సాక్షి, హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో వారసులు గెలిచొచ్చారు. బంజారాహిల్స్ డివి జన్‌లో టీఆర్‌ఎస్ తరఫున ఎంపీ కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మి 5వేలకుపైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించగా, ముషీరాబాద్‌లో మంత్రి నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాసరెడ్డి 11వేలు, ఖైరతాబాద్‌లో పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి 12వేల మెజారిటీతో గెలిచారు. ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి కోడలు విజయలక్ష్మి అల్వాల్‌లో 6వేల మెజారిటీతో ఎన్నికయ్యారు. గౌలి పురా డివిజన్‌లో కేంద్ర మాజీ మంత్రి ఆలె నరేంద్ర సతీమణి లలిత గెలిచారు. మాజీమేయర్ మాజిద్ హుస్సేన్ మెహిదీపట్నంలో గెలిచారు.
కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కుమార్తె లాస్యనందిత (టీఆర్‌ఎస్) కవాడిగూడ నుంచి 11 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. కాంగ్రెస్ మేయర్ అభ్యర్థిగా ప్రచారమైన మాజీ మంత్రి ముఖేశ్ తనయుడు విక్రంగౌడ్ జాంబాగ్ డివిజన్‌లో ఓటమి పాలయ్యారు. గన్‌ఫౌండ్రీలో పోటీ చేసిన ముఖేష్ కుమార్తె శిల్ప కూడా గెలవలేదు. మాజీ మేయర్ కార్తీకరెడ్డి తార్నాకలో, ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కోడలు అనితారెడ్డి ఆర్‌పురంలో ఓడారు.