Left parties
-
సీపీఐ,సీపీఎం ఆందోళన..అనంతపురం కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత
సాక్షి,అనంతపురం: కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన సూపర్‌సిక్స్ హామీలను అమలు చేయాలని సీపీఐ,సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో రైతులు,కార్మికులు అనంతపురం జిల్లా కలెక్టరేట్‌ను ముట్టడించారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన కలెక్టర్ వినోద్‌కుమార్ వాహనాన్ని అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఆందోళకారులు కలెక్టర్ వాహనాన్ని అరగంట సేపు దిగ్భందించారు.ఈ సందర్భంగా పోలీసులు,ఆందోళకారులకు మధ్య వాగ్వాదం,తోపులాటజరిగింది. హామీల అమలులో టీడీపీ,బీజేపీ, జనసేన విఫలమయ్యాయని సీపీఎం నేతలు మండిపడ్డారు. చంద్రబాబు కు రైతుల ఆత్మహత్యలు పట్టవా అని వారు ప్రశ్నించారు.రైతు భరోసా పథకం కింద ఒక్కో రైతుకు 20 వేల రూపాయల ఆర్థిక సాయం ఎందుకివ్వలేదో చెప్పాలని నిలదీశారు.వైఎస్సార్ వాహనమిత్ర ఇవ్వకపోవడం వల్ల ఆటో,ట్యాక్సీ డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: Andhra Pradesh: ఆందోళనలతో అట్టుడికిన రాష్ట్రం -
హైడ్రా పేరుతో పేదల జోలికి వస్తే ఉపేక్షించం..మిత్రపక్షం మిత్రపక్షమే.. పోరాటం పోరాటమే!
సాక్షి, హైదరాబాద్: ‘కేసీఆర్‌పై ఉన్న వ్యతిరేకతతో కాంగ్రెస్‌ను గెలిపించిన ప్రజలకు ఆ పార్టీ చేసిందేమీలేదు. ఏడాది పాలనలో సీఎం రేవంత్‌రెడ్డి ఉచిత బస్సు సౌకర్యం తప్ప వేటినీ అమలు చేయలేదు. దీంతో ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. విదేశీ పెట్టుబడిదారులకు మూసీ భూములు, ఫార్మా భూముల్ని కట్టబెట్టేందుకు మూసీ సుందరీకరణ జపం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ విధానాలతో ప్రజల కోసం పని చేస్తున్న వామపక్షాలు, ఇతర ప్రజా సంఘాలు రాబోయే కాలంలో ఐక్య పోరాటాల్ని నిర్వహించేలా ఊరూరా ఎర్రజెండా ను తీసుకెళ్తాం. ఈ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వానికి స్నేహపూర్వకంగా చెప్పాం.ఇక నుండి రోడ్ల పైకి వస్తాం. మాకు గెలవడం రాకపోయినా, ఓడించడం వచ్చు..’అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఇటీవలచేసిన తీవ్రమైన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రాజేశాయి. మొన్నటి పార్లమెంటు ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న ఆ పార్టీ ఇంతలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రమైన వ్యాఖ్యలు చేయడంలో ఆంతర్యమేంటన్న చర్చ జరుగుతోంది. అయితే కాంగ్రెస్ తమకిచ్చిన హామీ నెరవేర్చక పోవడం, రుణమాఫీ, రైతు భరోసా, హైడ్రా, మూసీ సుందరీకరణ తదితర అంశాలకు సంబంధించిన ప్రభుత్వ విధానాలు.. రైతులు, ఇతర వర్గాల ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నాయని సీపీఎం భావిస్తుండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఇటీవల గ్రూప్–1 అభ్యర్థులపై లాఠీచార్జి వంటి మరికొన్ని అంశాలను కూడా ఆ పార్టీ గట్టిగా వ్యతిరేకిస్తోంది. ప్రభుత్వంపై ఒకపక్క సీపీఎం విరుచుకు పడుతుంటే, మరోపక్క సీపీఐ కూడా వివిధ సమస్యలపై తన నిరసన వ్యక్తం చేస్తోంది. ప్రజలకు దూరమవుతామన్న భావన.. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో సీపీఐ పొత్తు పెట్టుకొని ఒక సీటు గెలవగా, సీపీఎం పార్టీ పొత్తు కుదరక ఒంటరిగా పోటీ చేసిన సంగతి తెలిసిందే. అయితే పార్లమెంటు ఎన్నికల నాటికి కాంగ్రెస్‌కు రెండు కమ్యూనిస్టు పార్టీలు కూడా మద్దతు తెలిపాయి. సీపీఐకి ఒక ఎమ్మెల్సీ ఇస్తామని అసెంబ్లీ పొత్తుల సందర్భంగా కాంగ్రెస్ హామీ ఇవ్వగా, పార్లమెంటు ఎన్నికల్లో మద్దతు ప్రకటించినందుకు సీపీఎంకు కూడా ఎమ్మెల్సీ లేదా స్థానిక సంస్థల్లో అవకాశం కల్పించాలన్న అవగాహన కుదిరినట్లు ప్రచారం జరిగింది.అయితే ఏడాది కావొస్తున్నా ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చలేదన్న అసంతృప్తి కామ్రేడ్లలో ఉందని అంటున్నారు. అలాగే పలు సందర్భాల్లో సమస్యలపై సీఎంకు వినతిపత్రాలు ఇచ్చినా లెక్క చేయడంలేదని వామపక్షాలు భావిస్తున్నట్టు చెబుతున్నారు. ఒకవైపు బీఆర్ఎస్, మరోవైపు బీజేపీలు దూకుడుగా ప్రభుత్వంపై విరుచుకుపడుతుంటే.. ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగట్టే తాము మిన్నకుంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని, వారికి దూరం అయ్యేందుకు అవకాశం ఉందనే ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తోంది. దీని ఫలితమే సీపీఎం, సీపీఐల ప్రతిస్పందనలని అంటున్నారు. ఇటీవలి పరిణామాలేంటి..?బెటాలియన్ కానిస్టేబుళ్ల పనిభారాన్ని పెంచే జీవోను రద్దుచేసి, వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని తమ్మినేని డిమాండ్ చేశారు. పేదల ఇళ్లను పడగొట్టి ప్రభుత్వం వారిపై అక్రమ కేసులు బనాయిస్తోందని, ఒకవైపు ప్రజాపాలన అంటూనే ప్రజలపై నిర్బంధాన్ని కొనసాగిస్తోందని సీపీఎం విమర్శించింది. ‘మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పోలీసులను, అధికారులను ప్రయోగిస్తోంది. ఇళ్ల కూలి్చవేతకు ఏర్పాట్లు చేస్తోంది. పేద, మధ్యతరగతి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. ప్రభుత్వం ఇంత హడావుడిగా నిర్ణయాలు తీసుకుని ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం సరికాదంటూ సీఎం రేవంత్‌రెడ్డికి తమ్మినేని వీరభద్రం లేఖ రాశారు. ‘రైతులకు ప్రకటించిన రు.2 లక్షల రుణమాఫీని అర్హులైనవారందరికీ అమలు చేయాలి. అలాగే పంటకాలం పూర్తవుతున్నప్పటికీ వానాకాలం రైతుభరోసా ఇవ్వలేదు. తక్షణమే రైతు భరోసా చెల్లించాలి..’అని సీపీఎం కోరింది. గ్రూప్–1 అభ్యర్థులపై లాఠీచార్జీని తీవ్రంగా ఖండించింది. వారికి న్యాయం చేసేవిధంగా ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకోవాలని, అభ్యర్ధులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. వానాకాలం, యాసంగికి రైతుభరోసా, రుణమాఫీలను వెంటనే అమలు చేయాలని సీపీఐకి చెందిన రైతుసంఘం డిమాండ్ చేసింది. ఈ విషయమై జిల్లాల్లో ధర్నాలు చేపట్టింది. హైడ్రా పేరుతో పేదల జోలికి వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, మిత్రపక్షం మిత్రపక్షమే.. పోరాటం పోరాటమేనంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. -
భారత్, చైనాల మధ్య నలిగిపోము: శ్రీలంక అధ్యక్షుడు
కొలంబో: భారత్, చైనా దేశాలతో విదేశాంగ విధానంలో శ్రీలంక సమానమైన వైఖరిని పాటిస్తుందని ఆ దేశ కొత్త అధ్యక్షుడు అనుర కుమార దిసానాయకే అన్నారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి భారత్, చైనా విదేశాంగ విధానంపై స్పందించారు. భారత్, చైనాల మధ్య నలిగిపోయే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు. ఆయన ఓ ఇంటర్వ్యులో పొరుగుదేశాలతో విదేశాంగ విధానంపై కీలక వ్యాఖ్యలు చేశారు.‘‘మా నాయకత్వంలో దేశం భౌగోళిక, రాజకీయ ప్రత్యర్థుల జోలికి వెళ్లకుండా చూస్తాం. నేషనల్ పీపుల్స్ పవర్( ఎన్పీపీ) ప్రభుత్వం ఏ దేశంతోను జతకట్టదని, పొరుగు దేశాలైన భారత్, చైనా రెండు దేశాలతో సమతుల్య సంబంధాలను పెంపొందించుకోవాలని భావిస్తోంది.మేము భౌగోళిక, రాజకీయ పోరాటంలో ఎవరితో పోటీదారులం కాదు. ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోము. ముఖ్యంగా భారత్, చైనాల మధ్య నలిగిపోవాలనే ఉద్దేశం మాకు లేదు. రెండు దేశాలు విలువైన స్నేహితులుగా మా ప్రభుత్వ సన్నిహిత భాగస్వాములు కావాలని ఆశిస్తున్నాం. యూరోపియన్ యూనియన్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికాతో కూడా సంబంధాలను కొనసాగించుతాం” అని అన్నారు.పొరుగు దేశాల ఆధిపత్య పోరులో శ్రీలంక నలిగిపోవద్దని ఇరుదేశాలతో పరస్పర ప్రయోజనకరమైన దౌత్య భాగస్వామ్యం నిర్మించడంపై దృష్టి సారిస్తోందని అన్నారు. ప్రాంతీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో శ్రీలంక తమ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి తటస్థ విదేశాంగ విధాన విధానమే కీలకమని భావిస్తున్నట్లు తెలుస్తోంది.చదవండి: సంక్షోభ లంకపై నెలవంక! -
ప్రపంచవ్యాప్తంగా రైట్‌వింగ్ నేతలపైనే టార్గెట్: అస్సొం సీఎం
ఢిల్లీ: అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌పై జరిగిన కాల్పులను ప్రపంచవ్యాప్తంగా దేశాధినేతలు తీవ్రంగా ఖండించారు. ఇప్పటికే ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రంగా ఖండించారు. తాజాగా ట్రంప్‌పై జరిగిన కాల్పుల ఘటనపై అస్సొం సీఎం హిమంత బిశ్వ శర్మ స్పందించారు. ట్రంప్ త్వరగా కోలుకోవాలని ఎక్స్ వేదికగా తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా రైట్ వింగ్ నేతలను లెఫ్ట్ వింగ్ పార్టీలు టార్గెట్ చేస్తున్నాయని అన్నారు. దేశమే తొలి ప్రాధాన్యం అనే జాతీయవాదాన్ని కలిగి ఉన్న నేతలను ఎవరు ఓడించలేరని తెలిపారు.‘‘భౌతికంగా, మరోరకంగా ప్రపంచవ్యాప్తంగా రైట్ వింగ్ నేతలపై లెఫ్ట్ పార్టీ దాడులతో టార్గెట్ చేస్తోంది. ఈ దాడులు జాతీయవాదం కలిగి ఉండే నేతలను ఓడించలేవు. జాతీయవాదం అనేది పూర్తిగా ఆధ్యాత్మిక సనాతనతత్వం నుంచి ప్రేరణ పొందింది. డొనాల్డ్ ట్రంప్ తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నా’ అని అన్నారు.Physical or otherwise, right-wing leaders across the globe are now active targets of the radical left. However, these attacks will not be able to defeat the "nation first" ideology. This is rooted in deep spirituality and inspired by the Sanatan philosophy of "Janani Janmabhoomi…— Himanta Biswa Sarma (@himantabiswa) July 14, 2024 ఇక, శనివారం పెన్సిల్వేనియాలో చేపట్టిన ప్రచారంలో పాల్గొన్న ట్రంప్‌పై ఓ గుర్తుతెలియని దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఓ బుల్లెట్ ట్రంప్ చెవిని తాకుతూ పక్కనుంచి దూసుకుపోవటంతో గాయమైంది. వెంటనే అప్రత్తమై సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు వేదిక పైకి వచ్చి.. ట్రంప్‌ను అక్కడి కిందకు దించి ఆస్పత్రికి తరలించారు.ఈ కాల్పులకు పాల్పడిన వ్యక్తిని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) తాజాగా గుర్తించింది. అతణ్ని 20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్స్‌గా ధ్రువీకరించారు. పెన్సిల్వేనియాలోని బెతెల్ పార్క్‌కు చెందిన వ్యక్తిగా పేర్కొన్నారు. యూఎస్ సీక్రెట్ సర్వీస్ అధికారులు క్రూక్స్‌ను షూట్ చేసినట్లు ఎఫ్‌బీఐ ఏజెన్సీ ప్రతినిధి ఆంథోనీ గుగ్లీల్మి వెల్లడించారు. ఈ ఘటనను అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌తో సహా ప్రపంచ దేశాధినేతలు తీవ్రంగా ఖండించారు. -
Lok sabha elections 2024: ఆర్జేడీకి 26.. కాంగ్రెస్‌కు 9
పట్నా: వచ్చే లోక్‌సభ ఎన్నికలకు గాను బిహార్‌లో ఆర్జేడీ సారథ్యంలోని మహాఘఠ్‌బంధన్‌లో సీట్ల పంపిణీ కొలిక్కి వచ్చింది. రాష్ట్రంలోని మొత్తం 40 స్థానాలకు గాను దాదాపు మూడింట రెండొంతుల సీట్లలో లాలూ ప్రసాద్‌కు చెందిన ఆర్జేడీ పోటీ చేయనుంది. మిగతా వాటిని కాంగ్రెస్, మూడు వామపక్ష పార్టీలు పంచుకున్నాయి. 2019 ఎన్నికల్లో ఆర్జేడీ ఒక్క సీటూ దక్కించుకోలేకపోయినప్పటికీ ఈసారి 26 చోట్ల పోటీ చేయనుంది. కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో మాదిరిగానే ఈసారీ 9 చోట్ల పోటీ చేయనుంది. ఆ తర్వాత సీపీఐ ఎంఎల్ లిబరేషన్ మూడు, సీపీఐ, సీపీఎంలు చెరో చోట బరిలోకి దిగనున్నాయి. బిహార్‌లో ఆర్జేడీ ఇప్పటికే నాలుగు చోట్ల అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో ఒక సీటును కాంగ్రెస్ ఆశిస్తోంది. కాంగ్రెస్ పోటీ చేయాలని ఆశిస్తున్న పుర్నియా స్థానానికి లాలూ ప్రసాద్ ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించేశారు. సీపీఐ, సీపీఐ(ఎంఎల్) కూడా బెగుసరాయ్, ఖరారియా సీట్లకు అభ్యర్థులను ప్రకటించుకున్నాయి. -
కూటమి కుదురుకునేనా?
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ‘ఇండియాకూటమి’ మధ్య పొత్తు చర్చలు జరుగుతున్నా, తెలంగాణలో మాత్రం కాంగ్రెస్, వామపక్షాల మధ్య ఇంకా అంతరం కొనసాగుతోంది. కూటమిలో కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ కీలకంగా ఉన్నా, రాష్ట్రంలో మాత్రం ఆ పార్టీల మధ్య సఖ్యత కనిపించడం లేదు. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడినా..పొత్తులపై ఇప్పటికీ ఆ పార్టీల మధ్య అవగాహన కుదరలేదు. ఒకవైపు బీజేపీ ప్రమాదం ముంచుకొస్తుందని కాంగ్రెస్, వామపక్షాలు చెబుతున్నా, ఐక్యత మాత్రం ప్రదర్శించలేకపోతున్నాయి. రాష్ట్రంలో బీజేపీకి కూడా గణనీయమైన ఎంపీ స్థానాలు వస్తాయనే అంచనాలున్న నేపథ్యంలో ఎంతోకొంత ప్రభావం చూపగలిగే వామపక్షాలను కాంగ్రెస్ పార్టీ పరిగణనలోకి తీసుకోవడం లేదని, గత అసెంబ్లీ ఎన్నికల సమయం నుంచీ కాంగ్రెస్ వైఖరి ఇలాగే ఉందని లెఫ్ట్ నేతలు వాపోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల వరకు నానబెట్టి చివరకు సీపీఐతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది. కాంగ్రెస్ సీపీఎం రెండూ రాజీకి రాలేకపోయాయి. ఎన్నికల వేళ మాటల యుద్ధం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వంద రోజులు దాటింది. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలపై దృష్టి సారించింది. అభ్యర్థులను ప్రకటించుకుంటూపోతోంది. ఈ నేపథ్యంలో తమతో చర్చలు జరపకపోవడంపై వామపక్షాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. అంతేకాదు వివిధ సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్‌రెడ్డిని కలవడానికి ప్రయత్నాలు చేస్తున్నా, సమయం ఇవ్వడం లేదని వామపక్ష నేతలు మండిపడుతున్నారు. ఇండియా కూటమిలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేరళ వెళ్లి అక్కడి సీపీఎం సీఎం పినరయి విజయన్ను విమర్శించడాన్ని కూడా కామ్రేడ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. దీనిపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం బహిరంగంగానే విమర్శించారు. మరోవైపు సీపీఐ నేతలు కూడా కాంగ్రెస్ వైఖరిని తూర్పారబడుతున్నారు. పార్టీలు మారిన వారికి పెద్దపీట వేస్తూ, తమకు ఒక ఎంపీ సీటు ఇవ్వడానికి వెనుకాడుతున్నారని సీపీఐ విమర్శిస్తోంది. తమిళనాడు రాష్ట్రాన్ని చూసైనా నేర్చుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కాంగ్రెస్‌కు సూచించారు. అభ్యర్థిని ప్రకటించిన సీపీఎం పొత్తులపై స్పష్టత రాకపోవడంతో సీపీఎం ఇటీవల భువనగిరి లోక్‌సభ సెగ్మెంట్‌కు జహంగీర్‌ను పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. ఇతర చోట్ల ఎవరికి మద్దతు ఇవ్వాలన్న దానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఎన్నికల్లో కలిసి పనిచేసే విషయంలో బీఆర్ఎస్ నుంచి తమకు ప్రతిపాదన వస్తే ఏం చేయాలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎస్.వీరయ్య చెప్పడం గమనార్హం. ఇక సీపీఐ కూడా కాంగ్రెస్ తీరుపై గరంగరంగా ఉంది. గత ఎన్నికల్లో పొత్తు పెట్టుకొని ఒక స్థానంలో గెలవడంతో దూకుడుగా వెళ్లడానికి సీపీఐ కాస్తంతా వెనుకాముందు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. నాలుగైదు రోజుల్లో చర్చలుంటాయా? కాంగ్రెస్ పార్టీ నాలుగైదు రోజుల్లో తమతో చర్చలు జరుపుతుందని అంటున్నారని వామపక్ష నేత ఒకరు పేర్కొన్నారు. ఏదిఏమైనా ఈ చర్చల్లో చెరో సీటు అడగాలని ఆ పార్టీలు భావిస్తున్నాయి. ఒకవేళ ఎంపీ సీట్లు ఇవ్వకుండా మద్దతు కాంగ్రెస్ కోరితే కనీసం చెరో ఎమ్మెల్సీ అడిగే ఆలోచనలో వామపక్షాలు ఉన్నట్టు సమాచారం. మరోవైపు చెరో ఎంపీ స్థానంలో తమ అభ్యర్థిని స్నేహపూర్వకపోటీ పెట్టడం ద్వారా బరిలో నిలపాలని కూడా లెఫ్ట్ వర్గాలు భావిస్తున్నట్టు తెలిసింది. -
‘రాష్ట్రంలో శత్రువులు.. ఢిల్లీలో చెట్టాపట్టాలు!
తిరువనంతపురం: ప్రధానమంత్రి నరేంద్రమోదీ కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు ఇతర రాష్ట్రాల్లో ఎప్పుడూ విడిపోని ప్రాణ స్నేహితులని కానీ కేరళ మాత్రం బద్దశత్రువులని ఎద్దేవా చేశారు. ఆయన మంగళవారం కేరళలోని తిరువనంతపురంలో ఏర్పాటు చేసిన బీజేపీ పార్టీ యాత్ర ముగింపు సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ‘కేరళలో కాంగ్రెస్ పార్టీ, లెఫ్ట్ పార్టీలు ఒకరికొకరు శత్రువులు. ఇతర రాష్ట్రాల్లో మాత్రం ప్రాణ స్నేహితులు. ఈ పార్టీలు తిరువనంతపురం భిన్నమైన భాష మాట్లాడి.. ఢిల్లీలో మాత్రం ఒకే భాష మాట్లాడుతాయి’ అని ప్రధాని మోదీ మండిపడ్డారు. మరోవైపు కేరళలో కాంగ్రెస్ పార్టీ సీపీఐ(ఎం) ప్రత్యర్థులు.. అదే పశ్చిమ బెంగాల్లో మాత్రం మళ్లీ మిత్రపక్షాలు. ఇటువంటి వైరుధ్యాలు కలిగిఉన్న కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి పొత్తులో భాగంగా ఢిల్లీ, గుజరాత్, గోవాల్లో సీట్లు సర్దుబాటు చేసుకుందని దుయ్యబట్టారు. ‘కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ అవినీతిపరుడు. కేరళలో గత కమ్యూనిస్ట్ పార్టీ పాలకులు కాంగ్రెస్ కార్యకర్తలపై లాఠీ చార్జీలు చేశారు. కమ్యూనిస్ట్ నేత పలు కుంభకోణాలకు పాల్పడ్డారు. కానీ.. ప్రతిపక్షాల ‘ఇండియా కూటమి’లో మాత్రం ఇరుపార్టీ నేతలు ఢిల్లీలో కూర్చొని బిస్కెట్లు, సమోసాలు తింటూ చాయ్ తాగుతారు’ అని ప్రధాని మోదీ మండిపడ్డారు. కేరళలో ఒకటి చెప్పి.. ఢిల్లీలో మరోటి చెప్పి ద్రోహం చేసేవారికి (కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు) వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కేరళ ప్రజలు తగినబుద్ధి చెప్పాలని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కేరళలో బీజేపీకి డబుల్ డిజిట్ సీట్లు ఇవ్వాలని ప్రధాని మోదీ ప్రజలను కోరారు. కేంద్ర పథకాలతో కేరళ లబ్ధి పొందుతున్నట్లు తెలిపారు. గత 2019 లోక్‌సభ ఎన్నికల్లో 20 సీట్లలో కాంగ్రెస్ పార్టీ 15 సీట్లను గెలుచుకోగా.. బీజేపీ కనీసం ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. -
కాంగ్రెస్ తో కామ్రేడ్లు కటీఫ్
-
పెండింగ్ 19పై నేడు భేటీ
సాక్షి, హైదరాబాద్: పెండింగ్‌లో ఉన్న 19 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్‌పార్టీ సోమ వారం తుది చర్చలు జరపనుంది. వామపక్షాలతో పొత్తుతో పాటు పోటీ తీవ్రంగా ఉన్న ఈ స్థానాల్లో ఏం చేయాలన్న దానిపై ఢిల్లీ వేదికగా నేతలు సమా వేశం కానున్నారు. ఈ భేటీ కోసం టీపీసీసీ నేతలు ఆదివారమే ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఏఐసీసీ కార్యాలయంలోని వార్ రూంలో పార్టీ అధిష్టానంతో జరిగే సమావేశానంతరం సోమవారం రాత్రి లేదంటే మంగళవారం తుది జాబితా వస్తుందని గాంధీభవన్ వర్గాలు చెపుతున్నాయి. లెఫ్ట్‌తో ‘లెఫ్టా.. రైటా?’ లెఫ్ట్ పార్టీలతో పొత్తుల విషయంలోనూ సోమవారం జరిగే సమావేశాల్లో స్పష్టత వస్తుందని కాంగ్రెస్ వర్గాలు చెపుతున్నాయి. ముఖ్యంగా సీపీఎం పార్టీతో పీటముడి పడిన వైరా, మిర్యాలగూడ స్థానాల్లో ఏం చేయాలన్న దానిపై కాంగ్రెస్ నేతలు నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో పాటు సీపీఐకి ఇవ్వాలనుకుంటున్న కొత్తగూడెం, చెన్నూరు సీట్ల విషయంలోనూ తేడా వచ్చిందనే చర్చ జరుగుతోంది. వివేక్ కుమారుడికి చెన్నూరు సీటు? చెన్నూరు స్థానాన్ని మాజీ ఎంపీ వివేక్ కుమారుడికి కేటాయించేందుకు కాంగ్రెస్ పార్టీ అంగీకరించిందని, ప్రస్తుతం బీజేపీలో ఉన్న వివేక్‌ను పార్టీలో చేర్చుకుని ఆయన్ను పార్లమెంటుకు పోటీ చేయించాలని కాంగ్రెస్ ప్రతిపాదిస్తోందని సమాచారం. ఈ మేరకు శనివారమే మొయినాబాద్‌లోని వివేక్ ఫాంహౌస్‌లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్, వివేక్‌లు భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో సీపీఐకి చెన్నూరు అసెంబ్లీ కేటాయించడం కష్టమేనని, సీపీఐ, సీపీఎంలకు చెరొక్క సీటును మాత్రమే కాంగ్రెస్ ఆఫర్ చేస్తుందని, ఇందుకు ఆ పార్టీలు అంగీకరిస్తే కలిసి ముందుకెళ్లవచ్చని, లేదంటే ఎవరి దారిలో వారు వెళ్లాల్సి వస్తుందని కాంగ్రెస్ నేతలంటుండడం గమనార్హం. -
‘పొత్తు’ పొడిచేనా!
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్, వామపక్షాల పొత్తుపై నీలినీడలు అలుముకుంటున్నాయి. ఆ పార్టీల మధ్య పొత్తు కుదురుతుందా? లేదా? అన్న సందిగ్ధత ఏర్పడుతోంది. సీపీఐ విషయంలో స్పష్టత వచ్చినా, సీపీఎంకిస్తామన్న రెండుస్థానాల్లో మిర్యాలగూడ ఖరారు చేసిన కాంగ్రెస్ పార్టీ.. వైరా స్థానంపై ఎటూ తేల్చకపోవడంతో ఆదివారం సీన్ మారిపోయింది. వైరా ఇవ్వనిపక్షంలో కాంగ్రెస్‌తో పొత్తు ఉండదని సీపీఎం స్పష్టం చేసింది. కాంగ్రెస్ తన తుది నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉన్న నేపథ్యంలో అసలు వామపక్షాలు, కాంగ్రెస్ మధ్య పొత్తు ఉంటుందా లేదా అన్న చర్చ జరుగుతోంది. సీపీఐ మౌనం.. సీపీఐ, సీపీఎంలకు రెండేసి చొప్పున అసెంబ్లీ స్థా నాలు కేటాయించేందుకు కాంగ్రెస్ పార్టీ అంగీకరించింది. అయితే వామపక్షాలు కోరుకున్న విధంగా స్థానాలు ఇవ్వడం కుదరదని స్పష్టం చేసింది. సీపీఐ కొత్తగూడెం, మునుగోడు స్థానాలు కోరగా, కాంగ్రెస్ పార్టీ కొత్తగూడెం, చెన్నూరు స్థానాలు కేటాయించింది. సీపీఎం మిర్యాలగూడతో పాటు భద్రాచలం లేదా పాలేరు స్థానాలు ఇవ్వాలని కోరగా మిర్యాలగూడ మాత్రమే సాధ్యమవుతుందని, మిగిలిన రెండింటిలో ఏ సీటూ ఇవ్వలేమని కాంగ్రెస్ తేల్చిచెప్పింది. ఆ రెండు స్థానాలకు తమ అభ్యర్థులను కూడా ప్రకటించింది. దీంతో వైరా తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ కూడా ఇచ్చేందుకు సిద్ధమైనట్టు భావించినా ఒక్కరోజులో పరిస్థితి మారింది. తాజా పరిణామాలపై సీపీఐ మౌనంగా ఉంది. ఏం చేయాలనే దానిపై తర్జనభర్జన పడుతున్నట్టు సమాచారం. కాగా ముందు ప్రకటించిన చెన్నూరు స్థానం కూడా సీపీఐకి కేటాయించే అవకాశాలు కనిపించడం లేదని అంటున్నారు. అదే నిజమైతే సీపీఐ వైఖరి కూడా మారే అవకాశముందని చెబుతున్నారు. ఒక వేళ చెన్నూరు ఖరారైతే కాంగ్రెస్‌తో ముందుకు వెళుతుందా? సీపీఎంతో ముడిపెడుతుందా? అనే చర్చ జరుగుతోంది. సహకారంపై సందేహాలు పొత్తు కుదిరినా కాంగ్రెస్ ఏమేరకు సహకరిస్తుందోనన్న చర్చ కూడా నడుస్తోంది. ఇప్పటికే మిర్యాలగూడలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిని ఆ పార్టీ అనధికారికంగా ప్రోత్సహిస్తోందని సీపీఎం వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. కొత్తగూడెంలోనూ అలాంటి పరిస్థితే నెలకొందని సీపీఐ వర్గాలు చెబుతున్నాయి. ఇలాగైతే ఎలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీంతో రెబల్ అభ్యర్థులను ప్రోత్సహించకూడదనే షరతును కాంగ్రెస్ పార్టీ ముందు పెట్టాలని వామపక్షాలు భావిస్తున్నట్టు సమాచారం. -
లెఫ్ట్ పార్టీలకు ఏమైంది?
-
ఉద్యమ ఆకాంక్షలను తుంగలో తొక్కారు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామిక వేదిక (టీఎస్డీఎఫ్) ఏర్పాటైంది. ఇందులో సీపీఐ, సీపీఐ (ఎంఎల్) ప్రజాపంథా, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ, ఎంసీపీఐ (యూ), ఆర్ఎస్పీ, బీఎల్ఎఫ్, భారత జాతీయ ఉద్యమ సంఘం తదితర అనేక లౌకిక ప్రజాసంఘాలు కలిసి టీఎస్డీ ఎఫ్‌ను ఏర్పాటు చేశాయి. ఈ వేదికకు చైర్మన్‌గా హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్, కో కన్వీనర్లుగా పార్టీకొకరు చొప్పున ఉండాలని నిర్ణయించారు. రాష్ట్ర సమన్వయకర్తగా నైనాల గోవర్ధన్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో టీఎస్డీఎఫ్ విధాన పత్రం, ఉమ్మడి కార్యాచరణను నాయకులు ప్రకటించారు. చైర్మన్ జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ, కేసీఆర్ ప్రభుత్వం ప్రజల ప్రయోజనాలను, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ ఆకాంక్షలను పూర్తిగా తుంగలో తొక్కిందని ధ్వజమెత్తారు. కేసీఆర్ ప్రభుత్వ అవినీతి, నియంతృత్వ పాలనకు వ్యతిరే కంగా వామపక్ష పార్టీలు, లౌకిక ప్రజాస్వామిక సంస్థలు కలిసి ఈ వేదికను ఏర్పాటు చేశాయన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వం అదానీ, అంబానీ లాంటి కొద్దిమంది పెట్టు బడిదారులకు దోచిపెడుతోందని మండిపడ్డారు. ప్రధాని మోదీ చేతిలో రాజ్యాంగ వ్యవస్థలు ధ్వంసమయ్యాయన్నారు. బీజేపీ మతోన్మాద విధా నాలు, బడా సంపన్న అనుకూల విధానాలు, పేదల వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పని చేస్తామ న్నారు. ముఖ్యంగా కేసీఆర్ కుటుంబం అడ్డూ అదుపులేని అవినీతికి పాల్పడుతోందని దుయ్య బట్టారు. తెలంగాణలో అవినీతి ప్రపంచ రికార్డు లను కూడా బద్దలు కొట్టిందన్నారు. ఈ అవినీతి తెలంగాణ ప్రజల పురోభివృద్ధికి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు గుదిబండగా మారిందని, అందుకే అంతా కలిసి అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రిటైర్డ్ ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జువ్వాడి చలపతిరావు, సీపీఐ రాష్ట్ర నాయకులు బాల మల్లేశ్, సీపీఐ ఎంఎల్ ప్రజాపంథా నాయకుడు హన్మేష్, ఆర్ఎస్పీ రాష్ట్ర కార్యదర్శి జానకి రాములు, ఎంసీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు తుకారాం, ఇతర నాయకులు గుర్రం విజయ్ కుమార్, కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. టీఎస్డీఎఫ్ విధాన పత్రం ముఖ్యాంశాలు ఇవీ.. ప్రతి మండలంలో అవసరమైనన్ని నాణ్యమైన పాఠశాలలు స్థాపించాలి. నాణ్యమైన వైద్యం అందరికీ అందుబాటులోకి తీసుకురావాలి. ప్రతి ఐదు వేల మంది జనాభాకు ఒక రోగ నిర్ధారణ పరీక్ష కేంద్రాన్ని నెలకొల్పాలి. స్వామినాథన్ సిఫారసులకు అనుగుణంగా పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వాలి. ప్రతి ఒక్కరికి ఉద్యోగ హక్కును కల్పించాలి. లేకుంటే నిరుద్యోగులందరికీ జీవించే నిరుద్యోగ భృతిని ఇవ్వాలి. భూమిలేని పేదలకు భూములను పంపిణీ చేయాలి. దళితులకు 3ఎకరాల భూమి ఇవ్వాలి. కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ వ్యవస్థను రద్దుచేసి అందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలి. కుల ప్రాతిపదికగా జన గణన జరగాలి. చట్టసభల్లో బీసీలకు, మైనారిటీలకు రిజర్వేషన్లు కల్పించాలి. కాళేశ్వరం, భగీరథ ప్రాజెక్టుల్లో జరిగిన భారీ అవినీతిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలి. -
కాంగ్రెస్.. కామ్రేడ్స్ కలిసే..!
కాంగ్రెస్...కామ్రేడ్స్ కలిసే..! -
‘కొడవలి’తో కుదిరేనా?
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ నుంచి విడిపోయిన ఉభయ కమ్యూనిస్టు పార్టీలను వచ్చే ఎన్నికల్లో తమతో కలుపుకోవడంపై కాంగ్రెస్ పారీ్ట ఊగిసలాటలో ఉంది. సీపీఎం, సీపీఐలతో కలసి వెళ్లడంపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మెజార్టీ నేతలు పొత్తులు వద్దనే అభిప్రాయంతో ఉండగా, పార్టీ హైకమాండ్ మాత్రం అందుకు భిన్నంగా ఆలోచన చేస్తోంది. జాతీయ స్థాయిలో ఏర్పడిన ఇండియా కూటమిలో కాంగ్రెస్, లెఫ్ట్ భాగస్వాములైన కారణంగా రాష్ట్ర స్థాయిలోనూ దోస్తీ కొనసాగించాలని రెండు పక్షాల హైకమాండ్లు భావిస్తున్నాయి. రాష్ట్రంలోని ఉభయ కమ్యూనిస్టు పారీ్టలు కూడా కాంగ్రెస్‌తో కలిసి పనిచేసేందుకు సంసిద్ధతను వ్యక్తం చేస్తున్నాయి. కానీ మెజార్టీ కాంగ్రెస్ నేతలు మాత్రం గతంలోలా ఓట్ల బదిలీ జరిగే అవకాశం లేదని అందువల్ల ఒంటరి పోటీయే మంచిదనే అభిప్రాయంతో ఉన్నారు. జాతీయ స్థాయిలోనే ప్రతిపాదనలు లెఫ్ట్, కాంగ్రెస్‌ల మధ్య పొత్తు వ్యవహారం ఇంకా కింది స్థాయికి రాలేదని, ఇప్పటిరకు ఏఐసీసీ, లెఫ్ట్ పారీ్టల జాతీయ నాయకత్వం స్థాయిలోనే ఈ ప్రతిపాదన ఉందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే ఇరు కమ్యూనిస్టు పార్టీల రాష్ట్ర నేతలతో ఫోన్లో మాట్లాడారని వివరిస్తున్నాయి. ‘వారు మాట్లాడుకున్న తర్వాత వ్యవహారం రాష్ట్ర పారీ్టల వరకు వస్తుంది. అప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం.’ అని టీపీసీసీకి చెందిన ముఖ్య నేత ఒకరు వ్యాఖ్యానించారు. మరోవైపు రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈసారి ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలు ఎన్ని స్థానాల్లో ఏ మేరకు ప్రభావితం చూపుతాయన్న దానిపై కూడా కాంగ్రెస్ నేతలు అంచనాలు వేస్తున్నారు. రాష్ట్రంలో లెఫ్ట్ పారీ్టల ప్రభావం బాగా తగ్గిపోయిందని, 10–15 చోట్ల అంతోఇంతో ఓటుబ్యాంకు ఉందని, నాలుగైదు చోట్ల మాత్రం గెలుపోటములను ప్రభావితం చేయవచ్చని భావిస్తున్నారు. ఆ ఆరూ.. అసాధ్యమే ఇతర పార్టీలతో పొత్తు కుదరితే ఏయే అసెంబ్లీ స్థానాలు అడగాలన్న దానిపై సీపీఎం, సీపీఐ నేతలు ఇప్పటికే ఓ అభిప్రాయానికి వచ్చారు. పార్టీ రాష్ట్ర కమిటీల్లో చర్చించిన అనంతరం ఈ సీట్లపై ఏకాభిప్రాయం కూడా వచ్చినట్టు తెలుస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరు, భద్రాచలం, మధిర, ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నకిరేకల్, మిర్యాలగూడతో పాటు రంగారెడ్డి జిల్లా పరిధిలోనికి వచ్చే ఇబ్రహీంపట్నం స్థానాల్లో పోటీ చేయాలనే ఆలోచనతో సీపీఎం ఉంది. అయితే ఈ ఆరు స్థానాల్లో ఒక్క స్థానం వదులుకోవడం కూడా సాధ్యం కాదనే అభిప్రాయం కాంగ్రెస్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. మధిర, భద్రాచలంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలుండగా, పాలేరులో గతంలో కాంగ్రెస్ గెలిచింది. ఇక ఇబ్రహీంపట్నంలో మల్రెడ్డి రంగారెడ్డి, మిర్యాలగూడలో బత్తుల లక్ష్మారెడ్డి, కుందూరు రఘువీర్‌రెడ్డి లాంటి బలమైన నేతలున్నారు. నకిరేకల్‌లో మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం పోటీ చేస్తారనే ప్రచారం ఉంది. దీంతో సీపీఎం అడిగే ఈ ఆరుస్థానాల విషయంలోనూ చిక్కుముడి ఏర్పడే అవకాశం ఉందని అంటున్నారు. అతికష్టంగా ఆ ఒక్కచోట..! సీపీఐ ఐదు సీట్లలో పోటీ చేయాలని భావిస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, వైరా, నల్లగొండ జిల్లా మునుగోడు, మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి, సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ స్థానాలపై ఆ పార్టీ దృష్టి ఉంది. కాంగ్రెస్‌తో చర్చల్లో ఈ స్థానాలను అడిగే అవకాశాలున్నాయి. అయితే కొత్తగూడెం స్థానాన్ని సీపీఐకీ కాంగ్రెస్ ఇచ్చే అవకాశం లేదు. వైరాలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరోక్ష మద్దతుతో గెలిచిన ఎమ్మెల్యే రాములు నాయక్ బీఆర్ఎస్లో చేరారు. దీంతో అక్కడ పోటీకి రాందాస్ నాయక్‌తో పాటు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వర్గానికి చెందిన విజయాబాయి పోటీ పడుతున్నారు. కాబట్టి ఈ స్థానాన్ని సీపీఐకి ఇవ్వడం కుదరదని కాంగ్రెస్ వర్గాలంటున్నాయి. బెల్లంపల్లిలో మాజీ మంత్రి గడ్డం వినోద్, హుస్నాబాద్‌లో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌లు బరిలో ఉండే అవకాశం ఉంది కాబట్టి ఆ రెండు స్థానాలను వదులుకోవడం కూడా కాంగ్రెస్‌కు కష్టమే. ఇక మిగిలిన మునుగోడులోనే సీపీఐని సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. మునుగోడులో 2018 ఎన్నికల్లో గెలిచినా, ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. ఈసారి ఈ స్థానాన్ని పాల్వాయి స్రవంతి, పున్నా కైలాశ్‌నేత, చల్లమల్ల కృష్ణారెడ్డి ఆశిస్తున్నారు. అయితే అక్కడ బీఆర్ఎస్, బీజేపీల మధ్య తీవ్ర పోటీ ఉండే అవకాశముంది. దీంతో ఒకవేళ ఇస్తే మునుగోడునే సీపీఐకి ఇవ్వాల్సి వస్తుందని మెజారిటీ కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. అయితే వామపక్షాలతో చర్చలకు వెళ్లి పొత్తు కుదుర్చుకోవాల్సి వస్తే మాత్రం కనీసం చెరో రెండు సీట్లను వదులుకోవాల్సి ఉంటుందని, దానివల్ల పారీ్టకి నష్టమే జరుగుతుంది తప్ప ఎలాంటి లాభం ఉండదనేది కొందరి అభిప్రాయంగా ఉంది. ఆ రెండు సీట్లు అసలు కుదరవు? ఉభయ కమ్యూనిస్టు పార్టీల సారథులు తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావులు పోటీ చేయాలని భావిస్తున్న పాలేరు, కొత్తగూడెం స్థానాలపై పీటముడి పడే అవకాశం ఉందని, ఆ రెండు సీట్లు వదులుకోవడం కాంగ్రెస్ పారీ్టకి సాధ్యం కాదనే అభిప్రాయం వినిపిస్తోంది. పాలేరు, కొత్తగూడెంలలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని, స్థానిక ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లోకి వెళ్లినా ఆ రెండు చోట్లా 2018లో కాంగ్రెస్ పార్టీ విజయఢంకా మోగించిందని, అలాంటప్పుడు ఆ సీట్లను ఎలా వదులుకుంటామని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ‘పొత్తులపై చర్చలు జరిగితే సీపీఐ, సీపీఎంలు ఆ రెండు సీట్లపైనే పట్టుపట్టడం ఖాయం. కానీ మేం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రెండు స్థానాలు ఇవ్వలేం. అందువల్ల చర్చలకు వెళ్లకపోవడమే మంచిదేమో..’ అని కాంగ్రెస్ కీలక నేత ఒకరు వ్యాఖ్యానించారు. ‘ఈసారి ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ జిల్లాల నుంచే మేం మెజార్టీ సీట్లు గెలుస్తామని అనుకుంటున్నాం. అక్కడ నాయకత్వం బాగా కష్టపడి పార్టీని నిలబెట్టింది. అలాంటి చోట్ల సీట్లు కమ్యూనిస్టులకు ఇస్తామంటే స్థానిక నాయకత్వం ఎలా స్పందిస్తుందో తెలియదు. కాబట్టి ఆచితూచి ముందుకెళ్లాలని భావిస్తున్నాం.’ అని మరో ముఖ్యనేత చెప్పారు. -
‘బీఆర్ఎస్కు మద్దతు కొనసాగుతుంది.. త్వరలో కేసీఆర్‌తో చర్చలు’
సాక్షి, హైదరాబాద్: ‘వామపక్ష పార్టీలైన సీపీఎం, సీపీఐలు విడివిడిగా పోటీ చేసి ఎంతో నష్టపోయాయి. ఇకపై వేరువేరుగా పోరాటం చేయకుండా ఐక్యంగా ముందుకు పోవాలని నిర్ణయించాం. అంతేకాకుండా బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న బీఆర్ఎస్ పార్టీకికి మద్దతు కొనసాగుతుందని స్పష్టం చేస్తున్నాం. దేశంలో బీజేపీ వ్యతిరేక లౌకిక శక్తులను ఏకం చేయడం ద్వారా కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వ ఏర్పాటే మా లక్ష్యం. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి మద్దతు కొనసాగిస్తూ మాకు బలం ఉన్న చోట్ల పోటీ చేయాలని నిర్ణయించుకున్నాం. అతి త్వరలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో చర్చిస్తాం..’అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. శుక్రవారం ఎంబీ భవన్లో సీపీఎం, సీపీఐల ఉమ్మడి సమావేశం జరిగింది. వచ్చే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసే అంశాలపై ఈ సమావేశంలో చర్చలు జరిపారు. అనంతరం తమ్మినేని, కూనంనేని మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌తో జట్టు కట్టం: తమ్మినేని బీఆర్ఎస్తో కమ్యూనిస్టులు దూరంగా ఉన్నారని, కాంగ్రెస్ పారీ్టతో జత కడతారనే తప్పుడు వార్తలను తమ్మినేని ఖండించారు. జాతీయ స్థాయిలో బీజేపీని ఎదుర్కొనే సత్తా బీఆర్ఎస్కు ఉందని, అందుకే మద్దతు తెలుపుతున్నామని చెప్పారు. బీఆర్ఎస్ తనకు తానుగా చొరవ చేసి మునుగోడులో కలిసి పని చేద్దామని కోరిందని, రానున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లోనూ కమ్యూనిస్టులతో పొత్తు ఉంటుందని సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించారని చెప్పారు. అయితే మంత్రులు, ఎమ్మెల్యేలు సీట్ల అంశంపై మైండ్ గేమ్ ఆడుతున్నారని విమర్శించారు. సీట్ల కేటాయింపులపై సీఎం కేసీఆర్‌తో ఇప్పటివరకు తాము చర్చించలేదన్నారు. కమ్యూనిస్టులు ఎన్నికలకు సమాయత్తం అవ్వడం లేదని కొందరు అనుకుంటున్నారని, కానీ తమకు బలం ఉన్న చోట సన్నాహాలు చేసుకుంటున్నామని తెలిపారు. ఓట్లు, సీట్ల కోసం దిగజారం: కూనంనేని మునుగోడులో ఏర్పడిన విపత్తును వామపక్షాలు అడ్డుకున్నాయని కూనంనేని అన్నారు. మునుగోడులో బీజేపీ గెలిస్తే ప్రభుత్వాన్ని అస్థిర పరిచేదని, ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీఎల్ సంతోష్ ప్రయత్నం చేశారని ఆరోపించారు. కమ్యూనిస్టులు లేని అసెంబ్లీ, పార్లమెంటులను ప్రజలు ఊహించుకోవడం లేదన్నారు. బీజేపీకి ప్రజల సమస్యలు పట్టవని, వ్యక్తిగత దూషణలకే పరిమితమవుతుందని విమర్శించారు. జాతీయ స్థాయిలో లౌకిక శక్తులతో కేసీఆర్ కలిసి పని చేయాలని కోరుకుంటున్నట్లు వివరించారు. గిరిజనేతరులకూ పోడు భూములు ఇవ్వాల్సిన అవసరం ఉందని, ఈ అంశం త్వరలో సీఎంకు వివరిస్తామన్నారు. -
బీఆర్ఎస్ తీరుపై కామ్రేడ్ల కస్సుబుస్సు
సాక్షి, హైదరాబాద్: పొత్తుల విషయంలో బీఆర్ఎస్ తీరుపై వామపక్షాలు గరంగరంగా ఉన్నాయి. పొత్తులుంటాయా ఉండవా అనే అంశంపై సీపీఐ, సీపీఎం కేడర్‌లో గందరగోళం నెలకొంది. పొత్తులు, ప్రజాసమస్యలపై చర్చించేందుకు సీఎం కేసీఆర్‌ను అపాయింట్మెంట్ కోరినా ఇప్పటివరకు లభించకపోవడంపై కామ్రేడ్లు కస్సుబుస్సులాడుతున్నారు. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో బీఆర్ఎస్ తమను ఉపయోగించుకొని పొత్తులపై చర్చించాలనే సరికి మాత్రం పక్కనపెడుతోందని కొందరు నేతలు మండిపడుతున్నారు. ఖమ్మంలో నిర్వహించిన సభకు తమ జాతీయ నేతలైన కేరళ సీఎం పినరయి విజయన్, డి.రాజా వంటి వారిని వెంటపడి మరీ పిలిపించుకున్న సీఎం కేసీఆర్... ప్రస్తుతం అపాయింట్మెంట్ ఇవ్వడానికి కూడా ఆసక్తి చూపించకపోవడాన్ని తప్పుబడుతున్నారు. ఈ నేపథ్యంలో సీపీఐ, సీపీఎం నేతలు శుక్రవారం ఎంబీ భవన్లో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సహా ఆ పార్టీల ముఖ్య నేతలు హాజరుకానున్నారు. బీజేపీని వ్యతిరేకించే శక్తులతోనే ముందుకు... మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా బీజేపీకి అడ్డుకట్ట వేయగలిగేది బీఆర్ఎస్ మాత్రమేనని భావించి ఆ పార్టీకి వామపక్షాలు మద్దతిచ్చాయి. అనుకున్నట్లుగానే బీజేపీ గెలవకుండా అక్కడ వామపక్షాల ఓట్లు సహకరించాయి. రానున్న ఎన్నికల్లోనూ బీజేపీని ఓడించే సత్తాగల పార్టీకే మద్దతు ఇవ్వాలన్నది వామపక్షాల వైఖరి. ఇందులో భాగంగా సీపీఐ, సీపీఎంలు బీఆర్ఎస్ను చెరో 10 అసెంబ్లీ స్థానాలు కోరాలనుకుంటున్నాయి. చర్చల్లో చివరకు చెరో ఐదు స్థానాలు తప్పనిసరిగా అడగాలన్నది వారి ఉద్దేశం. కానీ ఈ స్థానాలు ఇవ్వడానికి బీఆర్ఎస్ సిద్ధంగా లేదన్న వాదనలు వస్తున్నాయి. బీఆర్ఎస్ సిట్టింగ్‌లున్న ఆయా స్థానాలను కామ్రేడ్లకు ఇవ్వడం వల్ల ప్రస్తుత ఎమ్మెల్యేలు అలిగి సహకరించకపోతే ఓటు బదిలీ జరగక వారు ఓడిపోయే ప్రమాదం ఉందన్న భావనలో బీఆర్ఎస్ ఉందని వామపక్షాలు అంచనా వేస్తున్నాయి. అలాగే పది సీట్లు ఇచ్చినా వామపక్షాలు డబ్బు ఖర్చు పెట్టవని, దానివల్ల కూడా సీట్లు కోల్పోవాల్సి వస్తుందని కూడా బీఆర్ఎస్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్తో పొత్తు కుదరకపోతే కాంగ్రెస్‌తో పొత్తు కుదుర్చుకొనే దిశగా కూడా వామపక్షాలు ఆలోచిస్తున్నాయి. అయితే కాంగ్రెస్ కూడా ఇప్పటివరకు వామపక్షాలతో పొత్తుపై ఆసక్తి చూపించడంలేదని సమాచారం. -
TS: పొత్తుల విషయంలో వామపక్షాలు మౌనం.. కారణం అదేనా!
కొంతకాలంగా తెలంగాణ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. దీంతో పొత్తుల విషయంలో కమ్యూనిస్టు పార్టీలు ఎటూ తేల్చుకోలేకపోతున్నాయనే వాదన వినిపిస్తోంది. అసలు ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలో నిర్ణయించుకోలేకపోతున్నాయనే చర్చ కూడా నడుస్తోంది. బీఆర్ఎస్ విషయంలో క్లారిటీ రాలేదా? కాంగ్రెస్ బలపడుతున్నదని ఆలోచిస్తున్నారా? ఇంతకీ ఎర్రన్నల ఆలోచనలు ఎలా ఉన్నాయి? కొంతకాలంగా పొత్తుల విషయంలో తెలంగాణ కమ్యూనిస్టు పార్టీలు మౌనం పాటిస్తున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక తర్వాత సాధారణ ఎన్నికల్లో కూడా పొత్తు కొనసాగుతుందని రెండు వైపుల నుంచి ప్రచారం ఊపందుకుంది. కాని తాజా పరిణామాల నేపథ్యంలో పొత్తుల సంగతి తర్వాత ముందు మన బలం పెంచుకుందామని రెండు వామపక్షాలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే తమకు పట్టున్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బహిరంగసభలతో బలాన్ని చాటుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. కొత్తగూడెంలో సీపీఐ భారీ బహిరంగ సభ నిర్వహించి బీజేపీని టార్గెట్ చేసింది. ఖమ్మం అంటే కమ్యూనిస్టుల అడ్డా అని..ఇక్కడ కాషాయ పార్టీ పప్పులు ఉడకవని ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో పోటీ ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యనే ఉంటుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అంటున్నారు. అదే సమయంలో లెఫ్ట్ పార్టీలు ఎవరితో పొత్తు పెట్టుకుంటాయనే విషయమై ఎలాంటి చర్చలూ జరగలేదని ఆయన చెప్పారు. పొత్తుల అంశంపై ఎన్నికల సమయంలోనే స్పష్టత వస్తుందని కూడా ఆయన ప్రకటించారు. తెలంగాణలో కాంగ్రెస్ బలపడుతోందని.. అదే సమయంలో కర్ణాటక ఎన్నికల తర్వాత ఇక్కడ బీజేపీ పూర్తిగా బలహీనపడిందని లెఫ్ట్ నేతలు అంచనాలు వేస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీ ఎక్కడా కూడా గట్టిగా పోటీ ఇచ్చే పరిస్థితి లేదని కూడా వారు అభిప్రాయపడుతున్నారు. వారి అంచనాలు, అభిప్రాయాలు చూస్తుంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల్లో ఎవరితో అయినా పొత్తులు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం, వైరా, పినపాక స్థానాలపై సీపీఐ గురిపెట్టింది. అందులో భాగంగానే కొత్తగూడెంలో భారీ బహిరంగ సభతో బలప్రదర్శన చేసింది. కొత్తగూడెం నుంచి కూనంనేని సాంబశివరావు పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. సీపీఏం సైతం అదే ఫార్ములాను అనుసరిస్తోంది. పొత్తుల విషయం పక్కన పెట్టి వారికి పట్టు ఉన్నా ప్రాంతాల్లో బలం పెంచుకునే ప్రయత్నంలో సీపీఎం నాయకులు ఉన్నారు. ఇటివలే ఖమ్మం నగరంలో సీపీఏం కూడా భారీ బహిరంగ సభ నిర్వహించి సత్తా చాటే ప్రయత్నం చేసింది. ఉమ్మడి జిల్లాలో సీపీఏంకి పాలేరు, మధిర, భద్రాచలం నియోజకవర్గాల్లో బలం ఉంది. పాలేరు నుంచి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పోటి చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు సంబంధించి గ్రౌండ్ వర్క్ సైతం మొదలుపెట్టారు. సీట్ల విషయంలో బీఆర్ఏస్ నుంచి క్లారిటీ వచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో.. ముందు తమకు పట్టు ఉన్న ప్రాంతాల్లో బలం చూపించుకుంటే సీట్లు అవే వస్తాయన్న భావనలో ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే పొత్తుల విషయంలో మౌనంగా ఉంటున్నాయి. అయితే సీపీఎం, సీపీఐ కలిసే పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి. మరి వారి పొత్తు కాంగ్రెస్‌తో ఉంటుందా? బీఆర్ఎస్తో ఉంటుందా? బహుశా వారికి కావాల్సిన సీట్లు ఎవరిస్తే వారితో ఉంటుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. చదవండి: బండ్ల గణేష్ పొలిటికల్ ట్వీట్.. రాజకీయాల్లోకి రీఎంట్రీ! -
చంద్రబాబు బరితెగింపునకు నిదర్శనం ‘కరకట్ట నివాసం’: సజ్జల
సాక్షి, విజయవాడ: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వెనుకబడిన వర్గాల అభివృద్ధి దిశగా పనిచేస్తున్నారని తెలిపారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. చంద్రబాబు, పవన్ కల్యాణ్, లెఫ్ట్ పార్టీలు సంపన్నుల వైపు నిలబడతున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు ఏజెంట్లా పవన్ వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. సీఎం జగన్ రాజకీయ నిర్ణయాలు చంద్రబాబుకు రాజకీయంగా ఉరితాడు లాంటివని అన్నారు. అందుకే తోడేళ్ల మందలా ఏకమై దాడి చేయాలని చూస్తున్నారని విమర్శలు గుప్పించారు. అసెంబ్లీలో నూతన ఎమ్మెల్సీల ప్రమాణసీకారోత్సవ కార్యక్రమం అనంతరం సజ్జల మీడియాతో మాట్లాడారు. 'రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి మేలు చేసేలా సీఎం జగన్ పాలన ఉంది. మేనిఫెస్టోలో 98.2 శాతం హామీలను అమలు చేసి చూపించారు. చంద్రబాబు హయాంలో జరిగిన దేశంలోనే అతిపెద్ద స్కామ్ అమరావతి. బాబు అక్రమాలకు చిరునామా చంద్రబాబు కరకట్ట నివాసం. లింగమనేని రమేష్‌కి, హెరిటేజ్‌కి మధ్య లావాదేవీలు జరిగాయి. చంద్రబాబు బరితెగింపునకు నిదర్శనం ఈ అక్రమ నివాసం. అమరావతిలో పేదలకు ఇళ్లు ఇవ్వకుండా చట్టం చేసిన వ్యక్తి చంద్రబాబు. డబ్బున్న వాళ్లకోసం పేదలకు ఇవ్వకుండా చేశారు. రియల్ఎస్టేట్ ఏజెంట్ల ద్వారా చంద్రబాబు గొడవ చేయిస్తున్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే కోర్టులకు వెళ్లి అడ్డుకుంటున్నారు.' అని సజ్జల ఫైర్ అయ్యారు. చదవండి: వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం.. -
ఆపత్కాలంలో ఐక్యతా రాగం!
దేశంలో వామపక్షాలు బలహీనమై పోతున్న కాలమిది. ఇదే సమయంలో మతతత్త్వ శక్తులు బలపడిపోతుండటం ప్రగతి శీల ప్రజాస్వామ్యవాదులకు ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఉభయ కమ్యూనిస్టు పార్టీల (సీపీఐ, సీపీఎం) జాతీయ నాయకత్వాలు హైదరాబాద్‌లో సమావేశమై వామపక్షాల ఐక్యత అవసరంపై చర్చించాయి. ఈ పార్టీల్లో సీపీఐ తాజాగా ‘జాతీయ పార్టీ’ హోదాను కోల్పోయిన సంగతి తెలిసిందే. మొత్తం మీద ఉభయ కమ్యూనిస్టు పార్టీల నాయకత్వాలు వామపక్షాలు ఐక్యమైతేకాని మతతత్త్వ శక్తులను అడ్డుకోవడం సాధ్యం కాదని ప్రకటించాయి. వామపక్షాల ఐక్యత అవసరాన్ని ఎనభై ఏళ్ల క్రితమే భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రమాణ పత్రం ఒకటి నొక్కి వక్కాణించడం గమనార్హం. ‘‘భారతదేశాన్ని ‘హిందూ దేశం’గా మార్చేందుకు, భారత సెక్యులర్ రాజ్యాంగం స్థానంలో దేశాన్ని విభజించి కేవల ‘హిందూ’ దేశంగా మార్చే ‘మను స్మృతి’ని అమలు పరిచేందుకు ఆరెస్సెస్, బీజేపీలు ప్రయత్నిస్తు న్నాయి. మితవాద రాజకీయాలపై శక్తిమంతంగా పోరాడాలంటే దేశంలో వామ పక్షాల మధ్య ఐక్యత మరింత అవసరం. దేశంలోని మితవాద రాజకీ యాలపై నిరంతర పోరుకు వామపక్షాల ఐక్యత నేడు తక్షణావసరం. ఈ ఐక్యత పరస్పర విశ్వాసం ద్వారానే సాధ్యం’’. – సీపీఐ, సీపీఎం పార్టీలు హైదరాబాద్‌లో తొలిసారిగా జరిపిన సంయుక్త సమావేశంలో (10.4.2023) తీసుకున్న నిర్ణయం. వామపక్షాలైన సీపీఐ, సీపీఎంల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన తొలి ‘యూనిటీ’ సమావేశం వామపక్ష అభిమానులలో నూతనోత్తే జానికి కారణమయింది. ఉభయపక్షాల ఐక్యత తక్షణావసరాన్ని ఇరు పక్షాల నాయకులు, కార్యకర్తలు గుర్తించడం ముదావహం. నిజానికి ఉభయ పార్టీలూ కలవ వలసిన అవసరాన్ని కొత్తగా ఇప్పుడు గుర్తించారని చెప్పనవసరం లేదేమో. ఎనిమిది దశాబ్దాల క్రితమే కాన్పూర్ కేంద్రంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శి ఎస్. సత్యభక్త కమ్యూనిస్టుల ఐక్యత కోసం తొలి ప్రమాణ పత్రాన్ని వెలువరించారు. హైదరాబాద్ కేంద్రంగా వెలువడిన ఉభయ పార్టీ (సీపీఐ, సీపీఎం)ల సంయుక్త సమావేశంలో ప్రసంగించిన సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా, ïసీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిలు ఉగ్గడించిన ‘ఉభయ పక్షాల ఐక్యత అవసరం’ గుర్తించ డానికి ఇన్నేళ్ల సమయం పట్టడం... ఉభయ వామ పక్షాల ఉమ్మడి వార సత్వానికి ఒక రకంగా ‘మచ్చ’గానే భావించాలి. అయినా ఇప్పటికైనా ఏకపక్షంగా ఉభయపక్షాల ఐక్యతావాంఛ... అనేక సమస్యల పరిష్కా రానికి ఎదురుచూస్తున్న దేశానికి శుభసూచకంగా భావించాలి. ఈ సందర్భంగా కాన్పూర్ తొలి పార్టీ ప్రమాణ పత్రాన్ని ఎందుకు ప్రస్తావించవలసి వచ్చిందంటే, ఆ పత్రం ఆనాటికే కాదు, ఎప్పటికీ పోరాట పటిమ గల పార్టీకి ఒక బలమైన దిక్సూచిగా ఎలా నిలబడి పోయిందో గుర్తించడం కోసమే! అందులో పేర్కొన్న ప్రమాణాలలో కొన్నింటిని ఒక్కసారి పరిశీలిద్దాం: ప్రజా శ్రేయస్సు లక్ష్యంగా లేని రాజకీయ పార్టీలు అధికారంలోకి రావాలనుకొనేది సంపాదన కోసం, అది వీలు చిక్కకపోతే ప్రజలపై నిర్బంధ విధానాల ద్వారా ఒడుపుకోవడం కోసమే గానీ ప్రజల ప్రయోజనాలను గుర్తించి వారిని సకాలంలో ఆదుకోవడానికి కాదు; ఈ పరిస్థితుల్లో వామపక్షాల బాధ్యత పెట్టుబడిదారీ శక్తుల తరఫున కొమ్ము కాయడం కాదు, ఆ కొమ్ములను విరిచి ప్రజాబాహుళ్యం మౌలిక అవసరాలైన తిండి, బట్ట, వసతి, ఉపాధి సౌకర్యాలను కల్పించడం. తద్వారా ప్రజలు తమ కష్టార్జితాన్ని తాము స్వేచ్ఛగా అనుభవించడానికి దోపిడీకి తావు లేకుండా చేయడం కమ్యూనిస్టుల విధిగా ఉండాలి. ఇదీ స్థూలంగా 1924 నాటి కాన్పూర్ డాక్యుమెంట్ ఆదేశించింది. ఆ ‘ప్రమాణ పత్రం’ మకుటం కూడా ‘సత్యభక్త, భార తీయ సామ్యవాది దళ్’ (ది ఇండియన్ కమ్యూనిస్ట్ పార్టీ) అనీ, ‘సత్యవాది’ అనీ! 1924 నాటి భారత కమ్యూనిస్ట్ పార్టీ కొన్ని సమ స్యల్ని ఎంతగా మనసు విప్పి బాహాటంగా ప్రకటించిందో చూడండి: ‘సమాజంలో నాయకులకు, రాజకీయవేత్తలకు, మత ప్రవక్తలకు, సంఘ సంస్కర్తలకు కొదువ లేదు వీరంతా ప్రజలకు చేసే మార్గ నిర్దేశానికి కొదవ లేదు. కానీ వీరు చూపే అనేక మార్గాలు ఉన్న ‘జబ్బు’ను పెంచేవే కానీ తుంచేవి కావు. పైగా చాలామంది మార్గదర్శ కులు తమ పొట్టలు నింపుకోవడం కోసం ప్రజల్ని బుద్ధి పూర్వకంగానే అగాథంలోకి నెట్టేస్తారు. కానీ, ఇలా అగాథంలోకి నెట్టే వాళ్లనుంచి ప్రజల్ని రక్షించడానికే భారత కమ్యూనిస్టు పార్టీ పుట్టింది. ప్రజలు ఎదుర్కొనే అన్ని సమస్యల నుంచీ వారిని తామే రక్షిస్తామన్న హామీ ఏ పార్టీ ఇవ్వదు. ఎందుకంటే, ఏ పార్టీ వ్యవస్థా అలా ఉండదు కనుక. ప్రజలంతా ఏకమై తమ కాళ్లమీద నిలబడి సమస్యల పరిష్కారానికి ఉద్యమించాలి. ధనికులకు, పేదలకు మధ్య దారుణంగా పేరుకు పోయిన సమస్యల్ని తగ్గించడం పార్టీ లక్ష్యంగా ఉండాలి. సమాన త్వాన్ని ప్రేమించేవారికి పార్టీలో నిస్సందేహంగా స్థానం ఉంటుంది. అంతేగాని తాము మాత్రమే అన్ని సౌకర్యాలు అనుభవించాలనుకొనే వారికి పార్టీలో స్థానం ఉండదు. ఎవరైతే ప్రజల్ని మోసం చేస్తూ, ఇతరులను దోచుకుంటూ అనుభవించగోరతారో... వారికి పార్టీలో స్థానం ఉండదు. తమ చెమటోడ్చి సంపాదించుకుంటూ, తప్పుడు మార్గాల ద్వారా సంపాదనకు ఒడిగట్టని పేద రైతులు, కార్మికులు, నిరుపేద గుమస్తాలు, చిన్నచిన్న ప్రభుత్వోద్యోగులు, రైల్వే సిబ్బంది, స్కూలు మాస్టర్లు, చిన్నచిన్న వ్యాపారులు, చిన్నస్థాయి పోలీస్ కానిస్టేబుల్స్, ప్రెస్ ఉద్యోగులు – వంటి వారు మాత్రమే మా పార్టీలో సభ్యత్వానికి అర్హులు’ అని పార్టీ ఈ పత్రం ద్వారా చాటింది. అయితే పెట్టుబడిదారీ (కాపిటలిస్ట్) వర్గానికి, వారి ప్రయోజ నాల కోసం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పనిచేసే సంస్థలను పార్టీ సహించదని చెప్పింది. అందుకనే శ్రమ జీవులంతా ఏకైక భారత కమ్యూనిస్టు పార్టీ పతాకం కింద సమకూడి, తుది శ్వాస వరకూ నిలబడాలని ప్రమాణ పత్రం నిర్దేశించింది. అంతేగాదు, రంగంలో ఉన్న పెక్కు రాజకీయ పార్టీలు వర్గ ప్రయోజనాలను ప్రతిబింబించేవి కాబట్టి... వీటన్నింటిలో ఏకైక పెద్ద కార్మికవర్గ శక్తి కమ్యూనిస్టు పార్టీ కాబట్టి అందరూ ఐక్య శక్తిగా సమీకృతం కావాలని ఆ మానిఫెస్టో ప్రకటించింది. బహుశా అందుకనే సుభాష్ చంద్రబోస్ రానున్న రోజుల్లో భారతదేశ భవిష్యత్తు మౌలికంగా వామపక్ష శక్తుల పోరాటం, త్యాగాల మీదనే ఆధారపడి ఉంటుందని జోస్యం చెప్పారు. ఎందుకంటే, విప్లవోద్యమం అనేది అరాచక ఉద్యమం కాదు, టెర్రరిస్టుల ఉద్యమమూ కాదు. భారత స్వాతంత్య్రోద్యమంలో దేశ భక్తులైన అనేకమంది మేధావులను, నాయకులను, యువకులను, రచయిత లను ‘దేశద్రోహులు’గా వలస పాలకులు ముద్రవేసి జైళ్లలో పెట్టారు. అందులో వామపక్ష భావాలు ఉన్నవారు అనేకమంది ఉన్నారు. ‘మనల్ని దేన్ని చదవకూడదని బ్రిటిష్ పాలకులు కోరుకున్నారు’ (బ్యాన్డ్ అండ్ సెన్సార్డ్: వాట్ ది బ్రిటిష్ రాజ్ డిడిన్ట్ వాంట్ అజ్ టు రీడ్’) అనే గొప్ప చారిత్రిక విశ్లేషణా గ్రంథాన్ని తాజాగా అందించిన చరిత్రకారిణి దేవికా సేథి... అప్పటి వలస భారతంలోని ‘సెన్సార్షిప్’ నిబంధనల మాలోకం గురించీ వివరించారు. స్వాతంత్య్రం వచ్చిన దాదాపు 75 ఏళ్ల తర్వాత రాసిన ఆ గ్రంథం ఎన్నో మరుగున పడిన విషయాలను తెలియచేస్తోంది. ఇంతకూ ‘దేశద్రోహి’ అంటే ఎవరు, అన్న ప్రశ్నకు టర్కీ ప్రసిద్ధ ప్రజా మహాకవి హిక్మెట్‌ను అడిగితే చెబుతాడు: ‘‘ఔను, నేను దేశద్రోహినే – మీరు దేశభక్తులైతే మీరే మన మాతృభూమి పరిరక్షకులైతే నేను నా మాతృభూమికి దేశద్రోహినే దేశభక్తి అంటే మీ విశ్వాసాల వ్యవసాయ క్షేత్రాలే అయితే దేశభక్తి అంటే మీ బొక్కసాల్లో సంపదలే అయితే దేశభక్తి అంటే మీ బ్యాంకు ఖాతాల్లో నిధులే అయితే దేశభక్తి అంటే దారి పక్క దిక్కులేని ఆకలి చావులే అయితే దేశభక్తి అంటే జనాలు కుక్కపిల్లల్లా చలికి వణికిపోవడమే అయితే ఎండా కాలంలో మలేరియాతో కునారిల్లడమే అయితే మతగ్రంథాలను వల్లించడమే దేశభక్తి అయితే పోలీసు చేతి లాఠీయే దేశభక్తి అయితే మీ కేటాయింపులూ, మీ జీతభత్యాలు మాత్రమే దేశభక్తి అయితే మూఢ విశ్వాసాల అజ్ఞానపుటంధకారపు మురికి గుంట నుంచి విముక్తి లేకపోవడమే దేశభక్తి అయితే – నేను దేశద్రోహినే!’’ ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
కలి‘విడి’గానే! చర్చనీయాంశంగా కారు – కామ్రేడ్ల స్నేహబంధం
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పక్షాలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. కొన్ని పార్టీలు ఇప్పటికే ఎన్నికల కార్యాచరణను అమలు చేస్తున్నాయి. కానీ ఇంకా పూర్తిస్థాయిలో రంగంలోకి దిగలేదు. అయినప్పటికీ అధికార బీఆర్ఎస్ – వామపక్షాల పొత్తు అంశం మాత్రం గత కొన్నాళ్లుగా చర్చనీయాంశమవుతోంది. ఆ పార్టీల నేతలు పోటీలు పడుతూ దీన్ని తెరపైకి తెస్తున్నారు. తాజాగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాలేరు నియోజకవర్గంలో చేసిన వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారాయి. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, సీపీఐ, సీపీఎంలు కలిసి పోటీ చేస్తాయని, ఈ అవగాహనలో భాగంగా తాము అడిగే మొదటి స్థానం పాలేరేనని, ఇక్కడ తాము పోటీ చేస్తే మంచోళ్లంతా తమకే ఓట్లు వేయాలని ఆయన కోరారు. పొత్తు చర్చలు ప్రారంభం కాకుండానే ఆయన సీపీఎం పోటీ చేసే స్థానాలపై మాట్లాడటం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇటీవల మిర్యాలగూడలో జరిగిన ఓ సభలో కూడా ఇక్కడి నుంచి సీపీఎం కచ్చితంగా పోటీ చేస్తుందంటూ తమ్మినేని చెప్పుకొచ్చారు. తమ్మినేని మాత్రమే కాదు.. తాము కచ్చితంగా పోటీ చేయాలని భావిస్తున్న అసెంబ్లీ స్థానాల పరిధిలోని సీపీఎం, సీపీఐ నేతలు కూడా ఆయా సందర్భాల్లో బీఆర్ఎస్తో పొత్తు, తాము పోటీ చేసే నియోజకవర్గాలను ప్రస్తావిస్తున్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కూడా బీఆర్ఎస్తో పొత్తు ఉంటుందని, కొత్తగూడెం నుంచి తాను తప్పనిసరిగా పోటీ చేస్తానని పార్టీ కేడర్‌కు చెపుతున్నారు. అయితే ఈ విషయంలో బీఆర్ఎస్ ఆలోచన ఏ విధంగా ఉందన్నది బయటపడక పోవడంతో.. మునుగోడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆ పార్టీల మధ్య ఏర్పడిన స్నేహ బంధం ఎంత దూరం కొనసాగుతుందనేది ఆసక్తికరంగా మారింది. గౌరవప్రదమైన స్థాయిలో అంగీకారం! వామపక్ష పార్టీల్లో జరుగుతున్న చర్చల ప్రకారం.. బీఆర్ఎస్తో పొత్తు కుదిరితే మొత్తం 15 అసెంబ్లీ స్థానాలు అడగాలని సీపీఎం, సీపీఐలు నిర్ణయించుకున్నట్టు అర్థమవుతోంది. పాలేరు, వైరా, మధిర, భద్రాచలం, ఖమ్మం, నకిరేకల్, మిర్యాలగూడ, నల్లగొండ, ఇబ్రహీంపట్నం స్థానాలు కావాలని సీపీఎం అడిగే అవకాశం ఉండగా కొత్తగూడెం, దేవరకొండ, హుస్నాబాద్, బెల్లంపల్లి, వైరా, ఇల్లందు, మునుగోడు నియోజకవర్గాలను సీపీఐ కోరే అవకాశముంది. అయితే కోరినన్ని స్థానాలు ఇవ్వకపోయినా గౌరవప్రదమైన స్థాయిలో పొత్తును అంగీకరించే యోచనలో రెండు పార్టీలూ ఉన్నట్టు సమాచారం. కనీసం మూడు అసెంబ్లీ సీట్లు, ఒక ఎమ్మెల్సీ, ఒక రాజ్యసభ సభ్యత్వం కోసం బీఆర్ఎస్ను కోరే విషయమై సీపీఎం నేతలు అంతర్గతంగా చర్చించికుంటున్నట్టు తెలుస్తోంది. ఇక సీపీఐ కూడా కనీసం మూడు అసెంబ్లీ స్థానాలు కావాల్సిందేనని పట్టుబట్టే అవకాశాలున్నాయని ఆ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే ఎమ్మెల్సీ, ఇతర పదవుల గురించి కూడా చర్చించాలనే యోచనలో సీపీఐ పెద్దలున్నట్టు చెబుతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా కేంద్రంగా పొత్తు విషయంలో తగ్గేదేలేదని ఆ పార్టీలు చెబుతున్నాయి. తమ్మినేని వీరభద్రం పాలేరు నుంచి, కూనంనేని సాంబశివరావు కొత్తగూడెం నుంచి బరిలో దిగేందుకు ఆసక్తి చూపుతున్నందున ఆ రెండు నియోజకవర్గాల తర్వాతే ఏ స్థానం గురించైనా చర్చ జరుగుతుందని వామపక్ష పార్టీలు స్పష్టం చేస్తున్నాయి. బీఆర్ఎస్ పెద్దల మదిలో ఏముందో? కామ్రేడ్ల ఆలోచనలు ఎలా ఉన్నా.. వారితో తమ అనుబంధంపై బీఆర్ఎస్ పెద్దల మదిలో ఏముందన్నది అంతు పట్టడం లేదు. పలు సందర్భాల్లో లెఫ్ట్ పార్టీలతో పొత్తు అంశం తెరపైకి వస్తున్నప్పటికీ ఆ పార్టీ కీలక నేతలెవరూ ఎక్కడా బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయడం లేదు. సీఎం కేసీఆర్ గానీ, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గానీ లెఫ్ట్ పార్టీలతో పొత్తు అంశాన్ని కనీస మాత్రంగా కూడా ప్రస్తావించడంలేదు. అయితే వామపక్ష పార్టీలకు చెందిన ముఖ్య నేతలకు ఎమ్మెల్సీ పదవులు ఇప్పిస్తామని, ఆయా స్థానాల్లో తామే పోటీ చేస్తామని స్థానికంగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. వామపక్ష పార్టీల నేతలకు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చే అంశం కూడా ఎక్కడా చర్చకు రావడం లేదు. ఒకరిద్దరికి ఎమ్మెల్సీలుగా అవకాశం! వామపక్ష పార్టీలతో పొత్తు చర్చలు జరుగుతాయి కానీ, అధికారికంగా పొత్తు కుదిరే అవకాశం లేదని బీఆర్ఎస్ వర్గాలు స్పష్టం చేస్తుండటం సందిగ్ధతకు తావిస్తోంది. 2014, 2018 ఎన్నికల్లో తాము ఏ పార్టీతోనూ పొత్తు కుదుర్చుకోలేదని, ఆ రెండు ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి, 2023లో లెఫ్ట్‌తో కలిసి వెళితే తాము గతం కంటే బలహీనపడ్డామని తామే అంగీకరించినట్టు అవుతుందనే చర్చ ఆ పార్టీలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో లెఫ్ట్ నాయకుల్లో ఒకరిద్దరికి ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పిస్తారని, వారు కోరుతున్న స్థానాలను వదులుకునేందుకు బీఆర్ఎస్ అధిష్టానం సిద్ధంగా లేదని, అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం స్నేహపూర్వక పోటీ ఉండే అవకాశముందని తెలంగాణ భవన్ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఆ స్థానాల్లో కేడర్‌ను నిలబెట్టుకునేదెట్టా? లెఫ్ట్‌తో పొత్తు అంశం ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారింది. ముఖ్యంగా వామపక్షాలు ఖచ్చితంగా అడుగుతాయని భావిస్తున్న స్థానాల్లో భద్రాచలం మినహా మిగిలిన చోట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఆయా స్థానాలకు ప్రాతినిధ్యం వహిస్తోన్న కందాల ఉపేందర్‌రెడ్డి, నల్లమోతు భాస్కరరావు, రవీంద్రనాయక్, వనమా వెంకటేశ్వరరావు తదితరులకు తమ నియోజకవర్గాల్లో కేడర్‌ను నిలబెట్టుకోవడం కత్తిమీద సాములా మారుతోంది. ఆయా స్థానాలు లెఫ్ట్ పార్టీలకు వదిలివేస్తారనే సంకేతాల నేపథ్యంలో పార్టీ ద్వితీయ శ్రేణి నాయకత్వం ఎక్కడ జారిపోతుందోననే ఆందోళన స్థానిక బీఆర్ఎస్ నేతల్లో వ్యక్తమవుతోంది. పలువురు కమ్యూనిస్టు నాయకులకు ఏకంగా సీఎం కేసీఆర్ స్థాయిలో హామీ లభించిందన్న ప్రచారం కూడా వారికి మింగుడు పడడం లేదు. అందులో భాగంగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వివాదాస్పద ప్రకటనలకు కూడా సిద్ధమవుతున్నారు. కమ్యూనిస్టులకు ఓట్లేసే రోజులు పోయాయని పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి వ్యాఖ్యానించడం గమనార్హం. మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కరరావు కూడా కొద్దిరోజుల క్రితం.. అక్కడ జూలకంటి రంగారెడ్డి సీపీఎం తరఫున పోటీ చేస్తే గెలుపు బాధ్యతలు తీసుకోవాలని చెప్పినా, ఆ తర్వాత సీపీఎం నేతలకు దూరంగా ఉంటున్నారు. కొత్తగూడెంలో అయితే వనమాతో పాటు జలగం వెంకట్రావు, గడల శ్రీనివాసరావు తదితరులు తమకంటే తమకే టికెట్ వస్తుందని చెప్పుకుంటున్నారు. మొత్తంమీద లెఫ్ట్ పార్టీలతో పొత్తు అంశం కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు, ఆశావహులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కోరే విషయమై సీపీఎం నేతలు అంతర్గతంగా చర్చించికుంటున్నట్టు తెలుస్తోంది. ఇక సీపీఐ కూడా కనీసం మూడు అసెంబ్లీ స్థానాలు కావాల్సిందేనని పట్టుబట్టే అవకాశాలున్నాయని ఆ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే ఎమ్మెల్సీ, ఇతర పదవుల గురించి కూడా చర్చించాలనే యోచనలో సీపీఐ పెద్దలున్నట్టు చెబుతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా కేంద్రంగా పొత్తు విషయంలో తగ్గేదేలేదని ఆ పార్టీలు చెబుతున్నాయి. తమ్మినేని వీరభద్రం పాలేరు నుంచి, కూనంనేని సాంబశివరావు కొత్తగూడెం నుంచి బరిలో దిగేందుకు ఆసక్తి చూపుతున్నందున ఆ రెండు నియోజకవర్గాల తర్వాతే ఏ స్థానం గురించైనా చర్చ జరుగుతుందని వామపక్ష పార్టీలు స్పష్టం చేస్తున్నాయి. ఒకరిద్దరికి ఎమ్మెల్సీలుగా అవకాశం! వామపక్ష పార్టీలతో పొత్తు చర్చలు జరుగుతాయి కానీ, అధికారికంగా పొత్తు కుదిరే అవకాశం లేదని బీఆర్ఎస్ వర్గాలు స్పష్టం చేస్తుండటం సందిగ్ధతకు తావిస్తోంది. 2014, 2018 ఎన్నికల్లో తాము ఏ పార్టీతోనూ పొత్తు కుదుర్చుకోలేదని, ఆ రెండు ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి, 2023లో లెఫ్ట్‌తో కలిసి వెళితే తాము గతం కంటే బలహీనపడ్డామని తామే అంగీకరించినట్టు అవుతుందనే చర్చ ఆ పార్టీలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో లెఫ్ట్ నాయకుల్లో ఒకరిద్దరికి ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పిస్తారని, వారు కోరుతున్న స్థానాలను వదులుకునేందుకు బీఆర్ఎస్ అధిష్టానం సిద్ధంగా లేదని, స్నేహపూర్వక పోటీ ఉండే అవకాశముందని తెలంగాణ భవన్ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఆ స్థానాల్లో కేడర్‌ను నిలబెట్టుకునేదెట్టా? లెఫ్ట్‌తో పొత్తు అంశం ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారింది. ముఖ్యంగా వామపక్షాలు ఖచ్చితంగా అడుగుతాయని భావిస్తున్న స్థానాల్లో భద్రాచలం మినహా మిగిలిన చోట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఆయా స్థానాలకు ప్రాతినిధ్యం వహిస్తోన్న కందాల ఉపేందర్‌రెడ్డి, నల్లమోతు భాస్కరరావు, రవీంద్రనాయక్, వనమా వెంకటేశ్వరరావు తదితరులకు తమ నియోజకవర్గాల్లో కేడర్‌ను నిలబెట్టుకోవడం కత్తిమీద సాములా మారుతోంది. ఒకవేళ ఆయా స్థానాలు లెఫ్ట్ పార్టీలకు వదిలివేస్తే పార్టీ ద్వితీయ శ్రేణి నాయకత్వం ఎక్కడ జారిపోతుందోననే ఆందోళన స్థానిక బీఆర్ఎస్ నేతల్లో వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వివాదాస్పద ప్రకటనలకు కూడా సిద్ధమవుతున్నారు. కమ్యూనిస్టులకు ఓట్లేసే రోజులు పోయాయని పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి వ్యాఖ్యానించడం గమనార్హం. మిర్యా లగూడ ఎమ్మెల్యే భాస్కరరావు కూడా కొద్దిరోజుల క్రితం.. అక్కడ జూలకంటి రంగారెడ్డి సీపీఎం తరఫున పోటీ చేస్తే గెలుపు బాధ్యతలు తీసుకోవాలని చెప్పినా, ఆ తర్వాత సీపీఎం నేతలకు దూరంగా ఉంటున్నారు. కొత్తగూడెంలో అయితే వనమాతో పాటు జలగం వెంకట్రావు, గడల శ్రీనివాసరావు తమకంటే తమకే టికెట్ వస్తుందని చెప్పుకుంటున్నారు. మొత్తంమీద లెఫ్ట్ పార్టీలతో పొత్తు అంశం కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు, ఆశావహులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. -
కామ్రేడ్.. కథ అడ్డం తిరిగిందా?
తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత కొన్ని ప్రశ్నలు తెర మీదికి వచ్చాయి. లక్ష్యం ఒక్కటే. చీకటి ఒప్పందాలతో అయినా పచ్చ పార్టీ అభ్యర్థిని గెలిపించాలి. తాము బలపరిచిన అభ్యర్థి గెలవకపోయినా ఫర్వాలేదు.. 1. టీడీపీ గెలిస్తే చాలనుకున్న ఆ పార్టీలు ఏవి? 2. పచ్చ పార్టీతో చీకటి ఒప్పందాలు కుదుర్చుకున్న ఆ నాయకులు ఎవరు? 3. సొంత పార్టీని ఫణంగా పెట్టి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి సహకరించింది ఎవరు? ఎందుకిలా జరిగింది? 4. నెల్లూరు జిల్లాలో ఆ రెండు పార్టీల మద్య కుదిరిన రహస్య ఒప్పందమేంటి..? సైద్దాంతిక నిబద్ధతను కామ్రేడులు గాలికి వదిలేశారా? 5. భవిష్యత్ ఇస్తామని పచ్చ పార్టీ చూపిన ఆశలకు లొంగిపోయారా? 6. చంద్రబాబు ప్రలోభాలకు సరెండర్ అయి వారి బలాన్ని టీడీపీకీ ట్రాన్స్ఫర్ చేశారా..? లేక డబ్బు కోసం చేతులు కలిపారా ? 7. పట్టభద్రుల ఎన్నికలో టీడీపీ చేసిన జిమ్మిక్కులేంటి..? ఇప్పుడు ఇదే చర్చ ప్రస్తుతం వామపక్ష అభిమానుల్లో నడుస్తోంది.. గెలిచే బలమున్నప్పటికీ.. ఎందుకు టీడీపీ అభ్యర్దికి సహకరించారని అందరూ చర్చించుకుంటున్నారు. తమను తాకట్టు పెట్టుకుని బాబుకు జై కొట్టారా? తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలంటే పీడీఎఫ్ అభ్యర్దుల గెలుపు ఖాయమనే భావన ఉండేది. గత పదిహేను సంవత్సరాలుగా ఈ రెండు స్థానాల్లో వామపక్షాలు బలపరిచిన పీడీఎఫ్ అభ్యర్దులే గెలుస్తూ వచ్చారు. కానీ ఈ సారి వైఎస్ఆర్ కాంగ్రెస్ బరిలోకి దిగడంతో పీడీఎఫ్ అభ్యర్దులకు ముచ్చెమటలు పట్టాయి. గెలుపు అంత ఈజీ కాదని అర్దమైంది.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్ది చంద్రశేఖర్ రెడ్డిని, పట్టభద్రుల అభ్యర్ది శ్యామ్ ప్రసాద్ రెడ్డిని ఓడించేందుకు పావులు కదిపింది. డిపాజిట్లు అయినా సంపాదించుకోవాలనుకుంటున్న టీడీపీ వారితో జతకట్టింది.. ఇరు వర్గాల మధ్య తెరవెనుక ఒప్పందం కుదిరింది. రెండుసార్లు గెలిచిన పట్టభద్రుల పీడీఎఫ్ అభ్యర్థులు ఓడి, టీడీపీ అభ్యర్థిని గెలిపించారు. రాజకీయం ఎన్ని మలుపులు తిరిగింది? కామ్రేడ్స్ సైద్దాంతిక విలువలను గాలికొదిలేశారనే విమర్శలు నెల్లూరు జిల్లాలో వినిపిస్తున్నాయి. గత పదిహేనేళ్ళ నుంచి ఇక్కడి స్థానాల్లో విజయం సాదిస్తున్న పీడీఎఫ్ అభ్యర్దులకు సాంప్రదాయ ఓటు బ్యాంకు వుంది. కానీ వారు తమ బలాన్ని ఈసారి టీడీపీకి ట్రాన్స్ఫర్ చేయించారనే ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి నారాయణ విద్యాసంస్థల అధినేత, అప్పటి మంత్రి పొంగురు నారాయణ అనుచరుడు పట్టాభి బరిలోకి దిగాడు. నారాయణ విద్యాసంస్థలతో కోట్లు ఖర్చుచేయగల సత్తా ఉన్నప్పటికీ.. పీడీఎఫ్ అభ్యర్థులను టీడీపీ టచ్ చెయ్యలేకపోయింది.. పట్టాభిని పీడీఎఫ్ అభ్యర్దులు కామెడీగా పక్కకి నెట్టేశారు. ఆ సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి మద్దతుగా నిలిచింది.. గత ఎన్నికల్లో నారాయణ విద్యాసంస్థలనే ఢీకొట్టిన వామపక్షాలు... ఈ ఎన్నికల్లో మూడో స్థానానికి పడిపోవడం వెనుక కుల సమీకరణాలు బాగా పనిచేశాయనే టాక్ నడుస్తోంది. వామపక్ష పార్టీలను లీడ్ చేసేది కూడా చంద్రబాబునాయుడి సామాజికవర్గమే కావడంతో జగన్ ను ఎదుర్కొనేందుకు వారంతా ఒక్కటయ్యారనే చర్చ కమ్యూనిస్టు పార్టీల్లోనే జరుగుతోంది. మన వాళ్లు కక్కుర్తి పడ్డారు కమ్యూనిస్టులు తెరచాటు రాజకీయం చెయ్యడం వల్లనే టీడీపీ అభ్యర్ది శ్రీకాంత్ విజయం సాధ్యమైంది. అనామకుడుగా ఎమ్మెల్సీ బరిలోకి దిగిన శ్రీకాంత్ కు కామ్రేడ్స్ సాయం చేశారనే ప్రచారం జరుగుతోంది. ఈ సాయం వెనుక భవిష్యత్ లో ఏమైనా పదవులు రావొచ్చు.. లేదంటే భారీగా లబ్ది అయినా చేకూరి ఉండొచ్చని నెల్లూరులో గాసిప్స్ వినిపిస్తున్నాయి. పచ్చ పార్టీ అభ్యర్థిని గెలిపించడానికి తాము బలపరిచిన అభ్యర్థినే త్యాగం చేసిన కమ్యూనిస్టుల పార్టీల వ్యవహార సరళిని వామపక్ష అభిమానులే చీదరించుకుంటున్నారు. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ -
కాంగ్రెస్ వైపు కామ్రేడ్లు.. ప్రణాళికలు సిద్ధం..!
అసెంబ్లీ ఎన్నిక లకు ఏడాది సమయం కూడా లేదు. ముందస్తు ఎన్నికలపైనా ఊహాగా నాలు సాగుతున్నాయి. రాష్ట్రంలోని రాజకీయ పక్షాలన్నీ ఎన్నికలు లక్ష్యంగానే వ్యూహాలు రూపొందించి అమ లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పొత్తులు తెరపైకి వస్తుండగా.. వామ పక్షాలు తాజాగా కాంగ్రెస్‌తో కలిసి వెళ్లాలనే ప్రత్యామ్నాయ ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. వాస్తవానికి మునుగోడు ఉప ఎన్నికలో లెఫ్ట్ పార్టీలు బీఆర్ఎస్కు మద్దతు ప్రకటించాయి. ప్రచారం సైతం నిర్వ హించాయి. భవిష్యత్తులోనూ సీపీఎం, సీపీఐ తో కలిసే వెళ్తామని ఆ సమయంలో బీఆర్ఎస్ నేతలు చెప్పారు. సీఎం కేసీఆర్ కూడా కమ్యూనిస్టులతో పొత్తు కొనసాగుతుందని స్పష్టం చేశారు. నిన్న, మొన్నటివరకు ఇదే విధమైన వాతావరణం కన్పించింది. కానీ వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎవరితోనూ పొత్తు పెట్టుకోదని, కేవలం అవగాహన మాత్రమే ఉంటుందని ఇటీవల మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ స్పష్టం చేయడం, బీఆర్ఎస్ అధిష్టానం దీనిపై మౌనం వహించడం ఉభయ కమ్యూనిస్టు పార్టీలను అయోమయంలో పడేసింది. ఈ నేపథ్యంలోనే.. బీఆర్ఎస్ కలిసిరాని పక్షంలో కాంగ్రెస్‌తో పొత్తు కుదుర్చుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. బీజేపీ ఓటమే లక్ష్యం.. దేశంలోనూ, రాష్ట్రంలోనూ బీజేపీని ఓడించడమే లక్ష్యంగా లెఫ్ట్ పార్టీలు పనిచేస్తున్నాయి. బీజేపీతో విభేదించే పార్టీలు ఏవైనా సరే వాటితో కలిసి ముందుకు సాగుతున్నాయి. ఎన్నికల్లో పొత్తులు కూడా పెట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే గతేడాది మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా సీపీఐ, సీపీఎం పార్టీలు బీఆర్ఎస్తో జత కట్టాయి. ఆ పార్టీ విజయంలో తమ వంతుపాత్ర పోషించాయి. బీఆర్ఎస్ ఆవిర్భావం నేపథ్యంలో ఇటీవల ఖమ్మంలో ఆ పార్టీ నిర్వహించిన సభలో సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా, సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఆ పార్టీల రాష్ట్ర కార్యదర్శులు కూనంనేని సాంబశివరావు, తమ్మినేని వీరభద్రం పాల్గొని ఐక్యత చాటారు. కానీ ఇటీవల కాలంలో వామపక్షాలతో పొత్తుపై బీఆర్ఎస్ నాయకులు స్వరం మార్చారు. అసెంబ్లీ స్థానాలు ఇచ్చేది లేదని, అవసరమైతే పెద్దల సభకు నామినేట్ చేస్తామంటూ తలోమాట మాట్లాడుతుండటంతో లెఫ్ట్ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలోనే సీపీఐ, సీపీఎంలు ప్రత్యామ్నాయం ఆలోచిస్తున్నాయని, ఇదే అదనుగా కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దిగిందని, ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు కొందరు లెఫ్ట్ పార్టీల నేతలతో మంతనాలు జరిపారని తెలిసింది. అడిగినన్ని సీట్లు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసిన కాంగ్రెస్ పెద్దలు.. ‘వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలిసి పోటీ చేస్తే అధికారం ఖాయం. కాబట్టి మీరు మా వైపు రండి..’ అంటూ ఆహ్వానించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కమ్యూనిస్టులు ఎన్నికలకు సంబంధించి మూడు ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది. కమ్యూనిస్టుల ముందు 3 ప్లాన్లు... లెఫ్ట్ పార్టీలు ప్లాన్ ఏ, ప్లాన్ బీ, ప్లాన్ సీ.. ఇలా మూడు ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ప్లాన్ ఏ.. బీఆర్ఎస్తో పొత్తు ఉండేలా కృషి చేయడం. చెరో పది సీట్లు అడగాలి. మునుగోడు, దేవరకొండ, మిర్యాలగూడ, నకిరేకల్, పాలేరు, వైరా, కొత్తగూడెం, భద్రాచలం, మధిర, ఇబ్రహీంపట్నం, హుస్నాబాద్ స్థానాల కోసం పట్టుబట్టాలి. ఒకవేళ కొన్ని కాదని ఎమ్మెల్సీ స్థానాలు ఇస్తామంటే ఆలోచించాలి. ప్లాన్ బీ.. బీఆర్ఎస్ తర్వాత బీజేపీని వ్యతిరేకించే కాంగ్రెస్, వైఎస్సార్టీపీ, తెలంగాణ జన సమితి వంటి పార్టీలతో జత కట్టడం. కాంగ్రెస్ పార్టీ అడిగినన్ని సీట్లు ఇవ్వడానికి సాను కూలంగా ఉండటం కీలకాంశం. ప్లాన్ సీ కాంగ్రెస్ గౌరవప్రదమైన సీట్లకు అంగీకరించని పక్షంలో, ఏదైనా కారణంతో ఆ పార్టీతోనూ పొత్తు కుదరని పక్షంలో ఒంటరి పోరాటం చేయడం. చెరో 25 స్థానాల్లో పోటీ చేసి ఎన్నికల పోరాటంలో బీజేపీ సహా ఇతర పార్టీల వైఖరులను, విధానాలను ఎండగట్టడం. -
Tripura Assembly Elections 2023: మోత మోగేనా?
2018 అసెంబ్లీ ఎన్నికలు. లెఫ్ట్ కూటమి పాతికేళ్ల పాలనతో విసిగిపోయిన త్రిపుర ప్రజలను బీజేపీ అభివృద్ధి మంత్రం ఆకట్టుకుంది. దాని భాగస్వామ్య పార్టీ ఐపీఎఫ్‌టీకి గిరిజనుల్లో ఉన్న ఆదరణ తోడైంది. దాంతో 60 సీట్లకు గాను కాషాయ పార్టీ ఏకంగా 36 స్థానాల్లో నెగ్గింది. ముఖ్యంగా 20 ఎస్టీ స్థానాల్లో ఏకంగా 17 సీట్లను కొల్లగొట్టింది! ఐదేళ్ల తర్వాత పరిస్థితులు తారుమారవుతున్న సూచనలు కన్పిస్తున్నాయి. ప్రత్యేక రాష్ట్ర నినాదంతో రాజకీయ పార్టీ అవతారమెత్తిన ఉద్యమ సంస్థ టిప్రా మోతా ఈసారి అధికార పార్టీ పుట్టి ముంచేలా కన్పిస్తోంది... ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో అసెంబ్లీ ఎన్నికల వేడి తారస్థాయికి చేరుతోంది. పోలింగ్ (ఫిబ్రవరి 16) తేదీ సమీపిస్తున్న కొద్దీ పార్టీలన్నీ అమ్ములపొదుల్లోంచి అన్ని అస్త్రాలూ బయటికి తీస్తున్నాయి. రాష్ట్రంలో పాతికేళ్ల లెఫ్ట్ పాలనకు 2018 ఎన్నికల్లో బీజేపీ తెర దించింది. గిరిజనుల్లో బాగా పట్టున్న ఐపీఎఫ్టీ పార్టీతో జట్టు కట్టి ఘనవిజయం సాధించింది. సీపీఎం 16 సీట్లకు పరిమితం కాగా కాంగ్రెస్ సోదిలోకూడా లేకుండా పోయింది. ఈసారి మాత్రం టిప్రా మోతా రూపంలో కొత్త పార్టీ తెరపైకి రావడంతో సమీకరణాలన్నీ మారిపోయాయి. పరిస్థితి తారుమారు... త్రిపుర మాజీ రాజ కుటుంబానికి చెందిన ప్రద్యోత్ బిక్రం మాణిక్యదేబ్ బర్మన్ సారథ్యంలో కొంతకాలంగా ప్రత్యేక గిరిజన రాష్ట్రం కోసం పోరాడుతున్న తిప్రా (త్రిపుర ఇండిజినస్ ప్రోగ్రెసివ్ రీజనల్ అలయన్స్) మోతా ఈసారి పార్టీగా రూపాంతరం చెందింది. బీజేపీతో పొత్తు ప్రయత్నాలు విఫలం కావడంతో ఒంటరిగానే రంగంలోకి దిగి పోటీని ముక్కోణంగా మార్చేసింది. అధికార బీజేపీ కూటమికి గట్టి సవాలు విసురుతోంది. మూలవాసులైన గిరిజనులకు ప్రత్యేక రాష్ట్రంగా గ్రేటర్ తిప్రాలాండ్‌ను సాధిస్తామన్న మోతా హామీ ఎస్టీలను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా గత ఎన్నికల్లో ఐపీఎఫ్టీతో పొత్తు ద్వారా బీజేపీ కొల్లగొట్టిన గిరిజన ఓట్లు ఈసారి చాలావరకు మోతావైపు మళ్లే సూచనలు కన్పిస్తున్నాయి. గిరిజనుల్లోని లెఫ్ట్ ఓటు బ్యాంకుకూ మోతా గండి కొట్టేలా ఉంది. త్రిపురలో గిరిజన ప్రాబల్యం ఎక్కువ. మొత్తం 60 అసెంబ్లీ స్థానాల్లో 20 వారికి రిజర్వయ్యాయి. అంతేగాక మరో 23 గిరిజనేత స్థానాల్లోనూ 10 శాతానికి పైగా ఉన్న ఎస్టీలు అక్కడా నిర్ణయాత్మకంగానే ఉన్నారు. 2018లో బీజేపీ కూటమి 20 ఎస్టీ సీట్లలో ఏకంగా 17 స్థానాలను దక్కించుకుంది! అలా బీజేపీ కూటమికి అధికారంలోకి రావడంలో కీలకంగా మారిన గిరిజన ఓట్లరు ఈసారి టిప్రా మోతాకే ఓటేస్తామని బహిరంగంగానే చెబుతున్నారు. ఈ సీట్లలో ముఖ్యంగా గిరిజనులు 60 శాతానికి పైగా ఉన్న 12 చోట్ల మోతాకు విజయావకాశాలు అధికంగా కన్పిస్తున్నాయి. 50–60 శాతం మధ్య ఉన్న 5 స్థానాల్లో మోతా గట్టి పోటీ ఇవ్వనుండగా 50 శాతాం కంటే తక్కువగా ఉన్న మిగతా మూడు చోట్ల ముక్కోణ పోరు జరిగేలా కన్పిస్తోంది. ఎలా చూసినా బీజేపీ కూటమికి ఈ 20 సీట్లలో ఈసారి రెండు మూడు సీట్లకు మించి దక్కకపోవచ్చని అంచనా. దీనికి తోడు గిరిజన ప్రాబల్యమున్న 23 గిరిజనేతర అసెంబ్లీ స్థానాల్లో కూడా మోతా ఏకంగా 22 చోట్ల పోటీకి దిగడం బీజేపీకి నిద్ర లేకుండా చేస్తోంది. బీజేపీ కూటమి 12 నుంచి 15 సీట్లు కోల్పోయి హంగ్ అసెంబ్లీ ఏర్పడవచ్చని అంచనా. 10 నుంచి 15 సీట్లు గెలిచేలా కన్పిస్తున్న మోతా కింగ్‌మేకర్ అయ్యే అవకాశం లేకపోలేదంటున్నారు. ఓట్ల చీలికపైనే లెఫ్ట్ ఆశలు గత ఎన్నికలఓల 42 శాతానికి పైగా ఓట్లు సాధించినా సీట్ల లెక్కలో వెనకబడ్డ సీపీఎం, ఈసారి ఓట్ల చీలికపై బాగా ఆశలు పెట్టుకుంది. బీజేపీ–ఐపీఎఫ్టీ కూటమిని ఓడించేందుకు శత్రుత్వాన్ని పక్కన పెట్టి కాంగ్రెస్‌తో జట్టు కట్టింది. 20 గిరిజన సీట్లతో పాటు 22 గిరిజనేతర స్థానాల్లో బీజేపీ ఓటు బ్యాంకుకు మోతా గండికొట్టనుండటం సీపీఎం–కాంగ్రెస్ కూటమికి కలిసొచ్చేలా కన్పిస్తోంది. దీనికి తోడు 2.5 లక్షల ఉద్యోగాలు తదితర హామీలతో యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. కాకపోతే కాంగ్రెస్ ఓటర్లలో చాలామంది పొత్తును గౌరవించి సీపీఎం అభ్యర్థులకు ఓటేసేందుకు సిద్ధంగా లేరు. ఏడు దశాబ్దాల వైరాన్ని, అధికారంలో ఉండగా తమపట్ల సీపీఎం అనుసరించిన అణచివేత ధోరణిని మర్చిపోలేమని స్పష్టంగా చెబుతున్నారు. అయితే ముస్లింల్లో అత్యధికులు లెఫ్ట్ వైపే మొగ్గుతున్నారు. బీజేపీ.. అభివృద్ధి మంత్రం 2018లో బీజేపీ అభివృద్ధి నినాదాన్ని జనం నమ్మడంతో ఆ పార్టీ ఏకంగా 43 శాతం ఓట్లు సాధించింది! ఆశించిన అభివృద్ధి కనిపించలేదన్న అసంతృప్తి జనాల్లో ఉంది. శాంతిభద్రతలు క్షీణించాయన్నది మరో పెద్ద ఆరోపణ.అయితే మరోసారి బీజేపీకి అవకాశం ఇచ్చి చూస్తామంటున్న వారి సంఖ్యా ఎక్కువగానే ఉంది. పీఎం ఆవాస్ యోజన మొదలుకుని కిసాన్ సమ్మాన్ నిధి దాకా పలు కేంద్ర పథకాల లబ్ధిదారులు ఎక్కువగానే ఉన్నారు. వీరిలోనూ మహిళల సంఖ్య ఎక్కువ. వారు మళ్లీ బీజేపీకే ఓటేస్తామంటున్నారు. పైగా సీఎం మాణిక్ సాహాకు ప్రజల్లో మంచి పేరుంది. కానీ 9 నెలల క్రితం దాకా సీఎంగా ఉన్న బిప్లబ్ దేబ్ పట్ల జనంలో ఉన్న వ్యతిరేకత బీజేపీకి నష్టం చేసేలా కన్పిస్తోంది. పైగా 2018లో గిరిజనుల్లో మంచి ఆదరణతో 8 సీట్లు సాధించిన భాగస్వామ్య పార్టీ ఐపీఎఫ్టీ ఆ తర్వాత అధ్యక్షుడు ఎన్.సి.దేబ్బర్మ మృతితో బాగా బలహీనపడింది. దాంతో బీజేపీ ఈసారి ప్రభుత్వ పథకాలనే నమ్ముకుని వాటిపై భారీ ప్రచారంతో హోరెత్తిస్తోంది. రాష్ట్రమంతటా కాషాయ జెండాలే ఎగురుతున్నాయి! ఎక్కడికక్కడ పోలింగ్ బూత్ కార్యాలయాలు తెరిచి తమ నేతలు, కార్యకర్తలను ఓటర్లతో నిత్యం టచ్‌తో ఉంచుతూ అధికార పార్టీ పక్కా ప్రణాళిక ప్రకారం ముందుకు పోతోంది. హిందువుల్లో అత్యధికులైన బెంగాలీలు, ఎస్టీల్లో ఎగువ కులాల వారు బీజేపీ వైపే మొగ్గుతున్నారు. ఇక గిరిజన స్థానాల్లోని బెంగాలీలు బీజేపీకి, ముస్లింలు సీపీఎంకు జై కొడుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బిగ్ క్వశ్చన్: పేరుకు కమ్యూనిజం లోపలంతా ఎల్లో ఇజం
-
పేదోడికి ఇల్లు ఇస్తుంటే వద్దనే వారు కమ్యూనిస్టులా?
తాడేపల్లి: నిజమైన కమ్యూనిస్టులు పేదల బాగుకోసం పోరాడతారని, మరి అటువంటిది అమరావతి ఇళ్ల పట్టాలు ఇస్తుంటే కమ్యూనిస్టులు అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పేర్ని నాని. నిజమైన కమ్యూనిస్టులు సింగపూర్ కోరుకోరని, పేదల బాగుకోసం మాత్రమే ఆలోచిస్తారని అన్నారు పేర్ని నాని. తాడేపల్లి వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి మాట్లాడిన పేర్ని నాని.. చంద్రబాబుకు కమ్యూనిస్టు నేతలు రామకృష్ణ, నారాయణ అమ్ముడుపోయారని ధ్వజమెత్తారు. ‘సీపీఐ రామకృష్ణ కమ్యూనిస్ట్ సిద్ధాంతం పాటిస్తున్నారా?, అమరావతిలో ఇళ్ల పట్టాలు ఇస్తుంటే అడ్డుకున్నారు. నిజమైన కమ్యూనిస్టులు సింగపూర్ కావాలని కోరుకోరు.పేదోడికి ఇల్లు ఇస్తుంటే వద్దనే వారు కమ్యూనిస్టులా?, చంద్రబాబుకు రామకృష్ణ, నారాయణ అమ్ముడు పోయారు. చంద్రబాబును సీఎం చేయడమే వారి లక్ష్యం. చంద్రబాబు ఏం చెబితే అది చేస్తున్నారు. అసత్యాలను నిజమని నమ్మించే ప్రయత్నాలు చేస్తున్నారు. కమ్యూనిస్టుల్లో నిజమైన కమ్యూనిజం ఉందా? ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయో ప్రజలు తేలుస్తారు. విడివిడిగా పోటీ చేయడానికి మీకెందుకు అంత భయం’ అని పేర్ని నాని నిలదీశారు.