సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో సామరస్య, శాంతియుత వాతావరణాన్ని దెబ్బతీసేందుకు బీజేపీ నాయకులు వినాయక చవితిని ఒక వివాదంగా మారుస్తున్నారని వామపక్ష పార్టీలు ఏపీ బీజేపీపై మండిపడ్డాయి. కాషాయ పార్టీ కుటిల యత్నాలను ప్రజలు తిప్పికొట్టాలని వామపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి. ఈ క్రమంలో సోమవారం వామపక్ష పార్టీలు ఓ లేఖను విడుదల చేశాయి. ‘‘ప్రస్తుతం కోవిడ్ మూడవ దశ ప్రమాదం పొంచి ఉంది. ఈ తరుణంలో ప్రజలంతా కోవిడ్ నియమ నిబంధనలను జాగ్రత్తగా పాటిస్తూ వినాయక చవితి జరుపుకోవాలి’’ అని లేఖలో కోరాయి. (చదవండి: మహాగణపతి సిద్ధం.. ఖైరతాబాద్ చరిత్రలోనే తొలిసారి)
‘‘రాష్ట్రంలో కోవిడ్ విజృంభించినప్పుడూ కేంద్ర బీజేపీ రాష్ట్రానికి ఏ సహాయమూ చేయలేదు. రాష్ట్రం కోరిన మేరకు వ్యాక్సిన్‌లనూ ఇవ్వకుండా వివక్షను చూపుతోంది. కేంద్ర ప్రభుత్వం పండగ సీజన్‌లో తీసుకోవాల్సిన చర్యల గురించి రాష్ట్రాలకు ఇచ్చిన ఆదేశాలను సైతం విస్మరించి రాష్ట్ర బీజేపీ నాయకత్వం ప్రజల విశ్వాసాలతో రాజకీయ కుతంత్రం నడుపుతోంది’’ అంటూ వామపక్ష పార్టీలు మండిపడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment