ఉప ఎన్నికలో అధికార టీడీపీని ఓడించాలని నంద్యాల ఓటర్లకు వామపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి.
నంద్యాల: ఉప ఎన్నికలో అధికార టీడీపీని ఓడించాలని నంద్యాల ఓటర్లకు వామపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి. గత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అమలుచేయకుండా చంద్రబాబు ప్రజలను మోసం చేశారని వామపక్ష పార్టీలు ధ్వజమెత్తాయి. వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు చంద్రబాబు ద్రోహం చేశారని మండిపడ్డాయి. ప్రజలను మోసగిస్తున్న టీడీపీ సర్కారుకు, సీఎం చంద్రబాబుకు బుద్ధిచెప్పాలని లెఫ్ట్ పార్టీలు ప్రజలకు సూచించాయి.