
దేశంలోనే అత్యంత సంపన్నుడైన పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ (Mukesh Ambani) లక్షల కోట్ల రూపాయల విలువైన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారు. ఫోర్బ్స్ ప్రకారం ఆయన నెట్‌వర్త్ 91.1 బిలియన్ డాలర్లు. ఆయన ముగ్గురు పిల్లలు ఆకాష్ అంబానీ , ఇషా అంబానీ, అనంత్ అంబానీలు చేతికొచ్చారు. కుటుంబ వ్యాపారంలో వారు కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. కంపెనీలో గణనీయమైన వాటాలను కలిగి ఉన్నారు.
అయితే ముఖేష్ అంబానీ, నీతా అంబానీల ముగ్గురు వారసుల్లో ఎవరు ఎక్కువ సంపన్నులు (Richest) అనే ఆసక్తికర సందేహం ఎప్పుడైనా కలిగిందా? దీనికి సమాధానం ఈ కథనంలో తెలుసుకుందాం. ప్రస్తుతం ఆకాశ్, అనంత్, ఇషా అంబానీల నెట్ వర్త్ ఎంత? వ్యాపారంలో ఎవరి పాత్ర ఏంటి అన్నది కూడా పరిశీలిద్దాం..
ఆకాష్ అంబానీ
ముఖేష్ అంబానీ, నీతా అంబానీల ముగ్గురు సంతానంలో పెద్దవాడు, ఇషా అంబానీకి కవల సోదరుడు అయిన ఆకాష్ (Akash Ambani) రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ ఛైర్మన్‌గా పనిచేస్తున్నారు. రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ బోర్డులో డైరెక్టర్‌గా కూడా ఉన్నారు . ఆకాష్ వార్షిక జీతం రూ . 5.6 కోట్లు, దీని ద్వారా ఆయన 40.1 బిలియన్ డాలర్ల ( సుమారు రూ . 3,32,815 కోట్లు ) నెట్‌వర్త్‌ను సంపాదించారు.
ఇషా అంబానీ
అంబానీ ముద్దుల తనయ ఇషా అంబానీ (Isha Ambani).. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ బోర్డులో నాన్ - ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పదవిని కలిగి ఉన్నారు . ఆమె రిలయన్స్ రిటైల్ , రిలయన్స్ జియో, రిలయన్స్ ఫౌండేషన్‌లలో ఎగ్జిక్యూటివ్ లీడర్‌షిప్ బృందంలో కీలక సభ్యురాలు కూడా. అంతే కాకుండా తీరా బ్యూటీకి ఇషా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సహ వ్యవస్థాపకురాలు. అలాగే ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ నిర్వహణలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఆమె వార్షిక జీతం సుమారు రూ . 4.2 కోట్లు. ఆమె నెట్‌వర్త్ రూ . 800 కోట్లని అంచనా.
అనంత్ అంబానీ
అంబానీ వారసులలో ఆఖరి వాడు అనంత్ అంబానీ (Anant Ambani). రిలయన్స్ జియోలో ఎనర్జీ, టెలికమ్యూనికేషన్ రంగాలను పర్యవేక్షిస్తున్నారు. ఈయన జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్, రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ బోర్డులలో డైరెక్టర్‌గా కూడా పనిచేస్తున్నారు. అనంత్ వార్షిక జీతం రూ . 4.2 కోట్లు. నెట్‌వర్త్ విషయానికి వస్తే 40 బిలియన్ డాలర్లు ( సుమారు రూ . 3,32,482 కోట్లు).
ఆకాషే అత్యంత రిచ్
ముఖేష్ అంబానీ ముగ్గురు వారసులలో ఆకాష్ అంబానీ అత్యంత ధనవంతుడు. తన తమ్ముడు అనంత్ కంటే స్వల్ప ఆధిక్యంతో 40.1 బిలియన్ డాలర్ల నికర సంపదను కలిగి ఉన్నారు. ఇక ఇషా అంబానీ విషయానికి వస్తే రూ .800 కోట్ల నెట్‌వర్త్‌తో సోదరులిద్దరి కన్నా ఆమడ దూరంలో ఉన్నారు. ఏదేమైనప్పటికీ అంబానీ వారసులందరూ కలిసి రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. వారి కుటుంబ వారసత్వాన్ని నిలబెట్టుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment