
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్ జిల్లాలోని బ్రహ్మంగారి మఠం వారసత్వంపై వివాదం కొనసాగుతోంది. ఏడో తరానికి చెందిన పీఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా... నూతన పీఠాధిపతి ఎంపిక ప్రక్రియ కుటుంబ సభ్యుల మధ్య గొడవకు దారితీసింది. మఠాధిపతిగా ఉన్న వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామికి ఇద్దరు భార్యలు కాగా మొదటి భార్యకు నలుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. రెండో భార్యకు ఇద్దరు కుమారులు ఉన్నారు.
పీఠాధిపతి పదవి తనకే దక్కాలంటున్న పెద్దభార్య కుమారుడు డిమాండ్ చేస్తున్నారు. తన కుమారుడికే ఇవ్వాలని వీలునామా రాశారని చిన్న భార్య చెబుతున్నారు. వారసుల మధ్య విబేధాల నేపథ్యంలో పీఠాధిపతి ఎంపిక ప్రక్రియలో సందిగ్ధత నెలకొంది.
చదవండి: చిన్నారులకు ఏపీ సర్కార్ ఆర్థిక సాయం
చిత్తూరు జిల్లాలో కర్ఫ్యూ సమయం పెంపు..
Comments
Please login to add a commentAdd a comment