
జనగామ: సీపీఐ నేతలకు తృటిలో ప్రమాదం తప్పింది. ఎన్నికల ప్రచారం ముగించుకుని హైదరాబాద్‌కు తిరిగి వెళుతున్న సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ప్రయాణిస్తున్న వాహనం మంగళవారం అర్ధరాత్రి జనగామలో రోడ్డు ప్రమాదానికి గురైంది. దీంతో వారు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. వీరిద్దరు నేతలు మహబూబాబాద్ జిల్లాలో ఎన్నికల ప్రచారం ముగించుకుని.. ఇన్నోవా వాహనంలో జనగామ మీదుగా హైదరాబాద్‌కు బయలుదేరారు. జనగామ వద్ద రోడ్డుపై ఉన్న గుంతలో వారు ప్రయాణిస్తున్న వాహనం పడి పైకి లేచి.. భూమికి గట్టిగా ఢీకొట్టింది. ఈ ఘటనలో వారు స్వల్పగాయాలతో బయటపడగా.. మరో వాహనంలో వస్తున్న మాజీ ఎమ్మెల్యే సీహెచ్ రాజారెడ్డి మరో వాహనంలో హైదరాబాద్‌కు పంపించారు. అనంతరం రోడ్డు దుస్థితిపై కలెక్టర్ వినయ్‌క్రిష్ణారెడ్డికి ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు.