vinayaka chavithi
-
విశాఖలో ఘనంగా వినాయక చవితి సంబురాలు (ఫొటోలు)
-
ఖైరతాబాద్ గణేషుడి తొలిపూజలో సీఎం.. గవర్నర్ ప్రత్యేక పూజలు
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఖైరతాబాద్ గణేషుడికి సీఎం రేవంత్‌రెడ్డి తొలిపూజ నిర్వహించనున్నారు. 70 అడుగుల ఎత్తులో సప్తముఖ మహాశక్తి రూపంలో మహాగణపతి దర్శనమిస్తున్నారు.👉ఖైరతాబాద్ గణేశుడిని సీఎం రేవంత్‌రెడ్డి దర్శించుకున్నారు. సప్తముఖ వినాయకుడి వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రికి.. స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ స్వాగతం పలికారు. అనంతరం రేవంత్‌రెడ్డి.. మహాగణపతికి గజమాల, పండ్లు సమర్పించారు. వినాయకుడి తొలిపూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్.. రాష్ట్రంలోని అన్ని గణేష్ ఉత్సవ కమిటీలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ.. శనివారం మధ్యాహ్నం ఖైరతాబాద్ గణపతిని దర్శించుకున్నారు. ఈ సందర్బంగా గవర్నర్‌కు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు సత్కరించారు. అనంతరం, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.👉ఏటా ఒక్కో రూపంలో దర్శనమిచ్చే మహాగణపతి ఈసారి 70 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో నిలబడిన ఆకారంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, మహంకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి రూపాలతో కూడిన సప్త ముఖాలు, ఆపై సప్త తలలతో ఆదిశేషావతారం, రెండువైపులా 14 చేతులతో కుడివైపు చక్రం, పుస్తకం, వీణ, కమలం, గద.. ఎడమవైపు రుద్రాక్ష, ఆసనం, పుస్తకం, వీణ, కమలం, గద ఉంటాయి. మహాగణపతికి కుడివైపున పది అడుగుల ఎత్తులో ప్రత్యేకంగా బాలరాముడి విగ్రహంతో ఈసారి దర్శనమిస్తున్నారు.👉ఎడమవైపు రాహు కేతువుల విగ్రహాలను 9 అడుగుల ఎత్తులో ఏర్పాటుచేశారు. మహాగణపతి పాదాల చెంత ఆయన వాహనమైన మూషికం ఆకారాలు 3 అడుగులలో దర్శనమిస్తున్నాయి. విగ్రహానికి కుడివైపున 14 అడుగుల ఎత్తులో శ్రీనివాస కళ్యాణం, ఎడమవైపు శివపార్వతుల కళ్యాణం విగ్రహ మూర్తులను ఏర్పాటు చేశారు. -
ప్రజలందరికీ సకల శుభాలూ కలగాలి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మంచి పనులకు విఘ్నాలు తొలగిపోయి, ప్రజలందరికీ సకల శుభాలూ కలగాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకాంక్షించారు. వినాయక చవితి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలకు గణనాథుని ఆశీస్సులు ఉండాలని.. క్షేమ, స్థైర్య, ఆయురారోగ్యాలు, సకల సంపదలు సిద్ధించాలని, సకల శుభాలు కలగాలని ఆకాంక్షించారు. విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో మంచి పనులకు విఘ్నాలు తొలగిపోయి.. విజయాలు సిద్ధించాలని.. గణనాథుని కరుణా కటాక్షాలతో రాష్ట్రంలోని ప్రతి కుటుంబమూ సుఖ సంతోషాలతో అభివృద్ధి చెందాలని వైఎస్ జగన్ అభిలషించారు. -
పండుగనాడూ పస్తులే
సాక్షి, అమరావతి : హిందువుల తొలి పండుగ వినాయక చవితిని ఘనంగా నిర్వహించేందుకు దేశమంతా ఏర్పాట్లు చేసుకున్నారు. రాష్ట్ర రాజధానిలో భాగంగా చెప్పుకొనే విజయవాడలో మాత్రం పండుగ జాడ కానరావట్లేదు. బెజవాడ నగరం సగానికిపైగా వరద నీటిలో మునగడంతో బాధితులు తీవ్ర విషాదంలో ఉన్నారు. పండుగ నాడూ పస్తులుండాల్సిన స్థితిలో ఉన్నారు. వరద ప్రాంతాల్లో మంచి నీరు, ఆహారం కోసం బాధితులు పెద్ద యుద్ధమే చేస్తున్నారు. దాతలు పెద్ద ఎత్తున తెస్తున్న ఆహారం, ప్రభుత్వం అందిస్తున్న మంచినీరు, ఆహారం వరద ప్రాంతాల మొదట్లోనే ఆగిపోతున్నాయి. వరద తీవ్రత ఉన్న లోపలి ప్రాంతాలకు అవి అందడంలేదు. దీంతో పిల్లలు, పెద్దలు, వృద్ధులు, మహిళలు నీటిలో ఎదురీదుతూ వచ్చి నీరు, ఆహారం కోసం ట్రాక్టర్లు, వ్యాన్ల వెంట పరుగులు తీస్తున్న దృశ్యాలు గుండెలు పిండేస్తున్నాయి. వరద విపత్తుతో యుద్ధం.. గురువారం మధ్యాహా్ననికి వరద కొంత శాంతించిందని ఊపిరి పీల్చుకునే లోపే మళ్లీ బుడమేరు ఊరిపై పడింది. శుక్రవారం తెల్లవారుజాము నుంచి నీటి ఉధృతి పెరగడంతో అజిత్‌సింగ్‌నగర్, రాజరాజశ్వరిపేట, వాంబే కాలనీ, సుందరయ్యనగర్, కండ్రిక తదితర ప్రాంతాల్లో ప్రజలు మళ్లీ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. ప్రజల జీవన్మరణ పోరాటం.. పోలీసుల ఆంక్షలు.. ఉద్యోగుల హడావుడితో వరద ప్రాంతాల్లో యుద్ధ వాతావరణంలాంటి పరిస్థితి నెలకొంది. నిత్యావసరాల కోసం బయటకు వెళ్లిన వారిని మళ్లీ ఇంటికి చేరకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. దీంతో కుటుంబంలో బయట కొందరు, వరద నీరు చుట్టుముట్టిన ఇళ్లలో మరికొందరు చిక్కుకుపోయారు. వారి వాళ్లను కలిసే అవకాశం లేక అవస్థలు పడుతన్నారు. అటుగా వెళ్లే ట్రాక్టర్లు, వ్యాన్లు, బస్సులు ఎక్కి ముంపు ప్రాంతంలోని ఇళ్లకు తిరిగి చేరేందుకు బాధితులు చేస్తున్న ప్రయత్నాలను పోలీసులు అడ్డుకుంటున్నారు. ఎక్కడ పడితే అక్కడ బారికేట్లు ఏర్పాటు చేసి ఎవరినీ వెళ్లనీయడంలేదు. తమనైనా ఇళ్లకు పంపాలని, లేదంటే ఇంట్లో చిక్కుకుపోయిన వాళ్లనైనా బయటకు తీసుకురావాలని వందలాది మంది ఆందోళన చేసినా పోలీసులు పట్టించుకోలేదు. పైగా వారిపై పోలీసులు పరుష పదజాలంతో విరుచుకుపడుతన్నారు. దీంతో మేమేమైనా పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్నామా? మా ఇంటికి మేము వెళ్లకుండా అడ్డుకుంటారా? ప్రభుత్వం ఎలాగు పట్టించుకోదు.. మా చావు మేము చస్తాం అంటూ పలుచోట్ల ప్రజలు పోలీసులపై తిరగబడ్డారు.మాకు రిలీవర్ను ఇవ్వండి సార్.. అధికారులకు రోజు విడిచి రోజు షిఫ్ట్ పద్ధతిలో వరద ప్రాంతాల్లో విధులు కేటాయిస్తుంటే.. దిగువ స్థాయి ఉద్యోగులకు మాత్రం 24/7 విధులు చేయించడంతో వారు గగ్గోలు పెడుతున్నారు. సార్.. రేపు వినాయక చవితి ఇంటికి వెళ్తాం.. ఒక్కరోజుకైనా రిలీవర్ను పంపించండి అంటూ వేడుకుంటున్నారు. వారం రోజులుగా విజయవాడలోనే పని చేస్తున్నామని, పండుగ ఒక్కరోజైనా వేరొకరిని కేటాయించి తమకు శలవు ఇవ్వాలని పశి్చమ గోదావరి జిల్లా భీమవరం మున్సిపాలిటీకి చెందిన ఉద్యోగులు అధికారులకు మొరపెట్టుకోవడం గమనార్హం. నిన్ను నమ్మలేం బాబు..బాధితుల ఆగ్రహంవన్టౌన్ (విజయవాడ పశ్చిమ) : వరద ప్రభావిత ప్రాంతాల్లో జనం ‘నిన్ను నమ్మలేం బాబు’ అంటూ ప్రభుత్వ తీరుపై పెదవి విరుస్తున్నారు. ఐదు రోజులుగా జనం నరకాన్ని చవిచూస్తున్నారు. మొదటి మూడ్రోజులు కొంతమందికే ఆహారం, మంచినీరు వచ్చింది. అది కూడా వంతెన పైన ఉన్న ప్రాంతాల్లో ఇచ్చి చేతులు దులుపుకున్న సంగతులు తెలిసిందే. అధికారులు, ప్రజా ప్రతినిధులు చివరివరకూ వెళ్లలేక చేతులెత్తేశారని స్థానికులు మండిపడ్డారు. అయితే, ఇప్పుడిప్పుడే వరద నీరు తగ్గుతోంది. దీంతో సీఎం చంద్రబాబు, ఇతర ప్రజాప్రతినిధులు సాయమందిస్తాం ధైర్యంగా ఉండండి అంటూ పదేపదే భరోసా కల్పిస్తున్నప్పటికీ ఇక్కడి స్థానికులు వారి మాటలను విశ్వసించడంలేదు. మీకు రేషన్ బియ్యాన్ని పంపిస్తున్నాం, ఇతర సరుకులను పంపిస్తాం అంటూ తెగ ప్రచారం చేస్తున్నా మళ్లీ వరద వస్తే వీరంతా తమను వదిలేస్తారంటూ దాదాపు 30–40 శాతం మంది సురక్షిత ప్రాంతాలకు, బంధువుల ఇళ్లకు వెళ్లిపోతున్నారు.అనేక బోట్లు మా ముందే ఖాళీగా వెళ్తుంటే తాము బతిమాలుతున్నా పట్టించుకోకుండా పోయారంటూ బాధితులు మండిపడుతున్నారు. అటువంటి ప్రభుత్వం ఉన్న క్రమంలో మళ్లీ వరదనీరు ముంచెత్తితే మా బతుకులు తెల్లారతాయంటూ ప్రభుత్వాన్ని ఎండగడుతున్నారు. వరద పూర్తిగా తగ్గిన తరువాతే మా ఇళ్లకు వస్తామంటూ సింగ్‌నగర్, ఆంధ్రప్రభ కాలనీ, వాంబే కాలనీ, ఉడా కాలనీ, కండ్రిక, రాజరాజేశ్వరిపేట, ప్రకాష్‌నగర్, కబేళాలకు చెందిన వారు తేల్చిచెబుతున్నారు. రెండు రోజులుగా రోడ్డుపైనే ‘నిత్యావసర’ లారీలుఅన్లోడ్ చేయకపోవడంతో అవస్థలు పడుతున్న డ్రైవర్లువరద వల్ల సర్వం కోల్పోయిన బాధితులను ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ ఆదేశాల మేరకు మిల్లర్లు పంపించిన నిత్యావసర సరుకుల లారీలు అన్లోడ్ కోసం ఎదురుచూస్తున్నాయి. అధికారులు ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో రెండు రోజులుగా విజయవాడలోని బీఆర్టీఎస్ రోడ్డులో పెద్ద సంఖ్యలో లారీలు నిలిచిపోయాయి. వాటిని ఎప్పుడు తీసుకెళ్తారో అర్థమవ్వక.. లారీల డ్రైవర్లు అవస్థలు పడుతున్నారు. ‘గురువారం రాత్రి బియ్యం లోడుతో అమలాపురం నుంచి విజయవాడకు వచ్చాను. అప్పటి నుంచి బీఆర్టీఎస్ రోడ్డులోనే పార్కింగ్ చేసి ఉంచాను. అధికారులు ఎప్పుడు అన్లోడ్ చేయిస్తారో అర్థమవ్వట్లేదు’ అని లారీ డ్రైవర్ ఏడుకొండలు వాపోయాడు.– నెహ్రూనగర్, మేడికొండూరుప్రకాశం బ్యారేజ్‌కు మరమ్మతులుసాక్షి, అమరావతి: కృష్ణా వరద ఉధృతికి కొట్టుకొచ్చిన నాలుగు పడవలు ఢీకొనడంతో దెబ్బతిన్న ప్రకాశం బ్యారేజ్ మూడు గేట్లకు ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు, సలహాదారు కన్నయ్యనాయుడు నేతృత్వంలో మరమ్మతు పనులు ప్రారంభించారు. ఇందులో భాగంగా 69, 67 గేట్ల కౌంటర్ వెయిట్లను గురు, శుక్రవారాల్లో బీకెమ్ సంస్థ కార్మికులు తొలగించారు. 67, 68, 69 గేట్లను కిందకు దించారు. శనివారం 67–68 గేట్ల వద్ద ఉన్న రెండు పడవలను మరపడవతో తొలగించనున్నారు. హైదరాబాద్‌లో తయారు చేయించిన ఐరన్ కౌంటర్ వెయిట్లను విజయవాడకు తెచ్చి.. వాటిని 69, 67 గేట్లకు శనివారం బిగిస్తారు. -
#VinayakaChavithi : రేపటి నుండి ఖైరతాబాద్ మహాగణపతి దర్శనం (ఫొటోలు)
-
#VinayakaChavithi2024 : వినాయక చవితికి నేను సిద్దం..మరి మీరు (ఫొటోలు)
-
Prince World 2024: మోడల్ కార్తికేయ
మోడల్ కార్తికేయనడకతోపాటే నాట్యం కూడా నేర్చుకున్నాడు కార్తికేయ. వినాయక చవితి స్టేజ్‌తో మొదలు పెట్టి అంతర్జాతీయ వేదికపై మెరిశాడీ మోడలింగ్ ప్రిన్స్. థాయ్‌లాండ్‌లో జరిగిన అంతర్జాతీయ మోడలింగ్ పోటీల్లో ‘ప్రిన్స్ వరల్డ్–2024’ టైటిల్ సొంతం చేసుకుని వైజాగ్‌కు తిరిగి వచ్చిన కార్తికేయ సక్సెస్ స్టోరీ ఇది.థాయ్‌లాండ్‌లో ‘ప్రిన్స్’కిరీటం..కార్తికేయ రాష్ట్ర స్థాయిలో జరిగిన స్టార్ కిడ్స్ సీజన్–2, ఆంధ్రా ఫ్యాషన్ వీక్ పోటీలలో విజేతగా నిలిచాడు. కోళికోడ్ నగరంలో జరిగిన జాతీయ స్థాయి మోడలింగ్ పోటీల్లో కూడా విజయం సాధించాడు. ప్రిన్స్ ఆఫ్ ఏపీ సబ్ టైటిల్‌ను గెలిచి అంతర్జాతీయ పోటీలకు అర్హత సాధించాడు. దీంతో ఇటీవల థాయ్‌లాండ్‌లో జూనియర్ మోడల్ ఇంటర్నేషనల్ పేరుతో పోటీలు నిర్వహించారు. దీనికి 11 దేశాల నుంచి 45 మంది చిన్నారులు పోటీ పడ్డారు. ఇందులో కార్తికేయ మనదేశానికి ప్రాతినిథ్యం వహించాడు. నాలుగవ తరగతి చదువుతున్న ఈ విశాఖపట్నం కుర్రాడు మోడలింగ్‌తోపాటు వ్యాఖ్యానం, నటన, కథలు చెప్పడం, యోగా ఇలా అనేక రంగాల్లో ప్రతిభ చూపిస్తున్న బహుముఖ ప్రజ్ఞాశాలి. కార్తికేయ తండ్రి బి.జె.శ్రీనివాసరెడ్డి ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్‌లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్. ఆయన కథలు, కవితలు, వెబ్ పేజీలకు ఆర్టికల్స్ రాస్తుంటారు. వీటితోపాటు సేంద్రియ వ్యవసాయం, తేనెటీగల పెంపకం ఆయన ఆసక్తులు. కార్తికేయ తల్లి పావనీ లత భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్)లో ఇంజినీర్. చిత్రకారిణి కూడా. తల్లిదండ్రులిద్దరిలోనూ సృజనాత్మకత మెండుగా ఉండడం పిల్లల మీద మంచి ప్రభావం చూపించింది.రెండేళ్లకు బ్రేక్కార్తికేయ రెండేళ్ల వయసులో గాజువాకలో వినాయక చవితి ఉత్సవాలలో తొలిసారిగా చేసిన డ్యాన్స్‌కు మంచి ప్రశంసలందాయి. ప్లే స్కూల్లో పిల్లలందరూ ఏడుస్తూ ఉంటే.. కార్తికేయ డ్యాన్సులతో ఆ పిల్లలను అలరించేవాడు. దీంతో తల్లిదండ్రులు మంచి డ్యాన్సర్‌ను చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే మూడో ఏట కాలికి సర్జరీ అవడంతో ఏడాదిపాటు డ్యాన్స్‌కు దూరం కావల్సి వచ్చింది. గాయం తగ్గిన వెంటనే మళ్లీ డ్యాన్స్ ఫ్లోర్ ఎక్కాడు. పాశ్చాత్య నృత్యాన్ని అభ్యసించాడు. స్కూల్లో జరిగే కల్చరల్ కార్యక్రమాల్లో వ్యాఖ్యాతగా వ్యవహరించేవాడు. అతడు ప్రదర్శించిన అల్లూరి సీతారామరాజు ఏకపాత్రాభినయం విమర్శకుల మన్ననలు పోందింది. రాగయుక్తంగా శ్లోకాలు, గీతాలు పాడి అందరి అభినందనలు అందుకున్నాడు. డ్యాన్స్‌లోనే కాకుండా తొలిసారిగా ఫ్యాషన్ షోలో కూడా అందరినీ ఆకట్టుకున్నాడు. డ్యాన్సర్‌గా, మోడల్‌గా పలు రాష్ట్రాల్లో షోలు చేస్తూ గుర్తింపు తెచ్చుకుంటున్నాడు.ఇద్దరూ ఆణిముత్యాలేతమ్ముడు కార్తికేయ రెడ్డి డ్యాన్స్, మోడలింగ్‌లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న విషయం తెలిసిందే. అక్క హరి శ్రేయసి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో పేరు నమోదు చేసుకుంది. 34 శ్లోకాల సమాహారమైన ‘శ్యామలదండకం’ వల్లించినందుకు తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో పేరు నమోదైంది. అలాగే చిత్ర లేఖనం, పాటల పోటీలలో కూడా బహుమతులు గెలుచుకుంది. 2024లో ఉగాది ప్రతిభా పురస్కారం అందుకుంది.– దుక్క మురళీకృష్ణారెడ్డి, సాక్షి, విశాఖపట్నం -
Khairatabad Ganesh 2023: ఖైరతాబాద్ మహా గణపతి వద్ద భక్తజన సందోహం (ఫోటోలు)
-
వినాయక నిమజ్జనంలో సితార, గౌతమ్.. వీడియో వైరల్!!
సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇంట్లో గణేశ్ నిమజ్జన వేడుకలు నిర్వహించారు. టాలీవుడ్ ప్రిన్స్ కూతురు సితార, కుమారుడు గౌతమ్ గణనాథునికి ఘనంగా వీడ్కోలు పలికారు. హైదరాబాద్‌లోని ఇంటిలో జరిగిన ఈ వేడుకకు సంబంధించిన వీడియోను నమ్రతా శిరోద్కర్ తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. (ఇది చదవండి: తొలిసారి హీరోయిన్గా ట్రాన్స్‌జెండర్.. హీరోగా ఎవరంటే?) తమ ఇంట్లో పూజలు చేసిన వినాయకుడిని ఆవరణలోని ఓ డ్రమ్ము నీటిలో నిమజ్జనం చేశారు. ఈ వీడియోలో నమ్రతా, మహేశ్ బాబు ఎక్కడా కూడా కనిపించలేదు. ఇంట్లోని పనివారితో కలిసి ఈ వేడుకల్లో సితార, గౌతమ్ పాల్గొన్నారు. నమ్రతా ఇన్‌స్టాలో రాస్తూ 'గణపతి బప్పా మోరియా.. వచ్చే ఏడాది మళ్లీ కలుద్దాం' అంటూ పోస్ట్ చేసింది. అయితే మహేశ్ బాబు కూతురు సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గానే ఉంటూ అభిమానులతో టచ్‌లోనే ఉంటోంది. కాగా.. మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న గుంటూరు కారం మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత మహేష్.. రాజమౌళితో కలిసి ఓ భారీ బడ్జెట్ చిత్రం చేయనున్నారు. (ఇది చదవండి: అండమాన్ దీవుల నేపథ్యంలో సరికొత్త వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
సింగపూర్‌లో ఘనంగా వినాయక చవితి పూజలు.. లడ్డూ వేలం
సింగపూర్‌లో ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. గణనాథుని జయజయద్వానాల మధ్య భక్తి శ్రద్దలతో, ఎంతో అద్యాత్మిక శోభతో ఘనంగా జరిగింది. సుమారు వందమంది ఈ వేడుకలో పాల్గొన్నారు. ప్రత్యేకంగా అలంకరించబడి ముగ్ధమనోహరంగా తీర్చిదిద్దిన గణనాధుని ప్రధాన విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. పూజనంతరం వినాయకచవితి లడ్డు వేలం ఆసక్తికరంగా సాగింది. ఇందులో వీరగ్రూపు లడ్డును దక్కించుకుంది. ఈ సందర్భంగా సమాజ అధ్యక్షులు బొమ్మారెడ్డి శ్రీనివాసులు రెడ్డి..పూజలో పాల్గొన్న పిల్లలందిరికి మట్టితో చేసిన గణపతి విగ్రహాలు అందించారు. అనంతరం 800 మందికి అన్నిరకాల 21 పత్రిని ఉచితంగా పంచిపెట్టారు. ఈ పూజా కార్యక్రమాన్ని సుమారు 500 ప్రత్యక్షంగా, 5000 మంది అంతర్జాలం ద్వారా వీక్షించినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పూజా కార్యక్రమంలో పాల్గొన్న వారందరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. -
అమెరికాలో ఘనంగా వినాయక చవితి వేడుకలు, 11 రోజుల పాటు..
అమెరికాలోని నార్త్ కరోలినాలో వినాయక చవితి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. హంటర్స్‌విల్లేలోని సాయిమందిర్‌లో గణపతి ప్రతిమను ప్రతిష్టించారు. ఈ సందర్భంగా పెద్ద ఊరేగింపుతో మండపానికి తీసుకువచ్చారు. మహిళల కోలాటాలు, భజనలు, భక్తుల జయజయధ్వానాల నడుమ ప్రత్యేకంగా రూపొందించిన మండపాల్లో గణనాథుడిని ప్రతిష్టించారు. వినాయక చవితిని పురస్కరించుకుని ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. విఘ్నేశ్వరుడ్ని దర్శించుకొనేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. గణేష్ ఉత్సవాల్లో భాగంగా పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 11 రోజుల పాటు నిత్యపూజలు, మండపంలో రోజుకో అలంకరణ నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. గణేష్ ఉత్సవాలతో పాటు 5వ వార్షికోత్సవం సందర్భంగా సత్యనారాయణ స్వామి వ్రతం, బాబాకి ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వహకులు తెలిపారు. -
వినాయక చవితి స్పెషల్: స్వీట్ సందేశ్ చేసుకోండి ఇలా
స్వీట్ సందేష్ ఇలా చేసుకోండి కావలసినవి: ఉడికించిన చిలగడ దుంప – పెద్దది ఒకటి; పచ్చికొబ్బరి తురుము – ముప్పావు కప్పు; జీడిపప్పు పొడి – పావు కప్పు; కొబ్బరి పాలు – అరకప్పు; పంచదార – అరకప్పు; యాలకులపొడి – అరటీస్పూను; రోజ్ వాటర్ – టీస్పూను. తయారీ: చిలగడ దుంప తొక్క తీసి ఉండలు లేకుండా మెత్తగా చిదుముకోవాలి ∙చిదుముకున్న చిలగడ దుంప మిశ్రమంలో జీడిపప్పు పొడి వేసి కలపాలి. పంచదారలో కొద్దిగా నీళ్లుపోసి సుగర్ సిరప్‌ను తయారు చేసుకోవాలి ∙సిరప్ తయార య్యాక కొబ్బరి తురుము వేసి కలుపుతూ ఉండాలి. తీగ పాకం వచ్చినప్పుడు చిలగడదుంప మిశ్రమాన్ని వేసి కలపాలి ∙మిశ్రమం దగ్గర పడుతున్నప్పుడు కొద్దిగా కొబ్బరిపాలు వేయాలి ∙మధ్యలో కొబ్బరి పాలతో΄పాటు యాలకులపొడి, రోజ్‌వాటర్ వేసి కలుపుతూ మొత్తం కొబ్బరి పాలు అయిపోయేంత వరకు మగ్గనివ్వాలి ∙ దాదాపు ఇరవై నిమిషాల తరువాత ఈ మిశ్రమం దగ్గర పడుతుంది. అప్పుడు స్టవ్ ఆపేసేయాలి ∙ గోరువెచ్చగా ఉన్నప్పుడే మిశ్రమాన్ని చేతులతోగానీ, మౌల్డ్స్లోవేసి నచ్చిన ఆకారంలో వత్తుకుంటే స్వీట్ సందేష్ రెడీ. -
మెగా ఇంట్లో సందడి.. ఈ సారి ప్రత్యేకత ఏంటో తెలుసా?
మెగా ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. ఈ ఏడాది వినాయకచవితి మెగా ఫ్యామిలీకి మరింత స్పెషల్. ఎందుకంటే తొలిసారిగా మెగా వారసురాలితో ఈ పండుగను జరుపుకుంటున్నారు. ఈ ఏడాది జూన్‌లో మెగా ఇంట్లోకి వారసురాలు అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. దాదాపు పెళ్లైన 11 ఏళ్ల తర్వాత రామ్ చరణ్- ఉపాసన దంపతులకు బేబీ పుట్టింది. అపోలో ఆస్పత్రిలో ఉపాసన బిడ్డకు జన్మినిచ్చింది. మెగా వారసురాలు అడుగుపెట్టిన సందర్భంగా ఫ్యాన్స్‌తో పాటు కుటుంబసభ్యులు సైతం ఓ పండుగలా సెలబ్రేట్ చేసుకున్నారు. (ఇది చదవండి: వినాయకచవితి స్పెషల్.. ఈ సాంగ్స్ లేకపోతే సందడే ఉండదు!) తన మనవరాలి పేరును మెగాస్టార్ దంపతులు రివీల్ చేశారు. కొణిదెల క్లీంకారగా నామకరణం చేస్తున్నట్లు చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. తాజాగా క్లీంకారతో కలిసి ఈ ఏడాది వినాయకచవితిని సెలబ్రేట్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను రామ్ చరణ్, ఉపాసన తమ ఇన్‌స్టాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఇవీ చూసిన మెగా ఫ్యాన్స్ సైతం తాము అభిమానించే ఫ్యామిలీకి వినాయకచవితి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ! ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో జీవితాల్లో విఘ్నాలు తొలగి అందరికీ శుభములు కలగాలని ప్రార్ధిస్తున్నాను! 🙏 ఈ సారి ప్రత్యేకత ... చిన్ని 'క్లిన్ కారా' తో కలిసి తొలి వినాయక చవితి జరుపుకోవడం 😍😊 Happy Ganesh Chaturthi to ALL ! Celebrating the… pic.twitter.com/FeaFOtDdhd — Chiranjeevi Konidela (@KChiruTweets) September 18, 2023 (ఇది చదవండి: ఈ వారం ఓటీటీల్లో 20 సినిమాలు రిలీజ్) రామ్ చరణ్ ఇన్‌స్టాలో రాస్తూ.. 'అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ! ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో జీవితాల్లో విఘ్నాలు తొలగి అందరికీ శుభములు కలగాలని ప్రార్ధిస్తున్నాను! ఈ సారి ప్రత్యేకత ... చిన్ని 'క్లిన్ కారా' తో కలిసి తొలి వినాయక చవితి జరుపుకోవడం.' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా శంకర్ డైరెక్షన్లో గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Ram Charan (@alwaysramcharan) -
వినాయక చవితి స్పెషల్: కేసి మిథోయ్
కేసి మిథోయ్ కావలసినవి: తాజా బియ్యప్పిండి – రెండు కప్పులు; పచ్చికొబ్బరి తురుము – కప్పు; పంచదార పొడి – అరకప్పు; యాలకుల పొడి అరటీస్పూను; కొబ్బరి నీళ్లు – అరకప్పు. తయారీ: ►తడి బియ్యప్పిండిని ఒక గిన్నెలో వేసుకోవాలి ∙దీనిలో కొబ్బరి తురుము, పంచదార పొడి, యాలకుల ΄పొడి వేసి కలపాలి. ► అవసరాన్ని బట్టి కొబ్బరి నీళ్లను కొద్దికొద్దిగా వేసి పిండిని ముద్దలా కలుపుకోవాలి. ► పిండి ముద్దను చిన్న భాగాలుగా చేసి, ఉండలుగా చుట్టుకోవాలి ∙పిండిమొత్తాన్ని ఉండలుగా చుట్టుకుంటే కేసి మిథాయ్ రెడీ. ► కొబ్బరి నీళ్లకు బదులు కొద్దిగా నెయ్యికూడా కలుపుకోవచ్చు ∙రిఫ్రిజిరేటర్లో రెండుమూడురోజుల వరకు ఇవి తాజాగా ఉంటాయి. -
ఇలాంటి ఆలయం దేశంలో మరెక్కడా లేదు.. దీని విశిష్టత ఇదే
ఏ పని మొదలుపెట్టాలన్నా ముందుగా మనం పూజించేది ఆ గణనాథుడిని. ఏకదంతుడిగా ప్రసిద్ధి చెందిన ఆ వినాయకుడికి మూడు తొండాలు ఉన్నాయంటే మీరు నమ్ముతారా, నమ్మాలి మరి. ఇలా మూడు తొండాలున్న త్రిసూంద్ గణపతిని చూడాలంటే మనం పూణెలో ఉన్న సోమ్వర్ పేట్ జిల్లాకి వెళ్ళాల్సిందే. ఈ ప్రాంతంలో ఉన్న నజగిరి అనే నదీ తీరంలో ఉంది ఈ త్రిసూంద్ గణపతి దేవాలయం. భీమజీగిరి గోసవి అనే వ్యక్తీ ఈ ఆలయాన్ని 1754లో మొదలుపెట్టారట. పదహారు సంవత్సరాల నిర్మాణం తరువాత 1770లో గణపతిని ప్రతిష్టించారు. ఇక్కడి గర్భగుడి గోడల మీద మూడు శాసనాలు చెక్కబడి ఉన్నాయట. రెండు శాసనాలు సంస్కతంలో ఉంటే మూడోది పెర్షియన్ భాషలో ఉందట. ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఆలయంలోని వినాయకుడికి మూడు తొండాలు, ఆరు చేతులు ఉండి స్వామి నెమలి వాహనంపై ఆశీనుడై ఉంటాడట. ఆలయ ప్రవేశ ద్వారం దగ్గర ఉన్న ద్వారపాలకుల విగ్రహాలు ఎంతో అందంగా చెక్కబడి ఉంటాయి. ఆలయంప్రాంగణంలో కూడా అనేక దేవతా విగ్రహాలు, ఏనుగులు, గుర్రాలు మొదలైన జంతువుల విగ్రహాలు శోభాయమానంగా కనపడతాయి. ఎక్కడా లేని మరొక వింత ఈ ఆలయంలో ఒక గోడ మీద అమెరికన్ సైనికుడు ఖడ్గ మృగాన్ని ఇనప చైనులతో కడుతున్నట్టుగా ఉండే విగ్రహం. ఇలాంటి విగ్రహాలు మన దేశంలో మరెక్కడా చూడలేము. అలాగే ఆలయాన్ని నిర్మించిన గోసవి మహాశయుడి సమాధి కూడా ఆ ఆలయ ప్రాంగణంలో ఉండటం ఇంకో విశేషం. ఆలయం కింద భాగంలో నీరు నిలవ ఉండే విధంగా కొలనులాంటిది కట్టారు. ఎప్పుడూ నీటితో ఉండే ఆ కొలనుని గురుపూర్ణిమ రోజు నీరంతా ఖాళీ చేసి పొడిగా ఉంచుతారు. ఆ రోజు అక్కడివారు తమ గురువుగా భావించే ఆలయ నిర్మాణకర్త గోసవికి పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయంలో సంకటహర చతుర్థిని ఎంతో ఘనంగా నిర్వహించే ఆచారం ఎప్పటి నుంచో కొనసాగుతూ వస్తోందిట. నెలలో ఆ ఒక్క రోజు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కూడా. ఇక వినాయక చవితి ఉత్సవాలు ఇంకెంత ఘనంగా జరుగుతాయో వేరే చెప్పకర్లెద్దు. తొమ్మిది రోజులు పూణె చుట్టుపక్కల ఉన్న ఊరుల నుంచి భక్తులు వచ్చి ఇక్కడ విశేష పూజలు నిర్వహిస్తారట. రాజస్థాని, మాల్వా మాదిరి శిల్పకళ ఉట్టిపడే ఈ ఆలయాన్ని ప్రస్తుతం ఒక ట్రస్ట్ నడిపిస్తోంది. -
వినాయకచవితి స్పెషల్.. ఈ సాంగ్స్ లేకపోతే సందడే ఉండదు!
వినాయకచవితి పండుగ వచ్చిందంటే చాలు. చిన్నపిల్లలే కాదు.. పెద్దలు డ్యాన్సులతో హోరెత్తిస్తారు. పెద్ద పెద్ద డీజేలు, గణనాధుని పాటలతో ఏ గల్లీలో చూసినా సందడే సందడి.. ధూమ్ ధామ్. మరీ ఇంత సంతోషంగా పిల్లలు, పెద్దలు జరుపుకునే పండుగలో గణనాథునిపై మనం రాసుకున్న పాటలకైతే కొదువ లేదాయే. మరీ ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా సంతోషంగా గణనాధున్ని గంగమ్మ ఒడికి చేర్చే వరకు మనకోసం.. మరీ ముఖ్యంగా బొజ్జ గణపయ్య కోసం సినిమాల్లో వచ్చిన పాటలను ఓ సారి గుర్తు చేసుకుందాం. వినాయకచవితి సందర్భంగా లంబోదరుడి సూపర్ హిట్ సాంగ్స్ గురించి తెలుసుకుందాం పదండి. సినిమాల్లో మన గణపయ్య సూపర్ హిట్ సాంగ్స్ మెగాస్టార్ 'జై చిరంజీవ'- 'జై జై గణేశా.. జై కొడతా గణేశా' 'జై జై గణేశా.. జై కొడతా గణేశా' అనే సాంగ్ వినాయకచవితి వచ్చిందంటే కచ్చితంగా ఉండాల్సిందే. మెగాస్టార్ చిరంజీవి, సమీరా రెడ్డి, భూమిక ప్రధాప పాత్రల్లో విజయ భాస్కర్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. వెంకటేశ్ కూలీనెం 1- 'దండాలయ్యా.. ఉండ్రాలయ్యా..దేవా' 'దండాలయ్యా.. ఉండ్రాలయ్యా..దేవా. నీ అండదండా ఉండాలయ్యా.. దేవా' అంటూ సాగే వినాయకుని పాట ఇప్పటికీ కూడా ఎవర్గ్రీన్. వెంకటేశ్, టబు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2002లో రిలీజైంది. 100% లవ్ -'తిరుతిరు గణనాథ..' నాగచైతన్య, తమన్నా జంటగా నటించిన చిత్రం 100% లవ్. ఈ చిత్రంలో తమన్నా పాడే 'తిరుతిరు గణనాథ..' అంటూ పాడే సాంగ్ హైలెట్. వినాయకచవితి పండుగ రోజు ఈ పాట కచ్చితంగా ఉండాల్సిందే. అల్లు అర్జున్ 'ఇద్దరమ్మాయిలతో'- గణపతి బప్పా మోరియా అల్లు అర్జున్, అమలా పాల్ జంటగా నటించిన చిత్రం ఇద్దరమ్మాయిలతో. ఈ చిత్రంలో 'గణపతి బప్ప మోరియా' సాంగ్ వినని వారుండరు. ఐకాన్ స్టార్ ఈ పాటకు తన స్టెప్పులతో అదరగొట్టాడు. వెస్ట్రర్న్ స్టెల్లో బన్నీ దుమ్ములేపారు. దేవుళ్లు- 'వక్రతుండా మహాకాయ' సాంగ్ ఎస్పీ బాలసుబ్రమణ్య ఆలపించిన ఈ సాంగ్ దేవుళ్లు సినిమాలోది. ఇద్దరు చిన్న పిల్లలు తమ తల్లిదండ్రుల కోసం దేవుడిని మొక్కులు చెల్లించేందుకు బయలుదేరుతారు. ఈ సినిమాలో 2001లో రిలీజ్ కాగా.. కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కించారు. బాలయ్య భగవంత్ కేసరి- గణేశ్ ఆంతం సాంగ్ బాలకృష్ణ, శ్రీలీల జంటగా నటిస్తోన్న చిత్రం భగవంత్ కేసరి. ఈ చిత్రంలో గణేశ్ ఆంతం లిరికల్ సాంగ్‌ను ఇటీవలే రిలీజ్ చేశారు. వినాయకచవితికి గణపతి మండపాలు ఈ పాటతో హోరెత్తనున్నాయి. -
రంగులు మార్చుకునే వినాయకుడు..మీరెప్పుడు చూసుండరు!
సకల విఘ్నాలనూ తొలగించే దైవంగా తొలి పూజలు అందుకొనే వేలుపు గణనాథుడు. ఆయనకు ఇద్దరు భార్యలు ఉన్నారని సూచించే పురాణగాథలు ఉన్నప్పటికీ, ఏ ఆలయంలోనైనా గణేశుడు ఒక్కడే దర్శనమిస్తాడు. ఇద్దరు భార్యలతోనూ కనిపించే ఆలయాలను వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు. అలాంటి అరుదైన కోవెళ్ళలోకెల్లా అరుదైన ఆలయం ఒకటుంది. ఇక్కడ భార్యలతో పాటు పుత్రులతో కూడా కలిసి కొలువుతీరాడు పార్వతీ తనయుడు. రాజ్య రక్షకుడు: రణథంబోర్ వినాయకుడిని పరమ శక్తిమంతునిగా, రాజ్య రక్షకునిగా స్థానిక చరిత్ర అభివర్ణిస్తోంది. అది క్రీస్తుశకం 1299వ సంవత్సరం. రణథంబోర్ రాజు హమీర్‌కూ, ఢిల్లీ పాలకుడు అల్లావుద్దీన్ ఖిల్జీకీ మధ్య యుద్ధం మొదలైంది. యుద్ధ సమయంలో సైనికుల కోసం ఆహారాన్నీ, అవసరమైన ఇతర సరుకులనూ కోటలోని గోదాముల్లో నిల్వ చేశారు. ఈ యుద్ధం చాలా సంవత్సరాలు సాగడంతో గోదాముల్లో నిల్వలు నిండుకున్నాయి. వినాయకునికి పరమ భక్తుడైన హమీర్‌కు ఏం చెయ్యాలో పాలుపోలేదు. భారమంతా గణపతి మీద వేశాడు. ఒక రోజు రాత్రి అతను నిద్రపోతూండగా ఏకదంతుడు కలలోకి వచ్చాడు. సమస్యలన్నీ మర్నాటి పొద్దుటికల్లా తీరిపోతాయని అభయం ఇచ్చాడు. మరునాడు కోటలోని ఒక గోడ మీద మూడు నేత్రాలున్న వినాయకుని ఆకృతి దర్శనం ఇచ్చింది. దరిమిలా యుద్ధం ముగిసిపోయింది. ఖిల్జీ సేనలు వెనుతిరిగాయి. మరో చిత్రం ఏమిటంటే కోటలోని గోదాములన్నీ సరుకులతో నిండి ఉన్నాయి. గణేశుడే తన రాజ్యాన్ని రక్షించాడనీ, ఎల్లప్పుడూ తమకు అండగా ఉంటాడనీ భావించిన హమీర్ క్రీ.శ. 1300 సంవత్సరంలో కోటలోనే వినాయక ఆలయాన్ని నిర్మించాడు. ఇదీ విశిష్టత: ఈ ఆలయంలో వినాయకుడు మూడు నేత్రాలతో దర్శనం ఇస్తాడు. భార్యలైన సిద్ధి, బుద్ధి తోపాటు కుమారులైన శుభ్, లాభ్ కూడా గణేశునితో పాటు కొలువు తీరి పూజలందుకోవడం ఈ ఆలయ విశిష్టత. ఇలాంటిది మరే వినాయక ఆలయంలోనూ కనిపించదు. స్వామికి ప్రతిరోజూ అయిదు సార్లు హారతులు ఇస్తారు. అర్చకులతోపాటు భక్తులు కూడా సామూహిక ప్రార్థనలూ, భజనగీతాలాపనలూ చేస్తారు. ఈ స్వామిని పూజిస్తే విద్య, విజ్ఞానాలతోపాటు సంపదనూ, సౌభాగ్యాన్నీ అనుగ్రహిస్తాడని భక్తుల విశ్వాసం. ఎక్కడ? రాజస్థాన్ రాష్ట్రంలోని సవాయ్ మధోపూర్ జిల్లా రణథంబోర్‌లో తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాల నుంచి సవాయ్ మాధోపూర్ జంక్షన్‌కు నేరుగా రైళ్ళు ఉన్నాయి. అక్కడి నుంచి సుమారు 17 కి.మీ. దూరంలో ఉన్న రణథంబోర్‌కు రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు. రణథంబోర్‌కు సమీప విమానాశ్రయం సుమారు 150 కి.మీ. దూరంలోని జైపూర్‌లో ఉంది. రంగులు మార్చే శ్రీ మహాదేవర్ అతిశయ వినాయగర్ తమిళనాడు రాష్ట్రంలోని నాగర్ కోయిల్ జిల్లాలోని కేరళపురం గ్రామంలో ఒక అద్భుతమైన వినాయక దేవాలయమే ‘శ్రీ మహాదేవర్ అతిశయ వినాయగర్ ఆలయం’. ఈ ఆలయం చూడడానికి చిన్నదే అయినా... ప్రాశస్త్యం మాత్రం చాలా పెద్దది. అందుకు కారణం ఈ ఆలయంలోని మూలవిరాట్టు అయిన ‘వినాయకుడు’ ఆరు నెలలకు ఒకసారి తన రంగు తానే మార్చుకోవడం. మార్చి నుంచి జూన్ వరకూ నల్లని రంగులో ఉండే ఈ వినాయకుడు జూలై నుంచి ఫిబ్రవరి వరకూ తెల్లని రంగులో ఉంటాడు. ఈ విధంగా రంగులు మార్చుకోవడం ఈ వినాయకుని మాహాత్మ్యం అని భక్తుల విశ్వాసం. అంతే కాదు, ఇక్కడ మరో విచిత్రం కూడా వుంది. ఈ ఆలయం ఆవరణలో ఓ మంచినీటి బావి వుంది. నీటికి రంగు లేదు అన్న నిజం మనందరికీ తెలిసిన విషయమే. కానీ అది మిగతా చోట్ల మాటేమోగానీ.. నా దగ్గర మాత్రం అది చెల్లదు అంటుంది ఇక్కడున్న ఈ బావి. ఇక్కడి వినాయకుడు తన రంగును మార్చుకు న్నట్లే.. ఈ బావిలో నీళ్లు కూడా తమ రంగును మార్చుకుంటాయి. అయితే ఈ మార్పులో చిన్న తేడా ఉంది. వినాయకుడు నల్లగా ఉన్న సమయంలో.. ఈ బావిలో నీళ్లు తెల్లగా ఉంటాయి.., వినాయకుడు తెల్లగా ఉన్న సమయంలో.., ఈ బావిలో నీళ్లు నల్లగా ఉంటాయి. అంతేకాదు, ఇంతకన్నా మరో విచిత్రం కూడా ఉంది. సాధారణంగా శిశిరఋతువులో చెట్ల ఆకులు రాలడం ప్రకృతి సహజం. కానీ, దట్టమైన అడవుల కారణంగా తమిళ, కేరళారణ్య ప్రాంతాలకు ఈ ఋతు భేదం వర్తించదు. అవి ఎప్పుడూ సతతహరితాలే. కానీ, ఈ ఆలయంలో ఉన్న మఱిచెట్టు మాత్రం దక్షిణాయనంలో ఆకులు రాల్చి, ఉత్తరాయణంలో చిగురించడం ప్రారంభిస్తుంది. అందుకే ఈ ఆలయాన్ని ‘మిరాకిల్ వినాయకర్ ఆలయం’ అని కూడా పిలుస్తారు. ఇక చారిత్రక విషయాల కొస్తే... ఈ ఆలయం 12వ శతాబ్ది కాలం నాటిదని, 1317 సంవత్సరంలో ఈ ఆలయం నిర్మించారనీ, ఈ ఆలయంకు 2300 సంవత్సరాల చరిత్ర ఉన్నదనీ, చరిత్రకారుల అంచనా మాత్రమే కాదు, స్ధానికులు కూడా అదే చెప్తారు. నిజానికిది ‘శివాలయం’. ఈ ఆలయ ప్రాకార ప్రాంగణంలో ముందు శివాలయం ఉంది. ఆ తర్వాతే ఈ ఆలయ నిర్మాణం జరిగింది. అందుకే ఈ ఆలయాన్ని ‘శ్రీ మహాదేవర్ అతిశయ వినాయగర్’ ఆలయం అని అంటారు. ఈ ఆలయానికో చరిత్ర కూడా ఉంది. ఆ రోజులలో ‘కేరళపురం’ రాజుగారు తీర్థయాత్రలకని ‘రామేశ్వరం’ వెళ్లాడట. అక్కడ తన పరివారంతో కలసి దక్షిణ సముద్రంలో స్నానం చేస్తున్న సమయంలో, ఆయనకు ఒక వినాయక విగ్రహం, సముద్ర కెరటాలలో తడుస్తూ కనిపించింది. రాజుగారు ఆ విగ్రహాన్ని రామేశ్వరం రాజుగారికి అప్పగించబోతే..‘దొరికిన వారికే ఆ విగ్రహం చెందడం ధర్మం’ అని భావించి, రామేశ్వరం రాజు ఆ విగ్రహాన్ని ‘కేరళపురం’ రాజుకే ఇస్తూ, మరొక ‘మరకత(పచ్చల) గణపతిని కూడా బహూకరించాడు. కేరళపురం రాజుగారు ఆ రెండు విగ్రహాలనూ తన రాజ్యం తీసుకుని వచ్చి ప్రతిష్ఠించాడు. అయితే తురుష్కుల దండయాత్రలో ఆ మరకత గణపతి కొల్లగొట్టబడి, ఈ గణపతి మాత్రం ఇక్కడ మిగిలిపోయాడు. ఈ ఆలయం ప్రతిష్ఠ కూడా ఆగమశాస్త్రానుసారం జరగలేదు. ఒక రాతిపీఠం మీద అతి సాధారణంగా ఈ వినాయక విగ్రహాన్ని స్థాపించారు. ఈ ఆలయ ప్రాకార గోడల మీద అతి పురాతనమైన వర్ణచిత్రాలు చూపరులను ఎంతగానో ఆకర్షిస్తాయి.ఈ వినాయకునికి ఉదయము, సాయంకాలము కూడా అభిషేకాలు జరుగుతూండడం విశేషం. ఏ కోరికతోనైనా భక్తులు ఈ స్వామికి కొబ్బరికాయ గానీ, బియ్యపుమూట గానీ, ముడుపుగా చెల్లిస్తే వారి కోరిక తప్పకుండా నెరవేరుతుందనేది ఎవరూ కాదనలేని నిజం. దొడ్డ గణపతి ఆలయం, బెంగళూరు బెంగళూరులోని బసవన గుడి బుల్ ఆలయం పక్కనే ఉంది ఈ ఆలయం. దేవాలయంలోని గణపతి విగ్రహం 18 అడుగుల పొడవు, 16 అడుగుల వెడల్పు ఉంటుంది. ఈయనను సత్య గణపతి అని, శక్తి గణపతి అని పిలుస్తుంటారు.విశేషం ఏమిటంటే ... ఆలయం కుడివైపు క్రమంగా పెరగటం. భక్తులు ఇది దేవుని మహిమగా చెబుతారు. బెంగళూరు నుంచే కాక రాష్ట్రం నలుమూల నుండి భక్తులు వచ్చి దేవుణ్ణి దర్శించి, తమ కోరికలు తీర్చమని కోరుకుంటారు. స్వామి వారి అలంకరణ: వారంలో అన్ని రోజులలో స్వామి వారికి పూజలు చేసి రకరకాల అలంకరణ చేయటం ఇక్కడి ప్రత్యేకత. ఈ అలంకరణ లో అతి ముఖ్యమైనది వెన్నతో స్వామిని అలంకరించటం. దీన్ని చూసేందుకు రెండు కళ్ళు చాలవు అని భక్తులు చెప్పుకొంటారు. ఇది చూస్తే జన్మ ధన్యం అయినట్లు భావిస్తారు ఈ భారీ గణేషుని శరీరానికి వెన్న పట్టించటానికి 100 కేజీలకు పైగా వెన్న అవసరం అవుతుంది. ఆలయ వెనక శ్రీ శివ శక్తి బేడర కన్నప్ప, శ్రీ కానేశ్వర, శివాలయాలు ఉన్నాయి. ఆలయ సందర్శన సమయం దొడ్డ గణేశ దేవాలయంలో స్వామి దర్శనం ఉదయం ఏడు నుంచి పన్నెండున్నర వరకు తిరిగి సాయంత్రం అయిదున్నర నుండి రాత్రి ఎనిమిదిన్నర వరకు ఉంటుంది. వినాయక చవితి నుంచి ఉత్సవాలు వైభవంగా జరుపుతారు. బెంగళూరు లో వాయు, రోడ్డు, విమాన సౌకర్యాలు చక్కగా అందుబాటులో ఉన్నాయి. బెంగళూరు లో అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ ఉంది. అలాగే రెండు రైల్వే స్టేషన్ లు – బెంగళూరు సిటీ, యశ్వంతపుర ఉన్నాయి ఇక్కడికి దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుండి రైళ్లు, విమానాలు వస్తుంటాయి. దక్షిణ భారతదేశంలోని అన్ని ప్రధాన పట్టణాల నుండి బెంగళూరు కు బస్సు సౌకర్యం ఉంది. తెలుగు రాష్ట్రాలలో సిద్ధివినాయక ఆలయం ఆంధ్రప్రదేశ్‌లో సుప్రసిద్ధ గణపతి ఆలయాల్లో అయినవిల్లి ఒకటి. ఇది స్వయంభూ గణపతి క్షేత్రం. కాణిపాకం తరువాత అంతటి ప్రాశస్త్యం దీనికి ఉంది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి సుమారు 60 కి.మీ, అమలాపురానికి 12 కి.మీ దూరంలో ఈ క్షేత్రం నెలకొంది. పవిత్ర గోదావరి నది ఒడ్డున, పచ్చని కోనసీమ అందాలు, సుందర ప్రశాంత వాతావరణం, ప్రకృతి రమణీయతలతో ఈ ఆలయం అలలారుతోంది. ఉమాసుతుడు ఇక్కడ సిద్ధి వినాయకునిగా కొలువై భక్త జనాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఈ ఆలయ ప్రాంగణంలో వివిధ దేవతల ఆలయాలూ ఉన్నాయి. స్థల పురాణం కృతయుగం నుంచే ఇక్కడ స్వామి కొలువై ఉన్నట్లు స్ధల పురాణం చెబుతోంది. దక్ష ప్రజాపతి ద్రాక్షరామం లో చేసిన దక్షయజ్ఞానికి ముందు ఇక్కడి వినాయకుని పూజించి పునీతుడయ్యాడని ప్రతీతి. వ్యాస మహర్షి దక్షణ యాత్ర ప్రారంభానికి ముందు ఇక్కడ గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించగా.. దేవతలు ఆలయాన్ని నిర్మించారు. అనంతర కాలంలో నాటి తూర్పు చాళుక్యుల నుంచి నేటి పెద్దాపురం సంస్థానాధీశుల వరకు ఎందరో ఆలయ పునరుద్ధరణ, అభివృద్ధిలో భాగస్వాములయ్యారు. క్షేత్ర ప్రత్యేకత అయినవిల్లి ఆలయ ప్రస్తావన క్రీ.శ 14వ శతాబ్ధంలో శంకరభట్టు రచించిన శ్రీపాదవల్లభ చరిత్రలో ఉంది. శ్రీపాదవల్లభుల మాతామహులు అయినవిల్లిలో స్వర్ణ గణపతి యజ్ఞం చేసినట్లు.. యజ్ఞం ముగింపులో గణనాథుడు సర్ణమయకాంతులతో దర్శనమిచ్చి హారతులను స్వయంగా అందుకున్నట్లు అందులో పేర్కొన్నారు. శ్రీపాద వల్లభుని జననాన్ని తెలియజేశారని చెబుతారు. దక్షిణాభిముఖంగా దర్శనం..సాధారణంగా దేవాలయాల్లోని మూలవిరాట్ తూర్పు ముఖంగా దర్శనమిస్తారు. దీనికి భిన్నంగా ఇక్కడి సిద్ధి వినాయకుడు దక్షిణాభిముఖుడై భక్తకోటికి అభయమిస్తున్నాడు. అలాగే దక్షిణ సింహద్వారం ఉన్న గృహాలకు ఎలాంటి విఘ్నాలు కలగవని అయినవిల్లివాసుల నమ్మకం. వివిధ ఉత్సవాలు.. ఇక్కడి సిద్ధి వినాయకుని మూలవిరాట్ అత్యంత ప్రాచీనమైంది. రోజూ స్వామికి వివిధ పూజలు, అర్చనలు, అభిషేకాలు జరుగుతాయి. అభిషేక సేవకు ఈ ఆలయంలో విశేష ప్రాముఖ్యం ఉంది. శివకేశవులకు ప్రీతికరమైన వైశాఖ శుద్ధ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు పాంచాహ్నిక దీక్షతో అయిదు రోజులపాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. పూర్ణిమనాడు కల్యాణం.. గ్రామోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయి. భాద్రపద శుద్ధ చవితి నుంచి తొమ్మిది రోజుల పాటు వినాయక నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. మకర సంక్రాంతి, కనుమనాడు ప్రభల ఉత్సవం చేస్తారు. విజయదశమి, కార్తీకమాసం మొదటి, నాలుగు సోమవారాలు, కృష్ణాష్టమినాడు ప్రత్యేక పూజలు చేసి గ్రామోత్సవం నిర్వహిస్తారు. ఏటా మాఘ మాసంలో చదువుల పండుగ జరుగుతుంది. పండగలో భాగంగా గంగ, యమున, గోదావరి, సరస్వతి, నర్మద, సింధు, కావేరి నదీ జలాలతో స్వామిని అభిషేకిస్తారు. లక్ష కలములను సిద్ది వినాయకుని పాదాల వద్ద ఉంచి... లక్ష దూర్వములతో పూజిస్తారు. అనంతరం ఆ పెన్నులను విద్యార్థులకు పంచుతారు. వీటితో పరీక్షలు రాస్తే మంచి ఉత్తీర్ణత సాధించడంతో పాటు, చదువులో రాణిస్తారని భక్తుల విశ్వాసం. వివిధ ఆలయాలు... అయినవిల్లి క్షేత్రంలో గణపతి ఆలయంతో పాటు అన్నపూర్ణా సమేత విశ్వేశ్వరాలయం, శ్రీదేవీ, భూదేవీ సమేత కేశవస్వామి ఆలయం, కాలభైరవ ఆలయాలు ఉన్నాయి. ఇలా చేరుకోవాలి... రాజమహేంద్రవరం నుంచి అయినవిల్లికి బస్సు సౌకర్యం ఉంది. అమలాపురం నుంచి బస్సు, ఆటోలో దేవాలయాన్ని చేరుకోవచ్చు. కాకినాడ నుంచి యానాం, అమలాపురం, ముక్తేశ్వరం మీదుగా అయినవిల్లి చేరుకోవచ్చు. ఇతర సమాచారం.. దేవాలయం ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తిరిగి మధ్యాహ్నం 3:30 గంటల నుంచి 8గంటల వరకు తెరిచి ఉంటుంది. అభిషేకం ఉదయం 7 గం.ల నుంచి 11 గం. వరకు జరుగుతుంది. (సాధారణ రోజుల్లో) – డి.వి.రామ్ భాస్కర్ -
మహారాష్ట్రలోని అష్టగణపతి ఆలయాల గురించి మీకు తెలుసా?
గణపతి ఉపాసనకు మహారాష్ట్ర పెట్టింది పేరు. దానికి తగ్గట్టుగానే ఆ రాష్ట్రంలో గణపతి క్షేత్రాలు కోకొల్లలు. వాటన్నిటిలోకి అష్టగణపతి క్షేత్రాలుగా ప్రాముఖ్యం సంతరించుకున్న ఎనిమిది క్షేత్రాలు గణాధిపత్యులకు ముఖ్యమైనవి. ఈ ఎనిమిదీ ‘అష్టగణపతి క్షేత్రాలు‘గా ప్రసిద్ధికెక్కాయి. 1. మయూరేశ్వర గణపతి – పూనా జిల్లాలో పూనా నుండి నలభై మైళ్ళ దూరంలో నున్న ’మోరగావ్’లో మయూరేశ్వర గణపతి ఆలయం ఉంది. 2. చింతామణి గణపతి – పూనా నుండి పధ్నాలుగు మైళ్ళదూరంలో నున్న ’థేపూర్’ చింతామణి గణపతి క్షేత్రం. 3. గిరిజాత్మజ గణపతి – పూనా నుండి అరవై మైళ్ళదూరంలో నున్న ’లేహ్యాద్రి’ అనే స్థలంలో గిరిజాత్మజ గణపతి క్షేత్రం వెలిసింది. 4. శ్రీ విఘ్నేశ్వర గణపతి – లేహ్యాద్రి సమీపంలోనే ’ఓఝల్’ స్థలంలో ’శ్రీవిఘ్నేశ్వర’ క్షేత్రం వెలిసింది. 5. మహోత్కట గణపతి – పునానుండి 32 మైళ్ళ దూరంలో ’’రాజన్గావ్’’లో మహోత్కట గణపతి ఆలయం ఉంది. 6. భల్లాలేశ్వర గణపతి – మహారాష్ట్రలోని కులాబా జిల్లాలో ’పాలీ’ అనేచోట భల్లాలేశ్వర గణపతి క్షేత్రం ఉంది. 7. వరదవినాయకుడు – కులాబా జిల్లాలో ’’మహర్’’ అనే స్థలంలో ’’వరదవినాయక’’ ఆలయం ఉంది. 8. సిద్ధివినాయకుడు – అహ్మద్ నగర్ జిల్లాలో ’’సిద్ధటేక్’’ అనే స్థలంలో సిద్ధివినాయక క్షేత్రం వెలిసింది...!! -
ఈ వినాయకుడ్ని దర్శిస్తే..ఎలాంటి విఘ్నమైనా చిటికెలో తీరిపోతుందట!
అన్ని విఘ్నాలనూ తొలగించే... తొలిపూజలందుకునే దేవుడిగా ప్రసిద్ధికెక్కిన గణపయ్యకు ఎన్నో రూపాలున్నాయి. వింతకాంతులతో వెలుగుతూ చిత్ర విచిత్ర రూపాలతో భాసించే ఆ దేవుణ్ణి అందరూ ఆరాధిస్తారు. గుడికట్టి పూజిస్తారు. ఆ గణనాథుణ్ణి మామూలుగా అందరికీ తెలిసిన ఆకారంలో గాకుండా విశిష్టంగా కనిపించే రూపాలతో దేశవిదేశాలలో అనేక ఆలయాలున్నాయి. వినాయక చవితి సందర్భంగా అరుదైన రూపంతో అగుపించే గణపతి ఆలయాలు ఎక్కడ ఉన్నాయి, వాటి విశిష్టత ఏమిటో తెలుసుకుందాము. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో ఉన్న కాణిపాకంలో శ్రీ వరసిద్ధి వినాయకుని గురించి తెలియని తెలుగువారు ఉండరంటే అతిశయోక్తి కాదు. అక్కడి గణపయ్య విగ్రహం నానాటికీ పెరిగిపోతోందని స్థానికులు చెబుతారు. ఇక్కడే కాదు, మన భారతదేశంలో కొన్ని ఆధ్యాత్మిక ప్రదేశాల్లో విగ్రహాలు పెరుగుతాయని భక్తులు విశ్వాసం. కాణిపాకంలో లాగే కర్నూలు జిల్లా యాగంటిలో కూడా నంది విగ్రహం రోజురోజుకూ పెరుగుతోందని భక్తుల నమ్మకం. అలాగే కేరళలోని కాసర్ గోడ్ జిల్లాలోని మధుర్ గ్రామంలోని శివాలయంలో ఉన్న వినాయక విగ్రహం కూడా పెరుగుతోందని అక్కడి స్థానిక ప్రజలు చెబుతున్నారు. ఉత్త్తర కర్నాటకలో కాసర గోడ్ సమీపంలో మధుర్లో అనేక ఆలయాలున్నాయి ఇందులో మహాశివ ఆలయం, మహాగణపతి ఆలయం ముఖ్య మైనవి. ప్రకృతి ఒడిలోకి చేరినట్లు కనిపించే కేరళ... కర్నాటక బార్డర్లో కేరళ కొసన కసార్‌గాడ్ అనే పట్టణం ఉంది. ఈ పట్టణానికి అతి సమీపంలో మధుర్ మహాగణపతి అనే ఆలయం ఉంది. ఈ ఆలయం ఆవిర్భావం, చరిత్ర అన్నీ విశేషమే! నిజానికి చెప్పాలంటే ఈ ఆలయంలోని మూలవిరాట్టు ఆ పరమేశ్వరుడు. ఈ శివుని విగ్రహం కూడా ఓ స్వయంభువు గా వెలసినదని చెబుతారు. మధుర్ స్థలపురాణం ప్రకారం మధుర అనే ఒక స్త్రీ పెరుగుతున్నగణపతిని కనుగొన్నది. ఆమె పేరు మీదగానే ఈ ఆలయం మధూరాలయంగా మరియు ’మధుర్ మహాగణపతి ఆలయం’గా ప్రసిద్ది చెందింది. విగ్రహాన్ని ఆమె తొలిసారి చూసింది కనుక ప్రస్తుతం తొలి దర్శనాన్ని ప్రత్యేకించి మహిళకే కల్పిస్తున్నారు. మరి అంతటి మహిమల గల ఈ ఆలయ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం స్థల పురాణం ప్రకారం ఒక పురాణగాథ స్థల పురాణం ప్రకారం ఒక పురాణగాథ ఉంది. మధుర్ గణపతి ఆలయ పూజారి పిల్లవాడు ఒక సారి ఈ శివాలయానికి వచ్చాడు. ఆడుకుంటూ, ఆడుకుంటూ గర్భగుడిలోకి వెళ్ళి, అక్కడి దక్షిణంవైపు ఉన్న గోడమీద వినాయకుని రూపాన్ని సరదాగా చెక్కాడు. ఆ పిల్లవాడి భక్తికి మెచ్చాడో...తండ్రి చెంత తను కూడా ఉండాలనుకున్నాడో కానీ..ఆ బొమ్మ నుండి ఒక వినాయకుని రూపం ఆవిర్భవించడం మొదలైంది. అంతే కాదు..అలా మొదలైన ఆ రూపం నానాటికీ పెరుగుతోందని, అందుకే ఆ వినాయకుడిని బొడ్డ గణపతి అని పిలుస్తున్నారు. బొడ్డ గణపతి అంటే బొజ్జగణపయ్య అని అర్థం.మధుర్ మహాగణపతి ఆలయం మిగతా ఆలయాలకంటే భిన్నంగా మధుర్ మహాగణపతి ఆలయం మిగతా ఆలయాలకంటే భిన్నంగా కనబడుతుంది. మూడు చుట్టలుగా ఉన్న ప్రాకారాల రూపంలో ఉంటుంది. ఏనుగు వెనుక భాగంలాగా కనిపించే ఇలాంటి నిర్మాణాలని గజప్రిస్త’గోపురాలని పిలుస్తారు. ఆలయంలోని చెక్క మీద మహాభారత, రామాయణ ఘట్టాలని తలపించే శిల్పాలని చెక్కడం చూడవచ్చు. ఆలయ సమయాలు: ఈ ఆలయాన్ని ప్రతి రోజూ ఉదయం ఎనిమిది నుండి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు సాయంత్రం అయిదు నుండి రాత్రి ఎనిమిది వరకు తెరచి ఉంటుంది. ఇక్కడికి ఆదివారం నాడు భక్త జన సందోహం ఎక్కువ గా రావటం విశేషం.ఈ ఆలయం చరిత్రకు మరో విశేషం కూడా ఉంది. ఈ ఆలయం చరిత్రకు మరో విశేషం కూడా ఉంది. అదేంటంటే టిప్పుసుల్తాను దాడి. ఒకసారి టిప్పు సుల్తాను తన సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ ఈ దిశగా వచ్చాడట. తిరుగుముఖంలో ఇక్కడి ఆలయాన్ని ధ్వంసం చేయాలనుకున్నాడట. కానీ ఈ ఆలయంలోని మంచినీరు తాగిన వెంటనే ఆయన మనసు మారిపోయిందట. అయితే తన సైనికుల తృప్తి కోసం నామకార్థంగా తన ఖడ్గంతో ఆలయం గోడ మీద ఒక వేటు వేసి వెళ్లిపోయాడట. ఇప్పటికీ ఆలయం గోడ మీద టిప్పు సుల్తాను తన ఖడ్గంతో మోదిన గుర్తుని చూడవచ్చు. ఇక్కడి స్వామికి అప్పాలు అంటే చాలా ఇష్టం ఏదైనా కొత్త పనిని ఆరంభించేటప్పుడు, అనుకున్న పనికి అనుకోని ఆటంకాలు ఎదురవుతున్నప్పుడు..... ఈ ఆలయాన్ని దర్శిస్తే తప్పక ఫలితం దక్కుతుందన్నది భక్తుల నమ్మకం. ఇక్కడి స్వామికి అప్పాలు అంటే చాలా ఇష్టమట. అందుకనే ఈ స్వామిని దర్శించుకుని ఆయనకు అప్పాలను ప్రసాదంగా సమర్పిస్తే... ఎలాంటి విఘ్నమైనా చిటికెలో తీరిపోతాయని అంటారు. సహస్రాప్పం పేరుతో స్వామివారికి వేయి అప్పాలను నివేదించే ఆచారమూ ఇక్కడ కనిపిస్తుంది.ఈ ఆలయం కేరళలో ఉన్నా, కర్ణాటకకి కూడా ఇది చేరువే అవుతుంది. ఈ ఆలయం కేరళలో ఉన్నా, కర్ణాటకకి కూడా ఇది చేరువే అవుతుంది. కర్ణాటకలోని మంగళూరుకు కేవలం 50 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో కన్నడిగులు కూడా వేలాదిగా ఈ స్వామివారిని దర్శించుకుంటారు. గోకర్ణం దగ్గర నుంచి సాగే ఆరు వినాయకుని క్షేత్రదర్శనంలో మధుర్ మహాగణపతి ఆలయం కూడా ఓ భాగమే! -
ఈ వినాయకుడ్ని పూజిస్తే వివాహ అడ్డంకులు తొలిగిపోతాయట!
విశిష్ట గణపతికి ... వైవిధ్య రూపాలతో పూజలు పురాణేతిహాసాల ప్రకారం శ్రీ మహావిష్ణువు పార్వతీ దేవికి సోదరుని వరస. వినాయకుడు పార్వతీ తనయుడు. శ్రీ కృష్ణుడు మహావిష్ణువు అవతారం. ఈ వరస మేరకు కృష్ణుడు వినాయకుని మేనమామ.అలాటి మేనమామ తన మేనల్లుడి ఒడిలో కూర్చున్న అపూర్వ దర్శనం మీకెప్పుడైనా జరిగిందా ? అలాటి పుణ్యక్షేత్రం ఎక్కడుందో తెలియాలంటే మనం కేరళలోని మళ్ళియూర్ వూరికి వెళ్ళాలి. అక్కడి ఆలయంలో వినాయకుని ఒడిలో బాలకృష్ణుడు ఆసీనుడై భాగవతం వింటున్న అపూర్వ దృశ్యాన్ని మనం చూడగలం.ఇటువంటి దృశ్యం మరెక్కడా దర్శించలేము.వేలసంవత్సరాల ప్రాచీనమైన ఈ ఆలయంలో బీజ గణపతి రూపంలో వినాయకుడు అనుగ్రహిస్తున్నాడు. ఈ ఆలయం ప్రసిద్ధి చెందడానికి భాగవత అంశగా ప్రసిద్ధి చెందిన శంకరన్ నంబూద్రియే ముఖ్య కారణంగా చెపుతారు. శంకరన్ నంబూద్రి గణపతి విగ్రహం పక్కనే సాలగ్రామాన్ని పెట్టుకుని పూజిస్తూండేవారు. నిత్యం భాగవత పారాయణం చేసేవారు. ఒకనాడు ఆయనకు తన పూజలో వినాయకుని విగ్రహంలో బాలకృష్ణుని రూపం స్పష్టంగా గోచరించింది. ఆయన తాను చూసిన దృశ్యాన్ని యదాతధంగా చెక్కిన రూపమే ఈనాడు ఆ ఆలయంలో దర్శనమిచ్చే విగ్రహం. తొండం చివర నిమ్మపండు, హస్తాలలో కొడవలి, అంకుశం, తనకు ప్రీతిపాత్రమైన ఉండ్రాళ్ళు చేత ధరించి తనకు మామ అయిన బాలకృష్ణుని తన ఒడిలో వుంచుకొని దర్శనానుగ్రహాన్ని కలిగిస్తున్నాడు. గర్భగుడిలో ఇతర దైవ విగ్రహాలు ఏవీ వుండవు. భక్తుల కోరికలను తక్షణమే నెరవేర్చే వరప్రసాది మళ్ళియూరు మహాగణపతి. ఇక్కడ ఇష్టసిద్ధికై చేసే పూజలను ముక్కుట్రి పుష్పాంజలి అంటారు. సకల ఐశ్వర్యాలు కలగడానికి ఉదయాస్తమ పూజ జరుగుతున్నది. కష్టాలు తీరడానికి సహస్ర కలశాభిషేకం జరిపించుకుంటారు.వివాహ అడ్డంకులు లేకుండా వుండడానికీ పళ్ళమాలలు సమర్పిస్తారు. 27 కదళీ ఫలాలతో కట్టే యీ మాలను నక్షత్ర మాల అంటారు. అనారోగ్యాల నివారణకై దడి నివేదన చేస్తారు. బియ్యప్పిండి, చక్కెర, కొబ్బరి కలిపి మోదకంగా తయారు చేసి ఆవిరిలో ఉడికించి నివేదిస్తారు. దీనికే దడి నైవేద్యమని పేరు. ఈ ఆలయంలో పితృదోష పరిహారాలు జరుపుతారు. చవితినాడు చతుర్ధియూటు అనే పితృదోష పరిహార పూజలు జరుపుతారు. సంతాన భాగ్యం కోసం పాలు పాయసం నివేదించి పూజిస్తారు. తులాభార మొక్కు లు కూడా తీర్చుకుంటారు. ఈ ఆలయంలో తొమ్మిది రోజుల ఉత్సవం ఫాల్గుణ మాసంలో ఆరంభమై చైత్రమాసంలో వచ్చే విషూ పండుగతో సంపూర్ణమౌతాయి. వినాయకచవితి పండగను ఘనంగా జరుపుతారు.కేరళలోని కొట్టాయం .. ఎర్నాకుళం మార్గంలో కురుప్పన్దర అనే చోట దిగితే 2 కి.మీ దూరంలోను, కురుప్పన్దర రైల్వేస్టేషన్ నుండి 1/2 కి.మీ దూరంలో మళ్లియూరు మహాగణపతి ఆలయం వున్నది. -
గణపతి నవరాత్రులు..ఇలా పూజిస్తే విజయమే కాదు ధనం కూడా
మన భారతీయ సంప్రదాయం ముఖ్యంగా మూడు నవరాత్రుల పండుగలను చెప్పింది. 1) వసంత నవరాత్రులు, 2) గణపతి నవరాత్రులు, 3) దేవీ నవరాత్రులు. వినాయక నవరాత్రులనకుండా గణపతి నవరాత్రులనటంలోనే గణపతి వైభవం మనకు స్పష్టంగా అర్థమౌతున్నది. వేదం కూడా వినాయకుణ్ణి గణపతిగానే కీర్తించింది. ఏ శుభకార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నా ‘‘ఓమ్ గణానాం త్వా గణపతిగ్ం హవామహే‘‘ అనే వేదమంత్రంతోనే వినాయక పూజ ప్రారంభిస్తారు, గణపతులు మహాగణపతి, వాతాపిగణపతి, విద్యాగణపతి, విజయగణపతి, నృత్యగణపతి, సంగీత గణపతి, ఉచ్ఛిష్ట గణపతి ఇలా చాలా రకాలుగా ఉన్నారు. అందరికీ అవసరమైన వానినందిస్తూ అందరిచేత పూజలందుకొనే వాడు లక్ష్మీగణపతి. ఈనాడు చదువులు, వ్యాపారాలు, ఆరోగ్యాలు, ఆరాధనలు, అన్నదానాలు అన్నీ ధనంతోనే ముడిపడి ఉన్నాయి. అందువల్ల లక్ష్మీగణపతిని ఆరాధిస్తే విద్యా, విజయం, ధనం అన్నీ కైవసం అవుతాయి. ఈ లక్ష్మీగణపతి వృత్తాంతం గణేశ జననం అనే పేరుతో బ్రహ్మవైవర్త పురాణంలో గణపతి ఖండంలో పూర్వాపరాలతో చాలా వివరంగా ఉంది.పార్వతీ పరమేశ్వరులు ఏర్పాటు చేసిన ఒక ఉత్సవంలో దేవతలందరితో పాటుగా హాజరైన లక్ష్మీదేవి ఆ సందర్భంలో గణేశుని ఉద్దేశించి మమ స్థితిశ్చ, దేహే తే గేహే భవతు శాశ్వతీ! (నీ శరీరంలో, నీవు ఉన్న ఇంటిలో శాశ్వతంగా నా స్థితి ఉంటుంది. అంటే నేను నివసిస్తాను) అని లక్ష్మీదేవి ప్రత్యేకంగా చెప్పినందువల్ల ఈ స్వామి లక్ష్మీగణపతి అయినాడు. వైభవం అంటే విశేషమైన పుట్టుక. ఆ పుట్టుక ఈ లక్ష్మీ గణపతిది. శ్రీకృష్ణాంశేన సంభూతం సర్వ విఘ్ననివారకమ్ ‘ పార్వతీశ్వరయోః పుత్రం లక్ష్మీగణపతిం భజే ‘‘ అనే ఈ శ్లోకాన్ని జపిస్తూ లక్ష్మీగణపతి స్వామిని ఆరాధిస్తే అఖండంగా ఆయుర్లక్ష్మి, ఆరోగ్యలక్ష్మి ఐశ్వర్యలక్ష్మి కలుగుతాయి. ప్రపంచమంతా సుఖశాంతులతో వర్ధిల్లుతుంది. శ్రీ లక్ష్మీగణపతి ఆలయాలు బెంగళూరులోను, ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో రత్నగిరి నగర్, పలకలూరి పంచాయతీలో లక్ష్మీగణపతి ఆలయం ఉన్నది. అక్కడి స్వామి ఎడమ వైపున ఒడిలో లక్ష్మీ అమ్మవారిని కూర్చుండపెట్టుకొని దశ భుజుడై దర్శనమిస్తాడు. అష్టలక్ష్ములకు సంకేతంగా ఎనిమిది చేతులతో ఎనిమిది విధాలైన ఆయుధాలను ధరించి ఒక చేతిలో అభయ ముద్రతో, మరొక చేతితో అమ్మవారిని ధరించి భక్తులను అనుగ్రహిస్తున్నాడు. గణపతి నవరాత్రులు ప్రారంభమయ్యే వినాయకచవితి రోజున లక్ష్మీగణపతి స్వామిని భక్తి శ్రద్ధలతో సేవిద్దాం మనతో పాటు దేశ సౌభాగ్యాన్ని కూడా పొందుదాం. -
ముక్కోటి దేవుళ్ళలో వినాయకుడికే మొదటి పూజ ఎందుకు? గణాధిపత్యం ఎలా దక్కింది?
కుమారస్వామి అప్పటికే దేవసేనాధిపతిగా ఉన్నాడు. అందువల్ల వినాయకుడికి ప్రమథ గణాధిపత్యం ఇవ్వాలనుకున్నాడు శివుడు.‘నువ్వు నా ప్రమథగణాలకు నాయకుడిగా ఉండు’ అని వినాయకుడితో అన్నాడు శివుడు.‘తండ్రీ! నాయకుడిగా ఉండమంటే సరా? అర్హత నిరూపించుకోనిదే నాయకత్వం స్వీకరించడం ఏమంత సమంజసం? తమ్ముడు ఇప్పటికే దేవసేనాధిపతిగా సేనానాయకత్వంలో ఆరితేరి ఉన్నాడు. అతడికే గణాధిపత్యం కట్టబెడితే బాగుంటుంది’ అన్నాడు వినాయకుడు.‘ఇప్పటికే నీ తమ్ముడు దేవసేనాధిపతిగా ఉన్నాడు గనుకనే నిన్ను ప్రమథగణాలకు నాయకత్వం వహించమంటున్నాను. ఒక్కడే రెండు బాధ్యతలు నిర్వహించడం అతడికి భారంగా మారవచ్చు’ అన్నాడు శివుడు.‘తండ్రీ! అయితే, ఏదైనా పరీక్షపెట్టి, నెగ్గినవారికి నాయకత్వం అప్పగించడం న్యాయంగా ఉంటుంది’ అన్నాడు వినాయకుడు. దేవతలు, ప్రమథులు కలసి వినాయకుడికి, కుమారస్వామికి ఒక పందెం పెట్టారు. ముల్లోకాల్లోని తీర్థ క్షేత్రాలను సేవించి ముందుగా ఎవరు కైలాసానికి చేరుకుంటారో వారికే గణాధిపత్యం అప్పగించాలని తీర్మానించారు.కుమారస్వామి తన మయూరవాహనంపై రివ్వుమని ఎగురుతూ బయలుదేరాడు.వినాయకుడు ఎక్కడికీ కదలకుండా, ఉన్నచోటనే చతికిలబడి కూర్చుండిపోయాడు.అప్పుడు విష్ణువు అతణ్ణి ఏకాంతంలోకి తీసుకుపోయి, ‘నాయనా! మేమంతా నిన్ను అభిమానిస్తున్న వాళ్లం. నీ ఓటమి మా ఓటమి అవుతుంది. నువ్వెక్కడికీ తిరగనక్కర్లేదు. నేను చెప్పినట్లు చేస్తే చాలు’ అని చెప్పాడు.విష్ణువు సలహాతో వినాయకుడు ఉన్నచోటనే మఠం వేసుకు కూర్చుని, శివపంచాక్షరి మంత్రాన్ని జపించడం ప్రారంభించాడు.కుమారస్వామి వెళ్లిన ప్రతి తీర్థంలోనూ, క్షేత్రంలోనూ వినాయకుడు అతడికి తిరుగుముఖం పడుతూ ఎదురవుతూ వచ్చాడు. ఆశ్చర్యపోతూనే ముల్లోకాల్లోని తీర్థ క్షేత్రాలను కుమారస్వామి సేవించుకున్నాడు. కైలాసానికి తిరిగివస్తూనే, ‘తండ్రీ! ఈ పందెంలో నేను ఓడిపోయాను. అన్నదే గెలుపు. నీవనుకున్నట్లు అతడికే గణాధిపత్యాన్ని అప్పగించు’ అన్నాడు. కుమారస్వామి కైలాసంలో కొలువుదీరిన దేవతలు, మునులు, ప్రమథగణాల మధ్యకు వచ్చి, ‘పందెంలో మా అన్న వినాయకుడే గెలిచాడు. అతడికి సత్వరమే గణాధిపత్య పట్టాభిషేకం జరగాలి. శివుని ఆజ్ఞ అందరికీ శిరోధార్యం’ అని చెప్పాడు. కుమారస్వామి ప్రకటనతో దేవతలందరూ హర్షం వెలిబుచ్చారు. అయితే, ప్రమథగణ ప్రముఖులలో శృంగీశ్వర, భృంగీశ్వర, చండీశ్వర, నందీశ్వరులు మాత్రం దీనిని వ్యతిరేకించారు.అదివరకు వినాయకుడు పుత్రగణపతి రూపంలో వారికి గర్వభంగం చేశాడు. ఆ అక్కసుతోనే వారు వినాయకుడికి గణాధిపత్యం కట్టబెట్టడాన్ని వ్యతిరేకిస్తూ, ‘మొదటి నుంచి మేము శివుడికి నమ్మినబంట్లుగా ఉంటున్నాం. అలాంటిది వినాయకుడు మాకు ఎలా అధిపతి అవుతాడు? అతడికి తనదంటూ ఎలాంటి బలగమూ లేదు. అతడికి గణాధిపత్య అభిషేకమేమిటి?’ అంటూ నానా మాటలూ అన్నారు.ప్రమథుల కలకలం విన్న శివుడు అక్కడకు చేరుకున్నాడు. వారి మాటలు విని కళ్లెర్రజేశాడు. ‘నా నిర్ణయానికే ఎదురాడేటంత గొప్పవారైపోయారా మీరు?’ అంటూ ఆగ్రహోదగ్రుడయ్యాడు.ఇంత జరుగుతున్నా వినాయకుడు శాంతంగా, ‘నిజమే! నాకు గణాలెక్కడివి? లేవు కాబోలు. అన్నట్లు పుత్రగణపతిగా ఉన్నప్పుడు నాకూ కొన్ని గణాలు ఉన్నట్లు గుర్తు. ఆ గణాలు ఎక్కడ?’ అన్నాడు. వినాయకుడి నోట ఆ మాట వెలువడగానే, ముమ్మూర్తులా వినాయకుడిని పోలి ఉన్న గజముఖులు కోటాను కోట్లుగా పుట్టుకొచ్చారు. దిక్కులు పిక్కటిల్లేలా వినాయకుడికి జయజయ ధ్వానాలు పలుకుతూ అతడికి బాసటగా వచ్చి నిలుచున్నారు. వారందరూ చతుర్భుజులే! కొందరి చేతుల్లో ఘంటాలు, లేఖినులు, కుంచెలు ఉన్నాయి. ఇంకొందరి చేతుల్లో త్రిశూల కరవాల గదా ధనుర్బాణాది ఆయుధాలు ఉన్నాయి. మరికొందరి చేతుల్లో వీణా వేణు మృదంగ ఢక్కాది వాద్యపరికరాలు ఉన్నాయి. వారిలో కొందరు అరుణపతాకాలను పట్టుకున్నారు. ఇంకొందరు వినాయకుడికి ఛత్ర చామరాలు పట్టారు. వారు రత్నఖచితమైన భద్రసింహాసనాన్ని తీసుకువచ్చి, వినాయకుణ్ణి దానిపై కూర్చుండబెట్టారు. ఈ సంరంభానికి వినాయకుడి వాహనమైన మూషికం సింహాసనం కింద ఆనందంతో చిందులు వేయడం మొదలుపెట్టింది. దేవతలు, మునులు వేదస్తోత్రాలు పఠిస్తుండగా ప్రమథ గణాధిపతిగా వినాయకుడికి ఘనంగా అభిషేకం జరిగింది. ∙సాంఖ్యాయన -
వినాయకుడి వివాహం ఎలా జరిగిందో తెలుసా?మనకు తెలియని కథ..
వినాయకుని వివాహం గురించి చక్కటి పౌరాణిక గాథ. ప్రళయవేళ శ్రీ మహావిష్ణువు నాభినుండి వచ్చిన తామరపువ్వుపై బ్రహ్మ అవతరించాడు. ప్రళయానంతరం విష్ణువు మేల్కొని జీవనసృష్టి కార్యకలాపాన్ని ప్రారంభించమని తన కొడుకైన బ్రహ్మను ఆదేశించాడు. బ్రహ్మ సృష్టి ఆరంభిచాడు. కానీ అంతా వక్రంగా వుంది. అప్పటికి ఎన్నో కల్పాలలో సృష్టి చేస్తూ వస్తున్న బ్రహ్మకు ఈ పరిణామం ఆశ్చర్యం కలిగించింది. ఆలోచనలో పడ్డాడు. అప్పుడు నారదుడు కార్యారంభానికి ముందు వినాయక పూజ చేయనందువల్లే ఈ వైకల్పికము వచ్చిందని గణేశ అర్చనం చేయమని బ్రహ్మకు బోధించాడు. బ్రహ్మ వినాయకునికై కఠోర తపస్సు చేశాడు. ప్రత్యేక్షమైన వినాయకుడు బ్రహ్మ ఆంతర్యాన్ని గ్రహించి జ్ఞానం, క్రియలనే శక్తులను ఉపాసించమని బోధించాడు. బ్రహ్మ ఆ ఉపాసన చేశాడు. అప్పుడు ఆ రెండు శక్తులు సిద్ధి, బుద్ధి అనే రూపాలతో ప్రత్యక్షమయ్యాయి. బ్రహ్మ కోరిక మేరకు వారిరువురూ ఆయన కుమార్తెలుగా జన్మించారు. ఆ తరువాత బ్రహ్మ చేసిన సృష్టి సక్రమముగా కొనసాగింది. సిద్ధిబుద్ధులు యౌవనవతులయ్యారు. వారి వివాహం చేయాలని బ్రహ్మ సంకల్పించాడు. ఈలోగా నారదుడు కథ నడిపి సిద్ధిబుద్ధులు గణేశుని కోరుతున్నారని ఆయనకు చెప్పాడు. వినాయకుడు అంగీకరించాడు. తరువాత గణేశుడు మిమ్మల్ని కోరుతున్నాడని వారిద్దరికీ చెప్పాడు. బ్రహ్మ సమక్షంలో వినాయకుడికి పెళ్ళి జరిగింది. నూతన వధూవరులను ఆశీర్వదించి నారదుడు వినాయకునివైపు ఆశ్చర్యంగా చూశాడు. అతని ఆంతర్యాన్ని గ్రహించిన వినాయకుడు నారదా! మా మధ్య కలహం వస్తుదని నీవు భావించావు. ఈ సిద్ధిబుద్ధి ఎవరోకాదు, నా ఆంతరంగిక శక్తులైన జ్ఞానం, క్రియ. అందుకే మేము మళ్ళీ ఒకటయ్యాం.నీ కలహ చింతన లోకోపకారమైంది. భవిష్యత్ మానవుడు సిద్ధిబుద్ధి సమేతుడనైన నన్ను ఆరాధిస్తే వారికి సమస్త విఘ్నాలు తొలగి సుఖశాంతులు కలుగుతాయని చెప్పాడు. ఇది వినాయకుడి పెళ్ళి కథ ఆంతర్యం. -
Ganesh Chaturthi 2023: మనం కొలిచే తొలి దైవం ఆయనే..ఆనాటి నుంచే ఆచారం
సమస్త విఘ్నాలను పోగొట్టి,సర్వ విజయాలను,సత్వర ఫలాలను అందించే విఘ్ననాయకుడు వినాయకుడి పండుగను సభక్తి పూర్వకంగా జరుపుకోవడం అఖండ భారతీయులకు అనాదిగా వస్తున్న ఆచారం.మనం పూజించే తొలి దైవతం ఆయనే. ఎంతటి నాయకుడైనా వినాయకుడి ముందు సాగిలపడాల్సిందే.తమ ఇచ్ఛలు తీరాలంటే ఈ దేవుడిని కొలవాల్సిందే.భిన్న మతాలు,జాతులు కులాలు,సంస్కృతుల సంగమమైన భారతదేశాన్నిఏకం చేసింది,ఈ నేలపై జీవించేవారినందరినీ ఐక్యంగా నిలిపిందీ సనాతన ధర్మం.సహనం,సమ భావనందానికి ఆధారం."సర్వేజనా సుఖినో భవంతు"అన్న ఆర్యవాక్కులు దానికి మూలాధారం.సర్వజనులు బాగుండాలనే మంచితనం మనవారి రక్షణ కవచం.ఎక్కడెక్కడ నుంచో ఎవరెవరో వచ్చి,మనల్ని దురాక్రమించారు. వందల ఏళ్ళు ఈ రాజ్యం పరాయి పాలనలో సాగింది.ఎన్నో భాషా సంస్కృతులు వచ్చి చేరాయి.చాలా సంపదను కోల్పోయాం,విష కౌగిళ్ళ మధ్య నలిగిపోయాం.తుచ్ఛ సంస్కృతి వీధుల్లో ఏరులై పారింది.వీటన్నిటిని తట్టుకొని నిలబడ్డాం.మన ఉనికిని కాపాడుకున్నాం.మనదైన సంప్రదాయం మృగ్యమవకుండా చూసుకున్నాం.ప్రపంచ దేశాలలో భారత్ ను విశిష్టంగా గౌరవింప చేసింది,వివేకానంద వంటి మహనీయులు ప్రసంగిస్తుంటే ఆంగ్లేయులు సైతం మ్రాన్పడి వినేలా చేసింది మనదైన సంస్కారం.ఈ విశిష్ట విధానమే మన జీవనశైలి,మన పెంపకం.కలిసిమెలిసి వుండే కుటుంబ బంధాలు,గొప్ప వివాహ వ్యవస్థ మన దేశాన్ని సర్వోన్నతంగా నిలిపాయి.అదే మన సనాతన ఆచారంలోని ఔన్నత్యం. ఆచారం అంటే ఆచరించేది.హంగూ అర్భాటాలతో ప్రదర్శించేది కాదు.ఆత్మశుద్ధితో సాగే ఆరోగ్య స్రవంతి.పండుగలు మన జీవితంలో భాగం.హృదయంగమంగా జరుపుకోవడం ఒక యోగం.ఇంతటి ఉదాత్త విధానాల రూపమైన పండుగలు,ఆచారాలు రాజకీయాలకు వేదికలుగా మారడం మారుతున్న సమాజానికి, అడుగంటుతున్న విలువలకు అద్దం పట్టే విషాదం.అనంత కాలప్రవాహంలో,లక్షలాదిసంవత్సరాల మానవ జీవన పయనంలో కరోనా కాలం ఎంతో బాధించింది.ఇప్పుడు నిఫా వైరస్ అంటున్నారు.గతంలోనూ ఇటువంటివి ఎన్నో వచ్చి వెళ్లిపోయాయి.రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు.మంచిరోజులు వస్తాయి.భక్తి ప్రదర్శన కాదు.ఆత్మగతమైన అనుభూతి,బుద్ధిని ప్రక్షాళనం చేసే సద్గతి,అని మన పూర్వులు చెప్పారు.అఫ్ఘాన్ వంటి దేశాలను చూస్తేవారి రాక్షస ప్రవృత్తే వారిని ఏకాకులను చేసింది. డబ్బు పరంగా అగ్రరాజ్యమనే పేరున్నా,అమెరికాపై ప్రపంచ దేశాలకు విశ్వాసం లేదు.తుపానులా పైకి లేచిన చైనాను ఎవ్వరూ నమ్మరు.మూలక్షేత్రానికే దెబ్బకొడదామని చూసే పాకిస్తాన్ పట్ల ఎవ్వరికీ గౌరవం ఉండదు.క్షణక్షణానికి బంధాలు మార్చుకుంటున్న రష్యా తీరూ అంతే.ఒకప్పుడు అనంతమైన సంపదకు,సర్వ విద్యలకు నెలవుగా ఉన్న భారతదేశం,నేటికీ ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలోనే ఉన్నప్పటికీ,ప్రపంచం మనల్ని విశ్వసిస్తోంది,గౌరవిస్తోంది.ప్రపంచ తత్త్వశాస్త్రాలను -భారత తత్త్వ సిద్ధాంతాలను తులనాత్మకంగా విశ్లేషించి,భారతీయమైన ఔన్నత్యాన్ని ఆచార్య సర్వేపల్లి రాధాకృష్ణ ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో వివరిస్తూ, ప్రసంగం సాగిస్తే! మేధోసమాజమంతా ఆయనకు,ఆయనలోని భారతీయతకు మోకరిల్లింది. భారతీయ తత్త్వం తెలిసినవారే పాలకులుగా ఉండాలన్నది సర్వేపల్లివారి సంకల్పం.కులాలు,మతాలు, ప్రాంతాలు దాటి రాజకీయాలు సాగే పరిస్థితులు నేడు లేనే లేవు.వినాయకచవితి పండుగ ఎలా జరుపుకోవాలో వాళ్లే నిర్దేశిస్తున్నారు.ఒకరికి నచ్చినది ఇంకొకరికి నచ్చదు.ప్రజలను తదనుగుణంగా తమవైపు తిప్పుకొని రాజకీయమైన లబ్ధి పొందాలనే దృష్టి తప్ప,సంప్రదాయంపై,ఆచార వ్యవహారాలపై ప్రేమ కాదని తెలుస్తూనే ఉంటుంది.వివాదాలకు కావాల్సినంత ప్రచారం జరుగుతూనే ఉంటుంది.పండుగలను వివాదాలకు,ఆచారాలను రాజకీయాలకు వేదికగా మారని సమాజాన్ని చూడాలన్నది విజ్ఞుల హృదయం.సర్వజనులకు జయావహం,ప్రియంవదమైన వాతావరణం రావడమే పర్వదినం. సర్వ విఘ్నాలను తొలగించి,సకల జనులకు సకల జయాలను కలిగించి,ముప్పులకు ముగింపు పలికి,ప్రగతి ప్రయాణానికి ముహూర్తం పెట్టాలని విఘ్ననాయకుడికి విజ్ఞప్తి చేసుకుందాం.సనాతన ధర్మం, భారతీయత అందించిన సదాచారాల మధ్య,సమభావనతో,సోదర తుల్యంగా సహజీవనం చేద్దాం.పర్వదినం అంటే? సర్వులకు మంచిరోజు.పర్యావరణ హితంగా పండుగ జరుపుకుందాం. సరికొత్త సంకల్పాలకు శ్రీకారం చుడదాం.సిద్ధి దిశగా కృషి సాగిద్దాం. --మాశర్మ, సీనియర్ జర్నలిస్ట్ -
ఒజ్జ గణపతికి వందనాలు
‘‘ఓ బొజ్జ గణపయ్య! నీ బంటు నేనయ్య! ఉండ్రాళ్ళ మీదికి దండు పంపు.’’ అంటూ పిల్లలు సంబరంగా జరుపుకునే పండగ వినాయక చవితి. యావద్భారత దేశం వేడుకగా జరుపుకునే పండగ ఇది. కలియుగంలో అతి త్వరగా అనుగ్రహించే దైవం వినాయకుడు. ఋగ్వేద కాలం నుండి కీర్తించబడి పూజించబడుతున్న దేవత ఒక్క గణపతి మాత్రమే. దేవతలలో ప్రథముడు, జ్యేష్ఠుడు ఐన గణపతిని అన్ని సందర్భాలలోను పూజించటమే కాదు దేవతలందరూ త్రిమూర్తులతో సహా పూజించినట్టు ఆధారాలున్నాయి. గణపతి కున్న నామాలలో బాగా ప్రసిద్ధమైనవి వినాయకుడు, గజాననుడు. గణనాథుడికి ఉన్న పన్నెండు నామాలలో ప్రతి దాని వెనక ఒక చరిత్ర ఉంది. ముఖ్యంగా వినాయకోత్పత్తి, వినాయకుడు గజాననుడు కావటానికి గల కారణాలు ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క విధంగా ఉన్నాయి. అంతే కాదు ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రూపంలో అవతరించినట్టు కనపడుతుంది. సృష్టికార్యం ప్రారంభించే ముందు బ్రహ్మ ప్రార్థించిన గణపతి ఓంకార స్వరూపుడు. కృతయుగంలో కశ్యపునికి అదితికి జన్మించి ‘మహోత్కటుడు‘ అనే పేరుతో దేవాంతక నరాంతక రాక్షసులను సంహరించి లోకకల్యాణం గావించాడు. త్రేతాయుగంలో, మయూరేశుడుగా అవతరించి త్రిమూర్తులకు వారు కోల్పోయిన స్థానాలను తిరిగి ఇప్పించాడు. అప్పుడే బ్రహ్మ తన కుమార్తెలైన సిద్ధి, బుద్ధిలను వినాయకుడికిచ్చి, వివాహం చేస్తాడు. ఈ అవతారంలో వినాయకుడి వాహనం నెమలి. ద్వాపరయుగంలో గజాననుడుగా అవతరించి, సింధూరుడనే రాక్షసుని సంహరించాడు. మనం వినాయకవ్రత కల్పంలో చదివే కథ ఈ గజాననునిదే. కలియుగంలో ధూమ్రకేతువుగా అవతరించి, అశ్వారూఢుడై ప్రతిప్రాణిలో పెచ్చుపెరిగిన రాక్షసప్రవృత్తిని నశింప చేస్తూ ఉన్నాడట. వివిధ పురాణాలలో గణపతి వినాయకుడి ఆవిర్భావం, రూపు రేఖలు విభిన్నంగా ఉన్న కారణంగా శిల్పులు వాటికి గణపతి తత్త్వాన్ని, తమ సృజనాత్మకతను జోడించి రకరకాల గణపతులను మన ముందు ఉంచుతున్నారు. మిగిలిన లక్షణాలను ఏరకంగా చూపించినా అన్నింటిలోనూ సామాన్యంగా ఉండేవి – గజ ముఖం, కురచ మెడ, పెద్దబొజ్జ, నాగయజ్ఞోపవీతం, చేతిలో మోదకం, మూషిక వాహనం మొదలైనవి. గజముఖంలో తొండం, పెద్ద చెవులు, చిన్న కళ్ళు భాగాలు. ప్రపంచ సాహిత్యంలో మొదటిది అయిన ఋగ్వేదంలో గణపతిగానే పేర్కొనటం జరిగింది. బ్రహ్మాండ పురాణంలో ‘‘కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరా’’ అని లలితాదేవి కల్పించినది గణేశ్వరుణ్ణే అని తెలుస్తోంది. తరువాత విఘ్నాలకి అధిపతి అయి విఘ్నేశ్వర నామాన్ని పొందటం జరిగింది. గణాలకు అధిపతి కనుక గణపతి, గణాధిపతి అనే నామాలు కలిగాయి. ఏవైనా గణములు అంటే గుంపులు, సముదాయాలు ఉంటే వాటి మీద అధికారం కలిగి, అవన్నీ ఏకోన్ముఖంగా పని చేసేట్టు చేయించ కలిగిన ప్రజ్ఞయే గణపతి. ఏకాత్మతా భావన కలిగించ గలవాడు గణపతి. ఆ ప్రజ్ఞ లేనట్టయితే సృష్టిలోని అన్ని భాగాలు దేనికవే ఉండేవి. కనుకనే సృష్టి చేసే సమయంలో బ్రహ్మ గణపతిని ప్రార్థించాడట! దేవతారూపాలన్నీ ఆయా తత్త్వాలకి ప్రతీకలు. ముఖ్యంగా ప్రత్యేక రూపాలున్న మూర్తులు. గణపతి అనగానే గుర్తు వచ్చేది పెద్ద పొట్ట. దాని నిండా ఉన్నవి విద్యలు. ‘‘కోరిన విద్యలకెల్ల నొజ్జయయి యుండెడి ఓయి గణాధిప నీకు మ్రొక్కెదన్’’ అంటాము కదా! వొజ్జ అంటే గురువు అని అర్థం. అందుకే గణపతి పూజలో పిల్లల చేత పుస్తకాలు పెట్టించుతాము. పనిలో పనిగా గుంజీలు తీయిస్తాము. గుంజీలు తీయటం వల్ల కుదురు వస్తుంది. మెదడు చురుకుగా పని చేస్తుంది. పెద్ద చెవులు బాగా వినమని చెపుతున్నాయి. చిన్న కళ్ళు సూక్ష్మ మైన అంశాలని ఎంత నిశితంగా ఏకాగ్రతతో చూడాలో తెలియ చేస్తాయి. తొండం ఎప్పుడు నోటిని మూసుకుని ఉండాలని తెలియ చేస్తుంది. చంద్రుణ్ణి చూసిన దోషం తొలగటానికి శమంతకోపాఖ్యానం చదవుకోవాలనటం కూడా విశేషమే. ఆ కథని అర్థం చేసుకుంటే సమాజం ఎంత బాగుంటుందో కదా! ఏదైనా ఒక వరం ఒకరికి ఇస్తే దాన్ని వారు మాత్రమే ఉపయోగించాలి. ఇతరులకి అది ఉపయోగ పడక పోగా ప్రాణాంతకం కూడా కావచ్చును అని సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనజిత్తు వృత్తాంతమ్ తెలుపుతుంది. ప్రభుత్వం వద్ద కాక వ్యక్తుల దగ్గర ధనం పోగు అయితే ప్రాణాలకే మోసం జరుగుతుందని సత్రాజిత్తు మరణం తెలుపుతుంది. ఎంతటి అవతార పురుషుడికి అయినా దోషఫలం అనుభవించక తప్పదు అని కృష్ణుడికి నీలాపనిందలు రావటం తెలియ చేస్తుంది. సర్వమానవుల మూలాధారంలో కుండలినీ శక్తిగా ఉన్న జగన్మాతకి గుమ్మం దగ్గర కాపలా కాస్తూ ఉంటాడు. అదే పార్వతీ దేవి గుమ్మంలో కాపలా పెట్టింది అని కథలో చదువుకుంటాం. విఘ్నాధిపతి కనుక మనం చేసే పనుల్లో ఎటువంటి అడ్డంకులు రాకుండా చూడమని అన్ని కార్యాలకి ముందుగా విఘ్నేశ్వరుణ్ణి పూజించటం సంప్రదాయంగా మారింది. గణపతి పూజ మనకి ఏంచెపుతోంది? 1. మాతా పితృభక్తి అది ఉంటే లోకాలనన్ని చుట్టి రావచ్చు. విజయం సాధించవచ్చు. 2. భౌతిక బలం కన్న బుద్ధి బలం మిన్న తమ్ముడు నెమలి వాహనం మీద ఎగురుతూ వెళ్ళాడు. తాను ఎలుకనెక్కి వెళ్ళి గెలవటం ఎంత కష్టం? కనుక బుద్ధిబలాన్ని ఉపయోగించాడు. 3. ఆకుపచ్చని ఆహారం తింటే తెలివితేటలు పెరుగుతాయి. ఆకుపచ్చరంగులో ఉన్న ఆహారం తింటే తెలివి తేటలు పెరుగుతాయి, చూపు మెరుగుగా ఉంటుంది. అందుకే గరిక తనకి పరమప్రీతి అని చెప్పాడు. బుద్ధి కావాలంటే ఆరాధించవలసింది గణపతినే. గణపతి నక్షత్రమైన హస్తకి అధిపతి బుధుడు. బుద్ధి కారకుడు బుధుడే కదా! 4. ఏక వింశతి 21 రకాల పత్రితో పూజ చేయటం ఒక్క గణపతి పూజలో మాత్రమే కనిపిస్తుంది. పిల్లలకి పత్రి సేకరణ పేరుతో చెట్లని, పర్యావరణాన్ని పరిచయం చేయటం జరుగుతుంది. అవన్నీ ఆ సమయంలో వచ్చే తరుణ వ్యాధులకి ఔషధాలు. ప్రత్యేకంగా గరిక పూజ ద్వారా గరికకి ఉన్న ప్రాధాన్యాన్ని గుర్తు చేస్తున్నాడు. గరిక పవిత్రమైనదే కాదు, భూమి ఆకృతిని పరిరక్షిస్తుంది. 5. రెండుసార్లు ఆవిరిమీద ఉడకబెట్టిన ఆహారం వానాకాలంలో మంచిది. బలం కలిగిస్తుంది. నూనెలో వేయించిన ఆహారం వానలు పడుతున్నప్పుడు అరగటం కూడా కష్టం. 6. మనలో సామర్థ్యం ఉండాలే కాని పరికరాలు ప్రధానం కాదు అని ఎలుక వంటి అతి చిన్న వాహనం ఎక్కి లోకాల నన్నిటిని జయించి చూపించాడు. డా. ఎన్.అనంతలక్ష్మి -
ప్రకృత్యైనమః
గుర్తించాలే కానీ దేవుడు అనేక రూపాల్లో ఉంటాడు. వాటిలో కనిపించనివే కాదు, కనిపించేవీ ఉంటాయి. ఎక్కడో ఉన్నాడనుకునే దేవుడు... మన చేతికందే దూరంలో ఒక మొక్కలోనూ, కొమ్మలోనూ, ఆ కొమ్మకు పూసిన పువ్వులోనూ కూడా ఉన్నాడని గ్రహించడమే లౌకిక, పారలౌకిక సమన్వయంతో కూడిన ఆధ్యాత్మిక ప్రస్థానంలో తొలి ఎరుక. దైవం మానుషరూపేణ అంటారు. అలాగే, దైవం ప్రకృతి రూపేణ కూడా! రామకృష్ణ పరమహంస ఓసారి ఆకాశంలో రెక్కలు విప్పుకుంటూ ఎగిరే పక్షిని చూసి సమాధిలోకి వెళ్లిపోయారట. చెట్టును, పిట్టను, పువ్వును, పసిపాప నవ్వును, పారే ఏటినీ, ఎగిరే తేటినీ చూసి తన్మయులైతే చాలు; ఆ రోజుకి మీ పూజ అయిపోయిందని ఒక మహనీయుడు సెలవిస్తాడు. షడ్రసోపేతంగా వండిన తన వంటకాలను తృప్తిగా ఆరగిస్తే ఇల్లాలు ఎంత ఆనందిస్తుందో, తన వ్యక్తరూపమైన ప్రకృతిని చూసి పరవశిస్తే దేవుడు అంతే ఆనందిస్తాడని ఆయన అంటాడు. నది ఒడ్డున నిలబడి దాని పుట్టుకను, గమనాన్ని, పోను పోను అది చెందే వైశాల్యాన్ని, అది ప్రవహించిన పొడవునా దానితో అల్లుకున్న మన జీవనబంధాన్ని స్మరించుకున్నా అది పుణ్య స్నానంతో సమానమేనని ఒక కథకుడు రాస్తాడు. కృష్ణశాస్త్రి గారు పల్లవించినట్టు అడుగడుగునా, అందరిలోనే కాదు; ప్రకృతిలో అన్నింటిలోనూ గుడి ఉంది. అనాది నుంచీ నేటివరకూ మనిషి ఊహలో, భావనలో మనిషీ, దేవుడూ, ప్రకృతీ పడుగూ పేకల్లా అల్లుకునే వ్యక్తమయ్యారు. ఋగ్వేద కవి చూపులో ప్రకృతి పట్ల వలపు, మెరుపు ఎంతో ముగ్ధంగా, సరళంగా, సహజసుందరంగా జాలువారుతాయి. ‘‘వెలుగులు విరజిమ్మే ఓ ఆకాశపుత్రీ, సకల సంపదలకూ నెలవైన ఉషాదేవీ! వస్తూ వస్తూ మాకు ధనరూపంలోని ఉషస్సును వెంట బెట్టుకుని రా’’ అని ఒక ఋక్కు అంటుంది. ఋగ్వేద కవి చింతనలో అగ్ని ధూమధ్వజుడు; సూర్యకాంతితో తళతళా మెరుస్తూ ధ్వనిచేసే సముద్రపు అలల్లా వ్యాపిస్తాడు. ‘‘తమసానదీ జలాలు మంచివాడి మనసులా స్వచ్ఛంగా ఉన్నా’’యని వాల్మీకి వర్ణిస్తాడు. సుగ్రీవుడితో అగ్ని సాక్షిగా స్నేహం చేసిన రాముడు, ‘‘వర్షాకాలంలో మంచి పొలంలో వేసిన పంట ఫలించినట్టు నీకార్యాన్ని సఫలం చేస్తా’’నంటాడు. ఆ మాటలకు సుగ్రీవుడు, ‘‘నదీవేగంలా హఠాత్తుగా ఉరవడించిన కన్నీటివేగాన్ని ధైర్యంతో నిలవరించుకున్నా’’డని రామాయణ కవి అంటాడు. ఏ కాలంలోనూ మనిషీ, ఋషీ, కవీ ప్రకృతి పొత్తిళ్లలో పసివాడిగానే ఉన్నాడు తప్ప ప్రకృతికి దూరం కాలేదు. ఇతిహాస కావ్య ప్రబంధాలలో ప్రకృతి వర్ణనలు తప్పనిసరి భాగాలు. శారద రాత్రుల్లో ఉజ్వల తారకలు, కొత్త కలువ గంధాన్ని మోసుకొచ్చే సమీరాలూ, కర్పూరపు పొడిలా చంద్రుడు వెదజల్లే వెన్నెల వెలుగులూ, చెంగలువ కేదారాలూ, మావులూ క్రోవులూ పెనవేసుకున్న అడవులూ, పక్షులు బారులు కట్టి ఇంటిముఖం పట్టే సూర్యాస్తమయ దృశ్యాలూ, తలను రెక్కల్లో పొదవుకుని పంటకాలువల దగ్గర నిద్రించే బాతువుల సన్నివేశాలూ... ఇలా కవి ఊహల రస్తాకెక్కని ప్రకృతి విశేషం ఏదీ ఉండదు. పత్రం పుష్పం ఫలం తోయం రూపంలో ప్రకృతి భాగం కాని పూజా ఉండదు. వినాయకుని పూజలో ఉపయోగించే మాచీ,బృహతి, బిల్వం, ధత్తూరం, బదరి, తులసి, మామిడి, కరవీరం, దేవదారు, మరువకం లాంటి ఇరవయ్యొక్క పత్రాల పేర్లే చెవులకు హాయిగొలిపి ఆకుపచ్చని చలవపందిరి వేసి మనసును సేదదీర్చుతాయి. అమ్మవారి స్తుతుల నిండా పూవులూ, వనాలూ పరచుకుంటాయి. చంపకాలు, సౌగంధికాలు, అశోకాలు, పున్నాగాలతో అమ్మ ప్రకాశించిపోతుంది. కదంబ పూలగుత్తిని చెవికి అలంకరించుకుంటుంది. చాంపేయ, పాటలీ కుసుమాలు తనకు మరింత ప్రియమైనవి. శిరసున చంద్రకళను ధరిస్తుంది. ప్రకృతి వెంటే పర్యావరణమూ గుర్తురావలసిందే. పర్యావరణ స్పృహ ఇప్పుడే మేలుకొంద నుకుంటాం కానీ, ప్రకృతిలో భాగంగా మనిషి పుడుతూనే పెంచుకున్న స్పృహ అది. రావణ సంహారం తర్వాత రాముడు అయోధ్యకు వెడుతూ, వానరులు ఎక్కడుంటే అక్కడ చెట్లు సమృద్ధిగా ఉండాలనీ; అవి అన్ని కాలాల్లోనూ విరగ కాయాలనీ; నదుల్లో నీరు నిత్యం ప్రవహిస్తూ ఉండాలనీ ఇంద్రుని వరం కోరాడు. పాండవులు ద్వైతవనంలో ఉన్నప్పుడు ఆ అడవిలోని చిన్న జంతువులు ధర్మరాజుకు కలలో కనిపించి, ‘‘మీరు రోజూ మమ్మల్ని వేటాడి చంపడంవల్ల మా సంఖ్య తగ్గిపోయింది, బీజప్రాయంగా మిగిలాం, మేము పూర్తిగా నశించేలోగా దయచేసి మరో చోటికి వెళ్లం’’డని ప్రార్థించాయి. విశ్వనాథవారు తన ‘వేయిపడగలు’ నవలలో పర్యావరణానికి ప్రతీకగా పసరిక అనే పాత్రనే సృష్టించారు. ఆధునిక వేషభాషల వ్యామోహంలో పడీ, జీవ వైవిధ్యాన్ని దెబ్బతీసే వ్యవసాయ పద్ధతుల వల్ల పర్యావరణ విధ్వంసం ఏ స్థాయిన జరుగుతోందో ఆ పాత్ర ద్వారా గంట కొట్టి చెప్పారు. పూర్వకాలపు రాజులు అడవిని, అటవీ జనాన్ని, సంపదను పర్యావరణ భద్రతకు తోడ్పడే స్వతంత్ర అస్తిత్వాలుగా చూశారు తప్ప, తమ రాజ్యంలో భాగం అనుకోలేదు. ఇప్పుడా వివేచన అంతరించి అడవులు రాజ్యానికి పొడిగింపుగా మారి బహుముఖ ధ్వంసరచనకు లక్ష్యాలయ్యాయి. ప్రకృతికి పండుగకు ఉన్న ముడి తెగిపోయి ప్రతి పండుగా పర్యావరణంపై పిడికిటిపోటుగా మారడం చూస్తున్నాం. ప్రకృతిని మనం రక్షిస్తే ప్రకృతి మనల్ని రక్షిస్తుందన్న సంగతిని గుర్తు చేసుకోడానికి నేటి వినాయకచవితి కన్నా గొప్ప సందర్భం ఏముంటుంది! -
నటుడు నరేశ్ ఎమోషనల్.. అది తలుచుకుని బాధపడి!
కొన్ని నెలల ముందు టాలీవుడ్లో ఓ జంట గురించి తెగ మాట్లాడుకున్నారు. వీళ్లిద్దరూ కలిసి తమ జీవితంపైనే ఓ సినిమా చేయడం టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయింది. అవును పైన చెప్పిందంతా కూడా నరేశ్-పవిత్రా లోకేశ్ గురించే. వినాయక చవితి సందర్భంగా ఓ టీవీ ఛానెల్లో ప్రసారమైన షోలో పాల్గొన్నారు. అయితే ఈ ప్రోగ్రాంలో నరేశ్ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సీనియర్ నరేశ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విజయనిర్మల వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చాడు. తొలుత హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా మోస్ట్ బిజీయెస్ట్‌గా మారిపోయాడు. కెరీర్ పరంగా పీక్స్‌లో ఉన్న ఇతడు.. వైవాహిక జీవితంలో మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. (ఇదీ చదవండి: 'ఖుషి' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందా?) నరేశ్, అతడి భార్య రమ్య రఘుపతి మధ్య చాన్నాళ్ల నుంచి గొడవలు జరుగుతున్నాయి. అయితే కొన్నాళ్లుగా ఇతడు, నటి పవిత్రా లోకేశ్ తో కలిసి ఉంటున్నారని వార్తలొచ్చాయి. ఇది నిజమనేలా బయటకూడా జంటగా కనిపించడం, 'మళ్లీ పెళ్లి' అని తమ జీవితాన్నే సినిమాగా తీయడం టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయింది. అయితే వినాయక చవితి సందర్భంగా నరేశ్-పవిత్రా లోకేశ్‌ని ఓ ఈవెంట్‌కి గెస్టులుగా పిలిచారు. నరేశ్.. ఇండస్ట్రీలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. స్టేజీపై సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ నరేశ్ ఎమోషనల్ అయ్యాడు. '50 ఏళ్లు అయిపోయింది. పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌లో రకరకాల ఒడిదొడుకులు. గతంలో చేసిన వాటి గురించి నేను బాధపడుతున్నాను' అని అన్నాడు. అయితే అది తన పెళ్లిళ్ల గురించి, లేదా మరేదైనా విషయమా అనేది తెలియాల్సి ఉంది. (ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి' లుక్ లీక్.. కోట్ల నష్టపరిహారం డిమాండ్!) -
మట్టి గణపతే.. మహా గణపతి..
-
18 నుంచి కాణిపాకం బ్రహ్మోత్సవాలు
యాదమరి(చిత్తూరు జిల్లా): కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఈ నెల 18 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నా యి. తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని సిద్ధి, బుద్ధి సమేతంగా స్వామివారు నిత్యం వివిధ వాహన సేవల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. వినాయక చవితి మరుసటి రోజు ధ్వజారోహణం నిర్వహించనున్నారు. ఆ తర్వాత హంస వాహన సేవ, మయూర వాహన సేవ, మూషిక వాహన సేవ, చిన్న, పెద్ద శేష వాహన సేవ, వృషభ వాహన సేవ, గజవాహన సేవ, రథోత్సవం, అశ్వవాహన సేవ, ఏకాంత సేవలు తొమ్మిది రోజుల పాటు వేడుకగా జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ మోహన్‌రెడ్డి, ఈవో వెంకటేశు మాట్లాడుతూ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఆలయ పరిసరాలు, అనుబంధ ఆలయాలను శోభాయమానంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. అన్నప్రసాదాల పంపిణీపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తుల సౌకర్యాలకు పెద్దపీట వేస్తున్నామని వివరించారు. -
గణేషా.. ఒక్క సినిమా లేదు..ఎందుకిలా?
పండగొచ్చిందంటే చాలు కొత్త సినిమాల సందడితో థియేటర్స్ కళకళలాడుతాయి. చిన్న పండుగల రోజు ఏమోగానీ సంక్రాంతి..వినాయక చవితి..దసరా..దీపావళి లాంటి పెద్ద పండగ రోజు అయితే రెండు, మూడు పెద్ద సినిమాలతో పాటు ఒకటి రెండు చిన్న చిత్రాలు కూడా రీలీజ్ అవుతుంటాయి. ప్రతి ఒక్కరు ఈ పండుగ రోజుల్లో తమ సినిమాను విడుదల చేయాలనుకుంటారు. కొన్నిసార్లు పోటీ భారీగా ఉన్నప్పటికీ బాక్సాఫీస్ బరిలోకి దిగుతారు. ఎందుకలా అంటే.. సినిమా యావరేజ్‌గా ఉన్నసరే పండుగ కాబట్టి ఫ్యామిలీ ఆడియెన్స్ థియేటర్లకు వచ్చే చాన్స్ ఉంటుంది. ఇది చాలా సందర్భాల్లో వర్కౌట్ అయింది కూడా. అందుకే పండుగలపై చాలా సినిమాలు ముందే ఖర్చీఫ్ వేసుకుంటాయి. కానీ ఇప్పుడు టాలీవుడ్లో విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. వినాయక చవితి లాంటి పెద్ద పండగ రోజు ఒక్క తెలుగు సినిమా కూడా విడుదల కావడంలేదు. బంగారం లాంటి గణేష్ పండుగ డేట్‌ని వదిలేసి వేరే డేట్‌కి తమ చిత్రాలను రిలీజ్ చేస్తున్నారు. ముందే ఖర్చీఫ్.. చివరల్లో అలా వాస్తవానికి ఈ వినాయక చవితికి చాలా సినిమాలు విడుదల కావాల్సింది. కొన్ని పెద్ద సినిమాలు ముందే డేట్ ఎనౌన్స్ చేయడంతో చిన్న సినిమాలు వెనక్కి తగ్గాయి. కానీ చివరి నిమిషంలో బడా చిత్రాలు సైతం చవితికి రాలేమని ప్రకటించాయి. బోయపాటి-రామ్ కాంబోలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ ‘స్కంద’ సెప్టెంబర్ 15న విడుదల కావాల్సింది. కానీ కారణం ఏంటో తెలియదు.. సెప్టెంబర్ 28కి వాయిదా వేశారు. ఇక రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ కలిసి నటించిన చంద్రముఖి-2 చిత్రం కూడా సెప్టెంబర్ 15న రిలీజ్ కావాల్సింది. అది కూడా వాయిదా పడింది. వీఎఫ్ఎక్స్ సన్నివేశాలు ఆలస్యం కావడం వల్లే సినిమా వాయిదా పడిందని చిత్రయూనిట్ పేర్కొంది. స్కంద రిలీజ్ రోజే చంద్రముఖి-2 రానుంది. అంటే సెప్టెంబర్ 28న ఈ రెండు చిత్రాలు బాక్సాపీస్ వద్ద పోటీ పడతాయి. టిల్లన్న ఇలాగైతే ఎలాగన్నా? పోటీ ఈ వినాయక చవితికి టిల్లుగాని డీజేకి చిందులేద్దామనుకుంటే.. అది కూడా జరగడం లేదు. సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన ‘టిల్లు స్క్వేర్’ సెప్టెంబర్ 15న విడుదల చేయనున్నట్లు గతంలో మేకర్స్ ప్రకటించారు. కానీ అది కూడా మళ్లీ వాయిదా పడింది. ‘టిల్లు స్క్వేర్’ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. క్వాలిటీ ఔట్పుట్ కోసం విడుదల వాయిదా వేయక తప్పడం లేదు. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తాం’’ అంటూ మేకర్స్ ప్రకటించారు. డబ్బింగ్ సినిమానే దిక్కు వినాయక చవితికి ఒక్క తెలుగు సినిమా కూడా టాలీవుడ్లో విడుదల కావడంలేదు. డబ్బింగ్ సినిమాలనే తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమయ్యాయి. అందులో చంద్రముఖి-2 వాయిదా పడింది. ఇప్పుడిక ఒకే ఒక్క డబ్బింగ్ మూవీ విడుదల కాబోతుంది. అదే మార్క్ ఆంటోని. విశాల్ నటిస్తున్న తమిళ సినిమా ఇది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్‌కు పిచ్చ క్రేజ్ వచ్చింది. తెలుగులో కూడా విశాల్‌కు మంచి ఫాలోయింగ్. అందుకే ఈ చిత్రాన్నితెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఒకవేళ కొంచెం పాజిటివ్ టాక్ వచ్చిన చాలు..మార్క్ ఆంటోని పంట పండినట్లే అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మంచి వీకేండ్ మిస్ ఈ సారి వినాయక చవితి సోమవారం వచ్చింది. ఇది సినిమా వాళ్లకు బాగా కలిసొచ్చే రోజు. ఎందుంటే.. పండగతో కలిసి మొత్తం మూడు హాలిడేస్ వస్తున్నాయి. శుక్రవారం(సెప్టెంబర్ 15)సినిమాను విడుదల చేస్తే.. శని,ఆది వారాలతో పాటు సోమవారం కూడా సెలవు దినమే. దీంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా థియేటర్స్‌కి వచ్చే అవకాశం ఉంది. సినిమాకు కాస్త పాజిటివ్ టాక్ వచ్చిన చాలు.. ఈ మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ దాటొచు. ఇంత మంచి వీకెండ్‌ని టాలీవుడ్ వదులుకుంది. -
18న వినాయకచవితి.. 28న నిమజ్జనం
సాక్షి, హైదరాబాద్: భారతీయ సంస్కృతితో ముడిపడిన పండగల్లో ఎంతో పరమార్థం ఉంది. ప్రధానంగా వినాయకచవితి సందర్భంగా నిర్వహించుకునే కార్యక్రమాల్లో సామాజిక ప్రగతికి, సంఘటిత జీవనానికి, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన అంశాలు ఎన్నో ముడివడి ఉన్నాయి. సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ సమాజంలోని అన్ని వర్గాలను భాగస్వామ్యం చేస్తూ సాగే గణేష్ ఏకతా యాత్ర భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనం. వినాయకుడు అందరివాడు అన్ని పండుగల్లోకెల్ల వినాయక చవితి అంటే అందరికీ ఎంతో ఇష్టం. పిల్లా, పెద్ద అందరికీ వినాయకుడు అంటే మక్కువ చూపిస్తారు. దీన్ని పండుగలా కాకుండా.. సొంతింట్లో పుట్టినరోజును జరుపుకున్నట్టుగా భావిస్తారు. వినాయకుడిని తమ వాడిగా అన్వయించుకుంటారు. ఈ పండుగ ఎప్పుడు అన్నదానిపై ఈ సారి భిన్నవాదనలు తెరపైకి వచ్చాయి. (వినాయకుడిని పూజిద్దాం ఇలా..) 18కే భాగ్యనగర్ మొగ్గు వినాయకచవితి ఎప్పుడనే విషయంపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ ఒక ప్రకటన చేసింది. ఈ నెల 18వ తేదీనే వినాయకచవితి పండుగని పేర్కొంది. అలాగే 28వ తేదీన నిమజ్జనం ఉంటుందని తెలిపింది. అంతకు ముందు 19న వినాయక చవితి, 29న నిమజ్జనం ఉంటుందని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ ప్రకటించిన సంగతి విదితమే. అయితే.. ఈ ఏడాది తిథి రెండు రోజులు ఉండడం వల్ల.. పండుగ ఎప్పుడనే దానిపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే.. శృంగేరి-కంచి పీఠాధిపతులు గణేష్ ప్రతిష్ట 18వ తేదీనే చేసుకోవాలని సూచించారట. కాబట్టి.. గ్రేటర్ పరిధిలోని మండపాలు 18వ తేదీనే వినాయక చవితి నిర్వహించుకోవాలని సూచించింది భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ. సంబరం తెచ్చే పండగ భాజాభజంత్రీలు, తప్పెట్లు, కోలాటాలు, కీలుగుర్రాల నృత్యాలు, పండరిభజనలు, కర్రసాము విన్యాసాలు తదితర సాంస్కృతిక కార్యక్రమాలతో గణేషుడి నవరాత్రులు సందడిగా ఉంటాయి. ఇక నిమజ్జనం గురించి చెప్పనక్కర్లేదు. భాగ్యనగరం అంతా ఏకతా యాత్ర కోలాహలంగా, సందడితో సాగుతుంది. ఈ పండుగ వల్ల ఎంతో మందికి ఉపాధి, మరెంతో మందికి చేతినిండా పని. మట్టి వినాయకుడికి జై వినాయక చవితి సమీపిస్తుండడంతో నగరంలో విగ్రహాల విక్రయాలు ముమ్మరంగా సాగుతున్నాయి. పాతబస్తీలోని ధూల్‌పేటతోపాటు కూకట్పల్లి, మూసాపేట, ఉప్పల్, ఎల్బీనగర్, హయత్‌నగర్, పెద్ద అంబర్‌పేట ప్రాంతాల్లో రోడ్లకు ఇరువైపులా పెద్ద సంఖ్యలో విగ్రహాలు లభిస్తున్నాయి. ఈసారి మట్టివిగ్రహాలు కూడా పెద్ద సంఖ్యలో తయారు చేశారు. కొత్తపేట చౌరస్తాలో ఇలా రోడ్డు పక్కన మట్టివిగ్రహాలు ఉంచి విక్రయిస్తున్నారు. ఖైరతాబాద్ విగ్రహం కూడా తుదిమెరుగులు దిద్దుకుంటోంది. The #Khairatabad #Ganesh #Idol in making! #VinayakaChavithi #GaneshChaturthi #Hyderabad #Telangana 📸: @BelieverHemanth pic.twitter.com/HIFcGpULDr — Hi Hyderabad (@HiHyderabad) September 3, 2023 పర్యావరణానికి పెద్దపీట వినాయక ప్రతిమలతో పాటు మట్టి పాత్రలను, ప్రమిదలను, చేనేత పూజా వస్త్రాలను, ఎలాంటి పురుగుమందులు, రసాయనాలు లేకుండా సహజమైన పద్ధతుల్లో పండించిన పెసరపప్పు, బెల్లం, పసుపు, కుంకుమ, అక్షింతలు, స్వచ్ఛమైన ఆవు నెయ్యి, 21 రకాల ఆకులను సైతం పల్లెల నుంచి సేకరించి గణపతి కిట్లను అందుబాటులోకి తెచ్చారు. గతేడాది కంటే ఈసారి మట్టి విగ్రహాలకు ఎక్కువ డిమాండ్ ఉండే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. Ganapati Bappa Morya ♥️#GaneshChaturthi #GaneshChaturthi2023 pic.twitter.com/ByLNMYSef0 — poorna_choudary (@poornachoudary1) September 1, 2023 -
వినాయక చవితి సెప్టెంబర్ 18నే
సాక్షి, హైదరాబాద్: ఈ సంవత్సరం వినాయక చవితి పర్వదినాన్ని సెప్టెంబర్ 18 సోమవారం రోజునే నిర్వహించుకోవాలని తెలంగాణ విద్వత్సభ ప్రకటించింది. శోభకృత్నామ సంవత్సరం భాద్రపద శుక్ల చతుర్థి రోజునే మధ్యాహ్నం వరకు చవితి తిథి ఉన్నందున అదే రోజున వినాయక చవితిగా నిర్వహించుకోవాలని నిర్ధారించినట్టు తెలంగాణ విద్వత్సభ అధ్యక్షులు యాయవరం చంద్రశేఖరశర్మ సిద్ధాంతి, కార్యదర్శి దివ్యజ్ఞాన సిద్ధాంతిలు ఓ ప్రకటనలో తెలిపారు. చవితి తిథి 18న ఉదయం 9.58కి ఆరంభమై 19వ తేదీ ఉదయం 10.28కి ముగుస్తుందని తెలిపారు. దీని ప్రకారం చవితి తిథి మధ్యాహ్నం సమయానికి 18నే ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. ఇదే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి, దేవాదాయ శాఖ మంత్రి, కమిషనర్ కార్యాలయాలకు, ప్రభుత్వ సలహాదారులకు తెలిపినట్టు వెల్లడించారు. జూలై 22, 23 తేదీల్లో వర్గల్ విద్యా సరస్వతి క్షేత్రంలో జరిగిన షష్ఠమ విద్వత్సమ్మేళనంలో వందమంది సిద్ధాంతుల సమక్షంలో పండుగల తేదీలను ఖరారు చేసినట్టు పేర్కొన్నారు. చదవండి: Hyderabad: నా ఫ్లెక్సీలు తొలగిస్తారా?.. కార్పొరేటర్‌పై కేసు నమోదు -
Reliance AGM 2023: జియో ఎయిర్‌ఫైబర్ వచ్చేస్తోంది..
ముంబై: పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీ వృద్ధి లక్ష్యాల సాధన దిశగా ప్రణాళికలు ప్రకటించింది. ఇందులో భాగంగా వినాయక చవితి కల్లా జియో ఎయిర్‌ఫైబర్‌ను అందుబాటులోకి తేనుంది. అలాగే, జియో ఫైనాన్షియల్స్ విభాగం ద్వారా బీమా ఉత్పత్తులను ఆవిష్కరించనుంది. వచ్చే అయిదేళ్లలో 100 కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ) ప్లాంట్లను నెలకొల్పాలని లక్ష్యంగా పెట్టుకుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ 46వ సర్వ సభ్య సమావేశంలో (ఏజీఎం) చైర్మన్ ముకేశ్ అంబానీ ఈ విషయాలు ప్రకటించారు. అదే క్రమంలో వారసత్వ ప్రణాళికలను కూడా వెల్లడించారు. ఆయన ముగ్గురు సంతానం (ఆకాశ్, ఈషా, అనంత్) కంపెనీ బోర్డులో నియమితులైనట్లు పేర్కొన్నారు. అలాగే, 2024 ఏప్రిల్ 19తో తన పదవీకాలం ముగియనున్నప్పటికీ.. మరో అయిదేళ్ల పాటు చైర్మన్‌గా కొనసాగనున్నట్లు ఆయన తెలిపారు. ఏజీఎంలో మరిన్ని విశేషాలు.. ఎయిర్‌ఫైబర్‌తో వైర్లెస్ బ్రాడ్‌బ్యాండ్.. సెప్టెంబర్ 19న వినాయక చవితి సందర్భంగా జియో ఎయిర్‌ఫైబర్ సరీ్వసులు ప్రారంభమవుతాయి. ఇది వైర్లు అవసరం లేని 5జీ బ్రాడ్‌బ్యాండ్ సరీ్వసులాంటిది. నెట్ కనెక్టివిటీకి ఎదురయ్యే అవరోధాలను అధిగమించేందుకు .. 5జీ నెట్‌వర్క్‌ను, అధునాతన వైర్లెస్ టెక్నాలజీలను ఉపయోగించుకుని ఇది వరుసలో చిట్టచివర్న ఉన్న వారికి కూడా బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందుబాటులోకి తేగలదని ముకేశ్ అంబానీ తెలిపారు. ఆప్టికల్ ఫైబర్‌తో రోజూ 15,000 ప్రాంగణాలను కనెక్ట్ చేయగలుగుతుంటే, జియోఎయిర్‌ఫైబర్ దీనికి పది రెట్లు అధికంగా కనెక్ట్ చేయగలదు. తద్వారా 20 కోట్ల గృహాలు, ప్రాంగణాలకు జియో మరింత చేరువ కాగలదు. ఈ సందర్భంగా జియో ట్రూ5జీ డెవలపర్ ప్లాట్‌ఫాంను కూడా రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ చైర్మన్ ఆకాశ్ అంబానీ ప్రకటించారు. రిలయన్స్ కార్పొరేట్ పార్క్‌లో ఏర్పాటు చేసే తొలి జియో ట్రూ5జీ ల్యాబ్‌లో టెక్నాలజీ భాగస్వాములు, ఎంటర్ప్రైజ్ కస్టమర్లు .. వివిధ పరిశ్రమలకు అవసరమైన సొల్యూషన్స్‌ను రూపొందించవచ్చు. వాటిని పరీక్షించవచ్చు. అటు, కృత్రిమ మేధ (ఏఐ) ప్రయోజనాలను అందరికీ, అన్నిచోట్ల అందుబాటులోకి తెచ్చేందుకు జియో ప్లాట్‌ఫామ్స్ కృషి చేస్తోందని ముకేశ్ అంబానీ చెప్పారు. డిసెంబర్ ఆఖరు నాటికి దేశవ్యాప్తంగా 5జీ నెట్వర్క్ విస్తరణ పూర్తి చేసే దిశగా పనులు సాగుతున్నాయని తెలిపారు. జియోసినిమా వినోదానికి దేశీయంలోనే అతి పెద్ద డిజిటల్ వేదికగా మారిందని ఆయన పేర్కొన్నారు. సీబీజీ ప్లాంట్లు.. గిగా ఫ్యాక్టరీలు.. 2035 నాటికి కర్బన ఉద్గారాల విషయంలో తటస్థ స్థాయిని సాధించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు ముకేశ్ అంబానీ తెలిపారు. జామ్‌నగర్‌లో రెండు కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ) డెమో యూనిట్లను నెలకొల్పాక, కేవలం 10 నెలల వ్యవధిలోనే ఉత్తర్‌ప్రదేశ్‌లోని బారాబంకీలో వాణిజ్యావసరాల కోసం తొలి సీబీజీ ప్లాంటును ఏర్పాటు చేసినట్లు అంబానీ చెప్పారు. వీటిని త్వరితగతిన 25కి, అటుపైన వచ్చే అయిదేళ్లలో 100కు పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు ఆయన వివరించారు. 2026 నాటికి బ్యాటరీ గిగా ఫ్యాక్టరీ నెలకొల్పే లక్ష్యం పెట్టుకున్నట్లు చెప్పారు. సోలార్ ప్యానెళ్లు, బ్యాటరీల తయారీ కోసం జామ్‌నగర్ రిఫైనరీ కాంప్లెక్స్‌లో రూ. 75,000 కోట్లతో నాలుగు గిగాఫ్యాక్టరీలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. బీమాలోకి జేఎఫ్ఎస్... జియో ఫైనాన్షియల్ సరీ్వసెస్ (జేఎఫ్ఎస్) బీమా రంగంలోకి విస్తరించనున్నట్లు ముకేశ్ అంబానీ తెలిపారు. ఇది సరళమైన ఆరోగ్య, జీవిత, సాధారణ బీమా పాలసీలను అందిస్తుందని పేర్కొన్నారు. మ్యూచువల్ ఫండ్స్ వ్యాపారంలోకి విస్తరించేందుకు బ్లాక్‌రాక్‌తో కలిసి జేఎఫ్ఎస్ జాయింట్ వెంచర్‌ను ప్రకటించింది. టెలికం విభాగం జియోకి ఉన్న 45 కోట్ల మంది మొబైల్ ఫోన్ యూజర్లకు తమ ఉత్పత్తులను విక్రయించే యోచనలో ఉంది. టాప్ 4లో రిటైల్.. పలు అంతర్జాతీయ దిగ్గజాలు రిలయన్స్ రిటైల్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు ముకేశ్ అంబానీ చెప్పారు. ఒకవేళ దీన్ని స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్ట్ చేసి ఉంటే ప్రస్తుత వేల్యుయేషన్ ప్రకారం టాప్ 4 లిస్టెడ్ సంస్థల్లో రిటైల్ కూడా ఒకటిగా ఉండేదని ఆయన తెలిపారు. ‘‘2020 సెప్టెంబర్‌లో నిధులు సమీకరించినప్పుడు రిటైల్ వేల్యుయేషన్ రూ. 4.28 లక్షల కోట్లుగా ఉంది. మూడేళ్ల కన్నా తక్కువ వ్యవధిలోనే ఇది రెట్టింపయింది. రూ. 8.278 లక్షల కోట్ల వేల్యుయేషన్‌తో ఇటీవలే ఖతర్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ (క్యూఐఏ) 1 శాతం వాటాను కొనుగోలు చేసింది. నాణ్యత, నవకల్పన, కస్టమరు ప్రధానంగా కార్యకలాపాలు నిర్వహించడం, పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలను మార్చుకోగలుగుతుండటం వంటి సామర్థ్యాలకు ఇది నిదర్శనం’’ అని అంబానీ తెలిపారు. అటు రూ. 22 కోట్లకు కొనుగోలు చేసిన సాఫ్ట్‌డ్రింక్ క్యాంపా కోలాను ఆసియా, ఆఫ్రికాతో పాటు అంతర్జాతీయ మార్కెట్లకు కూ డా తీసుకెళ్లనున్నట్లు ఈషా అంబానీ తెలిపారు. వారసత్వ ప్రణాళికలు.. ప్రస్తుతం రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో భాగమైన వివిధ వ్యాపార విభాగాల కార్యకలాపాలు నిర్వహిస్తున్న ముకేశ్ అంబానీ ముగ్గురు సంతానం తాజాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డులో చేరారు. నాన్–ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా నియమితులయ్యారు. వారు ఈ హోదాను ‘కష్టపడి సంపాదించుకున్నారని’ అంబానీ తెలిపారు. ‘‘ఈషా, ఆకాశ్, అనంత్‌లో నేను, మా తండ్రిగారు ధీరుభాయ్ అంబానీ నాకు కనిపిస్తారు. ధీరుభాయ్లోని ఆ మెరుపు వారిలో నాకు కనిపిస్తుంది’’ అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం జియో ఇన్ఫోకామ్‌ను ఆకాశ్, రిటైల్ వ్యాపారాన్ని ఆయన కవల సోదరి ఈషా (31), కొత్త ఇంధన వ్యాపార విభాగాన్ని అనంత్ (27) పర్యవేక్షిస్తున్నారు. 2002లో ధీరుభాయ్ మరణానంతరం సోదరుడు అనిల్ అంబానీతో వ్యాపార పంపకాలపరంగా వివాదం తలెత్తిన నేపథ్యంలో ముకేశ్ తాజా వారసత్వ ప్రణాళికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు, రిలయన్స్ ఫౌండేషన్ కార్యకలాపాలపై మరింతగా దృష్టి పెట్టే ఉద్దేశంతో ముకేశ్ సతీమణి నీతా అంబానీ రిలయన్స్ బోర్డు నుంచి తప్పుకున్నారు. అయితే, ఫౌండేషన్ చైర్‌పర్సన్‌గా శాశ్వత ఆహా్వనితురాలు హోదాలో ఆమె బోర్డు సమావేశాలన్నింటికి యథాప్రకారంగా హాజరవుతారు. అత్యధిక డిమాండ్ ఉన్నవి, అనేక దశాబ్దాల పాటు ఆరోగ్యకరమైన వృద్ధి సాధించగలిగేవి అయిన వ్యాపారాలను మేము ఎంచుకున్నాం. తద్వారా అంతర్జాతీయ స్థాయిలో వ్యాపారాలను నిర్మించగలిగాం. మా మూడు వృద్ధి చోదకాలు .. (ఓ2సీ, రిటైల్, జియో డిజిటల్ సర్వీసులు) మరింత విలువ జోడించగలవు. కొత్తగా మా నాలుగో వృద్ధి ఇంజిన్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా వీటికి తోడుగా చేరింది. – ముకేశ్ అంబానీ, రిలయన్స్ చైర్మన్ -
శ్రీ దశ మహా విద్యాగణపతిగా ఖైరతాబాద్ వినాయకుడు
ఖైరతాబాద్(హైదరాబాద్): ప్రతియేటా వివిధరూపాల్లో కొలువుదీరే ఖైరతాబాద్ వినాయకుడు ఈ సంవత్సరం శ్రీ దశ మహావిద్యాగణపతిగా భక్తులకు దర్శనమివ్వనున్నాడు. ఖైరతాబాద్ గణేశ్ విగ్రహ ప్రతిష్ఠాపన 69వ సంవత్సరం సందర్భంగా మహాగణపతి 63 అడుగుల ఎత్తు, 23 అడుగుల వెడల్పులో ఉండే మహాగణపతి పక్కనే కుడివైపు వరాహాదేవి, ఎడమవైపు సరస్వతిమాత విగ్రహాలు పది అడుగుల ఎత్తు ఉండగా, మహాగణపతి 63 అడుగుల ఎత్తులో నాగశేషుపై నిలబడి ఉండే ఆకారంలో తలపై ఏడు పడగలు, 10 చేతులు ఉంటాయి. మహాగణపతి పక్కన కుడివైపు 18 అడుగుల ఎత్తులో లక్ష్మీ నరసింహస్వామి, ఎడమవైపు వీరభద్రస్వామి విగ్రహాలు ఉంటాయి. శ్రీ దశ మహావిద్యాగణపతిగా నామకరణం చేయడం ప్రత్యేకతగా ఉందని దివ్యజ్ఞాన సిద్ధాంతి విఠలశర్మ తెలిపారు. అమ్మవారి ఉపాసనలో దశ మహావిద్యలు అధిక ప్రాధాన్యత కలిగినవనీ, విద్యకు గణపతి అనుగ్రహం కావాల్సి ఉన్నందున దశ మహావిద్యాగణపతిగా నామకరణం చేసినట్లు తెలిపారు. -
ఆదివారం ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
వినాయకుడికి ఆధార్ కార్డు.. మీ ఆలోచనకు సలాం గురూ!
రాంచీ: ప్రజల జీవితంలో ఆధార్ కార్డు ఒక భాగమైపోయింది. ఏ పని చేయాలన్నా ఆధార్ తప్పనిసరిగా మారిపోయింది. అయితే.. ఒక్క మనుషులకేనా? దేవుళ్లకు కూడా ఆధార్ ఉంటే ఎలా ఉంటుందనే ఆలోచన చేశారు జార్ఖండ్‌లోని జెంషెడ్‌పూర్‌కు చెందిన కొందరు యువకులు.. అందుకు వినాయక చవితి ఉత్సవాలను వేదికగా చేసుకున్నారు. గణేషుడి పేరుపై ఆధార్ కార్డు సృష్టించేశారు. ఆధార్ నమూనాతో భారీ ఎత్తున ఆధార్ కార్డు మండపం వేశారు. ఆధార్ కార్డ్ థీమ్‌తో వేసిన ఈ మండపం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అక్కడికి వచ్చి పోయే భక్తులు ఆసక్తితో ఆధార్ కార్డులోని వివరాలను చదువుతూ, సెల్ఫీలు దిగుతూ ముచ్చట పడుతున్నారు. ఆధార్ కార్డు ప్రకారం.. వినాయకుడి అడ్రస్ కైలాసంగా పేర్కొన్నారు. ఫోటో స్థానంలోనే గణేషుడిని ప్రతిష్టించి పూజలు నిర్వహిస్తున్నారు. ఆధార్ కార్డుపై ఉన్న బార్‌కోడ్‌ను స్కాన్ చేస్తే.. అది గూగుల్ లింక్‌కు వెళ్తుంది. అందులో వినాయకుడికి సంబంధించిన ఫోటోలు ప్రత్యక్షమవుతాయి. ఆ వినూత్న ఆధార్‌పై శ్రీ గణేశ్ S/o మహాదేవ్, కైలాస్ పర్వత శిఖరం, మానస సరోవరం సరస్సు దగ్గర, పిన్‌కోడ్ 000001 అని రాసి ఉంది. ఇక డేట్ ఆఫ్ బర్త్ 01/01/600CEగా పేర్కొన్నారు. Jharkhand | A Ganesh Pandal in Jamshedpur has been made in the form of an Aadhar card which identifies the address of Lord Ganesha in Kailash & his date of birth during the 6th century #GaneshChaturthi pic.twitter.com/qupLStkut6 — ANI (@ANI) September 1, 2022 ఇదీ చదవండి: విదేశాల్లో వినాయకుడు.. గణేషునికి దేశదేశాల్లో ప్రత్యేక స్థానం -
ఏపీలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి: ఎంపీ భరత్
-
పీయూష్ గోయల్ ఇంట్లో ప్రధాని మోదీ సందడి, గణపయ్యకు ‘హారతి’
సాక్షి, న్యూఢిల్లీ: వినాయక చవితి ఉత్సవాలు బుధవారం దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. 9 రోజులపాటు గణపయ్య పూజలు అందుకోనున్నారు. ఈక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ.. ఢిల్లీలోని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ నివాసానికి వెళ్లారు. అక్కడ తొలిరోజు గౌరీ తనయుడికి హారతి ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు గణేష్ చతుర్థి సందర్భంగా ఆయన ట్విటర్ వేదికగా దేశ ప్రజలకు పండగ శుభాకాంక్షలు తెలిపారు. సంస్కృతంలోని ఓ శ్లోకాన్ని సైతం ఆయన షేర్ చేశారు. రాష్ట్రపతి శుభాకాంక్షలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆకాక్షించారు. జ్ఞానానికి ప్రతీక అయిన మంగళమూర్తి గణేషుడు అందరికీ మంచి చేయాలని కోరుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ‘గణపతిబప్పా మోరియా’ అంటూ ట్వీట్ చేశారు. ఆగస్టు 31 మొదలైన లంబోదరుడి ఉత్సవాలు సెప్టెంబర్ 9న ముగియనున్నాయి. గత రెండేళ్లుగా కోవిడ్ ఆంక్షల నడుమ కొనసాగిన గణనాథుడి వేడుకలు ఈసారి పునర్వైభవం సంతరించుకోనున్నాయి. (చదవండి: కిడ్నాప్ కేసులో ఆరోపణలు.. శాఖ మార్చిన కాసేపటికే బిహార్ మంత్రి రాజీనామా) -
గణేష్ ఉత్సవాలు షురూ.. ఈ జాగ్రత్తలు, సూచనలు మర్చిపోకండి!
సాక్షి, ఆదిలాబాద్: గణేశ్ నవరాత్రోత్సవాల సందర్భంగా వారం ముందు నుంచే పండుగ వాతావరణం నెలకొంటుంది. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అంతా కలిసికట్టుగా జరుపుకొనే ఈ పండుగ అందరిలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. ఆగస్టు 31న వినాయకుడి ప్రతిమలను ప్రతిష్ఠించడంతో గణేశ్ ఉత్సవాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో నవరాత్రులు సజావుగా జరిగేందుకు శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకొని గణేశ్ ఉత్సవ కమిటీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీసులు, విద్యుత్ అధికారులు పలు సూచనలు చేశారు. పోలీస్‌శాఖ సూచనలు.. ► గణేశ్ మండపాలను ఇరుకైన వీధుల్లో ఏర్పాటు చేయరాదు. ►మండపాల వద్ద మద్యం సేవించరాదు. జూదం ఆడరాదు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దు. ►మండపం వద్ద కనీసం ముగ్గురు వలంటీర్లు 24 గంటలు అందుబాటులో ఉండాలి. ప్రతి రోజు వలంటీర్ల పేర్లను నమోదు చేసి సంతకం తీసుకోవాలి. ►మండపాలను గాలి, వానకు కూలిపోకుండా పకడ్బందీగా నిర్మించాలి. రద్దీగా ఉండే మండపాల వద్ద బారికేడ్లు ఏర్పా టు చేయాలి. వలంటీర్లు భక్తులను తనిఖీ చేశాకే మండపం వద్దకు పంపాలి. ►మండపంలోకి ఎలాంటి మండే పదార్థాలు లేదా పటాకులు ఉంచకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. నూనెతో వెలిగించే దీపాల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. ►మండపాల వద్ద నిర్వాహకులు తప్పనిసరిగా వీడియో కెమెరాలు, సీసీటీటీలు ఏర్పాటు చేసుకోవాలి. ►రాత్రి వేళ మండపంలోకి పశువులు, కుక్కలు చొరబడకుండా అడ్డుగా కంచె ఏర్పాటు చేసుకోవాలి. ►ఆగస్టు 31న ఉదయం 6గంటల నుంచి సెప్టెంబర్ 11న సాయంత్రం 6 గంటల వరకు బహిరంగ ప్రదేశాలు, రోడ్లపై క్రాకర్లు కాల్చడం, పేల్చడం నిషేధం. ►సౌండ్ బాక్స్‌లను స్థానిక డీఎస్పీ అనుమతి లేకుండా ఉపయోగించరాదు. మండపం వద్ద ఒక బాక్స్ టైపు స్పీకర్ మండప ప్రాంగణంలో మాత్రమే ఇన్స్టాల్ చేయబడాలి. ►శబ్ధ స్థాయిలను అనుమతించదగిన ప రిమితుల్లోనే ఉంచాలి. భారత సర్వోన్న త న్యాయస్థానం ఆదేశాల మేరకు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య లౌడ్స్పీకర్లు, పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్‌లను ఉపయోగించకూడదు. ►మండపాల వద్ద ఎలాంటి అసభ్యకరమైన పాటలు, ప్రకటనలు చేయకుండా భక్తి పాటలను మాత్రమే ప్లే చేయాలి. ►ఏదైన సమాచారం కోసం డయల్ 100 లేదా స్థానిక పోలీసులను సంప్రదించాలి. విద్యుత్‌శాఖ సూచనలు.. ►వినాయక నవరాత్రులను పురస్కరించుకుని మండపాల వద్ద జాగ్రత్తగా ఉండాలని టీఎస్ఎన్పీడీసీఎల్ అధికారులు సూచిస్తున్నారు. మండపాల వద్ద తాత్కాలికంగా ఏర్పాటు చేసుకునే విద్యుత్ తీగలతో అనేక ప్రమాదాలు జరిగే ఆస్కారముందని, అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. పూర్తిగా నివాస ప్రాంతాల్లో ఏర్పాటు చేసే మండపాల్లో షార్ట్ సర్క్యూట్లు, విద్యుత్ షాక్‌లు తగిలితే ఆస్తి, ప్రాణనష్టం జరిగే ప్రమాదముందంటున్నారు. ►మండపాల విద్యుద్దీకరణ పనులు లైసెన్స్డ్ ఎలక్ట్రిక్ కాంట్రాక్టర్ ద్వారా మాత్రమే చేపట్టాలి. ►విద్యుత్ సరఫరా కోసం ఎర్త్ లీకేజ్ సర్క్యూట్ బ్రేకర్‌గా అమర్చుకోవాలి. లైన్ల నుంచి వచ్చే వైర్ల నుంచి మండపానికి సరఫరా అయ్యే చోట ఈ బ్రేకర్‌ను అమర్చుకోవాలి. ►మండపానికి విద్యుత్ అందించే వైర్లు 2.5 చదరపు మిల్లీమీటర్ల కంటే తక్కువగా ఉండరాదు. ► ప్రతి సర్క్యూట్‌పై 800 వాట్ల కంటే అధిక లోడ్ వేయరాదు. ►వరుస విద్యుద్దీపాల కోసం సిల్క్‌వైర్లను వాడడం మంచిదికాదు. దీని వల్ల షార్ట్ సర్క్యూట్ జరిగే ప్రమాదముంటుంది. ►ప్రతి సర్క్యూట్‌కు ప్రత్యేకించి న్యూట్రల్ ఎర్త్‌వైర్‌ను తీసుకోవాలి. ►మండపాల వద్ద ఎర్తింగ్ గుంతలను ఏర్పాటు చేసుకోవాలి. 25 ఎంఎం డయామీటర్, 3 మీటర్ల లోతైన గుంత తీసి ఎర్తింగ్ పైప్‌ను అమర్చుకోవాలి. ►మండపాల్లో విద్యుత్ ఎలక్ట్రిక్ హీటర్లు, ఎలక్ట్రిక్ స్టౌవ్‌లను వాడరాదు. ►ప్రతి మండపం వద్ద 5 కేజీల కార్బన్డయాక్సైడ్ నిండి ఉన్న అగ్నిమాపక సిలిండర్లను అమర్చుకోవాలి. 2 బకెట్లలో ఇసుకను నింపి పెట్టుకోవడం మంచిది. -
కాణిపాక గణపయ్యను దర్శించుకున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
-
వినాయక చవితి వేడుకల్ని జరుపుకున్న ఎమ్మెల్సీ కవిత దంపతులు
-
Khairtabad: మహాగణపతికి తొలిపూజ నిర్వహించిన మంత్రి తలసాని
-
ఖైరతాబాద్ గణపయ్యను దర్శించుకున్న గవర్నర్ తమిళిసై
-
రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన సీఎం వైఎస్ జగన్
-
కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయంలో సందడి.. తెల్లవారుజాము 3గంటల నుంచే అభిషేకాలు
-
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వాడవాడలా చలువ పందిళ్లు, మండపాలు ఏర్పాటు చేసి గణనాథుని ప్రతిష్టించిన భక్తులు.. ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి జోగిరమేష్, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, జంగా కృష్ణమూర్తి, మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, విఘ్నాలు లేకుండా రాష్ట్రాభివృద్ధికి గణేషుడి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. చదవండి: వినాయకుడినే మొదట ఎందుకు పూజించాలి? కాగా, రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో మంచి పనులకు విఘ్నాలు తొలగిపోయి, ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని, విజయాలు సిద్ధించాలని ఆకాంక్షించారు. గణనాథుని కరుణాకటాక్షాలతో రాష్ట్రంలోని ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో అభివృద్ధి చెందాలని ఆయన అభిలషించారు. -
Ganesh Chaturthi 2022: వినాయకుడి 8 అవతారాలు.. వాటి చరిత్ర ఇదే
వినాయకుడంటే భౌతికంగా మనకు కనిపించే ఆకారం మాత్రమే కాదు.. ఆయన రూపు, స్వభావం వెనుక లోతైన అర్థం ఉందని వేదాంతులు చెబుతుంటారు. గణేశుని ఆరాధనతో ఈ సంసారం నుంచి సులభంగా విముక్తి పొందవచ్చని సూచిస్తుంటారు. అందుకే గణేశుడే ప్రముఖంగా ఆరాధించబడే గాణపత్యం అనే శాఖ కూడా ఉంది.వినాయకుని ఆరాధనలో ఆధ్యాత్మిక రహస్యాలు ఎన్నో ఉన్నాయని చెప్పేందుకు ఓ గొప్ప ఉదాహరణ ఆయన అవతారాలు. ముద్గల పురాణం ప్రకారం వినాయకుడు ఎనిమిది అవతారాలను ధరించాడు. ఆ ఎనిమిది వివరాలను, గణనాథుని మహిమలను తెలుసుకుని ఆ వినాయకుని సేవించి తరిద్దాం. వక్రతుండుడు పూర్వం ఇంద్రుడు చేసిన ఒక పొరపాటు వల్ల ‘మాత్సర్యాసురుడు’ అనే రాక్షసుడు ఉద్భవించాడు. అతని ధాటికి ముల్లోకాలూ అల్లాడిపోయి దేవతలంతా దత్తాత్రేయుని శరణు వేడారు. అంతట దత్తాత్రేయుడు, గణపతిని ప్రార్థించమని సూచించాడు. ‘గం’ అనే బీజాక్షరంతో దేవతలంతా ఆ గణపతిని గురించి తపస్సు చేయగానే ‘వక్రతుండుని’గా అవతరించాడు. ఆయన సింహవాహనుడై ఆ మాత్సర్యాసురుని జయించాడు. వక్రతుండం అనేది ఓంకారానికి ప్రతీకగా, మాత్సర్యాసురుడు మనలోని మత్సరానికి (ఈర్ష్య) ప్రతీకగా చెప్పుకోవచ్చు. ఈ లోకం నాది, ఈ లోకంలో అందరికంటే నాదే పైచేయి కావాలి అనుకున్న రోజున ఈర్ష్యాసూయలు జనిస్తాయి. ఈ జగత్తు ఒక నాటకం మాత్రమే అని గ్రహించిన రోజున మనసులో ఎలాంటి ఈర్ష్య ఉండదు. ఏకదంతుడు చ్యవనుడనే రుషి మదాసురుడనే రాక్షసుని సృష్టించాడు. రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు అతనికి ‘హ్రీం’ అనే మంత్రాన్ని ఉపదేశించి నిరంతరం జపిస్తే ç్ఛౌలితం దక్కుతుందన్నాడు. లోకాధి పత్యమే అభీష్టంగా కల మదాసురుడు ఆ హ్రీంకారాన్ని యుగాల తరబడి జపించాడు. దాంతో అతనికి కోరుకున్న శక్తులన్నీ లభించి మదాసురునికి తిరుగులేకుండాపోయింది. అతని చేష్టలకు దేవతలంతా భీతిల్లిపోయి సనత్కుమారుని చెంతకు ఉపాయం కోసం పరుగులు తీశారు. సనత్కుమారుని సూచన మేరకు వారంతా గణేశుని కోసం ప్రార్థించగా, ఆయన ‘ఏకదంతు’నిగా అవతరించి మదాసురిని జయించాడు. ఇక్కడ మదాసురుడు అంటే మదానికి (గర్వం) చిహ్నం, ఏకదంతుడు ఈ సృష్టి యావత్తూ ఒకటే అన్న అద్వైతానికి చిహ్నం. మహోదరుడు శివుడు ఓసారి తీవ్రమైన తపస్సులో మునిగిపోయాడు. ఎంత కాలమైనా ఆయన ఆ తపస్సుని వీడకపోవడంతో పార్వతి కంగారుపడి పరమేశ్వరుని తపస్సు నుంచి బయటకు తీసుకురావాలని గిరిజన యువతిగా మారి ఆయన తపోభంగం కలిగించే ప్రయత్నం చేసింది. పార్వతి చేష్టలకు పరమేశ్వరునికి దిగ్గున మెలకువ వచ్చి ఏం జరిగింది అన్న అయోమయం కూడా ఏర్పడి రాక్షసుడు జనించాడు. అతనే మోహాసురుడు. ఆ మోహాసురుడు సూర్యుని ఆరాధించి ముల్లోకాధిపత్యాన్ని సాధించాడు. దేవతల ప్రార్థనను మన్నించి గణేశుడు లంబో దరునిగా అవతరించాడు. మోహం ఎప్పుడూ అయోమయానికి దారితీస్తుంది. దృక్పథం సంకుచితంగా మారిపోతుంది. అందరూ నావారే అన్న విశాలమైన దృష్టి కలిగిన రోజున ఆ మోహం దూరమైపోతుంది. గజాననుడు కుబేరుని ఆశ నుంచి లోభాసురుడు అనే రాక్షసుడు జనించాడు. శివపంచాక్షరిని జపించిన ఆ లోభాసురుడు, శివుని అనుగ్రహంతో ముల్లోకాలనూ జయించే వరాన్ని పొందాడు. కానీ అతని లోభానికి అంతులేకుండా పోయింది. చివరికి శివుని కైలాసాన్ని కూడా తన స్వాధీనంలోకి తెచ్చుకోవాలనుకున్నాడు. ఆ విషయాన్ని తెలుసు కున్న దేవతలు రైభ్యుడనే రుషిని శరణువేడారు. గణపతిని కనుక ఆవాహన చేస్తే, లోభాసురుని పరాజయం ఖాయమని సూచించాడు. అలా సకల దేవతల ప్రార్థనలను మన్నించి గణేశుడు ‘గజాననుడి’గా అవతరించి లోభాసురుని జయించాడు. గజాననుడు అంటే ఏనుగు ముఖం కలిగినవాడు అని అర్థం. ఏనుగు తల బుద్ధిని సూచి స్తుంది. ఆ బుద్ధిని కనుక ఉపయోగిస్తే మనలోని లోభం (అత్యాశ, పిసినారితనం) దూరం కాకతప్పవు. లంబోదరుడు దేవరాక్షసులు కలిసి సాగరాన్ని మధించినప్పుడు చివరగా అమృతం దక్కిన విషయం తెలిసిందే! ఈ అమృతాన్ని రాక్షసులకు కాకుండా చేసేందుకు విష్ణుమూర్తి మోహినీ అవతారాన్ని ధరించాడు. మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తిని చూసిన శివునికి కూడా మనసు చలించగా విష్ణువు తన నిజరూపంలోకి రావడంతో శివుడు భంగపడి క్రోధితుడయి క్రోధాసురుడు అనే రాక్షసుడు జన్మించాడు. సూర్యదేవుని ఆశీస్సులతో మహాబలవంతుడయ్యాడు.క్రోధాసురుడు ప్రీతి అనే కన్యను వివాహమాడగా హర్షం,శోకం అనేసంతానం కలిగారు. వినాయకుడు లంబోదరుని రూపంలో క్రోధాసురుడిని అణచివేశాడు. క్రోధం ఎప్పుడూ తాను ఇష్టపడిన దాని కోసం వెంపర్లాడుతుంది. ఆ వెంపర్లాటలో గెలిస్తే హర్షం, ఓడితే శోకం అనే ఉద్వేగాలు కలుగుతాయి. వికటుడు పూర్వం కామాసురుడనే రాక్షసుడు ఉండేవాడట. ఆ కామాసురుడు శివుని గురించి ఘోర తపస్సు చేసి ముల్లోకాధిపత్యాన్ని సాధించాడు. అతని బారి నుంచి కాపాడే ఉపాయం సెలవిమ్మంటూ దేవతలంతా ముద్గల మహర్షిని వేడుకున్నారు. అంతట ఆ రుషి తదేక దీక్షతో ఓంకారాన్ని జపిస్తూ ఉంటే కనుక ఆ గణేశుడు ప్రత్యక్షమై వారి కష్టాన్ని తీరుస్తాడని సెలవిచ్చాడు. ముద్గలుని ఉపాయం పాటించిన దేవతలకు గణేశుడు వికటునిగా ప్రత్యక్షం అయ్యాడు. గణేశుని రూపు కాస్త విభిన్నంగా ఉంటుంది. అది ఒకోసారి ఓంకారాన్ని కూడా తలపిస్తుందని చెబుతారు. ఆ ఓంకార స్వరూపంతో కామాన్నిఎదుర్కోవచ్చుననీ వికటుని వృత్తాంతం తెలియచేస్తోంది. విఘ్నరాజు కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యాలనే అరిషడ్వర్గాలకు ప్రతీకగా ఇప్పటి వరకూ రాక్షసులని చూశాము. ఇక మమతాసురుడు అనే రాక్షసుని కథ ఇది. శంబరుడు అనే రాక్షసుని ప్రలోభంతో మమతాసురుడు ముల్లోకాలనూ పీడించసాగాడు. దేవతల కోరిక మేరకు వినాయకుడు, విç్ఛ్నౌురాజుగా అవతరించి మమతాసురుని సంహరించాడు. చిత్రంగా ఈ అవతారంలో వినాయకుడు నాగుపాముని వాహనంగా చేసుకొన్నట్లు చెబుతారు. ఇక్కడ మమత అంటే దేహాభిమానానికి ప్రతీక. ఆ దేహంలోని కుండలిని జాగృతం చేసిన రోజున మోక్షానికి కల విç్ఛ్నౌూలన్నీ తొలగిపోతాయి. దేహాభిమానానికి మమతాసురుడు, కుండలినికి సూచనగా నాగ వాహనం కనిపిస్తాయి. ధూమ్రవర్ణుడు అరిషడ్వార్గాలు అయిపోయాయి, దేహాభిమానమూ తీరిపోయింది. ఇక ‘నేను’ అనే అహంకారం ఒక్కటే మిగిలింది. దానికి సూచనే అహంకారాసురుడనే రాక్షసుడు. ధూమ్రము అంటే పొగ అన్న అర్థం కూడా వస్తుంది. ధూమ్రానికి ఒక ఆకారం అంటూ ఉండదు. ఒక పరిమితీ ఉండదు. సర్వవ్యాపి అయిన ఆ భగవంతుని ప్రతిరూపం ధూమ్రం. మనిషి ‘తాను’ అనే అహంకారాన్ని వీడి ఆ భగవంతునిలో ఐక్యం కావడానికి సూచనే ఈ అహంకారాసురుని వృత్తాంతం. ‘నేను’ అనే అహంకారాన్ని పక్కనపెట్టి తనను తాను తెలుసుకునే ప్రయత్నం చేస్తూ పరులకు ఉపకారం చేస్తూ దైవ చింతనతో దైవాన్ని వెతుకుతూ మోక్షంకోసం సాధన చేయడమే దీని సారాంశం. -
వినాయకుడినే మొదట ఎందుకు పూజించాలి?
ఏడాదిలో మహా ప్రధానమైన పర్వదినం గణేశ చతుర్థి. మహాగణపతి పార్వతీ తనయుడుగా ఆవిర్భవించిన రోజు. ఇంటిల్లిపాదీ, ఊరూ వాడా పూజించుకునే పర్వమిది. కొన్నిచోట్ల నవరాత్రులు చేసే సంప్రదాయం ఉంది. ఈ స్వామి ఆరాధన వల్ల అన్ని శుభాలు లభిస్తాయని ప్రతీతి. భక్తితో పూజిస్తే చాలు అపారమైన కృపావర్షం కురిపించే సులభ ప్రసన్నుడు విఘ్నరాజు గురించి కొన్ని విశేషాలు... చదవండి: పచ్చగా నిను కొలిచేమయ్యా.. చల్లగా చూడు మా బొజ్జ గణపయ్యా.. వినాయకుడికి, విద్యకు సంబంధం ఏమిటి? చదువంటే గణపతికి ఇష్టం. నారదుడు, బృహస్పతి ద్వారా కేవలం అరవై నాలుగు రోజుల్లో విద్యలు నేర్చిన ఘనుడు. ఆయన సామర్థ్యం గురించి ఓ చిన్న ఇతివృత్తం ఉంది. వేదవ్యాసుడు భారతం రాయాలనుకున్నప్పుడు వేగంగా రాసే లేఖకుడు ఉంటే బావుండునని అనుకున్నాడట. గణపతి దగ్గరకు వచ్చాడట. ‘లక్ష శ్లోకాలు చెబుతాను వేగంగా రాసిపెడతావా!’ అని అడిగాడట.‘అలాగే రాస్తాను కానీ, మీరు వెంట వెంటనే చెబుతుండాలి. చెప్పడం ఆపితే నేను మాయం అవుతా!’ అన్నాడట గణపతి. ‘సరే! నేను చెప్పే శ్లోకాలను అర్థం చేసుకుని రాయగలిగితే నేనూ వేగంగా చెబుతా!’ అన్నాడట వ్యాసుడు. అలా సరస్వతి నది తీరాన మహాభారత రచన మొదలైంది. వ్యాసుడు ప్రతి వంద శ్లోకాల మధ్యలో అతి కఠినమైనవి చెబుతుండేవాడట. వినాయకుడు వాటిని అర్థం చేసుకుని రాసేలోపు మిగతా వంద గుర్తు తెచ్చుకునేవాడట. చివర్లో మరో పది శ్లోకాలు చెప్పాల్సి ఉండగా అనుకోకుండా వ్యాసుడి కవిత్వ ధార ఆగిపోయింది! తన నిబంధన ప్రకారం వినాయకుడు మాయమయ్యాడు. తన రచన ఆ మేరకు అసంపూర్ణంగా మిగిలిపోయిందని విచారించాడట వ్యాసుడు. సరే తానే రాస్తానని తాళపత్రాలు తీసి చూస్తే ఏముంది? ఆయన చెప్పాల్సిన పది శ్లోకాలు అక్కడే ఉన్నాయట. అంటే ఆ శ్లోకాలన్నీ విఘ్నాధిపతికి ముందే తెలిసుండాలి. అంటే వ్యాసుడు తన రచన ఎలా ముగిస్తాడో ముందుగానే వూహించాడు! వ్యాసుడు గణపతికి కృతజ్ఞతతో ‘నీ పుట్టినరోజున పుస్తకాలను ఉంచి పూజించే విద్యార్థులు సర్వశుభాలూ పొందుతారు. వారికి సకల విద్యలు అబ్బుతాయి’ అని ఆశీర్వదించాడట. నాటినుంచి వినాయక చవితినాడు చేసే పూజలో పిల్లలు తమ పుస్తకాలను, కలాలను ఉంచి, పుస్తకాలకు పసుపు కుంకుమలు అలంకరించి పూజించడం ఆచారంగా మారింది. క్షేమం, లాభం కూడా.. ఏ పూజ చేసినా, తొలుత గణపతిని ప్రార్థించిన తర్వాతనే తక్కిన వారిని ఆరాధించాలని, లేకపోతే ఆ పూజ నిష్ఫలమవుతుందని, అదే గణపతిని పూజించినట్లయితే సిద్ధి బుద్ధితోబాటు క్షేమం, లాభం కూడా కలుగుతాయని స్వయంగా పార్వతీ పరమేశ్వరులే చెప్పినట్లు పురాణాలు చెబుతున్నాయి. అందుకనే ఏ కార్యాన్ని ప్రారంభించడానికయినా ముందుగా గణపతిని పూజించి, ఆ తర్వాతనే ఆ పనిని మొదలు పెట్టడం ఆచారంగా వస్తోంది. వీటిలోని ఆంతర్యం ఇదే! వినాయకుని నక్షత్రం ‘హస్త’. ఈ నక్షత్రానికి అధిపతి చంద్రుడు. నవధాన్యాలలో చంద్రునికి బియ్యం. అందుకే బియ్యాన్ని భిన్నం చేసి, ఉండ్రాళ్లుగా తయారు చేసి చంద్ర నక్షత్రమైన హస్తా నక్షత్రంలో ఆవిర్భవించిన వినాయకునికి నివేదన చేస్తారు. పత్రిపూజ: అదేవిధంగా వినాయకునిది కన్యారాశి. ఈ కన్యారాశికి అధిపతి బుధుడు. బుధునికి ఆకుపచ్చ రంగు ప్రీతికరమైనది. అందుకే వినాయక చవితి రోజున విఘ్నేశ్వరుని ఆకుపచ్చ రంగులో ఉన్న పత్రితో పూజ చేస్తారు. మూషిక వాహనం: మూషికం అంటే ఎలుక వాసనామయ జంతువు. తినుబండారాల వాసనను బట్టి అది ఆ ప్రదేశానికి చేరుకుంటుంది. పంజరంలో చిక్కుకుంటుంది. ఆ విధంగానే మనిషి జన్మాంతర వాసనల వల్ల ఈ ప్రాకృతిక జీవితంలో చిక్కుకొని చెడు మార్గాలు పట్టినప్పుడు మూషిక వాహనుడుగా వాసనలను అనగా కోరికలను అణగద్రొక్కేవాడు – వినాయకుడు. చదవండి: గణేశ్ చతుర్థి: కుడుము..ఆరోగ్యకరము -
వెండితెరపై వినాయక విన్యాసాలు.. ఈ సినిమాలపై ఓ లుక్కేయండి
వినాయకుడు.. విఘ్నాధిపతి.. గణనాథుడు.. బొజ్జ గణపయ్య.. ఏకదంతుడు.. ఇలా ఏ పేరుతో స్వామిని కొలిచినా సకల విఘ్నాలు తొలగి జయం చేకూరుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అలాంటి వినాయకుడికి తెలుగు సినిమాల్లోనూ ప్రత్యేక స్థానం ఉంది. విఘ్నేశ్వరుడి నేపథ్యంలో ఎన్నో సినిమాలు వచ్చి, విజయాలు సాధించాయి. మరెన్నో చిత్రాల్లో స్వామిని కీర్తిస్తూ వచ్చిన సన్నివేశాలు, పాటలు కూడా ప్రేక్షకులను అలరించాయి. గణనాథుడి నేపథ్యంలో వచ్చిన కొన్ని సినిమాలు, పాటలపై ఓ లుక్కేద్దాం.. వినాయక చవితి వినాయక చవితి రోజున వినాయక వ్రత కథ చదువుకుని, పూజ చేసుకోవడం ఆనవాయితీ. ఈ కథ ఆధారంగా సముద్రాల రాఘవాచార్య దర్శకత్వం వహించిన చిత్రం ‘వినాయక చవితి’. ఎన్టీఆర్, జమున, కృష్ణకుమారి, గుమ్మడి, రాజనాల తదితరులు నటించారు. కె. గోపాలరావు నిర్మించిన ఈ సినిమా 1957 ఆగస్టు 22న విడుదలైంది. ఇక ఈ చిత్రకథ విషయానికి వస్తే.. వినాయక చవితి నాడు శ్రీకృష్ణుడు పాలలో చంద్రుణ్ణి చూడటంవల్ల సత్రాజిత్తు సంపాదించిన శమంతకమణిని అపహరించాడన్న అపఖ్యాతి మూటగట్టుకుంటాడు. ఆ తర్వాత వినాయక వ్రతం ఆచరించి, నిర్దోషిగా తనను తాను నిరూపించుకుని బయటపడతాడు. అందరూ చవితి నాడు వినాయక వ్రతం ఆచరిస్తే, ఆ గజానుని ఆశీస్సులతో ఎలాంటి నీలాప నిందలపాలు కాకుండా ఉంటారనే కథతో ‘వినాయక చవితి’ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రం విడుదలై 65 ఏళ్లు అయింది. భూ కైలాస్ పరమశివుని భక్తుడైన రావణాసురుడు తన తల్లి కోరిక మేరకు శివుని ఆత్మలింగం తెస్తానని శపథం చేసి తపస్సుకు వెళ్తాడు. ఆత్మలింగం సాధించి, అమరత్వం పొందాలన్నది రావణాసురుడి కోరిక. ఆయన తపస్సును మెచ్చుకున్న శివుడు ఆత్మలింగం ఇస్తూ, దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నేలపై పెట్టకూడదని షరతు విధిస్తాడు. రావణాసురుడికి అమరత్వం వస్తే భూ మండలాన్ని సర్వనాశనం చేస్తాడని భావించిన నారదుడు ఆత్మలింగం లంకకు చేరకుండా అడ్డుకోవాలని వినాయకుణ్ణి ప్రార్థిస్తాడు. రావణాసురుడు సంధ్యా వందనం చేసే సమయంలో శివుడి ఆత్మలింగం రావణుడి పాలు కాకుండా చేస్తాడు వినాయకుడు. చివరకు ఆత్మార్పణకు సిద్ధపడిన రావణాసురుణ్ణి కైలాసపతి కరుణించి, ఆ ప్రదేశం ‘భూకైలాసం’గా మారుతుందని చెప్పి అనుగ్రహించడంతో కథ ముగుస్తుంది. ఎన్టీఆర్ రావణునిగా, ఏఎన్నార్ నారదుడిగా నటించిన ‘భూ కైలాస్’ చిత్రకథ ఇది. కె. శంకర్ దర్శకత్వంలో ఏవీఎం సంస్థ నిర్మించిన ఈ సినిమా 1958 మార్చి 20న రిలీజైంది. శ్రీ వినాయక విజయం వినాయకుడి జీవిత చరిత్రపై తెలుగులో పూర్తి స్థాయిలో వచ్చిన చిత్రం ‘శ్రీ వినాయక విజయం’. కమలాకర కామేశ్వరరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కృష్ణంరాజు, వాణిశ్రీ శివపార్వతులుగా నటించారు. శివదీక్షా వ్రతాన్ని ఆచరించడానికి పూనుకుని స్నానమాచరించబోతూ పిండితో ఒక బాలుని బొమ్మ తయారు చేసి, దానికి ప్రాణం పోసి, కాపలాగా ఉంచుతుంది పార్వతీదేవి. అప్పుడు వచ్చిన శివుణ్ణి లోనికి అనుమతించడు ఆ బాలుడు. ఆగ్రహించి బాలుని శిరస్సు ఖండిస్తాడు శివుడు. దీంతో పార్వతి తన బిడ్డను ఎలాగైనా బతికించమని శివుణ్ణి కోరుతుంది. ఆ బాలునికి ఏనుగు తలను అమర్చి ప్రాణం పోస్తాడు శివుడు. ఆ బాలుడు మూషికాసురున్ని సంహరించిన తీరు, మూషికాసురుని జన్మ వృత్తాంతం వంటి ఎన్నో విషయాలను ఈ సినిమాలో చూపించారు. 1979 డిసెంబరు 22న ఈ చిత్రం విడుదలైంది. జై జై గణేశా... తెలుగు సినిమాల్లో గణనాథుణ్ణి కీర్తిస్తూ ఎన్నో పాటలు వచ్చాయి. ఎన్టీఆర్, కృష్ణ హీరోలుగా తెరకెక్కిన ‘దేవుడు చేసిన మనుషులు’ సినిమాలో ‘దేవుడు చేసిన మనుషుల్లారా..’ అనే పాట వినాయక నిమజ్జనం నేపథ్యంలో సాగుతుంది. వెంకటేష్ నటించిన ‘కూలీ నెంబర్ 1’ సినిమాలోని ‘దండాలయ్యా ఉండ్రాలయ్యా..’ పాట ఇప్పటికీ ప్రతి వినాయక మండపంలో వినిపిస్తూ ఉంటుంది. చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘జై చిరంజీవ’ సినిమాలో ‘జై జై గణేశా.. జై కొడత గణేశా..’ పాట సూపర్‌హిట్‌గా నిలిచింది. బాలకృష్ణ ‘డిక్టేటర్’ మూవీలోని ‘గం గం గణేశా..’ అనే పాట కూడా ఆకట్టుకుంది. ‘దేవుళ్లు’ సినిమాలోని ‘జయ జయ శుభకర వినాయక..’ పాటని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అద్భుతంగా పాడారు. మహేశ్‌బాబు ‘పోకిరి’ సినిమాలోని జగడమే పాటలో ‘గణపతి బప్పా మోరియా..’ అంటూ వచ్చే బిట్ సూపర్‌గా ఉంటుంది. రామ్ ‘గణేష్’ మూవీలో వినాయకుడిపై ఒక పాట ఉంది. ‘దేవదాస్’ సినిమాలో నాగార్జున, నాని వినాయకుణ్ణి కీర్తిస్తూ పాడే పాట పాపులర్ అయింది. నాని ‘భలే భలే మగాడివోయ్’, రవితేజ ‘పవర్’ సినిమాల్లో వినాయక చవితి ప్రస్తావన ఉంది. ఇవే కాదు.. మరికొన్ని సినిమాల్లోనూ గణేశుణ్ణి కీర్తిస్తూ పాటలున్నాయి. -
పచ్చగా నిను కొలిచేమయ్యా.. చల్లగా చూడు మా బొజ్జ గణపయ్యా..
వినాయక చవితి... యువతరం గుండెల్లో పెట్టుకునే పండగ. ఆనందం, ఆధ్యాత్మిక భావన... వాడవాడల్లో నిండుగా వెలిగే పండగ. కొంతకాలంగా ‘పర్యావరణహితం’ యూత్ ఎజెండాలో మొదటి వరుసలో చేరింది. రసాయన రహిత విగ్రహాలను కొనుగోలు చేయడానికే యువతరంలో ఎక్కువమంది ఇష్టపడుతున్నారు. కొందరు మరో అడుగు ముందుకు వేసి, మట్టితో విగ్రహాలను తయారు చేసి ఉచితంగా పంపిణి చేస్తున్నారు. పర్యావరణహిత సందేశానికి రెక్కలు ఇస్తున్నారు... వినాయక చవితి యువతరం సొంతం చేసుకునే పండగ. పండగ ముందు పందిరిగుంజలు పాతడం నుంచి నిమజ్జనం వరకు ప్రతిక్షణం ఆధ్యాత్మిక భావన, ఆనందం వారి సొంతం. అయితే గత కొద్దికాలంగా ‘ఎకో–ఫ్రెండ్లీ గణేశ’ విగ్రహాల వైపు యూత్ మొగ్గుచూపుతోంది. వారిలో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. లక్నోలోని ఐటీ కళాశాల ముందు గత అయిదు సంవత్సరాలుగా వినాయకుడి విగ్రహాలను అమ్ముతున్నాడు ఆకాష్ కుమార్. ‘గతంతో పోల్చితే మార్పు వచ్చిందనే చెప్పాలి. మట్టితో తయారు చేసిన గణేశుడి విగ్రహాలు కొనడానికి ప్రాధాన్యత ఇస్తున్న వారిలో యువత ఎక్కువ సంఖ్యలో ఉంది. కొద్దిపాటి కృత్రిమ రంగులు, ప్లాస్టిక్ అలంకరణను కూడా యువత ఇష్టపడడం లేదు’ అంటున్నాడు ఆకాష్ కుమార్. తనీష ఈసారి ఎకో–ఫ్రెండ్లీ గణేశుడి విగ్రహాన్ని కొనుగోలు చేసింది. గత సంవత్సరం కొనుగోలు చేసిన విగ్రహంతో పోల్చితే ఆకర్షణీయంగా లేకపోవచ్చుగాక, కాని తన మనసుకు మాత్రం తృప్తిగా ఉంది. ‘ఆకర్షణీయమైన రసాయన రంగుల కంటే పర్యావరణం ముఖ్యం’ అంటుంది తనీష. మరో కస్టమర్ అనీష కూడా ఎకో–ఫ్రెండ్లీ విగ్రహాన్నే కొనుగోలు చేసింది. ‘నేను కొనడమే కాదు, ఇతరులు కూడా కొనేలా నా వంతు ప్రచారాన్ని చేస్తున్నాను’ అంటుంది అనీష. సాధారణ విగ్రహాలతో పోల్చితే పర్యావరణహిత వినాయక విగ్రహాల ధర ఎక్కువగా ఉన్నప్పటికీ వాటిని కొనడానికి ఆసక్తి చూపడం విశేషం. సాధారణంగా కోల్‌కతాలో మట్టితో తయారు చేసిన విగ్రహాలు ఎక్కువగా ఉంటాయి. ముంబైలో మాత్రం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ను ఉపయోగించి తయారు చేసే విగ్రహాలే ఎక్కువ. అయితే బాంద్రాలోని పాలి హిల్‌కు చెందిన యువత మట్టిని ఉపయోగించి విగ్రహాలు తయారు చేయడమే కాదు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, మట్టి విగ్రహాలకు మధ్య తేడా గురించి ప్రచారం చేస్తున్నారు. ‘ఏదైనా మంచి విషయం చెబితే ఈ చెవిన విని ఆ చెవిన వదిలేస్తారు చాలామంది. కాని మేము చెప్పే విషయాలను చాలా ఆసక్తిగా వింటున్నారు. మార్పు వస్తుందనే నమ్మకం వచ్చింది’ అంటున్నాడు మట్టితో వినాయక విగ్రహాలు తయారుచేసే సచిన్. బాంద్రా నుంచి బెంగళూరు వచ్చేద్దాం. బెంగళూరుకు చెందిన శ్రీ విద్యారణ్య యువక సంఘ, కర్ణాటక స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్‌తో కలిసి ఔషధ గింజలతో కూడిన పదివేల మట్టి వినాయకుడి విగ్రహాలను పంపిణీ చేశారు. జైపుర్‌కు చెందిన కెరీర్ కౌన్సెలర్ షల్లీ కపూర్ తన ఫ్రెండ్ శ్వేతతో కలిసి ‘పర్యావరణహిత వినాయక చవితి’ గురించి స్కూల్, కాలేజీలలో విస్తృతంగా ప్రచారం చేయడమే కాదు, మట్టితో చిన్న చిన్న వినాయక విగ్రహాలు ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తుంది. ‘మార్పు అనేది యువతరంతోనే మొదలవుతుందనే బలమైన నమ్మకం ఉంది. అందుకే ఈ ప్రయత్నం’ అంటుంది శ్వేత. ‘నేను సొంతంగా గణేశుడి విగ్రహాన్ని తయారు చేయడం సంతోషంగా అనిపించింది. వర్క్‌షాప్‌లో నేర్చుకున్న, విన్న విషయాలను తల్లిదండ్రులతో పంచుకున్నాను’ అంటుంది అర్చనా గుప్తా. పదిమంది నడిచే బాటే ఆ తరువాత ట్రెండ్ అవుతుంది. యువతరంలో మొదలైన మార్పును చూస్తుంటే పర్యావరణహిత విగ్రహాలను ఇష్టపడే ధోరణి ట్రెండ్‌గా మారడానికి అట్టే కాలం పట్టకపోవచ్చు. -
Ganesh Chaturthi 2022: ఏకశిలలో భారీ ఏకదంతుడు
సాక్షి, నాగర్‌కర్నూల్: ఇది దేశంలోనే ఎత్తైన ఏకశిలా వినాయకుడి విగ్రహం. ఇది నాగర్‌కర్నూల్ జిల్లాలోని తిమ్మాజిపేట మండలం ఆవంచలో ఉంది. దుందుభి వాగు తీరంలో వెలసిన ఈ వినాయకుడికి ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. కర్ణాటకలోని శ్రావణబెళగోళలో ఉన్న గోమఠేశ్వరుడు, చాముండీ కొండపై నందీశ్వరుడితోపాటు ఆవంచలోని గణపతి ఏకశిలా విగ్రహాలుగా అతిపెద్దవిగా ప్రసిద్ధి. ఏటా వినాయక చవితి సందర్భంగా వేలాదిమంది భక్తులు ఇక్కడికి వచ్చి దర్శించుకుంటారు. స్థానికులు ఐశ్వర్య గణపతిగా పిలిచే ఈ గణనాథుడికి ఆలయం లేదు. నాటి ఆవుల మంచాపురమే.. నేటి ఆవంచ.. పశ్చిమ చాళుక్యుల కాలంలో ప్రముఖులైన జగదేక మల్లుడు, భువనైక మల్లుడు, తైలోక్య మల్లుడు ఆవుల మంచాపురాన్ని రాజధానిగా చేసుకుని పాలించారు. నాటి ఆవుల మంచాపురాన్నే కాలక్రమంలో ఆవంచగా పిలుస్తున్నారు. తెలుగు నేలను పాలించిన ఇక్ష్యాకులు గణపతి భక్తులు కావడంతో క్రీ.శ.12వ శతాబ్దంలో 26 అడుగుల ఎత్తైన ఏకశిలా గణపతిని ఏర్పాటు చేసినట్లు చరిత్ర పరిశోధకులు చెబుతున్నారు. పశ్చిమ చాళుక్యుల కాలంలో వెలుగొందిన ఆవంచ గ్రామంలో లభించిన విగ్రహాలు, శిల్పాలను మహబూబ్‌నగర్ జిల్లాలోని పిల్లలమర్రి మ్యూజియం వద్ద భద్రపర్చారు. వీరి కాలంలోనే గ్రామశివారులోని భైరవ ఆలయంలోని ప్రతిమలు, మరో స్తంభంపై శివ పంచాయతనం చెక్కినట్లు స్పష్టమవుతోంది. ఆదరణ లేక పూజలందుకోని గణనాథుడు దేశంలోనే అతిపెద్ద వినాయక ఏకశిలా విగ్రహంగా ప్రసిద్ధి చెందిన ఐశ్వర్య గణపతికి నీడ లేకుండాపోయింది. ఆలయం నిర్మాణం జరగకపోవడంతో ఈ విగ్రహం వందల ఏళ్లుగా ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తోంది. ఏడేళ్ల క్రితం ఓ చారిటబుల్ ట్రస్టు ఆలయం నిర్మించేందుకు ముందుకు వచ్చింది. ఆలయం కోసం ఆరు ఎకరాల స్థలాన్ని సైతం కొనుగోలు చేశారు. అయితే ఆలయ నిర్మాణపనులు ముందుకుసాగడం లేదు. ప్రభుత్వం స్పందించి ఆలయ నిర్మాణం చేపట్టి పర్యాటకంగానూ అభివృద్ధి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ప్రభుత్వం దృష్టిసారించాలి.. పురాతన కాలం నాటి ఏకశిలా వినాయక విగ్రహానికి ఆలయాన్ని నిర్మించాలి. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాలి. ఏళ్లపాటు ఆలయం లేక గణనాథుడు నిరాదరణకు గురవుతున్నాడు. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి ఆవంచ వినాయకుడిని పర్యాటకంగా అభివృద్ధి చేయాలి. – వస్పతి శివలింగం, ఆవంచ, నాగర్‌కర్నూల్ జిల్లా -
Ganesh Chaturthi Recipes: సున్నుండల తయారీ విధానం
కావలసిన పదార్థాలు : మినపప్పు – 2 కప్పులు, పంచదార పొడి – 2 కప్పులు, నెయ్యి – 1 కప్పు, యాలకలపొడి – 1/2 టీ స్పూన్ తయారు చేసే విధానం : మినపప్పు దోరగా వేయించుకొని చల్లారిన తరువాత పొడి చేసుకొని నెయ్యి వేడిచేసి పంచదారపొడి, మినప్పిండీ, యాలకుల పొడి కలిపి ఉండలు చేసుకోవాలి. -
వినాయకచవితికి సిద్ధమైన ఖైరతాబాద్ విఘ్నేషుడు
-
Ganesh Chaturthi 2022: వరసిద్ధి వినాయక పూజ, విఘ్నేశ్వరుని కథ, పునః పూజ
క్లిక్: Ganesh Chaturthi: వ్రతకల్పము.. పూజా ద్రవ్యములు, వరసిద్ధి వినాయక పూజ క్లిక్: విఘ్నేశుని కథా ప్రారంభం.. తదుపరి... పునఃపూజ : ఛత్రమాచ్ఛాదయామి‘ చామరేణ వీచయామి‘ నృత్యం దర్శయామి‘ గీతం శ్రావయామి‘ ఆందోళికా నారోహయామి‘ గజానారోహయామి‘ అశ్వానారోహ యామి‘ సమస్త రాజోపచార, భక్త్యోపచార, శక్త్యోపచార పూజాన్ సమర్పయామి‘‘ (స్వామిపై పుష్పాక్షతలు వేయాలి) శ్రీ శంభుతనయునకు సిద్ధిగణనాధునకు వాసిగల దేవతా వంద్యునకును ఆ సరసవిద్యలకు ఆదిగురువైనట్టి భూసురోత్తమ లోకపూజ్యునకును జయ మంగళం నిత్య శుభమంగళం! నేరేడు మారేడు నెలవంక మామిడి దూర్వారచెంగల్వ ఉత్తరేణు వేరువేరుగా దెచ్చి వేడ్కతో పూజింతు పర్వమున దేవ గణపతికి నెపుడు ‘‘జయ‘‘ సుచిరముగ భాద్రపద శుద్ధచవితి యందు పొసగ సజ్జనులచే పూజగొల్తు శశి చూడరాదన్న జేకొంటినొక వ్రతము పర్వమున దేవగణపతికి నిçపుడు ‘‘ జయ‘‘ పానకము వడపప్పు పనస మామిడి పండ్లు దానిమ్మ ఖర్జూర ద్రాక్షపండ్లు తేనెతో మాగిన తియ్యమామిడిపండ్లు మాకు బుద్ధినిచ్చు గణపతికినిపుడు ‘‘ జయ‘‘ ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్య ఉండ్రాళ్ల మీదికి దండుపంపు కమ్మనీ నెయ్యియు కడుముద్దపప్పును బొజ్జనిండుగ దినుచును పొరలుచును ‘‘ జయ ‘‘ వెండి పళ్లెములోన వేవేల ముత్యాలు కొండలుగ నీలములు కలయబోసి మెండుగను హారములు మెడ నిండ వేసుకొని దండిగా నీకిత్తు ధవళారతి ‘‘ జయ ‘‘ పువ్వులను నినుగొల్తు పుష్పాల నినుగొల్తు గంధాల నినుగొల్తు కస్తూరినీ ఎప్పుడూ నినుగొల్తు ఏకచిత్తమ్మున పర్వమున దేవగణపతికి నిపుడు ‘‘ జయ ‘‘ ఏకదంతంబున ఎల్లగజవదనంబు బాగైన తొండంబు వలపు కడుపు జోకయిన మూషికము పరకనెక్కాడుచు భవ్యుడగు దేవ గణపతికి నిపుడు ‘‘ జయ ‘‘ మంగళము మంగళము మార్తాండ తేజునకు మంగళము సర్వజ్ఞ వందితునకు మంగళము ముల్లోక మహిత సంచారునకు మంగళము దేవ గణపతికి నిపుడు ‘‘ జయ ‘‘ సిద్ధి విఘ్నేశ్వర ప్రసిద్ధిగా పూజింతు ఒనరంగ నిరువది యొక్క పత్రి దానిమ్మ మరువమ్ము దర్భవిష్ణుక్రాంత యుమ్మెత్త దూర్వార యుత్తరేణి ‘‘ జయ ‘‘ కలువలు మారేడు గన్నేరు జిల్లేడు దేవకాంచన రేగు దేవదారు జాజి బలురక్కసి జమ్మిదానపువ్వు గరిక మాచిపత్రి మంచి మొలక ‘‘ జయ ‘‘ అగరు గంధాక్షత ధూప దీప నైవేద్య తాంబూల పుష్పోపహారములును భాద్రపద శుద్ధ చవితిని కుడుములు నానుబాలు ఉండ్రాళ్లు పప్పు ‘‘ జయ ‘‘ పాయసము జున్ను తేనెయు భక్తిమీర కోరి పూజింతు నిన్నెపుడు కోర్కెలలర ‘‘ జయ ‘‘ బంగారు చెంబుతో గంగోదకము దెచ్చి సంగతిగ శిశువునకు జలకమార్చి మల్లెపువ్వుల దెచ్చి మురహరిని పూజింతు రంగైన నా ప్రాణలింగమునకు ‘‘ జయ ‘‘ పట్టు చీరలు మంచి పాడిపంటలు గల్గి ఘనముగా కనకములు కరులు హరులు యిష్ట సంపదలిచ్చి యేలిన స్వామికి పట్టభద్రుని దేవగణపతికి నిపుడు ‘‘ జయ ‘‘ ముక్కంటి తనయుడని ముదముతో నేనును చక్కనైన వస్తుసమితి గూర్చి నిక్కముగ మనమును నీయందె నేనిల్పి ఎక్కుడగు పూజలాలింప జేతు ‘‘ జయ ‘‘ మల్లెలా మొల్లలా మంచి సంపెంగలా చల్లనైనా గంధసారము లను ఉల్లమలరగ మంచి ఉత్తమపు పూజలు కొల్లలుగ నేజేతు కోరి విఘ్నేశ ‘‘ జయ ‘‘ దేవాదిదేవునకు దేవతారాధ్యునకు దేవేంద్రవంద్యునకు దేవునకును దేవతలు మిముగొల్చి తెలిసి పూజింతురు. భవ్యుడగు దేవగణపతికి నిపుడు ‘‘ జయ ‘‘ చెంగల్వ చేమంతి చెలరేగి గన్నేరు తామరలు తంగేడు తరచుగాను పుష్పజాతులు తెచ్చి పూజింతు నేనిపుడు బహుబుద్ధి గణపతికి బాగుగాను ‘‘ జయ ‘‘ మారేడు మామిడి మాదీఫలంబులు ఖర్జూర పనసలును కదళికములు నేరేడు నెంవంది టెంకాయ తేనెయు చాలగా నిచ్చెదరు చనువుతోడ ‘‘ జయ ‘‘ ఓ బొజ్జగణపతి ఓర్పుతో రక్షించి కాచి నన్నేలు మీ కరుణతోను మాపాలగలవని మహిమీద నెల్లపుడు కొనియాడుచుందును కోర్కెదీర జయమంగళం నిత్య శుభమంగళం! ‘‘ జయ ‘‘ శో‘‘ గణేశః ప్రతిగృహ్ణాతు గణేశో వైదదాతి చ గణేశః తారకోభాభ్యాం గణేశాయ నమోనమః (ఈ శ్లోకము వాయనమిచ్చువారు చెప్పవలెను) మంత్రము – దేవస్యత్యాసవితుః ప్రసవేశ్వినోర్బాహుభ్యాం పూషోహస్తాభ్యామా దదా! (ఈ మంత్రము వాయనము పుచ్చుకొనువారు చెప్పవలెను) ఉద్వాసన మంత్రము : (ఈ క్రింది మంత్రంతో గణపతి ప్రతిమ ఈశాన్యదిశగా మూడుసార్లు కదపవలెను) యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః‘ తాని ధర్మాణి ప్రథమాన్యాసన్‘‘ తేహనాకం మహిమానస్యచంతే‘ యత్రపూర్వే సాధ్యాస్సంతి దేవాః‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత సిద్ధి వినాయక స్వామిన్ యథాస్థాన ముద్వాసయామి‘‘ పూజా విధానం సంపూర్ణమ్. (వ్రతకల్ప పూజా విధానం సమాప్తం). -
Ganesh Chaturthi 2022: వరసిద్ధి వినాయక పూజ, విఘ్నేశ్వరుని కథ
క్లిక్: Ganesh Chaturthi: వ్రతకల్పము.. పూజా ద్రవ్యములు, వరసిద్ధి వినాయక పూజ తదుపరి: విఘ్నేశుని కథా ప్రారంభం.. (కథ చదివేవారు వినేవారు అందరూ అక్షతలు చేతిలో వుంచుకొని కథ వినాలి) సూతమహాముని శౌనకాది మునులకు విఘ్నేశ్వరోత్పత్తియు, చంద్రదర్శన దోషకారణంబును, దాని నివారణను ఇలా చెప్పెను. పూర్వం గజరూపంగల రాక్షసేశ్వరుండు శివుని గూర్చి ఘోర తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఒక వరము కోరుకోమన్నాడు. అంత గజాసురుండు పరమేశ్వరుని స్తుతించి, స్వామీ! నీవు ఎల్లప్పుడూ నా ఉదరమందు నివసించి ఉండమని కోరాడు. భక్త సులభుండగు నా పరమేశ్వరుండు అతని కోర్కెదీర్చి గజాసురుని ఉదరమందు ప్రవేశించాడు. కైలాసాన పార్వతీదేవి భర్త జాడ తెలియక పలు ప్రదేశాలలో అన్వేషిస్తూ కొంత కాలానికి గజాసురుని గర్భంలో వున్నాడని తెలుసుకొని రప్పించుకొను మార్గం తెలియక పరితపిస్తూ విష్ణుమూర్తిని ప్రార్థించి తన పతి వృత్తాంతం తెలిపి, ‘‘మహాత్మా! నీవు పూర్వం భస్మాసురుని బారి నుండి నా పతిని రక్షించి నాకు యొసంగితివి, ఇప్పుడు కూడా ఉపాయాంతరముచే నా పతిని రక్షింపుము’’ అని విలపించింది, శ్రీహరి పార్వతిదేవిని ఓదార్చి ధైర్యం చెప్పి పంపాడు. అంత హరి బ్రహ్మాదిదేవతలను పిలిపించి, పరమేశ్వరుని రప్పించుటకై గజాసుర సంహారమునకు గంగిరెద్దుమేళమే సరియైనదిగా నిశ్చయించి, నందిని గంగిరెద్దుగా ముస్తాబుచేసి, బ్రహ్మాది దేవతలందరిచేత తలొక వాద్యమును ధరింపజేసి, తాను కూడా చిరుగంటలు, సన్నాయిలు తీసుకుని గజాసురపురానికి వెళ్ళి జగన్మోహనంబుగా వాయిద్యాలతో నందిని ఆడించుచుండగా, గజాసురుండు విని వారిని తన చెంతకు పిలిపించి తన భవనమందు ఆడింపమని కోరాడు. బ్రహ్మాదిదేవతలు వాద్య విశేషంబుల బోరు సలుప జగన్నాటక సూత్రధారియగు హరి చిత్రవిచిత్రంగా గంగిరెద్దును ఆడించగా, గజాసురుండు పరమానందభరితుడై ‘‘మీకేమి కావలయునో కోరుకోండి’’ ఇచ్చెదను అన్నాడు. అప్పుడు విష్ణుమూర్తి వానిని సమీపించి, ‘‘ఇది శివుని వాహనమగు నంది. శివుని కనుగొనుటకై వచ్చింది. కావున శివునొసంగు’’ అనెను. ఆ మాటలకు గజాసురుడు నివ్వెరపడి, అతనిని రాక్షసాంతకుడగు శ్రీహరిగా గ్రహించి, తనకు మరణమే నిశ్చయమనుకొనుచు తన గర్భస్థుండగు పరమేశ్వరుని ‘‘నా శిరసు త్రిలోకపూజ్యముగా జేసి, నా చర్మము నీవు ధరింపు’’మని ప్రార్థించెను. విష్ణుమూర్తి అంగీకారం తెలిపి నందిని ప్రేరేపించాడు నంది తన కొమ్ములతో గజాసురుని చీల్చి సంహరించాడు. అప్పుడు శివుడు గజాసురగర్భం నుండి బహిర్గతుడై విష్ణుమూర్తిని స్తుతించెను. అంత నా ‘‘హరి దుష్టాత్ములకిట్టి వరంబు లీయరాదు... ఇచ్చినచో పామునకు పాలుపోసినట్లగు’’నని ఉపదేశించి బ్రహ్మాది దేవతలకు వీడ్కోలు తెలిపి తాను వైకుంఠమునకు వెళ్లాడు. పిదప శివుడు నంది నెక్కి కైలాసానికి వేగంగా వెళ్లాడు. కైలాసంలో పార్వతీదేవి భర్త రాకను దేవాదుల వలన విని సంతోషించి పరమేశ్వరుని స్వాగతసన్నాహానికై అభ్యంగన స్నానాలంకార ప్రయత్నంలో తనకై వుంచిన నలుగుపిండితో ఒక ప్రతిమను చేయగా అది చూడముచ్చటైన బాలుని రూపముగా వుండెను. ఆ రూపానికి ప్రాణప్రతిష్ఠ చేయాలనిపించి అంతకుపూర్వం తన తండ్రి నుండి పొందిన మంత్ర ఫలముతో ఆ ప్రతిమకు ప్రాణప్రతిష్ఠ చేసెను. ఆ దివ్యస్వరూపుడైన బాలుడ్ని వాకిటముందు కాపుగా వుంచి ఎవ్వరినీ లోనికి రానీయవద్దని తెలిపింది. స్నానానంతరం పార్వతి సర్వాభరణాలు అలంకరించుకొని పతి రాకకోసం నిరీక్షించసాగింది. అపుడు పరమేశ్వరుడు నంది నధిరోహించి వచ్చి లోపలికి పోబోయాడు. ఇంతలో వాకిలి ద్వారముననున్న బాలుడు అడ్డగించాడు. బాలుని ధిక్కారానికి కోపం వచ్చిన శివుడు తనమందిరమున తనకే ధిక్కరింపా అని రౌద్రరూపంలో తన త్రిశూలంతో బాలుని కంఠాన్ని ఉత్తరించి లోపలికి వెళ్లాడు. అంత పార్వతీదేవి భర్తను చూసి, ఎదురువెళ్ళి అర్ఘ్యపాద్యాదులచే పూజించింది. వారిరువురు పరమానందంతో ప్రియసంభాషణములు ముచ్చటించుకొంటుండగా ద్వారం దగ్గరవున్న బాలుని ప్రస్తావన వచ్చింది. అంత ఆ మహేశ్వరుండు తాను చేసిన పనికి చింతించి, గజాసురుని శిరస్సును బాలునికి అతికించి ప్రాణం ప్రసాదించి ‘‘గజాననుడు’’ అని పేరుపెట్టాడు. అతనిని పుత్ర ప్రేమంబున ఉమామహేశ్వరులు పెంచుకొన సాగారు. గజాననుడు తల్లిదండ్రులను పరమభక్తితో సేవిస్తున్నాడు. అతడు సులభంగా ఎక్కి తిరుగుటకు అనింద్యుడను నొక ఎలుక రాజును వాహనంగా జేసికొన్నాడు. కొంతకాలానికి పార్వతీ పరమేశ్వురులకు కుమారస్వామి జన్మించాడు. అతడు మహాబలశాలి. అతని వాహనరాజం నెమలి. దేవతల సేనానాయకుడై ప్రఖ్యాతిగాంచి యుండెను. ఒకనాడు దేవతలు, మునులు పరమేశ్వరుని ప్రార్థిస్తూ తమకు ఏ పని చేసినా విఘ్నాలు కలుగకుండా ఒకరిని అధిపతిగా నియమించమని కోరారు. గజాననుడు తాను పెద్దవాడు గనుక ఆ ఆధిపత్యం తనకు ఇవ్వమని కోరాడు. గజాననుడు మరుగుజ్జువాడు, అసమర్థుడు గనుక ఆ ఆధిపత్యం తనకే ఇవ్వమని కుమారస్వామి కూడా తండ్రిని వేడుకొన్నాడు. సమస్య పరిష్కారానికి శివుడు ఇరువురు కుమారులను చూసి, ‘‘మీలో ఎవ్వరు ముల్లోకాలలోని పుణ్యనదులలో స్నానంచేసి ముందుగా నా వద్దకు వస్తారో, వారికి యీ ఆధిపత్యం ఇస్తాను’’ అని అన్నాడు. ఆ మాటలు విన్న వెంటనే కుమారస్వామి నెమలి వాహనం ఎక్కి వాయు వేగంగా వెళ్లాడు. అంత గజాననుడు ఖిన్నుడై, తండ్రిని సమీపించి ప్రణమిల్లి ‘‘అయ్యా! నా అసమర్థత మీకు తెలిసి కూడా ఈ పరీక్ష తగునా! నీ పాదసేవకుడను నాయందు కటాక్షించి తగు ఉపాయం తెలిపి రక్షించండి’’ యని ప్రార్థించాడు. అప్పుడు మహేశ్వరుడు దయతో, ‘‘కుమారా! ఒకసారి నారాయణ మంత్రం పఠించు’’ మని ఆ నారాయణ మంత్రాన్ని ఉపదేశించాడు. ‘‘సకృత్ నారాయణేత్యుక్త్యాపుమాన్ కల్పశతత్రయం గంగాది సర్వతీర్థేషు స్నాతో భవతి పుత్రక’’ అంత గజాననుడు సంతోషించి, అత్యంత భక్తితో ఆ మంత్రం జపిస్తూ తల్లిదండ్రులకు మూడుసార్లు ప్రదక్షిణలు చేస్తూ కైలాసాన ఉన్నాడు. ఆ మంత్ర ప్రభావంతో∙అంతకు పూర్వం గంగానదికి స్నానానికి వెళ్లిన కుమారస్వామికి తన అన్న గజాననుడు ఆ నదిలో స్నానమాడి తన కెదురుగా వస్తున్నట్లుగా కనిపించాడు. ఆ విధంగా అతడు మూడు కోట్ల యాభై లక్షల నదులలో కూడా అలాగే చూసి ఆశ్చర్యపడుతూ, కైలాసానికి వెళ్ళి తండ్రి సమీపంలోవున్న గజాననుని చూసి, నమస్కరించి, తన బలాన్ని నిందించుకుని ‘‘తండ్రీ! అన్నగారి మహిమ తెలియక అట్లా అన్నాను. క్షమించు. ఈ ఆధిపత్యంబు అన్నగారికే ఇవ్వండి’’ అని ప్రార్థించాడు. అంత పరమేశ్వరునిచే భాద్రపదశుద్ధ చతుర్థినాడు గజాననుడు విఘ్నాధిపత్యం స్వీకరించడం ద్వారా విఘ్నేశ్వరునిగా కీర్తింప బడుతున్నాడు. ఆనాడు సర్వదేశస్తులు విఘ్నేశ్వరుని తమ విభవముల కొలది కుడుములు, అప్పాలు మున్నగు పిండివంటలు, టెంకాయలు, పాలు, తేనె, అరటి పండ్లు, పానకం, వడపప్పు మొదలగునవి సమర్పించి పూజించగా, విఘ్నేశ్వరుడు సంతోషంతో కుడుములు మొదలైనవి భుజించి, కొన్ని తన వాహనమైన ఎలుకకు ఇచ్చి, కొన్ని చేత ధరించాడు. భుక్తాయాసంతో సూర్యాస్తమయం వేళకు కైలాసానికి వెళ్ళి తల్లిదండ్రులకు వంగి నమస్కారం చేయబోయాడు. ఎంత ప్రయత్నించినా, ఉదరం భూమికి ఆని, చేతులు భూమికి అందటం లేదు. ఈ విధంగా ప్రణామం చేయడానికి శ్రమిస్తుండగా శివుని శిరస్సున అలంకరించి వున్న చంద్రుడు చూసి వికటంగా నవ్వాడు. అంత ‘రాజదృష్టి’ సోకిన రాలుకూడ నుగ్గగును అన్న సామెత నిజమగునట్లు విఘ్నదేవుని ఉదరం పగిలి అందున్న కుడుములు తదితరములన్నియు బయటకు దొర్లిపోయాయి. అతడు మృతుడయ్యాడు. పార్వతి శోకిస్తూ చంద్రుని చూసి, ‘‘పాపాత్ముడా! నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించెను కావున, నిన్ను చూసినవారు పాపాత్ములై నీలాపనిందలు పొందుదురు గాక’’ అని శపించింది. చంద్రునికి కలిగిన శాపం లోకానికి కూడా శాపమైంది. ఆ సమయంలో సప్తమహర్షులు యజ్ఞం చేస్తూ తమ భార్యలతో అగ్నిప్రదక్షిణం చేస్తున్నారు. అగ్నిదేవుడు ఋషి పత్నులను చూసి మోహించాడు, కానీ ఋషులు శపిస్తారని భయపడ్డాడు. ఈ విషయం గ్రహించిన అగ్నిదేవుని భార్య స్వాహాదేవి ఒక్క అరుంధతీ రూపం తప్ప తక్కిన ఋషిపత్నుల రూపాలను తానే ధరించి పతికి ప్రియంబు చేసెను. ఇది చూసిన ఋషులు అగ్నిదేవునితో వున్నవారు తమ భార్యలేయని శంకించి తమ భార్యలను విడనాడారు. పార్వతీ శాపానంతరం ఋషిపత్నులు చంద్రుని చూడడం వల్ల వారికి అటువంటి నీలాపనింద కలిగిందన్నమాట. ఋషిపత్నుల యాపద పరమేష్టికి విన్నవించుకొన్న పిదప ఆయన సర్వజ్ఞుడగుటచే అగ్నిహోత్రుని భార్య (స్వాహాదేవి)యే ఋషిపత్నుల రూపము దాల్చివచ్చుట తెలియపరచి సప్తఋషులను సమాధాన పరచాడు. వారితో కూడా బ్రహ్మ కైలాసానికి వెళ్ళి, ఉమామహేశ్వరుల సేవించి మృతుడై పడియున్న విఘ్నేశ్వరుని బ్రతికించి ముదంబు గూర్చె. అంత దేవాదులు, ‘‘ఓ పార్వతీదేవి! నీవిచ్చిన శాపం వలన లోకములకెల్ల కీడు వాటిల్లుతోంది. దానిని ఉపసంహరింపు’’మని ప్రార్థించగా, పార్వతీదేవి అంగీకరించి, ‘‘ఏ రోజున విఘ్నేశ్వరుని చూసి చంద్రుడు నవ్వాడో, ఆ రోజున చంద్రుని చూడరాదు’’ అని శాపానికి ఉపశమనం చెప్పాడు. అంత బ్రహ్మాదులు çసంతోషించి తమ గృహాలకు వెళ్లి భాద్రపదశుద్ధ చతుర్థియందు మాత్రం చంద్రుని చూడకుండ జాగ్రత వహించి సుఖంగా ఉన్నారు. యదువంశమునందు సత్రాజిత్తు, ప్రసేనుడు అను సోదరు లుండిరి. వారు నిఘ్నని కుమారులు. సత్రాజిత్తునకు సూర్యభగ వానుడు మిత్రుడు. ఒకనాడు సత్రాజిత్తు సూర్యభగవానుని స్తుతించెను. తదేక మనస్కుడై సత్రాజిత్తు చేసిన స్తుతికి ప్రసన్నుడై సూర్యభగవానుడు అతనికి ప్రత్యక్ష మయ్యెను. అంతట సత్రాజిత్తు సూర్యునకు ప్రణామములు చేసి స్తుతించెను. ప్రసన్నుడైన సూర్యుడు వరమును కోరుకొనమనెను. అంతట సత్రాజిత్తు సూర్యుని నుండి ‘‘శ్యమంతకమణి’’ని కోరెను. అది విని సూర్యభగవానుడు శ్యమంతకమణిని తన కంఠం నుండి తీసి సత్రాజిత్తునకు ఇచ్చాడు. ఆ సమయాన సూర్యుడు సత్రాజిత్తుతో ఆ దివ్యమణిని పవిత్రుడై ధరించినచో ప్రతిదినమా మణి ఎనిమిది బారువుల బంగారాన్ని అనుగ్రహిస్తుంది. ఆ మణి ఉన్న దేశంలో అనావృష్టి, ఈతి బాధలు, అగ్ని, వాయు, విషక్రిముల వల్ల ఉపద్రవాలు, దుర్భిక్షం మొదలగునవి ఉండవు. కానీ అశుచిౖయె ధరిస్తే అది ధరించిన వానిని చంపుతుంది’’ అని చెప్పాడు. ఈ విషయాలను తెలిసికొని, సత్రాజిత్తు సూర్యుని నుండి మణిని గ్రహించి, ధరించి, పురవీధులలో నడిచి వస్తుండగా చూసిన పౌరులు దాని కాంతికి భ్రమించి సూర్యభగవానుడే శ్రీకృష్ణదర్శనమునకై వస్తున్నాడని భావించి, ఆ విషయం శ్రీ కృష్ణునకు తెలియజేశారు. శ్రీకృష్ణుడు అట్టి రత్నం ప్రభువు వద్ద ఉంటే దేశాభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి ఉపయోగపడుతుందని ఆ మణిని ప్రభువైన ఉగ్రశేనునికి ఇప్పించాలనుకున్నాడు. అది తెలిసిన సత్రాజిత్తు ఆ దివ్యమణిని తన తమ్ముడైన ప్రసేనుడికిచ్చాడు. ప్రసేనుడు ఆ మణిని ధరించి వేటకై అరణ్యానికి వెళ్లాడు. కొంత సమయానికి శరీర శోధన కారణంగా ప్రసేనుడు అశౌచాన్ని పొందాడు. ఈ కారణంతో ప్రసేనుడు సింహం దాడిలో మరణించాడు. ఆ సింహాన్ని జాంబవంతుడను భల్లూకం సంహరించి మణిని తీసుకొనిపోయి దానిని గూహలో ఊయలలోనున్న తన కుమారునకు ఆట వస్తువుగా ఇచ్చింది. ఆ పిల్లవాని పేరు సుకుమారుడు. ప్రసేనుడు అరణ్యంలోనికి వేటకై వెళ్ళినపుడు శ్రీ కృష్ణుడు కూడా వేటకై వెళ్ళివున్నాడు. ఆనాడు భాద్రపద శుక్ల చవితి. ప్రదోషవేళలో ప్రసేనుడు సంహరింపబడ్డాడు. వానికోసం అడవిలో శ్రీకృష్ణుడు వెదుకుతూ తలెత్తి చూడగా ఆకాశాన శుక్లపక్ష చవితినాటి చంద్రబింబం కనపడ్డాడు. చీకట్లు బాగుగా ముసురుకున్న కారణముచే శ్రీ కృష్ణుడు తన మందిరానికి తిరిగి వచ్చాడు. దానికి పూర్వం, దేశ ప్రయోజ నాల కొరకై ఆ మణిని శ్రీకృష్ణుడు కోరిన కారణం వల్ల, అతడే ప్రసేనుని చంపి మణిని అపహరించిందని సత్రాజిత్తు, పౌరులు భావించారు. అంతట ఆ అపవాదును పోగొట్టు కోవాలనే సంకల్పంతో శ్రీకృష్ణుడు మరునాడు సపరివారంగా అడవిలో వెదుకగా ఎముకలు, చిరిగిన బట్టలు, తెగిపడిన ఆభరణములు కనబడెను. శ్యమంతకమణి మాత్రము దొరకలేదు. కాని కృష్ణుని వెంట వచ్చిన సత్రాజిత్తు సన్నిహితులు, కృష్ణుడే ముందటి రోజు ప్రసేనుని సంహరించి, శ్యమంతకమణిని అపహరించెనని, రాత్రివేళ సింహం ప్రసేనుని, అతని గుర్రాన్ని తిని ఉంటుందని నిష్టూరంగా పలికారు. ఈ అపవాదు నుండి తప్పించు కొనుటకై శ్రీ కృష్ణుడు మరింత ప్రయత్నం ప్రారంభించాడు. కొంత దూరం వెళ్ళగా అచట సింహపు కళేబరము కనబడెను. అచ్చటినుండి భల్లూకపు పాదముద్రలు కనబడెను. వాని ననుసరించి వెళ్ళి ఒక గుహలోనికి ప్రవేశించెను. అచ్చట యవ్వనమునందున్న ఒక యువతి ఊయలలో çపడుకున్న బాలుని ఊపుచుండెను. ఊయలపై ఆటవస్తువుగా శ్యమంతకమణి కట్టబడి ఉండెను. ఊయల ఊపుచున్న ఆ ఆమెయే జాంబవతి. ఆమె కృష్ణుని చూచి ఆయన సౌందర్యమునకు వశపడి, బహుశః ఆయన శ్యమంతకమణికై వచ్చెనని భావించి, గట్టిగా మాట్లాడినచో తనతండ్రి జాంబవంతుడు వచ్చి శ్రీకృష్ణునకేమైనా ఆపద కల్పించునేమోనని భయపడి, పాటపాడుచున్న దానివలె ఆ శ్యమంతకమణి వచ్చిన విధమునిట్లు చెప్చెను. శ్లో‘‘ సింహః ప్రసేనమవధీః సింహో జాంబవతాహతాః సుకుమారక మారోధీః తవ హ్యేష శ్యమంతకః (తా‘‘ ప్రసేనుని వధించిన సింహమును జాంబవంతుడు వధించి, శ్యమంతకమణిని తెచ్చెను. ఓ సుకుమారుడా! ఈ మణి నీకే ఏడవకుము.) అంతలో లోపల నిద్రించుచున్న జాంబవంతుడు లేచి వచ్చి, శ్యమంతకమణి కొరకై వచ్చెనని శంకించి శ్రీకృష్ణునితో ద్వంద్వ యుద్ధమునకు తలపడెను. ఆ కృష్ణుడే రామావతార కాలమున జాంబవంతునికి చిరంజీవిగా వరమిచ్చెను. ఆ కాలమున జాంబవంతునకు రాముని ఆలింగన మొనర్చు కొనవలెనని కోర్కె ఉండెడిది. కాని కృష్ణుడు ఆ కోర్కెనిప్పుడు తీర్చుటకై జాంబవంతునితో ఇరవైయొక్క (21) రోజుల పాటు యుద్ధమొనర్చెను. క్రమంగా జాంబవంతుని బలం క్షీణించసాగింది. అప్పుడు తనతో యుద్ధం చేస్తున్నది ఎవరో కాదు త్రేతాయుగంలో రావణాసురుని సంహరించిన శ్రీరామచంద్రుడే అని గ్రహించాడు. వెంటనే చేతులు జోడించి ‘‘దేవాదిదేవ! ఆర్తజనరక్ష! నిన్ను త్రేతాయుగంలో భక్తజనపాలకుడైన శ్రీరామచంద్రునిగా గుర్తించాను. ఆ జన్మంలో నీవు నామీద అభిమానంతో కోరిక కోరమంటే నేను తెలివితక్కువగా మీతో ద్వంద్వయుద్ధం చేయాలని కోరుకున్నాను. నీవు ముందు ముందు నా కోరిక తీరుతుందన్నావు. అప్పటినుంచి నీ నామస్మరణ చేస్తూ నీకోసం ఎన్నో యుగాలుగా ఎదురు చూస్తున్నా. నా ఇంటికే వచ్చి నా కోరిక నెరవేర్చావు. ధన్యుడను స్వామీ! నా అపచారమును మన్నించి నన్ను కాపాడు’’ అంటూ పలువిధాల అభ్యర్థించాడు. శ్రీకృష్ణుడు దయతో జాంబవంతుని శరీమంతా తన చేతితో నిమిరి ‘‘జాంబవంతా! శ్యమంతకమణి అపహరించా నన్న నింద నాపై వచ్చింది. దాని రూపుమాపుకొనుటకు వచ్చాను. నువ్వు ఆ మణి ఇస్తే వెళ్ళివస్తాను’’ అన్నాడు. జాంబవంతుడు సంతోషంగా శ్యమంతకమణితో పాటుగా తన కుమార్తె ఆయిన జాంబవతిని శ్రీ కృష్ణునికిచ్చి సాగనంపాడు. ద్వారాకానగర పౌరులకు ఈ సత్యం తెలిపి, శ్రీకృష్ణుడు శ్యమంతకమణిని సత్రాజిత్తునకిచ్చివేసెను. అప్పుడు సత్రాజిత్తు తన తప్పు తెలిసికొన్నాడు. శ్రీ కృష్ణుని క్షమింపమని ప్రార్థించి, తన కన్యారత్నమైన (కుమార్తె) సత్యభామను, మణిరత్నమైన శ్యమంతకమణిని గోపాలరత్నమైన శ్రీకృష్ణునకు సమర్పించాడు. శ్రీకృష్ణుడు భూదేవి అవతారమైన సత్యభామను గ్రహించి శ్యమంతకమణి సత్రాజిత్తునకే తిరిగి ఇచ్చివేసెను. ఈలోగా పాండవులు, కుంతీదేవి, లక్క ఇంటిలో కాలి మరణించి నారని వార్త వచ్చెను. శ్రీ కృష్ణునకు వారు సజీవులై ఉన్నారని తెలిసి నప్పటికీ, కుటుంబ పెద్ద అయిన ధృతరాస్ట్రుని అనునయించుట, లౌకిక మర్యాదగా భావించి, హస్తినాపురమునకు వెళ్ళెను. యాదవుల యందే శతధన్వుడు, కృతవర్మ, అక్రూరుడను ముగ్గురు ప్రముఖు లుండెడివారు. సత్యభామను శ్రీకృష్ణునకిచ్చి పరిణయము చేయుటకు పూర్వము, వీరు ముగ్గురు ఆమెను తమకిచ్చి వివాహము చేయమని సత్రాజిత్తునడిగిరి. వారిలో ఒకరికి సత్యభామ నిత్తునని సత్రాజిత్తు వాగ్దాన మొనర్చెను. కానీ అనుకోని పైన పరిణామములతో సత్యభామను శ్రీకృష్ణునకిచ్చి వివాహం జరిపెను. దానిచే కక్ష పెంచుకొనిన ఈ ముగ్గురు, ఏకమై కృష్ణుడు లేని సమయమెరిగి, సత్రాజిత్తును సంహరించి శ్యమంతకమణిని అపహరింపమని శతధన్వుని ప్రేరేపింపగా, అతడట్లే చేసి ఆ మణిని అక్రూరుని వద్ద వదలి పారిపోయాడు, ఇది తెలిసి శ్రీ కృష్ణుడు హస్తినాపురం నుండి వచ్చి, సత్యభామను ఓదార్చి శతధన్వుని సంహరించుటకై బలరామునితో కలిసి రథంలో బయల్దేరెను. గుర్రంపై పారిపోవుచున్న శతధన్యుడు, అది అలసి పడిపోగా, దానిని వదిలి పరుగిడుచుండెను. అంతట కృష్ణుడు బలరాముని రథమందుండమని, తాను దిగి శతధన్వుని వెంబడించి, పట్టి ద్వంద యుద్దంలో అతనిని సంహరించి ఒడలంతయు వెదుకగా, మణి దొరకదయ్యే అంతట కృష్ణుడు తిరిగి వచ్చి బలరామునకా విషయము తెలుపగా, అతుడు కృçష్ణునితో నీవు బాల్యమునుండియూ చోరుడవు, ఇప్పుడు ఆ మణిని నేనడిగెదనని శంకించి, దానిని దాచివైచి నీవిట్లు చెప్పుచున్నావని శ్రీ కృష్ణుని నిందించి, నీతో కలిసి యుండనని, విదేహ రాజ్యమునకు వెడలిపోయాడు. బాహ్యశౌచము లేక మణిని ధరించి ప్రసేనుడు మరణించెను. అంతఃశౌచము లేక (శ్రీకృష్ణుని అనుమానించుటచే) సత్రాజిత్తు మరణించెను. పరమ భక్తుడైనప్పటికినీ, తాత్కాలికంగా భగవద్విరోధ భావమునొందిన అక్రూరుడు మనఃశాంతికై తీర్థయాత్ర చేయుచూ, కాశీ పట్టణమునకు చేరెను. అచ్చటికి పోగానే మనఃశాంతిని పొంది శ్యమంతకమణి వలన ప్రతిదినము వచ్చు బంగారమును ధైవకార్య ములకు ఉపయోగించెను. అక్రూరుడు బాహ్యభ్యంతర శౌచమును పొంది యుండుటచే అచ్చట అతివృష్టి, అనావృష్టి రోగబాధలు లేక ప్రశాంతముగా వుండెను. ఇచ్చట శ్రీ కృష్ణుడు బలరామునిచే నిందింపబడి ఒక్కడే తిరిగి ద్వారక నగరమునకు చేరెను. ఈ మణి విషయమై తమ దండ్రులకు కీర్తి కలుగరాదని శ్రీకృష్ణుడు ఏదో మాయ చేసెనని, జాంబవతి, సత్యభామలు అనుమానించిరి. శ్రీకృష్ణుడు ఈ అపనిందలకు కారణమేమిటాయని విచారవదనంతో ఆలోచించుచుండగా నారదుడు ప్రతక్షమై ఆ అపనిందలకు కారణం భాద్రపద శుక్ల చవితినాటి రాత్రి వేటకై అడవికి వెళ్ళినపుడు చంద్రుని చూచుటయేయని, ఆ విశేషముల గురించి ఇట్లు చెప్పెను. శశివర్ణుడను పేరుగల మహాగణపతి, అన్ని లోకములలో విహరించుచూ ఒకనాడు చంద్రలోకమునకు చేరెను. బాహ్యమున వినాయకుడు మరుగుజ్జు, లంబోదరుడు, అయినప్పటికీ హృదయ మున మిక్కిలి కారుణ్యమూర్తి. కానీ చంద్రుడు పైకి అందగాడైనప్పటికీ, కవులచే వర్ణింపబడి నప్పటికీ నడవడియందు దోషములున్నవాడు. అట్టి చంద్రుడు వినాయకుని చూచి వికటముగా నవ్వెను. అప్పుడు చంద్రుని అహంకారమును తగ్గించుటకై వినాయకుడు, ఎవ్వరేని చంద్రుని చూసినచో అపనిందలు పొందెదరని శపించెను. దానిచే జనులెవ్వరు చంద్రుని చూడరైరి. దానితో కుంగినవాడై చంద్రుడు తాను జన్మించిన క్షీరసాగరములోనికి వెళ్ళిపోయెను. చంద్రకాంతిలేమిచే ఓషదులు ఫలించుట మానెను. ప్రజలకు ఆహ్లాదము కరువైంది. దీనితో దయతలిచి, దేవతలు, ఋషులు, బ్రహ్మగారి వద్దకు పోయి నివారణోపాయం కొరకు ప్రార్థించిరి. అంతట బ్రహ్మ భాద్రపద శుక్ల చవితినాడు నక్తవ్రత మొనరింపవలెననీ (పగటి ఉపవాసము) విఘ్నేశ్వరుని పూజించి, మోదకములు, (ఉండ్రాళ్ళు,), పండ్లు, కుడుములు, ప్రత్యేకించి దోసపండు నివేదన మొనరింపవలెనని సూచించాడు. అప్పుడు చంద్రుడు కూడా ఆ వ్రతమొనర్చి వినాయకుని అనుగ్రహాన్ని పొందాడు. అంతట వినాయకుడు, ఒక్క తన అవతారదినమైన భాద్రపద శుక్ల చవితినాటి రాత్రి తప్ప మిగిలిన రోజులలో చంద్రుని చూచినను ఎట్టి నిందలు కలగవని శాపావకాశమిచ్చెను. అంతట భాద్రపద శుక్ల చవితినాటి చంద్రబింబము చూచుటవలన జరిగిన విపరీతాలను స్వయంగా అనుభవించిన శ్రీకృష్ణ పరమాత్మ తనకు కలిగిన నిందలను పోగొట్టుకొనుటకై నారదుని సలహా మేరకు శ్రీకృష్ణుడు వినాయక వ్రతమాచరించాడు. వెంటనే వినాయకుడు ప్రత్యక్షమై శ్రీ కృష్ణునికి వచ్చిన అపనిందలు తొలగిపోవునని మంగళవాక్కులు పలికాడు. అంతట శ్రీ కృష్ణుడు తాను సమర్థతతో ఇంత కష్టపడితిని గాని, సామాన్యులకది ఎట్లు సాధ్యమగుననీ, కావున లోకమంతటినీ అనుగ్రహించమని కోరాడు. భాద్రపద శుక్ల చవితినాడు ఉదయం తనను ఫూజించి, శ్యమంతకోపాఖ్యానమును చదివిన మరియు విన్నా, చంద్రుని చూచిననూ ఎటువంటి అపనిందలు కలగవని వినాయకుడు వరమిచ్చెను. ఈ వృత్తాంతంలో దేవతలు, మహర్షులు, ప్రజలెల్లరు వినాయకుని యథాశక్తి పూజించి, కోర్కెలు నెరవేర్చుకుంటూ సుఖంగా వున్నారని సూతమహాముని శౌనకాదిమునులతో ఈ వృత్తాంతం తెలిపెను. దీనిలో ఏ మాత్రం ఏమరుపాటు తగదని శ్యమంతకోపా ఖ్యానంలో శ్రీకృష్ణపరమాత్మ వృత్తాంతం ద్వారా స్పష్టమైనది. అందువలన ఈ శ్యమంతోకాపాఖ్యానాన్ని అంటే అందులో హితబోధను చెప్పుకొని గణేశతత్వంపట్ల భక్తి, వినయాలతో శిరమున అక్షతలు ధరించినయెడల చవితి చంద్రుని చూచి ననూ నిష్కారణంగా నిందాభయం ఉండదని లోకులకు వరము ఇచ్చినారు. అది మొదలు శ్యమంతోకాపాఖ్యానము గాథను చదువుట, వినుట సాంప్రదాయమైనది. ద్వారకా నగరమునందు కలిగిన క్షామ నివారణకు మాహా భక్తుడైన అక్రూరుని రాక అవసమని భావించి, శ్రీ కృష్ణుడు అక్రూరునకు కబురుపంపెను. పరమభక్తుడైన అక్రూరుడు ద్వారక నగరమునకు వచ్చుటచే, అందరికి శ్యమంతకమణి వృత్తాంతము తెలిసి శ్రీకృష్ణుని పై వచ్చిన అపనిందలు తొలగిపోయినవి. లోపల, బయట, శౌచము కల అక్రూరుని వద్ద శ్యమంతకమణి శుభ పరంపర లిచ్చుచూండెను. ‘‘మంగళం మహత్’’ చేతిలో వున్న అక్షతలను కొన్ని విఘ్నేశ్వరుని పాదాల చెంత కొన్ని వుంచి కొన్ని మీ శిరస్సుపై వేసుకొని మిగిలినవి మీ పిల్లల శిరస్సుపై వేసి దీవించవలెను. – కథ సమాప్తం – తదుపరి: Ganesh Chaturthi 2022: వరసిద్ధి వినాయక పూజ, విఘ్నేశ్వరుని కథ, పునః పూజ (క్లిక్) -
చవితి పండుగపై ఏ ఆంక్షలూ లేవు.. తప్పుడు సమాచారంపై వెలంపల్లి శ్రీనివాస్ ఫైర్
సాక్షి, అమరావతి: వినాయక చవితి నిర్వహణపై ప్రభుత్వం ఏ ఆంక్షలూ విధించలేదని మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ స్పష్టంచేశారు. పైగా, గణేష్ మండపాల అనుమతిని సులభతరం చేశామని తెలిపారు. గతంలో అగ్నిమాపక, పోలీసు, విద్యుత్ శాఖలు, మున్సిపల్ కార్పొరేషన్ నుంచి అనుమతి కోసం వేర్వేరుగా దరఖాస్తు చేయాల్సి వచ్చేదన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక సింగిల్ విండో విధానాన్ని తెచ్చిందని తెలిపారు. మండపాల రుసుము ఒక్క రూపాయి కూడా పెంచలేదన్నారు. గత ప్రభుత్వ నిబంధనలే అమలు చేస్తున్నామని చెప్పారు. పైగా గత టీడీపీ ప్రభుత్వంలో 250 వాట్స్ వరకు విద్యుత్ వినియోగానికి రూ.1,000 చెల్లించాల్సి వచ్చేదని, ఇప్పుడు దాన్ని రూ.500కు తగ్గించామని చెప్పారు. టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన సోమవారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. వినాయక చవితిపై ప్రభుత్వం నిబంధనలు విధించిందంటూ టీడీపీ ఆఫీసు నుంచి సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని పోస్టు చేస్తున్నారని చెప్పారు. వాటన్నింటిపై దేవదాయ శాఖ మంత్రి, డీజీపీ, అధికారులు కూడా వివరణ ఇచ్చారని తెలిపారు. అయినా సోము వీర్రాజు, టీడీపీ నేతలు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని చెప్పారు. టీడీపీ ఆఫీస్ స్క్రిప్టును సోము వీర్రాజు, ఇతర బీజేపీ నేతలు మాట్లాడటం దుర్మార్గమన్నారు. దేవుడి పేరుతో రాజకీయం చేస్తే పుట్టగతులుండవని హెచ్చరించారు. చీకట్లో ఆలయాలను ధ్వంసం చేసిన నీచ చరిత్ర ఆనాటి టీడీపీ, బీజేపీ, జనసేన మిత్రపక్షానిదని అన్నారు. ఆలయాలు కూల్చి, విగ్రహాలను ధ్వంసం చేసి, రథాలు తగులబెట్టే వారికి దేవుడి గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. పార్టీల నేతలకు చెప్పారు. నిందలు మానాలి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో విపక్షాలకు దిక్కుతోచడం లేదని చెప్పారు. అసలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇలాంటి పథకాలు ఏమైనా అమలు చేస్తున్నారా అని ప్రశ్నించారు. సోము వీర్రాజు వాస్తవాలు గ్రహించి, ప్రభుత్వంపై నిందలు మానాలని చెప్పారు. కులం, మతం, వర్గం, రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సీఎం జగన్‌ను ఒక మతానికి పరిమితం చేయొద్దని కోరారు. -
గజముఖాసుర వధ
వజ్రదంతుడిగా పేరుమోసిన మూషికాసురుడు వినాయకుడి చేతిలో చావుదెబ్బలు తిన్నాడు. వినాయకుడు తోక పట్టుకుని విసిరితే పడ్డ పాటుకు ఒళ్లునొప్పులు తీరక ముక్కుతూ మూలుగుతూ ఉన్నాడు. అలాంటి సమయంలో నారదుడు కైలాసం నుంచి నేరుగా మూషికాసురుడి దగ్గరకు వచ్చాడు. మూలుగుతూనే నారదుడికి ఉచితాసనాన్ని చూపించాడు మూషికాసురుడు. నారదుడు సుఖాసీనుడై, ‘వజ్రదంతా! నిన్ను దారుణంగా పరాభవించిన వినాయకుడు గణాధిపతిగా వర్ధిల్లుతున్నాడు మరి...’ అంటూ అర్ధోక్తిలోనే ఆగిపోయాడు. పుండు మీద కారం చల్లినట్లయింది వజ్రదంతుడికి. ‘ఇప్పుడేం చెయ్యమంటావు నారదా?’ ఉక్రోషంగా అడిగాడు.‘వరాల దేవుడు మా తండ్రి బ్రహ్మదేవుడు ఉండనే ఉన్నాడు కదా! ఆయన కోసం తపస్సు చెయ్యి. ప్రతీకారం సాధించు’ అని చెప్పి, చల్లగా అక్కడి నుంచి నారాయణ నామస్మరణ చేస్తూ నిష్క్రమించాడు. భార్య ధవళ ఎంతగా వారిస్తున్నా వినిపించుకోకుండా, ఉన్నపళాన బయలుదేరాడు వజ్రదంతుడు. ఒక కీకారణ్యంలోకి చేరుకుని ఘోరమైన తపస్సు ప్రారంభించాడు. బ్రహ్మదేవుడు ప్రసన్నుడయ్యాడు. వజ్రదంతుడి ముందు ప్రత్యక్షమయ్యాడు. ‘ఏం కావాలో కోరుకో’ అన్నాడు. ‘విఘ్నానికి రూపం కల్పించి, నా ఆజ్ఞానువర్తిగా చెయ్యి’ అడిగాడు వజ్రదంతుడు.‘తథాస్తు’ అన్నాడు బ్రహ్మదేవుడు. విఘ్నాన్ని ఆవాహన చేసి, వజ్రదంతుడి ముందు నిలిపాడు. అతడికేమీ కనిపించలేదు. బ్రహ్మ అతడికి సూక్ష్మదర్శన దృష్టిని అనుగ్రహించాడు. అప్పుడు అతిచిన్న నలుసు రూపంలో ఉన్న విఘ్నాన్ని చూడగలిగాడు వజ్రదంతుడు. నల్లని ఆ నలుసును చూసి, ‘ఈ నలుసును నేనేం చేసుకోను?’ అని ఆశ్చర్యంగా బ్రహ్మను అడిగాడు. ‘విఘ్నబీజం కంటికి కనిపించదు. ఇది కామరూపి. ఏ రూపమైనా ధరించగలదు. ఎంతటి అనర్థాన్నయినా సృష్టించి, లోకాలను అల్లకల్లోలం చేయగలదు. దీన్ని ఏం చేసుకుంటావో చేసుకో!’ అని చెప్పి బ్రహ్మదేవుడు అదృశ్యమైపోయాడు. మూషికాసురుడు విఘ్నంతో ‘నువ్వు మహా గజముఖాసుర రూపం దాల్చి వెళ్లి వినాయకుణ్ణి నాశనం చెయ్యి’ అని ఆజ్ఞాపించాడు. అప్పుడే వినాయకుడు కైలాసం నుంచి తాను పుట్టిపెరిగిన విశ్వకర్మ నిర్మించిన భవంతికి చేరుకున్నాడు. అక్కడ సింహద్వారం ఎదుట చంద్రశిలా వేదికపై తీరికగా కూర్చుని, ప్రశాంతంగా పరిసరాలను తిలకిస్తూ సేదదీరుతున్నాడు. అలాంటి సమయంలో ‘వినాయకుడెక్కడ?’ అంటూ భీకర గర్జన వినిపించింది. మహా గజముఖాసుర రూపంలో విఘ్నం వినాయకుడి ఎదుట వాలింది. ‘నువ్వు గజముఖుడివైతే, నేను మహా గజముఖాసురుణ్ణి. నిన్ను చంపవచ్చాను. చంపితీరుతాను’ అంటూ హూంకరించాడు. వినాయకుడు ఆ మాటలు వినిపించనట్లే అమాయకంగా చూస్తూ, ‘అబ్బాయ్! ముక్కలు నరుక్కుని చెరుకుగడ తినాలనుంది. నా గొడ్డలి కాస్త పదునుపెట్టి ఇస్తావంటే నీకు కుడుములు పెడతాను’ అంటూ వాటంగా చేతిలోని పరశువును అతడికేసి విసిరాడు. దెబ్బకు కాళ్లుతెగి, గజముఖాసురుడు పర్వతంలా కుప్పకూలిపోయాడు. ‘మహాప్రభో! నేను విఘ్నాన్ని. వజ్రదంతుడైన మూషికాసురుడికి బ్రహ్మ ఇచ్చిన వరం వల్ల నేను ఈ రూపంలో నీ ముందుకొచ్చాను. తగిన శాస్తి జరిగింది. రక్షించు’ అంటూ గావుకేకలు పెట్టాడు. ‘నేను విఘ్ననాశకుణ్ణి. నిన్ను తుత్తునియలు చేయక తప్పదు. నీ తునకలు నన్ను, నిన్ను ఏమార్చిన వాళ్లనే పట్టి పీడిస్తాయి’ అంటూ విఘ్నాన్ని సూక్ష్మతి సూక్ష్మ ఖండాలుగా చెండాడాడు వినాయకుడు. -
తప్పుడు ప్రచారంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తాం: కొట్టు సత్యనారాయణ
-
Hyderabad: వినాయకుడి ఊరేగింపు ఉత్సవాలు.. ఈ నియమాలు తప్పనిసరి!
సాక్షి, హైదరాబాద్: పల్లె, పట్నం, చిన్నా పెద్ద తేడా లేకుండా అందరూ ఎదురు చూస్తున్న వినాయక చవివి రానే వచ్చింది. ఆగస్టు 31 నుంచి చవితి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.భక్తులు మండపాల ఏర్పాటు, విగ్రహాల కొనుగోళ్లలో నిమగ్నమయ్యారు. మండపాలు ఏర్పాటు, పూజలు, ఊరేగింపు, నిమజ్జనం తదితర అంశాల్లో జాగ్రత్తలు పాటిస్తే నవరాత్రులు విజయవంతమైనట్లే, విఘ్నేశ్వరుడి ఆశీస్సులు లభించినట్లే. ఈ నేపథ్యంలో ఉత్సవాల్లో పాటించాల్సిన అంశాలపై ప్రత్యేక కథనం. రాకపోకలకు భంగం కలిగించొద్దు... వినాయక మండపాలు ఏర్పాటు చేసే సమయంలో సామాన్యులకు ఇబ్బందులు కలగకుండా చూడాలి. రహదారి మధ్యలో మండపాలు నిర్మిస్తే వాహనాల రాకపోకలు, ఇతర ఇబ్బందులు ఎదురవుతాయి. ఖాళీ స్థలాల్లో మండపాలు ఏర్పాటు చేసుకోవాలి. విగ్రహాల పరిమాణం.. విగ్రహాల పరిమాణం చిన్నగా ఉండేలా చూసుకోవాలి. లేదంటే నిమజ్జనం సమయంలో విద్యుత్ తీగలు తాకే ప్రమాదముంది. తరలించే సమయం, మండపాల స్థలాన్ని దృష్టిలో ఉంచుకొని చిన్న విగ్రహాలను ప్రతిష్టించాలి. చదవండి: తెలంగాణలో భారీగా పెరిగిన క్రైం రేటు.. దేశంలోనే నెం.1 పర్యవరణాన్ని కాపాడాలి.. రసాయనాలు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వంటి హానికరమైన వాటితో చేసిన విగ్రహాలతో నీటి కాలుష్యం ఏర్పడుతుంది. మట్టి, పీచు, సహజ సిద్ధమైన రంగులతో తయారైన విగ్రహాలను పూజించాలి. డీజేలకు పోలీసుల అనుమతి తీసుకోవాలి.. పూజా సమయంలో మాత్రమే మైకులు ఉపయోగించాలి. అనవసర సమయంలో బంద్ చేయాలి. భక్తి గీతాలు మాత్రమే వినిపింంచాలి. డీజేలు, భారీ స్పీకర్లకు పోలీసుల అనుమతి తీసుకోవాలి. వ్యయం తగ్గించాలి... మండపాల నిర్వాహకులు చందాలు డిమాండ్ చేయకుండా భక్తులు ఇచ్చింది తీసుకోవాలి. మండపాల అలంకరణ, నిమజ్జనం రోజు భారీగా ఖర్చు చేయడం కంటే అన్నదానం, పిల్లలకు వినోద, విజ్ఞానం వచ్చే అంశాల్లో పోటీలు నిర్వహించి బహుమతులు ఇచ్చి ప్రోత్సహించాలి. సాఫీగా నిమజ్జనం చేయాలి... నిమజ్జనం రోజున మద్యం సేవించి డ్యాన్స్‌లు చేస్తూ సమస్యలు సృష్టించవద్దు. చెరువుల వద్ద అధికారుల సూచనలు పాటించాలి. స్వామివారిని భక్తి శ్రద్ధలతో నిమజ్జనం చేయాలి. పోలీసులకు సహకరించాలి.. పండుగ మూలాలు తెలుసుకొని బాథ్యతగా వినాయక ఉత్సవాలను జరుపుకోవాలి. విగ్రహ ప్రతిష్ట నుంచి నిమజ్జనం వరకు ఇతరులతో పోటీ పడకుండా సాంప్రదాయాలు పాటించాలి. ప్రభుత్వ సూచనలను పాటించాలి. శాంతిభద్రతల విషయమై పోలీసులకు సహకరించాలి. – చంద్రబాబు, సీఐ ఘట్కేసర్ -
భారీగా పెరిగిన గణేష్ విగ్రహాల ధరలు
-
ఎమ్మెల్యే చెవిరెడ్డికి ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం
తిరుపతి రూరల్: ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి ప్రతిష్టాత్మక ‘ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‘లో స్థానం లభించింది. పర్యావరణ హితాన్ని కోరుతూ 1.24 లక్షల మట్టి విగ్రహాలను తయారు చేయించడంతో పాటు ప్రజలకు ఉచితంగా ఇంటింటికీ అందిస్తున్న ఆయన అవార్డుకు అర్హత సాధించారు. శనివారం తిరుపతి రూరల్ మండలం చిగురువాడ అకార్డ్ స్కూల్ ఆవరణలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ కోసం ఎమ్మెల్యే చెవిరెడ్డి చేస్తున్న కృషిని గుర్తిస్తూ ‘ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్’ సంస్థ ప్రతినిధులు అవార్డుతో పాటు గోల్డ్ మెడల్, ప్రశంసా పత్రాన్ని అందజేశారు. అంతేకాకుండా తమ సంస్థ శాశ్వత సభ్యత్వాన్ని కూడా ఉమాశంకర్ అందించారు. ఏటా కొనసాగిస్తాం: ఎమ్మెల్యే చెవిరెడ్డి దేశ చరిత్రలో ఎక్కడా లేనివిధంగా చంద్రగిరి నియోజకవర్గంలో 1.24 లక్షల మట్టి విగ్రహాలు ఎక్కడికక్కడ తయారు చేసి పంపిణీ చేస్తున్నట్టు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వివరించారు. ఏటా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామన్నారు. పదేళ్లుగా చంద్రగిరి నియోజకవర్గంలో మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా ప్రతి ఇంటికి పంపిణీ చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో తుడా వీసీ హరికృష్ణ, కార్యదర్శి లక్ష్మి, వెస్ట్ డీఎస్పీ నరసప్ప, అకార్డ్ స్కూల్ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి, డైరెక్టర్లు ప్రశాంత్, వివేక్ పాల్గొన్నారు. కాగా, ‘మట్టి వినాయకుని పూజిద్దాం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం.. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ను నిషేధిద్దాం’ అంటూ ప్లకార్డ్‌లు చేత బట్టి విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే చెవిరెడ్డితో పాటు తుడా వీసీ హరికృష్ణ ప్లకార్డులు చేతబట్టి ర్యాలీలో పాల్గొన్నారు. -
వినాయక చవితి స్పెషల్: తిరుపతి బాలాజీ స్టైల్లో 18 అడుగుల ‘స్వర్ణ గణేష్’
లక్నో: వినాయక చవితి పండగ కోసం యావత్ దేశం సన్నద్ధమవుతోంది. ఈ ఏడాది ఆగస్టు 31న గణేష్ చతుర్థి వచ్చింది. పండగ దగ్గరపడుతున్న క్రమంలో గణేషుడి విగ్రహాలు ఏర్పాటు చేసేందుకు భక్తులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఒక్కోచోట ఒక్కో విధంగా, ఒక్క రూపంలో భక్తులకు దర్శనమిస్తాడు విఘ్నేశుడు. అయితే, ఈసారి ‘స్వర్ణ గణేష్’ ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. బంగారంతో సిద్ధం చేస్తున్న 18 అడుగుల వినాయకుడి విగ్రహం వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని చందౌసి ప్రాంతానికి చెందిన కొందరు భక్తులు ఈ స్వర్ణ గణేషుడి విగ్రహాన్ని సిద్ధం చేస్తున్నారు. 18 అడుగుల విగ్రహానికి మొత్తం బంగారంతో వివిధ రకాల ఆకృతులను తాపడంగా చేస్తున్నట్లు చెప్పారు అజయ్ ఆర్యా అనే నిర్వాహకుడు. ‘గణేషుడి విగ్రహం 18 అడుగుల ఎత్తు ఉంటుంది. తిరుపతి బాలాజీ మాదిరిగా బంగారు ఆభరణాలను అలంకరిస్తున్నాం.’ అని తెలిపారు. బంగారు గణేషుడి విగ్రహం వినాయక చవితి నాటికి పూర్తవుతుందని చెప్పారు అజయ్. #WATCH | 'Swarna Ganesh' adorned with gold is being made in UP's Chandausi for Ganesh Chaturthi "It will be an 18 feet tall idol. It is being prepared with gold decorative items on the lines of Tirupati Balaji," says Ajay Arya, a person associated with the project pic.twitter.com/B5RH2eXTnh — ANI UP/Uttarakhand (@ANINewsUP) August 25, 2022 ఇదీ చదవండి: ఆవు పేడతో వినాయక విగ్రహాలు -
Hyderabad: మట్టి ప్రతిమలకే జై కొడుతున్న నగరవాసులు
సాక్షి, హైదరాబాద్: కొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న వినాయకచవితి వేడుకలకు నగరం సన్నద్ధమవుతోంది. మండపాల్లో కొలువుదీరేందుకు బొజ్జ గణపయ్య ముస్తాబవుతున్నాడు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలపై ఆంక్షలు తొలగిపోవడంతో విగ్రహాల అమ్మకాలు మొదలయ్యాయి. మరోవైపు పర్యావరణహితమైన మట్టి ప్రతిమలకే నగరం పట్టం కడుతోంది. ముఖ్యంగా ఇళ్లల్లో గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని పూజించేందుకు నగర వాసులు ఒక అడుగు నుంచి అయిదడుగుల మట్టి విగ్రహాలను ఎక్కువగా కోరుకుంటున్నారు. గతేడాది కంటే ఈసారి మట్టి విగ్రహాలకు ఎక్కువ డిమాండ్ ఉండే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, పీసీబీ వంటి ప్రభుత్వ సంస్థలు, పలు స్వచ్ఛంద సంస్థలు మట్టి ప్రతిమల పంపిణీకి సన్నాహాలు చేపట్టాయి. సుమారు 6 లక్షల విగ్రహాలు.. ఈ ఏడాది సుమారు 6 లక్షల విగ్రహాలకు డిమాండ్ ఉండే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. దీంతో ప్రైవేట్ సంస్థలు తయారు చేసే మట్టి విగ్రహాలకు సైతం డిమాండ్ భారీగా ఉండనుంది. ‘ప్లాన్ ఏ ప్లాంట్’ వంటి సంస్థలు మొలకెత్తే విగ్రహాలను అందజేస్తుండగా మరి కొన్ని సంస్థలు ఆర్గానిక్ పద్ధతిలో తయారు చేసిన ప్రకృతి ప్రతిమలను అందుబాటులోకి తెచ్చాయి. ‘బాధ్యత ఫౌండేషన్’ అనే సంస్థ స్వచ్ఛమైన పల్లె మట్టితో చేసిన వినాయక ప్రతిమలను, సేంద్రీయ పద్ధతిలో సిద్ధం చేసిన పూజా ద్రవ్యాలను అందజేస్తోంది. ఈ మట్టి విగ్రహంతో పాటే విత్తనాలు కూడా ఉంటాయి. వేడుకలు పూర్తయ్యే నాటికి మొక్కలై ఎదుగుతాయి. ప్రకృతిని ఆరాధించడమే దైవంగా భావిస్తూ గత 8 ఏళ్లుగా ఏఎస్‌రావునగర్ కేంద్రంగా ప్రకృతి వినాయకుడి ప్రతిమలను భక్తులకు అందజేస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు చంద్రశేఖర్ తెలిపారు. హైదరాబాద్‌తో పాటు ముంబై, చెన్నై, బెంగళూరు తదితర నగరాలకు, బ్రిటన్, అమెరికా, మలేషియా, తదితర దేశాలకు సైతం పెద్ద ఎత్తున విగ్రహాలను పంపించినట్లు పేర్కొన్నారు. పల్లెల్లోంచి నగరానికి.. బాధ్యత ఫౌండేషన్ అందజేసే గణపతి కిట్లు అన్నీ పూర్తిగా పల్లెల నుంచి సేకరించినవే. పల్లెల్లోని చెరువు మట్టి నుంచి ఈ ప్రతిమలను తయారు చేస్తారు. ఈ ప్రతిమలతో పాటు మట్టి పాత్రలను, ప్రమిదలను, చేనేత పూజా వస్త్రాలను, ఎలాంటి పురుగుమందులు, రసాయనాలు లేకుండా సహజమైన పద్ధతుల్లో పండించిన పెసరపప్పు, బెల్లం, పసుపు, కుంకుమ, అక్షింతలు, స్వచ్ఛమైన ఆవు నెయ్యి, 21 రకాల ఆకులను సైతం పల్లెల నుంచి సేకరించి గణపతి కిట్లను అందుబాటులోకి తెచ్చారు. 60 పేజీల వినాయక పూజా పుస్తకాన్ని అందజేస్తారు. పదకొండు రోజుల పాటు పూజలకు అవసరమయ్యే వివిధ రకాల వస్తువులు ఉంటాయి. తేనె, ఆవుపాలు, ఆకుల డొప్పలు, ఖర్జూర వంటివి కూడా ఈ కిట్‌లో ఉంటాయి. పల్లెల్లోని చేతి వృత్తులను కాపాడేందుకు సహజమైన వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రకృతి ప్రతిమలకు శ్రీకారం చుట్టినట్లు చంద్రశేఖర్ తెలిపారు. (చదవండి: ప్రీలాంచ్ మాయ ) -
Hyderabad: 9న గణేష్ నిమజ్జనం.. ఉచితంగా 6 లక్షల విగ్రహాల పంపిణీ
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 31న గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయని, వచ్చే నెల సెప్టెంబరు 9న గణేష్ నిమజ్జనం నిర్వహించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. గణేష్ ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై మంగళవారం జూబ్లీహిల్స్‌లోని ఎంసీఆర్హెచ్ఆర్డీలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో 4 లక్షలు, పీసీబీ ఆధ్వర్యంలో లక్ష, హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో లక్ష చొప్పున మొత్తం 6 లక్షల గణేష్ విగ్రహాలను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఖైరతాబాద్ గణేష్‌ను దర్శించుకునేందుకు వచ్చే భక్తులు ఇబ్బందులకు గురి కాకుండా ఆర్అండ్బీ ఆధ్వర్యంలో బారికేడ్లు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ నెల 24న అధికారులతో కలిసి ఖైరతాబాద్ గణేష్ మండపాన్ని సందర్శిస్తామన్నారు. విగ్రహాల నిమజ్జనం కోసం నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న 25 పాండ్లకు అదనంగా మరో 50 పాండ్‌ను నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు. విగ్రహాల ఊరేగింపు రహదారుల్లో అవసరమైన చోట్ల మరమ్మతులు, అభివృద్ధి పనులు చేపడతామన్నారు. సెప్టెంబరు 9న నిర్వహించే గణేష్ నిమజ్జనానికి సుమారు 8 వేల మంది జీహెచ్ఎంసీ సిబ్బంది మూడు షిఫ్ట్‌ల్లో విధుల్లో ఉంటారని చెప్పారు. గణేష్ నవరాత్రులను ప్రశాంతంగా నిర్వహించేలా సహకరించాలన్నారు. (క్లిక్: కోట్ల గొంతుకలు.. ఒక్క స్వరమై) సమావేశంలో హోంమంత్రి మహమూద్ అలీ, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎమ్మెల్సీ ప్రభాకర్‌రావు, విద్యుత్ శాఖచీఫ్ సెక్రటరీ సునీల్ శర్మ, ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవిగుప్తా, అదనపు డీజీపీ జితేందర్, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్‌కుమార్, పీసీసీబీ మెంబర్ సెక్రటరీ నీతూ కుమారి ప్రసాద్, పోలీస్ కమిషనర్లు సీవీ ఆనంద్, మహేష్ భగవత్, స్టీఫెన్ రవీంద్ర, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, కలెక్టర్ అమయ్ కుమార్, టీఎస్ఎస్పీడీసీఎల్ అధికారి రఘోత్తంరెడ్డి, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు భగవంతరావు, రాఘవరెడ్డి, ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ప్రతినిధి సుదర్శన్, సికింద్రాబాద్, గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. (క్లిక్: సందడిగా మెగా రికార్డ్స్ అవార్డుల ప్రదానోత్సవం) -
హీరో కార్తీ, అతిథి శంకర్ విరుమన్ రిలీజ్ డేట్ ఫిక్స్
సాక్షి, చెన్నై: ‘విరుమన్’ చిత్రం వినాయక చవితికి విడుదలకు ముస్తాబవుతోంది. కార్తీ కథా నాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా దర్శకుడు శంకర్ వారసురాలు అతిథి శంకర్ కథానాయికగా పరిచయం అవుతున్నారు. ముత్తయ్య దర్శకత్వంలో 2డీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై జ్యోతిక, సూర్య నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. నటుడు రాజ్‌కిరణ్, ప్రకాష్‌రాజ్, సూరి, ఆర్కే సురేష్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. ఇది కుటుంబ అనుబంధాలను ఆవిష్కరించే కథా చిత్రంగా ఉంటుందని దర్శకుడు తెలిపారు. కాగా చిత్రాన్ని వినాయక చవితి సందర్భంగా ఆగస్టు 31వ తేదీ విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ஆகஸ்ட் 31 விநாயகர் சதுர்த்திக்கு வர்றோம் #விருமன் #VirumanFromAug31@Karthi_Offl @Suriya_offl @2D_ENTPVTLTD @dir_muthaiya @thisisysr @AditiShankarofl @rajsekarpandian @prakashraaj #Rajkiran @sooriofficial @sakthivelan_b pic.twitter.com/qnr2X1NKKT — Actor Karthi (@Karthi_Offl) May 18, 2022 -
న్యూజెర్సీలో ఘనంగా గణేశ్ నిమజ్జనోత్సవం
ఎడిసన్ (న్యూజెర్సీ): అమెరికాలో హిందు ఆధ్యాత్మిక వైభవాన్ని కొనసాగిస్తున్న సాయి దత్త పీఠం, న్యూజెర్సీ ఆధ్వర్యంలో గణేశ్ నవరాత్రులు ఘనంగా జరిగాయి. తొమ్మిది రోజుల పాటు తొమ్మిది అలంకారాలతో ఆ గణనాథుడిని తీర్చిదిద్దారు. తొమ్మిది రోజుల నిత్య పూజల అనంతరం అంగరంగ వైభవంగా నిమజ్జనోత్సవం జరిగింది. డప్పు వాయిద్యాల హోరులో భక్తుల ఆనందంతో చేసిన నృత్యాలతో ఎడిసన్ వీధులు కొత్త శోభను సంతరించుకున్నాయి. న్యూజెర్సీ సాయి దత్త పీఠం నిర్వాహకులు రఘుశర్మ శంకరమంచి ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరిగాయి. తొమ్మిది రోజుల పాటు భక్తులు భారీగా హాజరై ఆ గణనాథుడి పట్ల తమ భక్తిని చాటుకున్నారు. ఎడిసన్ నడిబొడ్డున ఉన్న శివ, విష్ణు ఆలయ ప్రాంగణంలో హేరంభ పంచముఖ గణపతి కొలువై ఉన్నాడు. చదవండి : షికాగోలో వినాయక చవితి వేడుకలు -
వినాయకుడికి రూ.6 కోట్ల విలువైన 5 కేజీల బంగారు కిరీటం
ముంబై: దేశవ్యాప్తంగా ప్రజలు భక్తిశ్రద్ధలతో వినాయక చవితి పండుగ జరుపుకుంటున్నారు. కోవిడ్ కారణంగా గత ఏడాది ఉత్సవాలకు అనుమతి ఇవ్వలేదు. అయితే ప్రస్తుతం కేసులు తగ్గడంతో పలు రాష్ట్రాల్లో ఆంక్షలతో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించుకునేందుకు ప్రభుత్వాలు అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. ఇక వినాయక చవితి ఉత్సవాలు అనగానే ముందుగా ముంబై పేరు గుర్తుకు వస్తుంది. ఇక్కడ పది రోజుల పాటు అంగరంగ వైభవంగా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇక మహారాష్ట్రలో ముంబై లాల్ బాగ్చా గణేషుడు, పుణెలోని శ్రీమంత్ దగ్దుశేఖ్ హల్వాయి గణపతి మందిరాలు ఎంతో పురాతనమైనవే కాక చాలా ప్రసిద్ధి చెందినవి కూడా. (చదవండి: మీ ఇష్టం.. గణేష్ విగ్రహాల విషయంలో ఆంక్షల్లేవ్) వినాయక చవితి సందర్భంగా ముంబై, పుణె ఆలయాల్లో భారీ ఎత్తున పూజలు నిర్వహిస్తారు. ముఖ్యంగా హల్వాయి గణపతి మందిరంలో మహా భోగ్ పేరిట భారీ ఎత్తున మోదక్‌లు, మిఠాయిలు ప్రసాదంగా నివేదిస్తారు. ఈ క్రమంలో ఈ ఏడాది వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా భక్తులు హల్వాయి గణపతికి 6 కోట్ల రూపాయల విలువ చేసే 5 కిలోగ్రాముల బంగారు కిరీటాన్ని గణేషుడికి సమర్పించారు. పర్వదినం సందర్భంగా భక్తులు వినాయకుడిని కొత్త దుస్తులు, ఆభరణాలతో అలంకరించారు. అనంతరం బంగారు కిరీటాన్ని అలంకరించారు. 21 కేజీల మహాప్రసాదిన్ని నివేదించారు. (చదవండి: జైలులో భర్త.. పండగ వేడుకల్లో శిల్పాశెట్టి) ఓ వైపు కరోనా భయం.. మరోవైపు వినాయక చవితి ఉత్సవాల కారణంగా ముంబై పోలీసులు సెప్టెంబర్ 10-19 వరకు నగరంలో 144 సెక్షన్ విధించారు. బహిరంగ ప్రదేశాల్లో ఐదుగురికంటే ఎక్కువ మంది గుమికూడరాదని ఆదేశించారు. గణపతి ఊరేగింపు వేడుకలకు అనుమతి లేదని తెలిపారు. అంతేకాక జనాలు ఇళ్ల దగ్గరే వినాయక చవితి జరుపుకోవాలని సూచించారు. ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో ఆన్లైన్ దర్శనాలు ప్రారంభించారు. ప్రస్తుతం హల్వాయి గణపతి మందిరంలో కూడా హారతి కార్యక్రమాన్ని లైవ్ టెలికాస్ట్ చేశారు. చదవండి: గోమయ గణేషుడు.. ఇలా ఎందుకంటే.. -
వినాయక చవితి పర్వదినం: గణేశుని పూజలో సెలబ్రెటీలు
-
కొలువుదీరిన శ్రీ పంచముఖ రుద్ర మహాగణపతి
-
రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు: సీఎం జగన్
-
కాణిపాకం వినాయకునికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి పెద్దిరెడ్డి
సాక్షి, చిత్తూరు: కాణిపాకం వరసిద్ధి వినాయకుడిని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సమేతంగా శుక్రవారం దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరుపున మంత్రి పెద్దిరెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఎమ్మెల్యే ఎస్ బాబు, ఆలయ అధికారి వెంకటేష్.. మంత్రికి ఘన స్వాగతం పలికారు. వేదపండితులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కాణిపాకం వినాయక ఆలయంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ స్వామివారిని భక్తులు దర్శించుకుంటున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఇవీ చదవండి: మంచి పనులకు విఘ్నాలు తొలగాలి మహా గణపతిం మనసా స్మరామి... -
ప్రతి సంవత్సరం కొత్త విగ్రహాన్నే ఎందుకు పెట్టాలి..?
-
మహాకాయ.. అభయమీయవయా!
సకల జీవకోటికీ వరాలను అనుగ్రహించవయా వరసిద్ధి వినాయకా.. శుభాలను కటాక్షించవయా పార్వతీప్రియసుతా.. విఘ్నాలను తొలగించవయా విఘ్నరాజా.. స్థితిగతులను మార్చవయా గణేశా.. ఐహిక సుఖాల నుంచి విముక్తి ప్రసాదించవయా మహాకాయా.. తెలియక చేసిన పాపాలను హరించవయా మూషిక వాహనా.. మొర ఆలకించి అభయమీయవయా సిద్ధి, బుద్ధి సమేత గణపయ్యా. కాణిపాకం(యాదమరి): కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి ఆలయం బ్రహ్మోత్సవశోభను సంతరించుకుంది. చవితి వేడుకలకు అంగరంగ వైభవంగా ముస్తాబైంది. కళ్లుమిరుమిట్లు గొలిపే విద్యుద్దీపాలు.. సుగంధ పరిమళాలను వెదజల్లే సుమమాలికలతో కనువిందు చేస్తోంది. 21 రోజులపాటు ఏకాంతంగా సాగే ఉత్సవాలకు ఆలయ యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. కోవిడ్ నిబంధనలను పకడ్బందీగా అమలు చేస్తోంది. భక్తులు భౌతికదూరం పాటిస్తూ స్వామివారిని దర్శించుకునేలా ప్రత్యేక క్యూలను ఏర్పాటు చేసింది. కొరత లేకుండా గణనాథుని లడ్డూ ప్రసాదాలను తయారు చేసింది. ప్రత్యేక ఏర్పాట్లు బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం వేర్వేరు క్యూలను ఏర్పాటు చేశారు. అందులో రూ.50, రూ.100 దర్శన టికెట్ కొనుగోలు చేసిన వారికి విడిగా ఆలయం వెలుపల నుంచి క్యూ నిర్మించారు. వీఐపీలు, చంటిబిడ్డ తల్లులు, వృద్ధులు, దివ్యాంగుల కోసం మరోవైపు క్యూ ఏర్పాటు చేశారు. స్వామివారి దర్శనానికి వేచి ఉన్న భక్తులు ఇబ్బంది పడకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు. క్యూలో లైట్లు, ఫ్యాన్లు, శానిటైజర్, తాగునీటి సౌకర్యం కల్పించారు. భక్తులకు అన్నదానం బ్రహ్మోత్సవం సందర్భంగా ఆలయంలో 5వేల మంది భక్తులకు అన్నదానం నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు. అయితే కోవిడ్ కారణంగా భక్తులకు భోజన ప్యాకెట్లు పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయించారు. సిద్ధంగా ప్రసాదం బ్రహ్మోత్సవాలకు విచ్చేస్తున్న భక్తులకు కొరత లేకుండా స్వామివారి ప్రసాదం అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు 60 వేల రూ.15 లడ్డూలు, 5వేల రూ.75 లడ్డూలు, 2వేల రూ.150 లడ్డూలను సిద్ధం చేశారు. భక్తుల సెల్ఫోన్లు భద్రపరిచేందుకు, పాదరక్షలు పెట్టుకునేందుకు పలుచోట్ల ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. స్వామివారి దర్శనానంతరం భక్తులకు పులిహోర, చక్కెర పొంగలిని పంపిణీ చేయనున్నారు. సామాన్య భక్తులకే తొలి ప్రాధాన్యం చవితి రోజున కేవలం సామాన్య భక్తులనే స్వామి వారి దర్శనానికి అనుమతిస్తున్నామని ఆలయ అధికారులు తెలిపారు. వీఐపీలు 11వ తేదీన దర్శనానికి రావాలని స్పష్టం చేశారు. కోవిడ్ కారణంగా వాహనసేవలు, అభిషేకాలకు 50 మంది ఉభయదారులకు మాత్రమే అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. గణేశ దీక్ష చేపట్టేవారి కోసం వరదరాజస్వామివారి ఆలయం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. భారీ బందోబస్తు బ్రహ్మోత్సవాల సందర్భంగా డీఎస్పీ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు కలి్పంచారు. నలుగురు సీఐలు, 9 మంది ఎస్ఐలు, 130 మంది సిబ్బందిని బందోబస్తుకు నియమించారు. ఆలయ పరిసరాల్లో 32 సీసీ కెమెరాలను అమర్చారు. భక్తుల వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. ప్రశాంతంగా చవితి వేడుకలు ప్రశాంత వాతావరణంలో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించుకోవాలని తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ వెంకట అప్పలనాయుడు కోరారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గురువారం తిరుపతిలోని వినాయక సాగర్‌లో నిమజ్జన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఎస్పీ మాట్లాడుతూ హైకోర్టు ఆదేశాల మేరకు బహిరంగ ప్రదేశాల్లో వినాయక విగ్రహాలను ఏర్పాటు చేయకూడదని స్పష్టం చేశారు. పూజా కార్యక్రమంలో ఐదుగురికి మించి పాల్గొనకూడదని చెప్పారు. చవితి మండపాల వద్ద డీజే సౌండ్స్‌కు అనుమతి లేదని తెలిపారు. -
సుముఖః, ఏక దంతః, కపిలః, గజకర్ణికః.. 8 నామాలు తెలుసా?
మనం ఎలా ఉండాలో, ఏయే గుణాలు మనకి అవసరమో, ఆవశ్యకమో తనని పఠిస్తూండే శ్లోకంలో ఇమిడిపోయి మహాగణపతి మనకి అద్భుతంగా తెలియజేసాడు. వినాయక చవితి పర్వదినం సందర్భంగా ఆ విశేషాలు.... సుముఖ శ్చైకదంత శ్చ కపిలో గజకర్ణికః లంబోదర శ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతు ర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః వక్రతండ శ్శూర్పకర్ణో హేరంబః స్కందపూర్వజః అష్టా వష్టౌ చ నామాని యః పఠే ఛృణుయా దపి విద్యారంభే వివాహేచ ప్రవేశే నిర్గమే తథా! సంగ్రామే సర్వకార్యేషు విఘ్న స్తస్య న జాయతే అంటూ వినాయకుని గురించి చెప్పే నామాలు 8. వినాయకునిలో నుండి గ్రహించవలసిన గుణాలని వినాయకుని రూపాన్ని వర్ణిస్తూ కళ్లలో ఆయన రూపాన్ని నిలుపుకునేలా చేసే నామాలు 8. మొత్తం 16 నామాలు పై శ్లోకంలో ఉన్నాయి. ఈ విశేషాన్ని గుర్తించవలసిందని చెప్పేందుకే అష్టౌ (8), అష్టౌ(8) చ (కలిపి) నామాన్ని అని కన్పిస్తుంది శ్లోకంలో. రూపాన్ని వర్ణిస్తూ, ఇలాంటి గుణాలని మనం ఆయననుండి నేర్చుకోవాలనే యదార్థాన్ని తెలుసుకుందాం! 1. సుముఖః: సు–ముఖః అంటే ఎవరు ఏ కోరికని తన ముందుకొచ్చి చెప్పదలిచినా, మనసులో అనుకుంటున్నా ఆ అభిప్రాయాన్ని ఎంతో సుముఖంగా ఉంటూ (వినాలనే ఆసక్తితోనూ, చెప్పేవానికి తప్పక తన పని తీరుతుందనే నమ్మకం కలిగేలానూ) ఆ విషయాన్నంతటినీ వింటాడాయన. లోకంలో కొందరి దగ్గరికి పోయి ఏదైనా చెప్పుకోదలిస్తే ఏదో పరాకుగా వింటూనో మధ్యమధ్యలో ఎవరినుండో వచ్చిన మాటల్ని వింటూనో ఆ మధ్యమధ్యలో ‘ఏం చెప్పా?’ వంటూ అడుగుతూనో వినే మనుషులుంటారు. అలాంటివాళ్ళకి వినాయకుడు చెప్పాడు... వినదలిస్తే సుముఖునిగా ఉండి విను లేదా తర్వాత వింటానని చెప్పు తప్ప వింటున్నట్టుగా వినకుండా ఉండడం సరికాదని. సు–ముఖః అనే పదంలో ముఖమనే మాటకి చక్కని నోరు కలవాడనేది కూడా అర్థం. ఇలా ముఖమనే మాటకి నోరు అనే అర్థం. వినాయకుడు చక్కని నోరు కలవాడనేది దీనర్థం. నోటితో సంభాషిస్తాం కాబట్టి ‘నొప్పించకుండా మాట్లాడేవాడు’ అనేది ఈయనకున్న మరో చక్కని గుణం. ఆ గుణం మనకి రావాలని ఆయన చెప్తున్నాడు. 2. ఏక+ దంతః: గజముఖం కలిగిన ఆయనకి నిజంగా 2 దంతాలుండాలి. వ్యాసుడంతటి వాడు భారతగ్రంథమంతనీ తన బుద్ధిలో నిల్చుకుని ‘నేను చెప్తూంటే రాయగల బుద్ధిమంతుడెవరా?’ అని బ్రహ్మను ప్రార్థిస్తే ఆయన గణపతి పేరు చెప్పాడు. గణపతిని ప్రార్థిస్తే ఆయన తప్పక రాస్తాను. అయితే నా రాతవేగానికి సరిపోయేలా నువ్వు కవిత్వాన్ని చెప్పాలనే నియమాన్ని పెట్డాడు. దాన్ని విని వ్యాసుడు మరో నియమాన్ని పెడుతూ నేను చెప్పే ప్రతి అక్షరాన్ని నువ్వూ అర్థం చేసుకున్నాక మాత్రమే రాయాలి తప్ప ఏదో యధాలాపంగా రాయకూడదన్నాడు. వ్యాసుని నియమాన్ని వింటూనే మహాగ్రంథాన్ని రాయబోతే తప్ప తనంతటి వానితో ఇలాంటి ఒప్పందాన్ని చేయనే చేయదలచడని భావించిన గణపతి ఆ రాయబోయే గ్రంథాన్ని తన చేతులతో వీక్షించడం కోసం తన దంతాన్నే పెరికి (పెకిలించి) గంటంగా చేసి మరీ రాసాడు. దీన్ని గమనిస్తూ మనమూ అర్థం చేసుకోగలగాలి. మన శరీరంలోని ఏ అవయవమైనా అవతలివానికి సహాయపడేలా చేయాలని. మరి మన స్థాయిలో మనం చేదోడు వాదోడు అంటే పనిలో సహాయపడడం... మాట సహాయం చేయడం గా ఉండగలిగితే చాలు. నిందని ఎదుటివాళ్ళమీద నెట్టేలా సముఖంలో మాట్లాడడం, చాటున చాడీలు చెప్పడం వంటివి మానేస్తే చాలు. శరీరావయవాలన్నీ ఎదుటివారికి తోడ్పడేలా చేయగలగాలి. 3. కపిలః: రెండు రంగులు కలిసిన తనాన్ని ‘కపిల’ మంటారు. ఇటు శివలక్షణమూ, అటు విష్ణువిధానమూ కలిగినవాడు కాబట్టి కపిలుడు. దీన్ని మనకి అన్వయించుకుంటే ఎవరైన నేరాన్ని చూస్తే ‘వాడు మనవాడా? మనకి ఉపయోగపడతాడా? ..’ అన్న తీరుగా లెక్కించి తప్పుచేసినా రక్షించదలిచే పని (రావణుడికి కుంభకర్ణునిలా) చేయరాదనీ, శిక్షించే తీరాలని చెప్తుంది ఒక పద్ధతి. అదేతీరుగా ధర్మబద్ధంగా పనిచేస్తూ ఉండేవాణ్ణి మెచ్చుకోవడమే కాక వానికి కొంత వెసులు బాటుని కల్పించాలని కూడా దీని భావంగా అర్థం చేసుకోవాలి. 4. గజకర్ణికః : ఏనుగు చెవులే తనకి చెవులుగా కలవాడనేది పై పదానికి అర్థం. ఏనుగుకున్న లక్షణాల్లో రెండు మరింత ఆశ్చర్యాన్ని కలుగజేస్తాయి. అంత ఎత్తున్న ఏనుగుకన్నా ఆ చిన్నకళ్లు నేలమీద పడ్డ బట్టలు కుట్టే సూదిని కూడా గుర్తించగలవు. అలాగే ఆ చెవులు కూడా దూరంగా పాము బుసకొడుతుంటే వినగలిగినంతటి శక్తివంతమైనవి. గజకర్ణికః నామం ద్వారా చెవులవరకే దీన్ని మనకి అన్వయించుకుంటే ఎవరు మన ప్రవర్తన గురించి తేడాగా అనుకుంటున్నారో గమనించుకుంటూ ఉండాలి. లోకం నుండి అపవాదు వస్తుందేమో అనే భయంతో మన ప్రవర్తన ఉండాలి. గణపతి చెప్పేదేమంటే, వేటిని వినాలో వేటిని వినకూడదో గమనించుకోవాలి తప్ప చెవికి చేరిన అన్నింటినీ నమ్మడం సరికాదని. అసలు చెవి దగ్గరకి ఎవరినీ చేరనీయవద్దనీ కూడ. 5. లంబోదరః: పెద్దబొజ్జ ఉన్నవాడనేది దీనిపై అర్థం. “లంబ’ మనే మాటకి వేలాడుతున్న అనేది సరైన అర్థం. బొజ్జ మరింతగా అయినప్పుడు కిందికి వేలాడుతూ ఉంటుంది. ‘నా కడుపులో ఎన్నో రహస్యాలని దాచున్నా’నంటుంది తల్లి. అలా రహస్యాలెందరు తనకొచ్చి చెప్పినా వాటిని తన పైత్యాన్ని కూడా జోడించి ప్రచారం చేయడం కాకుండా “కడుపులో దాచుకోగలగడమనే గొప్ప లక్షణాన్ని అలవర్చుకోవాలనేది గణపతి మనకి చెప్తున్నాడన్నమాట. 6. వికటః: కటకమంటే చెక్కిలి. ఏనుగురూపం అయిన కారణంగా ఏటవాలుగా అయి దృఢంగా అయిన చెక్కిలి కలవాడనేది దీనర్థం. దీన్ని మనకి అన్వయించుకుంటే చెక్కిలి అనేది వ్యక్తి చెప్పదలిచిన అభిప్రాయాన్ని చెప్పించగల ముఖ్య అవయవం ముఖంలో. ఏ పదం తర్వాత ఏ పదాన్ని పలకాలో, ఎంతగా ఊది ఏ పదాన్ని పలకాలో దేన్ని తేల్చి పలకాలో, ఏ మాటని ముందు చెప్పి తర్వాత దేన్ని పలకాలో వివరించేది ఈ నామం. మనం కూడా స్పష్టంగా నిదానించి మాట్లాడాలనే గుణాన్ని గ్రహించాలన్నమాట. 7. విఘ్నరాజః : ప్రారంభించిన పని– ఇక ఎప్పటికీ ముడిపడనే పడదన్న రీతిలో వచ్చిన అభ్యంతరాన్ని విఘ్నమంది శాస్త్రం. అలాంటి విఘ్నాలకి రాజు ఆయన అని అర్థం. రాజుకి చతురంగ బలాలు (పదాది– అశ్వ– గజ– రథ) ఉన్నట్లే విఘ్నాలని తొలగించేందుకై నాలుగు విధాలుగా ప్రయత్నించడం, నలుగురి సహాయాన్ని అర్థించడం, నాలుగు చోట్లకి వెళ్లి విచారించి ఆ విఘ్నాన్ని తొలగించుకోవాలి తప్ప విఘ్నం వచ్చిందనుకుంటూ దుఃఖిస్తూ్త ఉండిపోవడం సరికాదని గణపతి చెప్తున్నాడన్నమాట. 8. గణాధిపః: యక్ష, కిన్నెర, కింపురుష, గంధర్వ, విహంగ, నాగ రాక్షస, దేవ .... మొదలైన అన్ని గణాలకీ అధిపతి అనేది దీనర్థం. లోకంలో ఏ ఒక్కరూ శత్రువంటూ లేనివాళ్లుండరు. కాబట్టి ఏకగ్రీవంగా (ముక్తకంఠంతో) ఎన్నుకోవడమనేది అసాధ్యమైన అంశం. అయితే వినాయకుడు మాత్రం సర్వగణాధిపతి కాగలిగాడంటే దీనిద్వారా అందరూ మెచ్చుకునే తీరులో తన ప్రవర్తనని ఎప్పటికప్పుడు దిద్దుకుంటూ నడుచుకోవాలనే గుణాన్ని మనం గ్రహించుకోవాలన్నమాట. మరో విశేషమేమంటే పై కన్పిస్తున్న అన్ని గణాలవీ ఒకే తీరు లక్షణం కలవి కావు. ఎవరి తీరు వారిది. అయితే అలాంటి భిన్న భిన్న లక్షణాలున్న అందరినీ ఒకే తీరుగా అంగీకరించేలా చేసి ఆధిపత్యాన్ని సాధించగలిగాడంటే ఆ తీరుగా అధికారి ఉండాల్సిందేనని చెప్తున్నాడన్నమాట గణపతి. – డా. మైలవరపు శ్రీనివాసరావు చదవండి: శాస్త్రీయ నృత్యం చేస్తూ పెయింటింగ్ -
బహిరంగ ప్రదేశాల్లో.. వినాయక విగ్రహాలను అనుమతించలేం
సాక్షి, అమరావతి: బహిరంగ ప్రదేశాల్లో వినాయక మండపాలు, విగ్రహాలు ఏర్పాటుచేయరాదని, ప్రైవేటు స్థలాల్లోనే ఏర్పాటుచేసుకుని గణేష్ ఉత్సవాలు జరుపుకోవచ్చునంటూ ప్రభుత్వ యంత్రాంగం జారీచేసిన ఉత్తర్వులను హైకోర్టు ధర్మాసనం సైతం సమర్థించింది. బహిరంగ ప్రదేశాల్లో వినాయక చవితి ఉత్సవాలు జరుపుకునేందుకు ప్రజలందరికీ అనుమతినివ్వాలంటూ విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) చేసిన అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది. కోవిడ్ నేపథ్యంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునే బహిరంగ ప్రదేశాల్లో చవితి ఉత్సవాల నిర్వహణకు అధికారులు అనుమతివ్వలేదని, ఇందులో తప్పులేదని హైకోర్టు స్పష్టంచేసింది. బహిరంగ ప్రదేశాల్లో వినాయక ఉత్సవాలు నిర్వహించరాదంటూ కృష్ణాజిల్లా కలెక్టర్ జారీచేసిన ప్రొసీడింగ్స్ సరైనవేనని తెలిపింది. వీటిని రద్దుచేయాలని కోరుతూ వీహెచ్‌పీ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) హైకోర్టు కొట్టేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. బహిరంగ ప్రదేశాల్లో వినాయక మండపాలు, విగ్రహాల ఏర్పాటు చేసుకుని ఉత్సవాలు నిర్వహించుకునేందుకు అనుమతినిచ్చేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ వీహెచ్‌పీ కృష్ణాజిల్లా కార్యదర్శి సిద్ధినేని శ్రీసత్య సాయిబాబు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై గురువారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. అసలు పిల్ ఎలా దాఖలు చేస్తారు? పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. మత విశ్వాసాలకు అనుగుణంగా వేడుకలు జరుపుకునే హక్కు పౌరులందరికీ ఉందన్నారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ, బహిరంగ ప్రదేశాల్లో విగ్రహాలు ఏర్పాటుచేయరాదని సింగిల్ జడ్జి ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చారు కదా? అని ప్రశ్నించింది. అసలు ఎలా పిల్ దాఖలు చేస్తారని, మీ హక్కులు ఉల్లంఘన జరిగిందని భావిస్తే రిట్ పిటిషన్ దాఖలు చేసుకోవాలి అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇందులో పిటిషనర్ వ్యక్తిగత ప్రయోజనాల్లేవని, ప్రజలందరి తరఫున ఈ వ్యాజ్యం దాఖలు చేశామని న్యాయవాది తెలిపారు. పెళ్లిళ్లకు 150 మందిని అనుమతినిస్తున్నప్పుడు ప్రజల మనోభావాలకు సంబంధించిన విషయంలో అనుమతినివ్వకపోవడం సరికాదన్నారు. వినాయక ఉత్సవాలపై ఆధారపడిన చిన్న వ్యాపారులకూ నష్టం చేకూరుతుందన్నారు. దీంతో.. వారెవ్వరూ ఎలాంటి పిటిషన్ దాఖలు చేయలేదని, అందువల్ల ఆ అంశం గురించి మాట్లాడాల్సిన అవసరంలేదని ధర్మాసనం తేల్చిచెప్పింది. జీవించే హక్కే ముఖ్యమని ‘సుప్రీం’ చెప్పింది... తరువాత ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) చింతల సుమన్ వాదనలు వినిపిస్తూ.. వినాయక ఉత్సవాలు జరుపుకోకుండా ఎవరినీ అడ్డుకోవడంలేదని, కేవలం బహిరంగ ప్రదేశాల్లో మండపాలు, విగ్రహాలు ఏర్పాటుచేయడంపైనే ఆంక్షలు విధించామని చెప్పారు. బహిరంగ ప్రదేశాల్లో విగ్రహాలు ఏర్పాటుచేస్తే అక్కడికి ప్రజలు రాకుండా అడ్డుకోవడం అసాధ్యంగా మారుతుందన్నారు. ప్రజల జీవించే హక్కే అత్యంత ముఖ్యమైనదన్న సుప్రీంకోర్టు తీర్పును సుమన్ వివరించారు. కరోనా థర్డ్‌వేవ్ వచ్చే అవకాశముందని నిపుణులు చెబుతున్నారని, దీనిని పరిగణనలోకి తీసుకుని బహిరంగ ప్రదేశాల్లో విగ్రహాల ఏర్పాటుపై ఆంక్షలు విధించామన్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులను పరిగణనలోకి తీసుకునే సింగిల్ జడ్జి ప్రైవేటు స్థలాల్లోనే విగ్రహాలు ఏర్పాటుచేసుకోవాలని ఉత్తర్వులిచ్చారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఏ రకంగానూ జోక్యం అవసరంలేదు ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, కలెక్టర్ ప్రొసీడింగ్స్‌పై ఏ రకంగానూ జోక్యం చేసుకోవాల్సిన అవసరం కనిపించడంలేదని చెప్పింది. ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వాలకు పరమావధి అంటూ సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని ధర్మాసనం గుర్తుచేసింది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజల ప్రాణాలను దృష్టిలో పెట్టుకునే ఆంక్షలు విధించిందని తెలిపింది. ప్రభుత్వం చెబుతున్నట్లు బహిరంగ ప్రదేశాల్లో జన సమూహాలను నిలువరించడం అసాధ్యమేనని స్పష్టంచేసింది. ఈ విషయంలో సింగిల్ జడ్జి ఇప్పటికే ఉత్తర్వులు జారీచేశారన్న ధర్మాసనం.. వీహెచ్‌పీ దాఖలుచేసిన ఈ వ్యాజ్యా న్ని కొట్టేస్తున్నట్లు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. -
మంచి పనులకు విఘ్నాలు తొలగాలి
సాక్షి, అమరావతి: వినాయక చవితి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని, మంచి పనులకు విఘ్నాలు తొలగిపోయి, అందరికీ విజయాలు సిద్ధించాలని ఆకాంక్షించారు. విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో రాష్ట్రంలోని ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో అభివృద్ధి చెందాలని అభిలషించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ట్వీట్ చేశారు. రాష్ట్ర ప్రజలందరిపై గణనాథుడి ఆశీస్సులు ఉండాలని, మీరు తలపెట్టే ఏ కార్యమైనా విఘ్నాలు లేకుండా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలుగు ప్రజలందరికీ వినాయక చతుర్థి శుభాకాంక్షలు.#HappyGaneshChaturthi — YS Jagan Mohan Reddy (@ysjagan) September 10, 2021 (చదవండి: మహా గణపతిం మనసా స్మరామి...) -
వినాయకుడి గెటప్లోని ఈ నటుడెవరో మీకు తెలుసా?
Sri Vinayaka Vijayam Movie: కొన్ని సినిమాలు ఎప్పటికీ వన్నెతరగవు. అందుకే బుల్లితెరపై ఎన్నిసార్లు ప్రజెంట్ చేసినా వ్యూయర్స్ ఆదరిస్తూనే ఉంటారు. ముఖ్యంగా పండుగల లాంటి టైంలో వీటి ప్రత్యేకత ఏంటో జనాలకు తెలిసి వస్తుంది కూడా. అలాంటి సినిమాల్లో ‘శ్రీ వినాయక విజయం’ గురించి ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ప్రతీ వినాయక చవితికి క్రమం తప్పకుండా ఈ సినిమా టీవీలో వస్తూనే ఉంటుంది. అయితే ఈ ఏడాది మళ్లీ టెలికాస్ట్ ప్రొమో రిలీజ్ కావడంతో సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన చర్చ మొదలైంది. పూర్తి స్థాయిలో గణేషుడి కథను చూపిస్తూ తెలుగులో వచ్చిన మొదటి సినిమా ‘శ్రీ వినాయక విజయం’(1979). ఈ మూవీలో కృష్ణంరాజు, వాణిశ్రీలు శివపార్వతులుగా నటించారు. కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో వినాయకుని జన్మ వృత్తాంతం చక్కగా వివరించే ప్రయత్నం చేశారు. ‘ఎవరవయ్యా.. ఎవరవయ్యా’ అంటూ సాగే గానం.. దేవులపల్లి రచన, సాలూరి స్వరాలు, సుశీలమ్మ పాడిన పాట ఇప్పటికీ పండపూట టీవీల్లో మారుమోగుతుంటుంది. అయితే ఆ వినాయకుడి గెటప్‌లో ఉన్న ఆర్టిస్ట్ ఎవరంటూ? గూగుల్‌ను ఆశ్రయించడంతో సినిమా ట్రెండింగ్‌లోకి వచ్చింది. శ్రీ వినాయక విజయం చిత్రం భారీ సక్సెస్ సాధించింది. ఈ సినిమాలో బాల గణేషుడిగా కనిపించింది బేబీ లక్ష్మి సుధా. ఆ తర్వాత ఏనుగు తల గెటప్‌తోనూ కాసేపు ఈ చిన్నారి అలరించింది. ఇక పెద్దయ్యాక వినాయకుడి గెటప్‌లో నటించింది ఎంజీవీ మదన్‌గోపాల్ అనే ఆర్టిస్ట్. ఈయన గురించి పూర్తి సమాచారం, ఫొటో గురించి .. వెతకాలని ప్రయత్నిస్తున్నారు చాలామంది. కానీ, ఎలాంటి సమాచారం దొరకడం లేదు. అలా చాలా మంది వెతకడం వల్ల వినాయక విజయం మూవీ గూగుల్ ద్వారా సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రెండ్ అవుతోంది ఇప్పుడు. చదవండి: ‘తండ్రి ఎవరు?’.. ఫైర్ అయిన హీరోయిన్ -
బహిరంగ ప్రదేశాల్లో వినాయక విగ్రహ ప్రతిష్టకు ఏపీ హైకోర్టు నిరాకరణ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో వినాయక చవితి ఉత్సవాల నిర్వహణకు సంబంధించి ఏపీ హైకోర్టు కీలక సూచనలు చేసింది. బహిరంగ ప్రదేశాల్లో వినాయక విగ్రహ ప్రతిష్టకు హైకోర్టు నిరాకరించింది. అదే సమయంలో ప్రైవేట్ స్థలాల్లో విగ్రహాలు ఏర్పాటు చేసుకోవచ్చని.. కానీ ఐదుగురికి మించి వేడుకల్లో పాల్గొనకూడదని హైకోర్టు స్పష్టం చేసింది. కరోనా నేపథ్యంలో వినాయక చవితి వేడుకలపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న జాగ్రత్తలను హైకోర్టు సమర్థించింది. (చదవండి: మహాగణపతి సిద్ధం.. ఖైరతాబాద్ చరిత్రలోనే తొలిసారి) పబ్లిక్ ప్రాంతాల్లో విగ్రహాలు పెట్టేందుకు అనుమతి ఇవ్వాలన్న విజ్ఞప్తిని హైకోర్టు తోసిపుచ్చింది. ఆర్టికల్ 25 ప్రకారం మతపరమైన హక్కును నిరాకరించలేమని.. అదే సమయంలో ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కునూ కాదనలేమని వ్యాఖ్యానించింది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని బహిరంగ ప్రదేశాల్లో వినాయక విగ్రహాల ప్రతిష్టకు అనుమతి నిరాకరిస్తున్నట్లు హైకోర్టు స్పష్టం చేసింది. -
జైలులో భర్త.. పండగ వేడుకల్లో శిల్పాశెట్టి
Shilpa Shetty Brought Home an Idol of Lord Ganesha: ప్రస్తుతం శిల్పా శెట్టి, ఆమె కుటుంబం గడ్డు పరిస్థితులను చూస్తోంది. శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్‌కుంద్రా ఇటీవల పోర్నోగ్రఫీ కేసులో జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. దీంతో శిల్పా ఇమేజ్ డ్యామేజవడంతో ఆమె మీడియా ముందుకు రావడానికి ఇష్టపడటం లేదు. అంతేగాక 15 రోజుల పాటు ఇంట్లోనే ఉంది. షూటింగ్‌లకు కూడా హాజరు కాని శిల్పా ఇటీవల బయటకు వచ్చి తిరిగి సెట్స్‌లో సందడి చేస్తోంది. ఇదిలా ఉండగా వినాయకచవితి పండగ సందర్భంగా ఆమె వినాయకుడి విగ్రహాన్ని తీసుకువెళుతున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. చదవండి: Shilpa Shetty: 'శిల్పా శెట్టి దంపతులు నా డబ్బుతో పోర్న్ వీడియోలు తీశారు' ప్రతి ఏడాదిలాగే శిల్పా ఈసారి కూడా వినాయకుడి ప్రతిష్టిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రతిసారి శిల్పా తన కుమారుడు వియాన్, భర్త రాజ్‌కుంద్రా కలిసి విగ్రహాన్ని కొనుగోలు చేసి ఆటా పాటలతో అడంబరంగా ఇంటికి తీసుకుని వెళ్లేది. కానీ ఈ సారి ఆమె తన పనివారితో వచ్చి వినాయక విగ్రహాన్ని కొనుగోలు చేసింది. అంతేగాక గణపతి బప్ప మోరియా అంటూ అందరితో కలిసి ఆడంబరంగా విగ్రహాన్ని ఇంటికి తీసుకువెళ్లింది. చాలా రోజుల తర్వాత శిల్పా ఇలా బయటకు రావడంతో మీడియా తమ కెమెరాలకు పని చెప్పింది. ఆమె చుట్టూ చేరి ఫొటోలను తమ కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. చదవండి: షాకింగ్.. నటిని బంధించి రూ.6 లక్షలు దోచుకెళ్లారు! అయితే ఈ వీడియోను చూసిన నెటిజన్లు కొందరు ప్రశంసిస్తుంటే.. మరికొందరు విమర్శిస్తున్నారు. ‘భర్త జైలు ఉన్నప్పటికీ కుటుంబ సంప్రదాయాన్ని మాత్రం శిల్పా మరవడం లేదు’ అని కొందరు నెటిజన్లు ప్రశంసించారు. ‘భర్త జైలు పాలైనా శిల్పా మాత్రం సంతోషంగా పండగ చేసుకుంటోంది’ అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఇటీవల శిల్పా శెట్టి, ఆమె భర్త మోసం చేశారంటూ ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త విశాల్ గోయెల్ పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తన దగ్గర రూ.41 లక్షలు తీసుకొని మోసం చేశారని, ఈ డబ్బును అడల్ట్ మూవీస్ తీసేందుకు ఉపయోగించారని ఆరోపించాడు. స్వలాభం కోసం చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడ్డారని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇలా చాలామంది దగ్గర డబ్బు తీసుకుని, వాటి ద్వారా పోర్న్ వీడియోలు తీశారని తీవ్ర ఆరోపణలు చేశాడు. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) -
వినాయక చవితి ఉత్సవాలకు సిద్ధమైన బాలాపూర్ గణేషుడు