తోటపల్లిగూడూరు:
వినాయక చవితి ఉత్సవాలు ఆద్యంతం మండలంలో వేడుకగా నిర్వహించారు. మండలంలో 80 చోట్ల ఏ ర్పాటు చేసిన మండపాల్లో వినాయ విగ్రహాలను ప్రతిష్టించారు. ఏడు రోజుల పాటు ఆయా మండపాల్లో కొలువైన బొజ్జగణపయ్యలకు విశేష అభిషేకాలు, పూజలు నిర్వహించారు. నిత్యనైవేద్యాలను సమర్పించారు. మూడో రోజు నుంచి ప్రారంభమైన వినాయకుని గ్రా మోత్సవాలు, విగ్రహాల నిమజ్జనాలు సోమవారంతో ముగిశాయి. ముగింపు సందర్భంగా ఆదివారం రాత్రి తప్పెట్లు, కీలుగుర్రాల కోలాహలం మధ్య బాణ సంచా పేలుస్తూ అత్యంత వైభవంగా వినాయకుని గ్రామోత్సవాలు నిర్వహిం చారు. అనంతరం సోమవారం ఉదయం ఆనందోత్సవాల మధ్య గణేశ్ నిమజ్జన కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో విగ్రహాలు తరలిరావడంతో కోడూరు బీచ్, కాటేపల్లి సాగరతీరాలు సందడిగా మారాయి.
మనుబోలులో...
మనుబోలులోని పలు కూడళ్లలో ఏర్పా టు చేసిన గణనాథుని ప్రతిమలకు వైభవంగా నిమజ్జనోత్సవాలు నిర్వహిం చారు. పిడూరు రోడ్డులో ప్రతిష్టించిన వినాయక విగ్రహం గ్రామోత్సవం ఆదివారం అర్ధరాత్రి అత్యంత వైభవంగా సాగింది. అర్చకులు శ్రీనివాసులు బొజ్జ గణపయ్యకు ప్రత్యేక అలంకరణ చేసి వేదమంత్రోచ్ఛరణల మధ్య పూజలు చేశారు. భక్తులకు ప్రసాదాలు అందజేశారు. అనంతరం గణనాథుని ప్రతి మను ట్రాక్టర్‌పై ఉంచి తాళమేళాల మ ధ్య ఊరేగింపు నిర్వహించారు. యువకులు రంగులు చల్లుకుంటూ ఉత్సవం వెంట కేరింతలు కొట్టారు. అనంతరం విగ్రహాలను గ్రామ సమీపంలోనికండలేరులో నిమజ్జనం చేశారు.
వైభవంగా నిమజ్జనోత్సవం
Published Tue, Sep 17 2013 4:25 AM | Last Updated on Fri, Sep 1 2017 10:46 PM
Advertisement