GHMC elections
-
ఎన్నికల ప్రక్రియ దాదాపు పూర్తి అయింది: జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్
-
జీహెచ్ఎంసీలో జోనల్ కమిషనర్ల బదిలీ
హైదరాబాద్: రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి జీహెచ్ఎంసీలో బదిలీలు జరుగుతున్నాయి. కమిషనర్ లోకేశ్కుమార్ను కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర అడిషనల్ సీఈఓగా ఇప్పటికే బదిలీ చేయడం తెలిసిందే. తాజాగా జీహెచ్ఎంసీలోని నలుగురు జోనల్ కమిషనర్ల(జడ్సీ)ను ఇతర ప్రాంతాలకు బదిలీ చేశారు. ఈ మేరకు మునిసిపల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్‌కుమార్ ఉత్వర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. ఎవరెవరు.. ఎక్కడెక్కడ.. ► సికింద్రాబాద్ జోనల్ కమిషనర్‌గా పనిచేస్తున్న బి.శ్రీనివాస్‌రెడ్డిని నగరంలోనే ఎంతో కీలకమైన, ఐటీతో పాటు వివిధ సంస్థలు కొలువుదీరిన శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్‌గా బదిలీ చేశారు. ప్రస్తుతం శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్‌గా ఉన్న మునిసిపల్ పరిపాలన శాఖ అడిషనల్ డైరెక్టర్ జె.శంకరయ్యను జీహెచ్ఎంసీ ఎన్నికల విభాగం అడిషనల్ కమిషనర్‌గా బదిలీ చేశారు. ► ప్రస్తుతం ఆ పోస్టులో ఉన్న ఎస్.పంకజను ఆ పోస్టు నుంచి రిలీవ్ చేశారు. ఖైరతాబాద్ జోనల్ కమిషనర్‌గా పనిచేస్తున్న అడిషనల్ డైరెక్టర్ ఎన్.రవికిరణ్‌ను శ్రీనివాస్‌రెడ్డి స్థానంలో సికింద్రాబాద్ జోనల్ కమిషనర్‌గా నియమించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు ఖైరతాబాద్ జోనల్ కమిషనర్‌గా కూడా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు నిర్వర్విస్తారు. ► చార్మినార్ జోనల్ కమిషనర్‌గా పనిచేస్తున్న ఎన్.అశోక్ సామ్రాట్‌ను సీడీఎంఏ జాయింట్ డైరెక్టర్‌గా బదిలీ చేశారు. శేరిలింగంపల్లి డిప్యూటీ కమిషనర్‌గా పనిచేస్తున్న టి.వెంకన్నను చార్మినార్ జోనల్ కమిషనర్‌గా నియమించారు. ► సీడీఎంఏలో జాయింట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఆర్.ఉపేందర్‌రెడ్డిని జీహెచ్ఎంసీ పారిశుధ్య విభాగం అడిషనల్ కమిషనర్‌గా నియమించారు. ఆ విభాగం అడిషనల్ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న వి.మమతను అక్కడినుంచి రిలీవ్ చేశారు. చందానగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్‌గా పనిచేస్తున్న ఎన్.సుధాంశ్‌కు శేరిలింగంపల్లి డిప్యూటీ కమిషనర్‌గా కూడా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించారు. మహిళా జడ్సీలకు మినహాయింపు.. ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ ఎస్.పంకజ, కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి.మమతకు ఈ బదిలీల్లో మినహాయింపు నిచ్చారు. వారిని ఎక్కడికీ బదిలీ చేయకపోవడమే కాక వారికి అదనంగా ఉన్న పోస్టుల్లో ఇతరులను నియమించారు. ఇక వారు జోన్లపైనే పూర్తిస్థాయి శ్రద్ధతో పనిచేసే అవకాశం ఉంటుంది. గత బదిలీల సందర్భంగా వీరిద్దరూ తాము బదిలీ అయిన స్థానాలను పరస్పరం మార్చుకోవడం తెలిసిందే. జడ్సీల బదిలీల్లో పైరవీలు పనిచేశాయనే ఆరోపణలు వెలువడుతున్నాయి. ఇక త్వరలోనే డిప్యూటీ కమిషనర్ల బదిలీలు కూడా జరగనున్నట్లు సమాచారం. -
‘టీఆర్ఎస్ స్టీరింగ్ ఎంఐఎం చేతిలో’
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎంఐఎం సహాయంతో మేయర్, ఉప మేయర్ పదవులు దక్కించుకోవడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ స్పందించారు. ఆ రెండు పార్టీల మధ్య ఉన్న అక్రమ సంబంధం మరో సారి బహిర్గతమైందని తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తాము చెప్పిన విషయం నిజమైందని చెప్పారు. టీఆర్ఎస్, ఎంఐఎం రెండు పార్టీలు చీకట్లో ప్రేమించుకుంటూ బయటకు వేర్వేరు అని చెప్పే ప్రయత్నం చేశాయని పేర్కొన్నారు. మేయర్ ఎన్నికపై జరిగిన పరిణామాలపై గురువారం ఓ పత్రిక ప్రకటన విడుదల చేశారు. ఆ రెండూ పార్టీలు కలిసి పోటీ చేయకపోయి ఉంటే టీఆర్ఎస్కు సింగిల్ డిజిట్ కూడా వచ్చేది కాదని బండి సంజయ్ తెలిపారు. టీఆర్ఎస్ పక్కా మతతత్వ పార్టీ అయిన ఎంఐఎం చెంచా అని ఈ రోజు ఋజువైనదని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీలో టీఆర్ఎస్ స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉండటం ఖాయమని స్పష్టం చేశారు. సిగ్గు లేక ఎన్నికల్లో తాము వేర్వేరు అని చెప్పుకుని ప్రచారం చేసుకున్నారని సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నీతివంతమైన రాజకీయం చేయాలని భావిస్తే బహిరంగ పొత్తు పెట్టుకోవాల్సిందని సూచించారు. ఈ రెండు పార్టీలు కలిసి భాగ్యనగరాన్ని దోచుకునే కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. తమ పార్టీ కార్పొరేటర్లు హైదరాబాద్‌ను కంటికి రెప్పలా కాపాడుకుంటారని తెలిపారు. పైసా అవినీతి చేసినా, ఇంచు జాగా వదిలేసినా ఆ రెండు పార్టీలను బజారుకు లాగుతామని హెచ్చరించారు. ప్రజలు టీఆర్ఎస్ నీచ రాజకీయాలను సహించారని, అవకాశం వచ్చినా ప్రతి సారి కర్రు కాల్చి వాటా పెడతారని తెలిపారు. -
బల్దియా పీఠానికి దారేది?
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో హంగ్ రావడంతో మేయర్ పీఠం ఎవరికి, ఎలా దక్కుతుందనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బల్దియాలో అతిపెద్ద పారీ్టగా అవతరించిన టీఆర్ఎస్కు పీఠం దక్కించుకోవడానికి ఉన్న మార్గాలపై రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. మేయర్ ఎన్నికకు మరో రెండు నెలల సమయం ఉందన్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలతో ఈ ఉత్కంఠ మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ గ్రేటర్ కుర్చీని దక్కించుకునేందుకు మూడు మార్గాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఎంఐఎంతో అధికారిక పొత్తు మొదటిది కాగా, మేయర్ ఎన్నిక రోజున ఎంఐఎం గైర్హాజరు కావడం రెండో మార్గంగా కనిపిస్తోంది. ఇక, ఎంఐఎం కూడా మేయర్ ఎన్నికల్లో పోటీ చేస్తే బీజేపీ ఎలాగూ పోటీలో ఉంటుంది కనుక ఎక్స్అఫీషియో సభ్యుల సాయంతో ఎక్కువ ఓట్లు తెచ్చుకుని టీఆర్ఎస్ బల్దియా పీఠంపై కూర్చుంటుందని విశ్లేషిస్తున్నారు. మొత్తానికి టీఆర్ఎస్కు మేయర్ పీఠం దక్కాలంటే మాత్రం ఎంఐఎం కీలకం కానుంది. ఈ నేపథ్యంలో ఈ విషయంలో ఎలా ముందుకువెళ్లాలనే దానిపై టీఆర్ఎస్లో చర్చ జరుగుతోంది. సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లు దీనిపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గ్రేటర్ పీఠం దక్కుతుందన్న నమ్మకం ఉండటంతోనే భారతీనగర్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్‌రెడ్డికి ప్రగతిభవన్ నుంచి పిలుపు వచి్చందని తెలుస్తోంది. గ్రేటర్ పీఠం దక్కడం ఖాయమే అని, ఏ వ్యూహంతో దాన్ని దక్కించుకోవాలన్న దానిపై శనివారం మరింత స్పష్టత వస్తుందని తెలంగాణ భవన్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం లెక్క ఇదీ.. గ్రేటర్ పరిధిలోని 150 డివిజన్లకు గాను నేరేడ్మెట్ మినహా మిగతా 149 డివిజన్ల ఫలితాలను ప్రకటించగా, టీఆర్ఎస్ 55 డివిజన్లలో గెలుపొంది అతిపెద్ద పార్టీగా అవతరించింది. జీహెచ్ఎంసీలో వివిధ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కలిపి మొత్తం 45 మంది ఎక్స్అఫీషియో సభ్యులుగా ఉండగా, ఇందులో టీఆర్ఎస్కు 31 మంది బలం ఉంది. ఎక్స్అఫీషియో సభ్యులతో కలిపి జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలో పాల్గొనే మొత్తం ఓటర్ల సంఖ్య 195. ఈ నేపథ్యంలో మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలంటే ఏ పార్టీకి అయినా 98 మంది (మేజిక్ ఫిగర్) మద్దతు అవసరం ఉంటుంది. ఎక్స్‌అఫీíÙయో సభ్యులను కలిపితే టీఆర్ఎస్కు 86, బీజేపీకి 51, ఎంఐఎంకు 54, కాంగ్రెస్‌కు ముగ్గురు సభ్యుల బలం ఉంది. దీంతో అటు కమలనాథులకు, ఇటు కాంగ్రెస్‌కు మేయర్ పీఠం గెలుపొందే అవకాశం లేనే లేదు. -
‘గ్రేటర్’ తెచ్చిన కరోనా
ఆదిలాబాద్‌టౌన్: కోవిడ్ విజృంభణ మళ్లీ మొదలైంది. ఒక్కసారిగా కేసుల సంఖ్య పెరిగిపోయింది. రెండు రోజుల క్రితం పదిలోపే కరోనా కేసులు నమోదవుతుండగా, గురువారం ఏకంగా 65 కేసులు నమోదయ్యాయి. దీంతో జనాల్లో భయాందోళన మొదలైంది. చాలా మంది ప్రజలు కోవిడ్ నిబంధనలను పాటించకుండా రోడ్లపై తిరుగుతున్నారు. భౌతిక దూరాన్ని మరిచారు. దీంతో వైరస్ వ్యాప్తి చెందుతుందని వైద్యాధికారులు పేర్కొంటున్నారు. ప్రజలు జాగ్రత్తలు పాటిస్తూనే అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. మార్కెట్, రైతుబజార్, దుకాణ సముదాయాల ప్రాంతాల్లో భౌతిక దూరం పాటించకపోవడం, మాసు్కలు ధరించకపోవడంతో కేసుల సంఖ్య పెరిగిపోతున్నట్లు తెలుస్తోంది. అయితే చాలా మందికి కరోనా వైరస్ లక్షణాలు లేకుండానే వైరస్ వ్యాప్తి చెందుతోంది. ఇటీవల హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికల విధులకు వెళ్లిన పోలీసులకు కోవిడ్ సోకినట్లు వైద్యాధికారులు పేర్కొంటున్నారు. బుధవారం 14 మంది పోలీసులకు కోవిడ్ నిర్ధారణ కాగా, గురువారం నిర్వహించిన పరీక్షల్లో కూడా పలువురు పోలీసులకు కరోనా సోకినట్లు సమాచారం. అప్రమత్తంగా లేకుంటే ఇబ్బందులే.. సెకండ్ వేవ్ నేపథ్యంలో అప్రమత్తంగా లేకుంటే ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంది. పెండ్లీలు, విందులు, ఇతర కార్యక్రమాలకు హాజరైన వారు లక్షణాలు లేకున్నా పరీక్షలు చేయించుకుంటే మంచిదని వైద్యాశాఖాధికారులు పేర్కొంటున్నారు. సెకండ్ వేవ్ నేపథ్యంలో శుభకార్యాలు, ఇతర వాటికి వెళ్లకుండా తగు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. వృద్ధులు, పిల్లలు మరింతగా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. మాసు్కలు లేనిదే బయటకు రావద్దని డీఎంహెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా గురువారం 1949 మందికి కరోనా పరీక్షలు చేయగా 65 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. 1874 రిపోర్టు నెగిటివ్ రాగా, 10 నమూనాలు పెండింగ్‌లో ఉన్నాయి. కాగా ఇద్దరు కోలుకున్నారు. ఇప్పటివరకు 40 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. ఆదిలాబాద్ పట్టణంలోని అంబేద్కర్‌నగర్‌లో 1, అటెండర్‌కాలనీలో 1, బెల్లూరిలో 1, భుక్తాపూర్‌లో 1, చాందా(టి)లో 5, కలెక్టర్‌చౌక్‌లో 1, దుర్గానర్‌లో 2, ఎంప్లాయీస్ కాలనీలో 1, గ్రీన్ సిటీలో 1, కైలాస్‌నగర్‌లో 2, కోలిపురలో 1, కృష్ణనగర్‌లో 1, కుమ్మర్‌వాడలో 1, మహాలక్ష్మీవాడలో 1, మావలలో 1, న్యూహౌసింగ్‌బోర్డులో 2, పోలీస్ క్వార్టర్లో 1, రాంనగర్లో 1, రాంపూర్‌లో 1, రవీంద్రనగర్‌లో 2, రిక్షా కాలనీలో 2, సంజయ్‌నగర్‌లో 5, శాంతినగర్‌లో 4, టైలర్స్ కాలనీలో 2, టీచర్స్‌కాలనీలో 1, తిర్పెల్లిలో 1, ఇచ్చోడలోని అడెగాం(బి)లో 1, ఇచ్చోడ పీఎస్‌లో 2, ఎంపీడీఓ కార్యాలయ సమీపంలో 1, జైనథ్‌లోని ఆనంద్‌పూర్‌లో 1, ఉట్నూర్‌లోని బోయవాడలో 1, కొత్తగూడలో 1, సేవదాస్‌నగర్‌లో 1, ఉట్నూర్‌లో 1, ఉట్నూర్ పీఎస్‌లో 6, నేరడిగొండలో 1, బుగ్గారం(బి)లో 1, ఇంద్రవెల్లి పీఎస్‌లో 2, తలమడుగులోని ఝరిలో 1, సిరికొండలోని తిమ్మపూర్‌లో 1, సుంగాపూర్‌లో 1 చొప్పున కేసులు నమోదైనట్లు డీఎంహెచ్ఓ వివరించారు. -
ఎన్నికల ప్రచారం: తిరక్కుండానే టైమౌట్
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల హీట్ పీక్స్‌కు వెళ్లడంతో అభ్యర్థులు సుడిగాలి పర్యటన చేస్తున్నారు. జెట్ స్పీడ్ ప్రచారం నిర్వహిస్తున్నారు. అయినా డివిజన్ మొత్తాన్ని చుట్టేయడం సాధ్యంకావడంలేదు. ఇదీ ఈసారి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆయా పార్టీల అభ్యర్థుల ప్రచారం తీరు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల ప్రచారపోకడ గతం కంటే భిన్నంగా సాగుతోంది. సాధారణంగా ఎన్నికల ప్రచారంలో డివిజన్ మొత్తాన్ని చుట్టి, చివరలో ముఖ్యమైన ప్రాంతాల్లో రెండోసారి కూడా ప్రచారం చేస్తారు. కానీ, ఈసారి డివిజన్వ్యాప్తంగా అభ్యర్థి ప్రచారం చేసే వీలు చిక్కలేదు. ఆదివారం ప్రచారం ముగుస్తుండటంతో అభ్యర్థుల్లో కొంత ఆందోళన వ్యక్తమవుతోంది. అన్ని పార్టీలు, అన్ని డివిజన్లలో ఇదే పరిస్థితి నెలకొంది. బస్తీల్లోనే కుస్తీ ఎన్నికల తేదీలు ప్రకటించిన తర్వాత పక్షం రోజుల్లోనే ఎన్నికల తంతు ముగించాల్సి వస్తోంది. అభ్యర్థులను ప్రకటించి, బీఫామ్స్ అందించిన తర్వాత ప్రచారానికి కేవలం వారం మాత్రమే మిగిలింది. ఈ వారం రోజుల్లో డివిజన్లోని బస్తీలు, కాలనీలన్నింటిలో ప్రచారం చేయటం దాదాపు అసాధ్యమైపోయింది. దీంతో అభ్యర్థులు జెట్ స్పీడ్‌తో గరిష్ట ప్రాంతాలను కవర్ చేసేలా ప్రణాళిక రూపొందించకున్నారు. దాదాపు మూడొంతుల ప్రాంతాలను చుట్టేయగలిగారు. ఎన్నికల వేళ అభ్యర్థులు మెడలో పూలమాలలు వేసుకుని, బాజాభజంత్రీలు, మందీ మార్బలంతో ఇంటింటికీ తిరిగి ప్రచారం చేసేవారు. కానీ, ఈసారి తీరు మారింది. తక్కువ సమయంలో ఎక్కువ ప్రాంతాలు తిరగాల్సి రావటంతో హంగూఆర్భాటాలు లేకుండా పరుగు పరుగున ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పాదయాత్రలు చేసి సాయంత్రం కార్నర్ మీటింగ్స్ జరిపేవారు. ఇప్పుడు కార్నర్ మీటింగ్స్ జోలికి వెళ్లటం లేదు. ఒకచోట మీటింగ్ పెట్టే సమయంలో పది బస్తీలు కవర్ చేయొచ్చన్న ఉద్దేశంతో పాదయాత్రలకే ప్రాధాన్యమిస్తున్నారు. అభ్యర్థులు మూడు, నాలుగు బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యమైన ప్రాంతాలు, బస్తీలకు అభ్యర్థి వెళ్తుండగా, మిగతా ప్రాంతాలకు అభ్యర్థి తరఫున తండ్రి, సోదరులు, పార్టీ డివిజన్ స్థాయి ముఖ్యనేతలు వెళ్లి ఓట్లడగుతున్నారు. కొన్నిచోట్ల అభ్యర్థి చిన్న కటౌట్లను వెంట పెట్టుకుని వెళ్లి దాన్ని చూపిస్తూ ఓట్లడుగుతుండటం విశేషం. మజ్లిస్ పార్టీ అభ్యర్థులు మైనారిటీ ఓటర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాలకే పరిమితమవుతున్నారు. గతంలో మైనారిటీయేతరులుండే ప్రాంతాల్లోనూ ప్రచారం చేసేవారు. ఈసారి సమయంలేక అటు వెళ్లటం లేదు. ఉదయం అల్పాహారం ముగించి ప్రచారం ప్రారంభించి మధ్యాహ్నం ఇళ్లకు వచ్చి భోజనం ముగించి, కుదిరితే కాసేపు విశ్రాంతి తీసుకుని సాయంత్రం రెండోదఫా ప్రచారం చేసేవారు. కానీ, ఇప్పుడు షెడ్యూల్‌ను పూర్తిగా మార్చుకున్నారు. వేకువజామునే ప్రచారం ప్రారంభించి, కుదిరిన చోట లంచ్ ముగించి రాత్రి పొద్దుపోయే వరకు తిరుగుతున్నారు. ఎక్కువ మంది అభ్యర్థులు రాత్రి 10 గంటల వరకు ప్రచారం చేస్తున్నారు. బస్తీల్లోనే ఎక్కువ ఓటింగ్ జరుగుతుంది కాబట్టి ఆ ప్రాంతాల్లోనే అభ్యర్థులు పాదయాత్రలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. కాలనీలకు అతి తక్కువగా వెళ్తున్నారు. అభ్యర్థులు ప్రచారానికి వెళ్లని ప్రాంతాల్లో వారి ప్రచార వాహనాలను ఎక్కువగా తిప్పకుండా మైకుల ద్వారా ప్రచారం చేయిస్తున్నారు. అగ్రనేతల ప్రచారంపైనే ఆశలు.. గతంలో ఎన్నడూ లేనట్టుగా ఈసారి బల్దియా ఎన్నికల్లో ఆయా పార్టీల అగ్రనేతల ప్రచారం హోరెత్తుతోంది. కాంగ్రెస్ తరఫున ఒకరిద్దరు పెద్ద నేతలు మాత్రమే పాల్గొంటుండగా, టీఆర్ఎస్, బీజేపీలు ఒకదాన్ని మించి మరొకటి అన్నట్టుగా అగ్రనేతలతో ప్రచారం చేయిస్తున్నాయి. నిత్యం డజన్ ర్యాలీలు, బహిరంగ సభలతో హోరెత్తిస్తున్నాయి. కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా భారీ సభలు నిర్వహిస్తున్నారు. దీంతో అభ్యర్థులు వారి ప్రచారంపైనే ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. ఇంటింటి ప్రచారం కంటే అగ్రనేతల మాటలే ఎక్కువగా ఓట్లు తెచ్చిపెడతాయనీ, హామీలు, వరాలు వారి మాటల్లోనే పారుతున్నాయనీ భావించిన అభ్యర్థులు బస్తీల్లో ఓటర్లకు నమస్కారం చేసుకుంటూ ముందుకు సాగటం తప్ప పెద్దగా హామీలు ఇవ్వలేకపోతున్నారు. విజయం సాధిస్తే తమ పార్టీ ఏం చేస్తుందనే విషయాన్ని అగ్రనేతలే వివరిస్తున్నారు. వాటికి మీడియా ద్వారా భారీ ప్రచారమే సాగుతోంది. అన్ని పార్టీలు సొంతంగా సోషల్ మీడియ బృందాలు ఏర్పాటు చేసుకుని, అగ్రనేతల ప్రసంగాలను వాట్సాప్ గ్రూపులు, యూట్యూబ్ ఛానళ్ల ద్వారా జనంలోకి తీసుకెళ్తున్నారు.గెలుపోటములపై అవి ప్రభావం చూపుతాయన్న అభిప్రాయంతో అభ్యర్థులున్నారు. అగ్రనేతలు కొన్ని డివిజన్లకే పరిమితం కావటంతో వారు అడుగుపెట్టని ప్రాంతాల అభ్యర్థుల్లో కొంత ఆందోళన కనిపిస్తోంది. -
సామాన్యులు పోటీ చేసే పరిస్థితుల్లేవు: చాడ
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సామాన్యులు, డబ్బులు లేని వారు పోటీ చేసే పరిస్థితులు లేవని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలంటేనే డబ్బు మయం అనే పరిస్థితి ఏర్పడిందని, ప్రస్తుత ప్రజా స్వామ్యంలో సామాజిక సేవ కు ప్రాముఖ్యత లేకుండా పోయిందన్నారు. కార్పొరేట్ సంస్థల వ్యక్తులు, భూ కబ్జాదారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎన్నికల్లో పోటీ చేస్తూ ప్రజా భక్షకులుగా తయారవుతున్నారని ఆరోపించారు. జీహెచ్ఎంసీ ఎన్నికలను ఆగమేఘాలపై నిర్వహిం చడం, ప్రచారానికి కేవలం వారం రోజుల సమయమే ఉండటం విచార కరమన్నారు. ఆదివారం సీపీఐ నాయకులు అజీజ్‌పాషా, పల్లా వెంకట్‌రెడ్డి లతో కలిసి చాడ మీడియాతో మాట్లాడారు. ఈ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం ఉమ్మడిగా బరి లోకి దిగుతున్నాయని, సీపీఐ 17 డివిజన్లలో పోటీ చేస్తోందని వెల్లడిం చారు. అలాగే, పార్టీ అభ్యర్థుల జాబితాను ఆయన విడుదల చేశారు. రాష్ట్ర ప్రజల పట్ల కేంద్ర ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని ధ్వజ మెత్తారు. రాష్ట్రంలో భారీ వరదలు, వర్షాల కారణంగా తీవ్ర నష్టం వాటిల్లితే, కేంద్రం సాయం ఎందుకు అందించలేదో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సమాధానం చెప్పాలన్నారు. బాధితు లతో బీజేపీ బురద రాజకీయాలు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. వెంటనే కేంద్రం తగిన సహాయాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. -
కుళ్లు జోకులు.. వెకిలి పోస్టులు..
సాక్షి,హైదరాబాద్: గుండోడు, బండోడు, బక్కోడు, బికారీ.. గ్రేటర్ ఎన్నికల వేళ సోషల్ మీడియాలో విద్వేషం హద్దులు దాటుతోంది. ప్రత్యర్థులపై అభ్యంతరకర, రాయలేని వ్యాఖ్యలతో చెలరేగుతున్నారు, రెచ్చగొడుతున్నారు. నాయకుల అలవాట్లు, ఆహార్యంపై సెటైర్లు, కుళ్లుజోకులు వేస్తున్నారు. వ్యక్తిగత దూషణకు దిగుతున్నారు. ప్రత్యర్థులను చులకన చేసే ప్రయత్నంలో దిగజారుడు పోస్టులు పెడుతున్నారు. రాజకీయ వేడిలో సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న అరాచకమిది. పార్టీలకు అనుకూలంగా వారి సోషల్‌మీడియా విభాగాలు చేసే పోస్టులు పద్ధతిగానే ఉంటున్నాయి. కానీ, కొందరు సానుభూతిపరులు, అతివాదులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఈ పోస్టులపై పోలీసులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ఇలాంటి విద్వేషపు పోస్టింగులకు దిగిన వారిపై ఐటీయాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. కొత్త ఓటర్లు, యువతకు గాలం.. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ నిత్యావసర వస్తువుగా మారింది. ఆన్లైన్ క్లాసుల పుణ్యమాని ఇప్పుడు ప్రతీ విద్యార్థికి స్మార్ట్‌ఫోన్ ఉంది. ముఖ్యంగా 18 ఏళ్లు దాటి డిగ్రీ, ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థుల ఓట్లే లక్ష్యంగా ఈ వ్యంగ్యపు, వెకిలి పోస్టులు రూపొందిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్ వినియోగించే యువతలో నూటికి 90 శాతం వినోదానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. అందుకే, వారి దృష్టిని తమవైపు తిప్పుకునేందుకు, ప్రత్యర్థి పార్టీలపై కుళ్లుజోకులతో బాడీషేమింగ్‌కు దిగుతున్నారు. చేసిన, చేయబోయే పనులను చెప్పుకొని ఓట్లు అడగటం, ప్రత్యర్థులను విమర్శలతో ప్రశ్నించడం మంచి రాజకీయం. కానీ కొందరు అత్యుత్సాహపరులు తమ ప్రత్యర్థి పార్టీల నాయకులను తాగుబోతు, వదరుబోతు, గుండోడు, బండోడు, బక్కోడు, బికారీ అంటూ ఆకారం, అలవాట్ల ఆధారంగా కుళ్లుజోకులు వేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీపై యువత మనసులో విద్వేషపు బీజాలు నాటుతున్నారు. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్‌లలో ఇలాంటి పోస్టులకు కొదవలేదు. వ్యక్తులను కించపరుస్తూ వీడియోలు, సినిమాల్లోని హాస్యపు బిట్లు, మీమ్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్కులతో పోస్టులు రూపొందిస్తూ కొత్త ఓటర్లకు గాలం వేస్తున్నారు. ఇలాంటివారు అరెస్టయినా... పార్టీకి సంబంధం లేదని, స్వచ్ఛందంగానే తాము ఇలా చేశామని పోలీసులకు వివరణ ఇస్తుండటం గమనార్హం. ప్రైవేటు ఆర్మీల పేరుతో.. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. కొందరు సానుభూతిపరులు రాజకీయ పార్టీలతో పరోక్షంగా సంబంధాలు నెరుపుతూ సోషల్‌మీడియా ప్రైవేటు ఆర్మీల పేరిట ప్రత్యేక విభాగాలు నడిపిస్తున్నారు. సాధారణంగా పార్టీ అధికారిక సోషల్‌మీడియా వింగుల్లో ఎలాంటి అసభ్యతకు తావుండదు. కానీ, అభిమానుల ముసుగులో ప్రైవేటు ఆర్మీలు తమ పోస్టింగులతో ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడుతున్న తీరు ఆందోళనకరంగా ఉందని పోలీసులే వ్యాఖ్యానిస్తున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలుగొచ్చని, దాడులకు పురిగొలిపే ప్రమాదముందని పోలీసులే ఆందోళన వ్యక్తం చేస్తున్నారంటే వీటి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ రాగానే.. పార్టీల సానుభూతిపరులు అప్పటికపుడు ప్రత్యేకంగా కంటెంట్ రైటర్లు, డీటీపీ ఆపరేటర్లు, వీడియో ఎడిటర్లను నియమించుకున్నారు. కేవలం 20 రోజులకే వీరికి రూ.30 వేల నుంచి 40 వేల వరకు చెల్లిస్తూ ఇలాంటి పోస్టులను ప్రోత్సహిస్తున్నారు. సీనియర్ ఐపీఎస్‌లతో పర్యవేక్షణ! విద్వేషపు పోస్టులపై గ్రేటర్ సీపీ అంజనీకుమార్, సైబరాబాద్ సీపీ సజ్జనార్‌లు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే పలువురిని అరెస్టు చేశామని, ఇకపై పునరావృతమైనా సహించేది లేదని తెలిపారు. విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు చేసేవారిని ఉపేక్షించమని స్పష్టం చేశారు. డీజీపీ కార్యాలయం ఆదేశాల మేరకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండల్లోని సీసీఎస్ డీసీపీలతోపాటు, కొందరు సీనియర్ ఐపీఎస్‌లు ఈ తరహా పోస్టింగులపై నిఘా వేశారు. ప్రజలు, నాయకులు చేసే ఫిర్యాదుల పైనే కాకుండా అవసరమైతే పోలీసులు కూడా స్వచ్ఛందంగా కేసులు నమోదు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. -
హైదరాబాద్‌కు కేటీఆర్ ఏం చేశారు?
సాక్షి, హైదరాబాద్: కేంద్రం ఏమిచ్చిందని అంటున్న మంత్రి కేటీఆర్ హైదరాబాద్‌కు ఏం చేశారని ఎమ్మెల్యే రఘునందన్‌రావు ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. జీహెచ్ఎంసీ ఎన్నికలను హిందూ– ముస్లింల మధ్య పోటీగా చిత్రీకరించవద్దని కోరారు. చింతమడకకు కేసీఆర్ ఇచ్చింది రూ. 1.5 లక్షలేనని, కేంద్రం రూ. 8 లక్షలు ఇచ్చిందని, అలాగే భాగ్యనగరంలో రెండు లక్షల ఇళ్ల నిర్మాణానికి కేంద్రం నిధులు మంజూరు చేసిందని తెలిపారు. దేవాలయాల గురించి మాట్లాడే హక్కు కేసీఆర్, కేటీఆర్‌లకు లేదన్నారు. (మేమొస్తే పాతబస్తీ.. భాగ్యనగరమే) నగరంలో మాకు నచ్చిన ఆలయానికి వెళ్తామని, గుడికి వెళ్లాలంటే కేసీఆర్ అనుమతి తీసుకోవాలా లేక ఒవైసీల అనుమతి కావాలా అని ప్రశ్నించారు. హిందూగాళ్లు.. బొందుగాళ్లు అన్నందుకు కరీంనగర్ ప్రజ లు టీఆర్ఎస్కు సరైన సమాధానం చెప్పారని వ్యాఖ్యానించారు. టీఆర్ ఎస్ వచ్చాకే హైదరాబాద్‌లో అరాచకాలు పెరిగాయన్నారు. సామాన్యుల ఇళ కు వేల రూపాయల పన్నులు వేస్తూ, మౌలాలి టీఆర్ఎస్ కార్పొరేటర్ ఇం టికి రూ.101 మాత్రమే పన్ను వేయ డం ఈ ప్రభుత్వానికి న్యాయమేనా అని రఘునందన్ ప్రశ్నించారు. (పాతబస్తీలో 10 నుంచి 15 స్థానాలు గెలుస్తాం ) -
మాస్కు ఉంటేనే ఓటు
సాక్షి, హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా బ్యాలెట్ బాక్సులను తీసుకెళ్లే సిబ్బందికి, బ్యాలెట్ పేపర్లను ఒక దగ్గరకు చేర్చే ఉద్యోగులకు పీపీఈ కిట్లు ఇవ్వాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ సూచించింది. కరోనా నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు ఇటీవల రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారథికి సమగ్ర మార్గదర్శకాలను అందజేశారు. ఆ ప్రకారం ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల కార్యకలాపాల్లో పాల్గొనే వారందరూ తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. లేకుంటే పోలింగ్ స్టేషన్లలోకి ప్రవేశం ఉండదని స్పష్టం చేశారు. ‘నో మాస్క్ నో ఎంట్రీ’అని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారు. ‘భౌతికదూరం తప్పనిసరిగా పాటించాలి. రాజకీయ పార్టీలు, ఎన్నికల సిబ్బంది తమ కార్యకలాపాలను పెద్ద పెద్ద హాళ్లలో నిర్వహించుకోవాలి. పోలింగ్, భద్రతా సిబ్బంది కిక్కిరిసినట్లు వెళ్లకుండా తగినన్ని వాహనాలను సమకూర్చుకోవాలి. ఎన్నికల సిబ్బంది అంతా ఆరోగ్య సేతు యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాల’ని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ఆరడుగుల దూరం పోలింగ్‌స్టేషన్‌కు వచ్చే ఓటర్ల మధ్య ఆరడుగుల దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలి. ఎన్నికల సందర్భంగా కోవిడ్ జాగ్రత్తలను పర్యవేక్షించేందుకు వార్డు స్థాయి వరకు నోడల్ హెల్త్ ఆఫీసర్లను నియమించాలి. పోలింగ్ సిబ్బందిలో ఎవరికైనా కరోనా లక్షణాలుంటే, తక్షణమే వారి స్థానంలో రిజర్వుడు సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవాలి. అభ్యర్థులు తమ రోజువారీ ఎన్నికల ఖర్చులను ఆన్లైన్ ద్వారా సమర్పించవచ్చు. నామినేషన్ సమర్పించడానికి అభ్యర్థితో పాటు మరో ఇద్దరికే అనుమతి ఇస్తారు. రెండు వాహనాలకే అనుమతి. మరికొన్ని మార్గదర్శకాలు... - ఎన్నికల సామగ్రి పంపిణీ, సేకరణ, ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో శానిటైజర్లను అందుబాటులో ఉంచాలి. - పోలింగ్‌స్టేషన్‌ను పరిశుభ్రంగా ఉంచడంపై ప్రత్యేక దృష్టి కేటాయించాలి. - ఓటర్ల మధ్య ఆరడుగుల భౌతిక దూరాన్ని పాటించేలా వలయాలు గీయాలి. వాటిల్లో ఓటర్లు నిలబడేలా పర్యవేక్షించాలి. - స్త్రీ, పురుషులు, వికలాంగులు/ సీనియర్ సిటిజన్లకు... మూడు క్యూలు ప్రత్యేకంగా ఉండాలి. - అవకాశముంటే సీనియర్ సిటిజన్లు, వికలాంగులు, పాలిచ్చే తల్లులు, గర్భిణీ స్త్రీలు క్యూలలో నిలబడకుండా నేరుగా పోలింగ్స్టేషన్లోకి ప్రవేశించేందుకు అనుమతి ఇవ్వాలి. - భౌతికదూరాన్ని పర్యవేక్షించేందుకు వాలంటీర్ల సేవలు ఉపయోగించుకోవాలి. - కోవిడ్ అవగాహనకు పోస్టర్లు ప్రదర్శించాలి. - సిబ్బంది, ఏజెంట్ల కోసం పోలింగ్స్టేషన్లలో భౌతికదూరం పాటించేలా సీటింగ్ ఏర్పాట్లు చేయాలి. - మాస్క్ లేకుండా ఓటర్లను పోలింగ్స్టేషన్లలోకి అనుమతించరు. అయితే ఓటరును గుర్తించేందుకు ఒకసారి మాస్క్‌ను తొలగించి వెంటనే పెట్టుకోవచ్చు. - ప్రతి పోలింగ్ అధికారి ముందు ఒక ఓటరు మాత్రమే నిలబడటానికి అనుమతిస్తారు. - పోలింగ్ అధికారులకు, భద్రతా సిబ్బందికి మాస్క్‌లు, శానిటైజర్లు, ఫేస్‌షీల్డ్‌లు ఇస్తారు. - ఇంటింటి ప్రచారానికి అభ్యర్థితో కలిపి ఐదుగురు వెళ్లొచ్చు. - రోడ్‌షోలలో వాహనాల మధ్య 100 మీటర్ల దూరం పాటించాలి. - ఒకేమార్గంలో రెండు వేర్వేరు రాజకీయ పార్టీ రోడ్ షోలు ఉంటే, వాటి మధ్య కనీసం అరగంట తేడా ఉండాలి. - కరోనా ప్రొటోకాల్ ప్రకారం బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహించుకోవచ్చు. పర్యవేక్షించడానికి హెల్త్ రెగ్యులేటర్లను నియమించాలి. -
‘ఇద్దరు పిల్లల’ నిబంధన ఎందుకు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో ఇద్దరు పిల్లలకన్నా ఎక్కువ సంతానం ఉన్నా పోటీ చేసేలా ఇటీవల చట్ట సవరణ చేశారని, అయితే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో పోటీ చేయాలంటే మాత్రం ఇద్దరు పిల్లలు మాత్రమే ఉండాలన్న నిబంధన ఎందుకని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. జీహెచ్ఎంసీ కార్పొరేటర్‌గా పోటీ చేయాలంటే ఇద్దరు పిల్లలకంటే ఎక్కువ ఉన్న వారు అనర్హులంటూ ఉన్న సెక్షన్ 218ని సవాల్ చేస్తూ శ్రీధర్‌బాబు రవి, మహ్మద్ తాహెర్‌లు దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం గురువారం విచారించింది. ఇద్దరు పిల్లలకన్నా ఎక్కువ ఉన్నవారు కూడా మున్సిపాలిటీల్లో పోటీ చేసేలా ప్రభుత్వం ఇటీవల మున్సిపల్ చట్టానికి సవరణ చేసిందని, అయితే జీహెచ్ఎంసీ పరిధిలో మాత్రం పోటీ చేయడానికి వీల్లేదన్న నిబంధన అలాగే ఉందని, ఇందుకు సరైన కారణాలను కూడా పేర్కొనలేదని పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఎల్.రవిచందర్ వాదనలు వినిపించారు. ఈ వ్యవహారంపై రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేస్తామని ఏజీ అభ్యర్థించారు. అయితే ఈ రెండు వారాల్లో జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ అయితే ఈ పిటిషన్ వేసి ప్రయోజనం ఉండదని రవిచందర్ నివేదించారు. ఈ మేరకు స్పందించిన ధర్మాసనం, ఈ వ్యవహారంపై ఈనెల 17లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఏజీని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈనెల 19కి వాయిదా వేసింది. ( చదవండి: డిసెంబర్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు? ) -
పార్టీలు సహకరించాలి
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసినప్పటి నుంచి ప్రవర్తనా నియమావళి అమల్లోకి వస్తున్నం దున అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు తమకు సహకరించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్ఈసీ) సి.పార్థసారథి కోరారు. ప్రస్తుత జీహెచ్ఎంసీ పాలకమండలి పదవీకాలం వచ్చే ఫిబ్రవరి 10వ తేదీకి ముగుస్తున్నందున, ఆలోగా ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత రాష్ట్ర ఎన్నికల కమిషన్‌పై ఉందని చెప్పారు. త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గురువారం ఎస్ఈసీ కార్యాలయంలో గుర్తింపు పొందిన 11 రాజకీయ పార్టీల ప్రతినిధులతో వార్డుల వారీ ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల గుర్తింపు, మోడల్ కోడ్, అభ్యర్థుల ఎన్నికల ఖర్చు తదితర అంశాలపై కమిషనర్ చర్చించారు. ఒక్కో పార్టీ నుంచి ఇద్దరేసి ప్రతినిధులతో పార్థసారథి విడివిడిగా సమావేశమయ్యారు. వారుల్డవారీగా ఓటర్ల జాబితాలను సక్రమం గా తయారు చేసిన తరువాత ఎన్నికలు నిర్వహించాలని వివిధ రాజకీయపక్షాల నేతలు విజ్ఞప్తి చేశారు. ఏ వార్డులో నివసించే ఓటర్లను ఆ వార్డు జాబితాలోనే చేర్చాలని, ఒక వార్డు ఓటరు ఇంకో వార్డులో ఉండరాదని, ఒక కుటుంబంలోని ఓటర్లంతా ఒకే వార్డులో ఉండేలా కచ్చితంగా నిర్ధారించుకోవాలని ఎన్నికల అథారిటీగా ఉన్న జీహెచ్ఎంసీ కమిషనర్‌ను, డిప్యూటీ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించనున్నట్లు పార్థసారథి చెప్పారు. రాజకీయపార్టీల సూచనలు... దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో సోషల్ మీడియాలో జరిగిన అసత్య ప్రచార ప్రభావం ఎన్నికలపై పడినందున, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అలాంటిది జరగకుండా ఎన్నికల కమిషన్ ఒక ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి నియంత్రణకు చర్యలు చేపట్టాలని టీఆర్ఎస్ ప్రతినిధులు సూచించారు. వార్డులవారీ ఓటర్ల ముసాయిదా జాబితాల్లో చోటుచేసుకున్న అక్రమాలు, తప్పులను సవరించాలని, ఈ అంశంపై విచారణ జరిపి బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవాలని బీజేపీ ప్రతి నిధులు కోరారు. బీసీ రిజర్వేషన్లను పెంచడంతోపాటు పోటీకి ఇద్దరు పిల్లల సంతానం పరిమితిని ఎత్తేయాలని, అన్ని రాజకీయపార్టీలకు అడ్వర్జైజ్మెంట్లో సమాన అవకాశాలు కల్పించాలని, కొన్ని వర్గాల ఓటర్లపై ఈ–ఓటింగ్ వర్తింపజేయడం సరికాదని టీపీసీసీ నేతలు పేర్కొన్నారు. అభ్యర్థులు భారీగా మద్యం, డబ్బులు ఖర్చు చేస్తున్నందున ఈ వ్యయానికి కళ్లెం వేసేందుకు ప్రతి డివిజన్లో ప్రత్యేక పర్యవేక్షక అధికారిని నియమించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు సూచించారు. (సీఎంకు దుబ్బాక ప్రజల దీపావళి గిఫ్ట్) -
గ్రేటర్లో గెలవాల్సిందే
సాక్షి, హైదరాబాద్ : ‘గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలకు నేడో రేపో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఎన్నికల నిర్వహణకు ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్ సన్నాహాలు చేస్తోంది. ఓటరు తుది జాబితా కూడా శుక్రవారం వెలువడుతున్నందున ఎన్నికలకు పార్టీపరంగా పూర్తి సన్నద్ధంగా ఉండటంతో పాటు గెలుపే లక్ష్యంగా పనిచేయాలి’అని టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పార్టీ యంత్రాంగానికి పిలుపునిచ్చారు. మంత్రులు, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, కొం దరు ముఖ్యనేతలతో గురువారం ప్రగతిభవన్‌లో సీఎం భేటీ అయ్యారు. మధ్యా హ్నం 2 గంటల నుంచి దాదాపు ఆరున్నర గంటలపాటు సాగిన ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ ఎన్నికలు మొదలుకుని రాష్ట్రంలోని పలు అంశాలపై చర్చించినట్టు సమాచారం. ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఎన్నికల వ్యూహంపై ఆయన దిశానిర్దేశం చేశారు. వివిధ అంశాలకు సంబంధించి పలుమార్లు మంత్రులు, పార్టీ నేతల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ‘గ్రేటర్ ఎన్నికల్లో డివిజన్లవారీగా మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలకు ఇన్‌చార్జీలుగా బాధ్యతలు అప్పగిస్తాం. ఇప్పటికే డివిజన్లవారీగా పార్టీ ఇన్చార్జీల జాబితా కూడా సిద్ధం చేశాం. జీహెచ్ఎంసీ పరిధిలో పార్టీ పటిష్ట స్థితిలో ఉన్నట్లు అంతర్గత సర్వేల్లో వెల్లడైంది. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేలా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలి’అని సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నెలకొన్న వివిధ సమస్యలను ప్రస్తావించడంతో పాటు టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన నగర అభివృద్దిని సుదీర్ఘంగా నేతలకు వివరించారు. బెంబేలు పడాల్సిన అవసరం లేదు ‘దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం చూసి అధైర్యపడొద్దు. గాలివాటు గెలుపును చూసి గాభరా చెందాల్సిన అవసరం లేదు. మనకు పటిష్టమైన పార్టీ యం త్రాంగం, బలమైన నేతలు ఉన్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్దాం. 2016లో జరిగిన గ్రేటర్ ఎన్నికల ఫలి తాల మాదిరిగానే ఈ దఫా కూడా పార్టీ మంచి ఫలితాలను సాధిస్తుంది. గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను చాలా వరకు నెరవేర్చాం. రోడ్లు, ఇతర మౌలిక వసతుల కల్పనకు రూ.60వేల కోట్లకు పైగా నిధులను ఐదేళ్లలో ఖర్చు చేశాం. మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పార్టీ ఇన్చార్జీలు కీలకంగా వ్యవహరించాలి. డివిజన్ల వారీగా క్షేత్ర స్థాయిలో పార్టీ నేతలు, కార్యకర్తల నడుమ సమన్వయంపై ఇన్చార్జీలు ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉంటుంది’అని మంత్రులు, పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. క్షేత్ర స్థాయిలో అనుసరించాల్సిన వ్యూహాన్ని సీఎం వివరించినట్లు సమాచారం. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బాధ్యత తీసుకోవాలని.. ఎవరికీ మినహాయింపులు ఉండవని సీఎం స్పష్టంచేశారు. కాగా, సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీసేదిగా ఉందని ముఖ్యమంత్రి అభిప్రాయపడినట్టు తెలిసింది. ‘అభూతకల్పనలు, అవాస్తవాలు ప్రచారం చేయడంతో పాటు అభ్యర్థులు, నాయకుల వ్యక్తిత్వం కించపరిచేలా విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. దీనిని అరికట్టాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌పై ఉంటుంది. అ దిశగా ఎన్నికల కమిషన్‌పై ఒత్తిడి తేవాల్సిన అవసరముంది’అని కేసీఆర్ పేర్కొన్నట్టు సమాచారం. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై చర్చ శుక్రవారం సాయంత్రం జరిగే మంత్రిమండలి సమావేశంలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై చర్చిస్తామని సీఎం వెల్లడించినట్లు తెలిసింది. దివంగత నాయిని నర్సింహారెడ్డి, రాములు నాయక్, కర్నె ప్రభాకర్ పదవీ కాలపరిమితి ముగియడంతో ఈ ఏడాది ఆగస్టు నాటికే శాసనమండలిలో గవర్నర్ కోటా స్థానాలు ఖాళీగా ఉన్నాయి. కర్నె ప్రభాకర్, దేశపతి శ్రీనివాస్, గోరటి వెంకన్న, దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కుమార్తె వాణిదేవి, టి.రవీందర్రావు తదితరుల పేర్లు వినిపిస్తుండగా.. శుక్రవారం కేబినెట్ భేటీలో వీటిపై స్పష్టత వచ్చే అవకాశమున్నట్లు పార్టీ నేతలు వెల్లడించారు. గోరటి వెంకన్న పేరు ఇప్పటికే ఖరారు కాగా, మరో రెండు స్థానాలకు ఎవరిని ఎంపిక చేస్తారనే అంశంపై ఔత్సాహిక నేతల్లో ఉత్కంఠ నెలకొంది. కాగా, శాసనమండలి రెండు పట్టభద్రుల కోటా స్థానాల్లో ఓటరు నమోదు జరిగిన తీరును కూడా సీఎం కేసీఆర్ గురువారం జరిగిన సమావేశంలో ప్రస్తావించారు. శాసనమండలి పట్టభద్రుల కోటా ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపైనా దిశానిర్దేశం చేశారు. అలాగే ధరణి పోర్టల్, సన్నరకం వడ్లు తదితర అంశాలను కూడా ముఖ్యమంత్రి ప్రస్తావించారు. మరోవైపు మంత్రులు, పార్టీ ప్రధాన కార్యదర్శులతో సమావేశం ముగిసిన తర్వాత ఏఐఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రగతిభవన్‌లో సీఎంతో భేటీ అయ్యారు. జీహెచ్ఎంసీ ఎన్నికల కోణంలో ఈ భేటీ జరిగి ఉంటుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. దుబ్బాకపై సీఎంకు హరీశ్ నివేదిక.. దుబ్బాక ఉప ఎన్నికకు సంబంధించి గురువారం జరిగిన సమావేశంలో సీఎం కేసీఆర్ ఎలాంటి ప్రస్తావన, సమీక్ష చేయలేదని సమాచారం. అయితే దుబ్బాక ఉప ఎన్నిక ప్రచార బాధ్యతను ఒంటిచేత్తో నిర్వహించిన ఆర్దికశాఖ మంత్రి హరీశ్‌రావు.. సమావేశం ప్రారంభానికి ముందే సీఎం కేసీఆర్‌తో ప్రత్యేకంగా భేటీ అయినట్లు తెలిసింది. దుబ్బాక ఉప ఎన్నికకు సంబంధించిన అన్ని అంశాలను సీఎం కేసీఆర్‌కు ఆయన వివరించినట్లు సమాచారం. అభ్యర్థి ఎంపిక మొదలు పార్టీ పరంగా జరిగిన ప్రచారం, విపక్షాలు.. ప్రత్యేకించి బీజేపీ అనుసరించిన విధానాలు, స్థానిక పరిస్థితులు తదితరాలపై సీఎంకు నివేదిక సమర్పించినట్లు తెలుస్తోంది. -
గ్రేటర్ పోరుకు సిద్ధం కండి
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు రంగం సిద్ధ మైంది. డిసెంబర్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగే అవకాశాలున్నట్టు సమాచారం. వచ్చే ఫిబ్రవరి 10న జీహెచ్ఎంసీ పాలక మండలి పదవీకాలం ముగుస్తుండటంతో ఆలోగా ఎన్నికలు నిర్వహిం చేందుకు అవసరమైన చర్యలు ప్రారంభించాల్సిం దిగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ)ని కలిసి మున్సిపల్ పరిపాలనా శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్ విజ్ఞప్తి చేశారు. కొత్తగా వార్డుల పునర్వ్యవస్థీకరణ లేదని, గతంలోని వార్డులే కొనసాగడంతో పాటు 2016 ఎన్నికల్లో అనుసరిం చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రిజర్వేషన్లే వచ్చే ఎన్నికల్లోనే కొనసాగించేందుకు సంబంధించిన రెండు జీవోలను కూడా ఎస్ఈసీకి అందజేశారు. అంటే రెండోటర్మ్ కూడా అవే రిజర్వేషన్లు కొన సాగేలా ఇటీవల అసెంబ్లీలో చేసిన చట్టసవరణ బిల్లుకు తగ్గట్టుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత పాలకమండలి ఐదేళ్ల పదవీకాలానికి మూడు నెలల ముందు ఎన్నికలు నిర్వహించే సౌలభ్యం జీహెచ్ఎంసీ చట్టంలో ఉన్న విషయం తెలిసిందే. శనివారం ఈ మేరకు ఎస్ఈసీ కార్యా లయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థ సారథితో అరవింద్‌కుమార్, జీహెచ్ఎంసీ కమిష నర్ లోకేశ్‌కుమార్, అధికారులు భేటీ అయ్యారు. వార్డుల వారీగా ఓటర్ల జాబితా రూపొందించి, ప్రచురించడానికి నోటిఫికేషన్ ఇవ్వడానికి ముందు, ఇప్పటి నుంచి ఈ ఎన్నికల ప్రక్రియ అంతా ముగిసేవరకు యావత్ జీహెచ్ఎంసీ యంత్రాంగాన్ని ఎన్నికల పనులపై దృష్టి కేంద్రీ కరించేలా చూడాలని జీహెచ్ఎంసీ కమిషనర్‌కు ఎన్నికల కమిషనర్ సూచించారు. ఎన్నికలు సాఫీగా నిర్వహించేందుకు వార్డులవారీగా ఓటర్ల జాబితాను డిప్యూటీ మున్సిపల్ కమిషనర్లు రూపొందించేలా చూడాలని ఆదేశించారు. ఓటర్ల తుది జాబితాపై నోటిఫికేషన్... జీహెచ్ఎంసీలోని 150 వార్డుల వారీగా ఓటర్ల జాబితాలు సిద్ధం చేసి ఈ నెల 13న ఫొటోలతో కూడిన ఓటర్ల జాబితా తుది ప్రచురణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ శనివారం నోటిఫికేషన్ విడుదల చేశారు. 2020 సంవత్సరం జనవరి 1వ తేదీ ప్రాతిపదికగా (క్వాలిఫైంగ్ డేట్) తాజా అసెంబ్లీ ఓటర్ల జాబితాలను తు.చ తప్పకుండా పాటిస్తూ వార్డుల వారీగా ఓటర్ల జాబితాలు సిద్ధం చేసే బాధ్యతను సంబంధిత మున్సిపల్ సర్కిళ్లలోని జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్లకు అప్పగిస్తున్నట్టు పేర్కొన్నారు. శాసనసభ ఓటర్ల జాబితాని యథాతథంగా పాటిస్తూ అదే ఫార్మాట్లో జీహెచ్ఎంసీలోని అన్ని వార్డుల వారీగా ఫోటోలతో కూడిన ఓటర్ల జాబితాలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రతీ వార్డు వారీగా మున్సిపల్ ఓటర్ల జాబితా టైటిల్ పేజీలో పోలింగ్ ఏరియాల వివరాలను పొందుపరచాలని సూచించారు. నవంబర్ 13న తుది ఓటర్ల జాబితాను ప్రచురించాక, ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే దాకా చేర్పులు, తొలగింపులు లేదా కరెక్షన్లు వంటి వాటిని నిబంధనలకు అనుగుణంగా ఈఆర్వోల నుంచి సంబంధిత డిప్యూటీ కమిషనర్లు స్వీకరించి, ఆ మేరకు సంబంధిత వార్డులోని ఓటర్ల జాబితాల్లో చేర్చాలని ఈ నోటిఫికేషన్లో పార్థసారథి పేర్కొన్నారు. 5న కలెక్టర్లతో పార్థసారథి సమావేశం జీహెచ్ఎంసీ వార్డులు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల పరిధిలో ఉండటంతో ఎన్నికల ఏర్పాట్లు, సంసిద్ధతపై ఆయా జిల్లాల కలెక్టర్లతో నవంబర్ 5న ఎన్నికల కమిషనర్ సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే 150 డివిజన్లలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన రిటర్నింగ్ అధికారులను ఎస్ఈసీ నియమించింది. ఈ నేపథ్యంలో ఆర్వోలు, ఇతర ఎన్నికల సిబ్బందికి శిక్షణనిచ్చే ‘ట్రైనింగ్ టు ట్రైనర్స్’(టీవోటీ)కు నవంబర్ 3, 4 తేదీల్లో శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఓటర్ల జాబితా షెడ్యూల్ ఇదీ... నవంబర్ 7న వార్డుల వారీగా ముసాయిదా ఫోటో ఓటర్ల జాబితాలను తయారుచేసి, సాధారణ ప్రజలు పరిశీలించేందుకు వీలుగా రూల్‌నెం.5లో పేర్కొన్న ప్రదేశాల్లో ప్రదర్శించాలి. 8వ తేదీనుంచి 11 వరకు వార్డుల వారీ ఫోటో ఓటర్ల జాబితాపై ఏవైనా అభ్యంతరాలుంటే స్వీకరణ. 9న గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని రాజకీయ పార్టీల ప్రతినిధులతో జీహెచ్ఎంసీ కమిషనర్, ఎన్నికల అధికారి సమావేశం. 10న జీహెచ్ఎంసీ సర్కిల్ స్థాయి రాజకీయ పార్టీల ప్రతినిధులతో డిప్యూటీ కమిషనర్ల సమావేశం. 12న ఏవైనా అభ్యంతరాలుంటే డిప్యూటీ కమిషనర్ల ద్వారా పరిష్కారం. 13న సంబంధిత సర్కిళ్లలో డిప్యూటీ కమిషనర్ల ద్వారా వార్డుల వారీగా ఫోటోలతో కూడిన ఓటర్ల జాబితాల తుది ప్రచురణ. -
జీహెచ్ఎంసీ ఎన్నికలు పారదర్శకంగా జరగాలి
సాక్షి, హైదరాబాద్ : జీహెచ్ఎంసీ నాయకులతో 2021 కొత్త ఓటర్ లిస్ట్ సమరీపై రివ్యూ జరిగిందని కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ చైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ సమస్యలపై చర్చించామని వెల్లడించారు. దీనిలో భాగంగా 150 డివిజన్లు యధాతథంగా ఉంటాయా లేదా అనేది ప్రభుత్వం ప్రభుత్వం స్పష్టం చేయాలని తెలిపారు. అదే విధంగా వార్డు డీలిమిటేషన్‌పై కూడా స్పష్టత ఇవ్వాలని కోరారు. 'వార్డుల పునర్విభజన చట్ట ప్రకారం 2021 జనాభా లెక్కల ప్రకారం జరగాలి కానీ 2016లో రిజర్వేషన్ చివరి నిమిషం వరకు చెప్పకుండా వ్యవహరించారు. అలాంటి ధోరణి సరైనది కాదని మేం డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయంపై జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి కమిషనర్ , స్టేట్ ఎలక్షన్ కమిషన్‌ను కూడా కలుస్తాం. జీహెచ్ఎంసీ ఎన్నికలు బ్యాలెట్ ద్వారా ఎన్నికల కోసం సిద్ధం చేస్తోందంటూ వార్తలు వస్తున్నాయి. కాని కమిషన్ మాత్రం మమ్మల్ని అభిప్రాయాలు కొరుతూ లేఖలు రాశారు. (మేము సైతం.. రెఢీ) ఎన్నికల నిర్వహణపై లాభనష్టాలను తెలపాలి. స్టేట్ ఎలక్షన్ కమిషన్ వెంటనే అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేయాలి. 800 ఓటర్లు ఒక పోలింగ్ స్టేషన్ కు కాకుండా 500లకు మాత్రమే పరిమితం చేయాలని డిమాండ్ చేస్తాం. 2015లో ఓటర్ల ఆక్రమణల తొలగింపుపై మా పోరాటం వల్ల అప్పటి కమిషనర్ సోమేశ్ కుమార్‌ను తొలగించారు. ఓటరు లిస్ట్ తయారుపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి కి తీసుకెళ్తాం. ఎన్నికల సంఘం టోల్ ఫ్రీ పనిచేయకపోవడం దురదృష్టకరం. ఇంటి నెంబర్ సెర్చ్ అనేది ఎలక్షన్ వెబ్ సైట్లో ఉండాలి. 68లక్షల ఓట్లలో అవకతవకలు ఉన్నాయని హైకోర్టు లో పిటిషన్ వేస్తే.. న్యాయస్థానం అంగీకరించారు. ఎన్నికలు న్యాయంగా జరగాలంటే ఓటరు జాబితా సరిగా నిర్వహించాలి' అని పేర్కొన్నారు. (బాధిత కుటుంబాలను ఆదుకుంటాం: తలసాని) -
వారసుల అరంగేట్రం
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వారసులు గెలిచొచ్చారు. బంజారాహిల్స్ డివి జన్‌లో టీఆర్ఎస్ తరఫున ఎంపీ కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మి 5వేలకుపైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించగా, ముషీరాబాద్‌లో మంత్రి నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాసరెడ్డి 11వేలు, ఖైరతాబాద్‌లో పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి 12వేల మెజారిటీతో గెలిచారు. ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి కోడలు విజయలక్ష్మి అల్వాల్‌లో 6వేల మెజారిటీతో ఎన్నికయ్యారు. గౌలి పురా డివిజన్లో కేంద్ర మాజీ మంత్రి ఆలె నరేంద్ర సతీమణి లలిత గెలిచారు. మాజీమేయర్ మాజిద్ హుస్సేన్ మెహిదీపట్నంలో గెలిచారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కుమార్తె లాస్యనందిత (టీఆర్ఎస్) కవాడిగూడ నుంచి 11 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. కాంగ్రెస్ మేయర్ అభ్యర్థిగా ప్రచారమైన మాజీ మంత్రి ముఖేశ్ తనయుడు విక్రంగౌడ్ జాంబాగ్ డివిజన్లో ఓటమి పాలయ్యారు. గన్‌ఫౌండ్రీలో పోటీ చేసిన ముఖేష్ కుమార్తె శిల్ప కూడా గెలవలేదు. మాజీ మేయర్ కార్తీకరెడ్డి తార్నాకలో, ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కోడలు అనితారెడ్డి ఆర్‌పురంలో ఓడారు. -
నగరంలోని సర్కిళ్ల వారీగా కౌంటింగ్ కేంద్రాలు
నగరంలోని సర్కిళ్ల వారీగా కౌంటింగ్ కేంద్రాలు -
పొత్తు పోరు
బెడిసికొడుతున్న టీడీపీ-బీజేపీ పొత్తు వ్యూహం ప్రచారంలో క నిపించని ముఖ్యనేతలు, కార్యకర్తలు సాక్షి, సిటీబ్యూరో: పేరుకే పొత్తు.. క్షేత్రస్థాయిలో పోరు. గ్రేటర్లో టీడీపీ-బీజేపీ కూటమి పరిస్థితి ఇది. సీట్ల సర్దుబాటుతో మొదలైన ఈ చిచ్చు ఇప్పుడు తారాస్థాయికి చేరింది. ‘ఎవరికి వారే యమునా తీరే..’ అన్నట్లు రెండు పార్టీల నేతలు వ్యవహరించడంతో పొత్తు వ్యూహం బెడిసికొట్టేలా ఉంది. ముఖ్య నాయకులు, కార్యకర్తలు కలిసిరాక కొందరు అభ్యర్థులు విజయావకాశాలపై ఆందోళన చెందుతున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఉమ్మడి పోరని టీడీపీ, బీజేపీ ముఖ్య నేతలు చెబుతున్నా డివిజన్లలో పరిస్థితి మరోలా ఉంది. పొత్తు ధర్మం మరిచి రెండు పార్టీల అభ్యర్థులు ఒకరిపై ఒకరు కత్తులు దూస్తున్నారు. చాలా చోట్ల టీడీపీ, బీజేపీ రెబెల్స్ గుబులు రేపుతున్నారు. ప్రచారంలో అది స్పష్టంగా కన్పిస్తోంది. బీజేపీ నగర అధ్యక్షుడు బి.వెంకటరెడ్డి భార్య పద్మ తరఫున బాగ్ అంబర్‌పేట డివిజన్లో పాదయాత్ర నిర్వహించారు. డివిజన్ టీడీపీ అధ్యక్షుడు తప్ప ఒక్క టీడీపీ కార్యకర్త రాలేదు. ఇక టీడీపీ పోటీచేస్తున్న కవాడీగూడ, అమీర్‌పేట డివిజన్లలో బీజేపీ సహాయ నిరాకరణ చేస్తోంది. కవాడీగూడ టీడీపీ అభ్యర్థి రూపాల రాజశ్రీ ప్రచారంలో ఎమ్మెల్యే లక్ష్మణ్, పదిమంది బీజేపీ కార్యకర్తలు తప్ప ఎవరూ పాల్గొనడం లేదు. ఒంటరిపోరుతో గెలుపెలా..? పలు డివిజన్లలో మిత్రపక్ష నేతలు సహకరించడపోవడంతో అభ్యర్థులు ఒంటరి పోరు చేస్తున్నారు. హిమాయత్‌నగర్ నుంచి బీజేపీ అభ్యర్థి బి.మహాలక్ష్మి రామన్‌గౌడ్ బరిలో ఉండగా...టీడీపీ మాజీ కార్పొరేటర్ బాబూయాదవ్ టికెట్ ఆశించారు. టికెట్ దక్కపోవడంతో టీఆర్ఎస్లోకి జంప్ అయ్యి భార్య హేమలతను పోటీలో నిలిపారు. డివిజన్లోని టీడీపీ క్యాడర్ మొత్తం టీఆర్ఎస్లోకి వలసపోయింది. టీడీపీ నేతలు సహకరించక పోవడంతో బీజేపీ అభ్యర్థి మహాలక్ష్మి రామన్‌గౌడ్ ఒంటరి పోరుకు సిద్ధమయ్యారు. మాదాపూర్ డివిజన్ బీజేపీ అభ్యర్థి సతీష్ సకాలంలో బి-ఫారం ఇవ్వలేకపోయారు. దీంతో కూటమి నుంచి టీడీపీ అభ్యర్థి ఖరారయ్యాడు. అయితే ప్రచారంలో బీజేపీ నేతలెవ్వరూ పాల్గొనడం లేదు. సతీష్‌ను ఇండిపెండెంట్‌గా గెలిపించాలని కార్యకర్తలు, నాయకులు టీడీపీకి సహాయ నిరాకరణ చేస్తున్నారు. పైకి మిత్రులు.. తెరచాటున ఎత్తులు బేగంబజార్, ఘాన్సీబజార్, గోషామహల్ డివిజన్లలో టీడీపీ క్యాడర్ అంటీముట్టనట్లు ఉంది. ఇక బీజేపీలోనే ఓ వ్యతిరేకవర్గం గట్టిగా పనిచేస్తోంది. ఈ స్థానాల్లో గెలుస్తామా లేదా అన్న భయం బీజేపీకి పట్టుకుంది. ఉప్పల్, చర్లపల్లి, ఐ.ఎస్.సదన్, ఉప్పుగూడ, రామాంతపూర్, ఓల్డ్ మలక్‌పేట్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, బోరబండ, గచ్చిబౌలి, పటాన్చెరు, తార్నక, బౌద్ధనగర్ డివిజన్లలో మిత్రపక్షాలు పరోక్షంగా తలపడుతున్నాయి. ఈ మిత్రభేదం చివరికి ఏం చేటు చేస్తుందోనని టీడీపీ, బీజేపీ ముఖ్యనేతలు తలలు పట్టుకుంటున్నారు. -
ఏ పార్టీ గెలిస్తే..ఎవరు మేయర్ అవుతారు?
► కౌన్ హై..మేయర్ ► ముందే పావులు కదిపిన కాంగ్రెస్ ► మేయర్ అభ్యర్థిగా ముఖేష్ తనయుడు విక్రంగౌడ్ ► టీఆర్ఎస్ జాబితాలో విజయలక్ష్మీ, రాంమోహన్,జగదీశ్వర్‌గౌడ్ ► ఎంఐఎం పరిశీలనలో మాజిద్,నవీన్‌యాదవ్ హైదరాబాద్ సిటీబ్యూరో--- ఏ పార్టీ గెలిస్తే..ఎవరు మేయర్ అవుతారు..డిప్యుటీ మేయర్ అవుతారు..అన్న చర్చ నగరంలో ఊపందుకుంది. సోమవారం కాంగ్రెస్ పార్టీ గత చరిత్రకు భిన్నంగా ఎన్నికలకు ముందుగానే మేయర్ అభ్యర్థిగా మాజీ మంత్రి ముఖేష్‌గౌడ్ తనయుడు జాంభాగ్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మూల విక్రంగౌడ్‌ను ప్రకటించింది. దీంతో మిగిలిన అన్ని ప్రధాన పార్టీల్లో చర్చ పలువురు అభ్యర్థుల చుట్టూ తిరుగుతోంది. కాంగ్రెస్ పార్టీలో మరో బలమైన అభ్యర్థి లేకుండా పోవటంతో గోషామహల్ నియోకజవర్గానికి చెందిన విక్రంను తమ అభ్యర్థిగా ప్రకటించింది. ఇక తెలంగాణ రాష్ట్ర సమితిలో సైతం మేయర్ అభ్యర్థులెవరన్న పరిశీలన మొదలైంది. బంజారాహిల్స్ డివిజన్ నుండి పోటీ చేసిన ఎంపీ కే.కేశవరావు కూతురు గద్వాల విజయలక్ష్మీ,చర్లపల్లి స్థానం నుండి పోటీ చేస్తునన బొంతు రాంమోహన్,మాదాపూర్ డివిజన్ నుండి పోటీచేస్తున్న జగదీశ్వర్గౌడ్ల చుట్టూ చర్చ సాగుతోంది. ఇటీవల కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్లో చేరిన జగదీశ్వర్‌గౌడ్‌కు టీఆర్ఎస్ మదాపూర్ నుండి, ఆయన భార్య పూజిత హఫీజ్‌పేట కార్పోరేటర్లుగా పోటీ చేస్తున్నారు.అయితే టీఆర్ఎస్ ముందుగానే అభ్యర్థిని ప్రకటించే అవకాశం కనిపించటం లేదు. మేయర్ ఎన్నిక రోజే అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఎక్కువగా ఉందని నగరానికి చెందిన సీనియర్ మంత్రి ఒకరు పేర్కొన్నారు. ఎంఐఎం జాబితాలో మాజిద్,నవీన్ యాదవ్ ఎంఐఎం జాబితాలో మాజీ మేయర్ మాజిద్ హుస్సేన్, జూబ్లిహిల్స్ నియోజక వర్గ నాయకుడు నవీన్యాదవ్ల పేర్లు పరిశీలనకు వచ్చే అవకాశం ఉంది. మాజిద్ హుస్సేన్ మెహిదీపట్నం డివిజన్ నుండి.నవీన్ యాదవ్ రహమత్‌నగర్ డివిజన్ నుండి పోటీ చేస్తున్నారు. అయితే 60 స్థానాలకే పోటీ చేస్తున్న ఎంఐఎం కూడా ముందుగా మేయర్ అభ్యర్థిని ప్రకటించే ఛాన్స్ కనిపించటం లేదు. ఎంఐఎం గెలుచుకునే స్థానాలకు తోడు, తమ సహాయం అవసరమైన పార్టీలు ముందుకొచ్చిన తర్వాత మేయర్,డిప్యుటీ మేయర్ పదవులపై చర్చించాలని భావిస్తోంది. తమ మద్దతు కీలకమైతే మేయర్ స్థానాన్ని కోరుకోవాలన్న ఆలోచనతో ఉన్నట్లు సమాచారం.ఇక తెలుగుదేశం,బీజేపీల్లో ఇంకా మేయర్ ఊసే కనిపించటం లేదు. -
మూసీ.. బచావో
గతమెంతో ఘనకీర్తితో చరిత్ర పుటల్లోకి ఎక్కిన మూసీ.. నేడు కాలుష్య కాసారంగానూ రికార్డుకెక్కింది. అత్యంత విషతుల్యమై గరళ సాగరంగా మారింది. అమృత జలంతో అలరారిన జీవనది.. నేడు విష వ్యర్థాలతో ఉక్కిరిబిక్కిరవుతోంది. కాలుష్య కాసారమై క‘న్నీటి’ కష్టాలు వెల్లదీస్తోంది. మరి ఈ అపర సంజీవనిని ఆదుకొనే ఆపద్బాంధవుడు ఎవరు? స్వచ్ఛమైన జలంతో నగరవాసుల దాహార్తి తీర్చిన జలాశయానికి పూర్వ వైభవం తీసుకొచ్చే నాయకుడెవరు? మూసీ ప్రక్షాళనకు నడుం బిగించి ముందుకొచ్చే పార్టీ ఏది? ప్రస్తుతం నగరవాసుల్లో మెదులుతున్న ఆలోచనలివి. గ్రేటర్ ఎన్నికల వేళ.. వీరందరి నోటా ఒకటే మాట.. మూసీ ప్రక్షాళన. గుజరాత్‌లోని సబర్మతి నది తరహాలో మూసీని ప్రక్షాళన చేయాలని సిటీజనులు కోరుతున్నారు. ఆ దిశగా కృషి చేసే పార్టీకే పట్టం కడతామంటున్నారు. అనంతగిరిలో పురుడు పోసుకున్న అపర సంజీవని మూసీ. సుమారు వంద కిలో మీటర్లు ప్రవహించి నగరంలోకి ప్రవేశిస్తోందీ నది. సిటీ నడుమ సుమారు 25 కిలోమీటర్ల మేర ప్రవహిస్తోంది. నాడు నగరవాసులకు తాగునీటిని అందించిన ఈ నది.. నేడు వ్యర్థాలతో మురికి కూపంగా మారింది. కాలుష్య కారక నదుల్లో జాతీయ స్థాయిలో నాలుగో స్థానంలో నిలిచిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో గుజరాత్‌లోని సబర్మతి నదిలా మూసీని ప్రక్షాళన చేయాలని సిటీజనులు, పర్యావరణవేత్తలు గట్టిగా కోరుతున్నారు. అన్ని వర్గాల ప్రజల నుంచి ఈ డిమాండ్ వెల్లువెత్తుతోంది. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధాన రాజకీయ పక్షాలు ఈ అంశానికి అధిక ప్రాధాన్యతనివ్వాలని కోరుతున్నారు. మురికి కూపం..! పరిశ్రమలు, వాణిజ్య సముదాయాలు, ఇతర నివాస ప్రాంతాల నుంచి వెలువడుతోన్న వ్యర్థాలతో మూసీ మురికి కూపమైంది. నిత్యం 1400 మిలియన్ లీటర్ల మురుగు నీరు ఇందులో కలుస్తోంది. రెండేళ్ల క్రితం జేఎన్ఎన్యూఆర్ఎం నిధులతో మూసీ మొదటి దశ ప్రక్షాళన చేపట్టారు. నదీ పరివాహక ప్రాంతంలోఐదు మురుగు శుద్ధి (ఎస్టీపీ) కేంద్రాలను నిర్మించారు. ప్రస్తుతం మొదటి దశ కింద రోజు వారీగా సుమారు 500 మిలియన్ లీటర్ల మురుగు నీటిని మాత్రమే శుద్ధి చేస్తున్నారు. మరో 900 ఎంఎల్డీల మురుగు నీరు మూసీలోకే ప్రవేశిస్తుండడంతో నది కాలుష్య కాసారంగా మారుతోంది. అటకెక్కిన సంకల్పం.. కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా చారిత్రక నదులను పరిరక్షించేందుకు జాతీయ నదీ పరిరక్షణ పథకం(ఎన్‌ఆర్‌సీడీ) ప్రారంభించింది. ఇందులో భాగంగా మూసీ రెండోదశ ప్రక్షాళన పథకం కింద నిత్యం 610 మిలియన్ లీటర్ల మురుగు నీటిని శుద్ధి చేయాలని రెండేళ్ల క్రితం సంకల్పించారు. ఇందుకయ్యే రూ.923 కోట్ల అంచనా వ్యయంలో 70 శాతం నిధులు భరించేందుకు కేంద్రం ముందుకొచ్చింది. కానీ అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికపరంగా పూచీకత్తు (కౌంటర్గ్యారంటీ) ఇవ్వడంలో విఫలమవడంతో ప్రక్షాళన పథకం అటకెక్కింది. ప్రస్తుత ప్రభుత్వ చొరవతో మళ్లీ ఈ అంశం తెరపైకి వచ్చింది. ఎవరిదీ పాపం..? మూసీ కాలుష్యానికి సర్కారు నిర్లక్ష్యం, మానవ ప్రమేయమే కారణమన్నది సుస్పష్టం. దశాబ్దాలుగా ఈ నదిని మురుగు కూపంగా మార్చినపాపం రాజకీయ, పారిశ్రామిక, వాణిజ్య వర్గాలకే దక్కుతుందన్నది బహిరంగ రహస్యమే. గత కొన్నేళ్లుగా రోజూ మిలియన్ లీటర్ల మురుగు నీరు మూసీలో కలుస్తున్నా.. దాని నివారణకు పాలకవర్గం తీసుకున్న చర్యలు శూన్యమనే చెప్పాలి. మూసీ ప్రక్షాళనకు శాశ్వత ప్రాతిపదికన చర్యలు చేపట్టాల్సిన పాలకవర్గం, అధికారులు చేష్టలుడిగి చూస్తుండడంతోనే ఈ దుస్థితి వచ్చింది. ప్రాజెక్టు సాకారమైతేమూసీకి మహర్దశ కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఎన్‌ఆర్‌సీడీ పథకం కింద మూసీ రెండో దళ ప్రక్షాళన ప్రారంభమైతే నదిని కాలుష్యం నుంచి కాపాడొచ్చు. దీనికి ప్రభుత్వం చొరవ చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంచనా వ్యయం: రూ.923కోట్లు (ఎన్‌ఆర్‌సీడీ పథకం కింద కేంద్ర ఆర్థిక సహాయం 70 శాతం, 30 శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది) ఉద్దేశం: మూసీలో రోజు వారీగా కలుస్తున్న 610 మిలియన్ లీటర్ల మురుగు నీటిని శుద్ధి చేయడం చేపట్టనున్న నిర్మాణాలు: మూసీ నది ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో ఐదేసి చొప్పున మొత్తం 10 సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ల ఏర్పాటు ఎస్టీపీలు ఎక్కడెక్కడ: అంబర్పేట్(142ఎంఎల్డీ), నాగోల్(140), నల్లచెరువు(80), హైదర్షాకోట్(30), అత్తాపూర్(70), మీరాలం(6), ఫతేనగర్(30), ఐడీపీఎల్ టౌన్షిప్(59), నాగారం(29), కుంట్లూర్-హయత్‌నగర్(24) రీసైక్లింగ్ యూనిట్లు ఫతేనగర్, ఐడీపీఎల్ టౌన్షిప్, నాగారం- కాప్రా ప్రత్యేకతలు జీహెచ్ఎంసీ పరిధిలో మూసీ నది ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో 574.59 చదరపు కిలోమీటర్లలోని నాలాలు, పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలను శుద్ధి చేసి తిరిగి నదిలోకి వదలడం. తద్వారా మూసీనది కాలుష్య కాసారం కాకుండా నివారించొచ్చు. నది పరివాహక ప్రాంతాల్లో ఈ నీటిని వ్యవసాయ అవసరాలకు వినియోగించుకునేందుకు వీలుగా మార్చే అవకాశం ఉంటుంది. సబర్మతి ఆదర్శంగా సాగాలి ముందుకు.. వాణిజ్య, పారిశ్రామిక వ్యర్థాలతో విషతుల్యమైన సబర్మతి నది ప్రక్షాళనకు నాటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ 2010లో నడుం బిగించారు. సుమారు రూ.550 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు మూడేళ్లలోనే పూర్తయింది. చారిత్రక నదిని కాలుష్య కాసారం నుంచి విముక్తి చేసింది. ఇందులో గుజరాత్ కాలుష్య నియంత్రణ మండలి, అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, సబర్మతి రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ లిమిటెడ్‌ల కృషి ఎంతగానో ఉంది. ఇవి సమన్వయంతో పనిచేసి లక్ష్యాన్ని సాధించి ఆదర్శంగా నిలిచాయి. ఒకప్పుడు మురుగు కంపు కొట్టిన సబర్మతి నది పరిసరాల్లో ఇప్పుడు ఆహ్లాద వాతావరణం నెలకొంది. అహ్మదాబాద్ వాసులకు సబర్మతి తీరం ఇప్పుడు చక్కటి పర్యాటక స్థలంగా మారింది. నగరం నుంచి సుమారు 10 కిలోమీటర్ల మేర ఈ నది ప్రవహిస్తోంది. సబర్మతి ప్రక్షాళనలో భాగంగా పారిశ్రామిక, వాణిజ్య, గృహాల నుంచి నదిలోకి వ్యర్థ జలాలు చేరుతున్న 17 ప్రాంతాలను గుర్తించారు. వ్యర్థ జలాలు ఉత్పత్తవుతున్న ప్రాంతాల నుంచి ప్రత్యేక పైప్లైన్లు వేసి ఆ నీటిని మురుగు శుద్ధి కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు చేశారు. ఇక్కడ వ్యర్థ జలాల్లోని ఘన, ద్రవ, రసాయనిక వ్యర్థాలను పూర్తిగా శుద్ధి చేసి.. ఆ తర్వాత నీటిని నదిలోకి వదిలే ఏర్పాటు చేశారు. దీంతో నదిలో కాలుష్యం గణనీయంగా తగ్గింది. ఇదే స్ఫూర్తితో మూసీ ప్రక్షాళనకు జీహెచ్ఎంసీ, పీసీబీ, జలమండలి విభాగాలు సమన్వయంతో ముందుకు సాగాలి. ఓటు ప్రమాణం జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు కమిషనర్ జనార్దన్‌రెడ్డి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బేగంపేట్ కుందన్‌బాగ్‌లోని చిన్మయ విద్యాలయంలో విద్యార్థులకు శుక్రవారం ప్రత్యేక హామీ పత్రం అందజేశారు. తమ తల్లిదండ్రులు, మిత్రులు, ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు వేసేలా కృషి చేయాలని విద్యార్థులతో ప్రమాణం చేయించారు. 100 శాతం ఓటింగ్ జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు కమిషనర్ తెలిపారు. కార్యక్రమంలో సెంట్రల్ జోన్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్, డిప్యూటీ కమిషనర్ అశోక సామ్రాట్, పాఠశాల కరస్పాండెంట్ హరిగోపాల్ పాల్గొన్నారు. - సోమాజిగూడ -
విద్యుత్ చార్జీల పెంపు నివేదిక మళ్లీ వాయిదా!
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో విద్యుత్ చార్జీల పెంపునకు సంబంధించిన ప్రతిపాదనలను మరోసారి వాయిదా వేయాలని రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు నిర్ణయించాయి. 2016-17కు సంబంధించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదిక (ఏఆర్ఆర్)ను గత నెలాఖరులోగా రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి సమర్పించాల్సి ఉంది. అయితే జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఏఆర్ఆర్లను సమర్పిస్తే ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉండటంతో డిస్కంలు ఇప్పటికే రెండు సార్లు వాయిదా కోరాయి. రెండోసారి గడువు కూడా శనివారంతో ముగిసిపోనుండగా డిస్కంలు ఇంకా ఏఆర్ఆర్లను సమర్పించలేదు. జీహెచ్ఎంసీ ఎన్నికలు ముగిసిన తర్వాత సమర్పించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 5వ తేదీకి గడువు పొడిగించాలని కోరేందుకు డిస్కంలు సన్నద్ధమయ్యాయి. ఈ మేరకు ఈఆర్సీకి లేఖ రాయనున్నాయి. -
విధులు విస్మరిస్తే కఠిన చర్యలు
జీహెచ్ఎంసీ ఎన్నికల అధికారి జనార్దన్‌రెడ్డి సాక్షి,సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోలింగ్ విధులకు సంబంధించిన ఉత్తర్వులు అందినప్పటికీ, ఇప్పటి వరకు ఎలాంటి శిక్షణ కార్యక్రమానికి హాజరు కాని సిబ్బందిపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నట్లు జీహెచ్ఎంసీ ఎన్నికల అధికారి, కమిషనర్ జనార్దన్‌రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తగిన కారణాలతో ఇప్పటి వరకు శిక్షణ కార్యక్రమాలకు హాజరు కాని వారికి చివరి అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. వారు పోలింగ్ విధులకు తమ సంసిద్ధతను తెలియజేస్తూ వివరాలు నమోదు చేసుకునేందుకు ఈ నెల 23లోగా జీహెచ్ఎంసీ కాల్‌సెంటర్ నెంబర్ 040-21111111లో గానీ, ట్యాంక్‌బండ్ దగ్గర్లోని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో గానీ సంప్రదించాలని సూచించారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోకుండా ఎన్నికల ఉత్తర్వులను విస్మరించిన వారిపై ఎన్నికల నియమ నిబంధనల మేరకు క్రమశిక్షణ/క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
దిగ్విజయ్ కాలుపెడితే కాంగ్రెస్ ఖతం: నల్లాల
సాక్షి,హైదరాబాద్: ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ కాలు పెట్టిన ప్రతీ చోటా కాంగ్రెస్ పార్టీ గల్లంతవుతోందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు అన్నారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ.. గాంధీభవన్‌లో కాంగ్రెస్ నేతలు చెప్పే మాటలు విని సీఎం కేసీఆర్‌పై దిగ్విజయ్ అర్థంలేని విమర్శలు చేస్తున్నారన్నారు. -
ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టొద్దు
లోకేశ్‌పై ఎంపీ బాల్క సుమన్ ఫైర్ సాక్షి, హైదరాబాద్: ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టి, గొడవలు సృష్టించే రీతిలో టీడీపీ నేత నారా లోకేశ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మాట్లాడుతున్నారని టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ మండిపడ్డారు. బుధవారం తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ భానుప్రసాద్, ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిలతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. జీహెచ్ఎంసీలో మేయర్ స్థానాన్ని దక్కించుకోలేకపోతే మంత్రి పదవికి రాజీనామా చేస్తాననే ప్రకటనకు కేటీఆర్ కట్టుబడి ఉన్నారన్నారు. కేటీఆర్ వల్లే హైదరాబాద్‌కు బ్రాండ్ ఇమేజీ వచ్చిందన్నారు. టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి సంస్కారహీనుడన్నారు. ఏఐసీసీ నేత దిగ్విజయ్‌సింగ్ కాలుపెట్టిన ప్రతీచోటా కాంగ్రెస్ ఖాళీ అవుతోందని.. ఆయన పేరును అపజయ్‌సింగ్‌గా మార్చాలన్నారు. -
బాబు తీరుపై ‘తమ్ముళ్ల’ అసంతృప్తి
గ్రేటర్ ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు ప్రసంగంతో కంగుతిన్న టీటీడీపీ నేతలు సాక్షి ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణలో తెలుగుదేశం పార్టీని అధినేత చంద్రబాబునాయుడు పూర్తిగా వదిలేసుకున్నారేమోనని తెలంగాణ టీడీపీ నేతలు ఆం దోళన చెందుతున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచార సభలో అధికార పార్టీ టీఆర్ఎస్పై, ప్రభుత్వంపై చంద్రబాబు కనీస విమర్శలు కూడా చేయకపోవడమేమిటని ప్రశ్నిస్తున్నారు. ఇందుకు ‘ఓటుకు కోట్లు’ కేసు భయమే కారణమని భావిస్తున్నారు. అసలు ‘ఓటుకు కోట్లు’ వ్యవహారంలో బాబు నేరుగా మాట్లాడిన ఆడి యో టేపులు బహిర్గతం కావడం, ఏసీబీ తమ చార్జిషీటులోనూ చంద్రబాబు పేరు ప్రస్తావించి న నేపథ్యంలో... కేసీఆర్‌తో సఖ్యత కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారంటున్నారు. మంగళవారం నిజాం కళాశాల మైదానంలో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల సభలో చంద్రబాబు ప్రసంగించిన తీరు చూస్తే ఇదే అభిప్రాయం కలుగుతోందని పేర్కొంటున్నారు. ఇలాగైతే ఎలా..? గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారానికి రావడానికి తొలుత విముఖత చూపి, పార్టీ నేతల ఒత్తిడి మేరకు బహిరంగసభలో పాల్గొన్న చంద్రబాబు ముక్తసరి ప్రసంగం చేయడం వారికి ఏ మాత్రం మింగుడు పడడంలేదు. అధికారంలో ఉన్న టీఆర్ఎస్ను, ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపలేనప్పుడు ప్రతిపక్షంలో ఉండి పార్టీని ముందుకు నడిపించడం ఎలా సాధ్యమని టీడీపీ సీనియర్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ‘ఇప్పుడు మా ముందు గ్రేటర్ ఎన్నికలున్నా యి. ఇప్పటికిప్పుడు మా వైఖరి మార్చుకోవడానికి అనువైన ప్లాట్‌ఫాం దొరకాలి కదా. మా నిర్ణయం ఏదైనా గ్రేటర్ ఎన్నికల తరువాతే’ అని తెలంగాణ టీడీపీలో సీనియర్ నేత ఒకరు చెప్పారు. తెలంగాణలో టీడీపీ కోసం రక్తం ధారపోసిన కుటుంబాలున్నాయని, చంద్రబాబు వారిని తీసుకెళ్లి సీఎం కేసీఆర్‌కు బలిపెడతారనుకోవడం లేదని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఓ టీవీ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. కేసీఆర్‌తో దోస్తీ కడుతున్న బాబుకు పరోక్షంగా సంకేతాలు ఇవ్వడానికే రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేతలే అంటున్నారు. దానికి తోడు టీటీడీపీ శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు పార్టీ అధినాయకత్వం వైఖరిపై అసంతృప్తితో ఉన్నారని, మంగళవారంనాటి సభలో నమస్కారం అం టూ ఆయన ముక్తసరిగా మాట్లాడటానికి ఇదే కారణమని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ‘మేమేమో నిత్యం కేసీఆర్‌తో, టీఆర్ఎస్తో గొడవ పడాలి. పార్టీ అధినేత మాత్రం సఖ్యత తో ఉంటారు. ఇదెలా సాధ్యం? పార్టీ కేడర్ మమ్మల్ని ఎలా విశ్వసిస్తుంది’ అని ఎర్రబెల్లి సన్నిహితులవద్ద ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు-కేసీఆర్ కలసిపోయినప్పుడు మనిద్దరి మధ్య విభేదాలు ఎందుకంటూ ఎర్రబెల్లి, రేవంత్ సరదా వ్యాఖ్యలు కూడా చేసుకున్నారని ఓ ఎమ్మెల్యే చెప్పారు. నేతల్లో నిస్పృహ పార్టీ అధినేత చంద్రబాబు గ్రేటర్ ఎన్నికలను సీరియస్‌గా తీసుకోవడం లేదని గ్రహించిన మాజీ కార్పొరేటర్లు అనేక మంది గతవారం రోజులుగా టీఆర్ఎస్లో చేరుతున్నారు. మంగళవారం సాయంత్రం ఎల్బీనగర్, మహేశ్వరం నియోజకవర్గాలకు చెందిన ఏడుగురు మాజీ కార్పొరేటర్లు టీడీపీని వీడారు. ఇక చంద్రబాబు వైఖరి స్పష్టమైన తరువాత మిగిలిన వారు కూడా పార్టీలో కొనసాగుతారనుకోవడం లేదని పార్టీ నేతలు అంటున్నారు. పోటీ చేయడానికి ముందుకు వస్తున్నవారు కూడా తక్కువేనని... కొన్ని డివిజన్లలో మినహా టికెట్లకు పెద్దగా డిమాండ్ లేదని జీహెచ్ఎంసీ పరిధిలోని టీడీపీ ఎమ్మెల్యే ఒకరు చెప్పారు. ‘బాబు ఎంత బలవంతంమీద ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారో ఆయన ప్రసం గం చూస్తేనే అర్థమవుతుంది. ఇదేమీ మా కేడర్‌కు పనికొచ్చేదిగా లేదు. పైగా పార్టీలో ఉండడం ఎందుకన్న ఆలోచన కలిగించేలా ఉంది’ అని ఆ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. ఎప్పుడో పన్నెండేళ్ల క్రితం తామేదో చేశామని గొప్పలు చెప్పుకుంటే ప్రయోజనం లేదని టీడీపీ సీనియర్ నేత ఒకరు చంద్రబాబు ప్రసంగాన్ని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. టీడీపీ ప్రభుత్వానికి సంబంధమేలేని ఔటర్ రింగ్‌రోడ్డు కూడా తమ ఖాతాలో వేసుకోవడంపైనా టీడీపీ శ్రేణులు విస్తుపోతున్నాయి. ‘ఓటుకు కోట్లు’ కేసు కోసమే బాబు కేసీఆర్‌తో సంధి కుదుర్చుకున్నారన్న ఆరోపణలకు ఆయన ప్రసంగం అద్దం పట్టిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. బీజేపీలో అంతర్మథనం తరచూ సీఎం కేసీఆర్‌పై ఒంటికాలితో లేస్తున్న బీజేపీ నేతలు చంద్రబాబు వైఖరితో ఇబ్బంది పడుతున్నారు. టీఆర్ఎస్కు, సీఎం కేసీఆర్ కుటుంబానికి వ్యతిరేకంగా ప్రచారం మొదలు పెట్టినవారంతా బాబు ప్రసంగంతో కంగుతిన్నారు. ‘‘ఆయన ప్రసంగం ఇలా ఉంటుందనుకోలేదు. వేదిక మీద ఉన్న మాకే ఏం చేయాలో పాలుపోలేదు. టీడీపీ కార్యకర్తలకు కూడా మింగుడు పడలేదు. దీని ప్రభావం మా పార్టీపై పడుతుందేమో’’ అని బీజేపీ ఎమ్మెల్యే ఒకరు ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీతో పొత్తు లేకుంటే బాగుండనేదాకా తమ పార్టీ నేతలు మాట్లాడుతున్నారన్నారు. ఇక తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి రఘునందన్‌రావు అయితే బుధవారం ఉదయం ఓ టీవీ చర్చాగోష్టిలో మాట్లాడుతూ.. చంద్రబాబు వైఖరిని తప్పుపట్టారు. 15 నిమిషాల్లోనే ముగిసిన ప్రసంగం.. ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసినా, చివరకు కలెక్టర్ల కాన్ఫరెన్స్ అయినా సరే చంద్రబాబు గంటకు తక్కువ కాకుండా మాట్లాడతారు. ఇక బహిరంగ సభల్లో అయితే అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలపై, ప్రతిపక్షంలో ఉంటే అధికారపక్షంపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించడం ఆయన నైజం. టీడీపీ నేతలే ప్రైవేట్ సంభాషణల్లో ‘మైకాసురుడు’గా పిలుచుకునే చంద్రబాబు... మంగళవారం హైదరాబాద్‌లోని నిజాం కళాశాల మైదానంలో జరిగిన సభలో 15 నిమిషాల్లోనే తన ప్రసంగాన్ని ముగించడం చూసి వేదిక మీద ఉన్న టీడీపీ, బీజేపీ నేతలే ఆశ్చర్యపోయారు. ఈ 15 నిమిషాల ప్రసంగంలోనూ తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ను గానీ, సీఎం కేసీఆర్‌ను, ప్రభుత్వాన్ని గానీ పల్లెత్తు మాట అనకపోవడం చూసి విస్తుపోయారు. తాము అధికారంలో ఉన్న ఏపీలో ఏవిషయంలోనూ ప్రధాన ప్రతిపక్షం అభిప్రాయానికి విలువ ఇవ్వకపోగా, అదే పనిగా ఎదురుదాడికి దిగడమే అలవాటు చేసుకున్న చంద్రబాబు... తెలంగాణలో అధికారపక్షాన్ని మాటమాత్రంగానైనా విమర్శించలేదు. దీనికి ‘ఓటుకు కోట్లు’ కేసు కారణమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దాదాపు ఆర్నెల్ల కింద హైదరాబాద్‌లో ఏపీ పోలీసు స్టేషన్ పెడతామని బీరాలు పలికిన చంద్రబాబు.. ఆ తరువాత సీఎం కేసీఆర్‌ను ఒక్క మాట కూడా అనలేనంతగా మారిపోయారు. -
టీఆర్ఎస్ అధికార దుర్వినియోగం
‘మీట్ ద ప్రెస్’లో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. ఇతర పార్టీల నుంచి గెలిచిన వారిని టీఆర్ఎస్లో చేర్చుకోవడానికి బెదిరింపులు, కేసులు, ప్రలోభాలకు గురిచేస్తూ సంకుచిత రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. ఇంట్లో మాట్లాడుకుని టీఆర్ఎస్ నిర్ణయాలు తీసుకుంటుందని... కేబినెట్ మీటింగైనా, పార్టీ సమావేశమైనా ప్రజాస్వామ్యమే ఉండదని విమర్శించారు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామికంగా చర్చించి నిర్ణయాలు చేస్తుందన్నారు. బుధవారం హైదరాబాద్‌లో ‘టీయూడబ్ల్యూజే’ ఏర్పాటు చేసిన మీట్ ద ప్రెస్‌లో ఆయన మాట్లాడారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని గెలుచుకుంటామనే విశ్వాసముంటే ఎక్స్అఫీషియో సభ్యుల సంఖ్యను టీఆర్ఎస్ ఎందుకు పెంచుకుంటోందని ఉత్తమ్ ప్రశ్నించారు. కేవలం ప్రత్యక్షంగా ఎన్నికయ్యే కార్పొరేటర్లతోనే టీఆర్ఎస్ మేయర్ పీఠాన్ని దక్కించుకుంటే.. తాము దేనికైనా సిద్ధమేనని ఉత్తమ్ సవాల్ చేశారు. అధికార దుర్వినియో గం చేసి, అడ్డదారిలో మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలనే మంత్రి కేటీఆర్ నోటికొచ్చినట్టుగా సవాళ్లు చేస్తున్నారన్నారు. ‘‘హైదరాబాద్‌లో కేటీఆర్‌కు ఏ గల్లీ తెలుసు, ఆ గల్లీల్లో కష్టాలేం తెలుసు? ఒక సీఎం కుమారుడిగా కేటీఆర్ ఏం మాట్లాడినా చెల్లుతుందా? సీఎం కేసీఆర్ మాట్లాడితే ఒక అర్థం ఉంటుంది’’ అని ఉత్తమ్ అన్నారు. ప్రచారానికి చిరంజీవి... టీఆర్ఎస్ పార్టీతో కాకుండా ప్రభుత్వంతోనే పోటీలా ఎన్నికలున్నాయని ఉత్తమ్ అన్నారు. ఈ పరిస్థితులను చూస్తుంటే ఎన్నికల సంఘం తటస్థ వైఖరిపైనా అనుమానాలు కలుగుతున్నాయన్నారు. మెట్రో రైలుకు అడ్డంకులు కల్పించడం, సెటిలర్లపై అనుచితంగా మాట్లాడటం వంటివాటితో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను కేసీఆర్ దెబ్బకొట్టారన్నారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి, దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని చెప్పి మోసం చేశారని మండిపడ్డారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ అని చెప్పి 19 నెలలుగా ఏం చేశారని నిలదీశారు. రియల్టర్ల కొమ్ముకాయడానికే భవనాల చట్టానికి సవరణలు తెచ్చారన్నారు. 2014 ఎన్నికల్లో తాము సరైన పనితీరు చూపించలేకపోయామని, గ్రేటర్ ఎన్నికల్లో ఆ పరిస్థితి లేదన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ జాతీయ నేతలతో పాటు చిరంజీవి కూడా ప్రచారానికి వస్తారన్నారు. ఎంఐఎంతో బీజేపీ చీకటి ఒప్పందం బీజేపీతో ఎంఐఎం చీకటి ఒప్పందం చేసుకున్నదని ఉత్తమ్ ఆరోపించారు. పలు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా ఎంఐఎం పనిచేసిందన్నారు. హైదరాబాద్‌లోని కొన్ని డివిజన్ల లో ఎంఐఎంతో, మరికొన్ని డివిజన్లలో టీఆర్ఎస్తో మాత్రమే తమకు పోటీ ఉందన్నారు. టీడీపీ తెలంగాణ నుంచి, హైదరాబాద్ నుంచి అదృశ్యమవుతోందన్నారు. బీజేపీ, టీఆర్ఎస్, మజ్లిస్ మినహా మిగతా పార్టీలతో మద్దతుకోసం చర్చలు జరుగుతున్నాయని... కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందనే విశ్వాసం ఓటర్లలో పెరిగిందని, మేయర్ పీఠం తమకే వస్తుందని పేర్కొన్నారు. -
14న కాంగ్రెస్ తొలి జాబితా
♦ జీహెచ్ఎంసీ ఎన్నికలపై టీపీసీసీ సమన్వయ కమిటీ నిర్ణయం ♦ 3 దశల్లో అభ్యర్థుల ప్రకటన సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీకి దింపే అభ్యర్థుల తొలిజాబితాను ఈ నెల 14న విడుదల చేయాలని టీపీసీసీ నిర్ణయించింది. సోమవారం టీపీసీసీ చీఫ్ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన గాంధీభవన్‌లో సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. సీనియర్ నేతలు కె.జానారెడ్డి, షబ్బీర్ అలీ, మల్లు భట్టివిక్రమార్క, నంది ఎల్లయ్య, వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, డి.శ్రీధర్‌బాబు, బలరాం నాయక్, దానం నాగేందర్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభ్యర్థుల ఎంపిక, డివిజన్ల వారీగా ప్రచార వ్యూహం, పార్టీ సీనియర్లకు పని విభజన తదితర అంశాలపై చర్చించారు. అభ్యర్థుల ఎంపిక కోసం వ్యక్తిగత ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా స్వతంత్ర సర్వేలను నిర్వహించాలని, వాటి ఆధారంగా గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ నెల 14న కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించాలని... 15, 16 తేదీల్లో మరో రెండు జాబితాలను విడుదల చేయాలని నిర్ణయానికి వచ్చారు. ఇక ముఖ్యనేతలంతా ఐక్యంగా ఉన్నట్లు పార్టీ శ్రేణులకు విశ్వాసం కల్పించాలని, వ్యక్తిగత విభేదాలతో పార్టీ ప్రయోజనాలకు నష్టం కలిగించకూడదని అభిప్రాయానికి వచ్చారు. దీనికోసం ఉమ్మడిగా ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. గ్రేటర్ ఎన్నికల కోసం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ మంగళవారం హైదరాబాద్‌కు రానున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని రాజేంద్రనగర్, ఖైరతాబాద్, సనత్‌నగర్, ఎల్బీ నగర్ నియోజకవర్గాల్లో జరిగే సభల్లో దిగ్విజయ్ ప్రసంగిస్తారు. -
ఓర్నీ...ఓమ్నీ
ఈ ఓమ్నీని చూశారా? పుష్పక విమానంలా ఎంతమందిని మోసుకెళుతోందో... వీఎస్టీ ఫంక్షన్ హాలులో ఓ పార్టీ సమావేశానికి సోమవారం రాంనగర్ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున మహిళలను తీసుకొచ్చారు. సమావేశం ముగిసిన తరువాత ఓమ్నీ వ్యాన్‌లో సుమారు 25 మంది మహిళలను కుక్కి.. గాలి కూడా అందని స్థితిలో వారిని ఇళ్లకు తరలించారు. ఈ దృశ్యం చూసిన వారు జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో మున్ముందు ఇంకా ఎన్ని వి‘చిత్రాలు’ చూడాల్సి వస్తుందోనని వ్యాఖ్యానించారు. చిత్రం: ఎం.రవికుమార్ -
పరి‘మితి’మీరొద్దు
♦ ఎన్నికల వ్యయంపై నియంత్రణ ♦ ఫిర్యాదులకు కంట్రోల్ రూమ్ ♦ జీహెచ్ఎంసీ ఎన్నికల అధికారి జనార్దన్‌రెడ్డి రాజకీయ పక్షాల ప్రతినిధులతో సమావేశం సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్‌గా పోటీచేసే అభ్యర్థుల ఎన్నికల వ్యయ పరిమితి రూ.5 లక్షలుగా నిర్ణయించినట్లు ఎన్నికల అధికారి, కమిషనర్ డాక్టర్ బి.జనార్దన్ రెడ్డి తెలిపారు. ఎన్నికల వ్యయం, ప్రచారం, ఓటింగ్ శాతం పెంపు తదితర అంశాలపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించా రు. పరిమితికి మించి ఖర్చు చేసేవారిపై అనర్హత వేటు పడుతుందని కమిషనర్ హెచ్చరించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుకు 28 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులు, 24 మంది వ్యయ పరిశీలకులను నియమించినట్లు తెలిపారు. వీడియో చిత్రీకరణ, అకౌంటింగ్, మీడియా మానిటరింగ్ టీమ్‌లు, ఫ్లయింగ్ స్క్వాడ్లను ప్రత్యేకంగా నియమించామన్నారు. ఎన్నికల ప్రచారంలో ఉపయోగించే వివిధ రకాల పరికరాలు, వస్తువులకు అద్దె ధరలు నిర్ధారించినట్టు చెప్పారు. అభ్యర్థులు ఎన్నికల వ్యయానికి సంబంధించి ప్రత్యేక బ్యాంక్ ఖాతాను తెరచి...ఆ నంబర్‌ను నామినేషన్ పత్రంలో పొందుపరచాలని స్పష్టం చేశారు. ప్రచారంలో సెక్యూరిటీ పరంగా బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని వాడవచ్చునని, దానికి ఇంధన వ్యయం భరించాల్సి ఉంటుందని చెప్పారు. ఓటింగ్ శాతంపై దృష్టి ఓటింగ్ శాతాన్ని పెంచడానికి ప్రయత్నించాలని రాజకీయ పార్టీల ప్రతినిధులను కమిషనర్ కోరారు. ఓటరు స్లిప్పులను వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకునే సదుపాయం కల్పించామన్నారు. జీహెచ్ఎంసీలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఎన్నిక ల్లో అక్రమాలు, మద్యం పంపిణీ, నియమావళి ఉల్లంఘనలపై ఫిర్యాదులకు ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్‌ను జీహెచ్ఎంసీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేశామని కమిషనర్ తెలిపారు. వీటిపై 040-23261330, 2322018, 23221978 నెంబర్లు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో పాటు, అడిషనల్ కమిషనర్లు సురేంద్రమోహన్, శివనాయుడు, చీఫ్ అకౌంట్స్ ఎగ్జామినర్ నిరంజన్‌షా తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు మాట్లాడుతూ... అనేక ప్రాంతాల్లో మిగతా పార్టీలకు అవకాశం లేకుండా అధికార టీఆర్ఎస్ అనుమతి పొందిన హోర్డింగులన్నింటినీ బుక్ చేసుకుందని కమిషనర్ దృష్టికి తెచ్చారు. మిగతా పార్టీలకు కొన్ని హోర్డింగులను ఇవ్వాలని కోరారు. దీనిపై కమిషనర్ స్పందిస్తూ హోర్డింగులు ఏర్పాటు చేసిన వారికి అనుమతినిచ్చి ఫీజు తీసుకోవడం తప్ప తామేమీ చేయలేమన్నారు. అభ్యర్థుల తరఫున ప్రచారానికి ప్రముఖ స్టార్లు వస్తే.. ఆ ఖర్చులను కూడా అభ్యర్థి లెక్కలో చూపాలన్నారు. రాష్ట్ర పార్టీల ఖర్చును అభ్యర్థుల ఖాతాలో పొందుపరచాలన్నారు. రిపబ్లిక్ డే రోజు జాతీయ పతాకంతో పాటు పార్టీ జెండాలు ఎగురవే స్తే తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో నిరంజన్ (కాంగ్రెస్), డాక్టర్ సుధాకర్ (సీపీఐ) తదితరులు తమ అభిప్రాయాలు వెలిబుచ్చారు. గతంలో మంత్రి బాగారెడ్డి ప్రచార కార్యక్రమంలో పాల్గొనేందుకు పదవికి రాజీనామా చేశారని నిరంజన్ గుర్తుచేశారు. -
గ్రేటర్ బరిలో ఆర్యవైశ్యులు
ఖైరతాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆర్యవైశ్యులు ముందుకురావాలని, సేవా కార్యక్రమాలతో పాటు రాజకీయాల్లో రాణించాల్సిన అవసరం ఉందని ఇంటర్నేషనల్ వైశ్ ఫెడరేషన్ వర్కింగ్ ప్రసిడెంట్ గంజిరాజమౌళిగుప్త అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వివిధ పార్టీలలో పనిచేస్తున్న, పోటీచేయాలనే కోరిక ఉన్నవారు తమ బయోడేటాలతో లక్డీకాపూల్‌లోని వాసవీ హాస్పిటల్లో మంగళవారం సాయంత్రం 5గంటలకు నిర్వహించే సమావేశానికి హాజరు కావాలని కోరారు. ఔత్సాహికుల నుంచి సేకరించిన బయోడేటాలతో ఆయా పార్టీల తరపున సీటు ఇప్పించడంతో పాటు వారిని గెలిపించేందుకు వైశ్ ఫెడరేషన్ కృషిచేస్తుందన్నారు. నగరంలోని సరూర్‌నగర్, రామకృష్ణాపురం, కొత్తపేట, సీతాఫల్మండి, వారాసిగూడ, గన్‌ఫౌండ్రి, నాగోల్, మౌలాలి, నాచారం, జాంబాగ్, అంబర్పేట్, మూసారాంబాగ్, రామాంతపూర్, హబ్సీగూడ,బాల్నగర్, ఖార్కాణా తదితరప్రాంతాల్లో వైశ్యుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున ఆయా పార్టీల తరపున సీటు కేటాయిస్తే గెలిచి చూపిస్తామన్నారు. సమావేశంలో ఐవీఎఫ్ అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ముత్యాల సత్యయ్య, పొలిటికల్ కమిటి చైర్మన్ నాగబండి ఆనంద్, హైదరాబాద్ అధ్యక్షుడు మాడిశెట్టి సదానందం, సికింద్రాబాద్ అధ్యక్షుడు సత్యనారాయణతో పాటు బూరుగుల లలిత, గౌరిశెట్టి ప్రభాకర్, మహిళా అధ్యక్షురాలు మలిపెద్ది మేఘమాల పాల్గొంటారన్నారు. -
మేయర్ సీటును సీఎంకు బహుమతిగా ఇద్దాం: నాయిని
ముషీరాబాద్ : హైదరాబాద్ నగరాన్ని రెండేళ్లలో విశ్వకేంద్రంగా తీర్చిదిద్దేందుకు గ్రేటర్ ప్రజలు మేయర్ సీటును ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బహుమతిగా ఇవ్వాలని రాష్ట్ర హోం, కార్మికశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. తెలంగాణాలో ‘టీడీపీ క్యాడర్ లేదని, కాంగ్రెస్‌కు నాయకులు లేరని, బీజేపీకి ఓటర్లు లేర’న్నారు. వారికి తెలంగాణ వాదుల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. సోమవారం అడిక్‌మెట్ టిఆర్ఎస్ కార్యాలయంలో డివిజన్ కార్యకర్తల విసృ్తత స్థాయి సమావేశంలో నాయిని మాట్లాడుతూ.. 15ఏళ్ల అలుపెరగని ఉద్యమంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. అధికారం చేపట్టిన 18నెలలుగా రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ అలుపెరగని కృషి చేస్తున్నారన్నారు. ఉద్యమంలో వాడవాడలా తిరిగిన కేసీఆర్ ప్రజల సమస్యలను నేరుగా చూశారన్నారు. అధికారంలోకి రాగానే పేదలందరికి డబుల్ బెడ్రూం ఇళ్లను కేటాయిస్తున్నారన్నారు. ట్రాఫిక్ ఇక్కట్లు లేకుండా మల్టీలెవల్ ఫ్లైవర్స్ నిర్మించడంతోపాటు సిగ్నల్ ఫ్రీ చౌరస్తాలుగా మార్చేందుకు కార్యాచరణ రూపొందించారన్నారు. నగరానికి గోదావరి నీరు తీసుకొచ్చిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. నగరంలో 24గంటలు మంచినీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్, గురుచరణ్‌సింగ్, భన్వర్‌సింగ్, శ్రీనివాస్‌రెడ్డి, శంకర్లుక్, ముఠా గోపాల్, రేఖారెడ్డి, సునీతాప్రకాష్ గౌడ్, జయరాంరెడ్డి, ప్రకాష్ గౌడ్ పాల్గొన్నారు. -
టీఆర్ఎస్ అభ్యర్థుల ఎంపికకు కమిటీ
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీచేసే కార్పొరేటర్ అభ్యర్థుల ఎంపికకు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ఐదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు. ఎంపీ కె.కేశవరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీలో డి.శ్రీనివాస్, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్‌రెడ్డి సభ్యులుగా ఉంటారు. ఇటీవల పార్టీ అభ్యర్థుల గెలుపు అవకాశాలపై నిర్వహించిన సర్వే ఫలితాలను క్రోడీకరించడంతోపాటు, అభ్యర్థుల ఎంపికను నిష్పాక్షికంగా జరిపేందుకు ఈ కమిటీ ఏర్పాటు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సర్వే రిపోర్టుల పరిశీలనతోపాటు ఆశావహులు, ఇన్చార్జి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలతో సంప్రదింపులు జరిపిన తరవాతనే అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. -
50 స్థానాల్లో ఆటోడ్రైవర్ల పోటీ
సుల్తాన్‌బజార్ : గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో 50 స్థానాల్లో ఆటోడ్రైవర్లు పోటీ చేయనున్నట్లు స్టార్ ఆటో అండ్ ట్రాలీ డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మహ్మద్ అబ్దుల్ ఖాదర్ పాషా తెలిపారు. సోమవారం ఆయన హైదర్‌గూడ ఎన్ఎస్ఎస్లో విలేకరులతో మాట్లాడుతూ... గత 40 ఏళ్లుగా ఆటోడ్రైవర్ల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయన్నారు. ప్రభుత్వం ఈ-ఛలాన్ల పేరిట ఆటోవాలాలను వేధింపులకు గురిచేస్తోందని ఆరోపించారు. 50 స్థానాల్లో పోటీ చేసి తమ సమస్యలను తామే పరిష్కరించుకుంటామని ఆయన పేర్కొన్నారు. -
గ్రేటర్లో టీఆర్ఎస్కు కళ్లెం: ఎంపీ గుత్తా
నాగోలు : నగర ప్రజలు కేసీఆర్, కేటీఆర్ మాయ మాటలను నమ్మి మోసపోరాదని, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు కళ్లెం వేయడం ఖాయమని నల్లగొండ ఎంపీ, ఎల్బీనగర్ నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మాజీ ఎంపీ పొన్నం ప్రభా కర్, మాజీ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్లతో కలిసి ఎల్బీనగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. హైదరాబాద్ నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనన్నారు. మెట్రోరైలు, కృష్ణాజలాల సరఫరా తదితర పథకాలకు కాంగ్రెస్ హయాంలోనే శ్రీకారం చుట్టామన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలన నడుస్తోందన్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులే లేని టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ఇతర పార్టీలకు చెందిన నాయకులను తమ పార్టీలో చేర్చుకున్నారన్నారు. వారు నాయకులను ఆకర్షిస్తే మనం ప్రజలను ఆకర్షించి కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని వివరించాలన్నారు. ప్రధాని మోదీ తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్‌కు చేసిందేమీ లేదన్నారు. ఈ ఎన్నికల్లో గెలిచే అభ్యర్థులకే కాంగ్రెస్ టికెట్లు ఇస్తామని, ఎల్బీనగర్ నియోజకవర్గంలోని 11 స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధికార పార్టీ అనేక అక్రమాలకు పాల్పడుతూ రిజర్వేషన్లను తమకు అనుకూలంగా మార్చుకుందన్నారు. అధికారంలో ఉంది తామైనందున నగరం అభివృద్ధి జరగాలంటే టీఆర్ఎస్ గెలవాలనే వాదనతో ప్రజలను మభ్యపెడుతోందని ఆరోపించారు. నగరంలో వైఫై, ఐటీఆర్ ప్రాజెక్ట్ కింద ఉద్యోగాలు, స్కై ఓవర్ల నిర్మాణం పేరుతో ముఖ్యమంత్రి చేస్తున్న ప్రకటనలు పెద్ద జోక్‌గా ఆయన అభివర్ణించారు. ఎన్నికల హామీలలో ఒక్కటి కూడా నెరవేర్చలేదని, గతంలో ఢిల్లీ, బీహార్ ప్రజలు బీజేపీకి ఎలా బుద్ధి చెప్పారో గ్రేటర్లో కూడా టీఆర్ఎస్కు బుద్ధి చెప్పాలన్నారు. జిల్లా అధ్యక్షుడు క్యామ మల్లేష్, మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని వీడి తల్లికి ద్రోహం చేయవద్దని, నియోజకవర్గంలో పార్టీ పటిష్టంగా ఉందని, అన్ని స్థానాలలో పార్టీ జెండాను ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం నిర్వహించే కాంగ్రెస్ బహిరంగ సభకు రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్, పీసీసీ, సీఎల్పీ నేతలు హాజరుకానున్నట్లు తెలిపారు. సమావేశంలో నాయకులు ప్రభాకర్‌రెడ్డి, యాదగిరిరెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, దీప్‌లాల్‌నాయక్, మహేష్‌రెడ్డి, చంద్రశేఖర్‌రావు, ధన్‌రాజ్, రాఘవేందర్‌రెడ్డి, ముస్కు శేఖర్‌రెడ్డి, గట్టు జ్యోతి నర్సింహ్మారావు, కైసర్, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన బిగ్‌బజార్ సమీపంలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మంగళవారం సాయంత్రం జరగనున్న కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ ఏర్పాట్లను ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, క్యామ మల్లేష్, మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి పరిశీలించారు. సభకు నియోజకవర్గం పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి కార్యకర్తలు అధిక సంఖ్యతో తరలిరావాలని పిలుపునిచ్చారు. -
అభివృద్ధే టీఆర్ఎస్ లక్ష్యం
చంపాపేట: తెలంగాణ రాష్ర్ట అభివృద్ధి, పేద, మధ్య తరగతి ప్రజల సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. వివిధ పార్టీల నాయకులు, మాజీ కార్పొరేటర్లు టీఆర్ఎస్లో చేరిన సందర్భంగా సోమవారం రాత్రి చంపాపేట డివిజన్ కొత్త కాపు యాదవరెడ్డి ఫంక్షన్ హాల్లో సమావే శం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైనకేటీఆర్ మాట్లాడుతూ గత 60 ఏళ్లలో కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు చేయనివిధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. సమగ్ర సర్వేపై టీడీపీ, కాంగ్రెస్‌లు అసత్య ప్రచారాలు చేశాయన్నారు. మాజీ కార్పొరేటర్లు, టీడీపీ నేతలు సామ రమణారెడ్డి, గజ్జెల సుష్మామధుసూధన్రెడ్డి, జిట్టా రాజశేఖర్ రెడ్డి, కాంగ్రెస్‌కు చెందిన లింగాల నాగేశ్వరరావు, రాహుల్ గౌడ్, భవానీ ప్రవీణ్ కుమార్, బీజేవైఎం నాయకుడు కళ్లెం నవజీవన్రెడ్డిలతో పాటు పలువురు కార్యకర్తలకు ఆయన కండువాలను వేసి..టీఆర్ఎస్లోకిఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహేందర్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, తలసాని, ఎంపీ బాల్క సుమన్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ పాల్గొన్నారు. -
సగం స్థానాలు మహిళలకే
జీహెచ్ఎంసీ వార్డుల రిజర్వేషన్ల నోటిఫికేషన్ జారీ ♦ మహిళల(జనరల్)కు 44, బీసీలకు 50, ఎస్సీలకు 10, ♦ ఎస్టీలకు 2, రిజర్వు కానివి 44 ♦ అన్ని కేటగిరీలు కలిపి మహిళలకు 75 వార్డుల కేటాయింపు సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ జారీకి కొద్దిసేపు ముందు ప్రభుత్వం జీహెచ్ఎంసీ వార్డుల రిజర్వేషన్లను వెల్లడించింది. ఈ మేరకు మునిసిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధిశాఖ శుక్రవారం జీవో (నంబర్ 25)ను జారీ చేసింది. ఈ జీవో వెలువడిన దాదాపు గంటన్నర వ్యవధిలో ఎన్నికల షెడ్యూల్‌ను జారీ చేశారు. గ్రేటర్‌లోని మొత్తం 150 వార్డులకు(డివిజన్లకు)గాను స్థానిక సంస్థల్లో మహిళల కోటాగా 50 శాతం రిజర్వేన్లను వారికి వర్తింపజేస్తూ, ఆయా వర్గాలకు వార్డులను ఖరారు చేశారు. మొత్తం 150 వార్డులకు గాను మహిళ(జనరల్)కు 44, బీసీలకు 50, ఎస్సీలకు 10, ఎస్టీలకు 2 వార్డులు రిజర్వు చేశారు. ఇవిపోను ఓపెన్ కేటగిరీలో 44 వార్డులు కేటాయించారు. మహిళలకు 75 సీట్లు.. మహిళల కోటాలో భాగంగా 75 సీట్లు వారికి దక్కేందుకు జనరల్‌లో 44 వార్డులు, బీసీల్లో 25 వార్డులు , ఎస్సీల్లో 5 వార్డులు, ఎస్టీల్లో 1 వార్డు చొప్పున కేటాయించారు. వార్డుల వారీగా రిజర్వేషన్లు ఎస్టీ జనరల్(1): డివిజన్ నంబర్-46 (ఫలక్‌నూమా) ఎస్టీ మహిళ(1): 16 (హస్తినాపురం) ఎస్సీ జనరల్(5): 1 (కాప్రా), 4 (మీర్పేట్ హెచ్‌బీ కాలనీ), 62(జియాగూడ), 133 (మచ్చబొల్లారం), 135(వెంకటాపురం) ఎస్సీ మహిళ(5): 60(రాజేంద్రనగర్), 90 (కవాడిగూడ), 142(అడ్డగుట్ట), 144(మెట్టుగూడ), 147(బన్సీలాల్‌పేట్) బీసీ జనరల్(25): 3(చర్లపల్లి), 29 (చావ్నీ), 39(సంతోష్‌నగర్), 43(చాంద్రాయణగుట్ట) 48(శాలిబండ), 51(గోషామహల్), 52(పురానాపూల్), 53(దూద్‌బౌలి), 54(జహనూమా), 55(రామ్‌నస్‌పురా), 56 (కిషన్‌బాగ్), 58(శాస్త్రీపురం), 64(దత్తాత్రేయనగర్), 65(కార్వాన్), 69(నానాల్‌నగర్) , 70(మెహిదీపట్నం), 71(గుడిమల్కాపూర్), 83(అంబర్పేట్), 88(భోలక్‌పూర్), 103 (బోరబండ), 112(రామచంద్రాపురం), 113 (పటాన్చెరు), 125(గాజులరామారం), 126 (జగద్గిరిగుట్ట), 127(రంగారెడ్డి నగర్) బీసీ మహిళ(25): 9(రామాంతపూర్), 26 (ఓల్డ్‌మలక్‌పేట్), 34(తలాబ్చంచల్), 35 (గౌలీపుర), 37(కుర్మగూడ, 41(కంచన్‌బాగ్), 42(బార్కాస్), 47(నవబ్సాహెబ్కుంట), 49 (ఘాన్సీబజార్), 57(సులేమాన్‌నగర్), 61(అత్తాపూర్), 63(మంగళ్‌హాట్), 67(గోల్కొండ) , 68(టోలీచౌకీ), 72(ఆసిఫ్‌నగర్), 73(విజయనగర్‌కాలనీ), 74(అహ్మద్‌నగర్), 75(రెడ్‌హిల్స్), 76(మల్లేపల్లి), 82(గోల్నాక), 86 (ముషీరాబాద్), 101(ఎర్రగడ్డ), 128(చింత ల్),146(బౌద్దనగర్), 148(రాంగోపాల్‌పేట్) విమెన్ జనరల్(44): 2(డాక్టర్ ఎ.ఎస్.రావునగర్), 6(నాచారం), 7(చిలుకానగర్), 8(హబ్సీగూడ) , 10(ఉప్పల్) , 11(నాగోల్), 19(సరూర్‌నగర్), 20(ఆర్కేపురం), 24(సైదాబాద్), 25(మూసారాంబాగ్), 28(అజాంపుర) , 33(మోఘల్పురా), 38(ఐఎస్ సదన్), 66(లంగర్‌హౌజ్), 78(గన్‌ఫౌండ్రీ), 79(హిమాయత్‌నగర్), 80(కాచిగూడ), 81(నల్లకుం ట), 84(బాగ్అంబర్పేట్), 85(అడిక్‌మెట్), 89(గాంధీనగర్) , 91(ఖైరతాబాద్), 92(వెంకటేశ్వరకాలనీ), 97(సోమాజిగూడ), 98(అమీర్‌పేట్), 100(సనత్‌నగర్), 109(హఫీజ్‌పేట్) , 110(చందానగర్) , 111(భారతీనగర్), 115(బాలాజీనగర్), 116(అల్లాపూర్), 122(వివేకానంద్‌నగర్ కాలనీ), 130(సుభాష్‌నగర్), 131(కుత్బుల్లాపూర్), 132(జీడిమె ట్ల), 134(అల్వాల్), 136(నేరేడ్మెట్), 137(వినాయక్‌నగర్), 138(మౌలాలి), 141(గౌతంనగర్),143(తార్నాక),145(సీతాఫల్మండి), 149(బేగంపేట్),150(మోండామార్కెట్). అన్రిజర్వ్డ్(44): 5(మల్లాపూర్), 12(మన్సూరాబాద్), 13(హయత్‌నగర్), 14(బీఎన్‌రెడ్డి నగర్), 15(వనస్థలీపురం), 17(చంపాపేట్), 18(లింగోజీగూడ), 21(కొత్తపేట్), 22(చైతన్యపురి), 23(గడ్డి అన్నారం), 27(అక్బర్‌బాగ్), 30(డబీర్‌పురా), 31(రెయిన్బజా ర్), 32(పత్తర్‌గట్టి), 36(లలితాబాగ్), 40(రియాసత్‌నగర్), 44(ఉప్పుగూడ), 45(జంగంమెట్), 50(బేగంబజార్), 59(మైలార్దేవుపల్లి), 77(జాంబాగ్), 87(రాంనగర్), 93 (బంజారాహిల్స్), 94(షేక్‌పేట్), 95(జూబ్లీహిల్స్), 96(యూసఫ్‌గూడ), 99(వెంగళ్రావునగర్), 102(రహమత్‌నగర్), 104(కొండాపూర్),105(గచ్చిబౌలి), 106(శేరిలింగంపల్లి), 107(మాదాపూర్), 108(మియాపూర్), 114(కేపీహెచ్‌బీ కాలనీ), 117(మూసాపేట్), 118(ఫత్తేనగర్), 119(ఓల్డ్‌బోయిన్‌పల్లి), 120 (బాలానగర్), 121(కూకట్పల్లి), 123(హైదర్‌నగర్), 124(ఆల్వీన్‌కాలనీ), 129(సూరారం), 139(ఈస్ట్ఆనంద్బాగ్), 140 (మల్కాజిగిరి).