
ఢిల్లీ: హైదరాబాద్ స్థానిక సంస్థల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్ . గౌతం రావును ఖరారు చేసింది. ఈ మేరకు బీజేపీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. బీజేపీ ప్రకటనతో ఎమ్మెల్సీ అభ్యర్థి ఎన్. గౌతం రావు నామినేషన్ దాఖలు చేయనున్నారు.
ఇప్పటికే హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు.. కేంద్ర ఎన్నికల సంఘం గతనెలలో షెడ్యూల్ విడుదల చేసింది. ఎమ్మెల్సీ ప్రభా కర్ రావు పదవీకాలం మే 1తో ముగియనుంది. తాజాగా విడుదలైన షెడ్యూల్ ప్రకారం.. ఈ ఖాళీని భర్తీ చేసేందుకు మార్చి 28న నోటిఫికేషన్ విడుదల చేసింది.
దీంతో నామినేషన్ ప్రక్రియ ప్రారంమైంది. ఏప్రిల్ 4న నామినేషన్లు స్వీకరణ, ఏప్రిల్ 7న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్ 9 గడువు. ఏప్రిల్ 23న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. 25న ఓట్ల లెకింపు, ఫలితాలు వెల్లడిస్తామని ఈసీ తెలిపింది.