
వామపక్షాలు ఏకం కావాలి...
ప్రజాస్వామ్య పరిరక్షణకు, బీజేపీ మతోన్మాద విధానాలను అడ్డుకునేం దుకు సెక్యులర్ పార్టీలు, వామపక్షాలు ఒకే వేదికపైకి రావాల్సిన అవసరం ఉందని సీపీఐ...
సురవరం పిలుపు
సాక్షి, హైదరాబాద్: ప్రజాస్వామ్య పరిరక్షణకు, బీజేపీ మతోన్మాద విధానాలను అడ్డుకునేం దుకు సెక్యులర్ పార్టీలు, వామపక్షాలు ఒకే వేదికపైకి రావాల్సిన అవసరం ఉందని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరంసుధాకరరెడ్డి అన్నారు. శనివారం మగ్దూంభవన్‌లో ఆయన విలేకరులతో మా ట్లాడారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలస్థాయిలో బీజేపీతీసుకున్న నిర్ణయాలు, గవర్నర్‌పదవిని తీవ్రంగా దుర్వినియోగం చేయడం అత్యంత అప్రజాస్వామికమన్నారు. గోవా, మణిపూ ర్‌లలో ఫిరాయింపులను ప్రోత్సహించడం రాజకీయంగా, నైతికంగా ప్రమాదకరమైన ధోరణన్నారు.
యూపీ ఎన్నికల్లో బీసీల్లో, దళితుల్లో చీలిక తీసుకొచ్చి, మైనారిటీల్లో అభద్రతా భావాన్ని కలిగించి బీజేపీ గెలు పొందిందన్నారు. భౌతిక సుఖాలకు దూరంగా, సాధువుగా జీవించాల్సిన యోగి ఆదిత్యా నాథ్‌ను సీఎంగా తీసుకొచ్చి మతోన్మా దం తమ విధానం అని బీజేపీ స్పష్టం చేసిందన్నారు.హిందూ, బ్రాహ్మణ సమాజం, శాకాహారమనే ప్రమాదకరమైన ధోరణిని బీజేపీ ప్రచారంలోకి తెస్తోందన్నారు. జేఎన్‌యూలో సంఘ్ పరివార్ శక్తుల ఆటలు సాగకపోవడంతో ఎంఫిల్, పీహెచ్‌డీ ప్రవేశాలను తగ్గించి దళితులు, బలహీనవర్గాల విద్యార్థులు ఉన్నత చదవులకు అడ్డంకులు సృష్టిస్తున్నార న్నారు. గుజరాత్‌లో పశువధకు పాల్పడితే జీవితఖై దు, పశుమాంసం దొరికితే మూడేళ్ల పైబడి ఖైదు చట్టాన్ని ఉపసంహరించుకొనేలా చూ డాలని రాష్ట్రపతికి సురవరం విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వ వైఫల్యాలే ప్రచారాస్త్రాలు: చాడ
అధికార టీఆర్‌ఎస్ వైఫల్యాలనే ప్రచారా స్త్రాలుగా ప్రజల్లోకి వెళతామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి చెప్పారు. మళ్లీ వందకుపైగా సీట్లు గెలుస్తామంటున్న కేసీఆర్ గతంలో చంద్రబాబు విజన్ 2020 అని ప్రకటించి బొక్కబోర్లా పడిన వైనాన్ని గుర్తుంచుకుంటే మంచిదన్నారు.