
‘తన వల్లే రాష్ట్ర విభజన అని.. నేడు బ్లాక్ డేనా?’
బీజేపీతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిది అవకాశవాద పొత్తు అని సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు
ఏపీకి ప్రత్యేక హోదా కోరే వారిని ప్రగతి నిరోధకులుగా అభివర్ణించడం సరికాదని మండిపడ్డారు. తన వల్లే రాష్ట్ర విభజన జరిగిందని చెప్పిన చంద్రబాబు నాయుడు.. నేడు మాత్రం బ్లాక్ డే అనడం అవకాశవాదమే అవుతుంది తప్ప మరొకటి కాదని విమర్శించారు.