సాక్షి, విజయవాడ : హోదా ఇస్తారనుకుంటే.. అమరావతి శంకుస్థాపనకు వచ్చి మట్టి, నీళ్లు ఇచ్చారని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడి ఏపీకి వస్తే.. ప్రజలు స్వాగతించేవారని అభిప్రాయపడ్డారు. ఏపీలో బీజేపీ పట్ల తీవ్ర నిరాదరణ ఉందన్నారు. ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా హోదా కోసం ఒత్తిడి చేయకుండా ప్యాకేజీకి ఒప్పుకుందని సుధాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు హోదాకు ఒప్పుకున్న చంద్రబాబు.. నేడు అదే హోదా కోసం ఆందోళన చేయడం హాస్యస్పాదం అన్నారు.
వామపక్షాలు, విద్యార్థి సంఘాలు మాత్రమే నేటి వరకూ హోదా కోసం పోరాటం చేస్తున్నాయని సుధాకర్ రెడ్డి తెలిపారు. మోదీ పార్లమెంట్‌లో చేసిన ప్రసంగం ఎన్నికల ప్రసంగంలా ఉందని ఆరోపించారు. రాఫెల్ కుంభకోణంలో అసలు విషయం ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. బీజేపీ దేశంలోని వ్యవస్థలన్నింటిని క్రమబద్ధంగా నాశనం చేస్తుందని మండిపడ్డారు. ప్రభుత్వ కార్యాలయాలను బీజేపీ ఆఫీస్‌లుగా మారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment