సాక్షి, హైదరాబాద్: ఈ సంవత్సరం వినాయక చవితి పర్వదినాన్ని సెప్టెంబర్ 18 సోమవారం రోజునే నిర్వహించుకోవాలని తెలంగాణ విద్వత్సభ ప్రకటించింది. శోభకృత్‌నామ సంవత్సరం భాద్రపద శుక్ల చతుర్థి రోజునే మధ్యాహ్నం వరకు చవితి తిథి ఉన్నందున అదే రోజున వినాయక చవితిగా నిర్వహించుకోవాలని నిర్ధారించినట్టు తెలంగాణ విద్వత్సభ అధ్యక్షులు యాయవరం చంద్రశేఖరశర్మ సిద్ధాంతి, కార్యదర్శి దివ్యజ్ఞాన సిద్ధాంతిలు ఓ ప్రకటనలో తెలిపారు. చవితి తిథి 18న ఉదయం 9.58కి ఆరంభమై 19వ తేదీ ఉదయం 10.28కి ముగుస్తుందని తెలిపారు.
దీని ప్రకారం చవితి తిథి మధ్యాహ్నం సమయానికి 18నే ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. ఇదే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి, దేవాదాయ శాఖ మంత్రి, కమిషనర్ కార్యాలయాలకు, ప్రభుత్వ సలహాదారులకు తెలిపినట్టు వెల్లడించారు. జూలై 22, 23 తేదీల్లో వర్గల్ విద్యా సరస్వతి క్షేత్రంలో జరిగిన షష్ఠమ విద్వత్సమ్మేళనంలో వందమంది సిద్ధాంతుల సమక్షంలో పండుగల తేదీలను ఖరారు చేసినట్టు పేర్కొన్నారు.
చదవండి: Hyderabad: నా ఫ్లెక్సీలు తొలగిస్తారా?.. కార్పొరేటర్‌పై కేసు నమోదు
Comments
Please login to add a commentAdd a comment