
సాక్షి. హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పార్లమెంట్ ప్రజాస్వామ్యంపై ఎలాంటి గౌరవం లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి తెలిపారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై పార్లమెంట్ నిర్ణయాన్ని తర్వాతి ప్రభుత్వం తప్పని సరిగా అమలు చేయాలన్నారు. బీజేపీ మాటలు నమ్మి తెలుగుదేశం పార్టీ హోదాకు బదులు ప్యాకేజీకి ఒప్పుకుందన్నారు. ఆఖరికి హోదా రాలేదు.. ప్యాకేజీ ఇవ్వలేదు.. రెండు విధాలా మోసం చేశారని అన్నారు.
ప్యాకేజీ పేరుతో ఏపీకి మోదీ ఇచ్చింది మట్టి, నీరు మాత్రమేనని ఎద్దేవా చేశారు. ఏపీలో విభిన్న వర్గాల నుంచి హోదా పోరు తీవ్రమైందని వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవకాశవాద రాజకీయాలకు పాల్పడ్డాక.. మరో మార్గాంతరం లేకుండా పోయిందని తెలిపారు. ప్రత్యేక హోదాకు ప్ర్యాకేజీ ప్రత్యామ్నాయం కాదని.. ఇన్నాళ్లు ప్రజలను టీడీపీ ప్రభుత్వం నమ్మించిందని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment