వినాయక చవితి వేడుకల్లో తమన్నా సందడి! | Tamannaah Bhatia at Mukesh Ambani Ganpati celebrations In Antilia Home | Sakshi
Sakshi News home page

Tamannaah Bhatia: వినాయక చవితి వేడుకలు.. స్పెషల్ అట్రాక్షన్‌గా తమన్నా!

Sep 8 2024 7:59 AM | Updated on Sep 8 2024 11:24 AM

Tamannaah Bhatia at Mukesh Ambani Ganpati celebrations In Antilia Home

వినాయక చవితి వచ్చిందంటే సినీతారల సందడి మామూలుగా ఉండదు. ఎప్పటిలాగే ముంబయిలోని ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ ఇంట గణేష్ చతుర్థి  వేడుకలు గ్రాండ్‌ నిర్వహించారు. ముంబయిలోని ముకేశ్ నివాసం యాంటిలియాలో జరిగిన ఈ వేడుకల్లో బాలీవుడ్‌లోని ప్రముఖులంతా హాజరై సందడి చేశారు. కొందరు సతీసమేతంగా విచ్చేసి గణనాధుని పూజల్లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరలవుతున్నాయి. అయితే ఈ వేడుకల్లో టాలీవుడ్ హీరోయిన్‌ తమన్నా కూడా సందడి చేసింది.

ముకేశ్ అంబానీ నిర్వహించిన గణపతి పూజలో టాలీవుడ్ హీరోయిన్ తమన్నా భాటియా కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తమన్నా స్పెషల్ ‍అట్రాక్షన్‌గా నిలిచింది.  ఆమెతో పాటు కరీనా కపూర్, సైఫ్ అలీఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, సోనమ్ కపూర్ లాంటి సూపర్ స్టార్స్‌ పాల్గొన్నారు. సంప్రదాయ దుస్తులు ధరించి ఈ వేడుకల్లో మెరిశారు. అయితే అనంత్‌ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లికి మిస్సయిన సెలబ్రిటీ కపుల్ కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ వినాయక చవితి వేడుకలకు హాజరు కావడం విశేషం.

అంతేకాకుండా జాకీ ష్రాఫ్ తన కుమారుడైన టైగర్‌ ష్రాఫ్‌లో కలిసి వచ్చారు. ఈ వేడుకల్లో కాజల్ అగర్వాల్, అమీర్ ఖాన్ కుమారులు జునైద్, ఆజాద్‌లు కూడా పాల్గొన్నారు. ప్రముఖ నటి భాగ్యశ్రీ తన భర్త హిమాలయాతో కలిసి హాజరయ్యారు.  గాయం నుంచి కోలుకున్న సల్మాన్ ఖాన్ తన మేనకోడలు అలీజ్ అగ్నిహోత్రితో కలిసి సందడి చేశారు. మరో బాలీవుడ్ జంట రితీష్, జెనీలియా దేశ్‌ముఖ్, శ్రద్ధా కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా, గేమ్ ఛేంజర్ భామ కియారా అద్వానీ జంట, రాజ్‌కుమార్‌రావు సతీమణి పాత్రలేఖతో కలిసి గణపతి ఉత్సవాలకు హాజరయ్యారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement