
మీడియాతో మాట్లాడుతున్న సురవరం. చిత్రంలో నాగేశ్వర్, కూనంనేని, సయ్యద్ అజీజ్, పల్లా వెంకట్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: డబ్బు రాజకీయాల వల్లనే ఎన్నికల్లో వామపక్షాలు దెబ్బతింటున్నాయని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. దేశంలో వర్గ దోపిడీ, వ్యక్తిగత ఆస్తులకు వ్యతిరేకంగా పోరా టం చేసే ఏకైక పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ అని, అందుకే కమ్యూనిస్టు పార్టీ పట్ల రాజ కీయ ప్రత్యర్థులు, శతృవులు అనేక దుష్ప్రచారాలను, తప్పుడు మాటలను మాట్లాడుతారని అన్నారు. వారికి ఎర్రజెండా అంటేనే భయమన్నారు.
‘సీపీఐ 98వ వ్యవస్థాపక దినోత్సవ’ సందర్భంగా సోమవారం హైదరాబాద్ మగ్దూంభవన్ ప్రాంగణంలో బహిరంగ సభ నిర్వహించారు. తొలుత సీపీఐ జెండాను సుధాకర్‌రెడ్డి ఎగురవేశారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అధ్య క్షతన జరిగిన బహిరంగ సభకు సీపీఐ జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్, జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకట్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎన్.బాలమల్లేశ్, ఇ.టి.నర్సింహా, మాజీ ఎంఎల్‌ఎ పీ.జె చంద్రశేఖర్ హాజర య్యా రు. ఈ సందర్భంగా ‘కమ్యూనిస్టు పార్టీ ప్రాధా న్యత అవసరం’ అంశంపై సురవరం, ‘రాజ్యాంగ రక్షణ ఫెడరల్ వ్యవస్థ పరిరక్షణ’ అనే అంశంపై ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ ప్రసంగించారు.
సురవరం మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై కొత్త పోరా టాలకు రూపకల్పన చేయాలని, అందుకోసం ప్రతిన బూనాలని పిలుపునిచ్చారు. దేశంలో ఒక శక్తివంతమైన ప్రజా ఉద్యమాన్ని నిర్మించి, ప్రజాతంత్ర, లౌకిక పార్టీలతో విశాలమైన ఐక్యతకు సీపీఐ, సీపీఐ(ఎం) కలయిక దోహద పడుతుందని అభిప్రాయపడ్డారు. కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. కమ్యూనిస్టుల పునరేకీకరణ జరగాలని పేదల నుండి పెద్దల వరకు కోరుతున్నారని చెప్పారు.
చదవండి: రేవంత్‌రెడ్డి కొత్త పార్టీ?.. కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం..
Comments
Please login to add a commentAdd a comment