సాక్షి, హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సామాన్యులు, డబ్బులు లేని వారు పోటీ చేసే పరిస్థితులు లేవని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలంటేనే డబ్బు మయం అనే పరిస్థితి ఏర్పడిందని, ప్రస్తుత ప్రజా స్వామ్యంలో సామాజిక సేవ కు ప్రాముఖ్యత లేకుండా పోయిందన్నారు. కార్పొరేట్ సంస్థల వ్యక్తులు, భూ కబ్జాదారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎన్నికల్లో పోటీ చేస్తూ ప్రజా భక్షకులుగా తయారవుతున్నారని ఆరోపించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలను ఆగమేఘాలపై నిర్వహిం చడం, ప్రచారానికి కేవలం వారం రోజుల సమయమే ఉండటం విచార కరమన్నారు.
ఆదివారం సీపీఐ నాయకులు అజీజ్‌పాషా, పల్లా వెంకట్‌రెడ్డి లతో కలిసి చాడ మీడియాతో మాట్లాడారు. ఈ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం ఉమ్మడిగా బరి లోకి దిగుతున్నాయని, సీపీఐ 17 డివిజన్లలో పోటీ చేస్తోందని వెల్లడిం చారు. అలాగే, పార్టీ అభ్యర్థుల జాబితాను ఆయన విడుదల చేశారు. రాష్ట్ర ప్రజల పట్ల కేంద్ర ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని ధ్వజ మెత్తారు. రాష్ట్రంలో భారీ వరదలు, వర్షాల కారణంగా తీవ్ర నష్టం వాటిల్లితే, కేంద్రం సాయం ఎందుకు అందించలేదో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సమాధానం చెప్పాలన్నారు. బాధితు లతో బీజేపీ బురద రాజకీయాలు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. వెంటనే కేంద్రం తగిన సహాయాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment