Money politics
-
ఓటర్ల అకౌంట్లలో డబ్బులు జమ...టీజీ భరత్ మనీ పాలిటిక్స్
-
ప్రలోభాలకు తెరతీస్తున్న పచ్చపార్టీ
-
డబ్బు రాజకీయాల వల్లే వామపక్షాలకు దెబ్బ: సురవరం
సాక్షి, హైదరాబాద్: డబ్బు రాజకీయాల వల్లనే ఎన్నికల్లో వామపక్షాలు దెబ్బతింటున్నాయని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. దేశంలో వర్గ దోపిడీ, వ్యక్తిగత ఆస్తులకు వ్యతిరేకంగా పోరా టం చేసే ఏకైక పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ అని, అందుకే కమ్యూనిస్టు పార్టీ పట్ల రాజ కీయ ప్రత్యర్థులు, శతృవులు అనేక దుష్ప్రచారాలను, తప్పుడు మాటలను మాట్లాడుతారని అన్నారు. వారికి ఎర్రజెండా అంటేనే భయమన్నారు. ‘సీపీఐ 98వ వ్యవస్థాపక దినోత్సవ’ సందర్భంగా సోమవారం హైదరాబాద్ మగ్దూంభవన్ ప్రాంగణంలో బహిరంగ సభ నిర్వహించారు. తొలుత సీపీఐ జెండాను సుధాకర్‌రెడ్డి ఎగురవేశారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అధ్య క్షతన జరిగిన బహిరంగ సభకు సీపీఐ జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్, జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకట్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎన్.బాలమల్లేశ్, ఇ.టి.నర్సింహా, మాజీ ఎంఎల్ఎ పీ.జె చంద్రశేఖర్ హాజర య్యా రు. ఈ సందర్భంగా ‘కమ్యూనిస్టు పార్టీ ప్రాధా న్యత అవసరం’ అంశంపై సురవరం, ‘రాజ్యాంగ రక్షణ ఫెడరల్ వ్యవస్థ పరిరక్షణ’ అనే అంశంపై ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ ప్రసంగించారు. సురవరం మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై కొత్త పోరా టాలకు రూపకల్పన చేయాలని, అందుకోసం ప్రతిన బూనాలని పిలుపునిచ్చారు. దేశంలో ఒక శక్తివంతమైన ప్రజా ఉద్యమాన్ని నిర్మించి, ప్రజాతంత్ర, లౌకిక పార్టీలతో విశాలమైన ఐక్యతకు సీపీఐ, సీపీఐ(ఎం) కలయిక దోహద పడుతుందని అభిప్రాయపడ్డారు. కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. కమ్యూనిస్టుల పునరేకీకరణ జరగాలని పేదల నుండి పెద్దల వరకు కోరుతున్నారని చెప్పారు. చదవండి: రేవంత్‌రెడ్డి కొత్త పార్టీ?.. కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం.. -
టీడీపీ బాగోతం బయటపెట్టిన బీకే పార్థసారథి
సాక్షి, అనంతపురం జిల్లా: రూ. కోట్లు ఉంటేనే టీడీపీ టికెట్ వస్తుందంటూ శ్రీసత్యసాయి జిల్లా టీడీపీ అధ్యక్షుడు, పెనుకొండ మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి తమ పార్టీ బాగోతాన్ని బయటపెట్టారు. బాగా డబ్బు సంపాదించి రాజకీయాల్లోకి రావాలని, ఉత్తి చేతులతో వస్తే ఉపయోగం లేదని వ్యాఖ్యానించారు. శింగనమల నియోజకవర్గం నార్పలలో జరిగిన కురుబ కులస్తుల సమావేశంలో టీడీపీ డబ్బు సిద్ధాంతాన్ని బీకే పార్థసారథి బయటపెట్టారు. ఈ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చదవండి: బూతుల మోతాదు పెంచిన చంద్రబాబు.. పీక్స్‌లో ఫ్రస్టేషన్! -
Munugode Bypoll: ఆఫర్ భారీ.. ఆపై సారీ!
చౌటుప్పల్ మండలంలోని ఒక సర్పంచ్ ఒక పార్టీ నుంచి మరో పార్టీలో చేరారు. ఆయనకు రూ.20 లక్షలు ఆఫర్ చేసి.. అందులో రూ.10 లక్షలే ఇచ్చినట్లు తెలిసింది. మిగతా మొత్తం అడిగితే ఇప్పుడు అప్పుడు అంటూ దాట వేస్తుండటంతో సదరు సర్పంచ్ మిగతా డబ్బులు ఇస్తారా? లేదా? అనే ఆలోచనలో పడ్డారు. చండూరులో ఒక ముఖ్య నేత ఒక ప్రధాన పార్టీలో చేరారు. అక్కడ రూ.40 లక్షలు ఇస్తామని చెప్పారు. డబ్బులు తీసుకొని మళ్లీ ఫిరాయిస్తున్నారని ఆ పార్టీ వెంటనే డబ్బులు ఇవ్వలేదు. దీంతో మరో పార్టీ అదే మొత్తం ఇస్తామంటూ ఆయన్ను సంప్రదించడంతో ఆ పార్టీలో చేరిపోయారు. కానీ వారిచ్చింది రూ.5 లక్షలేనని తెలిసింది. సాక్షి, నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నిక ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారడంతో.. వచ్చిన అవకాశాన్ని సొమ్ము చేసుకుందామనుకుని పార్టీలు మారిన నేతల ఆశలు అడియాశలవుతున్నాయి. భారీ మొత్తాలు ఎరగా వేసి చేర్చుకున్న పార్టీలు, హామీ ఇచ్చిన లేదా ఒప్పందం చేసుకున్న నగదులో సగమో, పావు వంతో ఇచ్చి మిగతా మొత్తానికి రేపు, మాపంటూ ముఖం చాటేస్తుండటంతో.. గోడ దూకిన ప్రతినిధుల పరిస్థితి ‘కక్కలేక మింగలేక’అన్నట్టుగా తయారయ్యింది. స్థాయిని బట్టి రూ.40 లక్షల వరకు.. మునుగోడులో ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో ప్రధాన పార్టీలు.. ప్రత్యర్థి పార్టీల నేతలు, ప్రజా ప్రతినిధులకు గాలం వేస్తున్నాయి. వలలో వేసుకునేందుకు భారీ మొత్తంలో డబ్బు ఆశ చూపుతున్నాయి. స్థాయిని బట్టి రూ.10 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు ఆశ చూపుతున్నట్లు ఆరోపణలు ఉన్నా యి. ఈ నేపథ్యంలో నేతలు ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు పార్టీలు మారుతున్నారు. ఈ విధంగా ఇప్పటివరకు వందల సంఖ్యలో నేతలు పార్టీలు మారడం గమనార్హం. కాగా వీరిలో చాలామందికి కుదుర్చుకున్న ఒప్పందం మేరకు డబ్బులు దక్కలేదని తెలుస్తోంది. ఫిరాయింపు భయంతో కోత.. ఇస్తామన్న డబ్బులు మొత్తం ఇవ్వకపోవడంతో పార్టీలు మారినవారంతా తమను వలలోకి దింపినవారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయితే ప్రధాన పార్టీలు ఈ విషయంలో కొంత తెలివిగా వ్యవహరిస్తున్నాయని స్థానిక నేతలు చెబుతున్నారు. డబ్బులు మొత్తం ఇచ్చాక ఒకవేళ వారు మళ్లీ పార్టీ ఫిరాయిస్తే పరిస్థితి ఏమిటన్న జాగ్రత్తతోనే సగమో, పావు వంతో ఇచ్చి మిగతాది తర్వాత ఇస్తామని చెబుతున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే.. డబ్బుకు ఆశపడి పార్టీ మారితే అనుకున్న మొత్తం రాకపోగా, పరువు పోయిందని నాంపల్లి మండలానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి వాపోయారు. డబ్బులకు అమ్ముడుపోయారనే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలు మారిన వారి పరిస్థితి ఇలా ఉంటే.. తాము పార్టీని అంటిపెట్టుకుని ఉన్నా ఫలితం లేకుండా పోతోందని కొందరు వాపోతున్నారు. ముఖ్యనేతలు తమను పట్టించుకోవడం లేదని, తాము సొంత డబ్బులు ఖర్చు పెట్టి ప్రచారంలో పాల్గొంటున్నామని కొందరు కిందిస్థాయి నేతలు నిరాశ వ్యక్తం చేస్తుండటం గమనార్హం. మరికొన్ని బేరాలు.. – చౌటుప్పల్ మండలంలో ఒక పార్టీకి చెందిన సర్పంచ్ వేరే పార్టీలో చేరారు. రూ.20 లక్షలకు బేరం కుదిరినా అందులో రూ.5 లక్షలే అందినట్లు తెలిసింది. మిగతా మొత్తం అడిగితే అధికారంలోకి వచ్చాక ఇస్తామంటూ దాటవేస్తున్నారని ఆ సర్పంచ్ వాపోతున్నారు. – మునుగోడు మండలంలోని ఒక పార్టీకి చెందిన సర్పంచ్ మరో పార్టీలో చేరారు. ఆయనకు రూ.20 లక్షలు ఇస్తామనే హామీ లభించింది. ఈయనకు కూడా రూ.5 లక్షలే అందాయని, మిగతా మొత్తం ఎన్నిసార్లు అడిగినా ఇవ్వడం లేదని తెలిసింది. – నారాయణపూర్ మండలంలో ఒక గ్రామ సర్పంచ్‌తో రూ.10 లక్షలకు బేరం కుదిరింది. తీరా రూ.3 లక్షలే చేతిలో పెట్టి కండువాను కప్పి వదిలేశారు. – నియోజకవర్గంలోని మండల పార్టీ అధ్యక్షుడు ఒకరు రూ.30 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నా రూ.5 లక్షలే ఇవ్వడంతో అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. -
Sakshi Cartoon: నాకు తిక్కరేగిందంటే మరోక సారి ఓడిస్తా!
నాకు తిక్కరేగిందంటే మరోక సారి ఓడిస్తా! -
సామాన్యులు పోటీ చేసే పరిస్థితుల్లేవు: చాడ
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సామాన్యులు, డబ్బులు లేని వారు పోటీ చేసే పరిస్థితులు లేవని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలంటేనే డబ్బు మయం అనే పరిస్థితి ఏర్పడిందని, ప్రస్తుత ప్రజా స్వామ్యంలో సామాజిక సేవ కు ప్రాముఖ్యత లేకుండా పోయిందన్నారు. కార్పొరేట్ సంస్థల వ్యక్తులు, భూ కబ్జాదారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎన్నికల్లో పోటీ చేస్తూ ప్రజా భక్షకులుగా తయారవుతున్నారని ఆరోపించారు. జీహెచ్ఎంసీ ఎన్నికలను ఆగమేఘాలపై నిర్వహిం చడం, ప్రచారానికి కేవలం వారం రోజుల సమయమే ఉండటం విచార కరమన్నారు. ఆదివారం సీపీఐ నాయకులు అజీజ్‌పాషా, పల్లా వెంకట్‌రెడ్డి లతో కలిసి చాడ మీడియాతో మాట్లాడారు. ఈ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం ఉమ్మడిగా బరి లోకి దిగుతున్నాయని, సీపీఐ 17 డివిజన్లలో పోటీ చేస్తోందని వెల్లడిం చారు. అలాగే, పార్టీ అభ్యర్థుల జాబితాను ఆయన విడుదల చేశారు. రాష్ట్ర ప్రజల పట్ల కేంద్ర ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని ధ్వజ మెత్తారు. రాష్ట్రంలో భారీ వరదలు, వర్షాల కారణంగా తీవ్ర నష్టం వాటిల్లితే, కేంద్రం సాయం ఎందుకు అందించలేదో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సమాధానం చెప్పాలన్నారు. బాధితు లతో బీజేపీ బురద రాజకీయాలు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. వెంటనే కేంద్రం తగిన సహాయాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. -
2019లో ఒంటరి పోరు: కిషన్‌రెడ్డి
ఖమ్మం: 2019 నాటికి రాష్ట్రంలో బలమైన రాజకీయ శక్తిగా బీజేపీ ఎదుగుతుందని, రాష్ట్రంలో అన్ని స్థానాల్లో ఒంటరిగా బరిలోకి దిగుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా ఖమ్మంలో గురువారం ఆయన ప్రచారం నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజాస్వామ్య విలువలను మంటగలిపి.. డబ్బుంటే అధికారం చేజిక్కించుకోవచ్చనే ఉద్దేశంతో టీఆర్ఎస్ ధన రాజకీయాలు చేస్తోందన్నారు. అధికార బలాన్ని అడ్డుపెట్టుకుని ఇతర పార్టీల నాయకులను తమ పార్టీలో చేర్చుకోవడమే ధ్యేయంగా పని చేస్తున్నారన్నారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల అభివృద్ధి కేంద్ర ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ అభ్యర్థులను గెలిపించి ఖమ్మం నగరాన్ని అభివృద్ధి పథంలో నడిపించుకోవాలని పిలుపునిచ్చారు. కిషన్‌రెడ్డి వెంట జిల్లా నాయకులు శ్రీధర్‌రెడ్డి తదితరులున్నారు. -
'చంద్రబాబువి మనీ పాలిటిక్స్'
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మనీ పాలిటిక్స్ కొనసాగిస్తున్నారని సీపీఐ, సీపీఎం ఏపీ కార్యదర్శులు రామకృష్ణ, మధు మండిపడ్డారు. బుధవారం వారు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయి ఏడాది గడిచినా హామీల అమలులో ఆయన విఫలమయ్యారని ధ్వజమెత్తారు. రాజధాని భూములు కొల్లగొడితే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదన్నారు. ఓట్ల కోసం జనాన్ని చంద్రబాబు వాడుకున్నారని వారు దుయ్యబట్టారు.