సురవరం సుధాకర్ రెడ్డి (ఫైల్‌ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ: వైఎస్సార్‌సీపీ ఎంపీలు ఎన్నికలకు రావాలని సవాల్ విసురుతున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుగా ఆయన పార్టీలో చేర్చుకున్న 23 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ఎన్నికలు నిర్వహించాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి హితవుపలికారు. ఆయన ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్ సీపీ నుంచి పార్టీ ఫిరాయించి టీడీపీ లో చేరిన ఎమ్మెల్యేల సభ్యత్వాలను రద్దు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనే ఉన్నా అది చేయకుండా వైఎస్సార్ సీపీ ఎంపీలు ఎన్నికలకు రావాలని సవాల్ విసరడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఆ ఎమ్మెల్యేలతో ఇప్పటిదాకా రాజీనామాలు ఎందుకు చేయించలేదో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ బీజేపీకి మేలు
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపాదించిన ఫెడరల్ ఫ్రంట్ కేంద్రంలోని బీజేపీకి బి టీం లాంటిదని సురవరం విమర్శించారు. జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పాటవుతున్న ప్రతిపక్షాల ఐక్యతను దెబ్బతీసేందుకే కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment