సరికొత్త నాటకానికి తెరతీసిన టీడీపీ! | TDP's new drama in nandyal | Sakshi
Sakshi News home page

సరికొత్త నాటకానికి తెరతీసిన టీడీపీ!

Published Sun, Aug 20 2017 4:53 PM | Last Updated on Fri, Oct 19 2018 8:10 PM

సరికొత్త నాటకానికి తెరతీసిన టీడీపీ! - Sakshi

సరికొత్త నాటకానికి తెరతీసిన టీడీపీ!

నంద్యాలలో బలవంతంగా కండువాలు కప్పుతున్న మంత్రులు
మండిపడుతున్న వైఎస్‌ఆర్‌సీపీ నేతలు


నంద్యాల: ఉప ఎన్నిక జరుగుతున్న నంద్యాలలో టీడీపీ నేతలు సరికొత్త నాటకానికి తెరతీశారు. వైఎస్‌ఆర్‌సీపీ మద్దతుదారులకు బలవంతంగా కండువాలు కప్పి తమ పార్టీలో చేరినట్టు చూపించుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఇదేవిధంగా శనివారం మంత్రులు వైఎస్‌ఆర్‌సీపీ మద్దతుదారులకు టీడీపీ కండువాలు కప్పి అభాసుపాలయ్యారు. బంధువు కావడంతోనే తాము గంగుల ప్రతాపరెడ్డి ఇంటికి వెళ్లామని, దాంతో తాము టీడీపీలో చేరినట్టు ప్రచారం చేస్తున్నారని అధికార పార్టీ తీరుపై ప్రసాద్‌రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తాము టీడీపీలో చేరినట్టు జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు. తాము ఎప్పుడూ వైఎస్‌ఆర్‌సీపీ మద్దతుదారులగానే కొనసాగుతామని చెప్పారు.

నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో టీడీపీ నేతలు లేని బంధుత్వాన్ని ఆపాదిస్తూ.. బలవంతంగా కండువాలు కప్పుతున్నారని వైఎస్‌ఆర్‌సీపీ నేతలు శిల్పా చక్రపాణిరెడ్డి, గంగుల ప్రభాకర్‌రెడ్డి మండిపడ్డారు. వైఎస్‌ఆర్‌సీపీ మద్దతుదారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా తమ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి గెలుపు ఖాయమని అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement