Suravaram Sudhakar Reddy
-
చరిత్రాత్మకమైన మహత్తర పోరాటం
తెలంగాణ సాయుధ పోరాటం మత పోరాటం కాదు. వర్గ పోరాట స్వభావం కలిగిన పోరాటం. ప్రజాస్వామ్యం కోసం, పౌరహక్కుల కోసం, హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్‌లో విలీనం చేయడం కోసం జరిగిన పోరాటం.మొగల్ సామ్రాజ్యంలో భాగమైన దక్షిణ భారతదేశానికి ఔరంగజేబు మరణానంతరం ఢిల్లీ రాజప్రతినిధిగా వచ్చిన సైనికాధిపతే నిజామ్. ఢిల్లీలో మొగల్ సామ్రాజ్య ప్రాభవం తగ్గగానే స్వతంత్రం ప్రకటించుకున్నారు. మైసూరు రాజు టిప్పు సుల్తాన్‌కు, మహా రాష్ట్రులకు వ్యతిరేకంగా బ్రిటిషర్లకు నిజాం మద్దతు ఇచ్చినందుకు, నిజాం నవాబును కాపాడేందుకు బ్రిటిష్ సైన్యాన్ని ఇక్కడ ఉంచారు. వారి ఖర్చుల నిమిత్తం, సర్కారు జిల్లాలను, ఆ తర్వాత రాయ లసీమను వారికి అప్పగించారు.ఐనా మిగిలిన హైదరాబాదు సంస్థానం దేశంలోని 550 సంస్థా నాలలో పెద్దది. దీని వైశాల్యం 82,696 చదరపు మైళ్ళు. ఇది గ్రేట్ బ్రిటన్ వైశాల్యానికి సమానం. ఇందులో ఎనిమిది తెలుగు జిల్లాలు, ఐదు మరాఠీ జిల్లాలు, మూడు కర్ణాటక జిల్లాలు ఉండేవి. కోటీ ఎనభై లక్షల జనాభాలో సగంమంది మాతృభాష తెలుగు, 25 శాతం మంది మరాఠీ, 12 శాతం మంది ఉర్దూ, 11 శాతం మంది కన్నడ, ఇతర భాషలు మాట్లాడేవారు. కాని ఉర్దూలో తప్ప పాఠశాలలు లేవు. ప్రైవే టుగా మాతృభాషలో పాఠశాలలు పెట్టుకోవడానికి వీల్లేదు. తెలంగాణ ప్రాంతంలో భూ కేంద్రీకరణ విపరీతంగా వుండేది. మొత్తం సాగులో వున్న భూమి దాదాపు 70% భూస్వాముల చేతుల్లో వుండేది. ఐదు వేల ఎకరాలపైన వున్న భూస్వాములు 550 మంది. చిన్న పెద్ద భూస్వాములలో 1982 మంది ముస్లింలు, 618 మంది హిందూ భూస్వాములు. నిజాం సొంత ఖర్చుల కోసం 636 గ్రామాల్లో ఐదు లక్షల ముప్ఫై వేల ఎకరాల భూమి వుండేది. 7వ నిజాం ఆస్తి ఆనాడు 400 కోట్ల రూపాయలు. అప్పుడు ప్రపంచంలో కెల్లా ధనవంతుడని పేరుండేది. రాష్ట్రంలో ప్రజలు దుర్భర జీవితం గడిపేవారు. అన్ని కులాలవారు, జమీందార్లు, దేశ్‌ముఖ్‌లు, ప్రభుత్వ అధికారుల దగ్గర వెట్టిచాకిరీ చేయాల్సి వచ్చేది. తెలుగు ప్రజల సంఘంగా ఆంధ్ర జనసభ ప్రారంభమైంది. అది ఆంధ్ర మహాసభగా రూపొందింది. జోగిపేట ప్రథమ ఆంధ్ర మహా సభ సురవరం ప్రతాపరెడ్డి అధ్యక్షతన జరిగింది. 1946 నాటికి ఆంధ్ర మహాసభ ప్రధాన రాజకీయ శక్తిగా ఆవిర్భవించింది. ఈ దశలో ఆంధ్ర మహాసభలో మితవాదులు, అతివాదులు, జాతీయ వాదుల మధ్య ఘర్షణలో వామపక్షవాదులు మెజారిటీ అయ్యారు. రావి నారాయణ రెడ్డి అధ్యక్షుడైన తర్వాత పేద ప్రజల సమస్యలు, తెలుగులో బోధన, వెట్టిచాకిరీ రద్దు తదితర అంశాలపైన కార్యాచరణ తీసుకున్నారు.దేశవ్యాప్తంగా జరుగుతున్న స్వాతంత్య్ర పోరాటం హైదరాబాద్ సంస్థాన ప్రజల మీద ప్రభావం చూపింది. మజ్లిస్ పార్టీకి ఖాశిం రజ్వీ అధ్యక్షుడై, హైదరాబాదును స్వతంత్ర ముస్లిం రాజ్యం చేస్తానని ప్రక టించి రజాకార్ల (వలంటీర్) నిర్మాణానికి పూనుకుని వేలాదిమంది ముస్లిములను చేర్పించి దాడులు ప్రారంభించాడు. నిజాం మద్దతి చ్చాడు. తెలంగాణను ముస్లిం మెజారిటీ సంస్థానంగా చేసేందుకు ఇతర రాష్ట్ర్రాల నుండి 8 లక్షల మంది ముస్లింలను అంతకు ముందు తీసుకువచ్చారని ఒక ఆరోపణవుంది.ఈ దశలో కేంద్ర ప్రభుత్వానికి నిజాంకు మధ్య అనేక చర్చల తర్వాత యథాతథ ఒప్పందం కుదిరింది. దాని ప్రకారం నిజాం రాజుగా కొనసాగుతాడు. విదేశాంగ, రక్షణ కేంద్రం బాధ్యతల్లో వుంటుంది. ఇది రాష్ట్ర ప్రజలకు కేంద్రం చేసిన ద్రోహం. ఈలోగా విసునూరి రామచంద్రారెడ్డి ప్రజల మీద దాడులు ఉధృతం చేశాడు. ఆయన తల్లి జానకమ్మ నరరూప రాక్షసి. కడివెండిలో ప్రజలు బలవంతపు ధాన్యం లెవీకి వ్యతిరేకంగా ఊరేగింపు తీస్తే, గడీలోంచి కాల్పులు జరిపి, దొడ్డి కొమరయ్యను బలి తీసుకున్నారు. ఇక, అనేక ఇతర గ్రామాలలో రజాకార్లు గ్రామాలను తగలబెట్టి, స్త్రీలను మానభంగాలు చేశారు. బైరాన్‌పల్లి, పరకాల తదితర గ్రామాలలో డజన్ల సంఖ్యలో ప్రజలు హతులయ్యారు.ఈ నేపథ్యంలో 1947 సెప్టెంబరు 11వ తేదీన నిజాం నిరంకుశ ప్రభుత్వాన్ని కూలద్రోసి సంస్థానాన్ని భారత యూనియన్‌లో విలీనం చేసేందుకుగాను, సాయుధ పోరాటం చేయవలసిందిగా రావి నారా యణరెడ్డి, మఖ్దుం మొహియుద్దీన్, బద్దం ఎల్లారెడ్డి పేరుతో ప్రకటన విడుదల చేశారు. సాయుధ పోరాటం దావానలంలాగా వ్యాపించింది. ఈ పోరాటం ముఖ్యంగా నల్లగొండ, వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో విస్తృతంగా, ఇతర జిల్లాల్లో కొంత పరిమితంగా జరిగింది. 3,000 గ్రామాలను కమ్యూనిస్టు పార్టీ ప్రభావితం చేసింది. దాదాపు పది లక్షల ఎకరాల భూమి పేదలకు పంచింది. హింసను అరికట్టే పేరుతో యూనియన్ సైన్యాలు హైదరాబాదు సంస్థానాన్ని ముట్టడించాయి. 3 రోజుల్లో నిజాం సైన్యం లొంగి పోయింది. మిలిటరీ గవర్నరుగా నియమించబడ్డ జనరల్ చౌదరి కొందరు రజాకార్లను, ఖాశిం రజ్వీని అరెస్టు చేసి, కమ్యూనిస్టుల మీద యుద్ధం ప్రకటించాడు. సరోజినీ నాయుడు కుమారుడు డాక్టర్ జయసూర్య, మరికొందరు మిలిటరీ గవర్నరును కలిసి నెల రోజుల గడువిస్తే, కమ్యూనిస్టులతో చర్చించి, సాయుధ పోరాటాన్ని ఉపసంహరింపజేస్తామని చెప్పారు. దానికి జనరల్ చౌదరి నిరాకరించి నెల రోజు లెందుకు, వారం రోజుల్లో తెలంగాణలో కమ్యూనిస్టులను ఏరివేస్తా నని జవాబిచ్చాడు. అనివార్యంగా సాయుధ పోరాటం కొనసాగింది. హైదరాబాదు సంస్థానం, భారత యూనియన్‌లో విలీనమైనందున, నిజాం దుష్ట ప్రభుత్వం కూలిపోయినందున మధ్యతరగతి ప్రజలు, కొందరు మేధావులు సాయుధ పోరాటం ఆవశ్యకత లేదని భావించారు. 1951 చివరిలో పార్టీ కేంద్ర కమిటీ సమావేశమై సాయుధ పోరాటాన్ని ఉపసంహరించాలని నిర్ణయించింది.1952 నాటికి సీపీఐ మీద నిషేధం తొలగనందున పీపుల్స్ డెమాక్రటిక్ ఫ్రంట్ పేరుతో కమ్యూనిస్టులు + ప్రజాతంత్ర వాదులు కలిసి పోటీ చేశారు. మెజారిటీ స్థానాల్లో పి.డి.ఎఫ్. గెలిచింది. రావి నారాయణరెడ్డి నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గం నుండి నెహ్రూ కంటే ఎక్కువ ఓట్ల మెజారిటీతో గెలిచారు. నిజాం సంస్థానంలోని కర్ణాటక, మహారాష్ట్ర జిల్లాల్లో కమ్యూనిస్టు పార్టీ బలహీనంగా ఉండటంతో కాంగ్రెసుకు వచ్చిన మెజారిటీతో బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పాటైంది. మరొకవైపు రజాకార్లు స్వల్పశిక్షలతో బయటపడితే, కమ్యూనిస్టులపై సుదీర్ఘ శిక్షలు పడ్డాయి. 12 మందికి మరణశిక్షలు విధింప బడ్డాయి. దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు, ఆందోళన జరిగింది. వాటిని ముందు యావజ్జీవ కారాగార శిక్షలుగా మార్చి, కొన్నేళ్ళకు రద్దు చేశారు. రాజబహదూర్ గౌర్ రాజ్యసభకు ఎన్నికైనా విడుదల చేయలేదు. చివరకు ఉపరాష్ట్రపతి సర్వేపల్లి జోక్యంతో విడుదలయ్యారు.భూస్వాములు, వారి తాబేదార్లు, ముందు కాంగ్రెసులో, తర్వాత తెలంగాణ ప్రజాసమితి, తెలంగాణ రాష్ట్ర సమితులలో చేరారు. ఇప్పుడు బీజేపీలో భాగమౌతున్నారు. బీజేపీ వారు చరిత్రను వక్రీకరించి ‘ముస్లిం రాజుకు వ్యతిరేకంగా హిందువుల పోరాటం’గా చిత్రీక రిస్తున్నారు. ముస్లిం కార్మికులు సాయుధ పోరాటానికి మద్దతిచ్చారు. భారత యూనియన్‌లో హైదరాబాదు సంస్థానం విలీనంలో మిత వాదుల పాత్ర నామమాత్రం. స్వామి రామానంద తీర్థ నాయకత్వాన కాంగ్రెసు జాతీయవాదులు గట్టిగా పోరాటం చేశారు. కాని సాయుధ పోరాటానిదే ప్రధాన పాత్ర. భారత ఉపప్రధాని సర్దార్ పటేల్ వల్ల మిలిటరీ హైదరాబాదును విలీనం చేసిందనేది దుష్ప్రచారం మాత్రమే. సాయుధ పోరాటం తెలంగాణ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంటుందనే భయంతోనే మిలిటరీని పంపారు. వేలాదిమందిని హత్యలు చేయించిన నిజాంను అరెస్టు చెయ్యకపోగా, రాజప్రముఖ్‌ను చేసి కోటి రూపాయల రాజభరణం ఇచ్చారు. ఇది ‘విముక్తా’, ‘రాజీ’నా ప్రజలు అర్థం చేసుకున్నారు.తెలంగాణ సాయుధ పోరాటం మత పోరాటం కాదు. వర్గ పోరాట స్వభావం కలిగిన పోరాటం. ప్రజాస్వామ్యం కోసం, పౌర హక్కుల కోసం, సంస్థానాన్ని భారత యూనియన్‌లో విలీనం కోసం జరిగిన పోరాటం. ప్రస్తుత నక్సలైట్ పోరాటం తెలంగాణ సాయుధ పోరాటం కొనసాగింపు అనే వాదన తప్పు. పోరాటం చైతన్యవంతులైన ప్రజలు నడుపుతారు. తెలంగాణ సాయుధ పోరాటం ప్రారంభించిన నాటికి ఆంధ్ర మహాసభకు ఏడు లక్షల సభ్యత్వం వుంది. 90 లక్షల తెలుగు భాష మాట్లాడే ప్రజల్లో 7 లక్షల సభ్యత్వం అంటే దాదాపు ప్రతి 12 మంది జనాభాలో ఒకరు ఆంధ్రమహాసభ సభ్యులు. ఈరోజు అలాంటి పరిస్థితి లేదు. ఏమైనా తెలంగాణ సాయుధ పోరాటం, చరిత్రాత్మకమైన మహత్తర పోరాటం. మన దేశం కోసం, మన కోసం, మన స్వేచ్ఛ కోసం ప్రాణాలర్పించిన, పోరాడిన ఆ యోధులను స్మరించుకుందాం. సురవరం సుధాకర్ రెడ్డి వ్యాసకర్త సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి -
ప్రజా సమస్యల్ని పరిష్కరిస్తాం: మంత్రి పొన్నం
సాక్షి, హైదరాబాద్: ప్రజా సమస్యలు వినేందుకే ప్రజాదర్బార్ ఏర్పాటు చేశామని, వీలైనంత త్వరలోనే వారి సమస్యల్ని పరిష్కరిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ప్రజా సమస్యలను వినేందుకే ప్రగతిభవన్‌కు ఉండే అడ్డుగోడలను తొలగించి ప్రజాభవన్‌గా మార్చామని పొన్నం తెలిపారు. మంత్రిగా బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో పొన్నం ప్రభాకర్, మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కె.సత్యనారాయణతో పాటు సీపీఐ నాయకులను కలిసేందుకు శుక్రవారం హైదరాబాద్‌లోని మఖ్దూమ్‌భవన్‌కు వచ్చారు. ఈ సందర్భంగా సీపీఐ జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్ పాషా, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పశ్యపద్మతో సమావేశమయ్యారు. అనంతరం పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ..గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజా సమస్యలను చెప్పుకునేందుకు, ప్రతిపక్ష నేతలు కలిసేందుకు కూడా అవకాశం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ విజయంలో సీపీఐ సంపూర్ణ సహకారం, మద్దతు ఉందని, భవిష్యత్‌లో కూడా తాము కలిసే ముందుకెళ్తామని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే సత్యనారాయణ మాట్లాడుతూ.. కాంగ్రెస్ విజయంతో రాష్ట్రంలో ప్రజాస్వామిక పునాది పడిందన్నారు. సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డిని మంత్రి పొన్నం ప్రభాకర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సురవరం వారికి అభినందనలు తెలిపారు. -
డబ్బు రాజకీయాల వల్లే వామపక్షాలకు దెబ్బ: సురవరం
సాక్షి, హైదరాబాద్: డబ్బు రాజకీయాల వల్లనే ఎన్నికల్లో వామపక్షాలు దెబ్బతింటున్నాయని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. దేశంలో వర్గ దోపిడీ, వ్యక్తిగత ఆస్తులకు వ్యతిరేకంగా పోరా టం చేసే ఏకైక పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ అని, అందుకే కమ్యూనిస్టు పార్టీ పట్ల రాజ కీయ ప్రత్యర్థులు, శతృవులు అనేక దుష్ప్రచారాలను, తప్పుడు మాటలను మాట్లాడుతారని అన్నారు. వారికి ఎర్రజెండా అంటేనే భయమన్నారు. ‘సీపీఐ 98వ వ్యవస్థాపక దినోత్సవ’ సందర్భంగా సోమవారం హైదరాబాద్ మగ్దూంభవన్ ప్రాంగణంలో బహిరంగ సభ నిర్వహించారు. తొలుత సీపీఐ జెండాను సుధాకర్‌రెడ్డి ఎగురవేశారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అధ్య క్షతన జరిగిన బహిరంగ సభకు సీపీఐ జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్, జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకట్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎన్.బాలమల్లేశ్, ఇ.టి.నర్సింహా, మాజీ ఎంఎల్ఎ పీ.జె చంద్రశేఖర్ హాజర య్యా రు. ఈ సందర్భంగా ‘కమ్యూనిస్టు పార్టీ ప్రాధా న్యత అవసరం’ అంశంపై సురవరం, ‘రాజ్యాంగ రక్షణ ఫెడరల్ వ్యవస్థ పరిరక్షణ’ అనే అంశంపై ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ ప్రసంగించారు. సురవరం మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై కొత్త పోరా టాలకు రూపకల్పన చేయాలని, అందుకోసం ప్రతిన బూనాలని పిలుపునిచ్చారు. దేశంలో ఒక శక్తివంతమైన ప్రజా ఉద్యమాన్ని నిర్మించి, ప్రజాతంత్ర, లౌకిక పార్టీలతో విశాలమైన ఐక్యతకు సీపీఐ, సీపీఐ(ఎం) కలయిక దోహద పడుతుందని అభిప్రాయపడ్డారు. కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. కమ్యూనిస్టుల పునరేకీకరణ జరగాలని పేదల నుండి పెద్దల వరకు కోరుతున్నారని చెప్పారు. చదవండి: రేవంత్‌రెడ్డి కొత్త పార్టీ?.. కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం.. -
కమ్యూనిస్టుల భయంతోనే సైన్యాన్ని పంపించారు
గన్‌ఫౌండ్రీ (హైదరాబాద్): తెలంగాణ విమోచనం పేరుతో బీజేపీ చేస్తున్న హడావుడి చూస్తుంటే ఊళ్లో పెళ్లికి కుక్కల హడావుడిలా ఉందని సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. నాడు పోరాటం చేసింది కమ్యూనిస్టులు అయితే.. నేడు ఉత్సవాలు చేస్తుంది పోరాటంలో లేని బీజేపీ అని పేర్కొన్నారు. శనివారం నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనమనేని సాంబశివరావు అధ్యక్షతన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో సురవరం మాట్లాడుతూ.. నిజాం నిరంకుశత్వాన్ని ఎదిరించి 3 వేల గ్రామాలను విముక్తం చేసిన కమ్యూనిస్టులు కొద్ది నెలల్లో తెలంగాణ ప్రాంతమంతా విస్తరిస్తారన్న భయంతో సర్దార్ వల్లభాయ్‌పటేల్ సైన్యాన్ని హైదరాబాద్‌కు పంపించారన్నారు. భారత సైన్యం రావాలనుకుంటే.. 1947లోనే ఎందుకు రాలేదని, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా రజాకార్లు అరాచకాలు చేసినప్పుడు ఏమి చేశారని ప్రశ్నించారు. కమ్యూనిస్టులు లేకుండా తెలంగాణ పోరాటం జరిగిందా? అని ప్రశ్నించారు. సెప్టెంబర్ 17వ తేదీ.. విమోచనం కాదని విలీనమే సరైన పదమని స్పష్టం చేశారు. చరిత్ర వక్రీకరణ యత్నాన్ని అడ్డుకోవాలి : ప్రొఫెసర్ కోదండరాం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్ర వక్రీకరణకు జరుగుతున్న కుట్రలపై అప్రమత్తంగా ఉండాలని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం సూచించారు ఈ సంవత్సరం ఉత్సవాలు నిర్వహించినట్టుగానే ప్రతిసంవత్సరం నిర్వహించాలని సూచించారు. సీపీఐ నేతలు కె.నారాయణ, చాడా వెంకట్‌రెడ్డి, అజీజ్‌పాషా, ఓయూ ప్రొఫెసర్ ఖాసీం, స్వతంత్ర సమరయోధుడు మొయునుద్దీన్, రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పద్మ, సీపీఐ అనుబంధ సంఘాల ప్రతినిధులు ఈ సభలో పాల్గొన్నారు. -
అఖండ భారత్ నినాదం దేశానికి ముప్పు
సాక్షి, యాదాద్రి: ప్రధాని మోదీ తెచ్చిన అఖండ భారత్ నినాదంతో దేశానికి పెనుముప్పు పొంచి ఉందని సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా రాజ్యాంగం ప్రకారం చేయాల్సిన పరిపాలన గాడితప్పిందన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థల పునాదులను పెకిలించి దేశాన్ని హిందూ రాజ్యంగా మార్చడమే అఖండ భారత్ నినాదం వెనుక ఉన్న ముప్పు అని వివరించారు. సోమవారం భువనగిరిలో సీపీఐ జిల్లా మహాసభల్లో పాల్గొన్న సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత అభ్యుదయ వాదులను, ప్రశ్నించే గొంతులను అణిచివేస్తున్నారన్నారు. ప్రైవేటీకరణ పేరిట ప్రభుత్వరంగ సంస్థలను అమ్ముతూ కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేశారన్నారు. దేశంలో పేదలకు ఉచితాలు వద్దంటూ సంపన్నులకు రాయితీలు ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించారు. బడా కంపెనీలు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను ఎందుకు రద్దు చేశారని నిలదీశారు. యూనివర్సిటీల్లో స్కాలర్ షిప్ తొలగించి ఎస్సీ, ఎస్టీ, బీసీలను మోదీ ప్రభుత్వం విద్యకు దూరం చేస్తున్నదన్నారు. పార్లమెంట్లో విద్యుత్ సంస్కరణ బిల్లు ఆమోదం పొందగానే వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్లు బిగించే కార్యక్రమం మొదలవుతుందని సురవరం చెప్పారు. పాలు, పెరుగు, చెప్పులు, తలకు రుద్దుకునే నూనెలకు సైతం జీఎస్టీ విధిస్తే పేదలు ఎలా బతుకుతారని ప్రశ్నించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ పాగా వేయకూడదనే మునుగోడులో టీఆర్ఎస్కు మద్దతు ఇస్తున్నట్టు చెప్పారు. మద్దతు ఇచ్చినప్పటికీ ప్రజా సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామన్నారు. -
ఆదర్శ కమ్యూనిస్టుకు జోహార్లు!
కామ్రేడ్ వసుమతి హఠాత్తుగా మరణించిన వార్త మమ్మల్నందర్నీ నిర్ఘాంతపరిచింది. తిరుపతి వెళ్లక ముందు బహుశా, రెండు రోజుల ముందు... నారాయణ, వసుమతి, పిల్లల్ని తీసుకొని మా ఇంటికి వచ్చారు. సాయంకాలం చాలాసేపు సరదాగా మాట్లాడుకున్నాం. కలిసి భోజనం చేశాం. దాదాపు సంవత్సర కాలం నుండి వసుమతి అమెరికాలో స్పన్నీ దగ్గర ఉండడంతో చాలా రోజుల తర్వాత కలిశామని సంతోషించాం. తిరుపతికి వెళ్ళిన తర్వాత గుండె నొప్పి రావడంతో పరీక్ష చేసి స్టెంట్ వేశారని తెలిసింది. ఇంత లోనే దుర్వార్త! నారాయణ గుంటూరులో ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజీలో చదువుతూ, స్టాలిన్ బాబు ద్వారా ఏఐఎస్ఎఫ్ లోకి తెనాలి విద్యార్థి రాజకీయ పాఠశాల ద్వారా వచ్చారు. వచ్చిన కొద్ది కాలంలోనే మిలిటెంట్ నాయకుడిగా రూపొంది అనేక పోరాటాలు నిర్వహించారు. రాష్ట్ర విద్యార్థి ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శిగా శక్తివంతమైన విద్యార్థి ఉద్యమం నిర్వహించారు. తర్వాత పార్టీ నిర్ణయం మేరకు సొంత జిల్లాలోని తిరుపతికి వెళ్లి ఎస్వీ యూనివర్సి టీలో బలమైన విద్యార్థి ఫెడరేషన్ నిర్మించారు. ఆ దశలో మహిళా విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ చదువుతున్న వసుమతితో పరిచయం ప్రేమగా మారింది. వివాహం తిరుపతిలోనే! మంత్రాలు, పెళ్లి భోజనాలూ లేని అతి సాధారణమైన పెళ్లి అది. వివాహం అనంతరం వారు ఎస్ఎస్ ఆఫీస్‌లోనే కాపురం పెట్టారు. అదొక సత్రం. అయినా సర్దుకు పోయింది వసుమతి. ఆమె మొదట్లో చాలా మితభాషి. ఒకవైపు బ్యాంకులో ఉద్యోగం చేస్తూ మరోవైపు తరచుగా ఇంటికి వచ్చే బంధువులు, పార్టీ కార్యకర్తలకు అతిధి సత్కారాలు చేస్తూ సంతోషంగా బాధ్యతలు మోసింది. బ్యాంకు ఉద్యోగుల సంఘంలో చురుకుగా పని చేస్తూ ఇతర వర్కింగ్ ఉమెన్ సంఘాల నిర్మాణంలో కూడా పాల్గొంది. ఆంధ్రప్రదేశ్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలుగా కూడా పనిచేశారు. ఆమె ఉద్యోగం చేయడం ద్వారా నారాయణకు ఆర్థిక సమస్యలు, కుటుంబ బాధ్యతలు లేకుండా పార్టీ కార్యక్రమాలు నిరంతరం సాగించేందుకు సహాయపడింది. నారాయణ రాష్ట్ర పార్టీ బాధ్యతలు తీసుకున్న తర్వాత హైదరాబాద్‌కు కుటుంబంతో సహా వచ్చారు. అప్పటికి నా భార్య విజయలక్ష్మి ఆంధ్ర బ్యాంకులో పనిచేస్తూ ఢిల్లీకి ట్రాన్స్ఫర్ అయింది. మా పెద్దబ్బాయి చదువుకోసం స్టేట్స్లో ఉన్నాడు. నారాయణ–వసుమతి కుటుంబాన్ని మాతోపాటు ఉండమని ఆహ్వానిస్తే అంగీకరించారు. కొద్ది నెలలు మేమందరం కలిసే ఉన్నాం. అప్పటికి స్పన్నీ, దీరూ కాలేజీలో చదువుతున్నారు. ఆ రకంగా మా బంధం సన్నిహిత కుటుంబ బంధం! వసుమతి కూడా హైదరా బాద్‌కు ట్రాన్స్ఫర్ అయింది. హైదరాబాద్‌లో నారాయ ణతోపాటు పార్టీ సీఆర్ పౌండేషన్ తదితర కార్యక్రమాల్లో పాల్గొంది. టీవీ99 ప్రారంభించిన తర్వాత వసుమతి చాలా బాధ్యతలు తీసుకుంది. అనేక రకాల సమస్యలు వచ్చాయి. చాలా ఓపికగా ఆమె బాధ్యతలు మోసింది. టీవీ99 అమ్మేసిన తర్వాత కూడా ఆమె సంవత్సరాల తరబడి సమస్యలు ఓపికగా ఎదుర్కొన్నది. నారాయణ పార్టీ జాతీయ కార్యదర్శిగా ఢిల్లీకి మకాం మార్చిన తర్వాత వసుమతి కూడా ఢిల్లీ వచ్చింది. ‘అజయ్ భవన్’లోనే ఒకగదిలో ఉండేవారు. ఏఐటీయూసీ ఆఫీస్ నుండి తరచుగా విజయలక్ష్మి వచ్చేది. అందరం కలిసి భోజనం చేసే వాళ్ళం. ఇలాంటివి ఎన్నో జ్ఞాపకాలు! ఇంటా బయటా అన్నిరకాల బాధ్య తలూ అవలీలగా మోసిన మంచి కమ్యూనిస్టు వసుమతి. ఆమెకు మా దంపతుల జోహార్లు! వ్యాసకర్త: సురవరం సుధాకర్ రెడ్డి భారత కమ్యూనిస్ట్ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి -
తెలంగాణకు వరం సురవరం
నిజాం నిరంకుశ పాలనలోని తెలంగాణలో తెలుగువారి అణచివేతను వ్యతిరేకిస్తూ, తెలుగు భాషా సంస్కృతుల వికాసానికి ఎనలేని కృషి చేశారు సురవరం ప్రతాపరెడ్డి. చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఉర్దూ భాషను మతానికి అంట గట్టి, ఆ మతపు ఆయుధంతో ఒక జాతి సంస్కృతిని సాంతం అవమానించడానికి, కాలరాయడానికి ప్రయత్నించాడు. ‘తెలంగీ–బేఢంగీ’, ‘తెలుగు వికారభాష’ అనే నినాదం ప్రభుత్వ ప్రోత్సాహంతో ప్రచారంలోకి వచ్చింది. అందువల్ల విద్యార్థులు తెలుగులో చేర డానికి జంకేవారు. అదీగాక బి.ఎ. వరకు ఉర్దూలో చదివిన వారికి తెలుగు ఎలా వంటపడుతుంది? తెలుగు ప్రభుత్వం గుర్తించని భాష. అందులో డిగ్రీ పొంది ప్రయోజనం శూన్యం. రాజభాష ఉర్దూ. శాసనాలు ఉర్దూ. ఆఫీసుల్లో వ్యవహార భాష ఉర్దూ. కోర్టు భాష ఉర్దూ. జరీదా అనగా గెజిటెడ్ భాష ఉర్దూ. నాణేల మీద భాష ఉర్దూ. దుకాణాలు, వగైరా బోర్డులన్నీ ఉర్దూ. ఎవరైనా తెలుగు మాట్లాడినట్లు వినిపిస్తే ‘తెలంగీ–బేఢంగి’ అని వెక్కిరింపు. తెలుగు మూడో తరగతిలో మొదలవు తుంది. 7వ తరగతి వరకు సాగుతుంది. 8వ తర గతి నుంచి ఆప్షనల్ (ఐచ్ఛికం). పాఠశాలలు, కళా శాలలు అన్నీ సర్కారువే. అవి ఏర్పరచడానికి ప్రమాణాలు ప్రతీ సూచీకి ఒక ఇంటర్మీడియెట్ కాలేజీ, రాజ్యంలో నాలుగు అంటే నాలుగే ఇంటర్ కాలేజీలు. ప్రతి జిల్లాకు ఒక పౌఖాన్వా అంటే హైస్కూల్, ప్రతి తాలూకాకు వస్తాన్వా. తహతన్వా అంటే మిడిల్ స్కూల్. గ్రామ ప్రాముఖ్యతను బట్టి వీధి బడులను ఫర్మానా ద్వారా నిషేధించారు. అందువల్ల పంతుళ్లు తమ ఇళ్లల్లోనే తెలుగు చెప్పేవారు. ఇలాంటి నేపథ్యంలో తెలుగు భాషా ప్రచారా నికి, తెలంగాణ ప్రాంతాల్లో పాఠశాలల ఏర్పాటుకు ప్రజలను జాగృతం చేయడానికి సురవరం ప్రతాప రెడ్డి గోల్కొండ పత్రికను స్థాపించారు. దీని స్థాప నలో రాజబహదూర్ వెంకటరామారెడ్డి సహాయం తీసుకున్నారు. సంపాదకీయాలు, ప్రత్యేక వ్యాసా లతో తెలుగు భాషాభిమానులను చైతన్యవంతు లను చేశారు. నిరంకుశ పాలనను విమర్శిస్తూ నిర్భ యంగా ఎన్నో వ్యాసాలు రాశారు. జమీందార్లు, దేశ్‌ముఖ్‌లు ప్రజలను ఎలా పీడిస్తున్నారో నిక్క చ్చిగా తెలియజెప్పారు. అంతేకాదు, ప్రతీ గ్రామంలో గ్రంథాలయాల ఏర్పాటు ద్వారా ప్రజలను మరింత జాగరూకులను చేయవచ్చని భావించి, గ్రంథాలయోద్యమానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం నుండి ఎన్నో అవ రోధాలు ఎదుర్కోవాల్సి వచ్చినా లెక్క చేయక గ్రంథాలయాల ఏర్పాటును ఒక ఉద్యమంగా కొనసాగించారు.)) గ్రంథాలయాల ఏర్పాటుతో ప్రజా విప్లవం ఊపందుకోగలదన్న భావనతో నైజాం సర్కార్ కొత్తగా గ్రంథాలయాల ఏర్పాటును నిషేధించింది. అంతేకాదు, తెలుగువారు సభలు, సమావేశాల ఏర్పాటును ముందుగా అనుమతి లేకుండా చేపట్టరాదని ఉత్తర్వులు జారీ చేసింది. 1942 మే 26న తెలంగాణలో ఆంధ్ర మహాసభల వ్యాప్తికి గ్రంథాలయ మహాసభలను ఆలంపూర్, సూర్యాపేట, జనగాం తదితర ప్రాంతాల్లో సుర వరం ఘనంగా ఏర్పాటు చేశారు. తెలంగాణ రచ యితల సంఘం, లక్ష్మణరాయ పరిశోధన మండలి వంటి పలు సంస్థలు స్థాపించడంలో ఆయన పాత్ర ముఖ్యమైనది. బ్రిటిష్ ఆంధ్రులు నిజాం ఆంధ్రులను తమ సోదరులని గానీ, తమతో సములనిగానీ గుర్తిం చలేదు. బ్రిటిష్ ఆంధ్ర నాయకులెవరూ తెలంగాణ ప్రజలను పట్టించుకోలేదు. ‘తెలంగాణలో కూడా కవులున్నారా?’ అని ప్రశ్నించినాడు ఒక కవి శేఖ రుడు. సురవరం దానిని సవాలుగా తీసుకున్నారు. 354 మంది తెలంగాణ కవుల కవితలను కూర్చి గోల్కొండ కవుల ప్రత్యేక సంచిక ప్రచురించారు. నైజాం పాలనలో అణగారిపోయిన తెలుగువారి ఘనతను చాటిచెప్పిన బహుముఖ ప్రజ్ఞాశాలి, సాహితీవేత్త సురవరం ప్రతాపరెడ్డి. హైదరాబాద్ రాష్ట్ర ఏర్పాటు అనంతరం, రాష్ట్ర శాసనసభలో సభ్యుడిగా ఐదు సంవత్సరాలు పనిచేశారు. ఆ మహానీయుని ఆశయాలకు పునరంకితం కావడమే ఆయనకు అందించే ఘనమైన నివాళి. -కొలనుపాక కుమారస్వామి ఫ్రీలాన్స్ జర్నలిస్ట్, వరంగల్ మొబైల్ : 99637 20669 -
తప్పుడు కేసులు దుర్మార్గ చర్య
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ అల్లర్ల కేసులో ప్రేరేపకులుగా ఆరోపిస్తూ సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, జేఎన్‌యూ ప్రొఫెసర్ జయతీ ఘోష్, మరికొందరు మేధావులపై పెట్టిన తప్పుడు కేసులను వెంటనే ఉపసంహరించాలని సీపీఐ నేత సురవరం సుధాకరరెడ్డి డిమాండ్ చేశారు. ఢిల్లీ అల్లర్ల కేసులో ప్రధాన నిందితులైన బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు, ఇతరుల పేర్లు, వివరాలు పత్రికల్లో వచ్చినా వారిపై చర్యలు తీసుకోకుండా సంబంధం లేని వారిపై అక్రమ కేసులు పెట్టడం దుర్మార్గమైన చర్య అని, ఈ తప్పుడు కేసులు పెట్టేందుకు కేంద్ర హోంశాఖ చేస్తున్న కుట్రను ఖండిస్తున్నట్టు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బీమాకోరేగావ్‌లో జరిగిన అల్లర్లలో పాల్గొన్న సంఘ్‌పరివార్‌కు చెందిన నిందితులను వదిలేసి, ఈ ఘటనతో సంబంధం లేని మేధావులు, వామపక్ష భావాలు కలిగిన వారిని తప్పుడు కేసులతో అరెస్ట్ చేసి రెండేళ్లు అయినా ఎఫ్ఐఆర్ దాఖలు చేయకుండా, బెయిల్ ఇవ్వకుండా వేధిస్తున్నారని విమర్శించారు. సీపీఎం అగ్రనేత ఏచూరి, మరో 8 మంది మేధావులపై బీజేపీ ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టడాన్ని ఖండిస్తున్నట్టు సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. నేడు నిరసనలు.. ఢిల్లీ అల్లర్ల కేసులో ఏచూరి తదితరులపై పోలీసులు చార్జిషీటును ఫైల్ చేయడంపై సోమవారం సీపీఎం, సీపీఐ, న్యూడెమోక్రసీ, టీజేఎస్, టీటీడీపీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నాయి. ఈ అక్రమ కేసులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా చేపడుతున్న నిరసనల్లో భాగంగా హైదరాబాద్ ఆర్టీసి క్రాస్‌రోడ్డులో చేపడుతున్న కార్యక్రమంలో ఈ పార్టీల నాయకులు పాల్గొంటారని సీపీఎం తెలిపింది. -
చరిత్రను బీజేపీ వక్రీకరిస్తోంది: సురవరం
సాక్షి, హైదరాబాద్: నాడు నిజాం నవాబుకు, ప్రజలకు మధ్య జరిగిన పోరాటాన్ని హిందూ, ముస్లిం పోరాటం గా బీజేపీ వక్రీకరించి చేస్తున్న ప్రచారం శుద్ధ అబద్ధమని సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి అన్నారు. నిజాం నవాబు, దేశ్‌ముఖ్‌లతో జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో మెజారిటీ ముస్లింలు పాల్గొన్నారని, జిల్లాల్లో సైతం ముస్లింలు కమ్యూనిస్టు పార్టీలో చేరి నాయకత్వాన్ని అందించారని పేర్కొన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట 73వ వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం సీపీఐ ఆధ్వ ర్యంలో ఆన్లైన్లో బహిరంగసభ జరిగింది. ఈ సభలో సురవరం మాట్లాడుతూ నాటి పోరాటంలో నిజాం వెనుక ముస్లింలు ఉన్నారంటూ బీజేపీ చరిత్రకు వక్రభాష్యం చెబుతోందని ధ్వజమెత్తారు. ఈ పోరాటంలో ఎవరూ ఎవరినీ మతం పేరుతో చంపలేదని, రాచరిక, భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా మాత్రమే పోరాటం జరిగిందని అన్నారు. నిజాం వ్యతిరేక పోరాటంలో దొడ్డి కొమురయ్య హత్య కీలక మలుపు అని, దీంతో ఆయు ధాలు కలిగిన శత్రువుపై పోరాడేందుకు సాయుధ పోరా టమే మార్గమని, 1947 సెప్టెంబర్ 11న రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మఖ్దూం మొహియొద్దీన్ చారిత్రక రైతాంగ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చారని తెలి పారు. 1948 సెప్టెంబర్ 17న నిజాం సంస్థానం భారత్‌లో విలీనమయ్యాక భూస్వాములు తిరిగి గ్రామాల్లోకి వచ్చి భూములులాక్కునే పరిస్థితుల్లో కమ్యూనిస్టులు సాయుధ పోరాటం కొనసాగించాల్సి వచ్చిందని అన్నారు. సాయుధ పోరాటాన్ని స్మరించుకుందాం: నారాయణ మహత్తర చరిత్ర కలిగిన తెలంగాణ సాయుధ పోరాటం గురించి భవిష్యత్ తరాలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఈ పోరాటాన్ని స్మరించుకోవాలని సీపీఐ కేంద్ర కమిటీ సభ్యుడు నారాయణ అన్నారు. శుక్రవారం ట్యాంక్‌బండ్‌పై ఉన్న మఖ్దూం మొహియొద్దీన్ విగ్రహానికి సీపీఐ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ట్యాంక్‌బండ్‌పై ర్యాలీ నిర్వహించారు. అనంతరం నారాయణ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సాధనలో సీఎం కేసీఆర్ సెప్టెంబర్ 17ను అధికారికంగా ప్రభుత్వం నిర్వహిస్తుందని హామీ ఇచ్చారని, కానీ ఆచరణలో అమలు చేయకుండా ఎంఐఎం పార్టీకి భయపడుతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, నేతలు ఈటీ నరసింహ, కూనంనేని సాంబశివరావు, బీఎస్ బోస్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. ట్యాంక్‌బండ్‌పై మఖ్దూం మొహియొద్దీన్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం ర్యాలీగా వస్తున్న సీపీఐ నేతలు -
అన్ని కాలాలకు వర్తించేదే మార్క్సిజం
సుందరయ్య విజ్ఞానకేంద్రం : మార్క్సిజానికి కాలపరిమితి లేదనీ, అన్ని కాలాలకు వర్తించేదే ఆ సిద్ధాంతమని దీన్ని మన సమాజానికి వర్తింపజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కవి, విమర్శకుడు కె.శివారెడ్డి అన్నారు. శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నవ తెలంగాణ పబ్లిషింగ్ హౌస్, నవచేతన బుక్‌హౌస్‌ల సంయుక్త ఆధ్వర్యంలో రచయిత కె.గాంధీ రాసిన తెలుగు అనువాదం ‘మార్క్స్, ఏంగెల్స్ రచించిన కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక, కమ్యూనిజం సూత్రాలు’పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శివారెడ్డి మాట్లాడుతూ.. కమ్యూనిస్టు పార్టీ లోని అభిప్రాయ భేదాల వల్ల విడిపోయి అవి బలహీన పడ్డాయన్నారు. పురోగమన శక్తుల నుంచే గొప్ప కవిత్వం వస్తుందని చెప్పారు.సీపీఐ జాతీయ నేత సురవరం సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. సైద్ధాంతిక అధ్యయనంతో వామపక్ష ఉద్యమాన్ని బలోపేతం చేసుకోవాలని, ఐక్య ఉద్యమాల ద్వారానే దోపిడీ శక్తులను తిప్పికొట్టాలన్నారు. పెట్టుబడిదారీ సమాజం తీవ్ర సంక్షోభంలో ఉందని, ఘర్షణలు, యుద్ధాల ద్వారా వైవిధ్యాన్ని, సంక్షోభాన్ని పేద దేశాలపై రుద్దడానికి ప్రయత్నిస్తున్నాయ ని హెచ్చరించారు. ఆర్ఎస్ఎస్ ఫాసిస్ట్ దాడులను తిప్పికొట్టడానికి కమ్యూనిస్టులంతా ఐక్యంగా పని చేయాలని చెప్పారు. సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. సీపీఎం, సీపీఐ పార్టీలు దేశ ఆర్థిక పరిస్థితులను ఒక్కొక్కరూ ఒక్కో విధంగా అర్థం చేసుకున్నారని, అందుకే భిన్నమైన రీతుల్లో పోరాటం చేయాల్సి వచ్చిందన్నారు. సాయుధ పోరాటయోధుడు కందిమళ్ల ప్రతాపరెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీపీఐ తెలంగాణ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యుడు వేములపల్లి వెంకట్రామయ్య, తెలం గాణ రాష్ట్ర కార్యదర్శి సాదినేని వెంకటేశ్వరరావు, ప్రజా గాయకురాలు విమలక్క, ప్రజా వాగ్గేయకారుడు గోరటి వెంకన్న, ఎంసీపీఐ(యూ) జాతీయ ప్రధాన కార్యదర్శి మహ్మద్ గౌస్, రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి, నవ తెలంగాణ పబ్లిషింగ్ హౌస్ మేనేజర్ కోయ చంద్రమోహన్, నవచేతన పబ్లిషింగ్ హౌస్ ప్రతినిధి మధుకర్ తదితరులు పాల్గొన్నారు. -
వైవీ స్ఫూర్తితో రైతుల పక్షాన పోరాడాలి: సురవరం
కాచిగూడ : రైతులు పండించిన పంటకు మెరుగైన ధరకోసం, వారి రక్షణ కోసం రైతు సంఘం పోరాడాలని సీపీఐ జాతీయ నాయకులు సురవరం సుధాకర్‌రెడ్డి అన్నారు. రైతు సంఘాల ఐక్యకార్యచరణ ఏర్పాటు చేసుకుని ముందుకు పోవడం అభినందనీయమ న్నారు. ఆదివారం హిమాయత్‌నగర్ అమృత ఎస్టేట్స్‌లో ఏర్పాటు చేసిన రాష్ట్ర రైతు సంఘం వై.వి.కృష్ణారావు కార్యాలయాన్ని సుధాకర్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం మఖ్దూంభవన్‌లో రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విశ్వేర్‌రావు అధ్యక్షతన నిర్వహించిన ప్రారంభోత్సవ సభలో సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ రైతు సంఘం సీనియర్ నేత వై.వి.కృష్ణారావు తన జీవితాంతం కనీస ధరల కోసం పోరాడారని, కేద్రం ఏర్పాటు చేసిన కనీస ధరల కమిషన్‌కు ఆయనే చైర్మన్ అయ్యారని గుర్తుచేశారు. ఇప్పటికీ వామపక్షాలకు చెందిన రైతు సంఘాలే వారికోసం పనిచేస్తున్నాయన్నారు. ప్రొఫెసర్ వకుళాభరణం రామకృష్ణ మాట్లాడుతూ మంచి కమ్యూనిస్టుగా ఉండడం అరుదనీ, ఇలాంటి వారిలో వై.వి.ఒకరని, ఆయన కమ్యూనిస్టు పార్టీలో ఉండటం ఆ పార్టీకే గొప్పతనం అన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ వై.వి.కృష్ణారావు వ్యవసాయంపైనే కాకుండా దేశ ఆర్థిక విధానాలపైనా ఎన్నో పుస్తకాలు రాశారన్నారు. -
సామ్రాజ్యవాద కొత్త ముసుగులో అశాంతికి కుట్రలు
సాక్షి, హైదరాబాద్: సామ్రాజ్యవాదం కొత్త ముసుగులో అణ్వాయుధాలతో విధ్వంసాలు, మతాల పేరిట ఘర్షణలు సృష్టించేందుకు ప్రపంచ వ్యాప్తంగా కుట్రలు సాగుతున్నాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్ వ్యాఖ్యానించారు. ఈ కుట్రలను సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు ప్రతి ఒక్కరూ కంకణబద్ధులు కావాలని పిలుపునిచ్చారు. శాంతి, సౌభ్రాతృత్వం కోసం విద్యార్థులు, యువతను తగిన రీతిలో తీర్చిదిద్ది, వారిని ఈ రంగంలో ఉపయోగించే విషయంలో మేధావులు కృషి చేయాలని ఆయన కోరారు. శనివారం ఒక ప్రైవేట్ హోటల్లో ఆల్ ఇండియా పీస్, సాలిడారిటీ ఆర్గనైజేషన్ ద్వితీయ మహాసభలో ఆయన మాట్లాడుతూ అమెరికా వంటి సామ్రాజ్యవాద దేశాలు, దోపిడీని, అశాంతిని నెలకొల్పే స్వభావం ఉన్న దేశాల విషయంలో లోతుగా ఆలోచించే సమయం ఆసన్నమైందన్నారు. ఇటీవలి తన అమెరికా పర్యటనలో ఆసక్తికరమైన విషయాలు దృష్టికి వచ్చాయని, అక్కడి యువత ఆర్థికంగా ఎదగడం కన్నా సోషలిజం వైపు మొగ్గుచూపుతున్నారని ఆయన ప్రస్తావించారు. ఆహ్వాన సంఘం చైర్మన్ కాచం సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ మహాసభలో సీపీఐ నేత సురవరం సుధాకర్ రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కాంగ్రెస్ నాయకుడు, సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ, శాంతి సంఘీభావ సంఘం నాయకులు పల్లబ్ సేన్ గుప్తా, అరుణ్ కుమార్, తిప్పర్తి యాదయ్య, జగన్మోహన్, రఘుపాల్ పాల్గొన్నారు. -
సీఎం మొండివైఖరి విడనాడాలి: సురవరం
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ మొండివైఖరిని విడనాడి ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల పరిష్కారం ద్వారా సమ్మెకు తెరదించాలని సీపీఐ అగ్రనేత సురవరం సుధాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సమస్యను రెండు వారాల్లోగా ముగించాలని కార్మికశాఖను హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. న్యాయస్థానం చెప్పినా సీఎం వినడం లేదని, ఇందుకు కేసీఆర్ భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. సోమవారం మఖ్దూంభవన్‌లో పార్టీ నేతలు అజీజ్ పాషా, కూనంనేని సాంబశివరావులతో కలసి సురవరం మీడి యాతో మాట్లాడారు. సీఎం మూర్ఖంగా వ్యవహరిస్తూ కార్మికులపై పగ సాధిస్తున్నారని ఆరోపించారు. ఆర్టీసీ విలీన అంశాన్ని జేఏసీ వాయిదా వేసుకుని, మిగతా సమస్యలు పరిష్కరించాలని కోరినా ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోందని ప్రశ్నించారు. ప్రజారవాణా నిలిచిపోవడంతో పేదలు, విద్యార్థులు, మధ్యతరగతి వర్గాలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారన్నారు. సీఎంకు నచ్చజెప్పి సమ్మె పరిష్కారానికి టీఆర్ఎస్ నేతలు చొరవ తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో పూర్తిస్థాయి మెజారిటీ ఉన్నాక కూడా ప్రభుత్వాన్ని కూల్చివేస్తారని సీఎం ఎందుకు భయపడుతున్నారని కూనంనేని ప్రశ్నించారు. సర్కార్‌ను కూల్చాల్సిన అవసరం ఎవరికీ లేదని, ఒకవేళ ప్రభుత్వాన్ని కూల్చే పరిస్థితి వస్తే టీఆర్ఎస్లోని నాయకుల ద్వారానే జరుగుతుందని చెప్పారు. -
ఆర్టీసీని ప్రైవేటీకరించే కుట్ర
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీని ప్రైవేటీకరించి, వేల కోట్ల విలువ చేసే ఆ సంస్థ ఆస్తుల్ని సీఎం కేసీఆర్ తన అనుయాయులకు కట్టబెట్టే కుట్ర చేస్తున్నారని సీపీఐ అగ్రనేత సురవరం సుధాకరరెడ్డి ఆరోపించారు. సీఎం తన వైఖరిని మార్చుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్మికులకు న్యాయం జరిగేలా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, ప్రజలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఆర్టీసీని పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ శనివారం మఖ్దూంభవన్‌లో సీపీఐ సహాయకార్యదర్శి కూనంనేని సాంబశివరావు చేపట్టిన నిరవధిక దీక్షను సురవరం ప్రారంభించారు. ఈ సందర్భంగా సురవరం మాట్లాడుతూ..సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోకపోగా ప్రభుత్వం సమ్మె విచ్ఛిన్నానికి, బెదిరింపులకు దిగుతోందని ధ్వజమెత్తారు. దీక్షలో ఉన్న కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ..ఉద్యమనేతగా ఉన్న వ్యక్తి సీఎం అయ్యాక కూడా రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదన్నారు. సమ్మె పరిష్కారమయ్యే వరకు దీక్ష కొనసాగిస్తామన్నారు. -
అదేమీ అద్భుతం కాదు: సురవరం
సాక్షి, హైదరాబాద్ : ఒక్క కలం పోటుతో 48 వేల మంది ఉద్యోగాలు తీసేస్తాం అనడం దారుణమని సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు శనివారం నిరాహార దీక్షను చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దీక్ష చేపట్టిన సాంబశివరావుకు సీపీఎం రాష్ట్ర నాయకులు డీజీ నర్సింగరావు, ఆర్టీసీ జేఏసీ కో కన్వీనర్ రాజిరెడ్డి, సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డితోపాటు పలు ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. మొదట ఇందిరాపార్కు వద్ద దీక్ష చేపట్టాలని నిర్ణయించిన ఆయన పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో పార్టీ ఆఫీసులోనే దీక్షను ప్రారంభించారు. సురవరం సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. సమ్మె ప్రారంభమై 20 రోజులు గడుస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీతాలు లేక ఆర్టీసీ కార్మికులు ఇబ్బంది పడుతున్నారని.. ఇద్దరు కాల్చుకుని ఆత్మహత్య చేసుకోగా.. మరికొంత మంది గుండె పగిలి చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా.. రూ. 5,000 కోట్ల అప్పు ఉందని ఆర్టీసీని మూసివేస్తామని ముఖమంత్రి కేసీఆర్ అనడం సరికాదన్నారు. ఆ అప్పులన్ని ప్రభుత్వం చేసినవేనని, ఆర్టీసీ వారు సొంతంగా చేసినవి కాదని వ్యాఖ్యానించారు. ఆర్టీసీ వ్యాపార సంస్థ కాదని, ప్రజా రవాణా రంగమని ఆయన పేర్కొన్నారు. ఉప ఎన్నికల్లో గెలవడం అద్భుతం కాదు. నష్టాలు వచ్చినా.. లాభాలు వచ్చిన ప్రజా రవాణా వ్యవస్థను నిరంతరం నడపాల్సిందేనని సుధాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. డిజిటల్ పన్నులు వేయడం వలన ఆర్టీసీ నష్టాల్లోకి వెళ్ళిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఏపీలో ఆర్టీసీని విలీనం చేశారు కదా.. మరి తెలంగాణలో ఎందుకు సాధ్యం కావడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. హుజూర్ నగర్ ఎన్నికల్లో గెలిస్తే చేసిన తప్పులు అన్ని మాఫీ అయిపోతాయా అని నిలదీశారు. ఉప ఎన్నికల్లో అధికార పార్టీ గెలవడం పెద్ద అద్భుతం కాదని విమర్శించారు. నిరవధిక నిరాహార దీక్ష విజయవంతం చేయాలని కోరారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలకు పరిష్కారం చూపాలని సురవరం సుధాకర్ రెడ్డి సూచించారు. -
సాయుధ పోరాటాన్ని వక్రీకరిస్తోంది
గన్‌ఫౌండ్రీ: తెలంగాణ సాయుధ పోరాటాన్ని బీజేపీ వక్రీకరిస్తోందని సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌం డ్స్‌లో సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాల ముగింపు బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాలుపంచుకుని త్యాగాలు చేసిన పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ అని గుర్తుచేశారు. భూమి, భుక్తి, బానిస సంకెళ్ల విముక్తి కోసం నాడు నిజాం ప్రభుత్వంతో ఈ పోరాటం జరిగిందని, అయితే దీనిని ముస్లింలపై జరిగిన పోరాటంగా బీజేపీ వక్రీకరిస్తోందని ధ్వజమెత్తారు. ఈ పోరాటా నికి ముస్లింల మద్దతు ఉందన్న చరిత్రను తెలుసుకోవాలని సూచించారు. అనంతరం స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించారు. కార్యక్రమం లో సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యద ర్శి తమ్మినేని వీరభద్రం, టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం, అజీజ్‌పాషా, కూనంనేని సాంబశివరావు, పల్లా వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా, తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా మంగళవారం మఖ్దూం భవన్లో చాడ వెంకట్‌రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. -
దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చిరంజీవి
సాక్షి, హైదరాబాద్ : కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి(77) మృతి పట్ల సినీ నటుడు, కాంగ్రెస్ నేత మెగాస్టార్ చిరంజీవి సంతాపం ప్రకటించారు. రాజకీయ దురంధురుడు, మేధావి, జ్ఞాని అయిన జైపాల్‌రెడ్డి మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సంతాప సందేశాన్ని మీడియాకు విడుదల చేశారు. ‘రాజకీయ దురంధురుడు, మేధావి, జ్ఞాని అయిన జైపాల్ రెడ్డి మరణం నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. దేశ రాజకీయాల్లో ప్రభావం చూపిన ప్రజ్ఞాశాలి. ఆయన వాగ్ధాటి, రాజకీయ పరిజ్ఞానం ఆయన పట్ల నాకు గౌరవాన్ని పెంచింది. అభిమాన పాత్రుడిని చేసింది. ఆయన మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నా. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా’అని తన సందేశంలో చిరంజీవి తెలిపారు. ఇద్దరం కలిసి ఒకే యూనివర్సీటీలో కలిసి చదువుకున్నాం : సురవరం జైపాల్‌రెడ్డి మరణం తనను దిగ్బ్రాంతి కలిగించిందని సీపీఐ మాజీ జాత్యీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ అన్నారు. ఆయన మృతి పట్ల సంతాపం తెలిపారు. రాజకీయంగా భిన్న ధృవాలలో ఉన్నా తమ దోస్తాన మాత్రం అలాగే కొనసాగిందని చెప్పారు. ఇద్దరం కలిసి ఉస్మానియా యూనివర్సీటీలో కలిసి చదువుకున్నామని గుర్తుచేశారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా మంత్రి పదవులు నిర్వహించారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. జైపాల్‌రెడ్డి గొప్ప ప్రజ్ఞశాలి అని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు. -
ప్రతిఘటన పోరాటాలే శరణ్యం
సాక్షి, హైదరాబాద్ : రాజ్యాంగ పరిరక్షణతో పాటు లౌకికవాదం, ప్రజాస్వామ్య రక్షణకు ప్రతిఘటన పోరాటాలే శరణ్యమని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. దేశంలో రోజు రోజుకు ఫాసిజం, లౌకికవాదం, ప్రజాస్వామ్యంపై దాడులు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మిక హక్కులను మోదీ ప్రభుత్వం కాలరాస్తోందని, దీనిపై పోరాటం చేయడం ద్వారానే తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, కార్మికనేత డా.రాజ్‌బహదూర్ గౌర్‌కు నిజమైన నివాళి అర్పించినట్టు అవుతుందన్నారు. ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో గురువారం రాజ్‌బహదూర్ గౌర్ శత జయంతి ఉత్సవాల ముగింపు సభలో సీపీఐ అగ్రనేత సురవరం సుధాకరరెడ్డి మాట్లాడుతూ..గౌర్ స్ఫూర్తిదాయక నాయకుడని, తెలంగాణ సాయుధ పోరాటంలో గొప్ప పాత్రను పోషించారని కొనియాడారు. మోదీ విధానాలు దేశానికి ప్రమాదకరమని, మోదీ అభిప్రాయాలతో ఏకీభవించని వారిని దేశద్రోహులుగా ముద్ర వేస్తున్నారని పేర్కొన్నారు. దళితులు, మేధావులు, ఆలోచనపరులపై దాడులు పెరుగుతున్నాయని ప్రతిఘటన లేకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడలేమన్నారు. ఏఐటీయూసి జాతీయ ప్రధానకార్యదర్శి అమర్జిత్కౌర్ మాట్లాడుతూ..జీవితాన్ని కార్మికోద్యమానికి ధారపోసిన గొప్పయోధుడు గౌర్ అన్నారు. అంతకుముందు మఖ్దూం భవన్లో ఆవరణలో నిర్మించిన రాజ్‌బహదూర్‌గౌర్ సమావేశ మందిరాన్ని గురువారం ఉదయం సురవరం సుధాకరరెడ్డి ప్రారంభించగా, అక్కడ ఏర్పాటు చేసిన గౌర్ విగ్రహాన్ని బూర్గుల నరసింగరావు ఆవిష్కరించారు. త్యాగధనులు, పోరాట యోధుల త్యాగాలు, స్ఫూర్తిని నేటి తరానికి అందించాల్సిన అవసరముందని సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. రాచరిక పాలనకు వ్యతిరేకంగా పోరాడిన కార్మికోద్యమ నిర్మాత గౌర్ అని నరసింగరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గౌర్ జయంతి ఉత్సవాల కమిటీ ప్రధాన కార్యదర్శి ఉజ్జిని రత్నాకరరావు, కోశాధికారి డా. డి.సుధాకర్, గౌర్ సోదరి అవదేశ్‌రాణి, ఏపీ సీపీఐ కార్యదర్శి కె.రామకృష్ణ, సీపీఐ నాయకులు అజీజ్‌పాషా తదితరులు పాల్గొన్నారు. -
సీపీఐ పగ్గాలు అందుకున్న రాజా
సాక్షి, న్యూఢిల్లీ: భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) నూతన ప్రధాన కార్యదర్శిగా రాజ్యసభ సభ్యుడు డి.రాజా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆయన నియామకాన్ని పార్టీ జాతీయ సమితి, కార్యవర్గ సమావేశం ఆమోదించింది. సుదీర్ఘకాలం ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన సురవరం సుధాకర్‌రెడ్డి వయసురీత్యా వైదొలిగారు. గత మూడు రోజులుగా జరుగుతున్న జాతీయ సమితి, కార్యవర్గ సమావేశాల్లో సురవరం రాజీనామాను ఆమోదించారు. ప్రధాన కార్యదర్శి పదవి నుంచి వైదొలిగినా జాతీయ కార్యవర్గ సభ్యుడిగా కొనసాగుతానని సురవరం తెలిపారు. రాజా నేతృత్వంలో పార్టీ పునర్నిర్మాణం జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. విద్యార్థి సంఘం నాయకుడిగా.. తమిళనాడుకు చెందిన 70 ఏళ్ల డి. రాజా యువజన ఉద్యమాల ద్వారా క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చారు. 1975–80 వరకు అఖిల భారత యువజన సమాఖ్య తమిళనాడు కార్యదర్శిగా, 1985–90 వరకు ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1994 నుంచి సీపీఐ జాతీయ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. 2007 నుంచి ఆయన రాజ్యసభ సభ్యుడిగా పనిచేస్తున్నారు. ఆయన పదవీకాలం ఈనెల 24వ తేదీతో ముగియనుంది.ఎంపీగా రాజా దాదాపు అన్ని శాఖల పార్లమెంటు స్టాండింగ్ కమిటీల్లో పనిచేశారు. జాతీయ కార్యవర్గంలోకి కన్హయ్య జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ నాయకుడు కన్హయ్య కుమార్‌ను జాతీయ కార్యవర్గంలోకి తీసుకున్నారు. ఇటీవల మరణించిన షమీమ్‌ఫైజీ స్థానంలో కన్హయ్యకు చోటు కల్పించారు. ఒడిశాకు చెందిన రామకృష్ణ పాండ, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన మనీష్ కుంజంను జాతీయ కార్యవర్గంలో ప్రత్యేక ఆహ్వానితులుగా ఎన్నుకున్నారు. సమావేశాల్లో ఏపీ, తెలంగాణ కార్యదర్శులు రామకృష్ణ, చాడా వెంకట్‌రెడ్డి సహా ముప్పాళ్ల నాగేశ్వరరావు, శ్రీనివాస్‌రెడ్డి, అక్కినేని వనజా, ఓబులేసు పాల్గొన్నారు. -
సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా డి.రాజా
సాక్షి, న్యూఢిల్లీ : సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు డి.రాజా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సుదీర్ఘకాలంగా సీపీఐ జాతీయనేతగా ఉన్న డి. రాజా ఎన్నికను సీపీఐ జాతీయ మండలి సమావేశం ఆమోదించింది. 2012 నుంచి సురవరం సుధాకర్ రెడ్డి సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిలో కొనసాగుతున్నారు. ఆయన పదవీకాలం మరో రెండేళ్లు ఉండగా అనారోగ్య కారణాలతో పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో ఢిల్లీలో జరిగిన సీపీఐ జాతీయ కౌన్సిల్ సమావేశంలో డి. రాజాను పార్టీ జాతీయ కార్యదర్శిగా ఎన్నికున్నారు. సీపీఐ ప్రధాన కార్యదర్శిగా డి.రాజాను ప్రతిపాదిస్తూ సురవరం ప్రవేశపెట్టిన తీర్మానానికి అన్ని రాష్ట్రాల కార్యదర్శులు ఆమోదం తెలిపారు. ప్రధాన కార్యదర్శిగా తప్పుకున్నప్పటికీ కార్యవర్గ సభ్యుడిగా కొనసాగుతానని సురవరం చెప్పారు. రాజా నాయకత్వంలో పార్టీ పురోగమిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తంచేశారు. ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకుడు కన్నయ్య కుమార్‌తో పాటు, ఒడిశాకు చెందిన యువ నాయకుడు రామకృష్ణ పండాను జాతీయ కార్యవర్గ సభ్యులుగా నియమిస్తున్నట్లు సురవరం తెలిపారు. మొత్తం 13 అంశాలపై సమావేశంలో తీర్మానాలు చేసి ఆమోదించినట్లు పేర్కొన్నారు. 72 ఏళ్ల వయసున్న డీ రాజా తమిళనాడుకు చెందిన వ్యక్తి. ఆ రాష్ట్రం నుంచే రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. యువజన ఉద్యమాల నుంచి క్రియాశీలక రాజకీయాలలోకి వచ్చారు. 1985లో సీపీఐ యువజన విభాగానికి అధ్యక్షుడిగా పనిచేశారు.1995 నుంచి సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఢిల్లీ నుంచి పని చేస్తున్నారు. ప్రస్తుతం రెండోసారి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. -
సీపీఐ కొత్త సారథి డి.రాజా
సాక్షి, హైదరాబాద్: సీపీఐ జాతీయ స్థాయి నాయకత్వంలో మార్పు చోటు చేసుకుంది. సురవరం సుధాకర్‌రెడ్డి స్థానంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా డి.రాజా ఎన్నికయ్యారు. ఈ మేరకు శనివారం సీపీఐ జాతీయ సమితి ఆమోద ముద్ర వేసింది. ఢిల్లీలో జరుగుతున్న జాతీయ కార్యవర్గ, జాతీయ సమావేశాలు ఆదివారంతో ముగుస్తున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం సీపీఐ ప్రధానకార్యదర్శిగా పార్టీ అత్యున్నత బాధ్యతలను సురవరం సుధాకర్‌రెడ్డి నుంచి డి.రాజా స్వీకరిస్తారు. పార్టీ అత్యున్నత పదవి కోసం డి.రాజాతో పాటు సీనియర్ నేతలు అతుల్ కుమార్ అంజాన్, అమర్జిత్ కౌర్ పేర్లను నాయకత్వం పరిశీలించింది. తమిళనాడు నుంచి ఎంపీగా కొనసాగుతున్న రాజా రాజ్యసభ సభ్యత్వం త్వరలోనే ముగియనుంది. దళిత వర్గ నేతగా, రెండు పర్యాయాలు రాజ్యసభ ఎంపీగా ఉండడంతో జాతీయస్థాయిలో రాజకీయ పార్టీల అగ్రనేతలతో ఆయనకు పరిచయాలున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీలో కొత్త రక్తం నింపడంతో పాటు వినూత్న కార్యక్రమాలతో ప్రజలకు చేరువ కావాలనే వ్యూహంలో భాగంగానే రాజా వైపు జాతీయ సమితి మొగ్గు చూపినట్లు సమాచారం. లోక్‌సభ ఎన్నికల్లో రెండు సీట్లు మాత్రమే గెలుపొందడంతో పాటు దేశవ్యాప్తంగా పార్టీని బలోపేతం చేయడం, క్రియాశీలంగా మార్చడం వంటివి రాజాకు సవాళ్లేనని పరిశీలకులు అంటున్నారు. సురవరం ఎందుకు వైదొలిగారంటే.. ఆరోగ్యం సహకరించని కారణంగా ప్రధాన కార్యదర్శి బాధ్యతల నుంచి తనను తప్పించాలని మేలో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశంలో సురవరం సుధాకర్ రెడ్డి(77) కోరినట్టు పార్టీ వర్గాల సమాచారం. 2019 లోక్‌సభ ఎన్నికల వరకే పదవిలో ఉంటానని పార్టీకి ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న ఆ పార్టీ జాతీయ సమితి సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రధానంగా చర్చించి, నిర్ణయం తీసుకున్నారు. జాతీయ ›ప్రధాన కార్యదర్శిగా 2012లో బాధ్యతలను చేపట్టిన సురవరం, వరసగా మూడు పర్యాయాలు జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఆయన ప్రస్తుత పదవీకాలం 2021 వరకు ఉంది. -
రాజీనామా యోచనలో సురవరం!
న్యూఢిల్లీ : సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేయనున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. జూతై 19, 20 తేదీల్లో ఢిల్లీలో జరిగే సీపీఐ జాతీయ మండలి సమావేశాల్లో ఆయన రాజీనామా సమర్పిస్తారని వెల్లడించాయి. ఈ విషయమై ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు మాట్లాడుతూ...‘సార్వత్రిక ఎన్నికల్లో సీపీఐ కేవలం రెండు లోక్‌సభ స్థానాలకు పరిమితం కావడంతో పార్టీ ఓటమికి నైతిక బాద్యత వహిస్తూ సుధాకర్‌రెడ్డి రాజీనామా చేయాలని నిర్ణయించారు. పార్టీ కోసం పనిచేసేందుకు తన ఆరోగ్యం సహకరించడం లేదని, ప్రధాన కార్యదర్శి బాధ్యతల నుంచి తప్పుకోవాలని ఆయన అనుకుంటున్నట్లు’ చెప్పారు. -
కేసులున్న వారికి హోంమంత్రి పదవా?: సురవరం
సాక్షి, హైదరాబాద్: హత్య కేసుతో పాటు, ఆరు కేసుల్లో నిందితుడిగా ఉన్న అమిత్‌షాకు కేంద్ర హోంమంత్రి పదవిని ఎలా కట్టబెడతారని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి ప్రశ్నించారు. ఈ కేసుల్లో పోలీసులు నిష్పక్షపాతంగా విచారణతో పాటు కోర్టులు కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటాయనేది ప్రశ్నార్థకంగా మారిందన్నారు. 8 పార్లమెంటరీ కమిటీల్లో అమిత్‌షాను సభ్యుడిగా ఎలా చేస్తారని నిలదీశారు. ఎన్ని కేసులుంటే అన్ని కమిటీల్లో చేరుస్తారేమోనని ఎద్దేవా చేశారు. శుక్రవారం మఖ్దూంభవన్‌లో పార్టీనాయకులు డా.కె.నారాయణ, అజీజ్‌పాషా, చాడ వెంకట్‌రెడ్డిలతో కలసి సురవరం విలేకరులతో మాట్లాడారు. అద్భుతమైన జీడీపీ రేటును సాధించినట్టు నరేంద్ర మోదీ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుందని, వాస్తవానికి ఆ రేటు 5.5 శాతానికి పడిపోయిందని ఎద్దేవా చేశారు. నాలుగున్నర దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత ఎక్కువగా దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందన్నారు. ఎన్నికల సంఘం తన విశ్వసనీయతను, నిష్పాక్షితను, స్వయంప్రతిపత్తిని కోల్పోయి కేంద్ర ప్రభుత్వ పంజరంలో చిలుకగా మారిపోయిందని ధ్వజమెత్తారు. యూపీ, హరియాణ, బిహార్ తదితర రాష్ట్రాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో పోలైన ఓట్ల కంటే లెక్కింపులో ఎక్కువ ఓట్లు ఉండటంపై ఈసీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సీపీఐ అభ్యర్థి కన్హయ్యకుమార్ పోటీచేసిన బెగుసరాయిలోనూ ఇదే పరిస్థితి తలెత్తిందని, దీనికి ఈసీ సరైన సమాధానం చెప్పకపోతే కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. చంద్రబాబు విపక్షం లేకుండా చేయాలనుకున్నారు.. చంద్రబాబు ఏపీ సీఎంగా ఉండగా ప్రతిపక్షం లేకుండా చేయాలని వైఎస్సార్సీపీ నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించారని, అందుకే ఈ ఎన్నికల్లో బాబుకు తగిన బుద్ధి చెప్పారని సీపీఐ జాతీయ కార్యదర్శి డా.కె.నారాయణ పేర్కొన్నారు. చంద్రబాబు పరిస్థితిని చూసైనా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నేర్చుకోవాలన్నారు. చంద్రబాబుకు ఏ గతి పట్టిందో తనకు అదే పరిస్థితి వచ్చే విధంగా కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. టీఆర్ఎస్కు మద్దతుదారు ఎంఐఎంకు విపక్షహోదా వచ్చేలా వ్యవహరించడం సరికాదన్నారు. రాష్ట్రంలో పెద్ద మెజారిటీతో గెలిచిన టీఆర్ఎస్కు అసెంబ్లీలో ఎలాంటి ఇబ్బందుల్లేకపోయినా సీఎల్పీ విలీన ప్రక్రియ చేపట్టడం సరికాదన్నారు. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయో గవర్నర్ చూడలేరా, చట్టరీత్యా కాకపోయినా నైతికంగా ఇలా చేయకూడదని అధికారపార్టీకి చెప్పలేరా అని ప్రశ్నించారు. విశాఖ భూముల కుంభకోణంపై సిట్ ఇచ్చిన నివేదికను వెల్లడించి, ఈ వ్యవహారంలో తప్పు చేసిన వారిపై ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి చర్యలు తీసుకోవాలని నారాయణ విజ్ఞప్తి చేశారు. -
సీపీఐలో నాయకత్వ మార్పు!
సాక్షి, హైదరాబాద్: సీపీఐ నాయకత్వ మార్పుకు రంగం సిద్ధమవుతోంది. ప్రధాన కార్య దర్శి బాధ్యతలను మరొకరికి అప్పగించాలని సురవరం సుధాకరరెడ్డి చేసిన విజ్ఞప్తిని పార్టీ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఆరోగ్య కారణాలరీత్యా పార్టీ అత్యున్నత బాధ్యతల నుంచి తప్పించాలని జాతీయ కార్యవర్గ సమావేశంలో సురవరం కోరినట్టు సమాచారం. దీంతో నాయకత్వ బాధ్యతలను మార్చడానికి పార్టీ చర్యలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. వచ్చే నెల 19, 20, 21 తేదీల్లో ఢిల్లీలో జరగనున్న సీపీఐ జాతీయ సమితి సమావేశాల్లో దీనిపై చర్చించనున్నారు. ఇందుకు జాతీయ కౌన్సిల్ ఆమోదం తెలిపితే నాయకత్వ మార్పునకు అవకాశముంటుందని పార్టీ వర్గాల సమాచారం. ప్రధాన కార్యదర్శి పదవికి అతుల్‌కుమార్ అంజన్, అమర్జిత్కౌర్, డి.రాజా, కె.నారాయణ, కనమ్ రాజేంద్రన్ పేర్లు పరిశీలనలో ఉన్నట్టు తెలిసింది. 2012లో పార్టీ పగ్గాలు చేపట్టిన సురవరం.. వరుసగా 3 సార్లు జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయన పదవీకాలం 2021 వరకు ఉంది. అయితే 77 ఏళ్ల వయసుతోపాటు అలర్జీ, ఇతర ఆరోగ్య సమస్యల కారణంగా ఆ పదవిలో కొనసాగడానికి విముఖత వ్యక్తంచేస్తున్నారు. -
జోషి మరణం తీరని లోటు: సురవరం
సాక్షి, హైదరాబాద్: సీపీఐ సీనియర్ నాయకుడు పీపీసీ జోషి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జోషి ఆదివారం హైదరాబాద్‌లోని పుప్పాలగూడలోని ఆయన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంపై సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన లేనిలోటు పూడ్చలేనిదని వ్యాఖ్యానించారు. నవ తెలంగాణ పబ్లిషింగ్ హౌస్ కూడా మరో ప్రకటనలో జోషి మృతికి సంతాపం ప్రకటించింది. సాహిత్య సంస్థలకు ఆయన చేసిన సేవలు ఎనలేనివని కొనియాడింది. ఆయన మరణం అభ్యుదయ, వామపక్ష వాదులకు తీరనిలోటని పేర్కొంది. జోషి పార్టీలో పలు కీలక బాధ్యతలతోపాటు, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్‌కు మేనేజర్‌గా, సీపీఐ కేంద్ర కార్యాలయ ట్రెజరర్‌గా బాధ్యతలు నిర్వహించారు. జోషి తండ్రి తెలంగాణ సాయుధ పోరాటంలో అమరులయ్యారు. -
అన్ని పార్టీలు కలిసి రావాలి
సాక్షి, హైదరాబాద్: దేశంలో హంగ్ పార్లమెంట్ ఏర్పడే పరిస్థితులున్నందున, ప్రాంతీయ పార్టీలు, సెక్యులర్ పార్టీలు కలిసి కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేయాలని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి విజ్ఞప్తి చేశారు. అధికారంకంటే కూడా దేశ భవిష్యత్ ముఖ్యమని, సెక్యులరిజం, భారత రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు కలిసి రావాలని కోరారు. పదవులకోసం బీజేపీ అమలు చేయబోయే సెమీ ఫాసిస్ట్ ధోరణులు, విధానాలకు మద్దతు తెలపవద్దన్నారు. గురువారం మఖ్దూంభవన్‌లో పార్టీ నాయకులు కె.నారాయణ, చాడ వెంకటరెడ్డి, అజీజ్‌పాషాలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఫెడరల్ ఫ్రంట్ కోసం ప్రయత్నాలంటూ యూపీఏలోని భాగస్వామ్యపక్షా ల్లో చీలిక తెచ్చేందుకు సీఎం కేసీఆర్ యత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ రాజకీయ విధానాలు, నిర్వహిస్తున్న పాత్ర దీనినే స్పష్టం చేస్తోందన్నారు. ఎన్డీయే ప్రభుత్వానికి కేసీఆర్ తానా అంటే తందానా అంటూ వస్తున్నారన్నారు. కేసీఆర్ లేవనెత్తుతున్న అంశాలపై కమ్యూనిస్టు పార్టీలకు అభ్యంతరాలున్నా యని చెప్పారు. ప్రాంతీయ పార్టీలతో కలిసి యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అభ్యంతరం లేదని, బీజేపీయేతర ఫ్రంట్ ఏర్పడాలని, బీజేపీ ప్రత్యక్ష, పరోక్ష మద్దతు లేకుండానే ఇది ఏర్పడాలని కోరుకుంటున్నామన్నారు. పశ్చిమ బెంగాల్లో ఎన్నికల ప్రచారాన్ని ఈసీ ఒకరోజు కుదించడం పట్ల నిరసన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ, అమిత్‌షాల ఎన్నికల ప్రచారం ముగియడం తో చివరిరోజు ఇతర పార్టీల ప్రచారానికి అవకాశమివ్వకుండా చేయడాన్ని బట్టి ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని స్పష్టమవుతోందన్నారు. సిట్లు వంటింటి కుందేళ్లు: నారాయణ వివిధ అంశాలపై చంద్రబాబు, కేసీఆర్ వేసిన ప్రత్యేక దర్యాప్తు బృందాలు (సిట్)ఇద్దరు సీఎంల వంటింటి కుందేళ్లుగా మారిపోయాయని నారాయణ ఎద్దేవా చేశారు. ఈ సిట్లను బ్లాక్మెయిల్ చేయడానికి ఉపయోగించుకుంటున్నారు తప్ప ప్రజల కన్నీళ్లు తుడిచే ప్రయత్నం చేయడం లేదన్నారు. -
ఈసీ విశ్వసనీయత ఆందోళనకరం
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ఎన్నికల సంఘం విశ్వసనీయత రోజు రోజుకు తగ్గిపోవడం ఆందోళన కలిగించే పరిణామమని సీపీఐ ప్రధానకార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి వ్యాఖ్యానించారు. జాతీయస్థాయిలో ప్రతిష్ట కలిగిన ఈ సంస్థ నిష్పక్షపాతంగా ఉండటం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోందన్నారు. దేశవ్యాప్తంగా లోక్‌సభ తొలిదశ ఎన్నికల నిర్వహణ తీరు అసంతృప్తిని కలిగించిందన్నారు. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఈవీఎంలు సరిగా పనిచేయడం లేదన్న విమర్శలొచ్చాయని, ఏపీ, తెలంగాణల్లోనూ ఇవి చోటు చేసుకున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. మిగిలిన ఆరు విడతల ఎన్నికలనైనా ఈసీ జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. శనివారం మఖ్దూంభవన్‌లో రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డితో కలసి సురవరం విలేకరులతో మాట్లాడారు. ప్రధాని మోదీ పదే పదే సైన్యానికి ఓటు అంటూ బీజేపీకి అనుకూలంగా ఓటు వేయాలనే అర్థం వచ్చేలా చేస్తున్న ప్రచారాన్ని ఈసీ తీవ్రంగా పరిగణించాలన్నారు. విపక్షనేతగా వ్యవహరిస్తున్న కేసీఆర్... కలెక్టర్ల వ్యవస్థ, రెవెన్యూ,మున్సిపల్ శాఖలపై‡ సీఎం కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు విచిత్రంగా ఉంటున్నాయని చాడ వెంకటరెడ్డి అన్నారు. గతం నుంచి కొనసాగుతున్న కలెక్టర్ల వ్యవస్థే పనికి రానిదనడం సరికాదన్నారు. రెవెన్యూ,మున్సిపాలిటీ శాఖల్లో అవినీతి గత ఐదేళ్లు అధికారంలో ఉన్నపుడు కేసీఆర్‌కు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. ఆయన సీఎం మాదిరిగా కాకుండా ప్రతిపక్షనేత లాగా వ్యవహరిస్తున్నారన్నారు. కేసీఆర్ మెదడులో ఏదైనా ఆలోచన వచ్చిందే తడవుగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఎద్దేవాచేశారు. సీఎం ఇష్టానుసారంగా రెవెన్యూశాఖను రద్దు చేస్తారా అని ప్రశ్నించారు. ఈ అంశంపై అఖిలపక్ష భేటీని నిర్వహించడంతో పాటు, నిపుణుల సలహాలను స్వీకరించాలని డిమాండ్‌చేశారు. స్థానిక సంస్థలంటే తనకెంతో విశ్వాసమున్నట్టుగా కేసీఆర్ చెబుతున్నారని, నిధులు, విధులు బదలాయించకుండా పంచాయతీలు, మండల పరిషత్‌లను నిర్వీర్యం చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని విమర్శించారు. -
సీపీఐ నేతలకు తప్పిన ప్రమాదం
జనగామ: సీపీఐ నేతలకు తృటిలో ప్రమాదం తప్పింది. ఎన్నికల ప్రచారం ముగించుకుని హైదరాబాద్‌కు తిరిగి వెళుతున్న సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ప్రయాణిస్తున్న వాహనం మంగళవారం అర్ధరాత్రి జనగామలో రోడ్డు ప్రమాదానికి గురైంది. దీంతో వారు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. వీరిద్దరు నేతలు మహబూబాబాద్ జిల్లాలో ఎన్నికల ప్రచారం ముగించుకుని.. ఇన్నోవా వాహనంలో జనగామ మీదుగా హైదరాబాద్‌కు బయలుదేరారు. జనగామ వద్ద రోడ్డుపై ఉన్న గుంతలో వారు ప్రయాణిస్తున్న వాహనం పడి పైకి లేచి.. భూమికి గట్టిగా ఢీకొట్టింది. ఈ ఘటనలో వారు స్వల్పగాయాలతో బయటపడగా.. మరో వాహనంలో వస్తున్న మాజీ ఎమ్మెల్యే సీహెచ్ రాజారెడ్డి మరో వాహనంలో హైదరాబాద్‌కు పంపించారు. అనంతరం రోడ్డు దుస్థితిపై కలెక్టర్ వినయ్‌క్రిష్ణారెడ్డికి ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. -
రాహుల్‌గాంధీని ఓడిస్తాం
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో కేరళలోని వాయనాడ్‌లో సీపీఐ అభ్యర్థిపై పోటీచేస్తున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఓటమికి వామపక్షాలు అన్ని చర్యలు తీసుకోనున్నట్టు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి వెల్లడించారు. దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా లౌకిక, ప్రజాతంత్ర, వామపక్ష శక్తులను కూడగట్టేందుకు తాము కృషి చేస్తుంటే, అందుకు విరుద్ధంగా వామపక్షాలపైనే కాంగ్రెస్ పోటీకి దిగడం దారుణమని ధ్వజమెత్తారు. సీపీఐ పోటీలో ఉన్న చోట రాహుల్‌గాంధీ బరిలో దిగాలనుకోవడం మంచి సంకేతం కాదని వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రత్యక్ష పోరులో ఉన్న కర్ణాటక, తమిళనాడు ఇతర రాష్ట్రాలు కాదని కేరళ నుంచి రాహుల్ పోటీకి దిగడం అర్థరహితమని సోమవారం సురవరం ‘సాక్షి’తో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. కేరళ నుంచి రాహుల్ పోటీచేయడాన్ని వామపక్ష పార్టీలన్నీ వ్యతిరేకిస్తున్నాయన్నారు. ఈ స్థానం కాంగ్రెస్‌కు, మరీ ముఖ్యంగా రాహుల్‌గాంధీ గెలిచేంత సురక్షితమైనది కూడా కాదన్నారు. వాయనాడ్ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆరు స్థానాల్లో వామపక్షాల ఎమ్మెల్యేలే ఉన్నారని చెప్పారు. ఈ స్థానంలో సీపీఐ అభ్యర్థిని ఉపసంహరించుకోవాలంటూ కాంగ్రెస్ పార్టీ తమను కోరడం అర్థం లేనిదన్నారు. బీజేపీ వ్యతిరేక పక్షాలను ఏకం చేసే విషయంలో ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా వాయనాడ్ నుంచి తన నామినేషన్‌ను రాహుల్‌గాంధీ ఉపసంహరించుకోవాలని సురవరం సూచించారు. కేడర్‌లో ఆగ్రహజ్వాలలు.. వాయనాడ్‌లో రాహుల్‌గాంధీ పోటీకి దిగడం పట్ల వామపక్ష నాయకులు, కార్యకర్తల్లో ముఖ్యంగా సీపీఐ కేడర్‌లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోందని సురవరం తెలిపారు. పోటీకి నిర్ణయం వెలువడిన ఆదివారం రాత్రి నుంచి వరసగా కార్యకర్తలు ఫోన్లు చేసి కాంగ్రెస్ తీరుపై తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. వివిధ రాష్ట్రాల్లో సీపీఐ పోటీచేయని స్థానాల్లో బీజేపీని ఓడించేందుకు బలమైన లౌకికపార్టీ అభ్యర్థులకు (కాంగ్రెస్) ఓటు వేయాలని పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించాలనే ఒత్తిడి తమపై పెరుగుతోందన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు సీపీఐ ఎందుకు మద్దతివ్వాలనే ప్రశ్నలు ఎదురవుతున్నాయన్నారు. ఈ విధంగా తమ కంటే కూడా దేశవ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ నష్టం జరగబోతోందన్నారు. కాంగ్రెస్‌కు మద్దతుపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలియజేశారు. తమ నిర్ణయాన్ని కాంగ్రెస్ పునరాలోచించుకో వాలని సురవరం సూచించారు. -
అది మోదీ దిగజారుడుతనం
సాక్షి, హైదరాబాద్: దేశ రక్షణలో భాగంగా భారత సైన్యం చేసే ప్రతి చర్యకు దేశ ప్రజలంతా మద్దతునిస్తారని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి అన్నారు. కానీ ఆ సైనిక చర్యలను ఎన్నికల ప్రచారాస్త్రంగా ప్రధాని నరేంద్రమోదీ వాడుకోవడం ఆయ న దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. ప్రతిపక్ష పార్టీలు సైనిక చర్యలను ఆక్షేపిస్తున్నాయని మోదీ పేర్కొనడాన్ని ఖండించారు. ఐదేళ్ల ఎన్డీఏ పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, దాన్ని కప్పి పుచ్చుకునేందుకే మోదీ విపక్షాలపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. శుక్రవారం మఖ్దూంభవన్‌లో జాతీయ కార్యవర్గ సభ్యులు అజీజ్‌పాషా, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డితో కలసి ఎన్నికల మేనిఫెస్టో ఆవిష్కరించిన అనంతరం సురవరం మీడియాతో మాట్లాడారు. శాటిలైట్‌కు సంబంధించిన సాంకేతిక అంశాలను ఇస్రో లేదా డీఆర్డీఓనో విడుదల చేయాలని సురవరం చెప్పారు. ప్రధాని మోదీ ఈ అంశాన్ని విడుదల చేయడాన్ని తప్పుబట్టారు. ఐదేళ్లలో మోదీ అన్ని వ్యవస్థల్ని ధ్వం సం చేశారని విమర్శించారు. రాష్ట్రంలో నాలుగింట్లో సీపీఐ, సీపీఎం కలసి పోటీ చేస్తున్నట్లు చాడ వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. సీపీఐ మద్దతు కోసం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేసిందని, ఏయే స్థానాలకు మద్దతిస్తామో త్వరలో ప్రకటిస్తామన్నారు. -
రైతుకు ఆసరా.. యువతకు భరోసా
సాక్షి, హైదరాబాద్: భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. అన్ని వర్గాల అభ్యున్నతిని కాంక్షిస్తూ రూపొందించిన మేనిఫెస్టోను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి శుక్రవారం మఖ్ధూంభవన్‌లో విడుదల చేశారు. ‘సేవ్ నేషన్–సేవ్ కాన్స్టిట్యూషన్–సేవ్ డెమోక్రసీ అండ్ సెక్యులరిజం’అనే నినాదంతో ఎన్నికల ప్రచారం చేపడుతున్నట్లు స్పష్టం చేశారు. రైతులు, యువత, మహిళల కోసం పలు హామీలను ఆ పార్టీ మేనిఫెస్టోలో పొందుపర్చింది. కేంద్రంలో తమ పార్టీ మద్దతుతో ఏర్పాటయ్యే ప్రభుత్వం వీటిని తప్పనిసరి అమలు చేసేలా సీపీఐ చర్యలు తీసుకుంటుందని పేర్కొంది. నిరుద్యోగులకు ఉపాధి హామీ చట్టం రైతుల కోసం స్వామినాథన్ కమిటీ సిఫార్సులను పూర్తిస్థాయిలో అమలు చేయడం, సాగుకయ్యే పెట్టుబడి ఖర్చుకు అదనంగా 50 శాతం వరకు మద్దతు ధర కల్పించేలా ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు, ఏకకాల పంట రుణమాఫీ అంశాలకు సీపీఐ ప్రాధాన్యతనిచ్చింది. నిరుద్యోగుల కోసం ప్రత్యేకంగా భగత్‌సింగ్ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చేలా చర్యలు, ప్రతి ఒక్కరికి ఉపాధి హక్కును కల్పించడం, అన్ని విభాగాల్లో ఉద్యోగ ఖాళీల భర్తీ, నేషనల్ యూత్ పాలసీ రూపకల్పన, క్రీడలకు ప్రోత్సాహం, మౌలిక వసతుల కల్పన అంశాలను మేనిఫెస్టోలో పేర్కొంది. చట్టసభలు, ఉద్యోగ నియామకాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు, ఒంటరి మహిళలకు న్యాయ, ఆర్థిక సాయం అందించే కార్యక్రమాల అమలు, చిన్నారుల్లో పౌష్టిక లోపాల నిర్మూలనకు చర్యలు, మానవ అక్రమ రవాణా నిలుపుదలకు కఠి న చర్యలు తీసుకునే ఏర్పాట్లకు మద్దతు తెలిపింది. వృద్ధులు, దివ్యాంగులకు పెన్షన్, పదవీ విరమణ పొందిన రక్షణ ఉద్యోగులకు వన్ ర్యాంకు వన్ పెన్షన్ అమలు చేసే అంశాన్ని మేనిఫెస్టోలో పొందుపర్చింది. విద్యకు 10 శాతం అదనపు కేటాయింపులు మైనారిటీలకు జస్టిస్ రాజేంద్ర సచార్ కమిటీ సిఫార్సుల అమలు, రంగనాథ్ మిశ్రా కమిటీ ప్రతిపాదనలు అమలుకు సీపీఐ మద్దతు తెలిపింది. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రాథమిక, మాధ్యమిక విద్య ఉచితంగా చేపట్టాలని, విద్యకు మరో 10 శాతం అదనపు నిధుల కేటాయింపు, ఉపాధ్యాయ ఖాళీలను వంద శాతం భర్తీ చేయాలని మేనిఫెస్టోలో స్పష్టం చేసింది. వైద్య, ఆరోగ్యానికి ప్రత్యేక ప్రాధాన్యత–వైద్య విద్య వ్యాపారాన్ని ఎత్తేసేలా చర్యలు, పర్యావరణ పరిరక్షణ, ఆడవులు, సహజవనరులపై నిఘా పెంపొందించేలా చర్యలకు ప్రాధాన్యతనిచ్చింది. విదేశీ పాలసీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కశ్మీర్ సమస్య పరిష్కర అంశాలను మేనిఫెస్టోలో పొందుపర్చింది. దేశంలో అన్ని వ్యవస్థల్ని విచ్ఛిన్నం చేసిన బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని ఆ పార్టీ ప్రజలకు పిలుపునిచ్చింది. -
హోదాను సజీవంగానిలబెట్టింది జగన్ పార్టీనే..
‘‘సుదీర్ఘ చరిత్ర ఉన్న కమ్యూనిస్టు పార్టీకి ఉమ్మడి రాష్ట్ర కార్యదర్శిగా, పార్లమెంట్ సభ్యుడిగా, కార్మిక సమస్యలపై పార్లమెంటరీ స్థాయి సంఘం ఛైర్మన్‌గా పని చేసిన సురవరం సుధాకర్‌రెడ్డి.. మంచి చదువరి, వక్త. జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలపై పట్టున్న నేత. 15 ఏళ్ల ప్రాయంలోనే ఉద్యమాల బాట పట్టారు. విద్యార్థి నాయకుడిగా అంచలంచెలుగా ఎదిగి ఆరేళ్లుగా సీపీఐ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు’’ ‘ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్ష ప్రత్యేక హోదా. పార్లమెంటు సాక్షిగా ఆనాడు అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఇచ్చిన మాట అది. ఆ తర్వాత కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ, టీడీపీలు ప్రజల హోదా ఆకాంక్షను మొగ్గలోనే చిదిమేశాయి. రాష్ట్ర ప్రజల ఆకాంక్షను గుర్తెరిగి వామపక్షాలు ఆందోళన చేశాయి. హోదా డిమాండ్‌ను సజీవంగా ఉంచింది మాత్రం జగన్ నాయకత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ’ అని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి చెప్పారు. ఎన్నికల సందర్భంగా ‘సాక్షి’ ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలపై తన అభిప్రాయాలను వెలిబుచ్చారు. అవేమిటో ఆయన మాటల్లోనే..- ఆకుల అమరయ్య సాక్షి, విజయవాడ తీవ్రమైన అవినీతి ఆరోపణలు చంద్రబాబు నాయుడు పరిపాలనపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. అధికార ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారని, అధికారులను బెదిరిస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. కొన్ని ప్రాజెక్టుల్లో అంచనాలు ఒకటికి రెండు సార్లు పెంచి కాంట్రాక్టర్లకు దోచి పెట్టారనే వ్యవహారంపై మా పార్టీ ఆందోళన చేసింది. రాజకీయంగా మేము పెట్టిన ప్రత్యామ్నాయానికి ప్రజలు మద్దతు ఇస్తే అధికారంలోకి అయినా రావాలి. లేదంటే శక్తివంతమైన ప్రతిపక్షంగానైనా ఎదగాలి. ఆంధ్రాలో మా ప్రయత్నం అది. తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల కేసీఆర్ నెట్టుకువస్తున్నారు. ఏపీలో టెక్నాలజీ దుర్వినియోగం డేటా లీకేజీపై సమగ్ర విచారణ జరగాలి. ఎవరు లీక్ చేశారు, ఎక్కడికి వెళ్లిందీ, ఎవరు దుర్వినియోగం చేశారనేది బయటకు రావాలి. అసలు నిందితులు ఎవరో తేలాలి. వ్యక్తిగత గోప్యత, ఓట్ల తొలగింపు వంటి వాటి వల్ల ఎంత నష్టం వాటిల్లిందో కూడా అంచనా వేయాలి. దోషులెవరో తేల్చి వారిని శిక్షించాలి. హోదాను సజీవంగానిలబెట్టింది జగన్ పార్టీనే.. సీఎం చంద్రబాబు బీజేపీతో నాలుగున్నర ఏళ్ల పాటు కొనసాగి అవకాశవాదాన్ని ప్రదర్శించారు. ప్రజల ఒత్తిడికి ఆయన తలొగ్గి ఆలస్యంగానైనా కళ్లు తెరిచారు. ఇందులో ఆయన రాజకీయ ప్రయోజనాలు ఇమిడి ఉండవచ్చు. ప్రత్యేక హోదాను సజీవమైన నినాదంగా నిలబెట్టింది జగన్ పార్టీయే. హోదా రాష్ట్ర ప్రజల ఆకాంక్ష. ఇందుకోసం వామపక్షాలు మొదటి నుంచి బంద్‌లు, ఆందోళనలు చేస్తూ వచ్చాయి. ఆ తర్వాత పవన్ వచ్చాడు. ఫిరాయించిన వారి సభ్యత్వం రద్దు కావాలి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేలను చంద్రబాబు నాయుడు కొనుగోలు చేశారు. తెలంగాణలోనూ అలాగే చేస్తున్నారు. ఈ విషయంలో బూర్జువా పార్టీల వారందరిదీ ఒకే తీరు. అందుకని మా డిమాండ్ ఏమిటంటే.. పార్టీ ఫిరాయించిన వారి సభ్యత్వం రద్దు కావాలి. ఆ మేరకు చట్టంలో సవరణ తీసుకురావాలి. ఆటోమాటిక్‌గా సభ్యత్వం రద్దు అయ్యేలా చూడాలి. స్పీకర్ నిర్ణయంతో నిమిత్తం లేకుండా ఎన్నికల సంఘానికైనా ఇవ్వాలి. లేదా నిర్ణీత గడువులోగా సభ్యత్వం రద్దు అయ్యేలా ఉండాలి. స్పీకర్లు అన్నిచోట్ల అధికార పక్షానికి నాయకులుగా పని చేశారే తప్ప స్పీకర్లుగా ఉండడం లేదు. ప్రతిపక్షం లేని ప్రజాస్వామ్యం ఉప్పు లేని పప్పు లాంటిది. ఎన్నికల్లో ప్రాధాన్య అంశాలు ఇవే నిరుద్యోగ సమస్య చాలా తీవ్రంగా ఉంది. 7.2 శాతానికి చేరింది. నిత్యావసర వస్తువుల ధరలు బాగా పెరిగాయి. వ్యవసాయ సంక్షోభం చాలా ప్రాధాన్యత కలిగిన అంశం. ఆ తర్వాత అసంఘటిత రంగ కార్మికుల సమస్యలు. దేశవ్యాప్తంగా లక్షల మంది కార్మికులు సమ్మె చేశారు. ఇవన్నీ చాలా ప్రధాన సమస్యలు. అలాగే దళితులు, మైనారిటీలపై దాడులు. ప్రస్తుత మోదీ ప్రభుత్వ హయాంలో ఈ వర్గాలపై దాడులు విపరీతంగా పెరిగాయి. గత ఆరు నెలల్లో దేశ వ్యాప్తంగా ప్రతిరోజూ ఏదో ఒక మూల రైతులు పోరాటం చేస్తున్నారు. ఇవన్నీ ప్రభావం చూపిస్తాయి. ఒక దళితుణ్ని రాష్ట్రపతిని చేశారే తప్ప దళితులపై ఈ ప్రభుత్వానికి సానుకూల ధృక్పథం లేదు. ఏకైక పెద్ద పార్టీగా బీజేపీ కాంగ్రెస్‌తో చేదు అనుభవాలున్న మాట వాస్తవమే. వచ్చే ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలిచే పార్టీ బీజేపీ. ఆ తర్వాతి స్థానం కాంగ్రెస్‌ది. మిగతా పార్టీలన్నింటికీ కలిపి ఈ రెండింటి కన్నా ఎక్కువగా సీట్లు వస్తాయని భావిస్తున్నాం. తద్వారా కేంద్రంలో లౌకిక ప్రజాతంత్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అంచనా. ‘‘ప్రజల్లో ఉండే పోరాట స్ఫూర్తి పోదు. ఎన్నికలు వచ్చినప్పుడు ఆ ఆగ్రహాన్ని చూపిస్తారు. ప్రజల్ని ఇంతకాలం పట్టించుకోని ప్రభుత్వాలు.. ఎన్నికలకు ముందు తాయిలాలు ప్రకటిస్తున్నాయంటే ఓడిస్తారనే కదా!’’ స్వేచ్ఛగా ఓటేయాలి ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేయాలి. అందరూ ఓటింగ్‌కు వెళ్లాలి. ప్రజాస్వామ్యం బతికి బట్టకట్టాలంటే శక్తివంతమైన ప్రతిపక్షం ఉండాలి. ప్రజాస్వామ్యపరిరక్షణ కోసం వామపక్షాలను, సెక్యులర్ పార్టీలను గెలిపించడం చాలా ముఖ్యమని ఓటర్లకు సీపీఐ ప్రధాన కార్యదర్శిగా విజ్ఞప్తి చేస్తున్నా. ప్రజా సమస్యలపై పోరాడే పార్టీలను ఆదరించమని తెలుగు రాష్ట్రాల ప్రజలను కోరుతున్నా!! మా బలం తగ్గుతున్న మాట నిజమే గత ఎన్నికల్లో వామపక్షాలు బాగా దెబ్బతిన్నాయి. అయితే మా పోరాటాలు, ఉద్యమాలు సాగుతూనే ఉన్నాయి. ఈసారి జరిగే ఎన్నికల్లో వామపక్షాల బలం గణనీయంగా పెరుగుతుంది. పార్లమెంటులో శక్తివంతమైన పాత్ర నిర్వహించగలుగుతామనే విశ్వాసం ఉంది. తెలంగాణకు మద్దతు ఇచ్చినా సీపీఐ ఎక్కడా బలం పుంజుకోలేక పోయిన మాట నిజమే. ఇదో తాత్కాలిక దశ మాత్రమే. ప్రత్యేక తెలంగాణకు మద్దతు ఇచ్చిన పార్టీలు చాలా ఉన్నా.. టీఆర్ఎస్, కేసీఆర్‌ను మాత్రమే తెలంగాణ తెచ్చిన పార్టీగా ప్రజలు గుర్తించారు. దీనివల్ల మిగతా పార్టీలకు నష్టం జరిగింది. రాబోయే రోజుల్లో మరిన్ని పోరాటాలు, ఉద్యమాల ద్వారా జరిగిన నష్టాన్ని పూడ్చుకుంటాం. ఇంతకన్నా ఎక్కువగా నష్టం జరిగిన రోజుల్ని కూడా మేము చూశాం. రెయిన్ గన్లతో పరిష్కారం కాదు గత ఎన్నికలకు ముందు చంద్రబాబు డ్వాక్రా రుణాల మాఫీ, ఇంటికో ఉద్యోగం, పెన్షన్లు వంటి అనేక హామీలు ఇచ్చినట్టు గుర్తు. టెక్నాలజీకి ప్రాధాన్యం పేరుతో చంద్రబాబు వ్యవసాయాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు ఈయన ఇచ్చే పది వేలతోనో, కేంద్రం ఇచ్చే రూ.6 వేలతోనో వ్యవసాయ సంక్షోభం పరిష్కారం కాదు. రెయిన్గన్లతోనో, అన్నదాత సుఖీభవ వంటి తాత్కాలిక పథకాలతో రైతుకు శాశ్వత పరిష్కారం లభించదు. లక్షల్లో అప్పుండే రైతుకు వేయి, రెండు వేలతో ఏమి జరుగుతుంది? స్వామినాధన్ కమిషన్ సిఫార్సులు అమలు చేస్తేనే శాశ్వత పరిష్కారం లభిస్తుంది. రైతులకు గిట్టుబాటు ధర, సాగునీరు, మంచివిత్తనం, నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు ఇచ్చి రైతుల ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలి. కౌలు రైతుల సమస్య నిజంగా పెద్ద సమస్యే. కౌలుదారులు రిజిస్ట్రర్ కావడం లేదు. 2011లో చట్టాన్ని తీసుకువచ్చినా.. అమలు కావడం లేదు. రైతులకు, కౌలు రైతులకు ఇద్దరికీ డబ్బులు(రైతుబంధు పథకం నేపథ్యం) ఇవ్వాల్సి వస్తే పెద్ద మొత్తం అవుతుంది. అందుకని వాళ్లు ఆసక్తి చూపడం లేదు. కమ్యూనిస్టులు అధికారంలోకి వస్తే తప్ప కౌలు రైతుల సమస్యకు పరిష్కారం లభించదు. -
బీజేపీ, టీఆర్ఎస్లను ఓడించాలి: సురవరం
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో బీజేపీని, రాష్ట్రంలో టీఆర్ఎస్ను ఓడించేందుకు వామపక్ష, లౌకికవాద పార్టీలను గెలిపించాలని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో వామపక్ష, ప్రజాతంత్ర, లౌకిక, ప్రగతిశీల శక్తులతో కలసి పోటీచేయాలని అన్నారు. శుక్రవారం మఖ్దూం భవన్లో భాగం హేమంతరావు అధ్యక్షతన జరిగిన సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో సురవరం మాట్లాడుతూ.. సోషల్ మీడియానూ బీజేపీ తన ప్రచారానికి వాడుకుంటోందని, దీనిని అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రజాతంత్ర శక్తులపై ఉందన్నారు. దేశంలోని మీడియా 75 శాతం కార్పొరేట్ రంగం చేతుల్లో ఉందని, దీన్ని అదునుగా తీసుకుని బీజేపీ మీడియాను గుప్పిట్లో పెట్టుకుని ప్రజలను తప్పు దోవ పట్టిస్తోందని ధ్వజమెత్తారు. నిరంకుశ ధోరణులు ప్రబలుతున్నాయి: చాడ రాష్ట్ర చరిత్రలో కనీవిని రీతిలో నిరంకుశ ధోరణులు ప్రబలుతున్నాయని సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. అసెంబ్లీలో మెజార్జీ ఉన్నా ఎమ్మెల్యేల ఫిరాయింపులను సీఎం కేసీఆర్ ప్రోత్సహిస్తోన్న తీరు రాష్ట్ర చరిత్రలోనే మునుపెన్నడూ లేదన్నారు. రాష్ట్రంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాఫ్రంట్ కూటమిగా పోటీ చేసిన పార్టీలతో కాంగ్రెస్ కనీసం మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో వామపక్ష, ప్రజాతంత్ర శక్తులతో కలసి పోటీచేసే 2 స్థానాల్లో ప్రజలు ఆదరించాలని కోరారు. సమావేశంలో పార్టీ నాయకులు అజీజ్ పాషా, పల్లా వెంకటరెడ్డి, సాంబశివరావు, గుండా మల్లేష్, పశ్యపద్మ, శ్రీనివాసరావు, ఎన్.బాలమల్లేష్ పాల్గొన్నారు. -
కామ్రేడ్ల పొత్తు మళ్లీ మొదటికి
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల వేళ ఉభయ కమ్యూనిస్టు పార్టీల మధ్య పొత్తుల అంశం మళ్లీ మొదటికొచ్చింది. లోక్‌సభ ఎన్నికల్లో బీఎల్ఎఫ్ను వదులుకోవడంతోపాటు, పోటీకి సంబంధించి స్పష్టమైన వైఖరి, విధానాలను ప్రకటిస్తే తప్ప సీపీఎంతో పొత్తు పెట్టుకోవద్దని సీపీఐ రాష్ట్ర కార్యవర్గం అభిప్రాయపడింది. రాజకీయ విధానాల విషయంలో సీపీఐతో చర్చల సందర్భంగా ఓ రకంగా, పత్రికా ప్రకటనలు, ఇతరత్ర సమావేశాల్లో అందుకు భిన్నంగా సీపీఎం రాష్ట్ర నాయకత్వం వ్యవహరిస్తోందని ఆరోపించింది. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీలను ఓడించాలని, వామపక్షాలు పోటీ చేయని స్థానాల్లో టీఆర్ఎస్, బీజేపీలను ఓడించే బలమైనశక్తికి ఓటేయాలని పిలు పునిచ్చేందుకు ఆ పార్టీ సిద్ధం కాకపోతే సీపీఐ ఒంటరిగా పోటీచేసేందుకు సిద్ధం కావాలని కార్యవర్గం సూచించింది. శుక్రవారం రాత్రి పొద్దుపోయే దాకా మఖ్దూంభవన్‌లో జరిగిన సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పొత్తులు, సీపీఎం వైఖరిపై వాడీవేడి చర్చ సాగింది. సీపీఎం వైఖరిపై అసహనం.. సీపీఎంతో ఇప్పటివరకు మూడు విడతలుగా జరిపిన చర్చల సారాన్ని కార్యవర్గానికి సమన్వయ కమిటీసభ్యులు తెలిపారు. తమిళనాడు, బిహార్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో కాంగ్రెస్‌తో సీపీఎం పొత్తు కుదుర్చుకుని, తెలంగాణలో మాత్రం కాంగ్రెస్‌కు మద్దతు తెలపమని ద్వంద్వ విధానాలకు పాల్పడుతోందని కొందరు విమర్శించినట్టు తెలిసింది. బీఎల్ఎఫ్ను వదులుకునేందుకు సీపీఎం సిద్ధం కాకపోతే రాష్ట్రపార్టీ తన వైఖరిని నిర్ణయిం చుకోవచ్చని సీపీఐ ప్రధానకార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి సూచించినట్లు తెలిసింది. రాష్ట్రంలో ఒక్క భువనగిరి స్థానం నుంచే పోటీచేయాలని సీపీఐ నిర్ణయించింది. ఈ స్థానం నుంచి పార్టీ సహాయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డిని పోటీ చేయించాలని కొందరు ప్రతిపాదించగా ఆయన విముఖత వ్యక్తం చేశారు. దీంతో పార్టీ భువనగిరి జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు, మరో ఒకరిద్దరు పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. -
బీజేపీ, ఎన్డీయేలను ఓడించాలి
సాక్షి, హైదరాబాద్: కార్పొరేట్ అనుకూల విధానాలతోపాటు దళితులు, మైనారిటీలపై దాడు లు పెరగడం, నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో వైఫల్యం, పేద, ధనిక వ్యత్యాసం మరింత పెరగడానికి కారణమైన బీజేపీ, ఎన్డీయేలను వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఓడించాలని ప్రజలకు సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి పిలుపునిచ్చారు. అబద్ధాల ద్వారానే మళ్లీ గెలుపొందాలని భావిస్తున్న బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీలకు సరైన సమాధానం చెప్పాలని విజ్ఞప్తి చేశారు. ఐదేళ్ల పాలనలో విఫలమైన బీజేపీ ఓటమి తప్పదనే భావనతో సైనిక జవాన్ల ఆత్మబలిదానాలను ఎన్నికల కోసం ఉపయోగించుకోవడం దారుణమన్నారు. దేశంలోని ప్రతిపక్షాలు సైన్యానికి వ్యతిరేకంగా, పాకిస్తాన్‌కు అనుకూలంగా ఉన్నారం టూ ప్రధాని స్థాయి వ్యక్తి నీచమైన అబద్ధాలు చెప్పడాన్ని ఖండిస్తున్నామన్నారు. ఎన్నికల ప్రచారంలో సైనికుల ఫొటోలను ఉపయోగించకుండా ఈసీ నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. గురువారం మఖ్దూంభవన్‌లో పార్టీ నాయకులు చాడ వెంకటరెడ్డి, అజీజ్‌పాషాలతో కలిసి సురవరం విలేకరులతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా 24 రాష్ట్రాల్లో 55 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయాలని సీపీఐ నిర్ణయించిందన్నారు. 18 సీట్లలో అభ్యర్థుల ఎంపిక కూడా పూర్తయిందని, రెండు, మూడు విడతల్లో అభ్యర్థుల జాబితాలు విడుదల చేస్తామన్నారు. వామపక్షాలు బలంగా ఉంటేనే శ్రమజీవులకు, పేదలకు న్యాయం జరుగుతుందన్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 12, 13 స్థానాల్లో ఈవీఎం లలో రికార్డయిన ఓట్లు, అభ్యర్థులకు వచ్చిన మెజారిటీల్లో తేడాలున్నందున, ఐదువేలలోపు మెజారిటీ వచ్చిన చోట్ల వీవీప్యాట్లను లెక్కించాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. ఫిరాయింపులతో అభివృద్ధి సాధ్యమా? రాష్ట్రంలో ఇతర పార్టీల నుంచి అధికార పార్టీలోకి ఫిరాయింపులను ప్రోత్సహించడం ద్వారా నే అభివృద్ధి సాధ్యమవుతుందా అని సీఎం కేసీఆర్‌ను సీపీఐ కార్యదర్శి చాడ ప్రశ్నించారు. ప్రతిపక్షాల స్థైర్యాన్ని దెబ్బతీసేలా ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ, ప్రజాస్వామ్య విలువలకు పాతరేస్తున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ అనుసరిస్తున్న తీరు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు వంటిదన్నారు. పుల్వామా ఉగ్రదాడికి దారితీసిన ఇంటెలిజెన్స్ వైఫల్యానికి బాధ్యులెవరో చెప్పాలని అజీజ్‌పాషా డిమాండ్ చేశారు. -
‘55 స్థానాల్లోనే పోటీ చేస్తాం’
హైదరాబాద్: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో 26 రాష్ట్రాల్లో 55 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించినట్లు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి తెలిపారు. సురవరం గురువారం విలేకరులతో మాట్లాడుతూ.. ఇప్పటికే కొన్నిస్థానాల్లో అభ్యర్థుల ఎంపిక కూడా చేశామని వెల్లడించారు. గత పార్లమెంటులో ప్రజల కోసం శక్తివంతమైన గొంతును వినిపించామని పేర్కొన్నారు. వామపక్షాలను గెలిపిస్తే ప్రజలకు అవసరమైన చట్టాల రూపకల్పనలో మా బలం ఉపయోగపడుతుందని చెప్పారు. బీజేపీ, ఎన్డీయే పార్టీలను చిత్తుగా ఓడించాలని సీపీఐ పిలుపునిస్తోందని వ్యాక్యానించారు. పలు రాష్ట్రాల్లో అక్కడి ప్రాంతీయ పార్టీలతో చర్చలు జరుపుతున్నామని పేర్కొన్నారు. కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు జరపకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామన్నారు. కశ్మీర్లో పార్లమెంటు ఎన్నికలు జరపగలిగినపుడు, అసెంబ్లీ ఎన్నికలు జరపడానికి ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. ఐదు వేల ఓట్ల తేడాతో ఓడిపోయిన స్థానాల్లో వీవీ ప్యాట్లు లెక్కపెట్టాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. ప్రతిపక్షాలు పాకిస్తాన్‌కి మద్ధతు పలుకుతున్నాయని మోదీ చేస్తోన్న అబద్ధపు ప్రచారాన్ని ఖండిస్తోన్నామని అన్నారు. ప్రతిపక్షాలను మాకసికంగా దెబ్బతీయడం కోసమే: చాడ తెలంగాణ రాష్ట్రం ఫిరాయింపుల తెలంగాణాగా మారిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి విమర్శించారు. ప్రతిపక్షాలను మానసికంగా దెబ్బతీయడమే లక్ష్యంగా కేసీఆర్ పెట్టుకున్నారని మండిపడ్డారు. సీపీఐ, సీపీఎంలు కలిసి పోటీ చేయాలని భావించామని, మా రాష్ట్ర కమిటీలతో చర్చించి పూర్తి విషయాలను వెల్లడిస్తామని చెప్పారు. -
జనసేనతో వెళ్లాలని చూస్తున్నాం: సురవరం
ఢిల్లీ: దేశంలో జరుగుతోన్న ఆర్ధిక పరిణామాలు, త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలపై చర్చించామని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో రెండు రోజుల పాటు జరిగిన సీపీఐ జాతీయ కార్యవర్గ సమావేశాలకు సురవరం హాజరయ్యారు. ఈ సందర్భంగా సురవరం విలేకరులతో మాట్లాడుతూ.. బీజేపీని అధికారం నుంచి తొలగించి సెక్యులర్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని సీపీఐ నిర్ణయించిందని వెల్లడించారు. దేశంలో శాంతిభద్రతలను కాపాడటంలో బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందన్నారు. అన్ని పథకాలు, సంస్కరణలు ధనికులకు మాత్రమే లాభం చేకూరేలా ఈ ఐదేళ్లు బీజేపీ పాలించిందని విమర్శించారు. బీజేపీపై ప్రజలు ఆగ్రహంతో, అసంతృప్తితో ఉన్నారని వ్యాక్యానించారు. ఎక్కడ చూసినా రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు అందరూ ధర్నాలు చేస్తున్నారని, ఇదంతా ప్రభుత్వంపై వ్యతిరేకతతోనే చేస్తున్నారని విమర్శించారు. పాకిస్తాన్‌లోని ఉగ్రస్థావరాలపై వైమానిక దాడులకు మద్ధతు ప్రకటిస్తున్నట్లు చెప్పారు. సైనికుల త్యాగాలను, వారి రక్తాన్ని బీజేపీ రాజకీయంగా మార్చడాన్ని సీపీఐ ఖండిస్తోందన్నారు. ఇప్పుడిప్పుడే రాఫెల్లో కొత్త అంశాలు బయటపడుతున్నాయని చెప్పారు. పార్లమెంటుకు రంగం సిద్ధం వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నామని వివరించారు. తెలంగాణాలో భువనగిరి, ఖమ్మం నుంచి, ఆంధ్రాలో విజయవాడ, అనంతపురం నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అలాగే జనసేన పార్టీతో ఏపీలో పొత్తు పెట్టుకోవాలని చూస్తున్నట్లు వివరించారు. 24 రాష్ట్రాల్లో మాత్రమే పోటీ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. మొదట విడతలో భాగంగా 15 మంది ఎంపీ అభ్యర్థుల పేర్లను ప్రకటించినట్లు చెప్పారు. 11 మందితో కూడిన మ్యానిఫెస్టో కమిటీని ఏర్పాటు చేశామని, ఈ కమిటీకి డి.రాజా కన్వీనర్‌గా కొనసాగుతారని వెల్లడించారు. -
రఫేల్‌పై శ్వేతపత్రం విడుదల చేయాలి
సాక్షి, హైదరాబాద్: రఫేల్ రక్షణ ఒప్పందంతో ముడిపడిన అన్ని అంశాలతో వెంటనే శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి డిమాండ్ చేశారు. ఈ ఒప్పందంలోని అనేక కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నా, కేంద్ర ప్రభుత్వం సమాధానమిచ్చేందుకు నిరాకరిస్తోందని విమర్శించారు. రఫేల్ ఒప్పందంలో ప్రధానమంత్రి కార్యాలయం జోక్యం చేసుకోవడంతో అనేక తప్పులు జరిగాయని ఆరోపణలు వస్తున్నాయన్నారు. మంగళవారం మఖ్దూంభవన్‌లో పార్టీ నాయకులు చాడ వెంకటరెడ్డి, కూనంనేని సాంబశివరావు, పశ్యపద్మ, తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు, ఎన్.బాలమల్లేష్‌లతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. విపక్షాల ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వలేక పార్లమెంట్ సమయం వృథా అవుతోందంటూ రక్షణమంత్రి నిర్మలా సీతారామన్ దబాయింపు కేకలు వేస్తున్నారని ఎద్దేవా చేశారు. జాతీయ పౌరసత్వ చట్టానికి కేంద్రం ప్రతిపాదిస్తున్న సవరణలను మొత్తంగా వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇది పూర్తిగా ఒక మతానికి వ్యతిరేకంగా ఉండటంతో ఆ వర్గానికి తీరని అన్యాయం జరిగే పరిస్థితులున్నాయన్నారు. ఈశాన్య రాష్ట్రాల నుంచి దీనిపై తీవ్ర వ్యతిరేకత ఎదురవుతున్నా, రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించడాన్ని ఆయన తప్పుబట్టారు. ఇది ఎన్డీయే ప్రభుత్వ మొండి తనానికి, మూర్ఖత్వానికి నిదర్శనమన్నారు. దీనికి వ్యతిరేకంగా భారతరత్న అవార్డు తీసుకునేందుకు భూపేన్ హజారికా కుమారుడు నిరాకరించాడన్నా రు. ఇంతకు ముందే అస్సాం, మణిపూర్ ప్రాంతా లకు చెందిన మేధావులు తమకిచ్చిన పద్మశ్రీ అవార్డు లను తిరస్కరించారని గుర్తుచేశారు. ఇద్దరే అన్ని ఫైళ్లు చూస్తారా: చాడ రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు స్థానికంగా ఎదుర్కొంటున్న సమస్యలపై ఉద్యమించాలని పార్టీ సమావేశంలో నిర్ణయించినట్టు సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి వెల్లడించారు. కేబినెట్లో 18 మంది మంత్రులు చూడాల్సిన ఫైళ్లను సీఎం, హోంమంత్రి ఇద్దరే ఎలా పరిశీలిస్తారని నిలదీశారు. ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కావొస్తున్నా పూర్తిస్థాయి కేబినెట్‌ను ఏర్పాటు చేయకపోవడమేంటని ప్రశ్నించారు. -
రాఫెల్ డీల్‌లో కొత్త అంశాలు: సురవరం
సాక్షి, హైదరాబాద్ : పౌరసత్వానికి సంబంధించిన దుర్మార్గమైన సవరణను తక్షణమే వెనక్కి తీసుకోవాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ముస్లింలకు తప్ప ఎవరికైనా పౌరసత్వం ఇస్తామని కేంద్రం చెప్పడం విచారకరన్నారు. ఇది ముస్లింల పట్ల బీజేపీ వ్యతిరేకతను స్పష్టం చేస్తుందని పేర్కొన్నారు. రాఫెల్ డీల్‌కు సంబంధించిన కొత్తకొత్త అంశాలు బయటకు వస్తున్నాయని తెలిపారు. ఈ ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మోదీదే అన్నారు. రాఫెల్ డీల్ అంశాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేస్తాం : చాడ సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పలు రాజకీయ అంశాలపై చర్చించినట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. ఎన్నికల్లో కలిసి వచ్చేవారిని కలుపుకుని ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం లేదా మహబూబాబాద్, నల్లగొండ లేదా భువనగిరి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు వివరించారు. ఏపీ ప్రత్యేక హోదా అంశానికి సీపీఐ మద్దతిస్తుందని తెలిపారు. అంతేకాక కేసీఆర్ ఒంటరిగా ప్రభుత్వాన్ని నడుపుతున్నారని విమర్శించారు. నేటికి కూడా కేబినేట్ విస్తరణపై స్పష్టత రాలేదని.. కేబినేట్ లేకపోవడం వల్ల రోజుకు వెయ్యికి పైగా ఫైల్స్ ఆగిపోతున్నాయని ఆరోపించారు. కనీసం మంత్రివర్గం లేకుండానే విధానపరమైన నిర్ణయాలను తీసుకుంటున్నారని మండి పడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం రైతులను ఆత్మహత్యలవైపు ప్రోత్సాహించేలా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనగామ జిల్లా తిమ్మాపూర్ గ్రామంలో జరగబోయే భూముల వేలాన్ని సీపీఐ అడ్డుకుంటుందని తెలిపారు. -
‘హోదా ఇస్తారనుకుంటే మట్టి, నీళ్లు ఇచ్చారు’
సాక్షి, విజయవాడ : హోదా ఇస్తారనుకుంటే.. అమరావతి శంకుస్థాపనకు వచ్చి మట్టి, నీళ్లు ఇచ్చారని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడి ఏపీకి వస్తే.. ప్రజలు స్వాగతించేవారని అభిప్రాయపడ్డారు. ఏపీలో బీజేపీ పట్ల తీవ్ర నిరాదరణ ఉందన్నారు. ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా హోదా కోసం ఒత్తిడి చేయకుండా ప్యాకేజీకి ఒప్పుకుందని సుధాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు హోదాకు ఒప్పుకున్న చంద్రబాబు.. నేడు అదే హోదా కోసం ఆందోళన చేయడం హాస్యస్పాదం అన్నారు. వామపక్షాలు, విద్యార్థి సంఘాలు మాత్రమే నేటి వరకూ హోదా కోసం పోరాటం చేస్తున్నాయని సుధాకర్ రెడ్డి తెలిపారు. మోదీ పార్లమెంట్లో చేసిన ప్రసంగం ఎన్నికల ప్రసంగంలా ఉందని ఆరోపించారు. రాఫెల్ కుంభకోణంలో అసలు విషయం ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. బీజేపీ దేశంలోని వ్యవస్థలన్నింటిని క్రమబద్ధంగా నాశనం చేస్తుందని మండిపడ్డారు. ప్రభుత్వ కార్యాలయాలను బీజేపీ ఆఫీస్‌లుగా మారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
దేశంలో రాజకీయ సంక్షోభం
సాక్షి, హైదరాబాద్: దేశంలో రాజకీయ సంక్షోభం మరింత తీవ్రమవుతోందని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ధ్వజమెత్తారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన రాజకీయ ప్రత్యర్థులపై కేసు లు, వేధింపులకు పాల్పడుతుండటమే ఇందుకు కారణమన్నారు. బుధవారం పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డితో కలసి సురవరం విలేకరులతో మాట్లాడారు. బీజేపీ మాజీ సీఎంలు శివరాజ్‌సింగ్ చౌహాన్, రమణ్‌సింగ్‌లపై ఉన్న సీబీఐ కేసులపై విచారణ చేపట్టకుండా, సోనియా, రాహుల్ గాంధీ, మాయావతి, అఖిలేశ్‌యాదవ్, అరవింద్ కేజ్రీవాల్, పినరయి విజయన్‌లపై ఈడీ, ఐటీ, సీబీఐల ద్వారా రాజకీయ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. శారదా చిట్ ఫండ్ స్కాం, రోస్ వ్యాలీ కుంభకోణంలో సంబంధమున్న వారిని కాపాడేందుకు బీజేపీ, తృణమూల్ సాగిస్తున్న రాజకీయ పోరులో భాగంగానే ప్రస్తుత పరిణామాలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు. కేంద్ర–రాష్ట్ర సంబంధాల పునర్ నిర్వచనకు వెంటనే అఖిలపక్ష భేటీని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొత్త సీబీఐ చీఫ్ నియమితులైన రోజే ఇన్చార్జి డైరెక్టర్ నాగేశ్వరరావు కోల్‌కతా పోలీస్ కమిషనర్ అరెస్ట్‌కు ఎందుకు పూనుకున్నారు.. దీని వెనుక ఎవరున్నారో బయటపెట్టాలన్నారు. జంగిల్ బచావో పేరుతో గరీబ్ హటావో: చాడ అడవుల్లో పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజనులు, ఇతరవర్గాల పేదలను జంగిల్ బచావో పేరుతో వెళ్లగొట్టే ప్రయత్నం జరుగుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఆరోపించారు. కలప స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న వారిని పట్టుకోవడం మాని పోడుపై బతికే బడుగులపై పోలీసులు దాడులకు పాల్పడటాన్ని ఖండిస్తున్నామన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి 53 రోజులు గడిచినా పూర్తిస్థాయి కేబినెట్ ఏర్పాటు చేయకపోవడం కేసీఆర్ అప్రజాస్వామిక విధానాలకు అద్దం పడుతోందని విమర్శిం చారు. అన్ని విధులు, అధికారాలు బదిలీ చేయ కుండా సీఎం తన గుప్పిట్లో పెట్టుకుని సర్పంచ్ల మెడపై కత్తి మాదిరిగా ఆంక్షలు పెట్టారన్నారు. -
బీజేపీకి వ్యతిరేకమైతేనే ఫెడరల్ ఫ్రంట్ వైపు మొగ్గు!
సాక్షి, హైదరాబాద్: బీజేపీ పట్ల టీఆర్ఎస్ స్పష్టమైన వ్యతిరేక వైఖరి తీసుకుంటే, సీఎం కేసీఆర్ ప్రతిపాదిస్తున్న ఫెడరల్ ఫ్రంట్‌లో చేరే విషయంపై ఆలోచించవచ్చని సీపీఐ జాతీయ నాయకత్వం అభిప్రాయపడుతోంది. అయితే, టీఆర్ఎస్ సర్కార్ అవలంభిస్తున్న విధానాలు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపట్ల అనుసరిస్తున్న తీరు మాత్రం ఆ దిశలో లేవని భావిస్తోంది. పవన్‌కల్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీ కూడా బీజేపీ వ్యతిరేక వైఖరి తీసుకుంటేనే ఏపీలో ఆ పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉందని స్పష్టం చేసింది. జాతీయస్థాయిలో అధికార బీజేపీకి వ్యతిరేకంగా ‘మహాఘట్ బంధన్’ ఏర్పాటులో సీపీఐ తన వంతు కృషి చేయాలని తీర్మానించింది. సోమవారం ఇక్కడ మఖ్దూంభవన్‌లో జరిగిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశంలో జాతీయ, రాష్ట్ర రాజకీయాలపై జరిగిన సమీక్షలో పార్టీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి ఆయా అంశాలను వివరించినట్టు సమాచారం. రాజ్యాంగ సంస్థలు ధ్వంసం: సురవరం అన్ని రాజ్యాంగసంస్థలను మోదీ ప్రభుత్వం ధ్వంసం చేస్తోందని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి ధ్వజమెత్తారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్డీయే పాలనలో సీబీఐ, ఈడీ, ఆర్బీఐ వంటి రాజ్యాంగసంస్థలను రాజకీయ ప్రత్యర్థులపై ఉసిగొల్పుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని విమర్శించారు. ఈ పాలనలో మతోన్మాదం పడగ విప్పుతోందని, మైనారిటీలు, దళితులపై దాడులు కొనసాగుతున్నాయని విచారం వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో మోదీ సర్కార్‌ను గద్దె దించేలా ప్రజలు తీర్పునివ్వాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కావొస్తున్నా పూర్తిస్థాయి కేబినెట్‌ను ఏర్పాటు చేయకుండా సీఎం కేసీఆర్ నియంతపాలన కొనసాగిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ధ్వజమెత్తారు. ఇటీవలి వర్షాలకు దెబ్బతిన్న పంటలకుగాను రాష్ట్రప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో ఖమ్మం లేదా మహబూబాబాద్, నల్లగొండ లేదా భువనగిరి స్థానాల్లో పోటీకి సన్నద్ధమవుతున్నట్టు చాడ తెలిపారు. భేటీలో పార్టీ నేతలు అజీజ్‌పాషా, పల్లా వెంకటరెడ్డి, కూనంనేని సాంబశివరావు, గుండా మల్లేశ్, ఈర్ల నర్సింహ, పశ్య పద్మ, టి.శ్రీనివాసరావు, ఎ¯Œ..బాలమల్లేశ్ పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై అఖిలపక్షం పిలవాలి కేంద్ర, రాష్ట్ర సంబంధాలను పునర్ నిర్వచించేందుకు వెంటనే కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సురవరం సుధాకరరెడ్డి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. మోదీ ఆధ్వర్యంలోని ఎన్డీయే ప్రభుత్వం, ఇటు పశ్చిమబెంగాల్లోని మమతా బెనర్జీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న అప్రజాస్వామిక వైఖరి దేశాన్ని అంతర్యుద్ధ పరిస్థితుల వైపు నెడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రెండు ఎంపీ సీట్లకు పోటీ... లోక్‌సభ ఎన్నికలకు పార్టీ నాయకులు, కేడర్‌ను సంసిద్ధం చేయాలని ఈ భేటీలో నిర్ణయించారు. ఈ ఎన్నికల్లో ఖమ్మం/మహబూబాబాద్, నల్లగొండ/ భువనగిరి స్థానాల్లో రెండింటికి పోటీ చేసేందుకు ఇప్పటి నుంచే పార్టీ యంత్రాంగాన్ని సమాయత్తం చేయాలని తీర్మానించారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం కూడా రాష్ట్రంలో ప్రజాఫ్రంట్ కొనసాగుతుందా లేదా అన్న దానిపై స్పష్టత కొరవడిన నేపథ్యంలో సొంత ప్రయత్నాలు చేసుకోవాలనే అభిప్రాయానికి సీపీఐ వచ్చింది. లోక్‌సభ ఎన్నికల్లో సీపీఎంను కలుపుకొనిపోవాలని, బహుజన లెఫ్ట్ ఫ్రంట్(బీఎల్ఎఫ్) నుంచి బయటకు రావడానికి ఆ పార్టీ సిద్ధమైతే తదనుగుణంగా సీపీఐ కూడా వ్యవహరించాలని నిర్ణయించింది. శాసనసభ ఎన్నికలు ముగిశాక ఇంతవరకు ప్రజాఫ్రంట్ కూటమిపరంగా సమీక్ష జరగనందున సీపీఐ చొరవ తీసుకుని కాంగ్రెస్, టీజేఎస్, టీడీపీలతో సమావేశం కావాలని అభిప్రాయపడింది. లోక్‌సభ, మండల, జిల్లా పరిషత్, మున్సిపల్ ఎన్నికలకు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలని, ప్రత్యేక కార్యాచరణను చేపట్టాలని నిర్ణయించింది. -
నిరుద్యోగంపై క్షమాపణ చెప్పాలి
సాక్షి, హైదరాబాద్: ఐదు దశాబ్దాల్లో ఎప్పుడూ లేనంతగా దేశంలో నిరుద్యోగం పెరిగినందుకు ప్రధాని నరేంద్రమోదీ క్షమాపణలు చెప్పాలని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. నేషనల్ శాంపిల్ సర్వే(ఎన్ఎస్ఎస్) ›ప్రకారం నిరుద్యోగం పెరగగా, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగంలో అది తగ్గినట్టుగా పేర్కొనడం ద్వారా వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేశారని విమర్శించారు. ఎన్ఎస్ఎస్ నివేదికను పార్లమెంట్ ముందు ఉంచాలన్నారు. శుక్రవారం ఇక్కడి మఖ్దూంభవన్‌లో ఆ పార్టీ నేతలు చాడ వెంకట్‌రెడ్డి, పల్లా వెంకట్‌రెడ్డిలతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్డీయే ఆర్థిక విధానాల వల్ల నిరుద్యోగం దారుణంగా పెరిగిందని, ప్రభుత్వరంగాన్ని పెంచాల్సింది పోయి, ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. పార్లమెంట్లో బీజేపీకి వ్యతి రేకంగా వ్యవహరిస్తామంటూ టీఆర్ఎస్ చేసిన ప్రకటన హాస్యాస్పదంగా ఉందన్నారు. నాలుగేళ్లలో బీజేపీ ప్రవేశపెట్టిన ప్రతి అంశానికి టీఆర్ఎస్ మద్దతు తెలిపిందని, ఇప్పుడు బీజేపీతోపాటు ప్రతిపక్ష కాంగ్రెస్‌పట్ల కూడా వ్యతి రేక వైఖరినే టీఆర్ఎస్ అవలంబిస్తుందంటే ఆ పార్టీకి బీజేపీతో ఉన్న లాలూచీ బయటపడుతోందన్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్ప డి యాభై రోజులు గడిచినా మంత్రులు లేకుం డానే ప్రభుత్వాన్ని నిర్వహించడం కేసీఆర్ ఒంటెత్తు పోకడకు నిదర్శనమని చాడ ధ్వజమెత్తారు. పూర్తిస్థాయి కేబినెట్ లేకపోవడంతో ప్రజాసమస్యలపై తక్షణ చర్యలు తీసుకునే అవకాశం లేకుండా పోయిందని, దీనిని ప్రభు త్వ వైఫల్యంగా భావిస్తున్నామన్నారు. -
‘మన్‌కీ బాత్’ మాటలకు అర్థాలు వేరు
సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్రమోదీ ‘మన్‌కీబాత్’లో చెప్పే మాటలు, ఆయన లోపలి మాటలు పరస్పరం భిన్నమైనవి, మోసపూరితమైనవని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి ధ్వజమెత్తారు. మగ్దూంభవన్‌లో బుధవారం నిర్వహించిన ‘లౌకికవాదాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం’ అనే అంశంపై సదస్సులో సురవరం మాట్లాడారు. తమకు అనుకూలంగా లేని వారిని దేశద్రోహులుగా, అర్బన్ నక్సలైట్లుగా బీజేపీ, సంఘ్‌పరివార్ శక్తులు ముద్ర వేస్తున్నాయని విమర్శించారు. నాడు గాంధీని హత్య చేసిన అసహనమే నేడు దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో బుసలు కొడుతోందన్నా రు. మైనారిటీలు, దళితులతోపాటు శాస్త్రీయ ఆలోచనలు ప్రచారం చేసే మేధావులు, భావప్రకటనా స్వేచ్ఛ కోరే ప్రొఫెసర్లు, విద్యార్థి సంఘ నేతలు దాడులకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగంపై ప్రస్తుతం మతోన్మాదులు, సామ్రాజ్యవాదుల దాడి జరుగుతోందని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ స్వయం ప్రతిపత్తి ఉన్న వ్యవస్థలను బలహీనపరచడం ద్వారా రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతోందన్నారు. ఈ సమావేశానికి డా.సుధాకర్ అధ్యక్షత వహించగా పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
విపక్షాల ఐక్యతతో మోదీలో వణుకు
సాక్షి, హైదరాబాద్: జాతీయస్థాయిలో బీజేపీని ఓడించేందుకు వివిధ రాజకీయపార్టీలు కలుస్తుంటే ప్రధాని నరేంద్ర మోదీ కాళ్లు వణుకుతున్నాయని సీపీఐ ప్రధానకార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి ఎద్దేవా చేశారు. అందువల్లే విపక్ష కూటమిపై విషప్రచారం చేస్తున్నారని ధ్వజ మెత్తారు. బీజేపీ 34 పార్టీలతో ఎన్డీఏ పేరిట కూటమి కట్టగా లేనిది, ప్రతిపక్షాలు 10, 12 పార్టీలతో ఫ్రంట్ కడితే తప్పా అని ప్రశ్నించారు. శుక్రవారం ఇక్కడ మఖ్దూంభవన్‌లో పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డితో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్డీఏని గద్దె దించేందుకు ప్రత్యామ్నాయ, లౌకిక శక్తులు అధికారంలోకి వచ్చేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయన్నారు. కార్పొరేట్ అనుకూల, ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ మతోన్మాదాన్ని రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్న మోదీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఏకమవుతున్నాయన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమని సురవరం జోస్యం చెప్పారు. బీజేపీ వ్యతిరేక ఓట్లు చీల్చేందుకే సీఎం కేసీఆర్ వంటి వాళ్లు ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ‘డిఫెన్స్’ ప్రైవేటీకరణ ప్రమాదకరం... డిఫెన్స్ పరిశ్రమ ప్రైవేటీకరణకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను ఖండిస్తున్నట్టు సురవరం తెలిపారు. ఈ ప్రయత్నాలకు నిరసనగా ఈ నెల 23,24, 25 తేదీల్లో దేశవ్యాప్తంగా ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీల్లోని నాలుగున్నర లక్షల కార్మికులు చేపడుతున్న సమ్మెకు సీపీఐ మద్దతు ప్రకటించిందన్నారు. దేశరక్షణ వ్యవహారాల్లో ప్రైవేట్, విదేశీ కంపెనీల జోక్యం పెరగడం ప్రమాదకరమన్నారు. సీబీఐ డైరెక్టర్ ఆలోక్ వర్మ బదిలీ వ్యవహారంలో మోదీ విశ్వసనీయత ప్రశ్నార్థకంగా మారిందన్నారు. వర్మపై వచ్చిన ఆరోపణలు, సీవీసీ విచారణలో తేలిన అంశాలు, దానిపై జస్టిస్ పట్నాయక్ చేసిన వ్యాఖ్యలను గురించి దేశప్రజలకు తెలియజేసి పారదర్శకతను చాటాలని డిమాండ్ చేశారు. కేరళ పర్యటనకు వెళ్లిన మోదీ కమ్యూనిస్టుపార్టీలపై చేసిన అసంగత, బాధ్యతారహిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. సభ ఔన్నత్యాన్ని పెంచాలి: చాడ రెండోసారి అధికారంలోకి వచ్చాక కేసీఆర్ ఇతర పార్టీల నుంచి ఫిరాయింపులను ఉధృతం చేశారని సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. ఇందుకోసం అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో మెజారిటీ రావడం తో తనకు ఎదురులేదన్న విధంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నికైన∙సీనియర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధికార, విపక్షాలను నాణేనికి రెండువైపులా ఉండటాన్ని గమనంలో పెట్టుకుని సభ ఔన్నత్యం పెంచే చర్యలు తీసుకోవాలని కోరారు. -
‘కేసీఆర్ ఫ్రంట్ బీజేపీ కొరకే’
సాక్షి, హైదరాబాదు : డిఫెన్స్ ఇండస్ట్రీలో ప్రైవేటికరణకు వ్యతిరేకంగా ఈ నెల 23 నుంచి 25 వరకూ నాలుగు సంఘాలకు చెందిన దాదాపు 4 లక్షల మంది కార్మికులు సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. కార్మికుల సమ్మెకు సీపీఐ పూర్తి మద్దతు తెలుపుతుందన్నారు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి. ఈ సందర్భంగా శుక్రవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పలు అంశాల గురించి మాట్లాడారు. డిఫెన్స్ ఇండస్ట్రీలో ప్రైవేటికరణకు అనుమతించడం వల్ల దేశ రక్షణకు ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాక మోదీ కక్షపూరితంగానే ఆలోక్ వర్మను ట్రాన్స్ఫర్ చేయించారని ఆరోపించారు. ఆలోక్ విషయంలో పారదర్శకంగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అంతేకాక కేరళలో కమ్యూనిస్ట్‌లపై మోదీ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని తెలిపారు. సుప్రీం తీర్పుకు వ్యతిరేకంగా మోదీ మాట్లాడటం సిగ్గుచేటని విమర్శించారు. జేఎన్‌యూ విద్యార్థులపై అక్రమంగా నమోదు చేసిన చార్జిషీట్‌ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ఫ్రంట్ బీజేపీ లబ్ధి కొరకే : చాడ తెలంగాణ సీఎం కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సాహిస్తున్నారంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ నుంచి ఫిరాయిస్తే ఒక రకంగా.. టీఆర్ఎస్లోకి వెళ్తే మరో రకంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌లో చేరారని ఫిర్యాదు అందగానే ఆఘమేఘాల మీద చర్యలు తీసుకోవడం ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్‌లో గెలిచిన ఎమ్మెల్సీలను టీఆర్ఎస్లో చేర్చుకొని విలీనం చేయడం పద్దతి కాదని తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ అసెంబ్లీ నూతన స్పీకర్‌గా ఎన్నికైన పోచారం శ్రీనివాస్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. శాసన సభలను ఔన్నత్యంగా నడపాలని కోరారు. -
మనుధర్మం అమలుకు యత్నాలు
సాక్షి, హైదరాబాద్: ఆరెస్సెస్, బీజేపీలు రాజ్యాం గాన్ని తిరస్కరిస్తూ, మహిళల సమానత్వాన్ని కాలరాస్తూ మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతున్నాయని సీపీఐ జాతీయ ప్రధానకార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం మఖ్దూం భవన్లో పార్టీ నేతలు చాడ వెంకటరెడ్డి, బాలమల్లేశ్‌లతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. దేవాలయాల్లో దేవుళ్లను కొలిచే అవకాశాన్ని కూడా మహిళలకు దక్కకుండా చేస్తున్నారన్నారు. రఫేల్ ఒప్పందానికి సుప్రీంకోర్టు ఓకే చెప్పినందున సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) వేయాల్సిన అవసరం లేదని ప్రధాని నరేంద్ర మోదీ ఒకవైపు చెబుతూ, మరోవైపు శబరిమలలో మహిళల ప్రవేశానికి అనుకూలంగా సుప్రీం తీర్పు ఇచ్చినా, దానిని అమలు చేయకుండా ఇది సంప్రదాయాలకు చెందిన విషయమంటూ ద్వంద్వ వైఖరిని చాటుతున్నారన్నారు. శనిసింగనాపూర్‌లోని శనీశ్వర ఆలయంలోనికి మహిళల ప్రవేశం, ముంబైకి సమీపంలోని ఒక మసీదులో మహిళల ప్రవేశానికి అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బీజేపీ ఆధ్వర్యంలోని మహారాష్ట్ర ప్రభుత్వం అమలుచేయగా లేనిది శబరిమలలోకి మహిళల ప్రవేశంపై సుప్రీం ఆదేశాలను కేరళలో ఎల్డీఎఫ్ ప్రభుత్వం అమలు చేస్తే తప్పయిందా అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో శాంతియుతంగా ధర్నా చేస్తున్న సీపీఐ, సీపీఎం నాయకులు,కార్యకర్తలపై పోలీసులు జరిపిన లాఠీచార్జీని సురవరం ఖండించారు. అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలన్నారు. రఫేల్‌పై జేపీసీ వేయాల్సిందే... రఫేల్ ఒప్పందంపై జేపీసీని ఏర్పాటు చేసి, అందులోని నిజానిజాలను నిగ్గు తేల్చాల్సిందేనని సురవరం డిమాండ్ చేశారు. జేపీసీ వేయకుండా నిరాకరించడం ద్వారా అవినీతిని పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఎక్కువ జిల్లాలు చేస్తే గొప్పా?: చాడ రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు పెంచితే అంత గొప్పా అంటూ సీఎం కేసీఆర్‌ను సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ప్రశ్నించారు. జిల్లాల సంఖ్యను 33కు ఎందుకు పెంచారో కేసీఆర్‌కే తెలియాలన్నారు. చేతిలో అధికారం ఉందని దాన్ని కేసీఆర్ దుర్వినియోగం చేసి పరిపాలన గబ్బు పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. విపక్షాలు లేని రాష్ట్రాన్ని కేసీఆర్ కోరుకుంటున్నారా అని నిలదీశారు. ఎన్నికల కోడ్ అనేది కేబినెట్ విస్తరణకు అడ్డంకి కాదని ఒక ప్రశ్నకు చాడ జవాబిచ్చారు. ఈ నెల 8, 9 తేదీల్లో ‘మోదీ హటావో దేశ్‌కో బచావో’నినాదంతో జరుగుతున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు మద్దతు ప్రకటిస్తున్నట్టు వెంకటరెడ్డి తెలిపారు. కార్మికసంఘాలు 3సార్లు సమ్మె చేసినా మోదీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. -
మభ్యపెట్టి విజయం సాధించారు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను తాత్కాలికంగా మభ్యపెట్టి, ప్రలోభాలకు గురిచేసి టీఆర్ఎస్ అనుకున్న విజయాలు సాధించిందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి ధ్వజమెత్తారు. అయితే ఈ ఎన్నికల ఫలితాల ద్వారా ప్రజలు టీఆర్ఎస్కు శాశ్వతంగా అధికారాన్ని కట్టబెట్టలేదన్న విషయాన్ని గ్రహించాలన్నారు. సంక్షే మ పథకాలను ఒక భిక్ష రూపంలో కాకుండా సొంత కాళ్లపై నిలబడేలా చేయగలిగినప్పుడే ప్రయోజనం ఉంటుందని చెప్పారు. అది సోషలిజం వ్యవస్థలోనే సాధ్యమని, దానికోసం కృషి సాగించాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పడబోయే విశాల ఐక్యవేదిక విచ్ఛిన్నం చేసే పనిని సీఎం కేసీఆర్ కొనసాగిస్తున్నారని విమర్శించారు. బీజేపీ, కాంగ్రెస్‌లకు వ్యతిరేకంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు లక్ష్యమైతే గత నాలుగున్నరేళ్లుగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎందుకు బలపరచారో కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బుధవారం మఖ్దూంభవన్‌లో సీపీఐ 93వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పార్టీ పతాకాన్ని సురవరం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం కమ్యూనిస్టు ఉద్యమం ఆటుపోట్లను, సవాళ్లను ఎదుర్కుంటున్నదని, ప్రతి అపజయం నుంచి కొత్త గుణపాఠం నేర్చుకుని ముందుకు సాగాలన్నారు. కమ్యూనిస్టు ఉద్యమం సవాళ్లను ఎదుర్కొంటున్నా జాతీయ స్థాయిలో బీజేపీ ఫాసిస్ట్ విధానాలు, ప్రజా వ్యతిరేక చర్యలకు వ్యతిరేకంగా పోరాడాలన్నారు. మిలిటెంట్ ఉద్యమాలకు సిద్ధం కావాలి: చాడ బీజేపీ మతోన్మాద విధానాలు ఎండగట్టేందుకు మిలి టెంట్ తరహా ఉద్యమాలకు సిద్ధం కావాలని సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి కోరారు. ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణతో పాటు ప్రజలందరికీ మౌలిక అవసరాలు తీర్చేందుకు పోరాటాలు చేపట్టాల్సి ఉందన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పల్లా వెంకటరెడ్డి, పశ్యపద్మ, టి. శ్రీనివాసరావు, కందిమళ్ల ప్రతాపరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘అప్పుడెందుకు మద్దతిచ్చావ్ కేసీఆర్ ?’
సాక్షి, హైదరాబాద్ : సీపీఐ 93వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి పార్టీ కార్యాలయంలో సీపీఐ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వర్గ దోపిడీ, అసమానతలు ఉన్నంతకాలం కమ్యూనిస్ట్‌లు ఉంటారని చెప్పారు. పార్టీ ఏర్పాటు చేసినప్పుడు నిర్బంధం ఎదుర్కొన్నామన్నారు. ప్రజా ఉద్యామాలలో ఎందరినో అరెస్ట్ చేశారని తెలిపారు. జైల్లో ఉన్నవారి తరఫున జవహర్ లాల్ నెహ్రూ కేసులు వాదించారని గుర్తు చేశారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కమ్యూనిస్ట్‌ల పాత్ర మరువలేనిదన్నారు. ప్రస్తుత సమాజంలో కూడా అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నామని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ ప్రజలను ప్రలోభ పెట్టడం వల్లే తెలంగాణలో అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. ప్రస్తుతం దేశంలో ఉన్న అనైక్య పరిస్థితులను విచ్చిన్నం చేయడం కోసమే తాము థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. థర్డ్ ఫ్రంట్ పేరిట ఇన్ని రోజులు దేశవ్యాప్తంగా పర్యటనలు చేసిన కేసీఆర్ ఈ రోజు తన బాస్ మోదీకి వివరణ ఇస్తారని ఆరోపించారు. థర్డ్ ఫ్రంట్ నిర్ణయం ఎప్పుడో జరిగిందన్న కేసీఆర్ నోట్ట రద్దు, జీఎస్టీని ఎందుకు సపోర్ట్ చేశారని ప్రశ్నించారు. కేసీఆర్ నాటకాలను ప్రజలు గుర్తిస్తారని విమర్శించారు. త్యాగాల పార్టీ సీపీఐ : చాడ బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన పార్టీ సీపీఐ అన్నారు పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి. దేశంలో రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేసింది సీపీఐ పార్టీ అని తెలిపారు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని నడిపింది కూడా సీపీఐ పార్టీనే అన్నారు. త్యాగాల పార్టీ సీపీఐ అంటూ కొనియాడారు. ప్రాంతీయ పార్టీల వల్ల కమ్యూనిస్ట్ పార్టీలు బలహీనపడ్డాయని పేర్కొన్నారు. దేశంలో సెంటిమెంట్ రాజకీయాలెక్కువయ్యాయని విమర్శించారు. -
బీజేపీ వ్యతిరేక శక్తుల విచ్ఛిన్నానికే..
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక ఐక్యవేదికను విచ్ఛిన్నం చేసేందుకే ఫెడరల్ ఫ్రంట్ పేరిట కేసీఆర్ తన పాత్ర పోషిస్తున్నారని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి ధ్వజమెత్తారు. బీజేపీకి బీ–టీమ్‌గా పనిచేసేందుకే ఫెడరల్ ఫ్రంట్‌ను ఏర్పాటుచేసే ప్రయత్నాల్లో ఉన్నారన్నారు. కేసీఆర్ చేపట్టిన కొత్త యాత్రలో భాగంగా వివిధ రాష్ట్రాల్లో పర్యటించాక అక్కడి సీఎంలతో చేసిన చర్చల వివరాలు తెలియజేసేందుకే ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీతో సమావేశం కాబోతున్నారని ఆరోపించారు. సోమవారం మఖ్దూంభవన్‌లో సీపీఐ రాష్ట్రసమితి సమావేశాల సందర్భంగా సురవరం రాజకీయ నివేదికను సమర్పించారు. ఇతర రాష్ట్రాల సీఎంలు మోదీ అపాయింట్మెంట్ కోసం వారాల తరబడి వేచిచూసే పరిస్థితి ఉండగా, తాను ఫలానా తేదీ ఢిల్లీకి వస్తున్నానని చెప్పగానే ప్రధాని అపాయింట్మెంట్ ఫిక్స్ అవుతోందన్నారు. ఈ పరిణామాలను బట్టి కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఎవరికోసమో అర్థం చేసుకోవచ్చునని చెప్పారు. కొంతకాలంగా దేశంలో దళితులు, మైనారిటీలపై దాడులు, మేధావుల హత్యలు వంటి అనేక తీవ్రమైన ఘటనలు చోటుచేసుకున్నా కేసీఆర్ ఒక్కసారి కూడా స్పందించలేదని దీనిని బట్టి బీజేపీతో ఉన్న సంబంధాలు స్పష్టమవుతున్నాయన్నారు. రైతుబంధు, ఇతర పథకాలతోనే.. తెలంగాణలో టీఆర్ఎస్ అనూహ్య విజయానికి పోలింగ్‌కు రెండురోజుల ముందు రైతుల బ్యాంకు ఖాతాల్లో ఎకరానికి రూ.4 వేలు చొప్పున జమకావడం కారణమని, మొత్తంగా 54 లక్షల మంది రైతులకు లబ్ది జరిగిందని, గొర్రెల పెంపకం, పెన్షన్ల పెంపు వంటి సామాజిక సంక్షేమ పథకాలు గెలిపించాయని సురవరం అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ కూటమిలో చంద్రబాబు చేరడాన్ని కేసీఆర్ తమకు అనుకూలంగా మార్చుకుని తెలంగాణ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టి ప్రయోజనం పొందారన్నారు. పౌరహక్కుల హరింపు, నియంతృత్వ విధానాలు, వాస్తు ప్రకారం పాలన చేసి నవ్వులపాలు కావడం, ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో వేల కోట్ల దుర్వినియోగం వంటి విషయాల్లో టీఆర్ఎస్పై, కేసీఆర్ పాలనపై తాము చేసిన విమర్శలు సరైనవేనని స్పష్టం చేశారు. సహేతుకత, ప్రజల చైతన్య స్థాయిని పెంచడంలో విఫలమయ్యామని చెప్పారు. అంతులేని డబ్బు ప్రవాహం మధ్య ఎన్నికలు జరిగాయని, రూ.143 కోట్ల ధనాన్ని ఈసీ స్వాధీనం చేసుకున్నదంటే ఎన్ని కోట్లమేర డబ్బు పంపిణీ అయ్యిందో ఊహించుకోవచ్చునన్నారు. ప్రస్తుత పరిణామాలతో పార్టీ శ్రేణులు నిరాశా, నిస్పృహలకు గురికావాల్సిన అవసరం లేదన్నారు. నూతన శక్తులు ఐక్యమయ్యేలా చేసేందుకు, ప్రజాశ్రేణులను కదిలించేందుకు పార్టీగా సీపీఐ, కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. -
‘ఆ విషయం మోదీ గ్రహించాలి’
సాక్షి, విశాఖపట్నం: ప్రశ్నిస్తున్న ప్రగతిశీలవాదులను కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం హత్య చేస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి విమర్శించారు. విశాఖపట్నంలో జరుగుతున్న సీపీఐ జాతీయ కార్యవర్గ సమావేశాల చివరి రోజున ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. మోదీ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నదని, స్వతంత్ర సంస్థల ఉనికి ప్రమాదంలో పడిపోయిందన్నారు. నాలుగేన్నరేళ్ల కాలంలో దేశంలో ధనవంతులు మరింత ధనవంతులయ్యారని, పేదలు మాత్రం నిరుపేదలుగా మారిపోయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. జీడీపీ ఒక్కటే అభివృద్ధికి కొలమానం కాదనే విషయాన్ని మోదీ గ్రహించాలని హితవుపలికారు. ఉద్యోగాల కల్పన పూర్తిగా తగ్గిపోయిందని, నిరుద్యోగం తీవ్ర స్థాయిలో పెరిగిందని తెలియజేశారు. బీజేపీని గద్దెదింపే తరుణం ఆసన్నమైందన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి వామపక్షాల ఐక్యతతోపాటు విశాల ఐక్యతను ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. అభిప్రాయ బేధాల కారణంగా తెలంగాణ ఎన్నికల్లో వామపక్షాల ఐక్యత కుదరలేదని తెలిపారు. -
‘సైలెంట్ సపోర్ట్’ను గుర్తించలేకపోయాయి
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్కు ప్రజల్లో ఉన్న ‘సైలెంట్ సపోర్ట్’ను విపక్షాలు సరిగ్గా గుర్తించలేకపోయాయని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అనేక అంశాల్లో ప్రభుత్వ వైఫల్యాలున్నా సంక్షేమ కార్యక్రమాలు టీఆర్ఎస్కు ఎన్నికల్లో విజయం సాధించడానికి దోహదపడ్డాయన్నారు. ఎన్నడూ లేనివిధంగా డబ్బు ఖర్చు చేయడం, మద్యం పంపిణీ తదితర అంశాలన్నీ కలిసి కేసీఆర్ గెలుపునకు కారణమయ్యాయని బుధవారం ఆయన ‘సాక్షి’కి చెప్పారు. పింఛన్లు, రైతుబంధు, గొర్రె ల పంపిణీ తదితర పథకాలు కాంగ్రెస్ అనుకూల ఓటింగ్‌కు గండికొట్టాయని అభిప్రాయపడ్డారు. కూటమి సీట్ల సర్దుబాటు ఆలస్యం కావడం, కూటమి విధానాలు, తదితర అంశాలపై ప్రచారానికి 10– 15 రోజుల సమయం లేకపోవడం కూటమి ఓటమి కారణాలుగా చెప్పారు. ఐదురాష్ట్రాల ఎన్నికల్లో ప్రధాని మోదీ హవా తగ్గిపోవడం స్పష్టంగా కనిపించిందన్నారు. ‘ఫలితాలను అంచనా వేయలేకపోయాం’ సాక్షి, న్యూఢిల్లీ: తెలం గాణ ఎన్నికల ఫలితాలను తాము అంచనా వేయలేకపోయామని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయ ణ అన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై బుధవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్కి తెలంగాణ సెంటిమెంట్, పలు సంక్షేమ పథకాలు లాభించడంతో కేసీఆర్ ఈ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించగలిగారన్నారు. అందుకే గతంకంటే టీఆర్ఎస్కు ఓట్లు, సీట్లు అధికంగా వచ్చాయన్నారు. కూటమి ఏర్పాటులో ఆలస్యం కావడం, కూటమి కుదిరినా పై స్థాయిలో నాయకులు కలసినట్టు కింది స్థాయిలో ప్రజలు కలవలేకపోయారన్నారు. కూటమిలో ఎక్కడ తప్పులు జరిగాయో పరిశీలించుకొని ముందుకెళ్తామన్నారు. -
మోదీ, కేసీఆర్‌లది లాలూచీ కుస్తీ
సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం కేసీఆర్ ఒకరిపై ఒకరు లాలూచీ కుస్తీ చేస్తున్నారని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి విమర్శించారు. టీఆర్ఎస్ పాలనలో తీవ్రస్థాయిలో అవినీతి చోటుచేసుకున్నా కేంద్ర ఎన్ఫోర్స్మెంట్, ఐటీ దాడులు జరగలేదంటేనే మోదీ, కేసీఆర్‌ల మధ్య లాలూచీ స్పష్టమవుతోందని చెప్పారు. మంగళవారం మఖ్దూంభవన్‌లో పార్టీ నేతలు అజీజ్ పాషా, పల్లా వెంకటరెడ్డి, బాలమల్లేశ్‌లతో కలసి సురవరం మీడియాతో మాట్లాడారు. బీజేపీకి బీ టీమ్‌గా టీఆర్ఎస్ మారిందని, ఢిల్లీలో మోదీని ఓడించాలంటే రాష్ట్రంలో కేసీఆర్‌ను ఓడించాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్ స్టేట్‌లో నిజాం నవాబు పాలన కొనసాగింపునకు గతంలో ప్రయత్నించిన ఎంఐఎంకు కేసీఆర్ వంతపాడుతున్నారని, మరోవైపు బీజేపీకి టీఆర్ఎస్ మద్దతునిస్తోందన్నారు. ఆ అపవిత్ర కూటమి ఆడుతున్న నాటకానికి ఓటు అనే ఆయుధంతో గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మోదీ ప్రభుత్వానికి కేసీఆర్ మద్దతు గత నాలుగున్నరేళ్లలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం చేపట్టిన ప్రతీ కార్యక్రమానికి కేసీఆర్ పూర్తి మద్దతు ప్రకటించారని సురవరం గుర్తు చేశారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతుతో పాటు, పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీలను టీఆర్ఎస్ బలపరిచిందని, మోదీ ప్రభుత్వంపై విపక్షాల అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలపలేదని చెప్పారు. టీఆర్ఎస్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా, కేసీఆర్ నియంతృత్వ పోకడలకు నిరసనగా ఎన్నికల్లో ప్రజా కూటమిని గెలిపించాలని ప్రజలను కోరారు. కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్‌రెడ్డి అరెస్ట్ చేయడం ద్వారా భయందోళనలు సృష్టించే ప్రయత్నం జరిగిందన్నారు. ఇలాంటి చర్యల ద్వారా కేసీఆర్ ఆపద్ధర్మ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు. హైదరాబాద్‌లో మోదీ అబద్ధాలు.. నిరంకుశ నిజాం నవాబుకు వ్యతిరేకంగా జరిగిన మహత్తర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని దాచిపెట్టి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ హైదరాబాద్‌స్టేట్‌కు విమోచన కల్పించారని బీజేపీ సభలో మోదీ అబద్ధాలు చెప్పారని సురవరం సుధాకర్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణ పోరాటంలో ప్రజలతో పాటు కమ్యూనిస్టు పార్టీదే కీలకపాత్ర అని చెప్పారు. కమ్యూనిస్టు పార్టీ లేకుండా తెలంగాణ విముక్తి సాధ్యమయ్యేది కాదన్నారు. -
మోదీకి కేసీఆర్ చెంచాగిరీ
హుస్నాబాద్: కేసీఆర్‌కు ఓటేస్తే రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోదీకి మరో చెంచాగిరీ ఉంటాడని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి అన్నారు. ఆదివారం సిద్ది పేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో ప్రజాఫ్రంట్ బలపర్చిన సీపీఐ అభ్యర్థి చాడ వెంకట్‌రెడ్డికి మద్దతుగా నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. జీఎస్టీ, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి అభ్యర్థుల ఎంపిక కోసం కేసీఆర్ మద్దతు తెలిపి మోదీకి చెంచాగిరీ చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్‌కు ఓటేస్తే బీజేపీకి వేసినట్లేనని విమర్శించారు. కేసీఆర్‌కి ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పి తెలంగాణకు విముక్తి కల్పించాలని పిలుపు నిచ్చారు. ఇతర పార్టీలకు చెందిన 30 మంది ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లో చేర్చుకున్న కేసీఆర్‌కు చట్టాలు, రాజ్యాంగంపై విలువ లేదని టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ విమర్శించారు. 2014 ఎన్నికల్లో సోనియా గాంధీకి కృతజ్ఞత తెలుపలేదని, ఈసారైనా కృతజ్ఞత తెలిపేందుకు కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కోరారు. కార్యక్రమంలో టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు ఇనుగాల పెద్దిరెడ్డి, ఏఐఎస్ఎఫ్ జాతీయ మాజీ అధ్యక్షుడు కన్నయ్యకుమార్, మాజీ ఎంపీ అజీజ్‌పాష, చాడ వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. -
అప్పుల కుప్పగా మార్చారు
సాక్షి, హైదరాబాద్: మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల కుప్పగా సీఎం కేసీఆర్ పాలన మార్చేసిందని, ఆయన మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి మరింత చెడు జరుగుతుందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మరోసారి ప్రజావ్యతిరేక టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుందని, అందుకే ఆ పాలనను అంతమొందించాలనే ఏకైక లక్ష్యంతోనే కూటమిలో సీపీఐ చేరినట్లు స్పష్టం చేశారు. మళ్లీ సీఎంగా కేసీఆర్ వస్తే రాష్ట్రానికి తీరని నష్టమే తప్ప ఎలాంటి లాభం ఉండదని పేర్కొన్నారు. కోటి ఎకరాలకు నీరిస్తామంటూ ఊదరగొట్టి ప్రారంభించిన భారీ నీటిపారుదల ప్రాజెక్టుల్లో పారిన నీటి కంటే అవినీతే ఎక్కువ ఉందని ఆరోపించారు. అవినీతి ప్రవాహంతోనే కాల్వలు నిండిపోయాయని ధ్వజమెత్తారు. రాజులు, నవాబుల కంటే కూడా దారుణమైన పద్ధతుల్లో కేసీఆర్ వ్యవహార శైలి ఉందని, అందుకే ఆయనను ఓడించాలనే ధ్యేయంతో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. 2014 ఎన్నికల సమయంలో, ప్రస్తుత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో సీట్ల సర్దుబాటుకు సంబంధించి సీపీఐకి చేదు అనుభవాలు ఎదురయ్యాయని చెప్పారు. అయినా టీఆర్ఎస్ను ఓడించాలనే ధ్యేయంతో కూటమితో పాటు సాగాలని నిర్ణయించినట్లు తెలిపారు. లోక్‌సభ ఎన్నికలకు ప్రీఫైనల్‌గా భావిస్తున్న 5 రాష్ట్రా ల ఎన్నికల్లో పాలక పక్షాలు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాయని చెప్పారు. జాతీయ స్థాయిలో బీజేపీ అభివృద్ధి నినాదాన్ని పక్కనపెట్టి హిందూత్వవాద ఎజెండా ఎత్తుకుందని, ప్రధాని స్థాయికి తగ్గట్లు నరేంద్ర మోదీ మాట్లాడట్లేదన్నారు. బీజేపీ వ్యతిరేక శక్తులు కలవాలి.. వచ్చే లోక్‌సభ ఎన్నికలకు ముందే విపక్షాల మధ్య అవగాహన సాధ్యమని సురవరం చెప్పారు. రాష్ట్రా ల్లోని పరిస్థితులను బట్టి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో బీజేపీ వ్యతిరేకశక్తులు కలవాల్సి ఉందని, మొత్తం 542 సీట్లలో 375–400 సీట్ల వరకు ఈ విధమైన అవగాహన ఏర్పడే అవకాశాలున్నాయని చెప్పారు. సురవరం ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖ్యాంశాలు.. రాష్ట్రంలో గతంలో కాంగ్రెస్‌తో, మరోసారి టీడీపీ, టీఆర్ఎస్లతో, మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్, టీడీపీలతో కలసి సీపీఐ ఎన్నికల్లో పోటీచేయడాన్ని ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలి? సురవరం: రాజకీయ విధానం, సమస్యలను బట్టే ఇలాంటి పొత్తులు ఏర్పడ్డాయి. ఇది రాజకీయ విధానంలో భాగంగానే జరిగింది తప్ప పార్టీలకు సంబంధించిన సమస్య కాదని ప్రజలు అర్థం చేసుకుంటారని భావిస్తున్నాం. గతంలో వేర్వేరు సందర్భాల్లో కాంగ్రెస్, టీడీపీలతో కలసి టీఆర్ఎస్ పోటీచేసింది. ఇప్పుడు అధికార పార్టీగా ఉంది కాబట్టి ఒంటరిగా పోటీ చేస్తోంది. కాంగ్రెస్, బీజేపీ విధానాలు ఒకేలా ఉన్నాయి కదా? సురవరం: ఆర్థిక విధానాల విషయంలో కాంగ్రెస్, టీడీపీలు ఒకటే. బీజేపీ అనుసరిస్తున్న మతోన్మాద విధానాలు దేశానికి మరింత నష్టపరుస్తున్నాయి. ఈ విషయంలో ఒక పెద్ద శత్రువుగా బీజేపీ ముందు కొచ్చినపుడు కాంగ్రెస్ వంటి పార్టీ లేకుండా మతోన్మాద శక్తులను ఓడించడం సాధ్యం కాదు. దేశాన్ని పెద్ద ప్రమాదం నుంచి తప్పించేందుకు కాంగ్రెస్ సహా అన్ని ప్రతిపక్షాలు ఏకతాటిపైకి రావాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్రంలోని సెమీ ఫాసిస్ట్‌ను అంతం చేయాల్సిందే. టీడీపీతో దోస్తీని ఎలా సమర్థించుకుంటారు? సురవరం: బీజేపీ వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది కాబట్టే ఆ పార్టీతో పొత్తు. టీఆర్ఎస్ను ఓడించేం దుకు కాంగ్రెస్, టీడీపీ, ఇతర మిత్రపక్షాలతో కలసి సీపీఐ చేతులు కలిపింది. నాలుగున్నరేళ్ల టీఆర్ఎస్ పాలన ఎలా ఉంది? సురవరం: ప్రజలకు మేలు చేకూర్చే ప్రాజెక్టులు, పరిశ్రమలు, సంక్షేమ కార్యక్రమాలపై కంటే కులాలు, మతాల వారీగా సంక్షేమం అంటూ, దేవుళ్లు, పుణ్యకార్యాలు అంటూ ప్రభుత్వ సొమ్మును పప్పూబెల్లాల మాదిరిగా పంచిపెడుతున్నారు. దళితులకు మూడెకరాలు, డబుల్బెడ్రూంలు, ఇంటింటికీ నల్లా వంటి వాటిని అమలు చేయడంలో విఫలమయ్యారు. ప్రజాస్వామ్య విలువలకు పాతరేసి, ప్రజలకు నిరసనలు తెలిపే కనీస హక్కు కూడా లేకుండా చేశారు. -
‘తగ్గేదే లేదు..5 స్థానాల్లో పోటీకి దిగుతాం’
సాక్షి, హైదరాబాద్ : కొత్తగూడెం, వైరా, హుస్నాబాద్, మునుగోడు, బెల్లంపల్లి స్థానాల్లో పోటీ చేస్తామని సీపీఐ ప్రకటించింది. ఈ మేరకు హైదరాబాద్‌లోని మఖ్దూం భవన్లో శుక్రవారం సమావేశమైన రాష్ట్ర కార్యవర్గం ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రజాకూటమిలో భాగమైన సీపీఐ 9 సీట్లు డమాండ్ చేస్తుండగా.. కాంగ్రెస్ పెద్దలు 3 సీట్లు మాత్రమే ఇస్తాననడం దారుణమని పార్టీ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు అజీజ్‌పాషా, గోదా శ్రీరాములు వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ను ఓడించే ప్రధాన లక్ష్యంతోనే సీపీఐ పనిచేస్తుందని ఉద్ఘాటించారు. (‘సీట్ల కేటాయింపు మింగుడుపడటం లేదు’) ఎటువంటి సంప్రదింపులు లేకుండానే ఏకపక్షంగా కాంగ్రెస్ సీట్ల కేటాయింపులు చేస్తోందని ప్రకటనలో పేర్కొంది. రాష్ట్రంలో నియంతృత్వ టీఆర్ఎస్ను, వారితో లాలూచీ దోస్తీలో ఉన్న బీజేపీని ఓడించే లక్ష్యం నెరవేరాలంటే భాగస్వామ్య పార్టీల మధ్య సుహృద్భావ వాతావరణం ఉండాలని నేతలు ఆకాక్షించారు. ఉమ్మడి రాజకీయ లక్ష్యం కంటే గ్రూపులను సంతృప్తి పరిచే సంకుచిత ధోరణితో కాంగ్రెస్ పార్టీ వ్యవహరించడం సరికాదని హితవుపలికారు. -
సీట్ల లొల్లి : కోదండరాం, సురవరం భేటీ..!
సాక్షి, హైదరాబాద్ : టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డితో బుధవారం భేటీ అయ్యారు. అధికార టీఆర్ఎస్ని ఓడించడమే లక్ష్యంగా రూపుదిద్దుకుంటున్న ప్రజాకూటమిలో సీట్ల సర్దుబాటు విషయంలో రెండు పార్టీలకు అసంతృప్తి ఉన్న నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ విలేకరులతో మాట్లాడుతూ.. ఈ సమావేశంలో రాజకీయ అంశాలు ఏమి చర్చించలేదు. కేవలం స్నేహపూర్వకంగానే కలవడానికి వచ్చానని తెలిపారు. సీట్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంకా ఎటువంటి సమాచారం రాలేదని వెల్లడించారు. భేటీకి సంబంధించి కొన్ని విషయాలను ఇప్పుడే చెప్పలేనని తెలిపారు. -
సీపీఐ నేతలతో కోదండరామ్ భేటీ
-
ఆత్మగౌరవాన్ని చంపుకోవాల్సిన పనిలేదు
సాక్షి, హైదరాబాద్: ప్రజాకూటమికి సంబంధించి రెండ్రోజుల్లో సీట్లపై అవగాహనకు రావాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి పార్టీ రాష్ట్ర నేతలకు సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ రెండేనని, వీటిని గద్దె దించాల్సిన చారిత్రక అవసరముందన్నారు. అలాగని మన ఆత్మగౌరవాన్ని చంపుకోవాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. ఆదివారం ఇక్కడ జరిగిన సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ అత్యవసర సమావేశంలో సుధాకర్‌రెడ్డి మాట్లాడారు. మన పార్టీయే ప్రజా కూటమిని ప్రతిపాదించి ప్రజల్లో మన్నన పొందిందని, ఈ సమయంలో సంయమనం పాటించి రెండ్రోజుల్లో సీట్లపై అవగాహనకు రావాలని పార్టీ నేతలకు సూచించారు. కేంద్రంలో అన్ని ప్రతిపక్ష పార్టీలను ఒకతాటి మీదకు తీసుకురావడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నా ఇంకా చాలా సమయం ఉందన్నారు. ఏమైనా కేంద్రంలో మోదీ ప్రభుత్వాన్ని గద్దెదిం చాల్సిన అవసరముందన్నారు. తక్కువ అంచనా వేయొద్దు: చాడ సీట్ల పంపకాల విషయంలో కాంగ్రెస్ ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరించడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. గడీల పాలన అంతమొందించడానికి కలిసి పోటీ చేయాలన్న భావనతో వేచి చూస్తున్నామని, అంత మాత్రాన సీపీఐని తక్కువ అంచనా వేయొద్దన్నారు. ఇంకా ఒకట్రెండు రోజుల్లో సీట్ల పంపకం ఒక కొలిక్కి వస్తుందని ఆశిస్తున్నామన్నారు. లేకుంటే తాము తదుపరి కార్యక్రమం నిర్ణయించుకోవాల్సి ఉంటుందని చాడ తేల్చి చెప్పారు. సమావేశంలో నాయకులు పల్లా వెంకటరెడ్డి, కె.సాంబశివరావు, అజీజ్‌పాషా, గుండా మల్లేశ్, పశ్య పద్మ, నరసింహ పాల్గొన్నారు. -
సురవరం సుధాకర్‌రెడ్డిని కలిసిన వైఎస్సార్ సీపీ బృందం
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసుని రాష్ట్ర ప్రభుత్వం తప్పుదారి పట్టించడంపై ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఈ ఘటనపై కేంద్ర దర్యాప్తు సంస్థలచే విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ వెళ్లిన వైఎస్సార్ సీపీ బృందం అక్కడ పలువురు నేతలను కలిసి వైఎస్ జగన్‌పై హత్యాయత్నం జరిగిన తీరును వారి దృష్టికి తీసుకువెళుతుంది. సోమవారం ఉదయం కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసిన వైఎస్సార్ సీపీ నాయకులు ఈ ఘటనపై కేంద్ర దర్యాప్తు సంస్థల చేత విచారణ జరిపించాల్సిందిగా కోరారు. అంతేకాకుండా ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించిన తీరును కూడా హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అలాగే కేసును తప్పుదోవ పట్టించేలా డీజీపీ ఆర్పీ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలను కూడా వారు రాజ్‌నాథ్ సింగ్‌కు వివరించారు. సురవరంను కలిసిన వైఎస్సార్ సీపీ బృందం అలాగే సాయంత్రం వైఎస్సార్ సీపీ నాయకులు సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డిని కలిశారు. వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నం ఘటనను వైఎస్సార్ సీపీ నేతలు ఆయనకు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసును ఏ విధంగా తప్పుదారి పట్టిస్తుందో కూడా ఆయనకు తెలిపారు. ఆయనను కలిసిన వారిలో వైఎస్సార్ సీపీ నాయకులు వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి, మిథున్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డి, బొత్స సత్యనారాయణ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వరప్రసాద్ ఉన్నారు. -
అది ఆత్మహత్యా సదృశమే!
సాక్షి, హైదరాబాద్: ‘మహా కూటమిలో చేరతామన్నందుకు.. సీపీఐకి రెండు, మూడు సీట్లా? అక్కర్లేదు. వారి ప్రతిపాదనకు ఒప్పుకుంటే.. అది పార్టీకి ఆత్మహత్యా సదృశమే. అవసరమనుకుంటే సొంతంగానే పోటీ చేద్దాం’ అని సీపీఐ తెలంగాణ నిర్ణయించింది. సీపీఐ రాష్ట్ర కార్యవర్గం ఆదివారం మగ్దూం భవన్లో అత్యవసరంగా భేటీ అయింది. ఈ సందర్భంగా మహాకూటమిలో.. సీపీఐకి 2–3 సీట్లు ఇస్తామన్న కాంగ్రెస్ ప్రతిపాదనపై సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇంత తక్కువ సీట్లు ఆఫర్ చేస్తే తిరస్కరించాలని మెజార్టీ సభ్యులు డిమాండ్ చేశారు. అవసరమైతే ఒంటరిగానే పోటీ చేయాలని సూచించారు. దీంతో ముఖ్యనేతలకు ఏం చేయాలో అర్థంగాని పరిస్థితి ఎదురైంది. కూనంనేని సాంబశిరావు అయితే సమావేశం మధ్యలోనుంచే అలిగి వెళ్లిపోయినట్లు సమాచారం. కాగా, కార్యవర్గంలోని సభ్యుల డిమాండ్‌తో సీపీఐ నేతలు సురవరం సుధాకర్‌రెడ్డి, చాడ వెంకటరెడ్డి కూడా ఏకీభవించారు. కాగా, తానేమీ అలిగి వెళ్లిపోలేదని సాంబశివరావు స్పష్టం చేశారు. అనంతరం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. సీట్ల కేటాయింపు విషయంలో అవగాహన లేకుండా నిర్ణయాలు తీసుకోమన్నారు. కాంగ్రెస్ ఇస్తానంటున్న రెండు, మూడు సీట్లకు అంగీకరిస్తే.. అది పార్టీకి ఆత్మహత్య లాంటిదేనన్నారు. అంతటి దారుణమైన స్థితిని పార్టీకి కల్పించబోమన్నారు. అవసరమైతే ఒంటరిగా పోటీ చేసేం దుకూ వెనుకాడబోమన్నారు. రాఫెల్ వివాదంపై జాతీయ వామపక్ష పార్టీలు, ప్రతిపక్ష పార్టీలతో కలిసి ఈనెల 24న ఢిల్లీలో సమావేశం కానున్నట్లు సురవరం వెల్లడించారు. సైకిల్ కూడా తయారు చేయలేని అనిల్ అంబానీకి యుద్ధ విమానాల తయారీని ఎలా అప్పగిస్తారని ప్రశ్నించారు. రాజస్తాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో పొత్తులపై ఇప్పటివరకు ఏ పార్టీతోనూ అవగాహన కుదరలేదన్నారు. సీట్ల సర్దుబాటు విషయా న్ని కాంగ్రెస్ పార్టీ తొందరగా తేల్చాలని.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. ‘మాకు 9 స్థానాలు ఇవ్వాలని కాంగ్రెస్‌కు తెలిపాం. మహా కూటమితోనే ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాం కాబట్టి.. అందులో ఒకటో, రెండో సీట్లు తగ్గిస్తే పర్వాలేదు. కానీ అంతకన్నా ఎక్కువగా తగ్గిస్తామంటే ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పుకోం. దీనిపై మరోసారి కాంగ్రెస్ నేతలను సంప్రదిస్తాం’ అని ఆయన వెల్లడించారు. -
బాబువన్నీ అవకాశవాద విధానాలే
సాక్షి, అమరావతి: నాలుగేళ్లు బీజేపీతో అంటకాగిన చంద్రబాబు రాష్ట్రానికి ఎందుకు ప్రత్యేక హోదా సాధించలేకపోయారని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ప్రశ్నించారు. ప్రజాగ్రహం పెరగడంతో బీజేపీపై నెపం నెట్టి ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి పోరాడుతున్నట్టు చంద్రబాబు బిల్డప్ ఇస్తున్నారని సురవరం ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రాజకీయ ప్రత్యామ్నాయం కోసం ఉభయ కమ్యూనిస్టు పార్టీలు విజయవాడలో శనివారం ‘మహాగర్జన’ బహిరంగ సభ నిర్వహించాయి. సభలో సురవరం మాట్లాడుతూ చంద్రబాబువి మొదటి నుంచి అవకాశ విధానాలేనన్నారు. నాలుగేళ్లుగా నిరుద్యోగభృతి గురించి పట్టించుకోని బాబు మరో ఆరు నెలల్లో ఎన్నికలు వస్తుండటంతో ఇప్పుడు యువనేస్తం ప్రారంభించి ఏదో చేస్తున్నట్టు ప్రచారం చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. రాయలసీమలో కరువును జయించినట్టు చెబుతున్న చంద్రబాబు నీటి బొట్టును ఒడిసిపట్టడం మర్చిపోయి రాష్ట్రం అంతటా ఇసుక రేణువులను ఒడిసిపట్టి పెద్దఎత్తున అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఏపీ రాజకీయ చరిత్రలో ఈ మహాగర్జన నూతన అధ్యాయాన్ని సృష్టించాలని అభిలాషించారు. మతతత్వ బీజేపీ, ఆర్ఎస్ఎస్ శక్తులకు వ్యతిరేకంగా పోరాటాలను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్ మాట్లాడుతూ మోదీపై చంద్రబాబు లాలూచీ కుస్తీ నాటకం ఆడుతున్నారని ఆరోపించారు. ఏపీలో చంద్రబాబు తమ్ముడు అయితే ఆయనకు ఢిల్లీలో మోదీ పెద్దన్న అని, వారిద్దరు ఒకే విధానాలు అమలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబును ఏమాత్రం నమ్మొద్దని, మోదీకి వ్యతిరేకంగా ఆయనకు పోరాడే శక్తిలేదని చెప్పారు. దేశంలో ప్రజల జేబులు కొట్టే ప్రభుత్వం, దొంగల ప్రభుత్వం దిగిపోవాలంటే వామపక్ష శక్తులు మరింత బలపడాలన్నారు. దేశాన్ని రక్షిద్దాం, మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించుతాం అనే అజెండాతో ముందుకుసాగాలన్నారు. ‘మోదీ పోవాలి.. బాబు పోవాలి’ అనే ఒకే ఒక నినాదంతో వామపక్ష లౌకిక శక్తులు ముందుకు సాగాలని కోరారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో మాఫియాల రాజ్యం, రౌడీరాజ్యం నడుస్తోందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పరిశ్రమలు మూతపడుతున్నాయని, ఉద్యోగాలు ఇవ్వకుండా యువతను చంద్రబాబు ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ అబద్ధాలతో రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబు రాష్ట్రాన్ని అవినీతి, లంచగొండి రాజ్యంగా మార్చేశారని ధ్వజమెత్తారు. సభలో జనసేన రాష్ట్ర కన్వీనర్ చింతల పార్థసారధి, వీసీకే పార్టీ జాతీయ అధ్యక్షుడు తిరుమావలవన్, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి బి.బంగారావ్, పార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర కార్యదర్శి పీవీ సుందరరామరాజు, లోక్‌సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ, ఎంసీపీఐ(యు) రాష్ట్ర సహాయ కార్యదర్శి తుమాటి శివయ్య, అమ్ఆద్మీ రాష్ట్ర కన్వీనర్ పోతిన వెంకటరామారావు, సీపీఎం భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎంఏ గఫూర్, పలువురు వామపక్ష పార్టీల రాష్ట్ర నాయకులు మాట్లాడారు. ఎరుపెక్కిన బెజవాడ.. విజయవాడలో నిర్వహించిన వామపక్ష మహాగర్జనకు రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ఎర్ర దళంతో బెజవాడ ఎరుపెక్కింది. రైల్వే స్టేషన్ నుంచి సీపీఐ ఆధ్వర్యంలో ఒక ర్యాలీ, రామవరప్పాడు నుంచి సీపీఎం ఆధ్వర్యంలో మరో ర్యాలీ, బీఆర్టీఎస్ రోడ్డులోని సభా ప్రాంగణానికి చేరుకున్నాయి. ఎర్ర జెండాలు, ఎర్ర చొక్కాలతో కవాతు నిర్వహించడంతో ఆ ప్రాంతం అంతా ఎరుపుమయం అయ్యింది. ప్రజానాట్యమండలి కళాకారులు అభ్యుదల గీతాలతోపాటు నృత్యప్రదర్శలు ఇచ్చారు. -
కేసీఆర్‌ది కుటుంబ క్యాబినేట్.
-
కేసీఆర్ తీరు చూస్తుంటే శోభనం గది నుంచి..
ఢిల్లీ: ప్రతిపక్ష నేతలను సన్నాసులు, దద్దమ్మలు అంటూ నీచంగా మాట్లాడే కుసంస్కారి కేసీఆర్ అని అని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఢిల్లీలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణతో కలిసి సురవరం విలేకరులతో మాట్లాడుతూ.. ‘ఎన్నికల కమిషన్‌ను నిర్దేశించేలా కేసీఆర్ ప్రకటనలు చేస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్‌ని కేసీఆర్ ప్రకటిస్తున్నారు. స్వతంత్ర రాజ్యాంగ సంస్థ అయిన ఎన్నికల కమిషన్‌ను ప్రభావితం చేసేలా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల తేదీలను కేసీఆర్ ప్రకటించడంపై మేం ఎన్నికల ప్రధానాధికారి దృష్టికి తీసుకొచ్చాం. దీనిపై తగిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. కేసీఆర్‌ది కుటుంబ క్యాబినేట్. చర్చ లేకుండా రెండు నిమిషాల్లో అసెంబ్లీకి రద్దు చేస్తూ క్యాబినేట్ తీర్మానం చేశారు. ఏక వ్యక్తి పార్టీ. పార్టీ పొలిట్‌బ్యూరోతో సంబంధం లేకుండా 105 మంది అభ్యర్థుల పేర్లు విడుదల చేశారు’ అని సురవరం విమర్శించారు . నారాయణ మాట్లాడుతూ..కేసీఆర్ లక్ష్మణ రేఖ దాటారని విమర్శించారు. కేసీఆర్ వ్యవహార శైలిపై ఎన్నికల కమిషన్ ప్రధానాధికారి విచారం వ్యక్తం చేశారని వెల్లడించారు. కేసీఆర్ తీరు చూస్తుంటే శోభనం గది నుంచి మధ్య రాత్రి పారిపోయిన పెళ్లి కొడుకు మాదిరిగా ఉందని ఎద్దేవా చేశారు. ఇప్పుడు తనకు మళ్లీ పెళ్లి చేయండి..సత్తా చాటుతా అన్నట్లు ముందస్తు ఎన్నికల కోసం హడావుడి చేస్తున్నారని మండిపడ్డారు. -
220 మంది మృతి.. జర్నలిస్ట్‌లను కాపాడండి..!
సాక్షి, న్యూఢిల్లీ : గతకొంత కాలంగా తెలంగాణలో జరుగుతున్న జర్నలిస్ట్‌ల మరణాలపై ఢిల్లీలో టీయూడబ్య్లూజే ధర్నాను నిర్వహించింది. ‘జర్నలిస్ట్‌లను కాపాడండి’ అంటూ ఢిల్లీ పార్లమెంట్ స్ట్రీట్‌లో జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమానికి వామపక్ష పార్టీల నేతలు.. సురవరం సుధాకర్ రెడ్డి, సీతారా ఏచూరి, డీ రాజా హాజరై సంఘీభావం తెలిపారు. ఎన్‌యూజే నేత రాజ్ బిహారీ, ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు పెంటపాటి పుల్లారావు, ఐజేయూ సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్, ఐజేయూ నేత శ్రీనివాస్ రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో గత నాలుగేళ్ల కాలంలో మరణించిన 220 మంది జర్నలిస్టులపై పుస్తకాన్ని విడుదల చేశారు. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైన జర్నలిజాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిదని, ఇంత పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు ఏ రాష్ట్రంలో కూడా మరణించలేదని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వ్యాఖ్యానించారు. జర్నలిజం కత్తిమీద సాములాంటి వృత్తని.. జర్నలిస్ట్‌ల సమస్యలను కారుణ్య దృష్టితో చూడొద్దని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. జర్నలిస్ట్‌ల సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని.. అందుకే 31 జిల్లాల జర్నలిస్టులు వచ్చి ఢిల్లీలో ధర్నా చేపట్టారని ఐజేయూ సెక్రటరీ జనరల్ అమర్ విమర్శించారు. తెలంగాణలో చనిపోయిన 220 మంది జర్నలిస్టులవి అసహజ మరణాలని, శ్రమ దోపిడి కారణంగానే వారు చనిపోయారని అన్నారు. కేసీఆర్ ఎవరితో మాట్లాడకుండా ఓ గడీని నిర్మించుకున్నారని, తెలంగాణలో నిరసన తెలిపే అవకాశం లేకుండా ధర్నాచౌక్‌ను ఎత్తివేశారని ఆయన మండిపడ్డారు. వందలాది జర్నలిస్టులు చనిపోయినా ప్రభుత్వంలో చలనం లేదని.. వారికి తగిన గుణపాఠం చెప్పాలని ఐజేయూ నేత శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. -
యూఏఈ ఆఫర్ తిరస్కరణ: రూ.2600 కోట్లు ఇవ్వండి
హైదరాబాద్ : భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయిన కేరళను ఆదుకునేందుకు రూ.700 కోట్ల ఆర్థిక సహాయంతో ముందుకొచ్చిన యూఏఈ ఆఫర్‌ను కేంద్రం తిరస్కరించడంపై పలువురు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు కేంద్రం రూ.700 కోట్ల యూఏఈ ఆఫర్‌ను తిరస్కరించడంతో, తాత్కాలిక సహాయం కింద వెనువెంటనే కేరళకు రూ.2600 కోట్లను ప్రకటించాలని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా(సీపీఐ) డిమాండ్ చేసింది. ప్రకృతి వైపరీత్యాల సమయాల్లో విదేశీ సాయం విషయంలో కేంద్రం తప్పుడు ప్రతిష్టపై నిలబడి ఈ ఆఫర్‌ను తిరస్కరిస్తుందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి ఆరోపించారు. నిజంగా దేశ ప్రతిష్టను నిలబెట్టుకోవాలని మోదీ ప్రభుత్వం కోరుకుంటే ఎమిరేట్స్ కన్నా ఎక్కువగా, కేరళ కోరినంత రూ.2600 కోట్ల ఆర్థిక సహాయాన్ని స్వయంగా ప్రకటించాలని కోరారు. ఒక దేశం ప్రకృతి విపత్తు భారీన పడినప్పుడు, ఇతర దేశాలు సహాయం చేయడం సర్వసాధారణమని.. భారత్ కూడా గతంలో ఇలాంటి సమయాల్లో నేపాల్, బంగ్లాదేశ్‌లకు సహకరించిందని పేర్కొన్నారు. భూకంపం వచ్చినప్పుడు దాయాది దేశం పాకిస్తాన్‌కు కూడా భారత్ సాయం చేసిందని చెప్పారు. అలాంటి సమయాల్లో యూఎన్ఓ, యూఏఈల ఆఫర్లను మనం అంగీకరించవచ్చని.. ఎలాంటి షరతులు లేకుండా యూఏఈ రూ.700 కోట్లను ఆర్థిక సహాయాన్ని అందిస్తుందని.. దీన్ని మనం అంగీకరించవచ్చని తెలిపారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో విదేశాల నుంచే వచ్చే సహాయం విషయంలో.. ముందటి యూపీఏ ప్రభుత్వ పాలసీనే కేంద్రం అనుసరిస్తుందని అనధికారికంగా ఎన్డీఏ ప్రభుత్వం చెప్పేసిందని చెప్పారు. యూపీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా లాంటి చాలా మంచి నిర్ణయాలను కూడా తీసుకుంది.. మరిదాన్ని కేంద్రం ఎందుకు ఇవ్వడం లేదని సురవరం సుధాకర్ రెడ్డి ప్రశ్నించారు. కనీసం కేరళ ప్రభుత్వం అడిగిన మేర సాయం చేసేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదని విమర్శించారు. వరదల్లో నష్టపోయిన రూ.20 వేల కోట్ల మొత్తాన్ని కేరళ అడగడం లేదని.. కేవలం రూ.2600 కోట్ల సాయాన్ని మాత్రమే ఆర్థిస్తుందని చెప్పారు. యూఏఈ ఆఫర్‌ను తిరస్కరిస్తే.. కేరళకు కచ్చితంగా రూ.2600 కోట్లు ఇవ్వాల్సిందేనని.. భారత్ మాత్రమే ఈ సమస్యలను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉందని చెప్పాలని డిమాండ్ చేశారు. -
‘కరుణానిధికి భారతరత్న ఇవ్వాలి’
-
‘మేము ఎప్పటికీ డీఎంకేతోనే ఉంటాం’
సాక్షి, చెన్నై : డీఎంకే అధినేత దివంగత కరుణానిధికి సీపీఐ ఘన నివాళులర్పించింది. ఈ సందర్భంగా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి, జాతీయ కార్యదర్శి నారాయణ సోమవారం చెన్నైలోని గోపాలపురం నివాసంలో కరుణానిధి చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా సురవరం సుధాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కరుణానిధి పెద్ద హేతువాది అయినా కూడా తమిళ ప్రజల సంక్షేమానికి శ్రమించిన మహానాయకుడని గుర్తు చేశారు. ఆయన మృతి తమిళనాడుకు తీరనిలోటన్నారు. సీపీఐ ఎప్పుడూ డీఎంకేతోనే కొనసాగుతుందని స్పష్టం చేశారు. కరుణానిధికి భారతరత్న ఇవ్వాలనే డీఎంకే డిమాండ్ న్యాయబద్దమైనదేనని తెలిపారు. ఈ డిమాండ్‌కు సీపీఐ పూర్తి మద్దతిస్తుందని సురవరం తెలిపారు. కరుణానిధి 80 ఏళ్ల పాటు రాజకీయాల్లో కొనసాగారు. ఐదుసార్లు ముఖ్యమంత్రిగా, 14 మంది ప్రధానులను చూసిన రాజకీయ నేతగా కరుణానిధి దేశంలోనే అత్యంత సీనియర్ రాజకీయవేత్త అని కొనియాడారు. -
మోదీ మనసులో దళితులు లేరు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మనసులో దళితులు, గిరిజనులు, మైనారిటీలకు స్థానం లేదని, ఆయన ప్రభుత్వానివి దళిత వ్యతిరేక విధానాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని రాజ్యాంగం తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ చట్ట పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఢిల్లీలో రెండో రోజు జరిగిన ‘సింహగర్జన’ ధర్నాలో రాహుల్ పాల్గొన్నారు. సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని 9వ షెడ్యూల్లో చేర్చాలంటూ జరిగే పోరాటానికి తమ మద్దతు ఉంటుందన్నారు. బీజేపీ ఉద్దేశపూర్వకంగానే దళితులపై దాడులను ప్రోత్సహిస్తూ, చట్టాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తోందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. చట్ట పరిరక్షణ సమితి అధ్యక్షుడు మంద కృష్ణ మాట్లాడుతూ.. దళితులకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను బీజేపీ నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని 9వ షెడ్యూల్లో చేర్చినప్పుడే పూర్తి భద్రత ఏర్పడుతుందన్నారు. అన్ని రాష్ట్రాల్లో కొన్ని కులాల మధ్య అసమానతలు ఉన్నాయని, అలాగే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై కాంగ్రెస్ వైఖరేంటో తెలపాలని రాహుల్‌ను మంద కృష్ణ కోరారు. ఈ ధర్నాలో సమితి కన్వీనర్లు జేబీ రాజు, బెల్లయ్య నాయక్, అద్దంకి దయాకర్ సహా పలు రాష్ట్రాల దళిత సంఘాల నేతలు పాల్గొన్నారు. -
మోదీది దళిత వ్యతిరేక ప్రభుత్వం: సురవరం
సాక్షి, న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ చట్ట పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో బుధవారం ఢిల్లీలోని పార్లమెంటు సమీపంలో సింహగర్జన దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు పలు పార్టీల నేతలు సహా, రాష్ట్రాల నుంచి దళిత సంఘా ల నేతలు హాజరయ్యారు. దీక్షలో పాల్గొన్న సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దళిత వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని, అంటరానితనాన్ని బలపరుస్తోందని మండిపడ్డారు. గోరక్ష పేరు తో హింసను ప్రేరేపిస్తున్న బీజేపీ, దళితుల సంక్షేమా న్ని పట్టించుకోవడం లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని 9వ షెడ్యూల్లో చేర్చి పరిరక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. దీక్షలో పాల్గొన్న తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొ.కోదండరాం మాట్లాడుతూ..ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని అమలు చేయడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని షెడ్యూ ల్ 9లో చేర్చాలని చేస్తున్న డిమాండ్‌కు తమ మద్దతు ఉంటుందన్నారు. దీక్షను గురువారం కూడా నిర్వహించనున్నట్టు సమితి చైర్మన్ మందకృష్ణ తెలిపారు. సమితి కన్వీనర్లు అద్దంకి దయాకర్, జె.బి.రాజు, జి. చెన్నయ్య, బెల్లయ్య నాయక్ తదితరులు దీక్షలో పాల్గొన్నారు. -
ఏపీకి నష్టం జరిగింది..హోదా ఇవ్వాల్సిందే
-
ఆందోళనలో చంద్రబాబు: సురవరం
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ వైఎస్సార్సీపీ చేపట్టిన బంద్‌లో పాల్గొంటున్న ఆ పార్టీ శ్రేణులను టీడీపీ ప్రభుత్వం పోలీసుల చేత అరెస్ట్ చేయించడాన్ని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి తప్పుపట్టారు. ఢిల్లీలో సాక్షి టీవీతో మాట్లాడుతూ.. గతంలోనూ ప్రత్యేక హోదాపై నిర్వహించిన బంద్‌లను టీడీపీ వ్యతిరేకించిందని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా వైఎస్సార్ కాంగ్రెస్ ఇచ్చిన బంద్‌లను అడ్డుకుంటోందని విమర్శించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బంద్‌ను అణచివేయకూడదని, అరెస్ట్‌లు చేయకూడదన్నారు. గతంలో ప్రత్యేక ప్యాకేజీ వస్తే చాలని చంద్రబాబు రాష్ట్ర ప్రజలను ఒప్పించే ప్రయత్నం చేశారని, కానీ ఎన్నికలు వస్తున్నాయని గ్రహించి ప్రత్యేక హోదాపై ప్రజల్లో ఉన్న తీవ్రమైన డిమాండ్‌ను చూసి చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని ఆరోపించారు. ప్రత్యేక హోదాపై వైఎస్సార్ కాంగ్రెస్, వామపక్షాల నిరంతర ఆందోళనతో ప్రజా మద్ధతు పెరుగుతోందని.. దీంతో చంద్రబాబు ఆందోళనలో పడ్డారని అన్నారు. రాజీనామాలు ఆయా పార్టీల సొంత నిర్ణయమని వ్యాఖ్యానించారు. అవిశ్వాస తీర్మానంపై చర్చలో వైఎస్సార్ సీపీ ఉంటే మరింత బాగుండేదన్నారు. ప్రధానమంత్రి జవాబు అసంతృప్తికరంగా ఉందని, ఏపీపై సానుకూలత ఆయన ప్రసంగంలో వ్యక్తం కాలేదని.. అన్యాయాన్ని సరిదిద్దే ప్రయత్నం చేయలేదని విమర్శించారు. రాష్ట్ర విభజన మోదీకి ఇష్టం లేనట్లు తెలుస్తోందని, విభజనలో ఆంధ్రప్రదేశ్‌కు నష్టం జరిగింది.. ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. పార్లమెంటులో చేసిన వాగ్దానాన్ని నెరవేర్చాలన్నారు. ప్రతిపక్షాల మద్దుతు కూడగట్టి పోరాటం చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబుదేనని వివరించారు. ఏపీలో నూటికి 90 మంది ప్రత్యేక కోరుకుంటున్నారని వెల్లడించారు. చంద్రబాబు ఎన్నికల్లో ఓట్ల కోసం ఇప్పుడు మళ్లీ ప్రత్యేక హోదా అంటున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదా సంజీవని కాదన్నదీ బాబే.. హోదాపై యూటర్న్ తీసుకున్నదీ బాబేనని చెప్పారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని ప్రధాని మోదీ లోక్‌సభలో అన్న మాట నిజమేనని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని నీరుగార్చింది చంద్రబాబే కాబట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరినీ కలుపుకుని పోరాటం చేయాలని చంద్రబాబుకు సూచించారు. -
బీజేపీ మతోన్మాదాన్ని పెంచుతోంది
సాక్షి, నల్లగొండ: కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మతోన్మాదాన్ని పెంచి పోషిస్తోందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి అన్నారు. గుజరాత్లో నరేంద్రమోదీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మైనార్టీలపై విపరీతమైన దాడులు, ఊచకోతలు జరిగాయని, ప్రస్తుతం గో రక్షణ పేరుతో దళితులపై, ముస్లింలపై దాడులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. దేవరకొండ నియోజకవర్గ సీపీఐ జనరల్ బాడీ సమావేశంలో సురవరం సుధాకరరెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఆరెస్సెస్, సంఘ్ పరివార్ ఆగడాలు ఎక్కువయ్యాయని, దళిత, మైనార్టీలపై దాడులు చేసి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకొచ్చాక పెట్రోలు, డీజిల్ ధరలు 17 సార్లు ధరలు పెంచారని దుయ్యబట్టారు. పెద్దనోట్లను రద్దుచేసి ప్రజలకు ఇబ్బందులకు గురిచేశారని అన్నారు. నోట్ల రద్దుతో చిల్లర వ్యాపారాలు కనుమారుగయ్యాయన్నారు. గ్రామ పంచాయతీ స్థాయి నుంచి సీపీఐని బలోపేతం దిశగా పయనించి, ప్రజాపోరాటాలు చేయాలని ఆయన పార్టీ శ్రేణులకు సూచించారు. వామపక్ష పార్టీలు కలిసి ఐక్య ఉద్యమాలు, వర్గ పోరాటాలు చెయ్యాలన్నారు. సీపీఐ గ్రామస్థాయి నుంచి పుంజుకుంటోందని, వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో, రాష్ట్రంలో సీపీఐని అధికారంలోకి తేవడానికి కృషి చేస్తామని తెలిపారు. -
నాలుగేళ్ల పాలనలో ఎన్డీఏ విఫలం
అనంతపురం న్యూసిటీ: కేంద్రంలో నాలుగేళ్ల పాలనలో ఆర్థిక, సాంఘిక తదితర అన్ని రంగాల్లో బీజేపీ ఘోరంగా విఫలమైందని ఉభయ కమ్యూనిస్టు పార్టీల నేతలు విరుచుకుపడ్డారు. సోమవారం అనంతపురంలో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీతారాం ఏచూరి మాట్లాడుతూ దేశ ప్రగతి కోసం ప్రధాని మోదీ ప్రభుత్వాన్ని దించడానికే వచ్చే ఎన్నికల్లో అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. తాము అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్ సాక్షిగా చెప్పి కూడా అమలు చేయడంలో బీజేపీ విఫలమైందన్నారు. ఎన్నికల్లో ఓడిపోయినా తామే ప్రభుత్వం నడపాలని బీజేపీ యత్నిస్తోందని, అందుకు గోవా, మణిపూర్ ఎన్నికల్లే నిదర్శనమన్నారు. ఈ అనైతిక విధానాన్ని తిప్పికొట్టేందుకు కర్ణాటక ఎన్నికల అనంతరం బీజేపీయేతర పార్టీలు ఒకే వేదికపై కలిశాయన్నారు. సురవరం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ పాలనలో కేంద్ర, రాష్ట్ర సంబంధాలు ఎన్నడూలేని విధంగా దెబ్బతిన్నాయన్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ప్రభావం చూపాయన్నారు. నల్లధనం విదేశాల్లో నుంచి తీసుకొచ్చి ప్రతి కుటుంబానికి రూ.15 లక్షలు ఇస్తామన్న ప్రధాని మోదీ పూర్తిగా విఫలమయ్యారన్నారు. ఇటీవల స్విస్ బ్యాంకులో రూ.7 వేల కోట్ల భారతీయుల సంపద జమయ్యిందని, ఈ డబ్బు బ్యాంకుల్లో వేసుకోవడానికి రిజర్వ్ బ్యాంకు ఏవిధంగా అనుమతిచ్చిందో చెప్పాలన్నారు. నాలుగేళ్ల ఎన్డీఏ దుష్పరిపాలనపై ఆగస్టు 1 నుంచి 14 వరకు దేశ వ్యాప్త ప్రచారానికి సీపీఐ శ్రీకారం చుట్టనుందన్నారు. బీజేపీ ముందస్తు ఎన్నికలు చేపట్టాలని ప్రచారం చేస్తోందని, ఇది ప్రజాస్వామ్య హక్కులకు నష్టం అని అన్నారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సీపీఎం జిల్లా కార్యదర్శి జగదీష్, సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ తదితరులు పాల్గొన్నారు. -
బీజేపీది నియంత పాలన : సురవరం
మునుగోడు : ప్రశ్నించే గొంతుకలను అణచివేస్తూ బీజేపీ ప్రభుత్వం నియంతపాలన సాగిస్తోందని సీపీఐ పార్టీ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం మునుగోడులోని సత్య పంక్షన్‌హల్‌లో నిర్వహించిన ఆ పార్టీ నియోజకవర్గస్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చిన ప్రధాని మోదీ వాటిలో ఏ ఒక్కటి అమలు చేయకుండా కేవలం తన పార్టీ అభివృద్ధి, ప్రతిపక్ష పార్టీల అణచివేతకు మాత్రమే పదవిని వినియోగించుకుంటున్నాడన్నారు. దేశంలోని ప్రజల బాగోగులు విమస్మిరించి పారిశ్రామిక వేత్తలకు, పెట్టుబడి దారులకు కొమ్ముకాస్తూ 17 మార్లు పెట్రోల్, డిజీల్ ధరలు పెంచారని విమర్శించారు. రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మా ట్లాడుతూ అనేక త్యాగాలు చేసి తెలంగాణ ప్రజ లు రాష్ట్రం సాధిస్తే, భోగాలు మాత్రం సీఎం కేసీ ఆర్ కుటుంబం అనుభవిస్తోందన్నారు. తాను అధి కారంలోకి వస్తేఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పిన సీఎం, కనీసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఖాళీ ఉద్యోగాలు భర్తీ చేయకపొవడం సిగ్గుచేటన్నారు. రా ష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళణతో రెవెన్యూ అధికారులకు కాసుల వర్షం కురిపిస్తోం దని ఆరోపించారు. ఆ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి నెల్లికంటి సత్యం అధ్యక్షతన జరిగిన ఈ సభలో రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు, కార్యవర్గ సభ్యుడు ఉజ్జిని రత్నాకరావు, నల్లగొండ జిల్లా కార్యదర్శి పల్లానర్సింహారెడ్డి, మందడి నర్సిం హారెడ్డి, కె. లింగయ్య, సురిగి చలపతి, ఎన్.రామలింగయ్య, గుండెబోయిన రమేష్, కళ్లెంయాదగిరి, గుర్జ రామచంద్రం, బరిగెల వెంకటేష్, అం జయచారి, తిరిపారి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
ప్రజలను పీడిస్తున్న మోదీ: సురవరం
సాక్షి, హైదరాబాద్: బీజేపీ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల నుంచి దేశ ప్రజలను ప్రధాని నరేంద్ర మోదీ ఆర్థికంగా పీడిస్తున్నారని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, సహాయ కార్యదర్శులు పల్లా వెంకటరెడ్డి, అజీజ్ పాషాతో కలసి గురువారం ఇక్కడి మఖ్దూంభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నాలుగేళ్లల్లో ప్రజలను పీడించి రూ.2 లక్షల కోట్ల పన్నులు వసూలు చేశారని ఆరోపించారు. ప్రజలకు అవసరమైన, ముఖ్యమైన సంక్షేమ రంగాల్లో మాత్రం కేంద్రం కోత విధించిందని విమర్శించారు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత కోటీశ్వరుల చేతిలో జాతీయ సంపద 85 శాతం పెరిగిందని, ధనికులకు మాత్రమే అచ్ఛేదిన్ వచ్చిందన్నారు. బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు, ఆ పార్టీ ముఖ్యమంత్రులపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వచ్చినా విచారణ చేయడానికి కేంద్రం ముందుకు రావడంలేదన్నారు. నీరవ్ మోదీ, విజయ్ మాల్యా వంటి అక్రమార్కులకు కొమ్ముకాస్తున్నదన్నారు. ఎయిర్ క్రాఫ్ట్ కొనుగోళ్లలో అవినీతిపై విచారణను మోదీ ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందన్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ వల్ల దేశంలో ఆర్థిక వ్యవస్థ కుదేలైందన్నారు. ఆగస్టు 1 నుంచి దేశవ్యాప్త ఆందోళనలు దేశంలో వివిధ వర్గాలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ఆగస్టు 1 నుంచి 14 వరకు దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చినట్టు సురవరం వెల్లడించారు. నిత్యావసర ధరల పెరుగుదలపై 20న నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్‌పై దేశంలోని ఏ ప్రాంతీయ పార్టీ ఆసక్తి చూపడం లేదని, మమతాబెనర్జీ(పశ్చిమ బెంగాల్), అఖిలేష్ యాదవ్(ఉత్తరప్రదేశ్), స్టాలిన్(తమిళనాడు), హేమంత్ సోరేన్(జార్ఖండ్) వంటి వారంతా కాంగ్రెస్‌తోనే ఉంటున్నట్టుగా ప్రకటన చేశా రని సురవరం చెప్పారు. ఒక రాష్ట్రానికి సీఎం అని కేసీఆర్‌తో మాట్లాడితే, రాజకీయంగా తన అభిప్రాయంతో ఏకీభవిస్తున్నట్టుగా ప్రచారం చేసు కుంటున్నారని వ్యాఖ్యానించారు. ఆ ఫ్రంట్‌లో కేసీఆర్ మినహా ఎవరూ లేరని, ఉండరని అన్నారు. దేశ వ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక ఓట్లను, కూటమిని బల హీనపర్చడానికే కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ ఫ్రంట్ బీజేపీకీ అనుకూలంగా, బీ–టీమ్‌గా పనిచేస్తున్నదని సురవరం ఆరోపించారు. చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ నాలుగేళ్ల పాలనలో ఉద్యోగ నియామకాలు చేపట్టకుండా మోసం చేశారని విమర్శించారు. రాష్ట్రంలో లక్షకు పైగా ఖాళీలుంటే 26 వేల పోస్టుల్నే భర్తీ చేశారన్నారు. -
‘ముందు మీ పరిధిలో ఉన్న ఎన్నికలు నిర్వహించండి’
సాక్షి, న్యూఢిల్లీ: వైఎస్సార్సీపీ ఎంపీలు ఎన్నికలకు రావాలని సవాల్ విసురుతున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుగా ఆయన పార్టీలో చేర్చుకున్న 23 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ఎన్నికలు నిర్వహించాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి హితవుపలికారు. ఆయన ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్ సీపీ నుంచి పార్టీ ఫిరాయించి టీడీపీ లో చేరిన ఎమ్మెల్యేల సభ్యత్వాలను రద్దు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనే ఉన్నా అది చేయకుండా వైఎస్సార్ సీపీ ఎంపీలు ఎన్నికలకు రావాలని సవాల్ విసరడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఆ ఎమ్మెల్యేలతో ఇప్పటిదాకా రాజీనామాలు ఎందుకు చేయించలేదో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ బీజేపీకి మేలు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపాదించిన ఫెడరల్ ఫ్రంట్ కేంద్రంలోని బీజేపీకి బి టీం లాంటిదని సురవరం విమర్శించారు. జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పాటవుతున్న ప్రతిపక్షాల ఐక్యతను దెబ్బతీసేందుకే కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. -
‘కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ దానికోసమే’
సాక్షి, న్యూఢిల్లీ : ‘సబ్ కా సాథ్ సబ్ కా వికాస్’ నినాదంతో ఊదరగొట్టిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాలుగేళ్ల పాలనలో కార్పొరేట్ శక్తులు మాత్రమే వికాసం చెందాయని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. జాతీయ ప్రజాస్వామ్య కూటమి(ఎన్డీయే) నాలుగు సంవత్సరాల దుష్టపాలనలో రైతులు తీవ్ర అన్యాయానికి గురయ్యారని అన్నారు. పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశ వాసులందరికీ మంచి రోజులు (అచ్చేదిన్) తెస్తామని చెప్పి గద్దెనెక్కిన మోదీ పాలనలో.. వ్యాపార వర్గాలకు మాత్రమే అచ్చేదిన్ వచ్చాయని ధ్వజమెత్తారు. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు విపరీతంగా పెంచి సామాన్యులను ముంచుతున్నారని మండిపడ్డారు. ఇంధన ధరల పెంపునకు వ్యతిరేకంగా సీపీఐ నేతృత్వంలో ఈ నెల 20న దేశవ్యాప్తంగా ఆందోళన చేపడతామన్నారు. మోదీ నాలుగేళ్ల దుష్ట పరిపాలనపై ఆగస్టు 1 నుంచి 14 వరకు దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోరుతూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు చేసిన రాజీనామాలు స్పీకర్ ఎందుకు ఆమోదించడం లేదో అర్థం కావడం లేదన్నారు. వైఎస్సార్ సీసీ ఎంపీల రాజీనామాలను ప్రశ్నించే చంద్రబాబు, తొలుత ఆ పార్టీ నుంచి టీడీపీలోకి వచ్చిన ఎమ్మెల్యేలతో ఎందుకు రాజీనామా చేయించలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. షరతులు లేకుండా వస్తే వైఎస్సార్ సీపీతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమేనని ప్రకటించారు. కేసీఆర్ ప్రతిపాదించిన ఫెడరల్ ఫ్రంట్‌కు దేశ వ్యాప్త ప్రచారం లభించడం లేదన్నారు. మోదీకి వ్యతిరేకంగా ఏర్పాటవుతున్న ప్రతిపక్షాల కూటమిని దెబ్బ కొట్టడానికే కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ భావన తెచ్చారని ఆరోపించారు. -
ఈ వక్రీకరణలు ఎందుకు?
మార్క్స్ 200వ జయంతి నాడు భారత కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి సుధాకర రెడ్డి గారు ఓ వ్యాసం రాశారు. దానిలో ప్రతి వాక్యమూ ఒక ఆణి ముత్యమే. నేనిక్కడ కొన్ని ముత్యాలకే పరిమితమవుతాను. ‘‘సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైన తరువాత’’ సామ్రాజ్యవాదులు అనేక వక్రీకరణలకు పాల్పడ్డారు అంటారు రచయిత. అంతకుముందు మార్క్సిజం వక్రీకరణలకే గురి కాలేదా? వక్రీకరించినవాళ్లంతా సామ్రాజ్యవాదులేనా? కమ్యూనిస్టు పేరు తగిలించుకొన్నవాళ్లు వక్రీకరించనే లేదా? ‘‘మార్క్స్ ప్రతిపాదించిన సిద్ధాంతం వైఫల్యం చెందిందని ... సామ్రాజ్యవాదులు విస్తృత ప్రచారం’’ చేశారంటారు రచయిత. నిజమే. మార్క్సిజం అజేయం అనడానికి సోవియట్ యూనియనే తార్కాణం అని మీరు లక్ష సార్లు చెప్పారు. అందుకే ఆ తార్కాణం కూలిపోగానే మార్క్సిజమే కూలిపోయిందని జనం అనుకొన్నారు. అదే శత్రువులు ప్రచా రం చేశారు. ‘‘సామ్రాజ్యవాదులకు ... విమర్శించే హక్కు లేదు’’ అని ఆయన ఒక ఫర్మానా జారీ చేశారు. అది సరే. కాని విమర్శించేవాళ్లందరూ సామ్రాజ్యవాదులేనా? ఒకరడిగినా అడగకపోయినా వివరణ ఇవ్వాల్సిన బాధ్యత కమ్యూనిస్టు నాయకులకు ఉండనే ఉండదా? తమ సొంత స్పష్టత కోసమైనా పొరపాటు ఎక్కడ జరిగిందో శోధించాల్సిన పనిలేదా? మార్క్స్‌నీ జయాపజయాల చరిత్రనీ క్షుణ్ణంగా అధ్యయనం చేశారా? పోనీ ఆ దిశగా మీరు రెండడుగులయినా వేశారా, చెప్పండి. ‘‘1978 తదనంతరం మావో వారసుడు డెంగ్‌జియావో పింగ్ నాయకత్వంలో అనేక సంస్కరణలను తీసుకురావడం జరిగింది. తత్ఫలితంగా 80 కోట్ల ప్రజలు పేదరికం నుంచి విముక్తి పొందారు.’’ అంటారు సుధాకర్జీ. ప్రపంచంలో నయా ఉదారవాదాన్ని సంస్కరణలనే పేరుతో అధికారికంగా ప్రారంభించిన ముగ్గురిలో థాచర్, రీగన్లతో పాటు డెంగ్ ఒకడు. సుధాకర్జీ, మీరూ మీ పార్టీ సంస్కరణలనబడే వాటిని వ్యతిరేకించారు. అదే పనిచేసిన డెంగ్‌ని ఎలా పొగుడుతారు? ‘‘సోవియట్ ప్రభుత్వం... బ్యాంకులను పరి శ్రమలను జాతీయం చేసి అనేక విజయాలను సాధించింది.’’ అన్నారు సుధాకర్జీ. కాని రష్యాలో చైనాలో జాతీయం చేయడానికీ మార్క్స్ ప్రేరణ, చైనాలో ప్రభుత్వ ఆస్తులను సొంత ఆస్తులుగా మార్చిన డెంగ్కీ మార్క్స్ ప్రేరణ అంటే ఎలా సుధాకర్జీ. ‘‘దక్షిణ అమెరికాలో వెనిజులా బొలీవియా నికరాగువా మరికొన్ని దేశాలు ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య సంస్థల... ఒత్తిడులకు లొంగకుండా స్వంత బ్యాంకులను నిర్మించుకొన్నాయి’’ అన్నారు రచయిత. కాని ఆ దేశాలు బ్యాంక్‌లో ఇంతవరకూ డిపాజిట్లు కట్టనేలేదనీ అసలు పని మొదలే కాలేదనీ ఈ నాయకునికి తెలుసా? ఇంకో ఆణిముత్యం ‘ఈ నేపథ్యంలోనే రష్యాతో సహా అనేక తూర్పు యూరప్ దేశాల్లో కమ్యూనిస్టులు ముందుకు సాగుతూనే ఉన్నారు’. ఏమిటీ, అక్కడ కమ్యూనిస్టులు ముందుకు సాగుతున్నారా ఈ అభినవ రిప్ వాన్ వింకిల్ నిద్ర లేచి ఎంత కాలమైంది? ‘తింటానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు, చేయడానికి ఒక గౌరవప్రదమైన ఉద్యోగం’’ ఇచ్చే సోషలిస్టు సమాజమట! సోషలిజం అంటే ఇదేనా? కార్మికోద్యమ లక్ష్యం వేతన వ్యవస్థని రద్దు చేయడమే అన్న మార్క్స్ ఈ రచయితకు తెలుసా? అంటే ఆ వ్యవస్థలో యజమానీ ఉండడు. కూలీ ఉండడు. పని చేసేవాడే యజమాని. పనిచేసేవాళ్లదే అధికారం. అటువంటి వ్యవస్థ సోవియట్‌లో గాని చైనాలో గాని ఇంక ఎక్కడా గాని ఏర్పడనేలేదు. ఎందుకో సమీక్షించుకోవాల్సిన ‘అధికార’ కమ్యూనిస్టులు మాత్రం గానుగెద్దుని ఆదర్శంగా తీసుకొన్నారు. ఆర్థిక సంక్షోభాలు వచ్చిన ప్రతిసారీ పెట్టుబడిదారీ ప్రపంచంలో దూరం చూడగలిగినవారంతా మార్క్స్‌ని తలుచుకొంటున్నారు. ఉలిక్కిపడుతున్నారు. అక్కడ మార్క్స్ సజీవంగా ఉన్నాడు. అధికార కమ్యూనిస్టులు మాత్రం మార్క్స్ విగ్రహాలను పూజిస్తున్నారు. ఆ పూజకు అర్థం లేదు. ఆ విగ్రహంలో ప్రాణం లేదు. అదే విడ్డూరం. అదే విషాదం. (మే 5న సాక్షిలో వచ్చిన సురవరం సుధాకర రెడ్డి ‘‘గమ్యం గమనం మార్క్సిజమే’’ వ్యాసంపై స్పందన. దీని పూర్తి పాఠం ఈ లింకులో చూడండి : https://bit.ly/2jLIhg3) – వ్యాసకర్త: ఎ. గాంధీ, సంపాదకుడు, పీకాక్ క్లాసిక్స్ మొబైల్ : 91605 20830 -
మార్క్సిజంపై ఈ వక్రీకరణలు ఎందుకు?
కారల్ మార్క్సు 200వ జయంతి నాడు భారత కమ్యూనిస్టు పార్టీలో అత్యున్నత స్థానాన్ని అలంకరించిన మన తెలుగు బిడ్డ సుధాకర రెడ్డి గారు ఓ వ్యాసం రాశారు. అత్యధిక సర్క్యులేషను కల మూడు తెలుగు పత్రికల్లో రెండు పత్రికలు ఆయన వ్యాసాన్ని ప్రచురించాయి. దానిని బట్టి ఆ పత్రికలు ఆయనకి ఇచ్చిన ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవచ్చు. ఆ వ్యాసంలో ప్రతి వాక్యమూ ఒక ఆణిముత్యమని నేను కూడా గ్రహించాను. అయితే అన్ని ముత్యాలమీదా మాట్లాడతానంటే సంపాదకులు నాకంత చోటివ్వలేరు అనే ఇంగితం తెలిసినవాడిని కనుక కొన్ని ముత్యాలకే నేనిక్కడ పరిమితమవుతాను. ‘‘సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైన తరువాత’’ సామ్రాజ్యవాదులు అనేక వక్రీకరణలకు పాల్పడ్డారు అంటారు రచయిత. అంటే సుమారు రెండున్నర దశాబ్దాలుగానే వక్రీకరణలు చోటు చేసుకొన్నాయా? అంతకుముందు మార్క్సిజం వక్రీకరణలకు గురి కాలేదా? పైగా వక్రీకరించినవాళ్లు కేవలం సామ్రాజ్యవాదులేనా? సంగతేమంటే మార్క్సిజం పుట్టిన క్షణం నుంచీ వక్రీకరణలకీ గురైంది. దాడులకూ గురైంది. మరో నిజమేమిటంటే దానిని శత్రువులు ఎంతగా వక్రీరించారో అంతకుమించి కమ్యూనిస్టులం అని పేరు తగిలించుకొన్నవాళ్లు వక్రీకరించారు. కొందరు తెలిసీ మరికొందరు తెలియకా ఆ పని చేశారు.‘‘మార్క్స్ ప్రతిపాదించిన సిద్ధాంతం వైఫల్యం చెందిందని (సోవియట్ యూనియన్ కూలిపోయాక) సామ్రాజ్యవాదులు విస్తృత ప్రచారం’’ చేశారంటారు రచయిత. నిజమే. మార్క్సిజం ఆచరణలో రుజువయింది అని చెప్పడానికి సోవియట్ యూనియన్ బతికున్నంత కాలం దానినే కమ్యూనిస్టు నాయకులు ఉదాహరణగా చూపారు. మరి అది కూలిపోయినప్పుడు మార్క్సిజం కూడా విఫలమైందని సామాన్యులు అర్థం చేసుకోవడంలో తప్పేముంది? ఆ పరిస్థితినే శత్రువులు వాడుకొంటున్నారు. సుధాకర్జీ, మీకు రెండే మార్గాలు. ఒకటి, సోవియట్ యూనియన్‌లో ఉండింది మార్క్స్ ప్రతిపాదించిన సోషలిజమే అని మీరు డబాయిస్తే, మార్క్సిజం విఫలమైందని ఒప్పుకోక తప్పదు. లేదంటే సోవియట్ ‘‘సోషలిజం’’ మార్క్స్ ఊహించిన సోషలిజం కాదని గ్రహించాలి. సోవియట్ సోషలిజమూ శభాష్, మార్క్సూ శభాష్ అంటే కుదరదు. ఇదే చైనాకూ వర్తిస్తుంది. మిగతా ‘‘సోషలిస్టు’’ దేశాలకూ ఇదే వర్తిస్తుంది. ‘‘సామ్రాజ్యవాదులకు ... విమర్శించే హక్కు లేదు’’ అని ఆయన ఫర్మానా జారీ చేశారు. అది సరే. కాని విమర్శించేవాళ్లందరూ సామ్రాజ్యవాదులేనా అన్నది ప్రశ్న. ఒకరడిగినా అడగకపోయినా వివరణ ఇవ్వాల్సిన బాధ్యత కమ్యూనిస్టు అగ్ర నాయకులకు ఉండనే ఉండదా? ఎవరికీ జవాబు చెప్పకపోయినా మీ సొంత స్పష్టత కోసమైనా పొరపాటు ఎక్కడ జరిగిందో శోధించాల్సిన పనిలేదా? ఆ పని చెయ్యాలంటే మార్క్సునీ ఆశ్రయించాలి. చరిత్రనీ ఆశ్రయించాలి. ఆ దిశగా మీరు రెండడుగులయినా వేశారా, చెప్పండి. ‘‘1978 తదనంతరం మావో వారసుడు డెంగజియావో పింగ్ నాయకత్వంలో అనేక సంస్కరణలను తీసుకురావడం జరిగింది. తత్ఫలితంగా 80 కోట్ల ప్రజలు పేదరికం నుంచి విముక్తి పొందారు.’’ అంటారు సుధాకర్జీ. అంటే ఆ 80 కోట్ల మంది మావో నాయకత్వంలో మూడు దశాబ్దాలపాటు దరిద్రంలో మగ్గారనేనా? సుధాకర్జీ అంతమాట అనలేరు. ఈ వ్యాసంలోనే మావో లాంగ్ మార్చ్‌కూ మార్క్సే ప్రేరణ అన్నారు రచయిత. ఇక్కడేమో డెంగ్కీ మార్క్సిజమే ప్రేరణ అంటున్నారు. ప్రపంచంలో నయా ఉదారవాదాన్ని అధికారికంగా ప్రారంభించిన ముగ్గురు మొనగాళ్లలో డెంగ్ జియావో పింగ్ ఒకడు. సంస్కరణ అనే ముద్దు పేరుతోనే వారు దాన్ని ప్రవేశపెట్టారు. మిగతా ఇద్దరిలో ఒకరు మార్గరెట్ థాచర్. రెండోవాడు రొనాల్డ్ రీగన్. దానినే అదే ముద్దు పేరుతో ఇక్కడ ఇండియాలో పివి నరశింహారావు, మన్మోహన్ సింగ్ జంట సుమారు పుష్కరకాలం తర్వాత ప్రవేశపెట్టింది. సుధాకర రెడ్డిగారి పార్టీ ఇక్కడ ఆ సదరు జంటనూ వ్యతిరేకించింది. అంతర్జాతీయంగా థాచర్నీ రీగన్నీ సంస్కరణల పేరెత్తినవారందరినీ వ్యతిరేకించింది. చైనాలో ఆ ‘సంస్కరణ’లను తెచ్చిపెట్టిన డెంగ్ జియావో పింగ్‌ని మాత్రం సుధాకర్జీ పొగుడుతున్నారు. బహుశా ‘కమ్యూనిస్టు’ అనే పేరుతో ఏ పని చేసినా సమర్ధించాలన్న ‘‘జ్ఞానమే’’ అందులో ఉన్న తర్కం కావచ్చు. ఇక్కడ ఒక్కమాట. ఈ సంస్కరణల వల్ల చైనాలో సంపద అపారంగా పెరిగింది, నిజమే. మిలియనీర్లు, బిలియనీర్లూ తామరతంపరగా పెరిగారు. అదీ నిజమే. అయితే అదే స్థాయిలో అసమానతలూ పెరిగాయి. పని గంటలు అపారంగా పెరిగాయి. ఇంతకుముందు లేని నిరుద్యోగ సమస్య మళ్లీ వచ్చి పడింది. అడుగున పేదరికం కూడా అంతులేకుండా పెరిగింది. సామాజిక భద్రత అన్నది క్రమంగా తగ్గిపోతూ ఉంది. ‘‘సోవియట్ ప్రభుత్వం భూమిలేని పేదలకు భూములను పంచింది. బాంకులను పరిశ్రమలని జాతీయం చేసి అనేక విజయాలను సాధించింది.’’ సుధాకర్జీ చెప్పారు. ఇంతకీ సోవియట్ ప్రభుత్వం భూముల్ని పంచిందా, లేదా రైతులతో సమష్టి క్షేత్రాలూ ప్రభుత్వ క్షేత్రాలూ నిర్మించిందా? గుర్తు తెచ్చుకోండి. రష్యాలో చైనాలో పరిశ్రమలూ వగైరాలను జాతీయం చేయడానికీ మార్క్సే ప్రేరణ, చైనాలో డెంగ్ జియావో పింగ్ ప్రభుత్వ ఆస్తులను సొంత ఆస్తులుగా మార్చడానికీ మార్క్సే ప్రేరణ అంటే ఎలా సుధాకర్జీ. ఇంత నిలకడ లేని మనిషా మార్క్స్? అందుకేనేమో మార్క్సిజం పిడివాదం కాదనీ అది పరిస్థితులకు అనుగుణంగా మారుతూనే ఉంటుందనీ మార్క్స్ చెప్పాడనీ సుధాకరరెడ్డి గారు శలవిచ్చారు. అంటే దానిలో మారని మౌలిక అంశాలంటూ ఏమీ లేవా సార్. అవేమిటో ఏమైనా గుర్తున్నాయా? ఒక విద్య ఉంది. ఏమీ చెప్పకుండానే కొన్ని పదాలతో కొన్ని శబ్దాలతో ఘనమైనదేదో చెప్పినట్టు భ్రమ కల్పించే విద్య. అది కమ్యూనిస్టు నాయకులకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు. చూడండి. ‘‘తాను రాసిన కార్మికవర్గ సిద్ధాంతాలను అమలుపరచడానికి ఇంగ్గండులో పారిశ్రామిక విప్లవ నేపధ్యంలో కార్మిక వర్గ పరిస్థితులను అధ్యయనం చేసి వారి సంఘాలు పెట్టడం ప్రారంభించాడు.... ప్రపంచ కార్మికవర్గానికి వర్గపోరాటాలను సునిశితం చేయాలని దిశా నిర్దేశం చేశాడు, దోపిడీ సిద్ధాంతాన్ని వివరించారు.’’ ఈ వాక్యంలో మార్క్స్ ఏంచేశాడో కనుక్కోండి చూద్దాం. ‘‘దక్షిణ అమెరికా ఖండంలో వెనిజులా బొలీవియా నికరాగువా మరికొన్ని దేశాలు ప్రపంచ బాంకు, అంతర్జాతీయ ద్రవ్య సంస్థల ... ఒత్తిడులకు లొంగకుండా తన స్వంత బాంకును నిర్మించుకొన్నాయి’’ అన్నారు రచయిత. అయితే తర్వాత ఏం జరిగిందో రచయితకు తెలుసా? 1998 లో వెనిజులా నాయకుడు చావెజ్ మొదటిసారి బాంకు ప్రతిపాదన చేశాడు. పైన చెప్పిన రెండు సంస్థలూ రుణాలు మంజూరు చేయడానికి అనేక షరతులు పెడుతున్నాయి. రుణం తీసుకొనే దేశం ‘సంస్కరణలు’ అమలుచేయాలి. అంటే ప్రభుత్వ సంస్థలను వరసగా సొంత ఆస్తులుగా మార్చాలి. ఇది ఒక ప్రధానమైన షరతు. ఈ అన్యాయాన్ని ఎదిరించడానికి దక్షిణ అమెరికా బ్యాంకు ఒకటి పెట్టాలన్నది ఆలోచన. 2009నాటికి అర్జంటీనా బ్రెజిల్ దేశాలు కూడా ఈ ప్రతిపాదనకు ఒప్పుకొన్నాయి. చిన్న దేశాల్లో బొలీవియా పెరాగ్వే ఉరుగ్వే కూడా ముందుకొచ్చాయి. ఆ తర్వాత ఇంకొన్ని దేశాలు ఉత్సాహం చూపాయి. కాని విచారకరమైన విషయం ఏమంటే సమావేశాలు చాలా జరిగాయి కాని ఇంతవరకూ బాంక్‌కి డిపాజిట్లు కట్టాల్సిన దేశాలు కట్టనే లేదు. ఇంతవరకూ ఆ బాంకు చేయాల్సిన అసలు పని మొదలే కాలేదు. మూలిగే నక్క మీద తాటి పండు అన్నట్టుగా పోయిన ఏడాది వెనిజులా మీద ఉరుగ్వే అనేక ఆరోపను చేసింది. పైగా బయటికి పోతానని బెదిరించింది. ఇంకో ఆణిముత్యం చూడండి: ‘ఈ నేపధ్యంలోనే రష్యాతో సహా అనేక తూర్పు యూరపు దేశాల్లో కమ్యూనిస్టులు ముందుకు సాగుతూనే ఉన్నారు’. అక్కడ కమ్యూనిస్టులు ముందుకు సాగుతున్నారా? ఈ అభినవ రిప్ వాన్ వింకిల్ నిద్ర లేచి ఎంత కాలమైంది? ఇంకో మాట చూడండి: ‘‘అమెరికా గ్రంధాలయాల్లో మార్క్సిస్టు గ్రంధాలను ఎంతగా నిషేధించినప్పటికీ’’ ... అంటారు సుధాకర్జీ. అమెరికాలో కమ్యూనిజాన్ని ఒక బూచిగా చూపించే మాట నిజమే కాని పుస్తకాలు నిషేధించింది ఎక్కడ? ప్రపంచంలో అత్యధిక ధనవంతుడైన జెఫ్ బేజోస్ నడిపే ఎమెజాన్ లోనే మీరు పెట్టుబడి గ్రంథాన్ని కొనుక్కోవచ్చు. సామ్రాజ్యవాదం చేసిన చేస్తున్న నేరాలనూ ఘోరాలనూ ఎండగట్టడానికి అబద్ధాలు అవసరమా? ‘తింటానికి తిండి, కట్టుకోవడానికి బట్ట ఉండడానికి ఇల్లు, చేయడానికి ఒక గౌరవప్రదమైన ఉద్యోగం దొరికేటటువంటి ఒక నూతన సోషలిస్టు సమాజం ఏర్పడింది’ అన్నారు రచయిత. ఆ వ్యాసంలోనే మరో చోట... ‘సమానమైన పనికి సమానమైన వేతనం కోసం పోరాటం’ గురించి రాశారాయన. సోషలిజం అంటే ఇదేనా? సుధాకర రెడ్డి గారు మార్క్సిజం ఓనమాలు మర్చిపోయినట్టున్నారు. ఇల్లలకగానే పండగ కానట్టే సొంత ఆస్తులను జాతీయం చేయడమే సోషలిజం కాదని మార్క్స్ స్పష్టం చేశాడని సుధాకర్జీ కి తెలుసా? కార్మికవర్గ పోరాటం అంతిమ లక్ష్యం న్యాయమైన పనికి న్యాయమైన వేతనం కాదని వారు తేల్చి చెప్పాడనీ వేతన వ్యవస్థని రద్దు చేయడమే లక్ష్యం అన్నారనీ తెలుసా? అంటే ఏమిటి? ఆ వ్యవస్థలో కూలి ఇచ్చే యజమానీ ఉండడు. దాన్ని దేబిరించాల్సిన కూలీ ఉండడు. అక్కడ పని చేేసవాడే యజమాని. అధికారం పనిచేసేవాళ్ల చేతుల్లోనే ఉంటుంది. అటువంటి వ్యవస్థ సోవియట్ యూనియన్‌లో గాని చైనాలో గాని ఇంక ఎక్కడా గాని ఏర్పడలేదు. దాదాపు అన్ని చోట్లా ప్రజల చేతుల్లోకి చేరాల్సిన అధికారాన్ని బ్యూరోక్రాట్లు తన్నుకుపోయారు. అలా ఎందుకు జరిగిందో, సోషలిజం పేరుతో అన్నేళ్లపాటు నడిచిన దేశాల్లో మార్క్సిస్టు మౌలిక సూత్రాలు ఎందుకు అమలుకాలేదో శోధించి తమని తాము సరిదిద్దుకోవాల్సిన ‘అధికార’ కమ్యూనిస్టులు ఆదర్శంగా తీసుకొన్నది, మార్క్స్నా, గానుగెద్దునా అన్నది ప్రశ్న. ఆర్థిక సంక్షభాలు వచ్చిన ప్రతి సందర్భంలోనూ పెట్టుబడిదారీ బృందాల్లో దూరం చూడగలిగిన వారంతా మార్క్సుని తలుచుకొంటున్నారు. ఉలిక్కిపడుతున్నారు. అక్కడ ఆయన సజీవంగా ఉన్నాడు. అధికార కమ్యూనిస్టు బృందాలు మాత్రం మార్క్స్ విగ్రహాలను పూజిస్తున్నారు. ఆ పూజకు అర్థం లేదు. ఆ విగ్రహంలో ప్రాణం లేదు. అదే విడ్డూరం. అదే విషాదం. (మే 5న సాక్షి దినపత్రిక సంపాదకపేజీలో వచ్చిన సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి “గమ్యం గమనం మార్క్సిజమే” వ్యాసంపై స్పందన) ఎ. గాంధీ, సంపాదకుడు, పీకాక్ క్లాసిక్స్ మొబైల్ : 91605 20830 మార్క్సిజంపై ఏబీకే ప్రసాద్ గారు రాసిన వ్యాపం కోసం ఇక్కడ క్లిక్ చేయండి : మార్క్స్ ఎందుకు అజేయుడు?!