ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టొద్దు
లోకేశ్‌పై ఎంపీ బాల్క సుమన్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టి, గొడవలు సృష్టించే రీతిలో టీడీపీ నేత నారా లోకేశ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మాట్లాడుతున్నారని టీఆర్‌ఎస్ ఎంపీ బాల్క సుమన్ మండిపడ్డారు. బుధవారం తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ భానుప్రసాద్, ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిలతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. జీహెచ్‌ఎంసీలో మేయర్ స్థానాన్ని దక్కించుకోలేకపోతే మంత్రి పదవికి రాజీనామా చేస్తాననే ప్రకటనకు కేటీఆర్ కట్టుబడి ఉన్నారన్నారు. కేటీఆర్ వల్లే హైదరాబాద్‌కు బ్రాండ్ ఇమేజీ వచ్చిందన్నారు. టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి సంస్కారహీనుడన్నారు. ఏఐసీసీ నేత దిగ్విజయ్‌సింగ్ కాలుపెట్టిన ప్రతీచోటా కాంగ్రెస్ ఖాళీ అవుతోందని.. ఆయన పేరును అపజయ్‌సింగ్‌గా మార్చాలన్నారు.