Heirs
-
టాటా వారసులెవరు..
పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా అస్తమించిన నేపథ్యంలో ఇక 365 బిలియన్ డాలర్ల టాటా మహాసామ్రాజ్యానికి వారసులెవరనే ప్రశ్న తెరపైకి వచ్చింది. ఈ సందర్భంగా పలు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీటిలో రతన్ టాటా సవతి సోదరుడు నోయెల్ టాటాతో పాటు ఆయనకు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన మెహ్లీ మిస్త్రీ పేర్లు కూడా ఉన్నాయి. వాస్తవానికి రతన్ టాటాకు తోడబుట్టిన సోదరుడైన జిమ్మీ టాటా పేరు కూడా పరిశీలించాల్సినప్పటికీ ఆయన వ్యాపార కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో, రతన్ టాటా తండ్రి నావల్ టాటా, మారుతల్లి సిమోన్ టాటా కుమారుడైన నోయెల్ పేరు ప్రముఖంగా తెరపైకి వచి్చంది. టాటా కుటుంబసభ్యుడు కావడంతో పాటు పలు గ్రూప్ కంపెనీలను నడిపించిన అనుభవం కూడా ఉండటమనేది నోయెల్‌కు కలిసొచ్చే అంశంగా కనిపిస్తోంది. ఆయన ప్రస్తుతం ట్రెంట్, వోల్టాస్, టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్, టాటా ఇంటర్నేషనల్ సంస్థలకు చైర్మన్‌గా ఉన్నారు. అలాగే రతన్ టాటా ట్రస్టు బోర్డులో కూడా ఉన్నారు. టాటా సన్స్‌ను పర్యవేక్షించే టాటా ట్రస్ట్స్ చైర్మన్‌గా అయ్యేందుకు ఇది ఆయనకు కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు. రతన్ టాటా వివాహం చేసుకోకపోవడం, ఆయనకు సంతానం లేకపోవడంతో నోయెల్ సంతానానికి భవిష్యత్తులో టాటా గ్రూప్‌లో మరింత ప్రాధాన్యం దక్కే అవకాశం ఉంది. నోయెల్‌కు మాయా, నెవిల్, లియా... ఈ ముగ్గురు సంతానం ఉన్నారు. టాటా మెడికల్ సెంటర్‌కి మాయా ట్రస్టీగా వ్యవహరిస్తుండగా, హైపర్‌మార్కెట్ స్టార్ బజార్‌కి నెవిల్ సారథ్య బాధ్యతలు వహిస్తున్నారు. జుడియో బ్రాండ్ విస్తరించడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. టాటా గ్రూప్‌లో భాగమైన ఇండియన్ హోటల్ కంపెనీలో లియా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సన్నిహితుడు మెహ్లీ..: మెహర్జీ పల్లోంజీ గ్రూప్ డైరెక్టర్ అయిన మెహ్లీ మిస్త్రీ, రతన్ టాటాకు అత్యంత సన్నిహితుడు. ఆయనకు టాటా గ్రూప్‌తో చాలాకాలంగా అనుబంధం ఉంది. 2022లో కారు ప్రమాదంలో మరణించిన టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీకి మెహ్లీ కజిన్ అవుతారు. వాస్తవానికి టాటా సన్స్‌లో పల్లోంజీ మిస్త్రీ గ్రూప్‌నకు 18.4 శాతం వాటా ఉన్నందున ఆ గ్రూప్ అధినేత షాపూర్ మిస్త్రీ పేరు కూడా పరిశీలనకు రావాలి. కానీ టాటాలతో మిస్త్రీలకు విభేదాలు నెలకొన్న నేపథ్యంలో ఆయనకు టాటా సామ్రాజ్యం బాధ్యతలు లభించకపోవచ్చనే అభిప్రాయం నెలకొంది. నోయెల్, మెహ్లీతో పాటు గ్రూప్‌లో ఉన్నవారే కాకుండా బైటి వ్యక్తుల పేర్లు కూడా అకస్మాత్తుగా తెరపైకి వచ్చే అవకాశాలున్నాయి. -
బ్రహ్మంగారి మఠం: వారసుల మధ్య ఆధిపత్య పోరు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్ జిల్లాలోని బ్రహ్మంగారి మఠం వారసత్వంపై వివాదం కొనసాగుతోంది. ఏడో తరానికి చెందిన పీఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా... నూతన పీఠాధిపతి ఎంపిక ప్రక్రియ కుటుంబ సభ్యుల మధ్య గొడవకు దారితీసింది. మఠాధిపతిగా ఉన్న వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామికి ఇద్దరు భార్యలు కాగా మొదటి భార్యకు నలుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. రెండో భార్యకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పీఠాధిపతి పదవి తనకే దక్కాలంటున్న పెద్దభార్య కుమారుడు డిమాండ్ చేస్తున్నారు. తన కుమారుడికే ఇవ్వాలని వీలునామా రాశారని చిన్న భార్య చెబుతున్నారు. వారసుల మధ్య విబేధాల నేపథ్యంలో పీఠాధిపతి ఎంపిక ప్రక్రియలో సందిగ్ధత నెలకొంది. చదవండి: చిన్నారులకు ఏపీ సర్కార్ ఆర్థిక సాయం చిత్తూరు జిల్లాలో కర్ఫ్యూ సమయం పెంపు.. -
బ్రహ్మంగారి మఠం వారసత్వంపై కొనసాగుతోన్న వివాదం
-
ఆ వారసులకు రూ.20 వేల కోట్లు
చండీగఢ్: ఫరీద్ కోట్ మహారాజు హరీందర్ సింగ్ బ్రార్‌కు చెందిన రూ. 20 వేల కోట్ల విలువైన ఆస్తికి వారసులెవరనే విషయంలో పంజాబ్ అండ్ హరియాణా హైకోర్టు సోమవారం కీలక తీర్పును వెలువరించింది. మహారాజు కూతుళ్లు అమృత్ కౌర్, దీపిందర్ కౌర్‌లకు 75%, తల్లి దివంగత మొహిందర్ కౌర్‌కు మిగతా 25% వాటా చెందుతుందని స్పష్టం చేసింది. మొహిందర్ కౌర్ వాటాపై హరీందర్ సింగ్ సోదరుడైన మంజిత్ ఇందర్ సింగ్ వారసులకు హక్కు ఉంటుందని పేర్కొంది. మూడేళ్ల వయసులో హరీందర్ సింగ్ ఫరీద్కోట్ ఎస్టేట్‌కు రాజయ్యారు. ఆ సంస్థానం చివరి రాజు ఆయన నరీందర్ కౌర్‌ను వివాహం చేసుకున్నారు. వారికి ముగ్గురు కూతుళ్లు. ఒక కుమారుడు. కూతుళ్లు అమృత్ కౌర్, దీపిందర్ కౌర్, మహీపిందర్ కౌర్. కుమారుడు హర్మొహిందర్ సింగ్ 1981లో ఒక రోడ్డు ప్రమాదంలో మరణించారు. కూతురు మహీపిందర్ కౌర్ పెళ్లి కాకముందే మరణించారు. మహారాజు హరీందర్ సింగ్ 1989లో చనిపోయారు. అనంతరం ఆయన ఎస్టేట్ ఆస్తులపై వివాదం మొదలైంది. మహారాజు హరీందర్‌కు వంశపారంపర్యంగా వచ్చిన విలువైన ఆస్తులు హిమాచల్‌ప్రదేశ్, ఢిల్లీ, చండీగఢ్, హరియాణాల్లో ఉన్నాయి. వాటి విలువ రూ. 20 వేల కోట్లకు పైనే. కోర్టు కేసు నడుస్తుండగా దీపిందర్ కౌర్ మరణించారు. మహారాజు హరీందర్ సింగ్ మరణం తరువాత ఆయన రాసినట్లుగా చెబుతున్న వీలునామా ఒకటి వెలుగులోకి వచ్చింది. అందులో దీపిందర్ సింగ్ నిర్వహిస్తున్న ‘మహర్వాల్ కేవాజీ ట్రస్ట్’కు ఆస్తి చెందాలని ఉంది. అయితే, ఆ వీలునామా చెల్లదని ముందుగా చండీగఢ్ కోర్టు, ఆ తరువాత తాజాగా హైకోర్టు తేల్చిచెప్పాయి. హిందూ వారసత్వ చట్టం ప్రకారం ఆస్తి పంపకం జరగాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజ్‌మోహన్ సింగ్ తీర్పునిచ్చారు. ఆ ప్రకారం, ఇద్దరు కూతుళ్లకు, మహారాజు చనిపోయిన సమయంలో జీవించి ఉంది కనుక ఆయన తల్లి మొహిందర్ కౌర్‌కు ఆస్తి చెందుతుందని పేర్కొన్నారు. మొహిందర్ కౌర్ రాసిన వీలునామా ప్రకారం తనకు సంక్రమించే ఆస్తి ఆమె మరో కుమారుడు మంజిత్ ఇందర్ సింగ్ కుటుంబానికి చెందుతుంది. ఎస్టేట్స్ యాక్ట్, 1948 ప్రకారం ఆస్తి అంతా తనకే చెందుతుందని అమృత్ కౌర్ వాదించారు. జేష్టస్వామ్య సంప్రదాయం ప్రకారం.. పెద్ద కుమారుడికి కానీ, లేదా జీవించి ఉన్న పెద్ద సోదరుడి కుటుంబానికి కానీ ఆస్తిపై హక్కు ఉంటుందని మంజిత్ ఇందర్ సింగ్ కుమారుడు భరత్ ఇందర్‌సింగ్ వాదించారు. వీలునామా ప్రకారం ఆస్తి అంతా తాను నిర్వహిస్తున్న ట్రస్ట్‌కు చెందాలని దీపిందర్ సింగ్ కోరారు. వీరి వాదనలను హైకోర్టు తోసిపుచ్చింది. ఆస్తిపై హక్కు కోసం కుట్రపూరితంగా రూపొందించారని పేర్కొంటూ వీలునామాను కొట్టివేసింది. ఫరీద్ కోట్ రాజమహల్ -
పోలీసుల అదుపులో ‘ఉయ్యాలవాడ’ వంశీకులు
బంజారాహిల్స్: తమకు న్యాయం చేయాలని కోరుతూ సోమవారం జూబ్లీహిల్స్ రోడ్ నెం. 10 ఎంపీ, ఎమ్మెల్యే కాలనీలోని కొణిదల ప్రొడక్షన్స్ కార్యాలయం ఎదుట బైఠాయించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కుటుంబీకులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. కర్నూలు జిల్లా, ఆళ్లగడ్డ తాలూకా, ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 5వ తరం వారసులు దొరవారి దస్తగిరిరెడ్డి, లక్ష్మి కుమారి మాట్లాడుతూ గత మే నెలలో స్వామినాయుడు, రాంచరణ్ పీఏ అవినాష్ తమను చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌కు పిలిపించి ఉయ్యాలవాడ వంశీకులు 22 మందికి రూ. 5 కోట్లు ఇప్పిస్తామంటూ అగ్రిమెంట్ చేసి నోటరీ కూడా చేసి ఇచ్చారన్నారు. అయితే ఇప్పటి వరకు న్యాయం చేయలేదన్నారు. గత నెల 16న ఒక్కో కుటుంబానికి రూ.15 లక్షల చొప్పున ఏడు కుటుంబాలకు డబ్బులు ఇస్తామని తేల్చిచెప్పారన్నారు. అయితే ఇప్పటివరకు తమకు న్యాయం చేయకపోవడంతో తాము రాంచరణ్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నామన్నారు. ఇటీవల అతడి పీఏ అవినాష్ మీకెలాంటి హక్కులు లేవంటూ చెప్పేశాడని ఆరోపించారు. తమను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నోటరీ చేసినప్పుడే 15 రోజుల గడువు ఇచ్చారని దానిని పూర్తిగా విస్మరించారన్నారు. -
వారసులే.. వారసులు
ముంబై : కాంగ్రెస్ పార్టీ పేరు చెబితే చాలు.. అది నెహ్రూ, గాంధీ కుటుంబ పార్టీ అనే విమర్శలు వినపడతాయి. వాస్తవం ఏమిటంటే.. ఈ దేశంలోని రాజకీయ పార్టీల్లో అత్యధికం ఇలాంటివే. అమిత్ షా నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ కూడా దీనికి మినహాయింపేమీ కాదు. మహారాష్ట్రనే ఉదాహరణగా తీసుకుంటే.. దాదాపు 35 కుటుంబాల వారసులు ఇక్కడి నుంచి లోక్‌సభకు పోటీ చేస్తున్నారంటే ఆశ్చర్యం వేస్తుంది. పార్థ్ పవార్, డాక్టర్ సుజయ్ విఖే పాటిల్ ఏకంగా మూడోతరం రాజకీయ వారసులు. మరాఠా దిగ్గజం, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్‌కు పార్థ్ మనవడు కాగా.. అటల్ బిహారీ వాజ్‌పేయి కేబినెట్లో మంత్రిగా పనిచేసిన బాలాసాహెబ్ విఖే పాటిల్‌కు మనవడు సుజయ్. అంతేకాదు.. సుజయ్ తండ్రి, కాంగ్రెస్ నేత రాధాకృష్ణ విఖే పాటిల్ మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత కూడా. ఆసక్తికరమైన అంశం ఇంకోటి ఏమిటంటే.. పార్థ్ కోసం శరద్ పవార్ తాను ఎన్నోసార్లు పోటీ చేసిన మాధా నియోజకవర్గాన్ని వదులుకోవడం. ఈసారి తాను పోటీ చేయడం లేదని ప్రకటించడం. ఏకకాలంలో ముగ్గురు పవార్లు పోటీలో ఉండటం ఓటర్లకు తప్పుడు సంకేతాలు పంపుతుందన్న అంచనాతో శరద్ పవార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. అయితే బీజేపీ, శివసేన ఈ నిర్ణయాన్ని కూడా తప్పు పడుతుండటం గమనార్హం. సీనియర్ పవార్ బరిలోంచి తప్పుకోవడంతో ఇప్పుడు పార్థ్ పుణే జిల్లాలోని మవాల్ స్థానం నుంచి పోటీ చేస్తుండగా.. శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే బారామతి నుంచి మరోసారి పోటికి దిగారు. సుజయ్ చుట్టూ డ్రామా కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన డాక్టర్ సుజయ్ విఖే పాటిల్ చుట్టూ బోలెడంత డ్రామా నడిచింది. పశ్చిమ మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ నుంచి ఈయన బీజేపీ టికెట్‌పై పోటీ చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రకటనకు రెండు నెలల ముందు నుంచి మహారాష్ట్ర సీనియర్ మంత్రి గిరీశ్ మహాజన్ ద్వారా సుజయ్‌తో టచ్‌లో ఉన్న బీజేపీ చివరకు ఆయన్ను తమ వైపునకు తిప్పుకోగలిగింది. కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన తరువాత ఈ న్యూరోసర్జన్ డాక్టర్ తండ్రి అయిన రాధాకృష్ణ విఖే పాటిల్ చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నారు. ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేయాలని సొంత పార్టీ నేతల నుంచి ఒత్తిడి వచ్చింది. అయితే రాధాకృష్ణ వీటికి లొంగలేదు. మరోవైపు మాధా స్థానం విషయంలో మోహితే పాటిల్ కుటుంబంలో పెద్ద యుద్ధమే నడిచింది. పోటీ చేయడం లేదని ప్రకటించిన తరువాత ‘మాధా’ నుంచి తన సన్నిహితుడు విజయ్ సిన్హ్ పాటిల్ పోటీ చేయాలని శరద్‌పవార్ ఆదేంచారు. అయితే ఇంతలోనే విజయ్ సిన్హ్ కుమారుడు రంజిత్ సిన్హ్ మోహితే పాటిల్ తాను పోటీ చేస్తున్నట్లు ప్రకటించేశారు. ఎన్సీపీ తనకు ఎలాగూ సీటు ఇవ్వదని తీర్మానించుకున్న రంజిత్ సిన్హ్ మార్చి 20న బీజేపీలో చేరిపోయాడు. కానీ.. బీజేపీ రంజిత్ సిన్హ్ మోహితే పాటిల్ స్థానంలో రంజిత్ సిన్హ్ నాయక్ నింబాల్కర్‌కు మాధా టికెట్ ఇచ్చింది. ఈ నింబాల్కర్ గత వారమే కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు. దీంతో ఎన్సీపీ మాధా నుంచి మాజీ ఎమ్మెల్యే, షోలాపూర్ జిల్లా పరిషత్ అధ్యక్షుడు బాబూరావు షిండే తమ్ముడు సంజయ్ షిండేను బరిలోకి నిలిపింది. శివాజీ వారసులు..చవాన్.. ముండేలూ ∙మహారాష్ట్ర ఎన్నికల బరిలో నిలిచిన బోలెడన్ని ఇతర రాజకీయ కుటుంబాల్లో చవాన్, ముండేలతోపాటు ఛత్రపతి శివాజీ వారసులూ ఉన్నారు. 16వ లోక్‌సభలో సతారాకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉదయన్‌రాజే భోసాలే ఛత్రపతి శివాజీ వారసుడు.. 13వ ఛత్రపతిగానూ ఉన్నారు. ఈసారి కూడా ఆయన సతారా నుంచి లోక్‌సభకు పోటీ చేస్తున్నారు. కొల్హాపూర్ నుంచి శివసేన టికెట్‌పై పోటీ చేస్తున్న సంజయ్ మాండలిక్ స్వతంత్ర సభ్యుడు సదాశివరావ్ మాండలిక్ కుమారుడు. మాజీఎమ్మెల్యే అన్నాసాహెబ్ పాటిల్ కుమారుడు నరేంద్ర పాటిల్‌ను శివసేన సతారా నుంచి బరిలోకి దింపింది. మరాఠ్వాడ ప్రాంతంలోని నాందేడ్ నుంచి బరిలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్.. మాజీ కేంద్రమంత్రి ఎస్.బి.చవాన్ కుమారుడన్న సంగతి తెలిసిందే. 1952 నుంచి నాందేడ్‌లో ఎక్కువసార్లు కాంగ్రెస్ గెలుపొందుతూ వస్తోంది. ఎస్.బి.చవాన్ రెండుసార్లు ప్రాతినిధ్యం వహించగా.. అశోక్ చవాన్ కూడా 1987 ఉప ఎన్నికల్లో ఈ స్థానం నుంచి గెలుపొందారు. ఎస్.బి.చవాన్ అల్లుడు అశోక్ చవాన్ బావ అయిన భాస్కర్‌రావ్ ఖటగావ్కర్ 1998, 1999, 2009లో నాందేడ్ నుంచి ఎంపీగా గెలుపొందారు. 2014లో అశోక్ చవాన్ మరోసారి ఇక్కడి నుంచి గెలుపొందారు. బీడ్ స్థానంలో బీజేపీ టికెట్‌పై పోటీ చేస్తున్న ప్రీతమ్ ముండే దివంగత బీజేపీ నేత గోపీనాథ్ ముండే కుమార్తె. ప్రీతమ్‌కు ప్రత్యర్థి కూడా ముండే కుటుంబానికి చెందిన వారే కావడం ఇక్కడ ఆసక్తికరం. ప్రీతమ్ సోదరి, మహారాష్ట్ర మంత్రి పంకజా ముండేకు తమ్ముడి వరసైన ధనుంజయ్ ముండే ఎన్సీపీ తరఫున ప్రీతమ్‌కు ప్రత్యర్థిగా ఉన్నారిక్కడ. గోపీనాథ్ ముండే బతికుండగానే ధనంజయ్ తిరుగుబాటు చేసి ఎన్సీపీలో చేరిపోయారు. విధాన పరిషత్‌లో ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తున్నారు. ప్రీతమ్ ముండేకు దగ్గరి బంధువు, దివంగత బీజేపీ నేత ప్రమోద్ మహాజన్ కుమార్తె పూనమ్ మహాజన్ ముంబై నార్త్ సెంట్రల్ నుంచి పోటీ చేస్తున్నారు. ఒస్మానాబాద్లో ఎన్సీపీ తరఫున రాణా జగజీత్ సిన్హ్ పాటిల్ తన సమీప బంధువు శివసేన అభ్యర్థి ఒమ్ రాజే నింబాల్కర్‌తో పోటీ పడుతున్నారు. జగజీత్ మహారాష్ట్ర సీనియర్ మంత్రి, శరద్ పవార్ దగ్గరివాడైన పదమ్‌సిన్హ్ పాటిల్ కుమారుడు. 2006లో జరిగిన కాంగ్రెస్ నేత పవన్రాజె నింబాల్కర్ హత్య కేసులో పదమ్ సిన్హ్ నిందితుడు కాగా.. సేన అభ్యర్థి ఓమ్రాజే నింబాల్కర్ పవన్ రాజే కుమారుడే. నాసిక్‌లో సీనియర్ ఎన్సీపీ నేత ఛగన్ భుజ్‌బల్ సమీప బంధువు సమీర్ భుజ్‌బల్ మాజీ ఎంపీ రాజాబహూ గాడ్సే అల్లుడు హేమంత్ గాడ్సే పోటీపడుతున్నారు. కల్యాణ్ స్థానంలో ఎక్నాథ్ షిండే.. వాధా నుంచి చారులతా టోకాస్, ముంబై నుంచి ప్రియాదత్, మిలింద్ దేవరా, థానే నుంచి ఆనంద్ పరాంజపేతోపాటు ఇంకొందరు కూడా రాజకీయ కుటుంబ వారసత్వం ఆధారంగానే ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. టి.ఎన్.రఘునాథ (రచయిత, ముంబై కేంద్రంగా పనిచేస్తున్న సీనియర్ జర్నలిస్టు. మహారాష్ట్ర రాజకీయాలను మూడు దశాబ్దాలుగా పరిశీలిస్తున్నారు. ‘ద ఇండియన్ ఎక్స్‌ప్రెస్’, ‘ద పయనీర్’, ‘ద ఫ్రీ ప్రెస్ జర్నల్’, ‘ద బ్లిట్జ్’, ‘న్యూస్‌టైమ్’ దినపత్రికల్లో పనిచేశారు) -
వారసులు వస్తున్నారు..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజకీయ ముఖచిత్రంపైకి కొత్త నాయకులు రాబోతున్నారు. ఇప్పటికే సీనియర్లుగా ఉన్న పలువురు నేతల వారసులు రాజకీయ రంగంలోకి ప్రవేశించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. వీరిని తెరపైకి తెచ్చేందుకు నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అధికార టీఆర్ఎస్కు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యుల వారసులు దాదాపు 30 మంది వరకు ఈసారి ఎన్నికల్లో పోటీ అవకాశం కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు అంచనా. వారంతా ఓవైపు టీఆర్ఎస్ అధిష్టానం మెప్పు పొందడానికి ప్రయత్నిస్తూనే.. మరోవైపు తాము ఆశిస్తున్న నియోజకవర్గాల్లో పట్టు సాధించేందుకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ చురుకుగా వ్యవహరిస్తున్నారు. కొందరు ఆశావహులైన వారసులు ఆయా నియోజకవర్గాల్లో ద్వితీయశ్రేణి నాయకులను ఆకట్టుకునే యత్నంలో ఉండగా.. మరికొందరు ప్రజల్లో పేరు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. మొత్తంగా ఈ వారసుల రాజకీయ ప్రవేశానికి టీఆర్ఎస్ అధిష్టానం నుంచి కూడా సానుకూల స్పందన కనిపిస్తోందని అంటున్నారు. రాజకీయాల్లో రెండో తరాన్ని సుస్థిరం చేసుకునే దిశగా టీఆర్ఎస్ అధినాయకత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చెబుతున్నారు. పార్టీలో ముఖ్యనేతల వారసుల రాజకీయరంగ ప్రవేశానికి మంత్రి కేటీఆర్ ప్రోత్సాహం ఉన్నట్టు ముఖ్యులు పేర్కొంటున్నారు. ఒక్కొక్కరిది ఒక్కో లక్ష్యం.. టీఆర్ఎస్ ముఖ్య నేతల వారసులు రాజకీయంగా వేర్వేరు లక్ష్యాలతో ఉన్నట్టు కనిపిస్తోంది. రాజకీయాల్లో తమ తల్లిదండ్రుల హవా నడుస్తున్నప్పుడే.. తమ స్థానాలను సుస్థిరం చేసుకోవాలన్న యోచనలో ఎక్కువమంది ఉన్నట్టు చెబుతున్నారు. తమవారి రాజకీయ ప్రభావం తగ్గితే.. తర్వాత అవకాశాలు కరువవుతాయని, పోటీ పెరుగుతుందని పలువురు వారసులు భావిస్తున్నట్టు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తమ వారసులను రంగంలోకి దింపాలనుకుంటున్న నేతలు.. తాము ఇప్పుడున్న స్థానాల్లో ఉంటూనే ప్రోత్సహించడం, మరో స్థానానికి మారి వారసులకు అవకాశమివ్వడం, పరోక్ష పదవుల ద్వారా రాజకీయాల్లోకి తీసుకురావడం వంటి వివిధ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఏదేమైనా వచ్చే ఎన్నికల నాటికి ప్రత్యక్ష రాజకీయాల్లో అవకాశాలను పొందాలనే వ్యూహంతోనే ఎక్కువ మంది నాయకులు ఉన్నారు. 30 మందికిపైగానే.. టీఆర్ఎస్ పార్టీ ముఖ్యుల వారసులు దాదాపు 30 మందికిపైగానే రాజకీయ రంగం ప్రవేశాన్ని కోరుకుంటున్నారు. వీరిలో చాలామంది వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోటీ చేయాలన్న ఉత్సాహంతో ఉన్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి వీరందరికీ అవకాశం రాకపోయినా.. ఏదో ఒక రూపంలో తమ వారసులను రాజకీయాల్లో కొనసాగించేలా నేతలు ఏర్పాట్లు చేసుకుంటుండటం గమనార్హం. ఎంపీ, ఎమ్మెల్యే, నామినేటెడ్ పదవులు, స్థానిక సంస్థలు.. ఇలా ఏ అవకాశమున్నా అందిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎవరెవరు.. ఎక్కడెక్కడ..? పార్టీలో, ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్నవారితో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా తమ వారసులను రాజకీయ రంగ ప్రవేశం చేయించడం కోసం ప్రయత్నిస్తున్నారు. కొందరు ఈ విషయాన్ని బహిరంగంగానే వెల్లడిస్తుంటే.. మరికొందరు చాపకింద నీరులా లోలోపల ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కొందరు నాయకుల వారసులు దూకుడుగా వ్యవహరిస్తూ.. తమ రాజకీయ ప్రవేశం అనివార్యమనే సంకేతాలు ఇస్తున్నారు. – శాసనసభ స్పీకర్ ఎస్.మధుసూదనాచారి తనయుడు సిరికొండ ప్రశాంత్ భూపాలపల్లి నియోజకవర్గంలో చురుకుగా వ్యవహరిస్తున్నారు. – ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కుమార్తె కావ్య స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో పోటీకి అవకాశం కోరుకుంటున్నారు. – ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ కుమారుడు ఆజం అలీ హైదరాబాద్‌లో అవకాశమున్న ఏదైనా ఓ నియోజకవర్గంలో పోటీచేయాలనే యోచనతో ఉన్నారు. – ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ సతీమణి జమున కొంతకాలంగా రాజకీయంగా చురుకుగా వ్యవహరిస్తున్నారు. ఆమెను పోటీ చేయించే యోచన ఉన్నట్టు తెలుస్తోంది. – మంత్రి అజ్మీరా చందూలాల్ తనయుడు, మార్కెట్ కమిటీ చైర్మన్ అజ్మీరా ప్రహ్లాద్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. – మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు తనయుడు యుగంధర్‌రావు రాజకీయరంగ ప్రవేశాన్ని కోరుకుంటున్నారు. ఉమ్మడి నల్లగొండ (ప్రస్తుతం సూర్యాపేట జిల్లా) జిల్లాలోని కోదాడ నుంచి కానీ, చుట్టుపక్కల ఏదైనా నియోజకవర్గం నుంచిగానీ పోటీ చేసే యోచనలో ఉన్నారు. – ఎమ్మెల్యే కొండా సురేఖ, ఎమ్మెల్సీ కొండా మురళిల కుమార్తె సుస్మిత పటేల్ భూపాలపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే ప్రయత్నంలో ఉన్నారు. – మంత్రి జోగు రామన్న కుమారుడు జితేందర్ రాజకీయ కార్యకలాపాల్లో చురుకుగా వ్యవహరిస్తున్నారు. – ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ కుమారుడు అరుణ్ నియోజకవర్గంలో చురుకుగా వ్యవహరిస్తున్నారు. – మంత్రి జూపల్లి కృష్ణారావు తనయుడు అరుణ్‌రావు రాజకీయ ప్రవేశం కోసం ఆసక్తిగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. – మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డి కుమారుడు మిథున్‌రెడ్డి షాద్‌నగర్ లేదా కొడంగల్ అసెంబ్లీ స్థానాన్ని ఆశిస్తున్నారు. – ఎంపీ కె.కేశవరావు కుమార్తె విజయలక్ష్మి, కుమారుడు విప్లవ్కుమార్లలో ఒకరు జూబ్లీహిల్స్ లేదా ఖైరతాబాద్ స్థానంలో పోటీకి దిగాలని ఆశిస్తున్నారు. – మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ కుమారుడు సాయికిరణ్ యాదవ్ అసెంబ్లీకిగానీ, సికింద్రాబాద్ లోక్‌సభ స్థానానికిగానీ పోటీ చేయాలన్న దిశగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. – మంత్రి టి.పద్మారావు తనయుడు రామేశ్వర్యాదవ్ పార్టీలో క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారు. – హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాస్‌రెడ్డి ముషీరాబాద్ నుంచి అసెంబ్లీ టికెట్‌ను ఆశిస్తున్నారు. – మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి భార్య సునీతా మహేందర్‌రెడ్డి జెడ్పీ చైర్మన్‌గా, తమ్ముడు నరేందర్‌రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నారు. తాజాగా మహేందర్‌రెడ్డి వారసుడిగా అవినాష్‌రెడ్డి అసెంబ్లీకి పోటీ చేయాలని ఆశిస్తున్నారు. – ప్రభుత్వ విప్ నల్లాల ఓదేలు కుమారుడు క్రాంతి, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కుమారుడు గౌతమ్‌రెడ్డి, మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి కుమారులు భాస్కర్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇక మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, పి.హరీశ్వర్‌రెడ్డి, తీగల కృష్ణారెడ్డి, సాయన్న తదితరుల వారసులు కూడా పోటీకి సిద్ధమవుతున్నారు. -
వీధికెక్కిన గడీ వివాదం!
సాక్షి, కామారెడ్డి/దోమకొండ: ప్రసిద్ధి గాంచిన దోమకొండ గడీ వారసత్వ పోరు వీధికెక్కింది. సంస్థానాధీశుల వారసులు కోటలోని భవనాలను స్వాధీనం చేసుకోవడానికి పోటీ పడుతున్నారు. దశాబ్దాల కాలంగా వారసత్వ పోరు నడుస్తున్నప్పటికీ శనివారం రాజా ఉమాపతిరావ్ వారసులు కోటలోని ముఖ్య భవనాలకు తాళాలు వేసి హెచ్చరికలు జారీ చేస్తూ ఫ్లెక్సీలు కట్టడంతో వ్యవహారం మరోమారు రచ్చకెక్కింది. ప్రస్తుతం గడీలో మరో వారసుడు అనిల్ కామినేని (నటుడు చిరంజీవి వియ్యంకుడు) గడీకోటలో గత పది పదిహేనేళ్లుగా మరమ్మతులు చేయిస్తూ, అప్పుడప్పుడు వచ్చిపోతున్నారు. ఆయన కూతురు ఉపాసన, అల్లుడు రామ్‌చరణ్ పలుమార్లు కోటలోని మహదేవుని ఆలయంలో పూజలు సైతం నిర్వహించారు. ఇప్పుడు మరో వారసుడు కోటలోని భవనాలు తమవేనంటూ తాళం వేయడంతో పోరు తారాస్థాయికి చేరింది. ఆది నుంచీ వివాదాలే.. అనిల్ కామినేని నటుడు చిరంజీవితో వియ్యం అందుకున్న సందర్భంలో కోటలో మరమ్మతులు జరిగాయి. చిరంజీవి కొడుకు రామ్‌చరణ్ తేజ, అనిల్ కామినేని కూతురు ఉపాసనల వివాహానికి ముందు కొన్ని కార్యక్రమాలు కోటలోనే నిర్వహించారు. కోటలోని భవనాలన్నింటినీ మరమ్మతులు చేయడంతో పాటు మహదేవుని ఆలయాన్ని పునర్నిర్మించారు. మహదేవుని ఆలయం పురావస్తు శాఖ పరిధిలో ఉన్నప్పటికీ, దానికి మరమ్మతులు చేయడం అప్పట్లో వివాదాలకు తావిచ్చింది. కోటలోని ఓ భవనంలో నివాసం ఉంటున్న ఎండపల్లి లింబయ్య అనే వ్యక్తి కామారెడ్డి కోర్టులో కేసు సైతం దాఖలు చేశాడు. మరమ్మతులు జరుగుతున్నపుడే మిగతా వారసుల నుంచి నిరసనలు వ్యక్తమయ్యాయి. గడీ ప్రహరీ, మహదేవుని ఆలయం మాత్రమే పురావస్తు శాఖ ఆధీనంలో ఉన్నాయి. మిగతా భవనాలు రూపు మారకుండా మరమ్మతులు చేయడానికి మాత్రం పురావస్తు శాఖ అనుమతి ఇచ్చినట్టు తెలుస్తోంది. దీన్ని అడ్డు పెట్టుకుని గడి లోపలికి సామాన్య ప్రజల రాకపోకలను పూర్తిగా కట్టడి చేశారు. ప్రైవేటు సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నారు. కాగా భవనాలు తమవేనంటూ కొందరు వారసులు ఇప్పటికే జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అసలు పోరు ఇదే.. దోమకొండ గడీలో పలు భవనాలు ఉన్నాయి. ఇందులో అద్దాల మేడ, ఉమా మహాల్, వెంకట్ భవన్, ఆగన్న భవంతి పేరుతో ఉన్న భవనాలు ప్రైవేటు ఆస్తులుగా ఉన్నాయి. ఆయా భవనాలను తమకు చెందినవని అనిల్ కామినేని కొంత కాలంగా చెబుతూ పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే, శనివారం దోమకొండ గడీకోటకు వచ్చిన ఇతర వారసులు.. ఆస్తుల పంపకాల్లో వెంకట్భవన్ అనిల్ కామినేనికి, అద్దాల మేడతో పాటు అందులోని బావి రాజేశ్వర్రావ్, సత్యనారాయణరావ్లకు, ఉమా మహాల్ రాజేశ్వర్ భూపాల్‌లకు చెందినవంటూ ఆయా భవనాలకు తాళాలు వేసుకున్నారు. గడీకోటలోని గడీకోటలోని సిబ్బందిని బయటకు పంపి.. వెంకటపతిభవన్ గేటుకు, ఉమా మంజిల్, అద్దాలమేడ, క్లాక్ టవర్ గేటుకు వారు తాళాలు వేశారు. కోటలోని అస్తులు ప్రైవేట్ ఆస్తులని, అవి మూడు కుటుంబాలకు చెందిన ఉమ్మడి ఆస్తులని పేర్కొంటూ ఫ్లెక్సీలను గడీకోటలోని భవనాలు, ఇతర ప్రదేశాల్లో కట్టారు. వెంకటపతి భవన్ మాత్రమే కామినేని అనిల్దని, మిగతావి తమ ఆస్తులని, అందుకు సంబంధించిన డాక్యుమెంట్స్ తమ వద్ద ఉన్నాయని సత్యనారయణరావ్, రాజేశ్వర్‌రావు తెలిపారు. దీనిపై ఇప్పటికే కలెక్టర్‌కు, డీపీవోకు ఫిర్యాదు చేశామని చెప్పారు. గడీకోట వివాదంపై జిల్లా పంచాయతీ అధికారి రాములును ‘సాక్షి’ వివరణ కోరగా.. తమకు వచ్చిన ఫిర్యాదులపై విచారణ చేపట్టామని, కుటుంబానికి సంబంధించిన సమస్య అయినందున వారే పరిష్కరించుకోవాలని సూచించామని బదులిచ్చారు. -
గుంటూరులో కొత్త వారసుల పొలిటికల్ ఎంట్రీ
-
రాజకీయ అరంగేట్రానికి వారసులు రెడీ!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకున్న చందంగా రాజకీయనేతలు తమ వారసులను రంగంలోకి దింపుతున్నారు. డాక్టర్ పిల్లలు డాక్టర్.. యాక్టర్ పిల్లలు యాక్టర్ అయిన చందంగా జిల్లాలోని రాజకీయనేతలు తమ కుటుంబ సభ్యులను బరిలోకి దింపేందుకు సిద్ధం చేస్తున్నారు. రెండు దశాబ్దాలకు పైబడి రాజకీయ జీవితంలో ఉన్న నేతలు ఇక తమ వారసులకు పగ్గాలు అప్పగించాలని ఉవ్విళ్లూరుతున్నారు. సాధారణ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్ది రాజకీయ అరంగ్రేటం కోసం వారి సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే కొందరు నేతల వారసులు రంగంలోకి దిగగా... మరికొందరు కార్యాచరణ రూపొందించడంలో నిమగ్నమయ్యారు. అందుకు అనుగుణంగా నియోజకవర్గాల్లో మకాం వేస్తూ అన్నీ తామై వ్యవహరిస్తున్నారు. స్థానిక పరిస్థితులను, క్యాడర్‌తో కలుపుగోలు వ్యవహారం తదితర వ్యవహారాలన్ని యువ నాయకత్వం కనుసన్నల్లోనే కొనసాగుతున్నాయి. అవకాశం వస్తే వచ్చే ఎన్నికల్లో పోటీకి సై అంటూ నేతల వారసులు సిద్ధం కాగా.. నియోజకవర్గాల పునర్విభజనతో ఏర్పడే కొత్త స్థానాల నుంచి వారిని రంగంలోకి దింపాలని ప్రస్తుత నేతలు కలలు కంటున్నారు. అయితే, నియోజకవర్గాలు పెరిగే అవకాశాలు దాదాపు లేవని తెలుస్తుండడంతో ఏం చేయాలో వారికి పాలుపోవడం లేదు. ఏది ఏమైనా వచ్చే ఎన్నికల్లో తమ వారసులను రంగంలోకి దించాలన్న నేతలు వారి కోసం ప్లాట్‌ఫాం సిద్ధం చేస్తున్నారు. పోరులో డీకే వారసులు ఉమ్మడి పాలమూరు జిల్లాలో డీకే అరుణ కాంగ్రెస్ నేతగా, ప్రజాప్రతినిధిగా చిరపరిచితురాలు. మంత్రిగా ఉన్నప్పుడు ఆమె ఉమ్మడి జిల్లాను తన కనుసన్నల్లో శాసించారు. రాజకీయంగా ఈ ప్రాంతంపై ఉన్న పట్టును చేజారకుండా మరింత ఒడిసిపట్టుకునేందుకు రకరకాల వ్యూహరచనలు చేస్తున్నారు. ఇప్పటికే తన చిన్న కుమార్తె స్నిగ్దారెడ్డిని గద్వాల రాజకీయ తెరపైకి తీసుకొచ్చారు. భవిష్యత్‌లో గద్వాల నుంచి స్నిగ్దను బరిలో దింపనున్నట్లు వారి సన్నిహితులు పేర్కొంటున్నారు. అలాగే మహబూ బ్‌నగర్ పార్లమెంట్ స్థానం నుంచి తన రెండో కుమార్తె శృతిని బరిలో దింపాలని అరుణ భావిస్తున్నట్లు సమాచారం. ఈ స్థానాన్ని ఎంపిక చేసుకునేందుకు ఓ కారణం ఉందట. డీకే.అరుణ మొదటగా రాజకీయ ప్రస్థానాన్ని మహబూబ్‌నగర్ నుంచే ప్రారంభించారు. 1996లో మహబూబ్‌నగర్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి అతి తక్కువ మెజార్టీతో ఓడిపోయారు. ఈ నేపథ్యంలో తన కూతురును ఇక్కడి నుంచి బరిలో దింపి పాత చరిత్రను తిరగరాయాలని భావి స్తున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. ప్రస్తుతం శృతి హైదరాబాద్‌లోని వ్యాపారాల్లో పూర్తిగా నిమగ్నమై ఉన్నా రు. త్వరలోనే పాలమూరు ప్రాంతంలో ఆమె పర్యటనకు ఏర్పాట్లు జరుగు తున్నాయి. అయితే ఈ స్థానం నుంచి పా ర్టీ సీనియర్‌నేత ఎస్.జైపాల్‌రెడ్డి గతంలో పోటీ చేయడం, ప్రస్తుతం విస్తృతంగా పర్యటిస్తుండడంతో పరిస్థితి ఎలా ఉండ బోతుందనేది ఆసక్తికరంగా మారింది. మంత్రి జూపల్లి వారసుడు సై.. రాష్ట్ర పంచాయితీరాజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కుమారుడు అరుణ్ ఇప్పటికే రాజకీయ తెరపైకి వచ్చారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధిలో కొత్తగా ఏర్పడే నియోజకవర్గం నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భాస్తున్నారు. అందుకు అనుగుణంగా వనపర్తి జిల్లా కేంద్రంలో క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసి రాజకీయ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. అయితే కేంద్రం అంత సుముఖంగా లేకపోవడంతో నియోజకవర్గాల సంఖ్య పెరిగే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో తాను మంచి స్ట్రాంగ్‌గా ఉన్నప్పుడే కుమారుడికి గ్రాండ్ విక్టరీ అందజేయాలని నిర్ణయించుకున్న మంత్రి జూపల్లికి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. అదే విధంగా దేవరకద్ర, మక్తల్ నియోజకవర్గాల మాజీ ఎమ్మెల్యేలు సీతమ్మ, దయాకర్‌రెడ్డి దంపతల పెద్ద కుమారుడు సిద్దార్థరెడ్డి సైతం వచ్చే ఎన్నికల్లో బరిలో నిలవాలని ఆశపడుతున్నారు. అయితే వారు ప్రస్తుతం కొనసాగుతున్న టీడీపీ పరిస్థితి నానాటికి దయనీయంగా మారుతోంది. ప్రస్తుత టీడీపీ ద్వారా కుమారుడిని బరిలో దింపితే ప్రతికూల ఫలితాలు వచ్చే ప్రమాదముందని ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కుమారుడి రాజకీయ ప్రస్థానాన్ని ఎక్కడ ప్రారంభించాలో అర్థం కాక సతమతమవుతున్నారు. రంగంలోకి జితేందర్‌రెడ్డి కుమారుడు మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డి మొదటి కుమారుడు సిద్దార్థరెడ్డి సైతం రాజకీయ అరగ్రేటం కోసం ఉవ్విలూరుతున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఇప్పటి వరకు ఆయన తెరపైకి రాకపోయినా వచ్చే ఎన్నికల్లో మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలోని ఏదైనా ఒక అసెంబ్లీ స్థానానికి ఒక చోట పోటీకి దిగాలని భావిస్తున్నట్లు సమాచారం. అందుకోసం ఒకటి, రెండు నియోజకవర్గాలను పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. వచ్చే ఎన్నికల్లో ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేల స్థానాలను మార్పు చేయాలని పార్టీ అధినేత సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మిథున్‌రెడ్డి 2019 ఎన్నికల్లో షాద్‌నగర్ లేదా కొడంగల్ నుంచి పోటీకి దిగే అవకాశమున్నట్లు సమాచారం. అందుకు అనుగుణంగా త్వరలో రాజకీయ కార్యాచరణ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీకెళ్లిన పంచాయితీ.. వచ్చే ఎన్నికల్లో తమ వారసులకు మంచి ప్లాట్‌ఫాం ఏర్పాటు చేయడం కోసం నాగర్‌కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గంలో పెద్ద పంచాయతీ జరుగుతోంది. ఈ పంచాయతీ పరిష్కారం కోసం కొందరు ఏకంగా ఢిల్లీకి సైతం వెళ్లి నట్లు తెలుస్తోంది. నాగర్‌కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నాలుగైదు పర్యాయాలుగా నాగం జనార్ధన్‌రెడ్డి, కూచుకుల్ల దామో దర్‌రెడ్డి తలపడుతున్నారు. 2014 ఎన్నికల్లో నాగం మహబూబ్‌నగర్ పార్లమెంట్‌కు పోటీ చేయగా... నాగర్‌కర్నూల్ అసెంబ్లీ నుంచి తన కుమారుడు శశిధర్‌రెడ్డి బరిలో నిలిపారు. అయితే అనుకున్నంత మేర నియోజకవర్గంపై కుమా రుడు పట్టు సాధించలేదని నాగం మద నపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తానే బరిలో నిలవాలని.. ఎలాగైనా గెలిచేందుకు పార్టీ మారాలని యో చిస్తున్నారు. కాంగ్రెస్‌లో చేరితే తన గెలుపు సులువవుతోందని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. అయి తే ఎన్నో ఏళ్లుగా ప్రత్యర్థులుగా తలపడిన నేపథ్యంలో ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి కాంగ్రెస్ లోని రాకుండా జనార్ధన్‌రెడ్డిని అడ్డు కునే ప్రయత్నం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సానుకూల పవనాలు ఉంటాయని చెబుతూ.. తన కుమారుడు రాజేశ్‌ను బరిలో దింపాలని దామోదర్‌రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో నాగం కాంగ్రెస్‌లోకి వస్తే తన వారసుడి ఆశలు ఆవిరవుతాయని ఆయన ఆందోళన చెందుతున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. ఈనేపథ్యంలో సాధ్యమైనంత వరకు నాగంను అడుకునేందుకు ఇటీవల ఢిల్లీ కూడా వెళ్లి వచ్చారని పార్టీ వర్గాలు ప్రస్తావిస్తున్నాయి. ఇలా మొత్తం మీద వారసుల కోసం నాయకులు పడరాని పాట్లు పడుతున్నారు. ఇందులో ఎందరి వారసులు బరిలోకి దిగుతారు.. ఎందరు విజ యం సాధిస్తారన్నది తెలియాలంటే మరికొన్ని నెలలు వేచి చూడాల్సిందే. -
వారసుల అరంగేట్రం
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వారసులు గెలిచొచ్చారు. బంజారాహిల్స్ డివి జన్‌లో టీఆర్ఎస్ తరఫున ఎంపీ కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మి 5వేలకుపైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించగా, ముషీరాబాద్‌లో మంత్రి నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాసరెడ్డి 11వేలు, ఖైరతాబాద్‌లో పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి 12వేల మెజారిటీతో గెలిచారు. ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి కోడలు విజయలక్ష్మి అల్వాల్‌లో 6వేల మెజారిటీతో ఎన్నికయ్యారు. గౌలి పురా డివిజన్లో కేంద్ర మాజీ మంత్రి ఆలె నరేంద్ర సతీమణి లలిత గెలిచారు. మాజీమేయర్ మాజిద్ హుస్సేన్ మెహిదీపట్నంలో గెలిచారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కుమార్తె లాస్యనందిత (టీఆర్ఎస్) కవాడిగూడ నుంచి 11 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. కాంగ్రెస్ మేయర్ అభ్యర్థిగా ప్రచారమైన మాజీ మంత్రి ముఖేశ్ తనయుడు విక్రంగౌడ్ జాంబాగ్ డివిజన్లో ఓటమి పాలయ్యారు. గన్‌ఫౌండ్రీలో పోటీ చేసిన ముఖేష్ కుమార్తె శిల్ప కూడా గెలవలేదు. మాజీ మేయర్ కార్తీకరెడ్డి తార్నాకలో, ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కోడలు అనితారెడ్డి ఆర్‌పురంలో ఓడారు.