విధులు విస్మరిస్తే కఠిన చర్యలు | Ignoring the duties of strict action | Sakshi
Sakshi News home page

విధులు విస్మరిస్తే కఠిన చర్యలు

Published Wed, Jan 20 2016 4:06 AM | Last Updated on Tue, Aug 14 2018 9:04 PM

విధులు విస్మరిస్తే కఠిన చర్యలు - Sakshi

విధులు విస్మరిస్తే కఠిన చర్యలు

జీహెచ్‌ఎంసీ ఎన్నికల అధికారి జనార్దన్‌రెడ్డి

 సాక్షి,సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోలింగ్ విధులకు సంబంధించిన  ఉత్తర్వులు అందినప్పటికీ, ఇప్పటి వరకు ఎలాంటి శిక్షణ  కార్యక్రమానికి హాజరు కాని సిబ్బందిపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నట్లు జీహెచ్‌ఎంసీ ఎన్నికల అధికారి, కమిషనర్ జనార్దన్‌రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తగిన కారణాలతో ఇప్పటి వరకు శిక్షణ  కార్యక్రమాలకు హాజరు కాని వారికి చివరి అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు.

వారు పోలింగ్ విధులకు తమ సంసిద్ధతను తెలియజేస్తూ వివరాలు నమోదు చేసుకునేందుకు ఈ నెల 23లోగా జీహెచ్‌ఎంసీ కాల్‌సెంటర్ నెంబర్ 040-21111111లో గానీ, ట్యాంక్‌బండ్ దగ్గర్లోని జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో గానీ సంప్రదించాలని సూచించారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోకుండా ఎన్నికల ఉత్తర్వులను విస్మరించిన వారిపై ఎన్నికల నియమ నిబంధనల మేరకు క్రమశిక్షణ/క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement