ganesh immersion program
-
మద్యం అమ్మకాలు బంద్
కర్నూలు : గణేష్ నిమజ్జన వేడుకలు జరిగే ప్రాంతాల్లో మద్యం దుకాణాలు, బార్లు, కల్లు దుకాణాలు బంద్ చేయించాలన్న కలెక్టర్ ఆదేశాల మేరకు ఎకై ్సజ్ అధికారులు చర్యలు చేపట్టారు. వెల్దుర్తి, ఎమ్మిగనూరులో ఈనెల 20వ తేదీ రాత్రి 10 గంటల నుంచి 22 తేది ఉదయం 10 గంటల వరకు, ఆదోని, గూడూరులో 21వ తేదీ రాత్రి 10 గంటల నుంచి 23వ తేదీ ఉదయం 10 గంటల వరకు, కర్నూలులో 25వ తేదీ రాత్రి 10 గంటల నుంచి 27వ తేదీ ఉదయం 10 గంటల వరకు బార్లు, మద్యం దుకాణాల్లో విక్రయాలు జరగకుండా సీజ్ చేయనున్నట్లు ఎకై ్సజ్ అధికారులు తెలిపారు. -
మరోసారి వినాయక చవితి కోలాహలం.. గోళూరు గణనాథా..
సాక్షి, తుమకూరు(కర్ణాటక): వినాయక చవితి సందోహం తిరిగివచ్చింది. తుమకూరు నగరంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన గోళూరు మహా గణపతి నిమజ్జనం వైభవోపేతంగా నిర్వహించారు. బలి పాఢ్యమి రోజును గణపతి ఆలయంలో వినాయక ప్రతిమను ప్రతిష్టించి ఇప్పటివరకు నిత్యపూజలు చేశారు. కార్తీక మాసమంతా విఘ్నాధిపతికి నైవేద్యాలను సమర్పించారు. ఆదివారం వేలాది మంది భక్తుల సమక్షంలో ఊరేగింపుగా నిమజ్జన యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా కళాబృందాల ప్రదర్శనలు రంజింపజేశాయి. చెరువులో జలార్పణం గావించారు. చదవండి: ఓటరు నమోదుకు ఏడాదిలో 4 కటాఫ్ తేదీలు -
దేశవ్యాప్తంగా నిమ‘జ్జన జాతర’
-
నిమజ్జనంలో విషాదం
వినాయక నిమజ్జనంలో అపశృతి చోటుచేసుకుంది. కొండూరు తండాలో విషాదం అలముకుంది. అప్పటి వరకు గణనాథుడి జయజయధ్వనులతో హోరెత్తిన ఆ ప్రాంతంలో ఒక్కసారిగా నిశ్శబ్దం రాజ్యమేలింది. చివరి నిమిషం వరకు అందరితో సరదాగా.. హుషారుగా నృత్యాలు చేస్తూ గడిపిన ముగ్గురు యువకులను నిమజ్జన పర్వం ముగుస్తున్న సమయంలో చెరువులోని భారీ గోతులు కబళించేశాయి. తమ ఆశాజ్యోతులు జలసమాధి కావడంతో ఆ యువకుల తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితుల్లో.. కూలి పనులు చేసుకుంటూ పిల్లల భవిష్యత్ కోసం శ్రమిస్తున్నామని.. తీరా చేతికి అంది వచ్చిన కుమారులను కోల్పోవడంతో తమ జీవితాలు శూన్యమయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాక్షి, ఎ.కొండూరు(కృష్ణా): మండలంలోని కొండూరు తండాలో గణేశ నిమజ్జన వేడుక మూడు కుటుంబాల్లో శోకాన్ని నింపింది. స్థానికులు వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన నవరాత్రి వేడుకల్లో పూజలందుకున్న గణనాథుడిని గ్రామశివారులోని చెరువులో నిమజ్జనం చేసేందుకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. విగ్రహాన్ని నిమజ్జనం చేసే సమయంలో ప్రమాదవశాత్తు తండాకు చెందిన బాణావతు గోపాలరావు(20), భూక్యా శంకర్(22), భూక్యా చంటి(22) చెరువులో తవ్విన లోతైన గోతుల్లో పడిపోయారు. యువకులను కాపాడేందుకు మిగిలినవారు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ముగ్గురు యువకులు తమ కళ్లెదుటే ప్రాణాలు విడిచారని తండా వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న మైలవరం సీఐ పి. శ్రీను, ఏకొండూరు ఎస్ఐ పీవీపీ కుమార్‌రెడ్డి, రెవెన్యూ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికి తీశారు. యువకుల మృతదేహాలను మైలవరం ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి తల్లిదండ్రులకు అప్పగించారు. మృతుల కుటుంబాలను తిరువూరు ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి పరామర్శించారు. కన్నీళ్లకే కన్నీరొచ్చే.. తిరువూరు: ‘ఉన్న ఒక్కగానొక్క కొడుకు దేవుడి దగ్గరికెళ్లిపోయాడయ్యా.. ఇక మాకెవరు దిక్కయ్యా..’ ‘రేపో మాపో ఉద్యోగం వస్తే కుటుంబ సమస్యలు తీరతాయనుకున్నాం. ఇంతలోనే దేవుడు మాకు అన్యాయం చేశాడయ్యా’ అంటూ విలపిస్తున్న కన్నవారి తీరు కలచివేస్తోంది. వినాయక చవితి పండుగ నాటి నుంచి నవరాత్రి వేడుకలను ఆనందోత్సాహాలతో జరుపుకుని గణపతి విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు వెళ్లిన పిల్లలు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారనే నిజాన్ని ఆ తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. కొద్ది గంటల క్రితం వరకు ఆటపాటలతో అలరించిన కన్నబిడ్డలు విగతజీవులుగా మారడం వారికి కడుపుకోత మిగిల్చింది. ఒకేరోజు ముగ్గురు యువకులు చనిపోవడం ఏ కొండూరు తండా వాసుల్లో తీవ్ర విషాదం నింపింది. కన్నవారికి భారం కాకూడదని.. మృతుల్లో ఒకరైన భూక్యా చంటి ఐటీఐ పూర్తి చేసుకుని ఇటీవల ఆర్టీసీలో కాంట్రాక్టు డీజిల్ మెకానిక్ పోస్టుకు దరఖాస్తు చేయగా, సోమవారం ఎంపిక పరీక్షకు హాజరుకావలసి ఉంది. ఇతని తండ్రి బద్దు చిన్నతనంలోనే చనిపోగా, తల్లి సక్రీ కూలీ పనులు చేసుకుంటూ ఇద్దరు పిల్లలను కష్టపడి చదివించుకుంది. మృతుడి తమ్ముడు భూక్యా వస్రం కూడా ప్రైవేటు పనులు చేసి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మరో యువకుడు భూక్యా శంకర్(22) డిగ్రీ చదివి ఇటీవల జరిగిన గ్రామ సచివాలయ ఉద్యోగాల రాతపరీక్ష రాశాడు. తండ్రి భూక్యా సోములు, తల్లి అల్లు కూలీ పనులు చేసి కుటుంబాన్ని పోషిస్తున్నారు. బాణావాత్ గోపాలరావు(20) విస్సన్నపేట శ్రీశ్రీ విద్యాసంస్థల్లో బీఎస్సీ డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. తండ్రి జయరాం, తల్లి బుజ్జి కూలీ పనులు చేస్తుంటారు. తమ ఏకైక కుమారుడు మృతి చెందిన సంఘటనను జీర్ణించుకోలేక పోతున్నారు. ‘నీరు–చెట్టు’ గోతులు ప్రాణాలు తీస్తున్నాయి ఎ.కొండూరు(తిరువూరు): గత తెలుగుదేశం ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా చెరువుల్లో నీరు–చెట్టు పథకం కింద ఇష్టానుసారంగా తవ్విన గోతులు ప్రజల ప్రాణాలు తీస్తున్నాయని ఎమ్మెల్యే రక్షణనిధి ధ్వజమెత్తారు. ఎ.కొండూరు తండాలో నిమజ్జనం సమయంలో ప్రమాదవాశాత్తు చెరువులో పడి మృతి చెందిన చంటి, శంకర్, గోపాలరావు మృతదేహాలను ఆదివారం ఎమ్మెల్యే సందర్శించి నివాళులర్పించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. అనంతరం ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుతూ అక్రమంగా చెరువుల్లో తీసిన గోతుల వల్ల గతంలో పోలిశెట్టిపాడు చెరువులో ఇద్దరు ఇదే రీతిన మృతిచెందారన్నారు. అలాగే నందిగామ, మైలవరం ప్రాంతాల్లోని చెరువుల్లో ఉన్న గోతుల్లో పడి యువకులు మృత్యువాతపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత టీడీపీ ప్రభుత్వ దుర్మార్గ పాలన కారణంగా ప్రజల ప్రాణాలు పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రూ.5 లక్షలు ఆర్థిక సాయం బాధితుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని.. వైఎస్సార్ బీమా పథకం కింద ఒక్కొక్కొ కుటుంబానికి రూ. 5లక్షలు ఆర్థిక సహాయం అందజేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. అలాగే బాధిత గిరిజనులకు పక్కా గృహాలు మంజూరు చేయిస్తామని హామీనిచ్చారు. మైలవరం సీఐ పి. శ్రీను, ఎ.కొండూరు ఎస్ఐ పీవీపీ కుమార్‌రెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కమిటీ సభ్యుడు నరెడ్ల వీరారెడ్డి, తహసీల్దార్ బాలకృష్ణారెడ్డి, మాజీ జెడ్పీటీసీ పాలం ఆంజనేయులు, వజ్రాల బ్రహ్మానందరెడ్డి, అలవాల సుబ్బారెడ్డి, బత్తుల వెంకయ్య, ఎం. ఉమ , కె. చెన్నారావు ఉన్నారు. -
రికార్డు ధర పలికిన బాలాపూర్ లడ్డూ
-
గణేశ్ నిమజ్జనం వరకు ఆగాల్సిందే..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఆగమేఘాల మీద ఐపీఎస్ అధికారుల నుంచి ఎస్సై స్థాయి అధికారుల వరకు భారీ స్థాయిలో బదిలీలు జరిగాయి. ఇంత చేసినా..ఇప్పటివరకు అధికారులు తమ బదిలీ స్థానాలకు చేరుకోలేదు. రాష్ట్రంలో వివిధ జిల్లాలకు, జిల్లాల నుంచి హైదరాబాద్ కమిషనరేట్‌కు బదిలీ అయిన ఐపీఎస్ అధికారులు ఇంతవరకు రిపోర్టు చేయలేదు. దీనిపై పోలీస్ శాఖ స్పందిస్తూ..గణేశ్ నిమజ్జనం కారణంగానే అధికారులు తమ బదిలీ స్థానాలకు చేరుకోలేదని స్పష్టం చేసింది. హైదరాబాద్ కమిషనరేట్‌లో పనిచేస్తున్న ఏ ఒక్క అధికారిని గణేశ్ నిమజ్జనం పూర్తయ్యే వరకు రిలీవ్ చేయవద్దని ఆదేశాలు అందాయని కమిషనరేట్ వర్గాలు తెలిపాయి. శాంతి భద్రతల పర్యవేక్షణ, రూట్‌మ్యాప్ సమన్వయంపై ప్రస్తుతమున్న అధికారులకు అవగాహన ఉందని, కొత్తగా వచ్చే అధికారులకు కొంత సమయం పడుతుందని ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి తెలిపారు. గణేశ్ నిమజ్జనం తర్వాత బదిలీలు చేస్తే బాగుండేది కదా అని సదరు అధికారిని ప్రశ్నించగా, ఎన్నికల కోడ్ వస్తే ఇబ్బందికరంగా ఉంటుందని..అందుకే ముందుగా బదిలీలు చేపట్టినట్లు వెల్లడించారు. కాగా, కొత్త స్థానానికి వెళ్లేందుకు అధికారులు అయిష్టతను ప్రదర్శిస్తున్నట్లు సర్వత్రా చర్చ జరుగుతోంది. -
గణేష్ నిమజ్జన వేడుకల్లో అపశ్రుతులు
గణేష్ నిమజ్జన వేడుకల్లో అపశ్రుతులు దొర్లాయి...జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో గురువారం విషాద సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఎంతో ఉత్సాహంగా మిత్రులతో కలిసి గణేశుడిని సాగనంపేందుకు వెళ్లిన వారిలో ఇద్దరు విగతజీవులుగా మారగా, మరొకరి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. కొత్తగూడెం మండలం గొల్లగూడెంలో నివాసముంటున్న పశువుల రామలింగయ్య (28), వేంసూరు మండలం అమ్మపాలెం గ్రామానికి చెందిన పుచ్చ మల్లయ్య(22) వాగుల్లో పడి మృతి చెందారు. ఎర్రుపాలెం మండలకేంద్రానికి చెందిన మల్లెల నారాయణరావు (32) కృష్ణా జిల్లా వీరులపాడు మండలంలోని కూడల్లి గ్రామ సమీపంలో కట్లేరులో గల్లంతయ్యాడు. కాగా, ఖమ్మం రూరల్ మండలం రామన్నపేట వద్ద మున్నేరులో ఓ గుర్తుతెలియని యువకుడి మృతదేహం లభ్యమైంది. లక్ష్మీదేవిపల్లి/ గుండాల, న్యూస్‌లైన్: కొత్తగూడెం మండలం బంగారుచెలక పంచాయతీ గొల్లగూడెం గ్రామంలో నివాసముంటున్న పశువుల రామలింగయ్య (28) బుధవారం రాత్రి గణేష్ నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొనేందుకు గ్రామస్తులతో కలిసి బంగారుచెలక సమీపంలోని కిన్నెరసాని డ్యామ్‌కు వెళ్లాడు. అప్పటికే మద్యం సేవించిన రామలింగయ్య ఇంటికి తిరిగి వస్తూ బంగారుచెలక - గొల్లగూడెం మధ్యనున్న పారేటివాగులో పడి గల్లంతయ్యాడు. రామలింగయ్య బంగారుచెలకకు చెందిన బుడగం శంకర్ అనే రైతు వద్ద పాలేరుగా పనిచేస్తున్నాడు. గురువారం తెల్లవారుజామున పనికి రాకపోవడంతో శంకర్ రామలింగయ్య ఇంటికి వచ్చి ఆరా తీశాడు. బుధవారం రాత్రి నిమజ్జనానికి వెళ్లిన వ్యక్తి తిరిగి ఇంటికి రాలేదని కుటుంబ సభ్యులు చెప్పడంతో స్థానికులు పారేటివాగు వెంట వెదుకుతుండగా రామలింగయ్య మృతదేహం కనిపించింది. దీంతో గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. కాగా, రామలింగయ్య స్వగ్రామమైన గుండాల మండలం ఆళ్లపల్లికి మృతదేహాన్ని తరలించారు. మృతుడికి భార్య సమ్మక్క, కూతురు రవళి ఉన్నారు. అయితే ఈ ఘటనపై ఎలాంటి కేసు నమోదుకాలేదు. గుర్తు తెలియని మృతదేహం లభ్యం రామన్నపేట(ఖమ్మం రూరల్), న్యూస్‌లైన్: మండలంలోని రామన్నపేట గ్రామ సమీపంలో మున్నేటిలో గురువారం గుర్తు తెలియని యువకుని మృతదేహం(20) లభ్యమైంది. మున్నేటి ఒడ్డున మృతదేహాన్ని చూసిన స్థానికులు వీఆర్వో వీరభద్రంకు సమాచారం అందించగా, ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతుడి నుదుటిపై ‘గణపతి బప్పా మోరియా’ అని రాసిఉన్న కాషాయరంగు రిబ్బన్ ఉండడంతో గణేష్ నిమజ్జనానికి వచ్చి మృతి చెంది ఉంటాడ ని భావిస్తున్నారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ఖమ్మం ప్రభుత్వాస్పత్రి కి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ ఆచార్యులు తెలిపారు. చెరువులోపడి యువకుడి మృతి వేంసూరు : గణేష్ నిమజ్జనం సందర్భంగా మండలంలోని అమ్మపాలెం గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన పుచ్చ మల్లయ్య(22) తోటి మిత్రులతో కలిసి ఎంతో ఉత్సాహంగా నిమజ్జన కార్యక్రమానికి వెళ్లాడు. గణపయ్యను చెరువులో వేస్తున్న క్రమంలో అందులో పడి మునిగిపోయాడు. గమనించిన గ్రామస్తులు బుధవారం అర్ధరాత్రి 2 గంటల వరకు చెరువులో గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. గురువారం ఉదయం మళ్లీ వెదుకుతుండగా విగ్రహానికి ఐదడుగుల దూరంలో మృతదేహం లభ్యమైంది. మల్లయ్య భార్య లలిత రోదిస్తున్న తీరు అందరినీ కలిచివేసింది. -
వైభవంగా నిమజ్జనోత్సవం
తోటపల్లిగూడూరు: వినాయక చవితి ఉత్సవాలు ఆద్యంతం మండలంలో వేడుకగా నిర్వహించారు. మండలంలో 80 చోట్ల ఏ ర్పాటు చేసిన మండపాల్లో వినాయ విగ్రహాలను ప్రతిష్టించారు. ఏడు రోజుల పాటు ఆయా మండపాల్లో కొలువైన బొజ్జగణపయ్యలకు విశేష అభిషేకాలు, పూజలు నిర్వహించారు. నిత్యనైవేద్యాలను సమర్పించారు. మూడో రోజు నుంచి ప్రారంభమైన వినాయకుని గ్రా మోత్సవాలు, విగ్రహాల నిమజ్జనాలు సోమవారంతో ముగిశాయి. ముగింపు సందర్భంగా ఆదివారం రాత్రి తప్పెట్లు, కీలుగుర్రాల కోలాహలం మధ్య బాణ సంచా పేలుస్తూ అత్యంత వైభవంగా వినాయకుని గ్రామోత్సవాలు నిర్వహిం చారు. అనంతరం సోమవారం ఉదయం ఆనందోత్సవాల మధ్య గణేశ్ నిమజ్జన కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో విగ్రహాలు తరలిరావడంతో కోడూరు బీచ్, కాటేపల్లి సాగరతీరాలు సందడిగా మారాయి. మనుబోలులో... మనుబోలులోని పలు కూడళ్లలో ఏర్పా టు చేసిన గణనాథుని ప్రతిమలకు వైభవంగా నిమజ్జనోత్సవాలు నిర్వహిం చారు. పిడూరు రోడ్డులో ప్రతిష్టించిన వినాయక విగ్రహం గ్రామోత్సవం ఆదివారం అర్ధరాత్రి అత్యంత వైభవంగా సాగింది. అర్చకులు శ్రీనివాసులు బొజ్జ గణపయ్యకు ప్రత్యేక అలంకరణ చేసి వేదమంత్రోచ్ఛరణల మధ్య పూజలు చేశారు. భక్తులకు ప్రసాదాలు అందజేశారు. అనంతరం గణనాథుని ప్రతి మను ట్రాక్టర్‌పై ఉంచి తాళమేళాల మ ధ్య ఊరేగింపు నిర్వహించారు. యువకులు రంగులు చల్లుకుంటూ ఉత్సవం వెంట కేరింతలు కొట్టారు. అనంతరం విగ్రహాలను గ్రామ సమీపంలోనికండలేరులో నిమజ్జనం చేశారు.