సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి(పాత చిత్రం)
హైదరాబాద్ : కేరళలో ఈ నెల 26 నుంచి జరిగే జాతీయ మహాసభలు చాలా కీలకమైనవని, దేశంలో వామపక్షాలు సంక్షిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్న తరుణంలో జరుగుతున్న మహాసభలు ఇవని సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు.మగ్దూమ్ భవన్‌లో సీపీఐ నేత చండ్ర రాజేశ్వరరావు 25వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండా ఎగరవేసి చండ్ర రాజేశ్వరరావుకు ఫోటో వద్ద శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ..కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు ఆశయాలు కొనసాగించాలన్నారు. మతోన్మాద, ఫాసిస్ట్ పార్టీలను ఎదుర్కొంటూ వామపక్షాల ఐక్యానికి కార్యాచరణ రూపొందిస్తామని వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన రాజకీయ వ్యూహాన్ని సిద్ధం చేస్తామని తెలిపారు. వామపక్ష, సెక్యులర్ విశాల వేదిక కోసం జాతీయ మహాసభల్లో తీర్మానం ఆమోదిస్తామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment