లు, కీలుగుర్రాల కోలాహలం మధ్య బాణ సంచా పేలుస్తూ అత్యంత వైభవంగా వినాయకుని గ్రామోత్సవాలు నిర్వహిం చారు. అనంతరం సోమవారం ఉదయం ఆనందోత్సవాల మధ్య గణేశ్ నిమజ్జన కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో విగ్రహాలు తరలిరావడంతో కోడూరు బీచ్, కాటేపల్లి సాగరతీరాలు సందడిగా మారాయి. మనుబోలులో... మనుబోలులోని పలు కూడళ్లలో ఏర్పా టు చేసిన గణనాథుని ప్రతిమలకు వైభవంగా నిమజ్జనోత్సవాలు నిర్వహిం చారు. పిడూరు రోడ్డులో ప్రతిష్టించిన వినాయక విగ్రహం గ్రామోత్సవం ఆదివారం అర్ధరాత్రి అత్యంత వైభవంగా సాగింది. అర్చకులు శ్రీనివాసులు బొజ్జ గణపయ్యకు ప్రత్యేక అలంకరణ చేసి వేదమంత్రోచ్ఛరణల మధ్య పూజలు చేశారు. భక్తులకు ప్రసాదాలు అందజేశారు. అనంతరం గణనాథుని ప్రతి మను ట్రాక్టర్‌పై ఉంచి తాళమేళాల మ ధ్య ఊరేగింపు నిర్వహించారు. యువకులు రంగులు చల్లుకుంటూ ఉత్సవం వెంట కేరింతలు కొట్టారు. అనంతరం విగ్రహాలను గ్రామ సమీపంలోనికండలేరులో నిమజ్జనం చేశారు. -
ఆధ్యాత్మిక మాసం.. శ్రావణం
నారాయణఖేడ్ రూరల్, న్యూస్‌లైన్: శ్రావణమాసం ఆధ్యాత్మిక మాసంగా పేరుగాంచింది. ఏడాదిలో మహిళలకు సంబంధించిన అత్యధిక పండుగలు వచ్చేది శ్రావణ మాసంలోనే. ఈ మాసం ఆరంభం నుంచే ప్రతి ఇంటా భక్తిభావం ఉప్పొంగుతుంది. వ్రతాలు, పూజలు నిర్వహిస్తుంటారు. మందిరాలన్నీ కిటకిటలాడుతాయి. ఈ మాసంలో మహిళలు నియమాలను పాటిస్తారు. శాకహార వంటలకే పరిమితమవుతారు. భక్తిశ్రద్ధలతో ఉపవాసాలు పాటిస్తుంటారు. ఈ కాలంలో పూజలు, వ్రతాలను ఆచరిస్తే మాంగళ్యం, సౌభాగ్యం ప్రాప్తి కలుగుతాయని మహిళల నమ్మకం. ప్రతి శుక్రవారం, సోమవారాల్లో వరలక్ష్మి వ్రతాలు, పసుపుబొట్టు, ఇతర పూజలు నిర్వహిస్తుంటారు. శ్రావణ సోమవారం రోజున సుమంగళిగా, సౌభాగ్యంగా ఉండేం దుకు, మంగళవారం నాడు మంగళగౌరీ వ్రతం చేస్తారు. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం అష్ట ఐశ్వర్యాల కోసం వరలక్ష్మి వ్రతం చేస్తారు. అదీగాక ఆరోగ్య రీత్యా మేలు చేసే శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి చెబుతారు. అన్ని కాలాల కన్నా వర్షాకాలంలో పలు రకాల వ్యాధులు ప్రబలుతుంటాయి. ప్రధానంగా మాంసాహారం తింటే వ్యాధులు వస్తాయి. దీంతో శ్రావణమాసంలో మాంసాహారం స్వీకరించవద్దనేందుకు నియమంగా మారిందని పెద్దలు చెబుతున్నారు. దాదాపుగా ఈనెలంతా ఇళ్లల్లో పూజలు చేయడం వల్ల పురుషులు సైతం మద్యం, మాంసాహారాన్ని మానేస్తారు. వారు కూడా పూజలో భాగస్వాములవుతారు. ఈ మాసంలోనే నాగుల పంచమి, రాఖీపౌర్ణమి, కృష్ణాష్టమి, పొలాల అమావాస్య తదితర పండుగలు రావ డం విశేషం. మొత్తానికి శ్రావణమాసం మహిళలకు ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, భక్తిభావాన్ని పెంపొం దిస్తుందనడంలో సందేహం లేదు. జిల్లాలో మొదటి శుక్రవారాన్ని వైభవంగా జరుపుకొన్నారు.