
సాక్షి, హైదరాబాద్: భారతీయ సంస్కృతితో ముడిపడిన పండగల్లో ఎంతో పరమార్థం ఉంది. ప్రధానంగా వినాయకచవితి సందర్భంగా నిర్వహించుకునే కార్యక్రమాల్లో సామాజిక ప్రగతికి, సంఘటిత జీవనానికి, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన అంశాలు ఎన్నో ముడివడి ఉన్నాయి. సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ సమాజంలోని అన్ని వర్గాలను భాగస్వామ్యం చేస్తూ సాగే గణేష్ ఏకతా యాత్ర భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనం.
వినాయకుడు అందరివాడు
అన్ని పండుగల్లోకెల్ల వినాయక చవితి అంటే అందరికీ ఎంతో ఇష్టం. పిల్లా, పెద్ద అందరికీ వినాయకుడు అంటే మక్కువ చూపిస్తారు. దీన్ని పండుగలా కాకుండా.. సొంతింట్లో పుట్టినరోజును జరుపుకున్నట్టుగా భావిస్తారు. వినాయకుడిని తమ వాడిగా అన్వయించుకుంటారు. ఈ పండుగ ఎప్పుడు అన్నదానిపై ఈ సారి భిన్నవాదనలు తెరపైకి వచ్చాయి.
18కే భాగ్యనగర్ మొగ్గు
వినాయకచవితి ఎప్పుడనే విషయంపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ ఒక ప్రకటన చేసింది. ఈ నెల 18వ తేదీనే వినాయకచవితి పండుగని పేర్కొంది. అలాగే 28వ తేదీన నిమజ్జనం ఉంటుందని తెలిపింది. అంతకు ముందు 19న వినాయక చవితి, 29న నిమజ్జనం ఉంటుందని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ ప్రకటించిన సంగతి విదితమే. అయితే.. ఈ ఏడాది తిథి రెండు రోజులు ఉండడం వల్ల.. పండుగ ఎప్పుడనే దానిపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే.. శృంగేరి-కంచి పీఠాధిపతులు గణేష్ ప్రతిష్ట 18వ తేదీనే చేసుకోవాలని సూచించారట. కాబట్టి.. గ్రేటర్ పరిధిలోని మండపాలు 18వ తేదీనే వినాయక చవితి నిర్వహించుకోవాలని సూచించింది భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ.
సంబరం తెచ్చే పండగ
భాజాభజంత్రీలు, తప్పెట్లు, కోలాటాలు, కీలుగుర్రాల నృత్యాలు, పండరిభజనలు, కర్రసాము విన్యాసాలు తదితర సాంస్కృతిక కార్యక్రమాలతో గణేషుడి నవరాత్రులు సందడిగా ఉంటాయి. ఇక నిమజ్జనం గురించి చెప్పనక్కర్లేదు. భాగ్యనగరం అంతా ఏకతా యాత్ర కోలాహలంగా, సందడితో సాగుతుంది. ఈ పండుగ వల్ల ఎంతో మందికి ఉపాధి, మరెంతో మందికి చేతినిండా పని.
మట్టి వినాయకుడికి జై
వినాయక చవితి సమీపిస్తుండడంతో నగరంలో విగ్రహాల విక్రయాలు ముమ్మరంగా సాగుతున్నాయి. పాతబస్తీలోని ధూల్‌పేటతోపాటు కూకట్‌పల్లి, మూసాపేట, ఉప్పల్, ఎల్‌బీనగర్, హయత్‌నగర్, పెద్ద అంబర్‌పేట ప్రాంతాల్లో రోడ్లకు ఇరువైపులా పెద్ద సంఖ్యలో విగ్రహాలు లభిస్తున్నాయి. ఈసారి మట్టివిగ్రహాలు కూడా పెద్ద సంఖ్యలో తయారు చేశారు. కొత్తపేట చౌరస్తాలో ఇలా రోడ్డు పక్కన మట్టివిగ్రహాలు ఉంచి విక్రయిస్తున్నారు. ఖైరతాబాద్ విగ్రహం కూడా తుదిమెరుగులు దిద్దుకుంటోంది.
The #Khairatabad #Ganesh #Idol in making! #VinayakaChavithi #GaneshChaturthi #Hyderabad #Telangana
— Hi Hyderabad (@HiHyderabad) September 3, 2023
📸: @BelieverHemanth pic.twitter.com/HIFcGpULDr
పర్యావరణానికి పెద్దపీట
వినాయక ప్రతిమలతో పాటు మట్టి పాత్రలను, ప్రమిదలను, చేనేత పూజా వస్త్రాలను, ఎలాంటి పురుగుమందులు, రసాయనాలు లేకుండా సహజమైన పద్ధతుల్లో పండించిన పెసరపప్పు, బెల్లం, పసుపు, కుంకుమ, అక్షింతలు, స్వచ్ఛమైన ఆవు నెయ్యి, 21 రకాల ఆకులను సైతం పల్లెల నుంచి సేకరించి గణపతి కిట్‌లను అందుబాటులోకి తెచ్చారు. గతేడాది కంటే ఈసారి మట్టి విగ్రహాలకు ఎక్కువ డిమాండ్ ఉండే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
Ganapati Bappa Morya ♥️#GaneshChaturthi #GaneshChaturthi2023 pic.twitter.com/ByLNMYSef0
— poorna_choudary (@poornachoudary1) September 1, 2023
Comments
Please login to add a commentAdd a comment