Isha Ambani
-
కుంభమేళాలో ఇషా అంబానీ దంపతుల పుణ్యస్నానాలు (ఫోటోలు)
-
అంబానీ వారసులలో ఎవరు ఎక్కువ రిచ్?
దేశంలోనే అత్యంత సంపన్నుడైన పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ (Mukesh Ambani) లక్షల కోట్ల రూపాయల విలువైన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారు. ఫోర్బ్స్ ప్రకారం ఆయన నెట్‌వర్త్ 91.1 బిలియన్ డాలర్లు. ఆయన ముగ్గురు పిల్లలు ఆకాష్ అంబానీ , ఇషా అంబానీ, అనంత్ అంబానీలు చేతికొచ్చారు. కుటుంబ వ్యాపారంలో వారు కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. కంపెనీలో గణనీయమైన వాటాలను కలిగి ఉన్నారు.అయితే ముఖేష్ అంబానీ, నీతా అంబానీల ముగ్గురు వారసుల్లో ఎవరు ఎక్కువ సంపన్నులు (Richest) అనే ఆసక్తికర సందేహం ఎప్పుడైనా కలిగిందా? దీనికి సమాధానం ఈ కథనంలో తెలుసుకుందాం. ప్రస్తుతం ఆకాశ్, అనంత్, ఇషా అంబానీల నెట్ వర్త్ ఎంత? వ్యాపారంలో ఎవరి పాత్ర ఏంటి అన్నది కూడా పరిశీలిద్దాం..ఆకాష్ అంబానీముఖేష్ అంబానీ, నీతా అంబానీల ముగ్గురు సంతానంలో పెద్దవాడు, ఇషా అంబానీకి కవల సోదరుడు అయిన ఆకాష్ (Akash Ambani) రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ ఛైర్మన్‌గా పనిచేస్తున్నారు. రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ బోర్డులో డైరెక్టర్‌గా కూడా ఉన్నారు . ఆకాష్ వార్షిక జీతం రూ . 5.6 కోట్లు, దీని ద్వారా ఆయన 40.1 బిలియన్ డాలర్ల ( సుమారు రూ . 3,32,815 కోట్లు ) నెట్‌వర్త్‌ను సంపాదించారు.ఇషా అంబానీ అంబానీ ముద్దుల తనయ ఇషా అంబానీ (Isha Ambani).. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ బోర్డులో నాన్ - ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పదవిని కలిగి ఉన్నారు . ఆమె రిలయన్స్ రిటైల్ , రిలయన్స్ జియో, రిలయన్స్ ఫౌండేషన్లలో ఎగ్జిక్యూటివ్ లీడర్షిప్ బృందంలో కీలక సభ్యురాలు కూడా. అంతే కాకుండా తీరా బ్యూటీకి ఇషా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సహ వ్యవస్థాపకురాలు. అలాగే ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ నిర్వహణలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఆమె వార్షిక జీతం సుమారు రూ . 4.2 కోట్లు. ఆమె నెట్‌వర్త్ రూ . 800 కోట్లని అంచనా.అనంత్ అంబానీఅంబానీ వారసులలో ఆఖరి వాడు అనంత్ అంబానీ (Anant Ambani). రిలయన్స్ జియోలో ఎనర్జీ, టెలికమ్యూనికేషన్ రంగాలను పర్యవేక్షిస్తున్నారు. ఈయన జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్, రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ బోర్డులలో డైరెక్టర్‌గా కూడా పనిచేస్తున్నారు. అనంత్ వార్షిక జీతం రూ . 4.2 కోట్లు. నెట్‌వర్త్ విషయానికి వస్తే 40 బిలియన్ డాలర్లు ( సుమారు రూ . 3,32,482 కోట్లు).ఆకాషే అత్యంత రిచ్ముఖేష్ అంబానీ ముగ్గురు వారసులలో ఆకాష్ అంబానీ అత్యంత ధనవంతుడు. తన తమ్ముడు అనంత్ కంటే స్వల్ప ఆధిక్యంతో 40.1 బిలియన్ డాలర్ల నికర సంపదను కలిగి ఉన్నారు. ఇక ఇషా అంబానీ విషయానికి వస్తే రూ .800 కోట్ల నెట్‌వర్త్‌తో సోదరులిద్దరి కన్నా ఆమడ దూరంలో ఉన్నారు. ఏదేమైనప్పటికీ అంబానీ వారసులందరూ కలిసి రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. వారి కుటుంబ వారసత్వాన్ని నిలబెట్టుకుంటున్నారు. -
ఆర్ట్స్ కేఫ్ ప్రివ్యూ ఈవెంట్లో మెరిసిన 'రాధిక మర్చంట్' (ఫొటోలు)
-
రిలయన్స్ గ్రూప్ ప్రెసిడెంట్‌గా ఇరా బింద్రా నియామకం
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ గ్రూప్ ప్రెసిడెంట్‌గా ఇరా బింద్రా(47)ను నియమిస్తున్నట్లు కంపెనీ ఛైర్మన్ ముఖేశ్ అంబానీ ప్రకటించారు. ఈ స్థాయి వ్యక్తుల నియామకాలకు సంబంధించిన వివరాలను ముఖేశ్ నేరుగా వెల్లడించడం ఇదే తొలిసారి. ఇరా బింద్రా ఇప్పటివరకు యూఎస్‌లోని మెడ్‌ట్రానిక్ సంస్థలో పనిచేశారు. అక్కడ ఆమె హెచ్ఆర్ విభాగాధిపతిగా, కంపెనీ వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్‌లో అన్ని అనుబంధ సంస్థలకు సంబంధించి టాప్ మేనేజ్మెంట్ నియామకాలను ఈమె చేపట్టబోతున్నారు. కంపెనీ ప్రెసిడెంట్‌గా నియమించడంతో ఈమె రిలయన్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఉన్న మొదటి కుటుంబేతర మహిళ కావడం విశేషం.ఇదీ చదవండి: సుప్రీం కోర్టు ఆమోదంతో రూ.4,025 కోట్ల ఆస్తులు అప్పగింత‘రిలయన్స్ గ్రూప్‌లో టాలెంట్‌ను మెరుగుపరిచేందుకు బింద్రా బాధ్యతలు నిర్వర్తిస్తారు. నాతోసహా ఇషా, ఆకాష్, అనంత్, ఎగ్జిక్యూటివ్ కమిటీతో కలిసి పని చేస్తారు. విభిన్న పరిశ్రమలు, వ్యాపార సైకిల్స్‌పై బింద్రాకు అపార పరిజ్ఞానం ఉంది. మెడ్ట్రానిక్లో కీలక బాధ్యతల్లో పని చేశారు. జీఈ వంటి ఫార్చ్యూన్ 100 కంపెనీలో హెచ్ఆర్ టీమ్‌లకు నాయకత్వం వహించారు. కొత్త ఆపరేటింగ్ మోడల్ రూపొందించి దాన్ని అమలు చేశారు. తన నైపుణ్యాలు కంపెనీకి ఎంతో ఉపయోగపడుతాయి’ అని ముఖేశ్ అంబానీ అన్నారు.1998లో ఢిల్లీలోని లేడీ శ్రీ రామ్ కాలేజీ నుంచి బింద్రా గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.1999లో నెదర్లాండ్స్‌లోని మాస్ట్రిక్ట్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పూర్తి చేశారు.తర్వాత ఆమె మెడ్ట్రానిక్లో చేరడానికి ముందు జీఈ క్యాపిటల్, జీఈ ఇండియా, జీఈ హెల్త్‌కేర్, జీఈ ఆయిల్ & గ్యాస్‌లో పనిచేశారు. -
రూ.508 కోట్లకు బంగ్లా అమ్మేసిన ఇషా అంబానీ - సొంతం చేసుకున్న హాలీవుడ్ జంట (ఫోటోలు)
-
ఖరీదైన బంగ్లా అమ్మేసిన ఇషా అంబానీ: ఎవరు కొన్నారంటే..
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ కుమార్తె 'ఇషా అంబానీ' లాస్ ఏంజిల్స్‌లోని తన విలాసవంతమైన భవనాన్ని విక్రయించింది. దీనిని హాలీవుడ్ జంట జెన్నిఫర్ లోపెజ్, ఆమె భర్త బెన్ అఫ్లెక్ కొనుగోలు చేశారు. ఈ భవనం వివరాలు, ఇంతకు విక్రయించారు అనే సంగతులు ఈ కథనంలో తెలుసుకుందాం.తండ్రిలాగే ప్రముఖ పారిశ్రామిక వేత్తగా ప్రసిద్ధి చెందిన ఇషా అంబానీకి అమెరికాలో (లాస్ ఏంజిల్స్) సుమారు 5.2 ఎకరాల విస్తీర్ణంలో ఓ బంగ్లా ఉంది. పది సంవత్సరాల క్రితమే ఇషా దీనిని కొనుగోలు చేసినట్లు సమాచారం. అయితే ఈ ఇంట్లో ఆమె ఉన్న రోజులు చాలా తక్కువనే తెలుస్తోంది.ఇషా అంబానీ గర్భంతో ఉన్నప్పుడు ఇదే భవనంలో ఉన్నట్లు సమాచారం. ఆ సమయంలో నీతా అంబానీ కూడా ఈ భవనంలోనే ఉన్నారు. ఆ తరువాత అక్కడ నుంచి వచ్చేసారు. ఇప్పుడు హాలీవుడ్ స్టార్ కపుల్ 'జెన్నిఫర్ లోపెజ్ & బెన్ అఫ్లెక్' దీనిని 508 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారు.ఇదీ చదవండి: రతన్ టాటా ఫ్రెండ్.. శంతను నాయుడు ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా?ఇషా అంబానీ విలాసవంతమైన భవనంలో 12 బెడ్రూమ్లు, 24 బాత్రూమ్లతో పాటు.. స్విమ్మింగ్ పూల్, ప్రైవేట్ జిమ్, విశాలమైన డైనింగ్ ఏరియా, పికెల్ బాల్ కోర్టు, స్పా మొదలైన సకల సావుకార్యాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ విలాసవంతమైన భవనాన్ని హాలీవుడ్ జంట సొంతం చేసుకుంది. -
అంబానీ ఇంట్లో పుట్టినరోజు వేడుకలు (ఫొటోలు)
-
ఇషా అంబానీ సారథ్యంలోని ఏడు కంపెనీలు ఇవే..
ముకేశ్ అంబానీ గారాల తనయ 'ఇషా అంబానీ' రిలయన్స్ గ్రూపుకు చెందిన వివిధ రంగాల్లో కీలక బాధ్యతలను నిర్వహిస్తోంది. రిలయన్స్ రిటైల్ మేనేజింగ్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తూనే.. ఇతర సంస్థలను కూడా పర్యవేక్షిస్తోంది. ఈ కథనంలో ఇషా సారథ్యంలో ముందుకు సాగుతున్న సంస్థల గురించి తెలుసుకుందాం.తీరా బ్యూటీ (Tira Beauty)ఇషా అంబానీ సారథ్యంలోని ప్రముఖ వెంచర్లలో తీరా బ్యూటీ ఒకటి. ఇది ఏప్రిల్ 2023లో ప్రారంభమైన ఓమ్ని ఛానల్ బ్యూటీ రిటైల్ ప్లాట్‌ఫామ్. దీని ద్వారా వెర్సేస్, మోస్చినో, డోల్స్ & గబ్బానా వంటి లగ్జరీ ఉత్పత్తులను విక్రయిస్తోంది. ప్రీమియం షాపింగ్ అనుభవాన్ని కస్టమర్లకు అందించడం ఈ ప్లాట్‌ఫామ్ లక్ష్యం.హామ్లేస్ (Hamleys)రిలయన్స్ బ్రాండ్స్ లిమిటెడ్ 2019లో సుమారు రూ. 620 కోట్లతో టాయ్ రిటైలర్ హామ్లేస్ను కొనుగోలు చేసింది. ఇది కూడా ఇషా అంబానీ పర్యవేక్షణలో ఉంది. హామ్లేస్ అనేది ప్రపంచ మార్కెట్లోని పురాతనమైన, అతిపెద్ద బొమ్మల రిటైలర్లలో ఒకటి. ఇషా అంబానీ ఈ సంస్థను విస్తరించడంలో కీలక పాత్ర పోషించింది.అజియో (Ajio)ఇషా అంబానీ పర్యవేక్షణలో ఉన్న మరో సంస్థ అజియో. లాక్మే ఫ్యాషన్ వీక్ ఎస్ఎస్16 సందర్భంగా ప్రారంభమైన అజియో.. అతి తక్కువ కాలంలోనే ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్‌గా అవతరించింది. ప్రస్తుతం ఈ కంపెనీ అధిక లాభాలను గడిస్తూ ప్రత్యర్థులకు సైతం గట్టి పోటీ ఇస్తూ దూసుకెళ్తోంది.కవర్ స్టోరీ (Cover Story)ఇషా దర్శకత్వంలో మరో కీలకమైన బ్రాండ్ 'కవర్ స్టోరీ'. ఇది భారతీయ వినియోగదారులకు అంతర్జాతీయ కాస్మొటిక్స్ అందించే మొట్టమొదటి ఫ్యాషన్ బ్రాండ్‌గా గుర్తింపు పొందింది. ఇతర దేశాల సౌందర్య ఉత్పత్తులను భారతీయులకు పరిచయం చేయాలనే ఉద్దేశ్యంతో దీనిని ప్రారభించారు.ఫ్రెష్‌పిక్ (Freshpik)2021లో ముంబైలోని జియో వరల్డ్ డ్రైవ్‌లో.. ఫ్రెష్‌పిక్ పేరుతో ఇషా అంబానీ ఫుడ్ రిటైల్ కంపెనీని ప్రారంభించింది. ఇందులో అంతర్జాతీయ పదార్థాలు అందుబాటులో ఉంటాయి. ఇది ఆహార ప్రియులను ఎంతగానో ఆకర్షిస్తోంది. ఇది కూడా ఇషా అంబానీ సారథ్యంలో చాలా వేగంగా అభివృద్ధి చెందింది.నెట్‌మెడ్స్ (Netmeds)ఇషా అంబానీ ఆన్లైన్, ఆఫ్‌లైన్ కస్టమర్ అవసరాలను తీర్చే లక్ష్యంతో.. చెన్నైలో ఈ-ఫార్మసీ నెట్‌మెడ్స్‌ను కూడా పర్యవేక్షిస్తుంది. 2020లో నెట్‌మెడ్స్‌ను రిలయన్స్ రిటైల్ కొనుగోలు చేయడం ద్వారా ఔషధ రంగంలోకి ప్రవేశించింది. ఇది కూడా మంచి లాభాలను ఆర్జిస్తూ ముందుకు సాగుతోంది.ఇదీ చదవండి: లేటు వయసులో రెండో పెళ్లికి రెడీ అయిన ప్రపంచ కుబేరుడు.. ఆరేళ్లుగా!7-ఎలెవెన్ (7-Eleven)రిలయన్స్ రిటైల్‌తో భాగస్వామ్యం ద్వారా ప్రపంచంలోని ప్రముఖ కన్వీనియన్స్ స్టోర్ చైన్ 7-ఎలెవెన్‌ను భారతదేశానికి తీసుకురావడంలో ఇషా అంబానీ కీలక పాత్ర పోషించింది. భారతీయ వినియోగదారులకు ఐకానిక్ 24/7 కన్వీనియన్స్ స్టోర్ పరిచయం చేసి.. మెరుగైన షాపింగ్ అనుభూతిని అందిస్తోంది. -
తిరా ఈవెంట్ : ప్రత్యేక ఆకర్షణగా నీతా అంబానీ, ఇషా: ఇక బ్యాగ్స్ అయితే!
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ భార్య, రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ నీతా అంబానీ ఫ్యాషన్‌కు పెట్టింది పేరు. ఆరు పదుల వయసులోనూ స్టైలిష్ లుక్స్‌తో ఫ్యాషన్ ప్రపంచాన్ని సైతం మెస్మరైజ్ చేస్తూ ఉంటుంది. అంతేనా ముఖేష్, నీతా అంబానీ ముద్దుల తనయ ఇషా అంబానీ కూడా ఫ్యాషన్ ఐకాన్‌గా పేరు తెచ్చుకుంది. తల్లికి తగ్గ తనయ అనిపించుకుంటూ ఉంటుంది. తాజాగాముంబైలోని జియో వరల్డ్ ప్లాజాలో జరిగిన ఈహై-ప్రొఫైల్ లాంచ్ ఈవెంట్లో అంబానీ లేడీస్ తమ ప్రత్యేక నిలుపుకున్నారు. రిలయన్స్ బ్యూటీ వెంచర్ తిరా తన కొత్త స్టోర్‌ను ముంబైలో లాంచ్ చేసింది. ఈ సందర్భంగా ఇషా అంబానీపిరామిల్ మెరిసే లావెండర్ పవర్ ప్యాంట్‌సూట్ అందన్నీ ఆకట్టుకోగా, నీతా అంబానీ, లూజ్ ప్యాంట్, చెకర్డ్ బ్లేజర్‌తో ప్రత్యేకంగా దర్శనమిచ్చింది. ముఖ్యంగా వారి బ్యాగ్స్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.నీతా అంబానీ పాప్‌కార్న్ బ్యాగ్నీతా అంబానీ పాప్‌కార్న్ పర్స్ స్పెషల్ ఎట్రాక్షన్.. రెసిన్, ఎనామెల్, ఇమిటేషన్ ముత్యాలు, గోల్డ్-టోన్ మెటల్‌తో తయారు చేశారట.ఇషా అంబానీ బో క్లచ్ఫ్యాషన్ గేమ్‌లో తగ్గేదే లేదు అన్నట్టుంది ఇషా అంబానీ చేతిలోని పర్స్. చిన్న వెండి విల్లు ఆకారపు క్లచ్ అందరి దృష్టిని ఆకర్షించింది. కాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ బ్యూటీ రిటైల్ చైన్ అయిన తీరా ఫ్లాగ్షిప్ స్టోర్‌ను ముంబైలోని జియో వరల్డ్ ప్లాజాలో ప్రారంభించింది. భారతదేశంలో ప్రీమియం బ్యూటీ షాపింగ్ డెస్టినేషన్ అని కంపెనీ ప్రకటించింది. ఈ విస్తారమైన 6,200 చదరపు అడుగుల స్టోర్‌లో టాప్ గ్లోబల్ బ్యూటీ బ్రాండ్లతో హై-ఎండ్ రిటైల్ అనుభవాన్ని అందించనుంది. ఈ హై-ప్రొఫైల్ లాంచ్ ఈవెంట్లో ఫ్యాషన్ క్రిటిక్ ఇన్ఫ్లుయెన్సర్, సూఫీ మోతీవాలా, పలువురు బాలీవుడ్ క్వీన్లు మెరిసిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Limelight Nova (@limelightnova) ఇదీ చదవండి : పేరు మార్చుకున్న అంబానీ కోడలు : ఇకపై అధికారికంగా...! -
‘పర్యావరణం కోసం వాటికి నేను దూరం’
దీపావళి పండగను పురస్కరించుకుని చాలా మంది విభిన్న రీతుల్లో వేడుకలు నిర్వహించుకుంటారు. దేశంలో అత్యంత ధనవంతుల జాబితాలో ఉన్న ముఖేశ్ అంబానీ గారాలపట్టి, ఆయన కూతురు ఇషా అంబానీ దీపావళి రోజును ఎలా జరుపుకుంటారో తెలిపారు. ఇంటిల్లిపాది ఎలా వేడుకలు నిర్వహించుకుంటారో తెలియజేశారు. తన వ్యాపారాలు వృద్ధికి ఈ పండగ ఎలా ఉపయోగపడుతుందో చెప్పారు.‘చిన్ననాటి నుంచి నాకు పండుగలంటే చాలా సరదా. ఆ సమయంలో మా ఇల్లు బంధువులతో, పండుగ వేడుకలతో కళకళలాడుతుంది. ఎన్ని పనులున్నా అమ్మానాన్నలు వాటిని పక్కన పెట్టి మాతోనూ, బంధుమిత్రులతోనూ గడుపుతారు. బిజీ జీవితంలో పండుగలు మా అందరికీ ఓ ఆటవిడుపులా దోహదపడుతాయి. అంతేకాదు ఎన్నో విషయాల్నీ శాస్త్రాల్నీ తెలియజేస్తుంటాయి. అయితే నాకు అన్ని పండుగల్లో కెల్లా దీపావళి అంటే చాలా ఇష్టం. మట్టి ప్రమిదల్లో దీపాలను వెలిగించడం, ఆ వెలుగును చూస్తూ ఆనందించడం అలవాటు. ఆ కాంతులు పాజిటివ్ ఎనర్జీని ఇచ్చినట్టు అనిపిస్తుంది. దాంతో వ్యాపార నిర్ణయాలు తీసుకోవడంలోనూ ఈ పండగ వాతావరణం ఎంతో ఉపయోగపడుతుంది. టపాసుల విషయానికొస్తే పక్షుల్నీ, జంతువుల్నీ భయపెట్టీ, పర్యావరణానికి హాని చేసే వాటికి నేను దూరం’ అని చెప్పారు.ఇదీ చదవండి: ప్రత్యేక ట్రేడింగ్ నిర్వహించే ఏకైక దేశం భారత్!ఇషా అంబానీ ప్రాతినిధ్యం వహిస్తున్న కంపెనీలు రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ రిలయన్స్ ట్రెండ్స్ టిరా బ్యూటీ యూస్టా అజార్ట్ హామ్లేస్ నెట్‌మెడ్స్ ఫ్రెష్‌పిక్ -
‘నా పెళ్లి కోసం అన్నయ్య పెళ్లి వాయిదా’
ఇంట్లో పెళ్లికి ఎదిగిన కొడుకు, కూతురు ఉంటే తల్లిదండ్రులు కూతురికే ముందు పెళ్లి చేయాలనుకుంటారు. ఈ ఆనవాయితి దేశీయంగా దాదాపు అందరి ఇళ్లల్లో జరుగుతోంది. పేద, మధ్య తరగతి, ధనిక కుటుంబాలనే తేడా లేకుండా దీన్ని పాటిస్తున్నారు. ఇందుకు అంబానీ కుటుంబం కూడా అతీతం కాదని నిరూపించారు. ముఖేశ్-నీతా అంబానీ దంపతులకు ఇషా అంబానీ, ఆకాశ్ అంబానీలు కవల పిల్లలు. మొన్న అక్టోబర్ 23న వారు పుట్టిన రోజు జరుపుకున్న విషయం తెలిసిందే. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి, తన సోదరుడి పెళ్లికి సంబంధించి ఇషా అంబానీ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.‘అన్నయ్య ఆకాశ్ అంబానీ పెళ్లి శ్లోకామెహతాతో నిర్ణయించుకున్నారు. మార్చి 24, 2018న గోవాలో ఎంగేజ్మెంట్ పూర్తయింది. మే, 2018లో ఆనంద్ పిరమాల్‌తో నాకు నిశ్చితార్థం జరిగింది. ముందుగా అన్నయ్య ఎంగేజ్మెంట్ జరిగింది కాబట్టి, తన వివాహం ముందే జరగాల్సి ఉంది. కానీ నా పెళ్లి కోసం తన వివాహాన్ని వాయిదా వేసుకున్నాడు. అందుకు వదిన శ్లోకామెహతా కూడా ఎంతో సహకరించింది. నా వివాహం డిసెంబర్ 2018లో పూర్తయిన తర్వాత మార్చి 9, 2019లో అన్నయ్య-వదినల పెళ్లి జరిగింది’ అని ఇషా అంబానీ చెప్పారు.ఇషా అంబానీ ప్రాతినిధ్యం వహిస్తున్న కంపెనీలు రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ రిలయన్స్ ట్రెండ్స్ టిరా బ్యూటీ యూస్టా అజార్ట్ హామ్లేస్ నెట్‌మెడ్స్ ఫ్రెష్పిక్ఇదీ చదవండి: ఉచిత భోజనం వోచర్లు వాడిన ఉద్యోగుల తొలగింపుఆకాశ్ అంబానీ ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థలు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ జియో ప్లాట్‌ఫామ్స్ లిమిడెట్ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ ముంబయి ఇండియన్స్ -
ఇషా, ఆకాష్ అంబానీ పేర్ల వెనుక స్టోరీ, వాటి అర్థం తెలుసా?
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ,నీతా అంబానీల పిల్లలు ఇషా అంబానీ, ఆకాష్ అంబానీ. ఐవీఎఫ్ ద్వారా ఈ కవల పిల్లలకు జన్మనిచ్చారు నీతా అంబానీ. అక్టోబర్ 23న పుట్టిన ఇషా , ఆకాష్ అంబానీలు పేర్లు ఎలా వచ్చాయో తెలుసా?ఇషా, ఆకాష్ అంబానీ పుట్టిన రోజు సందర్బంగా గతంలో డిజైనర్లు అబు జానీ, సందీప్ ఖోస్లాతో నీతా అంబానీ సంభాషణ ఇపుడు వైరల్‌గా మారింది. ఇందులో తన కవల పిల్లలు ఇషా, ఆకాష్ పేర్ల వెనుకున్న కథను నీతా పంచుకున్నారు.కవలల పిల్లల ప్రసవం కోసం తాను అమెరికాలో ఉన్నానని నీతా తెలిపారు. అపుడు నత భర్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ తనను కలిసి ఇండియా వెళ్లేందుకు విమానం దిగారో లేదో వెంటనే అమెరికా బయలుదేరాల్సి వచ్చింది. ఎందుకంటే... నెలలకు నిండకుండానే. ఇషా, ఆకాష్‌కు జన్మనిచ్చారట నీతా. దీనితో ముఖేష్ U.S.కి తిరిగి వెళ్లవలసి వచ్చింది. ఇక్కడ ఇంకో విశేషం ఏమిటంటే..నీతాకు డెలివరీ అయిందన్న సంగతి తెలియగానే అంబానీతోపాటు, నీతా తల్లి, డాక్టర్ ఫిరోజా, విమానంలో అమెరికాకు బయలు దేరారు. అపుడు వారు ప్రయాణిస్తున్న విమానం పైలట్ ఈ సంతోషకరమైన వార్తను ప్రకటించారు. అంతేకాదు తమ పిల్లలకు ఇషా, ఆకాష్ పేర్లు ఎలా పెట్టిందీ వివరించారు నీతా. పిల్లలకు పేర్ల చర్చ వచ్చినపుడు పర్వతాల మీదుగా ఆకాశంలో ఎగురుతున్నపుడు ఈ వార్త తెలిసింది కాబట్టి అమ్మాయికి ఇషా (పర్వతాల దేవత) ఆకాష్ (ఆకాశం) అని అనే పేర్లు పెడదామని చెప్పారట అంబానీ. అదీ సంగతి. ఇషా అంబానీ, ఆకాష్ అంబానీ పుట్టిన మూడేళ్ల తర్వాత వారి మూడో సంతానం అనంత్ అంబానీ జన్మించాడు. కాగా ప్రస్తుతం ఇషా, ఆకాష్, అనంత్ రిలయన్స్వ్యాపార సమ్రాజ్య బాధ్యతల్లో ఉన్నారు. ఆకాష్ , డైమండ్స్ వ్యాపారి కుమార్తె శ్లోకా మెహతాను పె ళ్లాడాడు వీరికి ఇద్దరు సంతానం. వ్యాపారవేత్త ఆనంద్పిరమిల్ వివాహమాడిన ఇషాకు ఇద్దరు కవల పిల్లలు. అనంత్ తన చిన్న నాటి స్నేహితురాలు రాధికా మర్చంట్‌ను ఈ ఏడాది జూలైలో అంగరంగ వైభవంగా పెళ్లాడిన సంగతి తెలిసిందే. -
అంబానీ కవల పిల్లల వ్యాపార సామ్రాజ్యం
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ వారసులు, కవలు ఆకాశ్ అంబానీ, ఇషా అంబానీలు బుధవారం పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. ముఖేశ్-నీతా అంబానీ దంపతులకు ఐవీఎఫ్ ద్వారా అక్టోబర్ 23, 1991లో వీరు ఇద్దరు జన్మించారు.ఇషా అంబానీముంబయిలో అక్టోబర్ 23, 1991లో జన్మించారు.యేల్ యూనివర్సిటీ నుంచి సైకాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పట్టా పొందారు.పిరమల్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆనంద్ పిరమల్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు.కింది సంస్థలకు ఇషా అంబానీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్రిలయన్స్ ట్రెండ్స్టిరా బ్యూటీయూస్టాఅజార్ట్హామ్లేస్నెట్మెడ్స్ఫ్రెష్పిక్ఇదీ చదవండి: పెట్రోల్ కల్తీని ఎలా గుర్తించాలంటే..ఆకాశ్ అంబానీముంబయిలో అక్టోబర్ 23, 1991లో జన్మించారు.ముంబయిలోని ధీరూబాయ్ అంబానీ ఇంటర్నేషన్ స్కూల్లో విద్యాభ్యాసం చేశారు.అమెరికాలోని బ్రౌన్ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.2018లో శ్లోకామెహతాను వివాహం చేసుకున్నారు. వీరికి పృథ్వీ, వేద ఇద్దరు పిల్లలు.కింది సంస్థలకు ఆకాశ్ అంబానీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్జియో ప్లాట్‌ఫామ్స్ లిమిడెట్రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ముంబయి ఇండియన్స్ -
గోల్డెన్ స్పూన్‌తో పుట్టిన ట్విన్స్, ఐకాన్ ఇషా, ఆకాశ్ అంబానీ రేర్పిక్స్
-
‘అమ్మా నీ వల్లనే’ : ఐకాన్ ఇషా భావోద్వేగం, ట్రెండింగ్‌లో దూకుడు
అంబానీ వారసురాలు, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ డైరెక్టర్ ఇషా అంబానీ మరో ఘనతను సొంతం చేసుకుంది. బిలియనీర్ ముఖేష్ అంబానీ, నీతా కుమార్తె, ఇషా అంబానీ ఐకాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకుంది. ఈ సందర్భంగా తల్లినుద్దేశించి భావోద్వేగ ప్రసంగం చేసింది. అలాగే తనకు దక్కిన అవార్డును తల్లి నీతాకు, తన కుమార్తె ఆదియాకు అంకితమివ్వడం విశేషంగా నిలిచింది. దీంతో ప్రస్తుతం ఇషా గూగుల్ ట్రెండింగ్‌లో నిలిచింది.హార్పర్స్ బజార్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్స్ 2024లో 'ఐకాన్ ఆఫ్ ది ఇయర్' అవార్డును ఇషా అందుకుంది. ఈ అవార్డును ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్, వ్యవస్థాపకురాలు గౌరీఖాన్ ఆమెకు అందించారు. అవార్డు అందుకున్న తర్వాత, ఇషా తన తల్లికి కృతజ్ఞతలు తెలుపుతూ హార్ట్ టచింగ్ ప్రసంగం చేసింది.‘‘నా విజయానికి బాటలు వేసిన నా తల్లి, నా రోల్ మోడల్" అంటూ తల్లి నీతాకు ధన్యవాదాలు తెలిపింది ఇషా. ‘అమ్మా, నీకు ధన్యవాదాలు, నీ నడకే నాకు పరుగులు నేర్పింది. ఇది నిజంగా నీ వల్లనే’.. అంటూ ప్రసంగించింది. ఈ ఘనత అంతా అమ్మకే దక్కుతుంది. అందుకే ఈ అవార్డు అమ్మకు అంకితం’’ అన్నారు. అంతేకాదు "ఈ అవార్డును నా కుమార్తె ఆదియాకు కూడా అంకితమిస్తున్నా..నా బిడ్డ ప్రతీ రోజూ నన్నెంతో ప్రోత్సహిస్తోంది’’ అంటూ ఉద్వేగంగా ప్రసంగించడం అక్కడున్న వారిని ఆకట్టుకుంది. రిలయన్స్ రిటైల్ డిజిటల్ ఉనికిని మెరుగుపరచడంలో ఇషా కీలక పాత్ర పోషించింది ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ అజియో, ఆన్లైన్ బ్యూటీ మార్కెట్‌ప్లేస్ తీరా లాంటివాటితో వ్యాపారం రంగంలో దూసుకు పోతోంది. వ్యాపారవేత్త ఆనంద్ పిరమల్‌ను పెళ్లాడిని ఇషాకు కవల పిల్లలు. ఇవీ చదవండి: హనీమూన్ డెస్టినేషన్ : పడవింట్లో విహారం!కలల పంటకోసం ఎదురు చూపులు : అందమైన మెటర్నిటీ షూట్ -
మనవడితో దాండియా స్టెప్పులేసిన నీతా అంబానీ, ఆ స్టార్ కిడ్ కూడా!
రిలయన్స్ ఫౌండేషన్, ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్పర్సన్ నీతా అంబానీ దసరా వేడుకల్లో సందడి చేశారు. కుటుంబ సభ్యులతో పాటు, మనవడు పృథ్వీ, చదువుకుంటున్ నీతా ముఖేష్ అంబానీ జూనియర్ స్కూల్ (NMAJS)లో ఉత్సాహంగా పాల్గొన్నారు. అతని క్లాస్‌మేట్స్‌తో కలిసి డ్యాన్స్ చేశారు. వీరిలో బాలీవుడ్ స్టార్ కపుల్ కరీనా , సైఫ్ కుమారుడు జెహ్ అలీ ఖాన్ కూడా ఉన్నారు. దాదీ, మనవళ్ళ డ్యాన్స్ నెట్టింట సందడి చేస్తోంది.అంబానీ కుటుంబం ప్రతీ పండుగను వైభవంగా జరుపుకుంటుంది. తాజాగా నవరాత్రి సంబరాల్లో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీ దంపతులు చిన్న కుమారుడు అనంత్ అంబానీ భార్య, కొత్త కోడలు రాధికా మర్చంట్‌తో ఉత్సాహంగా పాల్గొన్నారు. నీతా కుమార్తె ఇషా అంబానీ కుమారుడు పృథ్వీ స్కూల్లో నిర్వహించిన వేడుకలో చిన్న పిల్లలతో దాండియా స్టెప్పులు వేశారు. మనవడు పృథ్వీరాజ్ అంబానీ కరీనా కపూర్ కొడుకు జెహ్, ఇతర పిల్లలతో కలిసి సరదాగా గడిపారు. పింక్ టోన్ స్ట్రాపీ హీల్స్,అద్భుతమైన పింక్ కలర్ సల్వార్ సెట్‌ను ధరించి నీతా ఆనందంగా డ్యాన్స్ చేస్తూ కనిపించారు. అలాగే తల్లి పూనమ్ దలాల్‌తో కలిసి గర్భా ఆచారం, అమ్మవారికి హారతి ఇచ్చి దసరా వేడుకను జరుపుకున్నారు. నీతా అంబానీ తన మనవడు, పృథ్వీ ,అతని క్లాస్మేట్లను స్టోరీ సెషన్‌తో ఆశ్చర్యపరిచారు. పెప్పా పిగ్ పుస్తకంనుంచి ఒక కథను వివరించి పిల్లలతో ఉత్సాహంగా కనిపించడం పిల్లలు శ్రద్ధగా వినడం, లంచ్‌లో వారితో ముచ్చటించడం విశేషం. దీనికి సంబంధించిన ఫోటోలను స్కూలు యాజమాన్యం తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. -
ఐకానిక్ ఇషా అంబానీ, స్టైలిష్ లుక్స్ (ఫోటోలు)
-
ఎలిగెంట్లుక్, స్టైలిష్ బ్యాగ్ : ఇషా అంబానీ లెవలే వేరు!
యువ మహిళా వ్యాపారవేత్తగా రాణిస్తున్న రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. వ్యాపార రంగంలో రాణిస్తూనే, ఫ్యాషన్ ఐకానిక్‌లా కూడా తనదైన శైలిని ప్రదర్శిస్తుంది. తాజాగా ఒక ఫ్యాషన్ ఈవెంట్లో ఇషా స్పెషల్లుక్లో ఆకట్టుకుంది. ఈ విషయంలో తల్లి నీతా అంబానీకి తగ్గ తనయ అనిపించుకుంటోంది. సోమవారం జరిగిన లగ్జరీ స్కిన్‌కేర్ అండ్ హెయిర్‌కేర్ బ్రాండ్ అగస్టినస్ బాడర్ నిర్వహించిన స్టార్-స్టడెడ్ లాంచింగ్ కార్యక్రమంలో ఇషా అంబానీ బ్లాక్ డ్రెస్‌లో తళుక్కున మెరిసారు. అనైతా ష్రాఫ్ అడ్జానియా డిజైన్ చేసిన స్ట్రాప్‌లెస్ బ్లౌజ్, నెక్లైన్ కార్సెట్ టాప్ ,మ్యాచింగ్ స్కర్ట్ ధరించింది. అంతేకాదు లగ్జరీ చిట్టి బ్యాగ్ హీర్మేస్ కెల్లీ బ్యాగ్ ఆకర్షణగా నిలిచింది. తన కవల పిల్లలు ఆదియా,కృష్ణ పేర్లతో ప్రత్యేకంగా తీర్చిదిద్దడం హైలైట్. గ్లామరస్ అవతార్‌లో శిరస్సునుంచి పాదం వరకు ఆసాంతంగా పర్ఫెక్ట్గా కనిపించింది.కాగా ఇషా అంబానీ 2018లోవ్యాపారవేత్త ఆనంద్ పిరమల్‌ను పెళ్లి చేసుకున్నారు. 2022, నవంబరులో వీరికి కవల పిల్లలు పుట్టారు. -
ఇషా అంబానీ సరికొత్త రికార్డ్!.. జాబితాలో ఆకాష్ కూడా..
హురున్ ఇండియా అండర్ 35 జాబితా విడుదల చేసింది. ఇందులో దేశంలోని అత్యంత విజయవంతమైన యువ పారిశ్రామికవేత్తలను వెల్లడించింది. ఈ లిస్టులో అంబానీ పిల్లలు ఇషా, ఆకాష్ ఉన్నారు. ఈ జాబితాలో మొత్తం 150 మంది 35 ఏళ్లలోపు వయసున్న పారిశ్రామిక వేత్తలు ఉన్నారు.ఓ వైపు ఆసియాలోని అత్యంత ధనవంతుల జాబితాలో ముకేశ్ అంబానీ ఒకరుగా ఉన్నారు. ఇప్పుడు అంబానీ కుమార్తె ఇషా 2024 హురున్ ఇండియా అండర్ 35 జాబితాలో అతి పిన్న వయస్కురాలైన మహిళా పారిశ్రామికవేత్తగా నిలిచారు. ఈ జాబితాలో అంబానీ కుమారుడు ఆకాష్ కూడా ఉన్నారు.ముకేశ్ అంబానీ గారాల తనయ ఇషా అంబానీ 'రిలయన్స్ రిటైల్' మేనేజింగ్ డైరెక్టర్. ముంబైలో పుట్టి పెరిగిన ఇషా ముంబైలోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో తన ప్రాథమిక విద్యను పూర్తి చేసింది. ఆ తరువాత యునైటెడ్ స్టేట్స్‌లోని యేల్ విశ్వవిద్యాలయం నుంచి సైకాలజీ, కాలిఫోర్నియాలోని స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ డిగ్రీని పొందింది.ఇదీ చదవండి: ఇద్దరితో మొదలై.. విశ్వమంతా తానై - టెక్ చరిత్రలో గూగుల్ శకం.. అనన్య సామాన్యంహురున్ ఇండియా అండర్-35 జాబితాలో ఇతరులు2024 హురున్ ఇండియా అండర్-35 జాబితాలో అనెరి పటేల్, అనీషా తివారీ, అంజలి మర్చంట్‌తో సహా మరో ఏడుగురు మహిళా వ్యాపారవేత్తలు కూడా ఉన్నారు. వీరి వయసు 33, 34 మధ్య ఉంది. వీరందరూ కుటుంబ వ్యాపారాలను కొనసాగిస్తున్నారు. ఈ జాబితాలో షేర్‌చాట్ కో ఫౌండర్ అంకుష్ సచ్‌దేవా అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచారు. మామా ఎర్త్ సీఈఓ 35 సంవత్సరాల వయస్సు గల గజల్ అలగ్ కూడా ఉన్నారు. -
ఇషా అంబానీకి ఆరేళ్లున్నప్పటినుంచీ..తొలి ఫీజు రూ. 25లే : వీణా
సెలబ్రిటీ మెహందీ కళాకారిణి, వీణా నగ్దా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తనదైన ప్రత్యేక మెహందీ కళతో సెలబ్రిటీ వధువుల ఫస్ట్ ఆప్షన్ ఆమె. బాలీవుడ్ క్వీన్స్ అందాల హీరోయిన్ శ్రీదేవి మొదలు ఈతరం దీపికా పదుకొనే, అలియా భట్, ట్వింకిల్ ఖన్నా, కృతి ఖర్బందా దాకా ఆమే హాట్ ఫ్యావరేట్. పలు బాలీవుడ్ సినిమాల్లో తనదైన నటనతో ఆకట్టుకుంది. వీణా. అంతేకాదు ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ కుటుంబంతో ఆమెకు సుదీర్ఘం అనుబంధం ఉంది. అంబానీలతో తన 38 ఏళ్ల అనుబంధం గురించి ప్రస్తావించిన వీణా రిలయన్స్ ఫౌండేషన్ చైర్ పర్సన్ నీతా అంబానీపై ప్రశంసలు కురిపించడం విశేషం.వీణా నగ్దా మెహందీ ఆర్ట్‌పై తన తనకున్న ప్రేమను వివరించడంతోపాటు, 38 ఏళ్ల అంబానీ కుటుంబంలో కోకిలాబెన్ అంబానీ నుండి నీతా అంబానీ వరకు తనకున్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు. అంబానీ కుటుంబంలో రెండు చేతుల నిండా నిండుగా గోరింటాకు పెట్టినందుకు తీసుకున్నతొలి రెమ్యునరేషన్ రూ, 25 రూపాయలట. ఆ సమయంలో ముఖేష్ అంబానీ కోకిలాబెన్ ఫోన్ నెంబరు, కార్డు ఉండాలని సలహా ఇచ్చాడు. దీంతో ఆమె సలహా పాటించినట్టు వీణా తెలిపారు. తనను ఎంతో మెచ్చుకునేవారని ఆమె చెప్పారు. అంతేకాదు అంబానీ ఇంటికి వెళ్ళే అవకాశం వచ్చినప్పుడు, ఎక్కువ ఫీజు వసూలు చేయాలని సూచించారట పొరుగింటివారు. కానీ తాను ఎన్నడూ అలాగ చేయ లేదని వెల్లడించింది. అంబానీలతో కలిసి పని చేయడమే గొప్ప అవకాశంగా భావించి సాధారణ కస్టమర్ల నుంచి పొందే ఛార్జీనే తీసుకోవాలని తన తల్లి కోరిందట. ఆ సలహా తనకు ఎప్పుడూ గుర్తుండేదంటూ చెప్పుకొచ్చారు.ఇషాకు ఆరేళ్లప్పటినుంచి గోరింటాకు పెడుతున్నాఇషా అంబానీ , శ్లోకా మెహతాకు 6 సంవత్సరాల వయస్సులో గోరింటాకు వారి చేతులను అలంకరించిన విషయాన్ని వీణా నగ్దా గుర్తు చేసుకుంది ఇషాకు ఆరేళ్ల వయసు ఉన్నప్పటి నుంచి వీణా నగ్దాను మెహందీ ఆర్టిస్ట్‌గా ఉన్నారు. ధీరూభాయ్ అంబానీ నిర్వహించిన ఒక కార్యక్రమానికి తాను హాజరయ్యానని, ఆయన కుమార్తెల చేతులకు కూడా మెహందీ పెట్టానని తెలిపింది. అప్పుడు శ్లోకాకి కూడా ఆరేళ్లు అని కూడా వీణా గుర్తు చేశారు. వారంతా చదువుల కోసం సింగపూర్‌లో ఉండేవారికి ఇంటికి వచ్చినప్పుడల్లా మెహందీ పార్టీలు చేసుకునే వారని వివరించారు.పారిస్ ఒలింపిక్స్ 2024, మెహిందీ ఆర్ట్పారిస్ ఒలింపిక్స్ 2024కి ఆహ్వానించినపుడు తానెంతో పొంగిపోయానని, భారతీయ సంస్కృతిని ప్రపంచానికి చాటేందుకు నీతా అంబానీ చేసిన పనికి థ్రిల్ అయ్యానని వీణా వెల్లడించింది. పారిస్ ఒలింపిక్స్‌లో ఇండియన్ హౌస్‌లోని మెహందీ స్టాల్ గురించి మాట్లాడటం, ప్రపంచం నలుమూలల నుండి అనేక మంది ఒలింపిక్ రింగ్‌ను మెహందీ డిజైన్ వేయించుకోవడం గురించి కూడా ప్రస్తావించారు. 'మెహెందీ క్వీన్ ఆఫ్ బాలీవుడ్' అని ట్యాగ్ ఇచ్చిన బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ తన కళకు విస్తరణకు అందించిన సహాయాన్ని కూడా వీణా గుర్తు చేసుకున్నారు. -
అంబానీ ఇంట అందగాడు
అందమైన కాలర్‌తో పింక్, గోల్డెన్ జాకెట్ ధరించి అనంత్ అంబానీ కుటుంబ వస్త్రధారణతో పోటీ పడుతూ వివాహ కార్యక్రమాల్లో తనూ విశేషంగా ఆహూతులను ఆకట్టుకుంది ‘హ్యాపీ’ అనే డాగ్. అహ్మదాబాద్‌కు చెందిన ఖ్యాతి అండ్ కరణ్ షా పంఖ్ డిజైనర్ పెట్ వేర్ దుస్తులను డిజైన్ చేసింది. స్వచ్ఛమైన సిల్క్ జాక్వర్డ్ ఫ్యాబ్రిక్‌తో ఆమె అంబానీల కోసం తయారు చేసిన పెంపుడు జంతువుల దుస్తుల్లో ఇది ఇరవై తొమ్మిదవది. వివాహ వేడుకలు జరుగుతున్నంతసేపూ హ్యాపీ హాయిగా మండపంపై తన స్థానాన్ని ఆక్రమించుకుని, చుట్టూ పరిశీలిస్తూ, చిత్ర విచిత్ర విన్యాసాలతో వీడియోల్లో సందడి చేసింది. ఇషా అంబానీ కూతురు బేబీ ఆదియుశక్తి ప్రేమతో హ్యాపీని ఆలింగనం చేసుకుంటుండగా, ఆమె తండ్రి ఆనంద్ పిరమల్ కూతురును అనుసరిస్తూ కనిపిస్తాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియోని ‘అత్యంత అందగాడు’ అంటూ అభివర్ణించారు వ్యూవర్స్. అంబానీ కుటుంబం పెంపుడు జంతువు హ్యాపీ ఈ యేడాది జనవరిలో అనం –రాధికల నిశ్చితార్థంలో ఉంగరం మోసే పాత్రను పోషించింది. అప్పుడే అంబానీ కుటుంబ ఫొటోలో ఇది ప్రధాన స్థానం పోందింది. -
స్టయిల్ బై అమీ..
ఈశా అంబానీ రిలయన్స్ వారసురాలిగానే కాదు.. స్టయిల్ ఐకాన్‌గానూ ప్రసిద్ధురాలే! ఆమెకు ఆ స్టయిల్ని దిద్ది.. ఆమె ఐకానిక్ లుక్స్‌కి కారణమైన వ్యక్తి అమీ పటేల్! ఒక్క ఈశాకే కాదు ఎంతోమంది బాలీవుడ్ సెలబ్స్‌కి స్టయిల్ని సెట్ చేసిన ఈమె గురించి కొన్ని వివరాలు..ఫ్యాషన్ ప్రపంచంలో అమీకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అనుకొని కాదు అనుకోకుండానే ఈ రంగంలోకి వచ్చింది. అమీ సొంతూరు ముంబై. అక్కడే పెరిగింది. అక్కడి సుప్రసిద్ధ సర్ జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్‌లో ఫైన్ ఆర్ట్స్ (పోర్ట్రెయిట్స్)లో మాస్టర్స్ చేసింది డిస్టింక్షన్‌తో.ఫ్యాషన్ రంగంలో ఆమె జర్నీ ఎల్ ఇండియాలో ఆర్ట్ డైరెక్టర్‌గా మొదలై లోఫిసియల్ ఇండియాలో ఫ్యాషన్ డైరెక్టర్, హార్పర్స్ బాజార్లో క్రియేటివ్ డైరెక్టర్ హోదా దాకా సాగింది. ఫ్యాషన్ మ్యాగజీన్స్‌లో పనిచేస్తున్నప్పుడే బాలీవుడ్లో అవకాశం వచ్చింది కాస్ట్యూమ్ డిజైనర్‌గా. కంటిన్యూ అయింది. ఆ పరిచయాలు, ఆమె పనితీరు‡ఆమెను సెలబ్రిటీ స్టయిలింగ్కి ఇన్వైట్ చేశాయి. అలా అమీ స్టయిలింగ్ చేసిన ఫస్ట్ బాలీవుడ్ స్టార్ ప్రియంకా చోప్రా. ఆమెను పెళ్లి కూతురిగా ముస్తాబుచేసింది అమీనే.ప్రియంకా పెళ్లిలో ఆమెను చూసినవారంతా అమీపై ప్రశంసల వర్షం కురిపించారు. ఊహించని ఆ అవకాశం.. ఆమె ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. అందుకే సొంతంగా స్టయిలింగ్ ఫర్మ్ని స్టార్ట్ చేసింది ‘స్టయిల్ బై అమీ( ్టy ్ఛbyఅఝజీ)’ పేరుతో. బాలీవుడ్‌కి అమీ స్టయిల్ ఆఫ్ వర్క్ కొత్త కాదు.. పైగా ప్రియంకా చోప్రా స్టయిలింగ్‌తో ది బెస్ట్ స్టయిలిస్ట్గానూ ప్రూవ్ చేసుకుంది. సెలబ్రిటీల వర్క్ కాంట్రాక్ట్స్, అగ్రీమెంట్స్తో ‘స్టయిల్ బై అమీ’ బిజీ అయిపోయింది. ఆలియా భట్, మాధురీ దీక్షిత్, కత్రినా కైఫ్, రకుల్‌ప్రీత్ సింగ్, పూజా హెగ్డే, శోభితా ధూళిపాళ.. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అంబానీ లేడీస్.. ఈశా అండ్ నీతా అంబానీలతో కనిపిస్తుంది అమీ సెలబ్రిటీ స్టయిలింగ్ లిస్ట్!‘ప్రతి ప్రొఫెషన్లో అప్ అండ్ డౌన్స్ ఉన్నట్టే సెలబ్రిటీ స్టయిలింగ్ కెరీర్లోనూ ఉంటాయి. కాబట్టి చాలెంజింగ్‌గా ఉండాలి. స్టయిలింగ్కి ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటూ లేదు. దీనికి స్టయిలిస్ట్ దగ్గర ట్రైనింగ్‌ని మించిన చదువులేదు. కష్టపడి పనిచేసే తత్వం, సహనం, సామర్థ్యం అదనపు అర్హతలు. మంచి ట్రైనింగ్‌తో పాటు ఈ మూడూ ఉంటే ఈ కెరీర్లో అందలం ఎక్కొచ్చు. ఫ్యాషన్‌కి సంబంధించి ఇప్పుడు జెండర్ బారియర్స్ లేవు. అబ్బాయిలు స్కర్ట్స్ వేసుకుంటున్నారు.. అమ్మాయిలు లుంగీ, టీ షర్ట్‌ని ఇష్టపడుతున్నారు. సో కాస్ట్యూమ్స్‌కి లింగ భేదాల్లేకుండా పోయాయి. నిన్ను నువ్వు ఎక్స్‌ప్రెస్ చేసుకోవడమనే అర్థంలోకి మారిపోయింది ఫ్యాషన్."వర్ధమాన స్టయిలిస్ట్‌లు ఈ మార్పును దృష్టిలో పెట్టుకోవాలి. సెలబ్రిటీ స్టయిలింగ్ అంటే గ్లామరస్ జాబ్ కాదని గుర్తుంచుకోవాలి. ఏ డ్రెస్ వేసుకోవాలి.. దానికి మ్యాచింగ్ యాక్ససరీస్ ఏంటీ.. హెయిర్ స్టయిల్ ఎలా ఉండాలని డిక్టేట్ చేయడం కాదు స్టయిలింగ్ అంటే! సెలబ్రిటీ వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకుని.. ఆ పర్సనాలిటీకి తగినట్లుగా వాళ్లను తీర్చిదిద్దే క్లిష్టమైన పని అది. ఈ క్రమంలో ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా సెలబ్రిటీ అభాసుపాలై.. వాళ్ల రెప్యుటేషనే పడిపోవచ్చు. అందుకే దీన్ని ఆషామాషీగా చూడొద్దు!’ అని ఔత్సాహిక స్టయిలిస్ట్లకు సలహా ఇస్తోంది" – అమీ పటేల్. -
తమిళియన్ హెయిర్ స్టైలో ఇషా స్టన్నింగ్ లుక్..! (ఫొటోలు)
-
అనంత్ -రాధిక పెళ్లి వేడుక: తమిళియన్ హెయిర్ స్టైల్లో ఇషా..!
రిలయన్స్ ఇండస్ట్రీస్ దిగ్గజం ముఖేష్ అంబానీ-నీతాల చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి వేడుకలు అత్యంత వైభవోపేతంగా సాగుతున్నాయి. సంగీత్ దగ్గర నుంచి హల్దీ వరుకు సాగిన వివాహ సంబరాల్లో అంబానీ కుటుంబసభ్యులు మునిగితేలుతున్నారు. ఆ వేడుకల్లో వాళ్లంతా ఏళ్ల నాటి సంప్రదాయ ఫ్యాషన్ స్టైల్‌ని గుర్తుచేసేలా.. ఆయా వస్త్రధారణలో కనిపించి ఆశ్చర్యపరుస్తున్నారు. ఆ వేడుకలో నీతా నుంచి ఇషా, శ్లోకా మెహతా వివిధ రకాల లగ్జరీయస్ ఫ్యాషన్ డిజైనర్‌వేర్‌లతో అలరించారు. ఇప్పుడూ తాజాగా ఇషా సరికొత్త హెయిర్ స్టైల్లో కనిపించింది. ఇది తమిళయన్ హెయిర్ స్టైల్లో జడను వేశారు. జడ పైభాగంలో మొగ్ర పువ్వులతో ఓ పెద్ద కొప్పులా ఉండి..కింద నుంచి గోల్డెన్ థ్రెడ్‌తో అల్లారు. ఇక అందుకు తగ్గట్టుగా గ్రీన్ లెహంగాలో స్టన్నింగ్ లుక్‌లో కనిపించారు. అలాగే వాటికి మ్యాచింగ్ అయ్యేలా చెవిపోగులు ఇరువైపుల సూర్యుడు, చంద్రుడుని ధరించిందా అన్నంతా గ్రాండ్ లుక్‌లో కనిపించింది ఇషా. కాగా, అనంత్-రాధికలు జూలై 12న శుక్రవారం వివాహ బంధంతో ఒక్కటికానున్నారు. ఈ వివాహం అనంతరం జూలై 14న గ్రాండ్ రిసెప్షన్ జరగనుంది. ఇది మంబై నగరంలోని అంబానీ జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ , వారి కుటుంబ సభ్యుల సమక్షంలో జరగనున్నట్లు సమాచారం. View this post on Instagram A post shared by Ambani Family (@ambani_update) (చదవండి: నాజూగ్గా ఉండాలనుకుంటే..మొరింగ నీటిని ట్రై చేయండి..!) -
అనంత్ రాధికల హల్దీ వేడుక: కలర్‌ఫుల్ లెహంగాలో శ్లోకా, ఇషా..!
రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ నీతాల చిన్న కుమారుడు పెళ్లి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో మొదటగా జరిగిన సంగీత్ కార్యక్రమం నీతా ధరించిన ఆభరణాలు, వస్త్రాధారణ హైలెట్‌గా నిలిచింది. ఇక తర్వాత జరుగుతున్న హల్దీ వేడుక చాల కలర్ఫుల్గా సాగింది. ఈ హల్దీ వేడుకలో ఇషా పిరమల్, శ్లోకా మెహతా రంగరంగుల లెహంగాలతో స్టన్నింగ్ లుక్‌తో ఆకట్టుకున్నారు. ఈ వేడుకలో కాబోయే పెళ్లి కూతరు రాధిక ఆమె సోదరి సాంప్రదాయ వస్త్రధారణతో కళ్యాణ శోభను తీసుకొచ్చారు. ఈ గ్రాండ్ వేడుకలో శ్లోకా, అనామికా ఖన్నా డిజైనర్ వేర్ లెహంగాను ధరించింది. ఆమె ఎరుపు, నీలం, ఆకుపచ్చ, బంగారు రంగు వంటి మరెన్నో రంగులతో కూడిన శక్తివంతమైన లెహంగా సెట్‌ను ధరించింది. దానికి తగినట్టుగా చిలుక ఆకుపచ్చ స్కర్ట్ దానిపై పూల ఎంబ్రాయిడరీని అందంగా తీర్చిదిద్దారు. ఇక ఇషా మల్టీకలర్ కలర్ లెహంగాను ధరించింది. ప్రముఖ లగ్జరీ బ్రాండ్ టోరాని దిల్ రంగ్ జీవా లెహంగా సెట్‌తో అలరించింది. ఇది ఇండో వెస్టట్రన్ టచ్‌తో కూడిన సరికొత్త డిజైనర్ వేర్ లెహంగా. దీనికి రా సిల్క్‌తో రూపొందించిన టాసెల్ అలంకారాలు హైలెట్‌గా ఉండగా, అందమైన నెక్లైన్తో కూడిన ప్రత్యేకమైన బ్లౌజ్ మరింత అకర్షణీయంగా ఉంది. ఈ లెహంగా ధర ఏకంగా రూ. 135,500/-.(చదవండి: అనంత్ రాధిక సంగీత్ కార్యక్రమంలో నీతా లుక్ అదుర్స్..చేతికి హృదయాకారంలో..!) -
అనంత్ - రాధిక పెళ్లి వేడుకలు.. మెరిసిపోయిన అంబానీ కుటుంబం (ఫోటోలు)
-
అనంత్ రాధిక సంగీత్ కార్యక్రమంలో నీతా లుక్ అదుర్స్..చేతికి హృదయాకారంలో..!
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ల వివాహ వేడుకలకు సంబంధించిన ప్రతి వేడుక ఓ రేంజ్లో జరుగుతున్నాయి. ఆ వేడుకల్లో ఆ అంబానీ కుటుంబ సభ్యులు ధరించే దుస్తులు, ఆభరణాలు వార్తల్లో హాట్ టాపిక్‌గా నిలుస్తున్నాయి. జూలై 12న అనంత-రాధికల వివాహం జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వివాహానికి ముందు జరిగే సంగీత్ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఆ కార్యక్రమంలో నీతా రాణి పింక్ లెహంగా చోళీలో అద్భుతంగా కనిపించారు. ఆ డిజైనర్ లెహంగాకి తగ్గట్లు ఆమె ఎంచుకున్న కాంతీలాల్ ఛోటాలాల రూపొందిచిన వజ్రాభరణాలు మరింత అందాన్ని తెచ్చిపెటట్టాయి ఆమెకు. అలాగే చేతులకు డైమండ్ బ్యాంగిల్స్ ధరించింది. ఈ అలంకరణలో అందరి దృష్టి ఆమె ధరించిన హృదయకారపు ఉంగరంపైనే పడింది. ఇదే ఉంగరాన్ని ఆమె కూతురు ఇషా అంబానీ, మనీష్ మల్హోత్రా దీపావళి బాష్‌లో ధరించింది. ప్రస్తుతం ఈ తల్లి, కూతుళ్ల ద్వయం సేమ్ రింగ్‌ని ధరించడం నెట్టింట కాస్త హాట్‌టాపిక్‌గా మారింది. ముఖ్యంగా ఈ వేడుకలో నీతా ధరించిన ఆభరణాలు చాలా హైలెట్‌గా నిలిచాయి.నీతా ధరించిన ఆభరణాలు..కాంతిలాల్ ఛోటాలాల్ రూపొందించిన ఆభరణాలు నీతా కంఠానికి ఎగ్జాట్‌గా సరిపోయాయి. రోజ్ కట్ డైమండ్లు ఆమె మెడను మిరమిట్లుగొలిపే కాంతితో నింపాయి. ఆమె తలకు ధరించిన పాపిడి బొట్టు, చెవిపోగులు.. ప్రతీదీ కళాత్మకంగా ఉంది. View this post on Instagram A post shared by Miss Diva (@missdivaorg) (చదవండి: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కీటకం..ఏకంగా ఓ లగ్జరీ కారు ధర..!) -
అంబానీ ఇంట మొదలైన పెళ్లి సందడి (ఫోటోలు)
-
సిగ్గు పడేదేముంది? ఐవీఎఫ్ ద్వారానే పిల్లల్ని కన్నా: ఇషా అంబానీ
ప్రముఖ వ్యాపారవేత్త, భారతీయ కుబేరుడు ముఖేష్ అంబానీ కుమార్తె 'ఇషా అంబానీ' (Isha Ambani) ఇటీవల వోగ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ఐవీఎఫ్ ద్వారా కవలలకు జన్మనిచ్చినట్లు వెల్లడించారు. తన తల్లి నీతా అంబానీ కూడా ఆకాష్‌కి గర్భం దాల్చినప్పుడు ఈ ప్రక్రియనే ఎంచుకున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు.నేను ఐవీఎఫ్‌తో పిల్లలకు జన్మనిచ్చిన విషయాన్ని తొందరగానే వెల్లడించాను. ఎందుకంటే ప్రస్తుతం చాలా మంది ఈ ప్రక్రియనే ఎంచుకుంటున్నారు. ఈ విషయాన్ని చెప్పడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు. టెక్నాలజీ వేగంగా డెవలప్ అవుతున్న తరుణంలో ఐవీఎఫ్ ఎందుకు ఎంచుకోకూడదు? అని ఇషా అంబానీ అన్నారు.ఇషా అంబానీ 2018లో ఆనంద్ పిరమల్‌ను వివాహం చేసుకున్నారు. ఆ తరువాత 2022లో ఆదిత్య, కృష్ణ అనే ఇద్దరు పిల్లలు జన్మించారు. ప్రస్తుతం చాలా జంటలు ఐవీఎఫ్ ద్వారా పిల్లలను కంటున్నారు, సంతోషంగా ఉంటున్నారు.ఐవీఎఫ్ అంటే ఏమిటి?ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) అనేది ఒక వైద్య ప్రక్రియ. ఈ ప్రక్రియలో అండాన్ని, శుక్రకణాలను ఫలదీకరణం చేస్తారు. ఆ తరువాత ఫలదీకరణం చేసిందిం రెండు లేదా మూడు పిండాలను స్త్రీల గర్భాశయంలోకి ప్రవేశపెడతారు. ఆ పిండాలు గర్బాశయంలోనే పెరుగుతాయి. ఈ పద్దతిలో చాలామందికి ట్విన్స్ జన్మించే అవకాశం ఉంది. -
ఐవీఎఫ్ ద్వారా కవలలకు జన్మనిచ్చా.. తల్లి బాటలోనే ఈషా అంబానీ (ఫొటోలు)
-
వోగ్ మ్యాగజీన్ కవర్ పేజ్‌పై ఇషా అంబానీ..లుక్ మామూలుగా లేదుగా!
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కుమార్తె, రిలయన్స్ రీటైల్ డైరెక్టర్ ఇషా అంబానీ పిరామిల్ మరోసారి ప్రతిష్టాత్మక ఫ్యాషన్ అండ్ బ్యూటీ మేగజీన్ వోగ్ కవర్‌పేజీపై మరోసారి మెరిసారు. గార్డెన్ ప్రిన్సెస్‌గా మారిన ఇషా అంబానీ తన ఫ్యాషన్ స్టయిల్‌ను చాటుకున్నారు. మేగజీన్ కవర్‌పేజీ కోసం చేసిన ఫోటోషూట్‌ను వోగ్ ఇండియా ఇన్‌స్టాలో ఖాతాలో పోస్ట్ చేసింది. View this post on Instagram A post shared by VOGUE India (@vogueindia) ప్రత్యేకంగా తయారుచేసిన లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ డియోర్ గోల్డెన్ ఫ్రాక్‌లో ఇషా అంబానీ లుక్ అదిరిపోయింది. మ్యాచింగ్ రెడ్ అండ్ పింక్ గులీబాలు అమరి, చేతిలో బోకే, యాష్-టోన్ గ్లోవ్స్, కొత్త హెయిర్ స్టయిల్హైలైట్గా నిలిచాయి. ఈ ఫోటో షూట్లో రెండో లుక్‌లో చాలా ఎలిగెంట్‌గా కనిపించారామె. ‘నా ఉంగరాలు జుట్టు అంతగా ఇష్టం ఉండేది కాదు.. అలాగే షూట్ కోసం నా జుట్టును సెట్ చేస్తోంటే... నా స్కూలు కష్టాలు గుర్తొచ్చాయి. ఉంగరాల జుట్టు కంట్రోల్లోఉండాలంటే.. నూనె రాసుకోవడం, కిందికి దువ్వుకోవడం ఇవ్వన్నీ చెప్పేవారు. కానీ ఎపుడూ అలా జరగలేదు. సో... మనం ఎలా ఉన్నామో అలాగే హ్యాపీగా కంఫర్ట్‌గా ఉండాలి’’ అంటూ ఇషా పిరామిల్ తన కర్లీ హెయిర్ కష్టాలను గుర్తు చేసుకున్నారు.కాగా గతంలో కూడా వోగ్ ఇండియా కవర్ స్టోరీపైనా, మెట్‌గాలా ఫ్యాషన్ ఈవెంట్లో కూడా ఇషా కనిపించిన సంగతి తెలిసిందే. రిలయన్స్ రీటైల్ బాధ్యతల్లో ఇషా దూసుకుపోతోంది. కొత్త ఒప్పందాలు, భాగస్వామ్యాలతో సంస్థను పరుగులు పెట్టిస్తోంది. తాజాగా రిలయన్స్ రీటైల్ తమ కిరాణా, ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (FMCG) ఉత్పత్తులను ముంబైలో గంటలో ఆర్డర్ డెలివరీ చేసేలా కొత్త పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. -
అంబానీ వారసురాలు ఇషా అంబానీ ఫ్యాషన్ ట్రెండీ లుక్స్ (ఫొటోలు)
-
ఇషా అంబానీకి జియో బంపర్ డీల్! సక్సెస్ అయితే..
ఈషా అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ రిటైల్ బంపర్ డీల్ అందుకుంటోంది. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ అనుబంధ సంస్థ ముకేశ్ అంబానీకి చెందిన జియో లీజింగ్ సర్వీసెస్ ఈషా అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ రిటైల్‌తో రూ.35,904 కోట్ల డీల్ కుదుర్చుకోనుంది.టెక్ క్రంచ్ నివేదిక ప్రకారం, జియో లీజింగ్ సర్వీసెస్ వచ్చే రెండు ఆర్థిక సంవత్సరాల్లో రూ .35, 904 కోట్ల విలువైన రౌటర్లు, సెల్ ఫోన్లు వంటి టెలికాం పరికరాలు, కస్టమర్ కేంద్రాల ఎక్విప్మెంట్ కొనుగోలు చేయాలని యోచిస్తోంది. ఈ డీల్ కు ఆమోదం పొందడానికి కంపెనీ వాటాదారులకు పోస్టల్ బ్యాలెట్ నోటీసును పంపినట్లు సమాచారం.జియో లీజింగ్ సర్వీసెస్ లిమిటెడ్ (జేఎల్ఎస్ఎల్) రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ వినియోగదారులకు అనుబంధ సేవలతో పాటు టెలికాం పరికరాలను లీజుకు ఇచ్చే వ్యాపారంలోకి ప్రవేశించాలని యోచిస్తున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ఈ డీల్ విజయవంతమైతే భారత టెలికాం రంగంలో ఇదే అతిపెద్ద ఎక్విప్మెంట్ లావాదేవీ అవుతుంది. నివేదిక ప్రకారం, జెఎల్ఎస్ఎల్ లీజింగ్ మోడల్ ద్వారా, ముఖేష్ అంబానీ లేటెస్ట్ 5జీ పరికరాలను ప్రజలకు అందుబాటు ధరలో అందుబాటులో ఉంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మోడల్ ఆకాష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియోకు మరింత మంది చందాదారులను ఆకర్షిస్తుంది. జియో ఇప్పటికే భారతదేశంలో అతిపెద్ద టెలికాం ఆపరేటర్‌గా ఉన్న విషయం తెలిసిందే. 2025 మార్చి నుంచి 2026 మార్చితో ముగిసే ఆర్థిక సంవత్సరాల్లో ఈ లావాదేవీ జరగనుంది. -
ఏఐతో మరింత అందంగా: రిలయన్స్
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌లో భాగంగా ఉన్న టీరా బ్యూటీకేర్ కృత్రిమ మేధను వాడుతున్నట్లు కంపెనీ మార్కెటింగ్ హెడ్ తేజస్ కపాడియా తెలిపారు. తమ కస్టమర్లను మరింత అందంగా మార్చేందుకు కంపెనీ కొత్త టెక్నాలజీని పరిచయం చేసిందని చెప్పారు.ఈ సందర్భంగా కపాడియా మాట్లాడుతూ..‘ఆర్ఐఎల్ కొత్త వెంచర్ తిరా బ్యూటీ సెక్టార్లో వినియోగదారులకు సేవలందిస్తోంది. ఈ రంగంలో ఇప్పటికే ఉన్న పోటీదారులకంటే ప్రత్యేకంగా కస్టమర్లను ఆకర్షించేందుకు టెక్నాలజీను వాడుతున్నాం. వినియోగదారుల స్కిన్‌టోన్‌ను ఫొటోతీసి వారికి కావాల్సిన బ్యూటీ ప్రొడక్ట్‌లను సిఫార్సు చేసేలా ఏఐను ఏర్పాటుచేశాం. ఇందులో స్కిన్ఎనలైజర్ టెక్నాలజీ ఉపయోగించాం. దీని సహాయంతో తమకు ఇష్టమైన ఉత్పత్తులను కొనుగోలు చేసుకోవచ్చు. కంపెనీ వెబ్సైట్లో మేకప్, చర్మ సంరక్షణ పాఠాలను కూడా అందిస్తున్నాం’ అని చెప్పారు.వేగంగా అభివృద్ధి చెందుతున్న వ్యాపారాల్లో బ్యూటీ సెక్టార్ ఒకటి. ఇందులో రిలయన్స్ వంటి దిగ్గజ కంపెనీ ప్రవేశించడంతో చాలా కంపెనీల ఉత్పత్తులపై ప్రభావంపడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ముఖేశ్అంబానీ కుమార్తె ఇషా నేతృత్వంలోని టీరా కంపెనీ ఇప్పటికే స్కిన్‌కేర్ బ్రాండ్ కికో మిలానో, ఎల్బీఎంహెచ్ గ్రూప్‌నకు చెందిన బ్యూటీ రిటైలర్ సెఫోరాను కొనుగోలు చేసింది. ఈ కంపెనీ రాకతో ఇప్పటికే మార్కెట్లో ఉన్న టాటా గ్రూప్‌నకు చెందిన పాలెట్, నైకా వంటి బ్రాండ్లపై ప్రభావం ఉండనుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.ఇదీ చదవండి: బంగారుకొండను పేరుస్తున్న ఆర్బీఐ..!భారత్‌లో ఈ బిజినెస్‌కు భవిష్యత్తులో ఆశించిన మార్కెట్ ఉంటుందని కంపెనీలు భావిస్తున్నాయి. అంతర్జాతీయ బ్రాండ్లు కూడా దేశంలోకి ప్రవేశిస్తున్నాయి. 2023లో జపాన్‌కు చెందిన షిసిడో యాజమాన్యంలోని ‘నార్స్ కాస్మెటిక్’ షాపర్స్ స్టాప్ లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఏడాది పాప్‌స్టార్ రిహన్న తన కాస్మెటిక్స్ కంపెనీ ఫెంటీ బ్యూటీ ఉత్పత్తులను నైకాతో కలిసి భారత్‌లో ప్రవేశపెట్టారు. -
సైన్స్, టెక్నాలజీలో మహిళా గ్రాడ్యుయేట్లు పెరగాలి
న్యూఢిల్లీ: దేశీయంగా టెక్నాలజీ రంగంలో లింగ అసమానతలు గణనీయంగా ఉంటున్నాయని రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ ఈషా అంబానీ తెలిపారు. మహిళలంటే ఉపాధ్యాయ వృత్తిలాంటివి మాత్రమే చేయగలరంటూ స్థిరపడిపోయిన అభిప్రాయాలే ఇందుకు కారణమని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం దేశీయంగా టెక్నాలజీ రంగంలో మహిళల వాటా 36 శాతమే ఉండగా, స్టెమ్ గ్రాడ్యుయేట్స్‌లో 43 శాతం, మొత్తం సైంటిస్టులు, ఇంజినీర్లు, టెక్నాలజిస్టుల్లో 14 శాతం మాత్రమే ఉందని ఆమె చెప్పారు. ఈ నేపథ్యంలో సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్ విభాగాల్లో మహిళా గ్రాడ్యుయేట్ల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉందని ’ గాల్స్ ఇన్ ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ) డే’ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఈషా తెలిపారు. నాలుగో పారిశ్రామిక విప్లవంలో పరిస్థితిని సరిదిద్దుకునే అవకాశాన్ని భారత్ అందిపుచ్చుకోవాలని ఆమె పేర్కొన్నారు. -
Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
మెట్‌గాలా 2024 ఈవెంట్లో అంబానీ కుమార్తె, రిలయన్స్ రీటైల్ ఎండీ ఇషా అంబానీ మరోసారి మెరిసి పోయింది. ఈ ఏడాది ఇషా అంబానీ మెట్ గాలా వేదికపైకి రావడం ఇది నాలుగోసారి. మెట్ గాలా 2024లో భారతీయ డిజైనర్ రాహుల్ మిశ్రా డిజైన్ చేసిన కస్టమ్-మేడ్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ కోచర్ చీర గౌనులో తళుక్కున మెరిసింది. ఆరు గజాల 3డీ గౌనుకు కార్సెట్ బ్లౌజ్‌తో గ్లామర్ లుక్‌ను మరింత ఎలివేట్ చేసుకుంది. పువ్వులు, సీతాకోకచిలుకలు, తూనీగల సిగ్నేచర్ మోటిఫ్‌లతో తయానైన గౌనులో అందరి దృష్టినీ తన వైపు తిప్పుకుంది. పూర్తిగా ప్రకృతి ప్రేరణగా తీర్చిదిద్దిన ఆభరణాలు, చేతితో నేసిన గౌను, నెమలి ఫీచర్డ్ బ్యాగ్‌తో వనదేవతలా కనిపించింది. View this post on Instagram A post shared by Anaita Shroff Adajania (@anaitashroffadajania)ఫ్యాషన్‌లో ప్రపంచంలోనే అతి పెద్ద ఈవెంట్ మెట్ గాలా వేదికపై రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీల కుమార్తె ఇషా అంబానీ తన ఫ్యాషన్ స్టయిల్‌ను చాటుకుంది. న్యూయార్క్ నగరంలోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ వేదికపై ఇండియాలోని గ్రామాలలో చేతితో ఎంబ్రాయిడరీ చేసిన గౌనుతో ప్రత్యేకంగా కనిపించింది.ఈ ఏడాది మెట్ గాలా థీమ్ "స్లీపింగ్ బ్యూటీస్: రీవేకనింగ్ ఫ్యాషన్." "ది గార్డెన్ ఆఫ్ టైమ్" అనే దుస్తుల కోడ్‌కు అనుగుణంగా, తన డ్రెస్‌లో పువ్వులు, సీతాకోక చిలుకలు, తూనీగలు ఉండేలా చూసుకున్నారు. అలాగే చేతికి ట్రెడిషనల్ లోటస్ బ్రేస్లెట్, ప్యారెట్ ఇయర్ రింగ్స్, ఫ్లవర్ చోకర్లతో పాటు, నకాషి మినియేచర్ పెయింటింగ్ వంటి భారతీయ కళ పద్ధతుల్లో స్వదేశ్ రూపొందించిన క్లచ్‌ను కూడా ఆమె ధరించింది. జాతీయ పక్షి మయూరం పెయింటింగ్ డిజైన్ క్లచ్ బ్యాగ్ చూడాల్సిందే. ఈ పెయింటింగ్‌ను జైపూర్‌కు చెందిన హరి నారాయణ్ మరోటియా రూపొందించారు. డిజైనర్, రాహుల్ మిశ్రా, ఇషా అంబానీ స్టైలిస్ట్ అనైతా ష్రాఫ్ అడజానియా ప్రకారం ఆమె ధరించిన 3డీ గౌను పూర్తి చేయడానికి 10,000 గంటలు పట్టిందట. ఫరీషా, జర్దోజీ, నక్షి , దబ్కా వంటి అప్లిక్, ఎంబ్రాయిడరీ డిజైన్స్ ఇందులో ఉన్నాయి. ఈ గౌనులో ఫ్రెంచ్ నాట్లు కూడా ఉన్నాయి.2017లో మెట్ గాలా అరంగేట్రం చేసింది ఇషా అంబానీ. 2019 లో,భారతీయ డిజైనర్ ప్రబల్ గురుంగ్ రూపొందించిన లిలక్ గౌను ధరించింది. ఇక 2023లో, మళ్లీ గురుంగ్ని డిజైన్ చేసిన బ్లాక్ పట్టు గౌను ధరించిన సంగతి తెలిసిందే. -
లగ్జరీ బంగ్లాను విక్రయించిన ఇషా అంబానీ? ఎవరు కొన్నారు?
రిలయన్స్ అధినేత ముఖేష్, నీతా అంబానీ ముద్దుల తనయ, వ్యాపారవేత్త ఇషా అంబానీ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. రిలయన్స్ రీటైల్ వ్యాపారాన్ని విజయ వంతంగా నడిపిస్తూ తండ్రికి తగ్గ తనయగా వ్యాపారంలో రాణిస్తోంది. తాజాగా ఇషా, భర్త ఆనంద్ పిరమల్ ఇంటికి సంబంధించి ఒక ముఖ్య సమాచారం వెలుగులోకి వచ్చింది. అమెరికాలోని ఇషా ఖరీదైన ఇంటిని ప్రముఖ హాలీవుడ్ జంట కొనుగోలు చేసిందట. ఈ వార్తలపై అధికారికంగా ఎలాంటి ధృవీకరణ లేనప్పటికీ, ఈ డీల్ మాత్రం హాట్ టాపిక్‌గా నిలిచింది. ఇషా-ఆనంద్ పిరమల్ లాస్ ఎంజేల్స్లోని విలాసవంతమైన భవనాన్ని విక్రయించినట్టు తెలుస్తోంది. దీన్ని అమెరికన్ టాప్ సింగర్ జెన్నిఫర్ లోపెజ్ బెన్ అఫ్లెక్ జంట కొనుగోలు చేసిందట. 38వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ ఇంటిని 'క్వీన్ ఆఫ్ డ్యాన్స్' జెలో,బెన్ దంపతులు సొంతం చేసుకున్నట్టు తాజా సమాచారం ద్వారా తెలుస్తోంది. ఇందులో 12 బెడ్రూమ్లు, 24 బాత్రూమ్లు ఉన్నాయి. ప్రత్యేక జిమ్‌లు, స్పాలు, సెలూన్లు, ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్ట్ లాంటి స్పెషల్ వసతులు కూడా లగ్జరీ హౌస్‌లో కొలువు దీరాయి. దాదాపు 61 మిలియన్ డాలర్ల (రూ. 508కోట్లు) ఇంటిని కొనుగోలు చేశారని కూడా ఇన్‌స్టా ఫ్యాన్ పేజీ నివేదించింది. కాగా ఇషాకు ఈ ఇంటితో ఉన్న అనుబంధం చాలా ప్రత్యేకమైందే అని చెప్పవచ్చు. ఇషా గర్భంతో ఉన్నపుడు తల్లి నీతాతో కలిసి ఆ ఇంట్లోనే గడిపింది. ఇద్దరు పిల్లలకు ఈ ఇంట్లోనే జన్మనిచ్చింది. అయితే ఈ ఇల్లు విక్రయించడానికి గల కారణాలు ఏంటి అనేదానిపై స్పష్టత లేదు. -
అచ్చం అనంత్ మామలాగే..క్యూట్ కృష్ణ ఫోటో వైరల్
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీల ముద్దుల తనయ ఇషా అంబానీ. రిలయన్స్ రిటైల్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నా ఇషా, 2018 డిసెంబరులో వ్యాపారవేత్త ఆనంద్ పిరమల్‌ను వివాహం చేసుకుంది. ఇషా, ఆనంద్ జంటకు కవలలు - కృష్ణ (కుమారుడు) ఆదియా (కుమార్తె) జన్మించారు. అటు తల్లిగా, ఇటు వ్యాపార నిర్వహణలోనూ అంబానీ వారసురాలిగా తన సత్తా చాటుకుంటోంది. ఇటీవల ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో తన ట్విన్స్‌తో సందడిగా కనిపించింది ఇషా. ఇషాతో ట్విన్స్ ఫోటోలో సోషల్ మీడియాలో తెగ షేర్ అయ్యాయి. ముఖ్యంగా ఇషా కుమారుడు కృష్ణ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచాడు. ఈ ఫోటోలు అచ్చం మేనమామ అనంత్ అంబానీలా ఉండటం నెటిజనులను బాగా ఆకట్టుకుంది. బ్లాక్ సూట్లో రాయల్ లుక్‌లో చిరునవ్వుల చిందిస్తున్న ఇషా కుమారుడు కృష్ణ, తమ్ముడు అనంత్ కార్బన్ కాపీలా ఉన్నాడంటూ వ్యాఖ్యానించారు. " అచ్చం అనంత్ అంబానీ లాగానే ఉన్నాడు అని ఒకరు, "అనంత్ మాము జైసా లగ్తా హై" అని మరొకరు వ్యాఖ్యానించారు. అంతేకాదుఆ చిన్నారి ధీరూభాయ్ అంబానీలా ఉన్నాడని మరికొందరు కామెంట్ చేయడం విశేషం. ప్రస్తుతం ఈ మామ, అల్లుళ్ల పోలికల ఫోటో ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. -
కుబేరుల బిడ్డలు : ఘనమైన బహుమతులు, వీటి విలువ తెలుసా?
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి తన 4 నెలల మనవడు గ్రాహ్కు రూ. 240 కోట్ల విలువైన 15 లక్షల ఇన్ఫోసిస్ షేర్లను బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఏయే సెలబ్రీటీలు తమ వారసులకు ఏయే ఖరీదైన గిఫ్ట్‌లు వార్తల్లో నిలిచాయి. నారాయణ మూర్తి కుమారుడు రోహన్ మూర్తి , అపర్ణ కృష్ణన్‌ల కుమారుడైన ఏకగ్రాహ్కు సుధా,మూర్తి దంపతులకు మూడో మనవడు . యూకే ప్రధాని రిషి సునక్ భార్య అక్షతామూర్తి వీరి పెద్ద కుమార్తె. అక్షత, రిషీలకు కృష్ణ , అనౌష్క అనే ఇద్దరు పిల్లలున్నారు. అంబానీ పెద్ద కోడలి గిఫ్ట్ ఆకాష్ అంబానీ భార్య శ్లోకా మెహతాకు అంబానీ పెద్ద కోడలు కూడా ఖరీదైన బహుమతి దక్కించుకుని అప్పట్లో వార్తల్లో నిలిచారు. రూ. 451 కోట్ల విలువైన మౌవాద్ ఎల్' నెక్లెస్‌ను నీతా అంబానీ కోడిలికి పెళ్లి బహుమతిగా ఇచ్చారు. కుమారుడికి పుట్టినరోజుకి పూనావాలా గిఫ్ట్ ఏంటంటే.. సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదార్ పూనావాలా, DC కామిక్ పుస్తకాన్ని పోలిన బ్యాట్మొబైల్ను తన కుమారుడికి బహుమతిగా ఇచ్చారు. 2015లో తన కుమారుడి 6వ పుట్టినరోజు సందర్భంగా, అదార్ పూనావల్ల తన Mercedes-Benz S-క్లాస్‌ని బ్యాట్‌మొబైల్ మోడల్లో తీర్చిదిద్దేలా చేశారు.ఈ మార్పులు పూర్తి చేయడానికి ఆరు నెలలకు పైగా పట్టిందట. శివ నాడార్ కూడా ప్రముఖ టెక్ సంస్థ హెసీఎల్ ఫౌండర్ పౌండర్, ఛైర్మన్ శివ్ నాడార్ 2014లో తన ఏకైక కుమార్తె రోష్ని కోసం ఒక లగ్జరీ ఇంటిని కొనుగోలు చేశారు. తూర్పు ఢిల్లీలోని ఫ్రెండ్స్ కాలనీలోని ఈ బంగ్లా విలువ రూ. 115 కోట్లు. ఇషా అంబానీ ట్విన్స్ కోసం ఇషా అంబానీ వ్యాపారవేత్తగా సత్తా చాటుతున్న ఇషా అంబానీ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ముఖేష్ అంబానీ , నీతా అంబానీ ఏకైక కుమార్తె, ఇషా అంబానీ 2018లో బిలియనీర్ ఆనంద్ పిరమల్‌ను వివాహం చేసుకుంది. ఈ పెళ్లి సందర్భంగానే అజయ్ పిరమల్ స్వాతి పిరమల్ దంపతులు ఇషా , ఆనంద్ పిరమల్లకు ముంబైలోని ‘గులిటా’ అనే ఒక విలాసవంతమైన ఇంటిని బహుమతిగా ఇచ్చారు. దీని విలువ రూ.450 కోట్లు అని సమాచారం. అలాగే ఇషా, ఆనంద్ దంపతులు ట్విన్స్ పుట్టిన సందర్భంగా అంబానీ ప్రత్యేకంగా తయారు చేసిన అల్మారాను బహుమతిగా ఇచ్చారు. 2022లో పుట్టిన కృష్ణ-ఆదియాలకు ఖరీదైన గిఫ్ట్ ఇవ్వడం విశేషం. బిల్‌గేట్స్ ముద్దుల బిడ్డ కోసం మైక్రోసాఫ్ట్ సహ-వ్యవస్థాపకుడు , బిలియనీర్ బిల్ గేట్స్ తన కుమార్తె జెన్నిఫర్ గేట్స్ నాసర్‌పై తనకున్న ప్రేమను ఘనంగా చాటుకున్నాడు. బిల్ గేట్స్ తన కూతురికి 277 కోట్ల రూపాయల విలువైన 124 ఎకరాలగుర్రపు ఫారమ్‌ను బహుమతిగా ఇచ్చాడు. అమెరికాలోని ఫ్లోరిడాలోని వెల్లింగ్టన్లో ఉన్న ఈ గుర్రపు ఫారమ్‌ను ఎవర్గేట్ స్టేబుల్స్ అంటారు.ఆమె గ్రాడ్యుయేషన్ పూర్తి అయిన తరువాత తన కుమార్తె రైడింగ్ కెరీర్‌ను మరింత ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో ఈ గిఫ్ట్ ఇచ్చారట. -
రాధిక మర్చంట్ డ్రెస్ ధర వింటే...
ఇషా అంబానీ నిర్వహించిన రోమన్ హోలీ ఈవెంట్లో కాబోయే మరదలు రాదికా మర్చంట్ శాటిన్ డ్రెస్‌లో ఆకర్షించింది. అందానికి తగ్గ స్టెయిలష్ బ్రాండ్లతో మరింత అందంగా కనిపించే రాధికా ఈ డ్రస్‌లో సినీ సెలబ్రెటీలను తలదన్నేలా కనిపించింది. కాక్టెయిల్ పార్టీలకు కరెక్ట్‌గా సరిపోయే డ్రస్‌లో అదిరిపోయింది. అందరి అటెన్షన్ ఆమె ధరించే డ్రస్పైనే పడింది. ఈ వేడుకలో ప్రముఖ సెలబ్రెటీలు, బాలీవుడ్ సినీ తారలు తమదైన స్టైయిలిష్ డిజైన్ వేర్లు, ఆభరణాలతో సందడి చేశారు. ఇందులో ఇషా అంబానీ గౌను డిజైనింగ్‌కే 100 గంటలు పట్టగా, బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా గౌరవ్ గుప్తా డిజైన్ చేసిన చీరతో స్టన్నింగ్ లుక్‌తో కనిపించింది. ఇక ఈ వేడుకలో రాధిక ధరించిన శాటిన్ డ్రెస్ ధర ఏకంగా రూ. 6.4 లక్షలు పలుకుతుందట. రాధిక ఆ డ్రెస్‌కి తగ్గట్టుగా అత్యంత లగ్జరియస్ ఆభరణాలను కూడా ధరించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత అంబానీలకు కాబోయే కోడలకు తగ్గ రేంజ్లో ఆమె డ్రస్ ధర ఉంది. అలాగే ఆమె నెక్కు ధరించిన నయీమ్ ఖాన్ గోల్డ్ ఆర్మీరీ జోడియాక్ క్లచ్ ధర ఏకంగా రూ. 1.67 లక్షలు. అంతేగాదు ఆమె ఇటీవల జరిగిన ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో కూడా బంగారంతో డిజైన్ చేసిన లెహంగాతో అందర్నీ మంత్రముగ్ధులన్ని చేసిన సంగతి తెలిసిందే. ఆమె అందానికి తగ్గ సింపుల్ డిజైనింగ్ వేర్లతో అందర్నీ కట్టిపడేసే ఆకర్షణీయమైన అందం రాధిక సొంతం. (చదవండి: ఇషా అంబానీ దుస్తుల డిజైనింగ్‌కి అంత టైం పడుతుందా!) -
ఇషా అంబానీ దుస్తుల డిజైనింగ్‌కి అంత టైం పడుతుందా!
ఇషా అంబానీ శుక్రవారం సాయంత్రం అంబానీ నివాసంలో బల్గారీ సీఈఓ జీన్ క్రిస్టోఫ్ బాబిన్తో కలిసి 'రోమన్ హోలీ' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకకు ముంబైకి చెందిన ప్రముఖ సెలబ్రెటీలంతా విచ్చేశారు. ఈ వేడుకల్లో ఇషా లుక్ అందర్నీ కట్టిపడేసింది. ఈ రోమన్ హోలీ వేడుకల కోసం అని ఆమె దుస్తులను రూపొందించడానికి చాలా సమయం తీసుకుందట. దీన్నీ ప్రముఖ డిజైనర్ ఆశ్విన్ త్యాగరాజన్ రూపొందించారు. ఇది చక్కటి ఎండ్రాయిడరీ వర్క్‌తో కూడిన లాంగ్ లెంగ్త్ బనారసీ గౌను అని త్యాగరాజన్ అన్నారు. దీన్ని రూపొందించడానికి తమకు ఏకంగా వంద గంటలు పైనే పట్టిందన్నారు. కెనడియన్ నటి మైత్రేయి రామకృష్ణ, టాలీవుడ్ నటి తాప్సీ పన్ను, ఐశ్వర్య రాజేష్ వంటి భారతీయ తారలు త్యాగరాజన్ రూపొందించే ఈ బనారస్ డ్రస్లంటే బహు ప్రీతి. ఇక త్యాగరాజన్ ప్రత్యేకత పర్యావరణ హితంగా దుస్తులను రూపొందించడం. పైగా అవి మన అమ్మలు, అమ్మమ్మల వారసత్వ చీరలు లేదా లెహంగాలతో కొత్తదనం సృష్టించడంలో మంచి నైపుణ్యం గల డిజైనర్ త్యాగరాజన్. చాలామంది సెలబ్రెటీలు మన పూర్వ సంప్రదాయల్ని అనుకరించేందుకు ఇష్టపడుతుండటంలో త్యాగరాజన్ డిజైన్వేర్లకు ఇంతల మంచి క్రేజ్ వచ్చింది. ఇక ఆమె దుస్తులకు సంబంధించిన నైలాన్ని పూర్తిగా సముద్రాలు, ఫిషింగ్ నెట్లు, వస్త్ర ఫైబర్ల వ్యర్థాలను నుంచి ప్లాస్టిక్‌ను రీసైక్లింగ్ చేసి శుద్ది చేసి వాటితో తయారైన నైలాన్‌తో తయారు చేస్తుంది. అంటే ఇక్కడ డిపాలిమరైజేషన్ , శుద్ధికరణతో వచ్చే కొత్త పాలిమర్లను థ్రైడ్లు మార్చడం ద్వారా ఈ కొత్త నైలాన్ని సృష్టిస్తారని చెప్పొచ్చు. అందువల్లే త్యాగరాజన్ డిజైన్వేర్లకు పర్యావరణ అనూకూలమైన ఫ్యాషన్ బ్రాండ్‌గా మంచి పేరొచ్చింది. నిజంగానే బ్రాండ్‌కి తగ్గట్టే త్యాగరాజన్ రూపొందించే డ్రస్‌లు సంప్రదాయంగా ఓ పండుగ వాతవరణం తలిపించే లుక్‌ని, కొత్త ఫ్యాషన్‌ని అందిస్తాయి. (చదవండి: వందేళ్ల క్రితం కరెంట్ లేకుండానే పనిచేసిన ఫ్రిడ్జ్!) -
ఇషా అంబానీ పార్టీలో స్టార్స్ హంగామా (ఫోటోలు)
-
వజ్రాలు వైఢూర్యాలతో డిజైన్ చేసిన జాకెట్..అంబానీ కూతురుగా ఆ మాత్రం ఉండాల్సిందే (ఫొటోలు)
-
వజ్రాలు, వైఢూర్యాలతో డిజైన్ చేసిన జాకెట్..ధర ఏకంగా..!
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకులు ధూమ్‌ధామ్‌గా జరిగాయి. ఆ వేడుకల్లో కళ్లు చెదిరే రేంజ్లో లగ్జరీయస్‌గా జరిగింది. ఆ వేడుకలు యావత్తు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. అతిథులు భోజనం దగ్గర నుంచి ధరించే బట్టల వరకు ప్రతీది ఓ సెన్సెషన్ అయ్యింది. ఆ వేడుకుల్లో నీతా అంబానీ తనయ ఇషా అంబానీ ధరించి వస్త్రాలు మరింత హాట్‌టాపిక్‌గా మారాయి. అంబానీ బిడ్డ కాబట్టి ఆ రేంజ్‌లోనే ఉంటాయి కానీ అంతకు మించి 'వేరేలెవెల్' అన్నట్లు ఉండటంతోనే నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ఆమె లెహంగాపై ధరించిన బ్లౌజ్‌కి సంబంధించిన వీడియోని చూసి అంబానీ బిడ్డ ఆ మాత్రం ఉంటుందిలే అని అంటున్నారు. మూడు రోజుల వేడుకల్లో చివరి రోజు చక్కటి లెహంగాతో అలరించారు ఇషా. అందులో ఆమె ధరించిన బ్లౌజ్ ప్రతి ఒక్కరిని స్టన్ అయిపోయేలా చేసింది. ఆ బ్లౌజ్‌ని మనం చెవులకు ధరించే జూకాలతో డిజైన్ చేశారు. కేవలం బంగారుపు జూకాలు కాదండోయ్. బంగారంతో పొదగబడిన వజ్రాలు, కెంపులు, వైఢ్యూర్యాలతో డిజైన్ చేశారు. ఈ బ్లౌజ్‌ని డిజైన్ చేసింది ప్రముఖ డిజైనర్ అబూ జానీ సందీప్ ఖోస్లా. ఆ బ్లౌజ్లో ఉన్న ప్రతి ఆభరణం చాలా కళాత్మకంగా ఉంటుంది. View this post on Instagram A post shared by FlixZon (@flixzonofficial) డిజైనర్ సందీప్ 2012లో 'ఇండియ ఫెంటాస్టిక్"లో ప్రదర్శించిన ఐకానిక్ బ్లౌజ్‌లను తలదన్నేలా ఐషా ధరించిన బ్లౌజ్‌ని తీర్చిదిద్దడం విశేషం. ఆ బ్లౌజ్‌పై ఇంత బరువైన నగలను చాల పొదినిగ్గా అమర్చడమే కాకుండా చూసేందుకు బండగా కనిపించకుండా ఎలా బ్లౌజ్పీస్పై అమర్చారా? అనిపించేలా తేలికైన ధారాలతో ఎంబ్రాయిడరీ చేశారు. ఆ జాకెట్ డిజైన్ నైపుణ్యానికి ఫిదా అవ్వాల్సిందే. అయితే అంతలా ఖరీదైన వజ్రాలు, కెంపులు, రత్నాలతో రూపొందిన బ్లౌజ్ ధర ఏకంగా కోట్లలో ఉంటుందని తెలుస్తోంది. ఆ జాకెట్‌నే తమ్ముడి పెళ్లిలో ధరించి సందడి చేశారు ఇషా. ఆ అత్యంత లగ్జరీయస్ జాకెట్ డిజైన్ చేసిన విధానానికి సంబంధించిన వీడియోని నెట్టింట్ పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోకి వేలల్లో వ్యూస్ లైక్‌లు వచ్చాయి. View this post on Instagram A post shared by FlixZon (@flixzonofficial) (చదవండి: షాపు షట్టర్లో కోటు చిక్కుకుపోడంతో పాపం ఆ మహిళ..!) -
ఇషా అంబానీ ప్రయత్నం ఫలిస్తుందా..?
రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యాపార సామ్రాజ్యంలో ముఖేశ్అంబానీ మూడోతరానికి పాలనా పగ్గాలు ఎప్పుడో అప్పజెప్పారు. తన వ్యాపార బాధ్యతలను చూసుకునే భవిష్యత్ లీడర్లు వీరేనంటూ వారసులు ఆకాశ్, ఈశా, అనంత్ అంబానీల పేర్లను గతంలోనే ప్రకటించారు. రిలయన్స్ రిటైల్ వ్యాపార బాధ్యతలు ఇషా అంబానీ చేతికి వచ్చిన తర్వాత కంపెనీ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. అంబానీ కుమార్తె అనేక విదేశాలకు చెందిన ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్లను దేశంలోని వినియోగదారులకు పరిచయం చేస్తూ ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకుంటున్నారు. రిలయన్స్ రిటైల్ ఇండస్ట్రీస్ బ్రిటీష్ ఫ్యాషన్ లేబుల్ ప్రిమార్క్ను భారత మార్కెట్లో విడుదల చేయడానికి చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ ఒప్పందం జరిగితే టాటాకు చెందిన జూడియో, ల్యాండ్ మార్క్ గ్రూప్‌నకు చెందిన మ్యాక్స్, షాపర్స్ స్టాప్.. వంటి ప్రత్యర్థులకు రిలయన్స్ ఫ్యాషన్ పోటీ ఇవ్వనుందని పరిశ్రమ వర్గాలు తెలియజేస్తున్నాయి. వాస్తవానికి బ్రిటీష్ ప్రిమార్క్ బ్రాండ్ ఖరీదైన దుస్తులు, పాదరక్షలకు ప్రసిద్ధి చెందింది. రిలయన్స్-ప్రిమార్క్ మధ్య జాయింట్ వెంచర్ లేదా లైసెన్సింగ్ ఒప్పందం జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ ఒప్పందం వార్తలు రాకముందు ప్రిమార్క్ ఇండియాలో వ్యాపారాన్ని విస్తరించే దిశగా అడుగులువేసినట్లు తెలిసింది. ప్రత్యేక రిటైల్ స్టోర్లను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. బ్రిటిష్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుని కంపెనీని మరింత లాభాల్లోకి తీసుకువెళ్లనున్నట్లు రిలయన్స్ రిటైల్ అధికారులు తెలిపారు. ఇదీ చదవండి: అత్తకు తగ్గ కోడలు.. నాట్యంలో దిట్ట.. ప్రిమార్క్ కంపెనీ లండన్ లిస్టెడ్ అసోసియేటెడ్ బ్రిటిష్ ఫుడ్స్ యాజమాన్యం పరిధిలో ఉంది. ఈ బ్రాండ్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 400 స్టోర్లను కలిగి ఉంది. 2026 చివరి నాటికి 530 అవుట్లెట్లను ప్రారంభించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. కంపెనీ మెజారిటీ దుస్తులను చైనా నుంచి కొనుగోలు చేసి విక్రయిస్తోంది. కంపెనీ తన ఉత్పత్తులను తక్కువ ధరలకు విక్రయిస్తోంది. మహిళా కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని ప్రిమార్క్ ఉత్పత్తులు తయారుచేస్తున్నారు. -
అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ మెరిసిపోతున్న ఇషా అంబానీ (ఫొటోలు)
-
అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు: స్టైయిలిష్ లుక్‌లో ఇషా!
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ నీతా అంబానీ దంపతుల చిన్న కుమారుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సినీ సెలబ్రెటీలు దగ్గర నుంచి పలు రంగాల అధినేతలు దేశ విదేశాల నుంచి తరలి వచ్చి మీరీ ఈ వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో అనంత్ అంబానీ సోదరి ఇషా తన ప్రత్యేక వస్త్రాలంకరణలో అందర్నీ మిస్మరైజ్ చేసింది. ఈ వివాహ వేడుకల్లో ఇషా ఫ్యాషన్ ఐకాన్‌గా పేరుగాంచిని తన తల్లి నీతా అంబానీని ఫాలో అయ్యిందా అన్నంత రేంజ్లో ఉంది ఆమె లుక్. ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ కార్ల్ లాగర్ ఫెల్డ్ చెందిన బ్లాక్ డ్రెస్‌లో అజంతా శిల్పంలా ఉంది. చేతులకు, డైమండ్ బ్రాస్లెంట్, డైమండ్ ఉంగరాలతో మరింత గ్రాండ్‌గా కనిపించింది. చెవులకు కూడా ఆ డ్రస్‌కి తగ్గ డైమండ్ జూకాలు ధరించింది. ఐషా ధరించిన గౌను ఆ బ్రాండ్ వ్యవస్థాపకుడు లాంగర్ ఫెల్డ్ చనిపోవడానికి కొద్దిరోజుల ముందు డిజైన్ చేసింది. ఆయన గత కొన్ని దశాబ్దాలుగా ఫ్యాషన్ ప్రపంచాన్ని ఏలుతున్న ప్రముఖ డిజైనర్ . తన క్రియేటివిటీతో ఎన్నో ప్రముఖ డిజైనర్ దుస్తులను పరిచయం చేసి ఫ్యాషన్‌కి అసలైన అర్థం ఇచ్చిన వ్యక్తి అతను. అతని బ్రాండెడ్ దుస్తులకు పలు సినీ సెలబ్రెటీలు, వ్యాపార ప్రముఖులే అభిమానులు. ఈ బ్రాండ్ ధర కూడా ఓ రేంజ్లో ఉంటుంది. ఇక ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో ఇషా ధరించిన లాగర్ఫెల్డ్ గౌనుపై వెండి ఆకుల రూపంలో బ్లాక్ షీర్ సిల్హౌట్ అందంగా డిజైన్ చేశారు. ఆ డ్రెస్‌కి తగ్గట్టు లైట్ మేకప్, పెదాలకు నేచురల్ లిప్‌స్టిక్‌తో ప్రత్యేక ఆకర్షణ నిలిచింది ఇషా. చెప్పాలంటే పండు వెన్నెలలో ఉండే జాబిల్లిలా ఆమె స్టన్నింగ్ లుక్ కళ్లు తిప్పుకోనివ్వలేనంతగా కట్టిపడేస్తోంది. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ చక్కెర్లు కొడుతున్నాయి.మరీ మీరు కూడా ఓ లుక్కేయండి. (చదవండి: అనంత్ అంబానీ అధిక బరువుకి కారణం ఇదే! ఆ విషంయలో కాబోయే భార్య..) -
మాది ఫెవిక్విక్ బంధం..వారికి ‘నేను హనుమంతుడి లెక్క’
భారత సంపన్నుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ ప్రీ-వెడ్డింగ్ ఈవెంట్ ప్రారంభం కానుంది. ఈ వేడుకలు మార్చి 1 నుంచి మార్చి 3 వరకు కొనసాగనున్నాయి. ఈ వేడుకల్లో ప్రపంచ వ్యాప్తంగా పలు రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొననున్నారు. ఈ శుభ సందర్భంలో ముందస్తు పెళ్లి వేడుకకు ముందు అనంత్ అంబానీ తన తోబుట్టువులు ఆకాష్, ఇషాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ ముగ్గురి మధ్య పోటీ లేదని, తన తోబుట్టువులు తనకు సలహాదారులలాంటి వారని మీడియా ఇంటర్వ్యూలో చెప్పారు. ‘మా మధ్య ఎలాంటి పోటీ లేదు. వారు నా సలహాదారుల లాంటి వారు. నేను వారి సలహాలను నా జీవితాంతం పాటించాలనుకుంటున్నాను. వారికి నేను హనుమంతుడి లెక్క. నా అన్న నా రాముడు. నా చెల్లెలు ఈశా నాకు తల్లితో సమానం. వాళ్ళిద్దరూ నన్ను ఎప్పుడూ కాపాడుతూనే ఉన్నారు. మా మధ్య ఎలాంటి విభేదాలు. పోటీలు లేవు. మేము కలిసిపోయాం. మాది ఫెవిక్విక్ బంధం’ అంటూ నవ్వేశారు. తన తండ్రి ముఖేష్ అంబానీతో తనకున్న అనుబంధం గురించి అనంత్ మాట్లాడుతూ.. తన తండ్రి మార్గదర్శకత్వం లేనిది ఏదీ సాధించలేనని అన్నారు. మాకు ఆయనంటే ఎంతో గౌరవం. నా తండ్రి ఇచ్చిన ప్రోత్సాహం వల్లే ఇవన్నీ నిర్మించగలుగుతున్నాను’ అని అన్నారు. -
ఆ క్రెడిట్ అంతా ఆమెదే! జియో ఆలోచనకు బీజం పడిందిలా..
దేశంలో అతిపెద్ద టెలికాం సంస్థ ఏది అంటే రిలయన్స్ జియో అని టక్కున చెప్పేస్తాం. ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో 2023 డిసెంబర్లో 3.99 మిలియన్ల మంది యాజర్లను సంపాదించి అతిపెద్ద విజేతగా నిలిచింది. దీంతో జియో సబ్‌స్క్రైబర్ బేస్ 459.81 మిలియన్లకు పెరిగింది. అయితే ఈ జియో ఏర్పాటుకు బీజం ఎలా పడిందో ఈ కథనంలో తెలుసుకుందాం.. దేశంలో అత్యంత సంపన్నుడు, దేశ మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ డేటా వినియోగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన టెలికాం దిగ్గజం జియో వెనుక ఉన్న ముఖేష్ అంబానీ.. 2018లో లండన్‌లో జరిగిన ఫైనాన్షియల్ టైమ్స్ ఆర్సెలర్ మిట్టల్ బోల్డ్నెస్ ఇన్ బిజినెస్ అవార్డ్స్‌లో తన అంగీకార ప్రసంగంలో ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. ఆ క్రెడిట్ ఇషాదే.. 2011లో జియోను ప్రారంభించడం వెనుక తన కుమార్తె ఇషా అంబానీ ఉన్నారని, ఆ క్రెడిట్ అంతా ఆమెదే అని ముఖేష్ అంబానీ పేర్కొన్నారు. అప్పుడు యేల్లో చదువుతున్న ఇషా అంబానీ సెలవులకు ఇంటికి వచ్చింది. వారి నివాసంలో ఇంటర్నెట్ కనెక్టివిటీ సరిగా లేకపోవడం ఆమెను అసహనానికి గురి చేసింది. అదే కోట్లాది మంది భారతీయులకు సరసమైన, హై-స్పీడ్ ఇంటర్నెట్ సదుపాయాన్ని అందించాలనే సంచలనాత్మక ఆలోచనకు దారితీసింది. ముఖేష్ అంబానీ తన ప్రసంగంలో ఇలా పంచుకున్నారు. "2011లో నా కుమార్తె ఇషా ద్వారా జియో ఆలోచనకు బీజం పడింది. ఆమె యేల్లో చదువుకుంటున్నప్పుడు సెలవులకు ఇంటికి వచ్చింది. కోర్స్‌వర్క్ చేసుకుంటుండగా ఇంట్లో ఇంటర్నెట్ సక్రమంగా రాలేదు. దీంతో 'నాన్న , మన ఇంట్లో ఇంటర్నెట్ పోయింది' అని చెప్పింది" అని అంబానీ చెప్పుకొచ్చారు. తన పిల్లలు ఇషా, ఆకాష్‌లు.. సృజనాత్మకంగా ఆలోచిస్తూ ప్రపంచ స్థాయిలో రాణించడానికి పోటీ పడుతున తరానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారని చెప్పుకొచ్చిన ముఖేష్ అంబానీ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ అనేది దేశానికి అత్యంత ఆవశ్యకరమైన అంశమని తనను వారే ఒప్పించారని వివరించారు. -
కూతురికి అరుదైన గౌరవం - ఆనందంలో ముకేశ్ అంబానీ..
రిలయన్స్ గ్రూప్ రిటైల్ వెంచర్ 'రిలయన్స్ రిటైల్'కు నాయకత్వం వహిస్తున్న 'ఇషా అంబానీ' (Isha Ambani), జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ బోర్డులో కూడా నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు. వ్యాపార రంగంలో దూసుకెళ్తున్న ఆమెను ఇటీవల 'మహారాష్ట్రియన్ ఆఫ్ ది ఇయర్ 2024' అవార్డు వరించింది. రిలయన్స్ రిటైల్ వ్యాపారం అభివృద్ధి చెందడంతో 'ఇషా అంబానీ' పాత్ర అనన్యసామాన్యం. ఈమెకు ఫిబ్రవరి 15న ఓ వార్తాపత్రిక వార్షిక కార్యక్రమంలో 2024 సంవత్సరపు మహారాష్ట్ర ప్రత్యేక అవార్డును గెలుచుకుంది. అవార్డు గెలుచుకున్న సందర్భంలో ఇషా అంబానీ మాట్లాడుతూ.. మహారాష్ట్ర కేవలం మాకు ఉంటున్న ప్రదేశం (ఇల్లు) మాత్రమే కాదు, ఇది మాకు కర్మభూమి. మా తాత 'కలలు కనడానికి ధైర్యం చేయండి, వాటిని సాధించడం నేర్చుకోండి' అని చెప్పేవారు, ఆ మాటలనే అనుసరిస్తూ నా తల్లిదండ్రులు నన్ను పెంచారు. మా నాన్న కష్టపడి ఎలా పనిచేయాలో చూపించి, ఎంతోమందికి ఆదర్శమయ్యారు. అవార్డు అందుకున్న సందర్భంగా ఆమె రిలయన్స్ కుటుంబానికి కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ అవార్డు మొత్తం రిలయన్స్ కుటుంబానికి చెందినదిని వెల్లడించింది. యేల్ యూనివర్శిటీ నుంచి గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన ఇషా ఇప్పుడు రిలయన్స్ రిటైల్‌ను ప్రపంచ వ్యాప్తంగా విస్తరించడంతో ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఈమె ఇప్పటికే ఫోర్బ్స్ ఇండియా లీడర్షిప్ అవార్డ్స్ 2023లో GenNext ఎంటర్ప్రెన్యూర్ అవార్డును కూడా అందుకుంది. ఇదీ చదవండి: హ్యాండ్సమ్గా కనిపిస్తున్న ఈ కుర్రాడే.. నేడు భారత్ గర్వించదగ్గ వ్యక్తి -
ఇషా అంబానీకి చెందిన ఆ కంపెనీ విలువ రూ.8 లక్షల కోట్లు!
ఆసియాలోనే సంపన్నుడైన ముఖేష్ అంబానీ రిలయన్స్ గ్రూప్‌ను విస్తరిస్తూ మార్కెట్‌ను ఏలుతున్నారు. నెమ్మదిగా ఆయన వ్యాపార బాధ్యతలు తన పిల్లలకు అప్పగిస్తున్నారు. అందులో ఇషాఅంబానీ తండ్రికి తగ్గ తనయగా గుర్తింపు పొందుతోంది. ఇషా రిలయన్స్ రిటైల్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి కంపెనీని దశల వారీగా విస్తరిస్తూ ప్రస్తుతం రూ.8 లక్షల కోట్ల కంపెనీగా మలిచింది. కంపెనీ అనేక ప్రఖ్యాత విదేశీ బ్రాండ్లను దేశీయ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తోంది. దాదాపు 7వేల టౌన్‌ల్లో సుమారు 18వేల స్టోర్లతో దూసుకెళ్తున్న రిలయన్స్ రిటైల్ అభివృద్ధి వెనుక ఇషా అంబానీతోపాటు కంపెనీలో ఉన్నత స్థానంలోని వ్యక్తుల కృషి ఎంతో ఉందని ఆమె తెలిపారు. ఇప్పటికే బర్బెరీ, స్టీవ్ మాడెన్, అర్మానీ, బాలెన్సియాగా వంటి ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్లతో రిలయన్స్ జతకట్టడానికి ఇషా అంబానీ ఎంతో కృషి చేసింది. రోజూ కొత్త పుంతలు తొక్కుతున్న ఈ కంపెనీకి సారథిగా ఉండడం కొంత కష్టమైన పని. అయితే కంపెనీలో కీలక నిర్ణయాలు తీసుకునే కొందరు విశ్వసనీయ సహాయకులను ఆమె నియమించుకున్నారు. రిలయన్స్ రిటైల్ కన్జూమర్ ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్ అండ్ లైఫ్‌స్టైల్, గ్రాసరీ, ఫార్మా రిటైల్ ఉత్పత్తులను విక్రయిస్తోంది. కంపెనీ తన మొదటి స్టోర్‌ను హైదరాబాద్‌లోనే ప్రారంభించింది. 2020లో అమెరికా పెట్టుబడి సంస్థ సిల్వర్‌లేక్ 1.75 శాతం వాటాను రూ.7500 కోట్లకు కొనుగోలు చేసింది. కంపెనీలో కేకేఆర్ సంస్థ 1.28 శాతం వాటా(రూ.5500 కోట్లు) కలిగి ఉంది. 2021లో ఫ్యూచర్గ్రూప్నకు చెందిన రిటైల్, హోల్‌సేల్, లాజిస్టిక్స్, వేర్‌హౌజింగ్ బిజినెస్‌ను రూ.24,713 కోట్లకు కొనుగోలు చేసింది. రిలయన్స్ రిటైల్ గత సంవత్సరం ఏకంగా 3,300 స్టోర్లను ప్రారంభించింది. 78 కోట్ల మంది ఈ స్టోర్లను కస్టమర్లు సందర్శిస్తుండగా.. 100 కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయి. దీంతో కంపెనీ ప్రపంచంలో అత్యధికంగా ప్రజలు సందర్శిస్తున్న టాప్-10 రిటైల్ కంపెనీల్లో ఒకటిగా నిలిచింది. ఇదీ చదవండి: 10 నెలల్లో 110 మంది సీఈవోల రాజీనామా.. కారణం ఇదే..! రిలయన్స్ రిటైల్ గత రెండేళ్ల కాలంలో ఏకంగా రూ.82,646 కోట్లను పెట్టుబడిగా పెట్టింది. ప్రస్తుతం దేశంలో 7000 టౌన్‌ల్లో మెుత్తం 18000 రిటైల్ స్టోర్లను కలిగి ఉంది. కంపెనీలో 2.45 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నట్లు సమాచారం. ఇషా కంపెనీ పగ్గాలు చేపట్టిన తర్వాత రిలయన్స్ రిటైల్ విలువ భారీగా పెరిగింది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాపిటల్ రూ.8.4 లక్షల కోట్లకు చేరుకుంది. -
ఇషా అంబానీ రైట్ హ్యాండ్ ఇతడే.. జీతం లక్షల్లో కాదు కోట్లల్లోనే..
Reliance First Employee: భారతదేశంలో అత్యంత సంపన్నుడు, రిలయన్స్ కంపెనీ అధినేత ముఖేష్ అంబానీ, ఆయన కుటుంబం గురించి మాత్రమే అందరికి తెలుసు. కానీ ఆ సంస్థ ఈ రోజు ఈ స్థాయిలో ఉండటానికి దోహదపడిన చాలా మంది సన్నిహితుల గురించి బహుశా తెలియకపోవచ్చు. ఈ కథనంలో రిలయన్స్ బ్రాండ్ లిమిటెడ్ మొదటి ఉద్యోగి ఎవరు? ప్రస్తుతం ఆయన జీతం ఎంత? అనే మరిన్ని ఆసక్తికర విషయాలు చూసేద్దాం.. 'దర్శన్ మెహతా' (Darshan Mehta).. ఈ పేరు చాలామందికి తెలియకపోవచ్చు, కానీ రిలయన్స్ బ్రాండ్ లిమిటెడ్ (RBL) మొదటి ఉద్యోగి ఇతడే అంటే చాలా మంది ఆశ్చర్యపోవచ్చు, ఆ సంస్థ ఉన్నతికి పాటుపడిన కొంతమంది వ్యక్తులలో ఈయన ఒకరు కావడం గమనార్హం. మెహతా ప్రస్తుతం RBL ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2007లో ముఖేష్ అంబానీ స్థాపించిన రిలయన్స్ బ్రాండ్ లిమిటెడ్ మొదటి ఉద్యోగి అయిన దర్శన్ మెహతా 'చార్టర్డ్ అకౌంటెంట్'. చదువు పూర్తయిన తరువాత త్రికాయా గ్రే అడ్వర్టైజింగ్ (Trikaya Grey Advertising)లో సీనియర్ ఎగ్జిక్యూటివ్‌గా అడ్వర్టైజింగ్లో కెరీర్ ప్రారంభించాడు. భారతదేశానికి టామీ హిల్ఫిగర్, గాంట్ మరియు నౌటికా వంటి స్పోర్ట్స్‌వేర్ బ్రాండ్లను తీసుకురావడంలో ఈయన కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. దర్శన్ మెహతా జీతం ప్రతిరోజూ కొత్త శిఖరాలను తాకుతున్న కంపెనీని నిర్వహించడం అంత సులభం కాదు. కంపెనీ కోసం కీలక నిర్ణయాలు తీసుకునే దర్శన్ మెహతా.. ఇషా అంబానీకి సన్నిహిత సహాయకుడు, రైట్ హ్యాండ్ కూడా. 2020-2021లో ఈయన వార్షిక వేతనం రూ. 4.89 కోట్లు అని తెలుస్తోంది. ఇదీ చదవండి: చిన్న గదిలో మొదలైన వ్యాపారం.. నేడు రూ.4000 కోట్ల సామ్రాజ్యంగా..!! రిలయన్స్ బ్రాండ్ లిమిటెడ్ 2007లో ప్రారంభమైన రిలయన్స్ బ్రాండ్ లిమిటెడ్ అంబానీ కుమార్తె 'ఇషా అంబానీ' నేతృత్వంలో ఉంది. 125 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్ కలిగిన ఈ సంస్థ జిమ్మీ చూ, ఎర్మెనెగిల్డో జెగ్నా, బొట్టెగా వెనెటా, జార్జియో అర్మానీ, బర్బెర్రీ, సాల్వటోర్ ఫెర్రాగామో వంటి సుమారు 50 కంటే ఎక్కువ ప్రముఖ బ్రాండ్లతో కలిసి పనిచేసింది. ఈ కంపెనీ ఇప్పటికి వేలసంఖ్యలో రిటైల్ అండ్ ఆన్లైన్ స్టోర్లను కలిగి ఉంది. 2022 డిసెంబర్ 31తో ముగిసిన త్రైమాసికంలో RBL ఏకంగా రూ. 67,634 కోట్ల అమ్మకాలను పొందినట్లు సమాచారం. -
గ్రాండ్‌గా ఇషా అంబానీ ట్విన్స్ పుట్టినరోజు వేడుకలు.. హాజరైన ప్రముఖులు (ఫోటోలు)
-
ఇషా అంబానీకి ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్.. జియో ఫైనాన్షియల్ డైరెక్టర్లుగా మరో ఇద్దరు
జియో ఫైనాన్షియల్ డైరెక్టర్లుగా ముఖేష్ అంబానీ కుమార్తె 'ఇషా అంబానీ'తో పాటు అన్షుమాన్ ఠాకూర్, హితేష్ కుమార్ సేథియాలను నియమించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఆర్బీఐ ఈ నియామకాలకు నవంబర్ 15న ఆమోదం తెలిపింది. ఈ ఆమోదం నియామక తేదీ నుంచి ఆరు నెలలు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఈ గడువులోపల ప్రతిపాదనలను అమలు చేయడంలో కంపెనీ విఫలమైతే.. ముందుగా ప్రతిపాదించిన మార్పులను అమలు చేయకపోవడానికి గల కారణాన్ని పేర్కొంటూ మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని ఆర్బీఐ వెల్లడించింది. 'ఇషా అంబానీ' యేల్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి ఎమ్బీఏ గ్రాడ్యుయేట్ పూర్తి చేసింది. ఆ తరువాత రిలయన్స్ ఎగ్జిక్యూటివ్ లీడర్షిప్ టీమ్‌లో చేరింది. ఆ తరువాత రిలయన్స్ రిటైల్ విభాగాన్ని చేపట్టి కంపెనీకి లాభాలు రావడానికి కృషి చేసింది. ఇటీవల ఈమె నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఎంపికైంది. అన్షుమాన్ ఠాకూర్ ఎకనామిక్స్‌లో గ్రాడ్యుయేట్, ఐఐఎం అహ్మదాబాద్‌లో MBA పూర్తి చేసింది. చదువు పూర్తయిన తరువాత కార్పొరేట్ స్ట్రాటజీ, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ వంటి విభిన్న పరిశ్రమలలో పనిచేశారు. ప్రస్తుతం ఇతడు జియో ప్లాట్‌ఫారమ్ లిమిటెడ్‌లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఇదీ చదవండి: దీపావళికి నెట్లో ఎక్కువగా ఏం సర్చ్ చేసారంటే..? రివీల్ చేసిన సుందర్ పిచాయ్ హితేష్ కుమార్ సేథియా.. హార్వర్డ్ బిజినెస్ స్కూల్ పృథివీ విద్యార్ధి, ఒక చార్టర్డ్ అకౌంటెంట్ కూడా. యితడు ఐరోపా, ఆసియా, ఉత్తర అమెరికా వంటి దేశాల్లో సుమారు 20 సంవత్సరాలు ఫైనాన్సియల్ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు. ఆ తరువాత ఐసీఐసీఐ బ్యాంక్ కెనడా, ఐసీఐసీఐ బ్యాంక్ జర్మనీ, యూకే, హాంకాంగ్‌లలో కూడా బ్యాంకింగ్ కార్యకలాపాలను నిర్వర్తించారు. -
హైదరాబాద్‌లో స్వదేశ్ స్టోర్ ప్రారంభోత్సవానికి హాజరైన నమ్రతా(ఫోటోలు)
-
భారత్‌లో లగ్జరీ బ్రాండ్ బాలెన్సియాగా స్టోర్ ప్రారంభం
రిలయన్స్ రిటైల్ మేనేజింగ్ డైరెక్టర్ ఇషా అంబానీ భారత్‌లో ఫ్రెంచ్ కార్పొరేషన్ కెరింగ్ యాజమాన్యంలోని లగ్జరీ బ్రాండ్ బాలెన్సియాగా తొలి స్టోర్‌ను ప్రారంభించారు. రిలయన్స్ బ్రాండ్స్ లిమిటెడ్ (ఆర్బీఎల్).. ఫ్రెంచ్ కార్పొరేషన్ కెరింగ్ సంస్థతో చేతులు కలిపింది. ఈ రెండు సంస్థల మధ్య ఒప్పందం తర్వాత జియో వరల్డ్ ప్లాజాలో స్టోర్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఇటీవల, రిలయన్స్ ఇండస్ట్రీస్ ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో జియో వరల్డ్ ప్లాజాను ప్రారంభించింది. ఈ మాల్ లో డియోర్, గూచీ, లూయిస్ విట్టన్, రోలెక్స్ తో పాటు దాదాపూ 20కి పైగా హై-ఎండ్ బ్రాండ్ల విక్రయాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ జియో వరల్డ్ ప్లాజాలోనే బాలెన్సియాగా బ్రాండ్స్ అమ్మకాలు సైతం ప్రారంభించినట్లు రిలయన్స్ రీటైల్ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రీమియం బ్రాండ్స్ ఆర్బీఎల్ ప్రీమియం ఫ్యాషన్, లైఫ్ స్టైల్ విభాగాలలో గ్లోబల్ బ్రాండ్లను లాంచ్ చేసేందుకు సుమఖత వ్యక్తం చేస్తుంది. ఇప్పటికే అర్మానీ ఎక్స్ఛేంజ్, బర్బెర్రీ, క్లార్క్స్, కోచ్, డీజిల్, డూన్, ఈఎస్7, ఎంపోరియో అర్మానీ, గ్యాస్, జార్జియో అర్మానీ, హామ్లీస్, హ్యూగో బాస్, హంకెమోలర్, జిమ్మీ చూ, కేట్ స్పేడ్ న్యూయార్క్, మనీష్ మల్హోత్రాలతో ఒప్పందం కుదుర్చుకుని వ్యాపార కార్యకలాపాల్ని ముమ్మరం చేసింది. -
రిలయన్స్ బోర్డులోకి అంబానీ వారసులు - ఆమోదం తెలిపిన షేర్ హోల్డర్స్
ఆయిల్ నుంచి టెలికామ్ వరకు అన్ని రంగాల్లో దూసుకెళ్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ భారతదేశంలో అతిపెద్ద కంపెనీగా అవతరించింది. ఈ సంస్థలో ముఖేష్ అంబానీ, నీతా అంబానీతో పాటు వారి పిల్లలు కూడా ఒక్కో విభాగంలో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తాజాగా ఆకాశ్, ఇషా, అనంత్ అంబానీ ముగ్గురూ కంపెనీ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా నియమితులయ్యారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ ఏడాది ప్రారంభంలో వార్షిక సర్వసభ్య సమావేశంలో ప్రకటించిన వారసత్వ ప్రణాళికను ఈ రోజు అధికారికం చేసింది. కంపెనీ బోర్డులో ఇషా, ఆకాష్, అనంత్ అంబానీలను నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా నియమించడానికి వాటాదారులు ఆమోదించారు. కంపెనీ బోర్డులో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా కొనసాగటానికి షేర్ హోల్డర్ల నుంచి అంబానీ పిల్లలు ముగ్గురూ (ఇషా, ఆకాష్, అనంత్ అంబానీ) వరుసగా 98.21 శాతం, 98.06 శాతం, 92.75 శాతం ఆమోదం పొందారు. ఇదీ చదవండి: ఇంతకంటే ఖరీదైన ప్యాలెస్ మరొకటి లేదు! ముఖేష్ అంబానీ యాంటిలియా దీని తరువాతే.. ముఖేష్ అంబానీ మరో ఐదేళ్లు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతలను ముఖేష్ అంబానీ మరో ఐదేళ్లపాటు నిర్వహించనున్నారు. నీతా అంబానీ పదవీ విరమణ తరువాత కూడా రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్‌గా కొనసాగుతారు. దీనికి రిలయన్స్ వార్షిక సర్వసభ్య సమావేశంలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల నుంచి ఆమోదం లబించింది. -
రిలయన్స్ ఇషా అంబానీ మరో భారీ డీల్: కేకేఆర్ పెట్టుబడులు
KKR invests Reliance Retail రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ పూర్తి-యాజమాన్య అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ భారీ పెట్టుబడులను సాధించింది. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ అమెరికాకు,చెందిన KKR, రిలయన్స్‌రీటైల్ వాటాను1.42 శాతానికి పెంచుకోనుంది. ఇందుకుగాను రిలయన్స్ రీటైల్లో రూ. 2,070 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. దీంతో రిలయన్స్ రీటైల్ ప్రీ-మనీ ఈక్విటీ విలువ రూ. 8.36 లక్షల కోట్లకు చేరిందని కంపెనీ సోమవారం ప్రకటించింది. దీంతో ఈక్విటీ విలువ పరంగా దేశంలోని మొదటి నాలుగు కంపెనీలలో ఒకటిగా నిలిచింది. గత నెలలో ముఖేష్ అంబానీ రిటైల్ సామ్రాజ్యంలో ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ ఒక బిలియన్ డాలర్ల పెట్టుబడితరువాత ఈ ఒప్పందం జరిగడం విశేషం. న్యూయార్క్ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న ప్రైవేట్ ఈక్విటీ సంస్థ KKR రిలయన్స్ రిటైల్‌లో 2020లో ఆర్ఆర్విఎల్లో 1.28 శాతం వాటాల కొనుగోలు ద్వారా రూ. 5,550 కోట్ల పెట్టుబడి పెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుత కొనుగోలుతో మొత్తం ఈక్విటీ వాటా పూర్తిగా పలచన ప్రాతిపదికన 1.42శాతానికి పెరిగింది. 2020లో వివిధ గ్లోబల్ ఇన్వెస్టర్ల నుండి మొత్తం రూ. 47,265 కోట్ల నిధుల సమీకరించింది. దీంతో పాటు KKR రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ టెలికాం యూనిట్ అయిన జియో ప్లాట్‌ఫారమ్‌ల లిమిటెడ్‌లో కూడా పెట్టుబడిదారుగా ఉంది. (జీ20 సమ్మిట్: దాదాపు రూ. 400కోట్లు నష్టం, వ్యాపారుల ఆందోళన) 1976లో స్థాపించబడిన, KKR జూన్ 30, 2023 నాటికి సుమారు 519 బిలియన్ల డాలర్లు ఆస్తులను కలిగి ఉంది. కేకేర్ ఫాలోఅన్ పెట్టుబడులపై రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ డైరెక్టర్ ఇషా ముఖేష్ అంబానీ, ఇటు రిలయన్స్‌తో భాగస్వామ్యంపై KKR సహ-CEO జో బే ఈ డీల్‌పై సంతోషం ప్రకటించారు. భారతదేశంలో నిజమైన కార్పొరేట్ లీడర్, ఇన్నోవేటర్. ఈ బృందంతో భాగస్వామ్యాన్ని కొనసాగించే అవకాశం లభించడం సంతోషమని కెకెఆర్లోని ఆసియా పసిఫిక్ ప్రైవేట్ ఈక్విటీ హెడ్ గౌరవ్ ట్రెహాన్ పేర్కొన్నారు. (విమానంలో వెర్రి వేషాలు, నిద్ర నటించిన మహిళ ఏం చేసిందంటే?) -
ఇషా అంబానీతో జతకట్టిన అలియాభట్! ఇక దూకుడే..
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ (Alia Bhatt), రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ ( Isha Ambani) జతకట్టారు. ఎడ్-ఎ-మమ్మా అనే వ్యాపార సంస్థతో బిజినెస్ రంగంలోనూ పేరుగాంచిన అలియాభట్, రిలయన్స్ రిటైల్ వెంచర్ లిమిటెడ్‌తో చేతులు కలిపారు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేశారు అలియాభట్. ఇషా అంబానీతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశారు. ‘బూట్స్ట్రాప్డ్ వెంచర్ ఎడ్-ఎ-మమ్మా (Ed-a-Mamma), భారతదేశపు అతిపెద్ద రిటైలర్ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ ( Reliance Retail Ventures Ltd) సంస్థలు చేతులు కలిపాయి. ఇక రెండూ కలిసి వ్యాపారం సాగిస్తాయి’ అని అలియాభట్ పేర్కొన్నారు. ఇద్దరు తల్లులమైన తాము ఇలా చేతులు కలపడం మరింత ప్రత్యేకమైందని వివరించారు. (తండ్రికి తగ్గ తనయ.. ఆకట్టుకున్న ఇషా అంబానీ మాటలు!) ఎడ్-ఎ-మమ్మా కంపెనీని 2020లో ఏర్పాటు చేశారు అలియా భట్. ఇది ప్రత్యేకంగా పిల్లలు, టీనేజనర్ల దుస్తులు, ప్రసూతి తల్లులకు సంబంధించిన దస్తులు విక్రయించే ఆన్లైన్ షాపింగ్ సంస్థ. ఇక అర్మానీ ఎక్స్ఛేంజ్, బుర్బెర్రీ, జిమ్మీ చూ వంటి ప్రముఖ బ్రాండ్ల సహకారంతో రిలయన్స్ రిటైల్ భారతదేశంలో అతిపెద్ద రిటైలర్లలో ఒకటిగా ఉంది. దీనికి డైరెక్టర్‌గా ఉన్న ఇషా అంబానీ నిర్వహణ బాధ్యతలు చూస్తున్నారు. View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) -
ఇషా అంబానీకి కొత్త బాధ్యతలు: కుమార్తెపై నీతా నమ్మకం అలాంటిది!
Isha Ambani రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కుమార్తె, రిలయన్స్ రిటైల్ మేనేజింగ్ డైరెక్టర్ ఇషా అంబానీ మరో కీలకమైన పదవికి ఎంపికైనారు. అంబానీ భార్య , రిలయన్స్ ఫౌండేషన్ ఫౌండర్, ఛైర్ పర్సన్ నీతా అంబానీ ఈ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్య, కళలు, క్రీడలు పట్ల ఎక్కువ శ్రద్ధ వహిస్తూ, అనేక సామాజిక కార్యకలాపాలను నిర్వించే నీతా తన ఎడ్యుకేషనల్ ప్రాజెక్ట్‌ను మరింత విస్తరించనున్నారు. ఈ నేపథ్యంలోనే తన కొత్త వెంచర్ బాధ్యతలను కుమార్తె ఇషాకు అప్పగించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) 46వ వార్షిక సర్వసభ్య సమావేశంలో (ఏజీఎం) నీతా అంబానీ , నీతా ముఖేష్ అంబానీ జూనియర్ స్కూల్ ద్వారా ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌ను విస్తరించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇషా అంబానీ నేతృత్వంలో ఈ పాఠశాల భారతీయ ఆత్మతో భవిష్యత్తులో ఒక మోడల్ స్కూల్‌గా తీర్చిదిద్దనున్నట్టు కూడా వెల్లడించారు. రిలయన్స్ ఫౌండేషన్ రాబోయే 10 సంవత్సరాలలో రిలయన్స్ ఫౌండేషన్ అండర్ గ్రాడ్యుయేట్ , పోస్ట్ గ్రాడ్యుయేట్ స్కాలర్‌షిప్‌ల ద్వారా 50వేల మంది విద్యార్థులకు మద్దతు ఇవ్వనున్నామని, ఈ సంవత్సరంలోనే, సంస్థ 5000 స్కాలర్షిప్లను ప్రదానం చేశామని కూడా తెలిపారు. రిలయన్స్ రీటైల్ హెడ్‌గా దూసుకుపోతున్న ఇషా అంబానీ ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌కి వైస్ చైర్పర్సన్ కూడా. ఇపుడిక నీతా ముఖేష్ అంబానీ జూనియర్ స్కూల్ బాధ్యతలను చేపట్టానున్నారు. అలాగే రిలయన్స్ రీటైల్‌కు సంబంధించి ఇప్పటికే పలు విదేశీ రిటైల్ బ్రాండ్లతో కోట్ల ఒప్పందాలు కుదుర్చుకున్నారు. -
వినాయక చవితికి జియో ఎయిర్‌ఫైబర్.. రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డులోకి వారసుల ఎంట్రీ.. ఇంకా ఇతర అప్డేట్స్
-
తండ్రికి తగ్గ తనయ.. ఆకట్టుకున్న ఇషా అంబానీ మాటలు!
Isha Ambani at Reliance AGM 2023: రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన రిటైల్ విభాగం రిలయన్స్ రిటైల్ వ్యాపారం, పెట్టుబడులు.. ఇలా అన్ని అంశాల్లోనూ దూసుకెళ్తోంది. ముఖేష్ అంబానీ తనయ ఇషా అంబానీ నాయకత్వంలో రిటైల్ బిజినెస్ పరుగులు పెడుతోంది. తాజాగా జరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సర్వసభ్య సమావేశంలో రిలయన్స్ రిటైల్ ప్రగతిని ఇషా అంబానీ వివరించారు. రిలయన్స్ రిటైల్ 2023 ఆర్థిక సంవత్సరంలో 100 కోట్ల లావాదేవీల మైలురాయిని దాటింది. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఇది 42 శాతం పెరిగింది. సంస్థ రిజిస్టర్డ్ కస్టమర్ బేస్ 249 మిలియన్లకు చేరుకుంది. 3,300 కొత్త స్టోర్లు ఏర్పాటయ్యాయి. మొత్తంగా 65.6 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో 18,040 స్టోర్లకు రిటైల్ విస్తరణ చేరుకుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, ఎండీ ముఖేష్ అంబానీ వివరించారు. ల్యాండ్‌మార్క్ ఇయర్ కంపెనీ డిజిటల్ కామర్స్, ఇతర కొత్త వ్యాపారాలు దాదాపు రూ.50,000 కోట్ల ఆదాయాన్ని అందించాయి. అంటే మొత్తం రెవెన్యూలో ఇది ఐదో వంతు. "మేము గత రెండు సంవత్సరాలలో 10 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.82 వేల కోట్లు)కుపైగా పెట్టుబడి పెట్టాం. సమ్మిళిత వృద్ధి, అంతర్గత బ్రాండ్లను పెంచుకోవడం, సప్లయి చైన్ నెట్‌వర్క్‌లను మెరుగుపరుచుకోవడంపై దృష్టి పెడుతున్నాం" అని ఇషా అంబానీ చెప్పారు. రిటైల్ వ్యాపారానికి 2023 ఆర్థిక సంవత్సరాన్ని ఒక మైలురాయి సంవత్సరంగా ఆమె అభివర్ణించారు. ఇదీ చదవండి: తక్కువ ధరలతో రిలయన్స్ కొత్త ఫ్యాషన్ బ్రాండ్.. తొలి స్టోర్ హైదరాబాద్‌లోనే.. “మేము గత సంవత్సరం 3,300 కొత్త స్టోర్లను ప్రారంభించాం. మొత్తం స్టోర్లు 18,040లకు చేరుకున్నాయి. 6.56 కోట్ల చదరపు అడుగుల రిటైల్ స్థలాన్ని కవర్ చేశాం. ఈ స్టోర్లలో మూడింట రెండొంతులు టైర్ 2, టైర్ 3 నగరాలు, చిన్న పట్టణాల్లోనే ఉన్నాయి" అని ఇషా అంబానీ పేర్కొన్నారు. తమ బ్యాకెండ్ వేర్‌హౌసింగ్, లాజిస్టిక్స్ ఆస్తులలో కూడా కంపెనీ పెట్టుబడి పెడుతోంది. రిలయన్స్ రిటైల్ బలమైన వృద్ధి భారతదేశంలో ఈ-కామర్స్, ఆన్లైన్ షాపింగ్‌కు పెరుగుతున్న ప్రజాదరణకు నిదర్శనం. కంపెనీ తన ఫిజికల్ స్టోర్ నెట్‌వర్క్‌ను టైర్ 2, టైర్3 మార్కెట్లలోకి విస్తరించడం ద్వారా కూడా ప్రయోజనం పొందుతోంది. భారతదేశంలోని 30 శాతానికి పైగా జనాభాకు తమ ఉత్పత్తులను అందిస్తున్నట్లు ఇషా అంబానీ చెప్పారు. ఇవన్నీ రిలయన్స్ రిటైల్‌ను ప్రపంచంలో అత్యధికంగా సందర్శించే టాప్-10 రిటైలర్లలో ఒకటిగా నిలిపాయని వివరించారు. నాలుగు ‘సీ’ల సూత్రంపైనే.. రిటైల్ వ్యాపారం కొలాబరేషన్, కన్జ్యూమర్ ఎంగేజ్మెంట్, క్రియేటివిటీ, కేర్ అనే 4 సీ(C)ల సూత్రంపై ఆధారపడి ఉంటుంది. రిలయన్స్ రిటైల్ భారతీయ కుటుంబాల రోజువారీ అవసరాలను 90 శాతానికి పైగా తీర్చేలా ఉత్పత్తులను అందిస్తోంది. కిరాణా వ్యాపారంలో ఈ సంవత్సరంలో 18 లక్షల మెట్రిక్ టన్నుల కిరాణా సామగ్రిని విక్రయించాం. కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ బిజినెస్‌లో సంవత్సరంలో దాదాపు 5 లక్షల ల్యాప్‌టాప్‌లు, 23 లక్షలకు పైగా ఉపకరణాలను విక్రయించాం. ఇక ఫ్యాషన్ & లైఫ్‌స్టైల్ వ్యాపారంలో ఈ సంవత్సరంలో రికార్డు స్థాయిలో 50 కోట్ల వస్త్రాలను విక్రయించినట్లు ఇషా అంబానీ చెప్పారు. కంపెనీ ఇటీవల యువత లక్ష్యంగా ఫ్యాషన్ రిటైల్ ఫార్మాట్ యూస్టాను ప్రారంభించింది. హైదరాబాద్‌లోని శరత్ సిటీ మాల్లో తన మొదటి స్టోర్‌ను ప్రారంభించింది. ఇది యువతకు సరసమైన ధరలలో ఫ్యాషన్ ఉత్పత్తులు అందిస్తుంది. ఇదీ చదవండి: అంబానీ కంపెనీ దూకుడు! భారీగా పెరిగిన నికర రుణం.. అయినా తగ్గేదేలే.. -
పిల్లలు చేతికొచ్చిన వేళ.. ముఖేష్ అంబానీ మరో సంచలన నిర్ణయం!
రిలయన్స్ 46 వార్షిక సాధారణ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) బోర్డుకి నీత అంబానీ రాజీనామా చేస్తున్నట్లు ముఖేష్ అంబానీ ప్రకటించారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల బాధ్యతల్ని అంబానీ వారసులు చేపట్టనున్నారు. ముఖేష్ అంబానీ వారసులు ఈశా అంబానీ, ఆకాష్ అంబానీ, అనంత్ అంబానీలను రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డ్‌లో నాన్ - ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్లుగా నియమించారు. ఏజీఎం సమావేశానికి ముందు జరిగిన సమావేశంలో కంపెనీ బోర్డు నిర్ణయం తీసుకున్నట్లు ముకేష్ తెలిపారు. వీరి నియామకాన్ని షేర్ హోల్డర్లు అనుమతి ఇవ్వాల్సి ఉంది. ఆర్ఐఎల్ బోర్డుకి ముఖేష్ అంబానీ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. నీతా అంబానీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌కు రాజీనామా చేసినప్పటికీ, ఆమె అన్ని బోర్డు సమావేశాలకు శాశ్వత ఆహ్వానితురాలిగా హాజరవుతూనే ఉంటారని, తద్వారా కంపెనీ వృద్దికి సహాయసహకారాలుంటాయని తెలిపారు. రాజీనామా ఎందుకు చేశారంటే? రిలయన్స్ ఫౌండేషన్‌కు మార్గనిర్దేశం చేయడానికి, దేశ సేవ కోసం తమ సమయాన్ని వెచ్చించాలనే ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తూ బోర్డు నుండి నీతా అంబానీ రాజీనామాను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఆమోదం తెలిపినట్లు రిలయన్స్ పేర్కొంది. పిల్లలు చేతికొచ్చిన వేళ ముఖేష్ అంబానీ తన వారసత్వ ప్రణాళికను 2021లో ప్రకటించిన విషయం తెలిసిందే. పిల్లలు చేతికి వచ్చిన వేళ ఆస్తుల పంపకం మొదలు పెట్టారు. న్యూ ఎనర్జీని చిన్న కుమారుడు అనంత్ అంబానీకి , టెలికం విభాగం రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ నిర్వహణ బాధ్యతల్నిపెద్ద కుమారుడు ఆకాష్‌కు, కవల సోదరి ఇషా అంబానీ రిటైల్ వ్యాపారం అప్పజెప్పారు. శామ్ వాల్టన్ బాటలో ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీ లిమిటెడ్ లక్షల కోట్ల విలువైన వ్యాపార సామ్రాజ్యం. ఇదే వైభవం భవిష్యత్తులోనూ కొనసాగాలంటే పక్కా ప్లాన్, అంతకుమించిన వ్యూహం అవసరం. అందుకోసం కసరత్తు చేస్తున్న ముకేష్ అంబానీ.. ఒక దుకాణంతో ప్రారంభించి ప్రపంచంలోనే అతిపెద్ద రిటైలర్‌గా ఎదిగిన శామ్ వాల్టన్ ఫాలో అవుతున్నారు. ఇందుకోసం ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ భాద్యతలను దానికి పూర్తిగా అప్పగించాలని ముఖేష్ అంబానీ చూస్తున్నారని బ్లూంబర్గ్ ఓ నివేదికను విడుదల చేసింది. కొత్త సంస్థలో బోర్డు సభ్యులుగా ముకేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ, అతని ముగ్గురు పిల్లలు మరికొందరు కుటుంబ సభ్యులు ఉంటారు. ముఖేష్ అంబానీ సన్నిహిత సహచరులు రిలయన్స్ సామ్రాజ్యాన్ని పర్యవేక్షించే సంస్థ బోర్డులో స్థానం కల్పించానున్నట్లు బ్లూంబర్గ్ తన కథనంలో హైలెట్ చేసింది. -
ఇషా అంబానీ దూకుడు: ఖతార్ నుంచి రూ.8 వేల కోట్ల పెట్టుబడులు
బిలియనీర్,రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ పెట్టుబడుల విషయంలో దూసుకుపోతోంది. రిలయన్స్‌కు చెందిన రీటైల్ విభాగం భారీ పెట్టుబడులను సాధించింది. ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ (QIA) రిలయన్స్ రీటైల్లో రూ. 8,278 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఈ పెట్టుబడి నిమిత్తం సంస్థలో దాదాపు ఒక శాతం వాటాను తీసుకుంటుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్), ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ, పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థ ద్వారా, అనుబంధ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (ఆర్‌ఆర్‌విఎల్)లో రూ. 8,278 కోట్ల పెట్టుబడి పెట్టనుందని రిలయన్స్ బీఎస్ఈ ఫైలింగ్‌లోతెలిపింది. ఇది రిలయన్స్ రిటైల్‌లో 0.99 శాతం వాటాను కొనుగోలుతో మైనారిటీ ఈక్విటీ వాటాగా మారుతుంది. ఈ పెట్టుబడి ప్రీ-మనీ ఈక్విటీ వాల్యూ రూ. 8.278 లక్షల కోట్లు అనిఆగస్టు 23న విడుదల చేసిన ప్రకటనలో రిలయన్స్ వెల్లడించింది. ఇషా అంబానీ ఏమన్నారంటే రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్‌లో క్యూఐఏ పెట్టుబడులపై రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ డైరెక్టర్ ఇషా ముఖేష్ అంబానీ సంతోషం వ్యక్తం చేశారు. తమ సంస్థను ప్రపంచ స్థాయి సంస్థగా మరింత అభివృద్ధి చేయడం ద్వారా, భారతీయ రిటైల్ రంగాన్ని మార్చేందుకు, క్యూఐఏ గ్లోబల్ అనుభవం బలమైన ట్రాక్ రికార్డ్ తమకు లబ్ది చేకూరుస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఇండియా రిటైల్ మార్కెట్లో, విభిన్నమైన పెట్టుబడుల పోర్ట్‌ఫోలియోలో చేరడంపై ఆనందంగా ఉందని క్యూఐఏ సీఈఓ మన్సూర్ ఇబ్రహీం అల్-మహమూద్ అన్నారు. కాగా ఆర్‌ఆర్‌విఎల్ 2020లో వివిధ గ్లోబల్ ఇన్వెస్టర్ల నుండి రూ. 4.21 లక్షల కోట్ల ప్రీ-మనీ ఈక్విటీ వాటాగా మొత్తం రూ. 47,265 కోట్ల నిధుల సమీకరించిన సంగతి తెలిసిందే. -
అంబానీ ప్లాన్లు మామూలుగా లేవుగా: రూ.40 వేల కోట్లపై కన్ను
ఆసియా కుబేరుడు, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ మరో భారీ ప్రణాళికతో అడుగులు వేస్తున్నారు. ఆయిల్ నుంచి టెలికాం దాకా పట్టిందల్లా బంగారంలా దూసుకు పోతున్న అంబానీ తాజాగా వేల కోట్ల నిధుల సమీకరణపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. అంతేకాదు దీనికి సంబంధించిన ప్రపోజల్‌ను మార్కెట్ రెగ్యులేటరీ సెబీ ముందు ఉంచినట్టు సమాచారం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (InvIT) ద్వారా ప్రాథమికంగా రూ.400 కోట్ల నిధులను సమీకరించాలని యోచిస్తోంది.దీనికి సంబంధించిన ప్రతిపాదనను సెబీ వద్ద దాఖలు చేసినట్లు ఇండియా రిటైలింగ్ రిపోర్ట్ చేసింది. రిలయన్స్ రిటైల్ ఇన్విట్ రానున్న రెండు నెలల్లో ప్రారంభంలో సుమారు రూ.400 కోట్లను సమీకరించనుంది. మొదటి రౌండ్ నిధులతో ట్రస్ట్‌ను ఏర్పాటు చేయనున్నాయి. అయితే ఈ ఏడాది క్యూ4 నాటికి మొత్తంగా రూ.25,000-40,000 కోట్ల దాకా నిధులను సేకరించాలనేది ప్రణాళిక. అయితే ఈ వార్తలపై రిలయన్స్ అధికారంగా స్పందించాల్సి ఉంది. (అంబానీ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో ఎల్ఐసీ భారీ వాటా కొనుగోలు) 2.4-3 బిలియన్ డాలర్ల ట్రస్ట్‌తో రిటైల్ వేర్‌హౌసింగ్ ఆస్తులను మోనటైజ్ చేయడానికి సిద్ధమవుతోందన్న వార్తలు గత ఏప్రిల్ నుంచే హల్‌చల్‌చేస్తున్న సంగతి తెలిసిందే. రిలయన్స్ రిటైల్ విభాగం ఇటీవలి కాలంలో ఆఫ్‌లైన్ సెగ్మెంట్లో భారీగా విస్తరిస్తోంది.ఈ క్రమంలో రిలయన్స్ రిటైల్ ఇతర కీలకమైన అంబానీ సంస్థలను అధిగమించి 112 బిలియన్ డాలర్ల విలువగా బ్రోకరేజ్ సంస్థ బెర్న్‌స్టెయిన్ ఇటీవల నివేదించడం గమనార్హం. దీంతో ఈ వార్తలు మరింత బలం చేకూరుతోంది. కాగా 2022 ఆగస్టులో రిలయన్స్ రిటైల్ వెంచర్ లిమిటెడ్ పగ్గాలను ఇషా అంబానీ చేపట్టారు. ఆమెనేతృత్వంలోని రిలయన్స్ రిటైల్‌లో పెట్టుబడి రూ. 25,000 కోట్లకు పైమాటే.దీనికి అదనంగా రూ. 15000 కోట్లుపెట్టుబడులను రిలయన్స్ అందించనుంది. -
ఇషా అంబానీ కారు.. దూరం నుంచి అలా.. దగ్గర నుంచి ఇలా!
ముఖేష్ అంబానీ గురించి వారి ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే ప్రముఖ పారిశ్రామిక వేత్తలుగా విలాసవంతమైన జీవితం గడుపుతూ.. భారతదేశంలో అత్యంత సంపన్నుల జాబితాలో అగ్ర స్థానంలో నిలిచారు. అయితే వీరి వద్ద ఉన్న లగ్జరీ వాహనాలు లెక్కకు మించి ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో చెప్పుకోదగ్గ కారు రంగులు మార్చే 'రోల్స్ రాయిస్'. రోల్స్ రాయిస్ కల్లినన్.. రంగులు మార్చే ఖరీదైన రోల్స్ రాయిస్ కారులో ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ కనిపించింది. వీరి వద్ద ఉన్న రోల్స్ రాయిస్ కార్లలో ఇది చాలా ప్రత్యేకమైనదికి కావడం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బీలైక్ఓమ్ అనే యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేసిన వీడియోలో గమనించినట్లైతే పోర్స్చే 911 జీటీ3, టయోటా సుప్రా వంటి కార్లతో పాటు రోల్స్ రాయిస్ కారుని గమనించవచ్చు. ఇది దూరం నుంచి వైలెట్ కలర్ షేడ్‌లో కనిపిస్తుంది.. దగ్గరకు వచ్చే సరికి నీలం (బ్లూ) రంగులోకి మారింది. ఇలా అది దూరం వెళ్లే సరికి మళ్ళీ రంగు మారినట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: ఇండియాలో ఆ మందు పాక్, చైనాకంటే 15 రెట్లు కాస్ట్లీ.. ధర తెలిస్తే షాకవుతారు! సైకెడెలిక్ ర్యాప్.. నిజానికి వర్షం కురిసిన సమయంలో ఈ కారు కనిపించడంతో ఇలా కనిపించింది. అదే బాగా ఎండగా ఉన్న సమయంలో అయితే మరింత ఆకర్షణీయంగా కనిపించి ఉంటుందని భావిస్తున్నారు. ఇది కలర్ మార్చే ర్యాప్.. కావున దానిపై పడే కాంతి పరిమాణం, మీరు కారును చూస్తున్న కోణాన్ని బట్టి రంగు మారుతుంది. ఈ రకమైన ర్యాప్‌ను సైకెడెలిక్ ర్యాప్ అని కూడా పిలుస్తారు, ఇది రోల్స్ రాయిస్ కంపెనీకి చెందిన కల్లినన్ కారు అని తెలుస్తోంది. కావున ఈ లగ్జరీ కారు 6.8 లీటర్ V12 ట్విన్-టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌తో గరిష్టంగా 580 బీహెచ్పీ పవర్ 850 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ముఖేష్ అంబానీ గ్యారేజిలో ఈ రోల్స్ రాయిస్ మాత్రమే కాకుండా.. బిఎమ్‌డబ్ల్యూ ఐ8, ఫెరారీ 812 సూపర్‌ఫాస్ట్, మెక్లారెన్ 520ఎస్ స్పైడర్, లంబోర్ఘిని అవెంటడోర్ ఎస్ రోడ్‌స్టర్, ఫెరారీ 488 జిటిబి, ఫెరారీ పోర్టోఫినో వంటి మరెన్నో కార్లు ఉన్నట్లు సమాచారం. ఇదీ చదవండి: ఒకప్పుడు రూ. 600 జీతం.. ఇప్పుడు కోట్ల సంపాదన - ఐఏఎస్ కొడుకు సక్సెస్ స్టోరీ! -
తండ్రికే షాకిస్తున్న ఇషా: మురిసిపోతున్న అంబానీ
దేశీయ వ్యాపార దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఆసియాలోనే అత్యంత ధనిక పారిశ్రామికవేత్తగా తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఇపుడు కుటుంబ వారసురాలిగా బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అంబానీ తనయ ఇషా అంబానీ కూడా సంచలనం సృష్టించారు. రిలయన్స్ రిటైల్ విభాగం, రిలయన్స్ రిటైల్ లాభాల్లో మాతృ సంస్థనే అధిగమించింది. దశాబ్దాల చరిత్ర కలిగిన రిలయన్స్‌తో పోలిస్తే దాదాపు రెండింతలు విలువను కలిగి ఉందట. బాధ్యతలను స్వీకరించిన అనతి కాలంలోనే రిలయన్స్ రిటైల్ వ్యాపారాన్ని శరవేగంగా పరుగులు పెట్టిస్తూ తండ్రికి తగ్గ తనయ అనిపించుకుంటున్నారు ఇషా. బ్రోకరేజ్ సంస్థ బెర్న్‌స్టెయిన్ తాజా నివేదిక ప్రకారం ఇషా అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ రిటైల్ విలువను రూ.9,26,055 కోట్లుగా (112 బిలియన్ డాలర్లు) అంచనా వేసింది. ఆయిల్ టు కెమికల్స్ రిలయన్స్ వ్యాపారం రూ.4,71,295 కోట్ల కంటే రెండు రెట్లు ఎక్కువ అని తెలిపింది. (పల్సర్ బైకా? మజాకా..రూ.35 వేల కోట్ల ఆస్తి..ఎవరా హీరో?) రిలయన్స్ రిటైల్ అంతర్జాతీయ కంపెనీలతో ఒప్పందాలు, భారీ పెట్టుబడులతో సరికొత్త విస్తరణలతో కంపెనీని కొత్త పుంతలు తొక్కిస్తోంది. రిలయన్స్ EBITDA భారీ పెరుగుదలకు డిజిటల్ రిటైల్, న్యూ ఎనర్జీతో సాధ్యమైందని బెర్న్‌స్టెయిన్ వెల్లడించింది. అంతేకాదు 2027 రిలయన్స్ రిటైల్ వ్యయం రూ.18,900 కోట్లకు చేరుకుంటుందని అంచనావేసింది. రిలయన్స్ మొత్తం మూలధన వ్యయంలో 19శాతం వాటాను కలిగి ఉంటుందని కూడా అంచనా వేసింది.రిలయన్స్ రిటైల్ మార్కెట్ నాయకత్వం స్టోర్ నెట్‌వర్క్‌ను విస్తరించడం (గత రెండు సంవత్సరాల్లో 1.5 రెట్లు), కొత్త బ్రాండ్లను (1.2 బిలియన్ డాలర్లుపెట్టుబడులు), ఇ-కామర్స్/న్యూ కామర్స్ (రూ. 18 శాతం మిశ్రమం) కొనుగోళ్లతో 7.7 శాతం ఆరోగ్యకరమైన మార్జిన్లతో ప్రత్యర్థులతో పోలిస్తే వార్షిక ప్రాతిపదిక (రూ. 20 శాతం)బలమైన వృద్ధిసాధిస్తోందని పేర్కొంది. (ఇండియాలో అత్యధికంగా అమ్ముడుబోయిన కారు ఇదే: ఎన్ని కార్లు తెలుసా?) రిలయన్స్ రిటైల్ దేశంలో అతిపెద్ద ఆర్గనైజ్డ్ రీటైలర్ అని పేర్కొన్న బ్రోకరేజ్ సంస్థ, కంపెనీ ఆదాయం 30 బిలియన్ల డాలర్లతో దేశంలోని మూడు రిటైలర్ల ఉమ్మడి స్కేల్ కంటే 2.5 రెట్లు ఎక్కువఅని వ్యాఖ్యానించింది. 2022, ఆగస్టులో రిలయన్స్ రిటైల్ లీడర్‌గా ఇషా అంబానీ నియమితులైన సంగతి తెలిసిందే. -
ఇషా అంబానీ అంటే అంతే: అన్‌కట్‌డైమండ్ నెక్లెస్ ఖరీదు తెలుసా?
ఆసియాలోనే అత్యంత ధనవంతులైన కుటుంబానికి చెందిన బిజినెస్ ఉమెన్ ఇషా అంబానీ వ్యాపార ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కేవలం బిలియనీర్ ముఖేష అంబానీ కుమార్తెగానే కాదు, విజయవంతమైన వ్యాపారవేత్తగా రాణిస్తోంది. అందేకాదు ఫ్యాషన్ ఐకాన్‌గా తన ఫ్యాన్స్నుఆకట్టుకుంటూనే ఉంటుంది. చూడచక్కని లెహంగా, ముచ్చటైన చీరలు, రాయల్ జ్యువెలరీ, అంతకుమించిన ఫ్యాషన్ అండ్ క్లాసీ స్టైల్‌తో అందర్నీ మెస్మరైజ్ చేయడం ఇషా స్పెషాల్టీ. ఈ నేపథ్యంలో 165 కోట్ల అన్‌కట్ డైమండ్ నెక్లెస్ వార్తల్లో నిలిచింది. (బర్త్ డే నాడు కొత్త బిజినెస్‌లోకి హీరోయిన్, నెటిజన్ల రియాక్షన్ మామూలుగా లేదు!) ఇషా అంబానీ ఖరీదైన వస్తువులలో డైమండ్ నెక్లెస్ స్పెషల్‌గా నిలుస్తోంది. ఇషా తన వివాహానికి ముందు జరిగిన వేడుకలో మొదట ధరించిన అత్యంత ఖరీదైన డైమండ్ నెక్లెస్ కూడా ఒకటి. దీని ధర ఖచ్చితంగా తెలియనప్పటికీ, ఆభరణాలు, వజ్రాల నిపుణుల ప్రకారం, 20 మిలియన్ల డాలర్లు (సుమారుగా రూ. 165 కోట్లు) ఉంటుందని అంచనా. ఇషా ప్రీ-వెడ్డింగ్ వేడుక గురించి మాట్లాడుకుంటే ఫ్యాషన్‌స్టార్ ఏస్ డిజైనర్ మనీష్ మల్హోత్రా షెల్ఫ్‌ల నుండి రాణి పింక్ లెహంగాతో పాటు కాస్ట్లీ డైమండ్ నెక్లెస్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. బెస్పోక్ అన్‌కట్ నెక్లెస్‌లో 50 పెద్ద అన్‌కట్ డైమండ్లతో చాలా స్పెషల్‌గా రూపొందించారట. అలాగే బనీతా ముఖేష్ అంబానీ కల్చర్ సెంటర్‌ను గ్రాండ్ ఈవెంట్ సందర్బంగా ఇషా అదే నెక్లెస్‌ను ధరించింది. ఈవెంట్లో డిజైనర్ ద్వయం అబు జానీ అండ్ సందీప్ ఖోస్లా రూపొందించిన ఎరుపు రంగు టల్లే కేప్‌తో అందమైన రెడ్ కలర్ వాలెంటినో గౌను ధరించింది. కాగా 2008లో ఫోర్బ్స్ 'యంగెస్ట్ బిలియనీర్ వారసురాలు' జాబితాలో ఇషా అంబానీ రెండవ స్థానంలో నిలిచింది. యేల్ యూనివర్శిటీ సైకాలజీ , సౌత్ ఏషియన్ స్టడీస్‌లో పట్టా పొందిన ఇషా రిలయన్స్కుచెందిన టెలికాం, రీటైల్ బిజినెస్‌లో దూసుకు పోతోంది. డిసెంబర్ 12, 2018న బిలియనీర్, అజయ్ పిరమల్, స్వాతి పిరమల్‌ల కుమారుడు, వ్యాపార దిగ్గజం ఆనంద్ పిరమల్‌తో వివాహైంది. ఇషాకు ఇద్దరు పిల్లలు (ట్విన్స్) ఉన్నారు. -
ఎన్మ్యాక్లో ఆకట్టుకుంటున్న ఆర్ట్ ఎగ్జిబిషన్.. తరలివచ్చిన ప్రఖ్యాత ఆర్టిస్టులు
-
ఎన్మ్యాక్లో భారీ ఆర్ట్ ఎగ్జిబిషన్.. సందడి చేసిన ఇషా అంబానీ, రణ్వీర్ సింగ్
ముంబైలోని నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్లో భారీ ఆర్ట్ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. ‘రన్ యాస్ స్లో యు క్యాన్’ (Run as slow as you can) పేరిట టాయిలెట్ పేపర్ అనే మ్యాగజైన్ ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేసింది. జులై 22న ప్రారంభమైన ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ అక్టోబర్ 22 వరకు సుదీర్ఘంగా కొనసాగనుంది. ఏడేళ్ల లోపు చిన్నారులు, సీనియర్ సిటిజెన్లు, ఆర్ట్ విద్యార్థులకు ఈ ప్రదర్శన పూర్తిగా ఉచితమని కల్చరల్ సెంటర్ పేర్కొంది. ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేసిన కళ్లు చెదిరే కళాకృతులు చిన్నారులు, యువతను అమితంగా ఆకట్టుకుంటాయని నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ చైర్పర్సన్ నీతా అంబానీ కుమార్తె ఇషా అంబానీ పేర్కొన్నారు. ఆర్ట్ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మంది ప్రఖ్యాత కళాకారులు, ఔత్సాహికులు తరలివచ్చారు. వీరితో కలిసి ఇషా అంబానీ సందడి చేశారు. ఇదీ చదవండి ➤ IPL 2023: ఫ్రీగా చూపించినా.. వేల కోట్లు సంపాదించారు! రంగురంగుల కార్నివాల్, 10,000 అరటిపండు బుడగలతో నిండిన స్విమ్మింగ్ పూల్, వింటేజ్ కారు, విలాసవంతమైన మొసలి ఆసనం, కళాకృతంగా తీర్చిదిద్దిన గోడలు వంటివి మంత్రముగ్ధులను చేస్తాయని, సందర్శకులు నచ్చినన్ని ఫొటోలు తీసుకోవచ్చని నిర్వాహకులు పేర్కొన్నారు. కాగా బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ ఈ ఎగ్జిబిషన్‌ను సందర్శించి బనానా పూల్‌లో ఆటలాడుతూ సందడి చేశారు. -
తారల మెరుపులతో మనీష్ మల్హోత్రా ఈవెంట్ (ఫొటోలు)
-
ఇషా అంబానీ నివాస భవనం ఎన్ని కొట్లో తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది!
భారతదేశంలో అత్యంత సంపన్న కుటుంబం ఎవరిదీ అంటే వెంటనే గుర్తొచ్చేది 'అంబానీ ఫ్యామిలీ'. ఈ కుటుంబం విలాసవంతమైన జీవితం గడుపుతారన్న విషయం అందరికి తెలిసిందే. 2018లో ముఖేష్ అంబానీ గారాల తనయ ఇషా అంబానీ, ఆనంద్ పిరమల్‌ని వివాహం చేసుకుంది. వివాహానంతరం ఈ కొత్త జంట అప్పట్లో కొత్త ఇంట్లోకి ప్రవేశించారు. ఈ లగ్జరీ బంగ్లా విశేషాలను ఈ కథనంలో తెలుసుకుందాం. గులిటాలోని ఇషా అంబానీ మాన్షన్ అని పిలువబడే సంపన్నమైన ఎస్టేట్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఆధునిక సదుపాయాలు, అధునాతన వసతులు కలిగిన ఈ భవనం భూలోక ఇంద్ర భావనాన్ని తలపిస్తుంది. వర్లీలోని హిందూస్తాన్ యూనిలీవర్‌కి చెందిన ఈ భవనాన్ని 2012లో జరిగిన వేలంలో పిరమాల్ కుటుంబం దక్కించుకుంది. ఈ అద్భుతమైన భవనం అరేబియా సముద్రానికి ఎదురుగా ఉంటుంది. దీనిని అజయ్ పిరమల్ అండ్ స్వాతి పిరమల్ ఇషా అంబానీకి కానుకగా అందించారు. (ఇదీ చదవండి: కొత్త కారు కొంటున్నారా.. ఈ రూల్స్ తెలిస్తే ఎగిరి గంతేస్తారు!) 50000 చదరపు అడుగుల అల్ట్రా లగ్జరీ బంగ్లా ఖరీదు సుమారు రూ. 450 కోట్లు అని తెలుస్తోంది. ఐదు అంతస్తులు కలిగిన ఈ సౌధం మొదటి అంతస్థులో విశాలమైన మల్టి పర్పస్ రూమ్స్, ఓపెన్ ఎయిర్ వంటి వాటితో పాటు ఆ తరువాత అంతస్తుల్లో లివింగ్, డిన్నర్, డ్రెస్సింగ్ వంటి వాటి కోసం ప్రత్యేకమైన రూమ్స్ వంటివి ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇషా ఆనంద్ కోసం ప్రత్యేకంగా రూపొందించారు. -
ఇషా అంబానీ దూకుడు.. అలియా భట్‌తో భారీ డీల్!
బిలియనీర్, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ వ్యాపార విస్తరణలో దూసుకు పోతోంది. రిలయన్స్ రిటైల్ వెంచర్స్‌లో భాగమైన ముఖేష్ అంబానీ, ఇషా అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ బ్రాండ్స్, ప్రముఖ బాలీవుడ్ నటి అలియా భట్ చిల్డ్రన్ వేర్ బ్రాండ్ ఎడ్-ఎ-మమ్మాను కొనుగోలుకు సిద్ధంగా ఉందని తెలుస్తోంది. ఈ మేరకు సంబంధిత చర్చలు జరుపుతోందని సమాచారం. ది ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం అలియా భట్ బ్రాండ్‌ను రూ. 300 నుంచి 350 కోట్ల భారీ డీల్‌లో కొనుగోలు చేయాలని యోచిస్తోంది. పిల్లల దుస్తుల విభాగంలో తమ ఉనికిని బలోపేతానికి యోచిస్తున్న ఇషా అంబానీ, ఇప్పటికే పాపులర్ అయిన అలియా బ్రాండ్‌ను కొనుగోలు చేయాలని భావిస్తోంది. అలియా భట్ అక్టోబర్ 2020లో ఎడ్-ఎ-మమ్మాను ప్రారంభించిన సంగతి తెలిసిందే. 2-14 సంవత్సరాల వయస్సున్న కిడ్స్‌కు పూర్తి స్వదేశీ దుస్తులను విక్రయిస్తుంది. డిజిటల్ మార్కెట్‌ప్లేస్ ఆరంభంనుంచే అలియా బ్రాండ్ మంచి ఆదరణను సొంతం చేసుకుంది. (ఐటీ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్: మరింత గడ్డు కాలం?) ఈ ఏడాది ఆరంభంలోనే ప్రారంభంలో అలియా ఎడ్-ఎ-మమ్మా రూ. 150 కోట్లకు పైగా వాల్యుయేషన్‌ను సాధించిందని అంచనా. అటు రిలయన్స్ రిటైల్ ప్రస్తుతం రూ. 918000 కోట్ల కంటే ఎక్కువ విలువను సాధించింది. అలాగే వాల్యుయేషన్ పరంగా ఇది ఇప్పటికే ఐటీసీ, హెచ్‌యూఎల్ లాంటి ఎఫ్ఎంసీజీ దిగ్గజాలను అధిగమించింది. వరుస డీల్స్‌తో ఎఫ్ఎంసీజీ దిగ్గజాలకు సవాల్ విసురుతోంది ఇషా. అయితే తాజా వార్తలపై అటు రిలయన్స్‌రీటైల్, ఇటు అలియా భట్ గానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. (వెకేషన్లో ఉన్న ఈ నటి ఎవరు, ఆ డ్రెస్ ఖరీదు ఎంతో తెలుసా?) కాగా ఆగస్ట్ 2022లో రిలయన్స్ రిటైల్ హెడ్‌గా ఇషా అంబానీని ముఖేష్ అంబానీ నియమించారు. అప్పటికి సంస్థ టర్నోవర్ రూ. 2 లక్షల కోట్టు. జిమ్మీ చూ, జార్జియో అర్మానీ, హ్యూగో బాస్, వెర్సేస్, మైఖేల్ కోర్స్, బ్రూక్స్ బ్రదర్స్, అర్మానీ ఎక్స్ఛేంజ్, బుర్బెర్రీ లాంటి ఇతర ప్రపంచ బ్రాండ్లు రిలయన్స్ రిటైల్ భాగస్వామి బ్రాండ్‌గా భారతదేశంలో అందుబాటులో ఉన్నాయి. -
ముఖేష్ అంబానీ బాటలో.. ఈషా అంబానీకి మరో కీలక బాధ్యతలు
డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ గ్రూప్ అధినేత ముఖేష్ అంబానీ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. జియో ఫైనాన్షియల్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ముఖేష్ అంబానీ కుమార్తె, రిలయన్స్ రీటైల్ డైరెక్టర్ ఈషా అంబానీనీ నియమించినట్లు తెలుస్తోంది. రిలయన్స్‌లో ఇండస్ట్రీస్ (RIL)లో జియో ఫైనాన్షియల్ ఓ భాగం. అయితే, ఆర్ఐఎల్ నుంచి జియో ఫైనాన్షియల్‌ను డీ మెర్జర్ (విడదీయడం) చేసింది. ఇందుకోసం ఎన్సీఎల్టీ ఆమోదం కూడా పొందింది. డీ మెర్జర్ తర్వాత జియో ‘ఫైనాన్సియల్ సర్వీసెస్ (Jio Financial Services- JFSL) పేరిట స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ కోసం ఐపీఓకు వెళనున్నట్లు సమాచారం. ఈ తరుణంలో శుక్రవారం జరిగిన బోర్డు డైరెక్టర్ల సమావేశంలో ముఖేష్ అంబానీ తన గారాల పట్టి ఈషా అంబానీకి కీలక బాధ్యతలు అప్పగించారు. ఈషా అంబానీ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బాధ్యతల్ని అప్పగించారు. మెక్ లారెన్స్ స్ట్రాటర్జిక్ వెంచర్స్ కు చెందిన హితేష్ సెథియాను మూడేండ్ల పాటు జియో ఫైనాన్సియల్ సర్వీసెస్ సీఈవో, ఎండీగా విధులు నిర్వహించనున్నారు. యేలే యూనివర్సిటీ డిగ్రీలో ఎకనామిక్స్, ప్రఖ్యాత స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంబీయే పూర్తి చేసిన ఈషా అంబానీ రిలయన్స్ రీటైల్, జియో ఫ్లాట్‌ఫామ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. తాజాగా, డిజిటల్ లెండింగ్, ఇన్సూరెన్స్, వెల్త్ మేనేజ్మెంట్ వంటి సేవల్ని అందించే జియో ఫైనాన్షియల్ సంస్థ నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తన తండ్రి ముఖేష్ అంబానీ తరహాలో తన బాధ్యతల్ని విజయవంతంగా నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. చదవండి👉 టాటాలనే ఢీకొట్టేలా.. ఈషా అంబానీ మరో వ్యాపార ఎత్తుగడ! -
టాటాలనే ఢీకొట్టేలా.. ఈషా అంబానీ మరో వ్యాపార ఎత్తుగడ!
ప్రముఖ డ్రైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ రిలయన్స్ రీటైల్ డైరెక్టర్ ఈషా అంబానీ భారత్‌లో అత్యంత విలువైన బ్రాండ్‌గా తన స్థానాన్ని పదిలం చేసుకున్న టాటా గ్రూప్‌ను ఢీకొట్టనున్నారా? టాటా గ్రూప్ అనుబంధ సంస్థ స్టార్‌బక్స్‌కు పోటీగా తన వ్యాపార తంత్రాన్ని ప్రదర్శించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి పరిశ్రమ వర్గాలు గత పదేళ్లుగా భారత్ కాఫీ వ్యాపార విభాగంలో టాటా గ్రూప్ జాయింట్ వెంచర్ స్టార్‌బక్స్ ఇండియా తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది. 2012లో టాటా గ్రూప్ స్టార్‌బక్స్‌ను మార్కెట్‌కు పరిచయం చేసింది. కేవలం పదేళ్లలో ఆ సంస్థ కాఫీ ప్రియుల ఆదరాభిమానాలు చూరగొన్నది. వెరసీ జాయింట్ వెంచర్‌ను ప్రారంభించిన 10ఏళ్ల తర్వాత వార్షికంగా రూ.1000 కోట్లకు అమ్మకాల్ని నమోదు చేసింది. ఇదే స్టార్‌బక్స్‌తో నేరుగా తలపడేందుకు రిలయన్స్ రీటైల్ గత కొన్నేళ్లుగా గట్టి ప్రయత్నాలే చేసింది. చివరికి రిలయన్స్ రీటైల్ డైరెక్టర్ ఈషా అంబానీ తన వ్యాపార వ్యూహాలతో యూకేలో కాఫీ, శాండ్ విచ్ విభాగంలో ఐకానిక్ బ్రాండ్ ‘ప్రెట్ ఎ మ్యాంగర్’తో చేతులు కలిపారు. ఇటీవల, ఒప్పందంలో భాగంగా రిలయన్స్ రీటైల్ జాయింట్ వెంచర్ ప్రెట్ ఎ మ్యాంగర్ కార్యకలాపాల్ని భారత్‌లో ప్రారంభించింది. దిగ్గజ బ్రిటిష్ బ్రాండ్‌ను ముంబైలోని బాంద్రా - కుర్లా క్లాంప్లెక్స్ (BKC)లో ఏర్పాటు చేసింది. రానున్న రోజుల్లో ఢిల్లీ, బెంగళూరుతో పాటు మొత్తం 12 నగరాల్లో వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. ఇషా అంబానీ నేతృత్వంలోని అనుబంధ సంస్థలు ఫుడ్ అండ్ బేవరేజెస్ విభాగంలో దూసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాయని నిరూపించేలా..మార్కెట్లోని టీ, కాఫీలకు యువతలో పెరిగిపోతున్న అభిరుచికి అనుగుణంగా ప్రెట్ ఎ మ్యాంగర్ తన కాఫీ ఘుమఘుమలు అందరికీ అందుబాటులోకి తెచ్చేలా ప్రణాళికల్ని సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే తమ భాగస్వామ్యంతో భారత్‌లో వ్యాపారాల్ని ప్రారంభించాలని ఆహ్వానిస్తూ రిలయన్స్ ఇటీవల పలు అంతర్జాతీయ బ్రాండ్లతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. కాగా, ప్రెట్ ఎ మ్యాంగర్ ప్రపంచవ్యాప్తంగా 550 స్టోర్లను నిర్వహిస్తోంది. ఈ బ్రాండ్ ఆర్గానిక్ కాఫీ, కుకీలు, సలాడ్, శాండ్విచ్ల అమ్మకాలు ప్రసిద్ధి చెందింది. టాటా స్టార్‌బక్స్ భారత్‌లోని 43 నగరాల్లో 341 స్టోర్లను నడుపుతుంది.అయితే, దేశీయ స్టార్టప్‌ల నుండి తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొనేందుకు బిజినెస్ కార్యకలాపాల్ని మరింత మెరుగుపరుచుకోనుంది. చిన్న పట్టణాలలో సైతం విస్తరించేలా స్టార్‌బక్స్ చిన్న, చౌకైన పానీయాలతో పిల్లలతో సహా భారతీయులను ఆకర్షించడానికి తన వ్యూహాన్ని పునరుద్ధరిస్తున్నట్లు నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. చదవండి👉 ముగ్గురు పిల్లలకు..చాలా తెలివిగా ముఖేష్ అంబానీ వీలునామా -
రిచ్ కిడ్స్: అంబానీ కొడుకులు, కూతురు ఏం పని చేస్తారు.. ఎంత సంపాదిస్తారు?
దేశంలోనే కాదు.. ఆసియాలోనే అత్యంత సంపన్న కుటుంబం.. ముఖేష్ అంబానీ కుటుంబం. ముఖేష్, నీతా అంబానీ దంపతులు ఉత్సాహంగా పనిచేస్తూ కుటుంబానికి విజయవంతంగా నాయకత్వం వహిస్తున్నారు. అయితే వారి పిల్లలు అంటే ఇద్దరు కొడుకులు, కూతురు ఏం పని చేస్తున్నారు.. వ్యక్తిగతంగా ఎంత సంపాదిస్తున్నారన్నది ఆసక్తికరం. రిలయన్స్ గ్రూప్‌నకు అధిపతిగా ఉన్న ముఖేష్ అంబానీ కుటుంబ వ్యాపారాన్ని చూసుకోవడానికి తన పిల్లలకు శిక్షణ కూడా ఇచ్చారు. ఆకాష్ అంబానీ, ఇషా అంబానీ, అనంత్ అంబానీ ఉన్నత చదువులు చదివారు. వారి తండ్రి, తాతలను అనుసరించి వ్యాపారంలో నైపుణ్యాన్ని సాధిస్తున్నారు. వారు రిలయన్స్ గ్రూప్‌లో ముఖ్యమైన విభాగాలను చూసుకుంటున్నారు. ఆకాష్ అంబానీ ఆకాష్ అంబానీ యూఎస్ఏలోని రోడ్ ఐలాండ్‌లోని ప్రతిష్టాత్మక బ్రౌన్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ చేశారు. వ్యాపారం విషయానికి వస్తే తన తండ్రిని అనుసరించారు. ఆకాష్ ప్రస్తుతం రిలయన్స్ జియో ఛైర్మన్‌గా ఉన్నారు. ఇందులో టెలికాం సేవలు, జియో సినిమా ఉన్నాయి. ఆకాష్ అంబానీ జీతం ఎంత అనేది వెల్లడించనప్పటికీ, ఆయన నెలవారీ జీతం దాదాపు రూ. 45 లక్షలు ఉంటుందని అంచనా. ఇషా అంబానీ సోదరుడు ఆకాష్ అంబానిలాగే ఇషా అంబానీ కూడా వ్యాపారంలో మెలకువలు సాధించింది. ఆమె శిక్షణ పొందిన బిజినెస్ అనలిస్ట్ అలాగే సలహాదారు. యూఎస్‌లోని అగ్రశ్రేణి సంస్థలో కొంతకాలం పనిచేసిన తరువాత ఇషా అంబానీ తన తండ్రి వ్యాపారంలో చేరారు. రిలయన్స్ రిటైల్, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్‌లకు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. డివిడెండ్ లాభాలతో కలిపి ఇషా అంబానీ నెలవారీ జీతం రూ.35 లక్షలు ఉంటుందని అంచనా. అనంత్ అంబానీ ముఖేష్, నీతా అంబానీల చిన్న కొడుకు, ఆఖరి సంతానం అయిన అనంత్ అంబానీ ప్రస్తుతం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) ఎనర్జీ వింగ్ హెడ్‌గా పనిచేస్తున్నారు. జియో ప్లాట్‌ఫారమ్‌లు, రిలయన్స్ రిటైల్ వెంచర్స్ బోర్డు మెంబర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. అంచనాల ప్రకారం.. అనంత్ అంబానీ నెలవారీ జీతం రూ. 35 లక్షలు. ఇదీ చదవండి: Aditi Avasthi: రూ.1600 కోట్ల నిధులు.. ఎడ్టెక్ కంపెనీలకు గట్టి పోటీ ఇస్తున్న అదితి అవస్తీ! -
వదినా మరదళ్లతో అట్లుంటది: వారి హ్యాండ్ బ్యాగ్ ధర రూ. 21 లక్షలు
సాక్షి,ముంబై: అంబానీ ఫ్యామిలీ మహిళలంటే ఈ కథే వేరుంటుంది కదా. ఈ విషయాన్నే రిలయన్స్ అధినేత, ఆసియా బిలియనీర్ ముఖేశ్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ, కాబోయే కోడలు రాధిక మర్చంట్ మరోసారి నిరూపించారు.లగ్జరీ బ్రాండ్ హ్యాండ్బాగ్తో కనిపించి ఇటీవల అందరి దృష్టినీ ఆకర్షించారు. ప్రస్తుతం ఈ బ్యాగ్ ధర హాట్ టాపిక్‌గా మారింది. (3 వేల ఉద్యోగాలు కట్: లగ్జరీ కార్‌మేకర్ స్పందన ఇది!) నీతా,ముఖేశ్ అంబానీ తనయ, రిలయన్స్ రీటైల్ హెడ్ ఇషా అంబానీ, అనంత్ అంబానీ (ఇషా సోదరుడు అనంత్ రాధిక నిశ్చితార్థం జరిగింది) కాబోయే భార్య రాధిక మర్చంట్ ఇద్దరూ లేడీ డియోర్ మినీ హ్యాండ్‌బ్యాగ్‌లతో సందడి చేశారు. మంచి ఫ్రెండ్స్ అయిన వీరిద్దరూ తరచూ అనేక ఈవెంట్లకు హాజరువుతూ ఉంటారు. ప్రముఖ లగ్జరీ బ్రాండ్ బ్యాగ్స్ ధరించి ది డియోర్ ఫాల్ 2023 షోలో పోజులిచ్చారు. డియోర్ అధికారిక వెబ్సైట్లో ప్రస్తుతానికి ఈ బ్యాగు అందుబాటులో లేనప్పటికీ వీరిద్దరూ ధరించిన ఈ బ్యాగు ధర భారత కరెన్సీలో సుమారుగా రూ. 21 లక్షల 6 వేలు. (కేవీపీ పెట్టుబడి డబుల్ ధమాకా: పదేళ్లదాకా ఆగాల్సిన పనిలేదు! ) లగ్జరీ దిగ్గజం క్రిస్టియన్ డియోర్ లేటెస్ట్ ఈవెంట్ ఇటీవల ముంబైలోని గేట్‌వే ఆఫ్ ఇండియాలో జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఫ్యాషన్ షోకు అనుష్క శర్మ , విరాట్ కోహ్లీ, సోనమ్ కపూర్, శోభితా ధూళిపాలా, మీరా రాజ్‌పుత్, అనన్య పాండే, ఖుషీ కపూర్, కరిష్మా కపూర్, డయానా పెంటీ, ఆథియా శెట్టి లాంటి సెలబ్రిటీలు హాజరైనారు. ఇంకా హర్ష్ వర్ధన్ కపూర్, అనితా ష్రాఫ్ అడజానియా, శ్వేతా బచ్చన్, అర్జున్ కపూర్, మసాబా గుప్తా, నటాషా పూనావల్లా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరితోపాటు బ్రిడ్జర్టన్ స్టార్ సిమోన్ ఆష్లే, నటుడు పూర్ణ జగన్నాథన్, సంగీత విద్వాంసురాలు అనౌష్క శంకర్ ఇతరజాతీయ అంతర్జాతీయ ప్రముఖులు ఫ్యాషన్ ఈవెంట్లో సందడి చేశారు. View this post on Instagram A post shared by Dior Official (@dior) -
మరో 9 వేల మందికి పింక్ స్లిప్స్ సిద్ధం: రూ 2 వేల కోట్ల డీలే కారణమా?
సాక్షి, ముంబై: బిలియనీర్ ముఖేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కూడా భారీ ఎత్తున ఉద్యోగాలపై వేటు వేస్తున్న సంస్థల జాబితాలో చేరి పోయింది. ఇషా అంబానీ నేతృత్వంలోని జియో మార్ట్ ఇటీవల 1000 మంది ఉద్యోగులను తొలగించింది. ఇది చాలదన్నట్టు మరో 9 వేలమందిని తొలగించేందుకు యోచిస్తోందట. ఇటీవల చేసుకున్న 28 వేల కోట్ల డీల్ తరువాత ఈనిర్ణయం తీసుకుందని అంచనా. (Meta Layoffs ఇండియాలోని టాప్ ఎగ్జిక్యూటివ్‌లకు షాక్!) తాజా నివేదికల ప్రకారం, రిలయన్స్ రిటైల్ 15వేల మంది సిబ్బందిలో మూడింట రెండు వంతుల మందికి పింక్ స్లిప్ ఇవ్వాలని కంపెనీ భావిస్తోంది. ఇందులో భాగంగాఇప్పటికే వెయ్యిమందిని తొలగించింది. వీరిలో 500 మంది కార్పొరేట్ ఉద్యోగులే. ఇక మలిరౌండ్లో మరో 9000 మందిని రిజైన్ చేయాల్సిందిగా కోరనుంది. అంతేకాదు వేలాది మంది ఉద్యోగులను పనితీరు మెరుగుదల పథకం (పిఐపి) కిందికి తీసుకు రానుంది. మొత్తం సేల్స్, మార్కెటింగ్ టీమ్ సాలరీ స్ట్రక్చర్‌ని వేరియబుల్ పే స్ట్రక్చర్‌కు మార్చి వేసిందని ఎకనామిక్స్ టైమ్స్ నివేదించింది. తన ఖర్చులను తగ్గించడం ద్వారా తన లాభాలను ఏకీకృతం చేయాలనుకుంటోంది. (సూపర్ ఫీచర్లతో లెనోవో కొత్త ట్యాబ్: ధర రూ.15 వేల లోపే) రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ ఇటీవలే మెట్రో క్యాష్ అండ్ క్యారీకి చెందిన 31 స్టోర్లను రూ.2,850 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతోపాటు 3500 మంది ఉద్యోగులను కూడా తీసుకుంది. రిలయన్స్ రిటైల్ 2022-2023 నాలుగో త్రైమాసికంలో రూ. 2415 కోట్ల లాభాన్ని సాధించింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 12.9 శాతం పుంజుకుంది. ఇలాంటి బిజినెస్ న్యూస్ అప్డేట్స్, ఇంట్రస్టింగ్ కథనాల కోసం చదవండి సాక్షిబిజినెస్ -
ఇషా అంబానీ ఇండియాకు తీసుకురానున్న చైనా బ్రాండ్ ఇదే..
Shein India: అపర కుబేరుడు, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కుమార్తె 'ఇషా అంబానీ' గురించి అందరికి తెలుసు. వ్యాపార రంగంలో తండ్రికి తగ్గ తనయురాలిగా పేరు తెచ్చుకున్న ఈమె త్వరలో భారతదేశానికి చైనీస్ ఫ్యాషన్ బ్రాండ్ 'షీన్' (Shein) తీసుకురావడానికి కావలసిన అన్ని ఏర్పాట్లను సిద్ధం చేస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. సుమారు మూడేళ్ల తర్వాత షీన్ను ఇండియాకు తీసుకురావడానికి ఇషా అంబానీ సిద్ధమైంది. ఇండియాకు తిరిగి రావడానికి షీన్ రిలయన్స్ రిటైల్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. సరసమైన ధరలో ట్రెండింగ్ అండ్ స్టైలిష్ దుస్తుల కోసం చూస్తున్న మహిళలకు షీన్ ఒక మంచి షాపింగ్ ప్లాట్‌ఫారమ్. ఈ బ్రాండ్ అతి తక్కువ కాలంలోనే మంచి ఆదరణ పొందగలిగింది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల 2020 జూన్‌లో ఈ కంపెనీ భారతదేశంలో నిషేధానికి గురైంది. అయితే సుదీర్ఘ సమయం తరువాత మళ్ళీ దేశీయ మార్కెట్లో అడుగుపెట్టడానికి సిద్ధమవుతోంది. 2020లో నిషేదానికి గురైన సమయంలో కూడా బ్రాండ్ ప్రోడక్ట్స్ ఢిల్లీ వంటి ప్రముఖ నగరాల్లో ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ అమెజాన్ ద్వారా ఢిల్లీ కోర్టు నోటీస్ జారీ చేసే వరకు అమ్ముడవుతూనే ఉన్నాయి. నిజానికి రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో షీన్ బ్రాండ్ ఒప్పందం కుదుర్చుకున్న తరువాత ఒకదానితో ఒకటి ప్రయోజనం పొందుతాయి. (ఇదీ చదవండి: ఈ చెట్ల పెంపకం మీ జీవితాన్ని మార్చేస్తుంది - రూ. కోట్లలో ఆదాయం పొందవచ్చు!) రిలయన్స్ రిటైల్ భాగస్వామ్యంలో ఇప్పటికే జిమ్నీ చూ, జార్జియా అర్మానీ, హ్యూగో బాస్, వెర్సస్, మైఖేల్ కోర్స్, బ్రూక్స్ బ్రదర్స్, అర్మానీ ఎక్స్చేంజ్, బర్బెర్రీ వంటి బ్రాండ్స్ ఉన్నాయి. ఈ జాబితాలో షీన్ కూడా త్వరలోనే చేరే సూచనలు కనిపిస్తున్నాయి. 2022లో రిలయన్స్ రిటైల్‌కు కొత్త లీడర్‌గా ఎంపికయ్యే సమయాన్ని బ్రాండ్ నికర విలువ రూ. 2కోట్లు, అయితే ఇప్పుడు బ్రాండ్ విలువ ఏకంగా రూ. 4 కోట్లకు చేరింది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. -
రిలయన్స్ - మెట్రో డీల్ పూర్తి.. వేల కోట్లు పెట్టి కొనుగోలు చేసిన ఇషా అంబానీ!
న్యూఢిల్లీ: భారత్‌లో తమ వ్యాపార విభాగాన్ని రిలయన్స్ రిటైల్ వెంచర్స్ (ఆర్ఆర్వీఎల్)కు విక్రయించే ఒప్పంద ప్రక్రియ పూర్తయినట్లు జర్మనీ రిటైల్ సంస్థ మెట్రో తెలిపింది. ఈ డీల్ కింద 31 హోల్‌సేల్ స్టోర్లు, మొత్తం రియల్ ఎస్టేట్ పోర్ట్‌ఫోలియో ఉన్నట్లు వివరించింది. వ్యాపార బదిలీ ప్రక్రియ జరిగే సమయంలో మెట్రో ఇండియా స్టోర్లన్నీ అదే బ్రాండ్‌తో కొనసాగుతాయని, ఉద్యోగులు.. కస్టమర్ల విషయంలో పెద్ద మార్పులేమీ ఉండబోవని సంస్థ పేర్కొంది. భారత్‌లో మెట్రో కార్యకలాపాలను రూ. 2,850 కోట్లకు కొనుగోలు చేస్తున్నట్లు ఆర్ఆర్వీఎల్ గతేడాది డిసెంబర్ 22న ప్రకటించింది. ఇప్పటికే భారీగా కార్యకలాపాలు విస్తరిస్తున్న ఆర్ఆర్వీఎల్.. తాజాగా మెట్రో కొనుగోలుతో దేశీయంగా రిటైల్ రంగంలో మరింత పట్టు సాధించనుంది. గత ఆర్థిక సంవత్సరంలో ఆర్ఆర్వీఎల్ రూ. 2.30 లక్షల కోట్ల ఆదాయం ఆర్జించింది. అటు మెట్రో ప్రపంచవ్యాప్తంగా 30 దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో 29.8 బిలియన్ యూరోల అమ్మకాలు నమోదు చేసింది. మెట్రో కొనుగోలుతో.. ఇప్పటికే రిలయన్స్ జియో మార్ట్, రిలయన్స్ ట్రెండ్స్, స్మార్ట్ బజార్ పేర్లతో ఇప్పటికే రిటైల్ మార్కెట్లో ఉన్న రిలయన్స్ రిటైల్.. మెట్రో ఇండియా కొనుగోలుతో తన వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు దోహదపడనున్నట్లు మార్కెట్ విశ్లేషకులు అంచనా. కాగా, మెట్రో కొనుగోలులో రిలయన్స్ రిటైల్ డైరెక్టర్ ఇషా అంబానీ చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. రిలయన్స్‌కు మూలస్తంభాల్లా.. రిలయన్స్ సామ్రాజ్యానికి ముగ్గురు వారసులు మూలస్తంభాల్లా నిలుస్తున్నారు. తండ్రి నుంచి పుణికి పుచ్చుకున్న వ్యాపార వారసత్వాన్ని తమదైన వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. ఇక, గత ఏడాది రిలయన్స్ రిటైల్ బాధ్యతలు తన కూతురు ఇషా అంబానీకి,రిలయన్స్ జియో బాధ్యతలు తన పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీకి,సోలార్ ఎనర్జీకి సంబంధించిన విభాగం మరో కుమారుడు అనంత్ అంబానీకి ముఖేష్ అంబానీ దంపతులు అప్పగించిన విషయం తెలిసిందే. -
మెట్‌గాలా 2023: ప్రియాంక చోప్రా నెక్లెస్ ధర తెలిస్తే షాకవుతారు!
న్యూఢిల్లీ: న్యూయార్క్‌లో అంతర్జాతీయ అతిపెద్ద ఫ్యాషన్ ఈవెంట్ మెట్‌గాలా 2023లో తారలు సందడి గురించి ప్రత్యేకంగాచెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, తొలిసారి భర్త నిక్ జోనాస్ స్టైలిష్‌గా కనిపించారు. ఈ సందర్భంగా ఆమె ధరించిన ఖరీదైన డైమండ్ నెక్లెస్ హాట్‌టాపిక్‌గా నిలిచింది. మెట్‌గాలా 2023లో ప్రియాంక చోప్రా ప్రముఖ డిజైనర్ వాలెంటినో రూపొందించిన సెక్సీ బ్లాక్ గౌనులో చూపరులను కట్టి పడేసింది. ముఖ్యంగా బల్గారీకి చెందిన 11.6 క్యారెట్ డైమండ్ నెక్లెస్‌ను ధరించింది. ఈ డైమండ్ నెక్లెస్ విలువ రూ. 204 కోట్లు అని వార్త హల్చల్ చేస్తోంది. మరోవైపు ఈ ఈవెంట్ తర్వాత 25 మిలియన్ల బల్గేరియో ఫీషియల్ నెక్లెస్ వేలం వేయనున్నారు. (Realme 5th Anniversary Sale:స్మార్ట్ఫోన్లు, టీవీలు, ల్యాప్‌టాప్‌లపై భారీ ఆఫర్) ప్రియాంక మూడోసారి ఈ ఈవెంట్లో తళుక్కు మనగా, తొలిసారిగా భర్తతలో కలిసి సందడి చేసింది. ఇద్దరూ బ్లాక్ అండ్‌వైట్ వాలెంటినో దుస్తుల్లో అలరించారు. ప్రియాంక ఇటీవల విడుదలైన యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన అమెరికన్ వెబ్ సిరీస్‌కు సిరీస్ సిటాడెల్కు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. మెట్ గాలా రెడ్ కార్పెట్‌పై అలియా భట్ అరంగేట్రంతో ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేసింది. అంతేకాదు రిలయన్స్అధినేత కుమార్తె ఇషా అంబానీ ప్రబల్ గురుంగ్ డిజైన్ చేసిన డిజైనర్ దుస్తుల్లో మెరిసిపోయారు. ఇంకా ఫ్లోరెన్స్ పగ్, అన్నే హాత్వే, జారెడ్ లెటోరా కిమ్ కర్దాషియాన్, జెన్నిఫర్ లోపెజ్, నవోమి కాంప్‌బెల్ తదితరులు హాజరయ్యారు. ప్రపంచంలోని అత్యుత్తమ ఫ్యాషన్ షోలలో ఒకటి 'మెట్ గాలా'. ఈ ఈవెంట్లో ఫ్యాషన్ దుస్తులపై ఫోకస్ చేస్తారు. ఈ సంవత్సరం థీమ్ ఫ్యాషన్ డిజైనర్ 2019లో మరణించిన ప్రసిద్ధ జర్మన్ ఫ్యాషన్ డిజైనర్ కార్ల్ లాగర్ఫెల్డ్. ఆయనకు ఈ ఈవెంట్ ఘన నివాళులర్పించింది. (దుర్భర జైలు జీవితం, భార్యతో విడాకులు.. అయినా వేల కోట్ల కంపెనీ!) Her $25 million @Bulgariofficial necklace is going to be auctioned off after #MetGala @priyankachopra pic.twitter.com/LK0otVUHea — SAMBIT ⚡ (@GirlDontYell) May 2, 2023 -
మెట్ గాలా 2023: నిండైన శారీ గౌన్‌లో ఇషా అంబానీ.. దేవకన్యలా అలియా (ఫొటోలు)
మెట్ గాలా 2023: నిండైన శారీ గౌన్‌లో ఇషా అంబానీ.. దేవకన్యలా అలియా (ఫొటోలు -
లగ్జరీ ఇంట్లో పార్టీ ఇచ్చిన ఇషా అంబానీ.. వీడియో, ఫొటోలు వైరల్!
దేశంలోనే అత్యంత సంపన్నుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ తనయ ఇషా అంబానీ తరచుగా వార్తల్లో నిలుస్తోంది. ఫ్యాషన్ పరంగా తనకంటూ ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకుంది. అంబానీ కుటుంబంలోని ఇతర సభ్యుల్లాగే ఇషా అంబానీ కూడా చాలాగా హుందా ఉంటుంది. సాంప్రదాయ మూలాలను ఇష్టపడుతుంది. (Dulquer Salmaan: రూ.3 కోట్లు పెట్టి దుల్కర్ సల్మాన్ కొన్న కొత్త కారు ఏంటో తెలుసా?) ఇషా అంబానీ తన ఆనంద్ పిరమల్‌తో కలిసి ఉంటున్న తమ విలాసవంతమైన ఇంట్లో శుక్రవారం (ఏప్రిల్ 14) టుస్కానీ థీమ్‌తో పార్టీ ఇచ్చారు. ఈ పార్టీకి ఇషా అంబానీ సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. ఈ పార్టీకి సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సముద్ర తీరానికి దగ్గరలో వీరి లగ్జరీ నివాసం పేరు కరుణ సింధు. (నిలిచిపోయిన నెట్‌ఫ్లిక్స్.. సబ్స్క్రయిబర్ల పరేషాన్) ఈ పార్టీలో ఇషా అంబానీ ధరించిన పొడువాటి ఎరుపు రంగు గౌన్ అమితంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఇషా పెద్దగా మేకప్ లేకుండా సహజంగా కనిపించింది. ఇషా వేసుకున్న రెడ్ హ్యూడ్ అవుట్‌ఫిట్ షాప్ డోన్ అనే లేబుల్ నుంచి వచ్చింది. View this post on Instagram A post shared by Isha Ambani Piramal✨ (@_ishaambanipiramal) -
ఏం చెప్పారు సార్.. అల్లుడికి అంబానీ ఇచ్చిన సలహా ఏంటో తెలుసా?
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుటుంబం గురించి పరిచయం అక్కర్లేదు. దేశంలోనే సంపన్న కుటుంబం కావడంతో ఆ కుటుంబం గురించిన ప్రతి విషయంపైనా అందరికీ ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా సతీమణి నీతా అంబానీ, కుమారులు, కుమార్తె, అల్లుడు ఇలా ఎవరో ఒకరు వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. తన అల్లుడు, కుమార్తె ఇషా అంబానీ భర్త అయిన ఆనంద్ పిరమల్‌కు ముఖేష్ అంబానీ ఇచ్చిన సలహా వెలుగులోకి వచ్చింది. (అది ఆఫర్ లెటర్ కాదు.. ఫ్రెషర్లకు షాకిచ్చిన క్యాప్‌జెమినీ! కాస్త ఓపిక పట్టండి..) ఆనంద్ పిరమల్ భారతదేశంలోని అత్యంత సంపన్నులలో ఒకరైన అజయ్ పిరమల్ కుమారుడు. తన తండ్రి నిర్మించిన ఫార్మారంగ వ్యాపార సామ్రాజ్యాన్ని సోదరి నందిని పిరమల్‌తో కలిసి నడుపుతున్నాడు. ప్రస్తుతం వారి కుటుంబ నికర ఆస్తి విలువ దాదాపు రూ.24 వేల కోట్లు. ఆనంద్ పిరమల్ ముఖేష్ అంబానీకి అల్లుడు. ఇషా అంబానీని వివాహం చేసుకున్నాడు. అయితే ముఖేష్ అంబానీకి ఆనంద్ పిరమల్ ముందు నుంచే తెలుసు. దేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీ సలహాలను ఆనంద్ తీసుకునేవాడు. (ఫ్లిప్‌కార్ట్ సమ్మర్ సేల్: ఐఫోన్13పై రూ.10 వేలు డిస్కౌంట్!) ఆనంద్ పిరమల్, ఇషా అంబానీల వివాహం 2018లో జరిగింది. వారికి కవలలు జన్మించారు. వారి పేర్లు కృష్ణ, ఆదియా. పెళ్లికి ముందే వీరి కుటుంబాలు ఒకరికొకరు తెలుసు. ఆనంద్ పిరమల్ ముఖేష్ అంబానీతో చాలా సన్నిహితంగా ఉంటాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కెరియర్‌కు సంబంధించి ముఖేష్ అంబానీ తనకు ఏం సలహా ఇచ్చారో ఆనంద్ పిరమల్ బయటపెట్టాడు. క్రికెట్‌ను ముడిపెడుతూ అంబానీ ఇచ్చిన సలహా ఆసక్తికరంగా ఉంది. (తెలుగు రాష్ట్రాల్లో అటవీ సందర్శకులకు గుడ్ న్యూస్.. ఇక దూసుకెళ్లడమే!) తాను కన్సల్టింగ్ లేదా బ్యాంకింగ్ రంగంలోకి వెళ్లాలనుకుంటున్నట్లు ఆనంద్ ఒకసారి అంబానీకి చెప్పాడు. దానిపై అతని సలహా కోరాడు. దీనికి అంబానీ క్రికెట్‌ను ముడిపెడుతూ చక్కని సలహా ఇచ్చాడు. కన్సల్టెంట్‌గా ఉండటం అనేది క్రికెట్ చూడటం లేదా క్రికెట్ గురించి వ్యాఖ్యానించడం లాంటిదని, అదే పారిశ్రామికవేత్త కావడం అనేది క్రికెట్ ఆడటం లాంటిదని అంబానీ తనకు సలహా ఇచ్చారని పిరమల్ చెప్పారు. ఇది తనకు 20 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు చెప్పాల్సిందని, 25 ఏళ్ల వయసులో కాదని తాను అంబానీతో చమత్కరించిన్లు పేర్కొన్నారు. ఎవరీ ఆనంద్ పిరమల్? పిరమిల్ గ్రూప్ ఆర్థిక సేవలకు ఆనంద్ పిరమల్ నాయకత్వం వహిస్తున్నారు. అతని కంపెనీ గృహ రుణాలు, ఎస్ఎంఈ లోన్లు, నిర్మాణ ఫైనాన్స్ మొదలైనవాటిని అందిస్తుంది. అలాగే రియల్ ఎస్టేట్ విభాగానికి కూడా ఆయన నాయకత్వం వహిస్తున్నారు. పిరమల్ ఈ-స్వస్థ్య అనే ఆనంద్ స్థాపించారు. గ్రామీణ ఆరోగ్య సంరక్షణ సేవలు అందించే ఈ కంపెనీలో దాదాపు 2300 మంది ఉద్యోగులు, 140 మంది వైద్యులు ఉన్నారు. ఆనంద్ పిరమల్ హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ పట్టా పొందారు. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా నుంచి ఎకనామిక్స్‌లో గ్రాడ్యుయేషన్ చేశారు. 100 ఏళ్ల ఇండియన్ మర్చంట్ ఛాంబర్స్ యువజన విభాగానికి ఆనంద్ అతి పిన్న వయస్కుడైన అధ్యక్షుడు. (ఈషా అంబానీకి సరికొత్త వెపన్ దొరికిందా?) -
ఈషా అంబానీకి సరికొత్త వెపన్ దొరికిందా?
గత ఏడాది రిలయన్స్ రీటైల్ డైరక్టర్‌గా బాధ్యతల్ని చేపట్టిన ముఖేష్ అంబానీ కుమార్తె ఈషా అంబానీకి ఆర్ఎస్ సోధి (రూపిందర్ సింగ్ సోధి) రూపంలో సరికొత్త వెపన్ దొరికిందా? రిలయన్స్ రీటైల్ సామ్రాజ్యాన్ని మరింత విస్తరించేందుకు ఈషా అంబానీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారా? అంటే అవుననే అంటున్నాయి పరిశ్రమ వర్గాలు. కలిసి పనిచేయాలి. కలిసి సంబరాలు చేసుకోవాలి. రియలన్స్ కంపెనీ ఓ సందర్భంలో ఇచ్చిన స్లోగన్ ఇది. ఈ మాట రిలయన్స్ అధినేత కుటుంబానికి అతికినట్లు సరిపోతుంది. ధీరూబాయ్ సృష్టించిన వ్యాపారానికి వారసుడిగా వచ్చి సామ్రాజ్యంలా విస్తరించారు ముఖేష్. ఇప్పుడు అంబానీ ఫ్యామిలీలో థర్డ్ జనరేషన్ రిలయన్స్‌ను మరింత ముందుకు తీసుకువెళ్లడానికి వ్యూహాలు రచిస్తుంది ఈషా అంబానీ.. తండ్రికి తగ్గ తనయగా రిలయన్స్ రీటైల్ విభాగానికి రారాణిగా కొనసాగుతున్న ఈషా అంబానీ.. తండ్రికి తగ్గ తనయగా ఏ రంగంలోకి అడుగు పెట్టినా తన దైన మార్క్‌ను చూపిస్తూ మరిన్ని విజయాలు సాధించాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇందులో భాగంగా గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మేనేజిమెంట్ (జీసీఎంఎంఎఫ్నే అమూల్ (AMUL)గా పిలుస్తుంటారు) మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేసిన ఆర్ఎస్ సోధికి ఈషా అంబానీ రిలయన్స్ రీటైల్, ఎఫ్ఎంసీజీ విభాగానికి అడ్వైజర్ బాధ్యతలు అప్పగించనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఇదే జరిగితే టెలికాం రంగాన్ని జియో శాసించినట్లే.. రీటైల్ విభాగంలో రిలయన్స్ టార్చ్ బేరర్‌గా ఎదుగుతుందనే అభిప్రాయాలు వ్యక్త మవుతున్నాయి. ఆర్ఎస్ సోధి ఎవరు? ఆర్ఎస్ సోధి ఢిల్లీలో జన్మించారు. మున్సిపల్ స్కూల్లో విద్యనభ్యసించిన ఆయన ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్ ఆనంద్ (IIRMA) నుండి ఎంబీఏ పూర్తిచేశారు. అనంతరం అమూల్‌లో సీనియర్ సేల్స్ ఆఫీసర్‌గా చేరారు. 2010 జూన్‌లో కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌గా పదోన్నతి పొందారు. సోధీ హయాంలో అమూల్ ప్రపంచంలోని అతిపెద్ద పాలను ఉత్పత్తి చేసే కంపెనీలలో ఒకటిగా ఎదిగింది. 1982లో అమూల్ ఆదాయం రూ.121 కోట్లు ఉన్నప్పుడు కంపెనీలో చేరగా.. 2022-23 నాటికి ఆ సంస్థ ఆదాయం రూ.72,000 కోట్లు దాటింది. ఇలా ఇంతింతై వటుడింతై అన్నట్లు ఎదిగిన అమూల్ సామ్రజ్యంలో సోధీ బాధ్యతలు కీలకమనే చెప్పుకోవాలి. ముఖ్యంగా 'వరల్డ్స్ ఒరిజినల్ ఎనర్జీ డ్రింక్', అమూల్ ధూద్ పీతా హై ఇండియా వంటి ప్రకటనలతో కంపెనీని లాభాల బాట పట్టించడంలో సిద్ధహస్తులయ్యారు. కొరకరాని కొయ్యగా ‘కాంపా కోలా’ సాఫ్ట్ డ్రింక్ మార్కెట్‌ను శాసిస్తున్న కోకోకోలా, పెప్సికోకు చెక్ పెట్టేలా యాభై ఏళ్ల క్రితం అనతి కాలంలోనే మార్కెట్ అగ్రగామి బ్రాండ్‌గా ఎదిగిన ‘కాంపా కోలా’ హక్కులను రిలయన్స్ దక్కించుకుంది. ప్రత్యర్ధులకు కొరకరాని కొయ్యగా తయారైంది. అదే బాటలో ఇండియన్ డైరీ మార్కెట్‌ను శాంసించేలా రిలయన్స్ రీటైల్ విభాగానికి డైరక్టర్‌గా వ్యవహరిస్తున్న ఈషా అంబానీ ఆర్ఎస్ సోధీని నియమించుకోనున్నారు. కాగా, ప్రస్తుతం ఇండియన్ డైరీ మార్కెట్ వ్యాల్యూ రూ.13లక్షల కోట్లుగా ఉంది. 2027 నాటికి రూ.30 లక్షల కోట్లకు వృద్ది సాధించనుంది. రిలయన్స్ రిటైల్ రిలయన్స్ రిటైల్ (Reliance Retail) బిజినెస్ కింద రిలయన్స్ ఫ్రెష్, రిలయన్స్ స్మార్ట్, రిలయన్స్ స్మార్ట్ పాయింట్, జియో మార్ట్, రిలయన్స్ డిజిటల్, జియో స్టోర్, రిలయన్స్ ట్రెండ్స్, ప్రాజెక్ట్ ఈవ్, ట్రెండ్స్ ఫుట్‌వేర్, రిలయన్స్ జువెల్స్, హామ్లేస్, రిలయన్స్ బ్రాండ్స్, రిలయన్స్ కన్జ్యూమర్ బ్రాండ్స్, 7-ఇలెవన్ వంటి బ్రాండ్లు ఉన్నాయి. చదవండి👉 ముగ్గురు పిల్లలకు..చాలా తెలివిగా ముఖేష్ అంబానీ వీలునామా,ఇషాకు రీటైల్ బాధ్యతలు! -
కంపాకోలాతో కోకాకోలా,పెప్సికోకు గట్టి సవాల్ విసిరిన రిలయన్స్
-
సౌందర్య సంరక్షణ విభాగంలోకి రిలయన్స్ రిటైల్
న్యూఢిల్లీ: రిలయన్స్ రిటైల్ తాజాగా సౌందర్య, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల విభాగంలోకి ప్రవేశించింది. టిరా పేరిట రిటైల్ ప్లాట్‌ఫాంను ఆవిష్కరించింది. యాప్, వెబ్‌సైట్‌తో పాటు ముంబైలో తొలి టిరా రిటైల్ స్టోర్‌ను కూడా ప్రారంభించింది. 100 పైచిలుకు నగరాల్లో వీటిని ఏర్పాటు చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ బ్రాండ్‌తో రిలయన్స్ ఇకపై హెచ్‌యూఎల్, నైకా, టాటా, ఎల్వీఎంహెచ్ మొదలైన దిగ్గజాలతో పోటీపడనుందని పేర్కొన్నాయి. అన్ని వర్గాల వినియోగదారులకు మెరుగైన అంతర్జాతీయ, దేశీయ సౌందర్య సంరక్షణ బ్రాండ్లను అందుబాటులోకి తెచ్చేందుకు టిరా ఉపయోగపడగలదని రిలయన్స్ రిటైల్ వెంచర్స్ ఈడీ ఈషా అంబానీ తెలిపారు. ఆన్లైన్ మార్కెట్ డేటా రీసెర్చ్ సంస్థ స్టాటిస్టా ప్రకారం దేశీయంగా బ్యూటీ, పర్సనల్ కేర్ మార్కెట్ 2023లో 27.23 బిలియన్ డాలర్లుగా ఉండనుంది. ఇందులో 12.7 శాతం వాటా ఆన్లైన్ అమ్మకాల ద్వారా రానుంది. -
ఈషా అంబానీకి ఫోర్బ్స్ అవార్డు
న్యూఢిల్లీ: రిలయన్స్ రిటైల్ చైర్పర్సన్ ఈషా అంబానీ తాజాగా జెన్నెక్ట్స్ ఎంట్రప్రెన్యూర్ పురస్కారాన్ని దక్కించుకున్నారు. శుక్రవారం జరిగిన ఫోర్బ్స్ ఇండియా లీడర్షిప్ అవార్డులు 2023 కార్యక్రమంలో దీన్ని ప్రదానం చేశారు. ఆమెతో పాటు పలువురు పరిశ్రమ ప్రముఖులు కూడా పురస్కారాలు అందుకున్నారు. వీరిలో టైటాన్ ఎండీ సీకే వెంకటరామన్ ’సీఈవో ఆఫ్ ది ఇయర్’, మ్యాక్స్ హెల్త్‌కేర్ సీఎండీ అభయ్ సోయి ’ఎంట్రప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డులను దక్కించుకున్నారు. ఈషా అంబానీ 2008లో ఫోర్బ్స్ రూపొందించిన యువ బిలియనీర్ వారసురాళ్ల జాబితాలో రెండో స్థానంలో నిల్చారు. యేల్ యూనివర్సిటీ, స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో చదివారు. -
ముద్దుల మనవలకు అంబానీ బ్రహ్మాండమైన గిఫ్ట్: వీడియో వైరల్
సాక్షి,ముంబై: బిలియనీర్, రిలయన్స్చైర్మన్ ముఖేష్ అంబానీ, నీతా అంబానీ అమ్మమ్మ, తాతయ్యలుగా కవల మనవలకు బ్రహ్మాండమైన గిఫ్ట్ ఇచ్చారు. ఆకర్షణీయమైన ఐదడుగుల అల్ట్రా-లగ్జరీ క్లోసెట్ను బహుమతిగా ఇచ్చారు. మనవడు కృష్ణ మనవరాలు ఆదియా పుట్టిన సందర్భంగా గ్రాండ్‌గా పార్టీ ఇచ్చిన అంబానీ దంపతులు తాజాగా వారికిచ్చిన గిఫ్ట్ వైరల్‌గా మారింది. పాపులర్ మహిళా పారిశ్రామిక వేత్త, అంబారీ ఏకైక కుమార్తె ఇషా అంబానీ, వ్యాపార దిగ్గజం ఆనంద్ పిరమల్ దంపతులకు 2022 నవంబరులో కవల పిల్లలకు జన్మించిన సంగతి తెలిసిందే. ఈ కవలల కోసమే లగ్జరీ క్లోసెట్( కప్బోర్డ్)ను ప్రత్యేకంగా కస్టమైజ్ చేసి ఆకర్షణీయంగా తీర్చిదిద్దడం విశేషం. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎల్లో కలర్ రూంలో హాట్-ఎయిర్ బెలూన్లతో మేఘాల వాల్‌పేపర్‌తో ఆకట్టుకుంటోంది. అలాగే టెడ్డీ బేర్లు, ఆకర్షణీయమైన రంగుల కృత్రిమ పువ్వులు, రెండు స్పెషల్ బాక్స్లతోపాటు, ఒక గ్లోబ్, రెండు పాస్‌పోర్ట్‌లు, ఒక చిన్న విమానాన్ని కూడా ఇందులో పొందుపర్చారు. అలాగే కస్టమైజ్డ్ క్లోసెట్ డోర్ పైన "అడ్వెంచర్స్ ఆఫ్ ఆదియా అండ్ కృష్ణ" అని రాసి ఉండటం గమనార్హం. View this post on Instagram A post shared by Gifts Tell All (@giftstellall) -
చిన్నప్పుడే ఆ ఉద్యోగంపై మనసుపడిన ఇషా అంబానీ
అపరకుబేరుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త 'ముఖేష్ అంబానీ' గురించి గానీ, వారి కుటుంబం గురించి గానీ ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అయితే ముఖేష్ అంబానీ కుమార్తె 'ఇషా అంబానీ' గురించి కొంతమందికి తెలియకపోవచ్చు. చిన్నప్పుడు టీచర్ కావాలని కలలు కన్న ఈమె ఈ రోజు ఫ్యాషన్ ప్లాట్‌ఫారమ్ AJIO బోర్డులో మేనేజింగ్ డైరెక్టర్ స్థానంలో కూర్చుంది. ఇషా అంబానీ 1991 అక్టోబర్ 23న జన్మించింది. ఈమె ముఖేష్ అంబానీ, నీతా అంబానీల ఏకైక కుమార్తె. వీరికి ఆకాష్ అంబానీ, అనంత్ అంబానీ అనే ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. ఆకాష్ అంబానీ శ్లోకా మెహతాను పెళ్లి చేసుకున్నారు, అనంత్ అంబానీకి ఇటీవల రాధిక మర్చంట్‌తో నిశ్చితార్థం జరిగింది. ముంబైలోని ధీరుభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ నుండి పాఠశాల విద్యను ప్రారంభించిన ఇషా అంబానీ అమెరికాలోని యేల్ విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేసింది. (ఇదీ చదవండి: టాటా కార్లు కొనేవారికి శుభవార్త.. ఆకర్షణీయమైన డిస్కౌంట్స్, అంతకుమించిన బెనిఫిట్స్) 23 సంవత్సరాల వయసులో తండ్రి వ్యాపారంలో చేరిన ఇషా 2020లో రిలయన్స్ రిటైల్, రిలయన్స్ జియో బోర్డులలో ఒకరుగా నిలిచింది. ఆ తరువాత ఆనంద్ పిరమల్‌ను వివాహం చేసుకుని, ఈ రోజు ఇషా అంబానీ ముంబైలో 450 కోట్ల రూపాయలు విలువ చేసే బంగ్లాలో నివసిస్తున్నారు. -
ఇషా అంబానీ దూకుడు: శ్రీలంక కంపెనీతో డీల్, వాటికి బిగ్ షాకే!
సాక్షి,ముంబై: రిలయన్స్ మరో వ్యాపారంలోకి అడుగుపెడుతోంది. ఆయిల్‌నుంచి టెలికాం దాకా అడుగుపెట్టిన ప్రతీ రంగంలోనూ దూసుకుపోతున్న రిలయన్స్ త్వరలోనే ఇండియా బిస్కెట్ల వ్యాపారంలోకి ప్రవేశించనుంది. ఇందుకోసం శ్రీలంక ఆధారిత మాలిబాన్ బిస్కెట్ మాన్యుఫాక్టరీస్ (ప్రైవేట్) లిమిటెడ్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. మాలిబాన్తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్లు రిలయన్స్ ఎఫ్ఎంసీజీ విభాగం రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (RCPL) తెలిపింది. దేశీయ, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన వినియోగదారు బ్రాండ్‌ను ఇండియాకు తీసుకురావడమే లక్ష్యమని తెలిపింది. ఇందులో భాగంగానే మాలిబన్ బిస్కెట్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పేర్కొంది. అయితే దేశీయ బిస్కెట్ల మార్కెట్లో 80 శాతం వాటా ఉన్న దిగ్గజాలు బ్రిటానియా,ఐటీసీ, పార్లేకు గట్టిపోటీ ఇవ్వనుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. దీనిపై రిలయన్స్ రిటైల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇషా అంబానీ సంతోషం ప్రకటించారు. తమ ఎఫ్ఎంసీజీ పోర్ట్‌ఫోలియోను గొప్ప బ్రాండ్ ద్వారా బలోపేతం చేయడమే కాకుండా, తమ వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తుల ద్వారా అద్భుత సేవలందించ గలుగుతామన్నారు. కాగా ఏడాది డిసెంబరులో గుజరాత్లో మేడ్-ఫర్-ఇండియా కన్స్యూమర్ ప్యాకేజ్డ్ గూడ్స్ బ్రాండ్ ‘ఇండిపెండెన్స్’ ను ప్రారంభించిన సంగతి తెలిసిదే. RCPLతో భాగస్వామ్యంపై మాలిబాన్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ కుముదిక ఫెర్నాండో మాట్లాడుతూ, “రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ మాలిబన్‌తో భాగస్వామ్యాన్ని ఎంచు కోవడం సంతోషమని, దాదాపు 70 సంవత్సరాలుగా అత్యున్నత నాణ్యతా ప్రమాణాలను కొనసాగించడంలోతమ అంకితభావానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. 1954లో స్థాపితమైన మాలిబాన్ శ్రీలంకలో రెండవ అతిపెద్ద బిస్కెట్ కంపెనీగా పాపులర్. బిస్కెట్లు, క్రాకర్లు, కుకీలు, ఇతర ఉత్పత్తులను 35 దేశాలకు ఎగుమతి చేస్తోంది. -
తాతైన ముఖేష్ అంబానీ
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తాతయ్యారు. అంబానీ కుమార్తె ఇషా అంబానీ కవల పిల్లలకు జన్మనిచ్చారు. ఇషా అంబానీ, ఆమె భర్త ఆనంద్ పిరమల్..నవంబర్ 19న కవల పిల్లలకు జన్మనిచ్చారంటూ..ఈ మేరకు అంబానీ, పిరమల్ కుటుంబాలు అధికారికంగా ప్రకటనను విడుదల చేశాయి. ఇషాకు పుట్టిన కవల పిల్లలో..ఒక పాప, బాబు ఉన్నారు. పాపకు ఆదియా అని పేరు పెట్టగా, బాబుకు కృష్ణ అని పేర్లు పెట్టినట్టుగా ఆ ప్రకటనలో పేర్కొన్నాయి. కాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ,నీతూ అంబానీల కుమార్తె ఇషా అంబానీ..పారిశ్రామికవేత్త అజయ్ పిరమల్, స్వాతి పిరమల్ కుమారుడు ఆనంద్ పిరమల్‌ల వివాహం 2018 డిసెంబర్లో జరిగింది. ప్రస్తుతం ఇషా అంబానీ రిలయన్స్ రిటైల్ వెంచర్స్‌కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తుండగా ఆమె భర్త ఆనంద్ పిరమల్.. పిరమల్ గ్రూప్ ఆర్థిక సేవల వ్యాపారాలను నిర్వహిస్తున్నారు. చదవండి👉 ముగ్గురు పిల్లలకు..చాలా తెలివిగా ముఖేష్ అంబానీ వీలునామా! -
పెప్సీ, కోకా-కోలాకు రిలయన్స్ షాక్: కాంపా కోలా రీఎంట్రీ
సాక్షి,ముంబై: ఎఫ్ఎంసీజీ రంగంలోకి ఎంట్రీ ఇస్తున్న రిలయన్స్ఇండస్ట్రీస్ ఒకప్పటి పాపులర్ కూల్ డ్రింక్ కాంపా కోలాను తీసుకురానుందట. ఈ విస్తృత వ్యూహంలో భాగంగానే ఢిల్లీకి చెందిన ప్యూర్ డ్రింక్స్ గ్రూప్ నుంచి దాదాపు రూ. 22 కోట్లకు కాంపా, సోస్యో అనే సాఫ్ట్ డ్రింక్ బ్రాండ్లను రిలయన్స్ కొనుగోలు చేసిందని ది ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. రిటైల్ విభాగం ఎఫ్ఎంసిజి విభాగంలోకి అడుగుపెట్టబోతున్నట్లు ప్రకటించిన కొద్ది రోజుల తర్వాత ఈ కొనుగోలు వార్త ప్రముఖంగా నిలిచింది. ముఖ్యంగి దిగ్గజాలైన కోకా-కోలా, పెప్సీకో లాంటి కంపెనీలకు షాకిచ్చేలా దీన్ని తిరిగి లాంచ్ చేయనుందిని తెలుస్తోంది. దీపావళి సందర్భంగా అక్టోబర్‌లో ఈ బ్రాండ్లను లాంచ్ చేయడానికి కంపెనీ సిద్ధంగా ఉంది. ఎఫ్ఎంసీజీ మార్కెట్లోకి దూసుకొస్తున్న రిలయన్స్ దాదాపు రెండు డజన్ల బ్రాండ్లను ఇప్పటికే గుర్తించిందనీ, వీటిని జాయింట్ వెంచర్‌గా కొనుగోలు చేయనుందని ఈటీ రిపోర్ట్ చేసింది. ఎడిబుల్ ఆయిల్, సోప్ బ్రాండ్ తదితర కంపెనీలతో చర్చలు జరుపుతోందని ప్రస్తుతం అందుకు సంబంధించిన కసరత్తు జరుగుతోందని తెలిపింది. తాజా రిపోర్టు ప్రకారం రిలయన్స్ రిటైల్ స్టోర్లు, జియోమార్ట్, కిరానా స్టోర్లలో కొనుగోలుకు కాంపాకోలా డ్రింక్ అందుబాటులో ఉంచనుంది. నిమ్మ, నారింజ రుచులలో పునఃప్రారంభించనుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఒకపుడు కోలా వేరియంట్ కాంపా కోలాతో మార్కెట్ లీడర్‌గా ఉండేది ఐకానిక్ కోలా.1990ల నుంచి క్రమంగా కనుమరుగై పోయింది. (Anand Mahindra వీడియో వైరల్: లాస్ట్ ట్విస్ట్ ఏదైతో ఉందో..) ఎఫ్ఎంసీజీ మార్కెట్లోకి ప్రవేశించనున్నామని ఇటీవల జరిగిన రిలయన్స్ 45వ వార్షిక సర్వసభ్య సమావేశంలో రిలయన్స్ రిటైల్ డైరెక్టర్ ఇషా అంబానీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే మెటా, జియో మార్ట్ భాగస్వామ్యంతో వాట్సాప్‌లో రిలయన్స్ రిటైల్ సేవలను వివరించారు. కేవలం కొన్ని నిమిషాల్లో వాట్సాప్ ద్వారా కిరాణా సామాగ్రిని ఆర్డర్ చేయవచ్చని ఆమె వివరించారు. (Benda V302C: కీవే కొత్త బైక్ చూశారా? ధర సుమారు రూ. 4 లక్షలు) కాగా 1990లలో, పార్లే అభివృద్ధి చేసిన శీతల పానీయాల బ్రాండ్లతో పాటు, థమ్స్ అప్, గోల్డ్ స్పాట్, లిమ్కా మార్కెట్లో కాంపా ఆధిపత్యం చెలాయించింది. అయితే, కోకా-కోలా తన రీ-ఎంట్రీలో మూడు పార్లే బ్రాండ్లను కొనుగోలు చేసిన తర్వాత, కాంపా పోటీ పడలేక మార్కెట్ నుంచి తప్పుకుంది. ఆ తరువాత 2019లో మార్కెట్లోకి మళ్లీ ప్రవేశించేందుకు పదే పదే ప్రయత్నాలు చేసినా ఆర్థిక బలం లేకవిఫలమైంది. -
ముగ్గురు పిల్లలకు..చాలా తెలివిగా ముఖేష్ అంబానీ వీలునామా!
దేశంలోనే అత్యంత విలువైన కార్పొరేట్ గ్రూప్ రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అపర కుబేరుడు, రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ రిలయన్స్ గ్రూప్ రీటైల్ బాధ్యతల్ని కుమార్తె ఇషా అంబానీకి అప్పగించారు. రిలయన్స్ ఇండస్ట్రీ 45వ ఏజీఎం సమావేశంలో ముఖేష్ అంబానీ.. రిలయన్స్ రీటైల్ బాధ్యతల్ని ఇషా అంబానీకి అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. ముఖేష్ అంబానీ ప్రకటన అనంతరం రిలయన్స్ రీటైల్ నుంచి వాట్సాప్ ద్వారా ఆర్డర్లు చేయడం, పేమెంట్స్ చేయడంతో పాటు ఎఫ్ఎంసీజీ విభాగంలోకి అడుగుపెడుడుతున్నట్లు తెలిపారు. ప్రతి భారతీయుడికి హైక్వాలిటీ, తక్కువ ధరకే నిత్యవసర వస్తువుల్ని అందించేలా రీటైల్ విభాగాన్ని డెవలెప్ చేసినట్లు చెప్పారు. కాగా, సూపర్ మార్కెట్లు, కన్జూమర్ ఎలక్ట్రానిక్స్, గ్రోసరీ, ఫ్యాషన్, జ్యవెలరీ, ఫుట్‌వేర్, క్లాతింగ్ విభాగాలతోపాటు ఆన్లైన్ రిటైల్ వెంచర్ జియోమార్ట్‌ను రిలయన్స్ రిటైల్ విభాగంలోకి రానున్నాయి. ఆకాష్..ఈషా..అనంత్ ముకేష్ అంబానీ ముగ్గురు సంతానంలో ఆకాశ్, ఈషా కవలలుకాగా.. చిన్న కుమారుడు అనంత్. ఇప్పటికే ఈ ముగ్గురికి ముఖేష్ అంబానీ ఆస్తుల పంపకం ప్రక్రియను ముమ్మరం చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జూన్‌లో పెద్ద కొడుకు ఆకాశ్ ఎం.అంబానీకి టెలికం విభాగం రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ నిర్వహణ బాధ్యతల్ని కట్టబెట్టారు. ఇందుకు అనుగుణంగా టెలికం బోర్డు నుంచి వైదొలిగారు. తాజాగా ఇషా అంబానీకి రిటైల్ గ్రూప్ బాధ్యతల్ని అప్పగించారు. చిన్న కొడుకు ముఖేష్ అంబానీకి న్యూఎనర్జీ బిజినెస్ విభాగాన్ని అప్పగించే యోచనలో ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి శామ్ వాల్టన్ బాటలో ముఖేష్ అంబానీ రిలయన్స్ లక్షల కోట్ల విలువైన వ్యాపార సామ్రాజ్యం అన్నీ రంగాలలో విస్తరించి ఉంది. ఇదే వైభవం భవిష్యత్తులోనూ కొనసాగాలంటే పక్కా ప్లాన్, అంతకుమించిన వ్యూహం అవసరం. అందుకోసం కసరత్తు చేస్తున్న ముకేష్ అంబానీ..వాల్ మార్ట్ వ్యవస్థాపకుడు శామ్ వాల్టన్ నడిచిన బాటను ఫాలో కావాలన్న యోచనలో ఉన్నట్లుగా బ్లూంబర్గ్ కథనం పేర్కొంది. ఇందుకోసం ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ భాద్యతలను దానికి పూర్తిగా అప్పగించాలని ముఖేష్ అంబానీ చూస్తున్నారు. కొత్త సంస్థలో బోర్డు సభ్యులుగా ముకేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ, అతని ముగ్గురు పిల్లలు మరికొందరు కుటుంబ సభ్యులు ఉంటారు. ముఖేష్ అంబానీ సన్నిహిత సహచరులు రిలయన్స్ సామ్రాజ్యాన్ని పర్యవేక్షించే సంస్థ బోర్డులో స్థానం కల్పించానున్నట్లు బ్లూంబర్గ్ తన కథనంలో హైలెట్ చేసింది. -
మరో రంగంలోకి రిలయన్స్ సునామీ: దిగ్గజాలకు దిగులే!
సాక్షి,ముంబై: రిలయన్స్ జియో పేరుతో టెలికాం రంగంలో సునామీ సృష్టించిన ఆయిల్-టు-టెలికాం దిగ్గజం రిలయన్స్ త్వరలోనే మరో రంగంలో ఎంట్రీ ఇస్తోంది. రిటైల్ విభాగం, రిలయన్స్ రిటైల్ వ్యాపారంలో భారీ వృద్ధి తర్వాత ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (ఎఎఫ్ఎంసీజీ) విభాగంలోకి అడుగు పెట్టనునున్నామని రిలయన్స్ మెగా ఈవెంట్లో ప్రకటన వెలువడింది. కంపెనీ 45వ వార్షిక సర్వసభ్య సమావేశంలో రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ డైరెక్టర్ ఇషా అంబానీ ఈ విషయాన్ని వెల్లడించారు. హైక్వాలిటీ, సరసమైన ఉత్పత్తులను అభివృద్ధి, డెలివరీతో పాటు, మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే లక్ష్యంతో ఎఫ్ఎంసీజీ విభాగంలో అడుగుపెడుతున్నట్లు తెలిపారు .అలాగే కస్టమర్లకు షాపింగ్ అనుభవాన్ని మెరుగుపర్చే ఉద్దేశంతో 2021లో ప్రారంభించిన WhatsApp-JioMart భాగస్వామ్యం ఎలా పనిచేస్తుందో ప్రదర్శించి చూపించారు. ఇషా అంబానీ ఇంకా ఏమన్నారంటే.. ‘‘డిజిటల్ కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు ప్రతిరోజూ దాదాపు 6లక్షలకు ఆర్డర్లు డెలివరీ చేస్తున్నాం. ఇది గత సంవత్సరం కంటే 2.5 రెట్లు పెరిగింది. 260కి పైగా పట్టణాల్లో డెలివరీ చేస్తున్న జియోమార్ట్ ఆన్లైన్ గ్రోసరీ ఇండియా నంబర్ వన్ విశ్వసనీయ బ్రాండ్‌గా రేట్ సాధించింది. 42 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న మా స్టోర్ల సంఖ్యను 15,000కు పైగా పెంచడానికి ఈ ఏడాది 2,500 స్టోర్లను ప్రారంభించాం. స్టోర్ నెట్వర్క్ , మర్చంట్ పార్టనర్ల జోడింపు ద్వారా మరింత మంది కస్టమర్లు మా ఖాతాలో చేరుతున్నారు. రిలయన్స్ రిటైల్ రాబోయే ఐదేళ్లలో 7,500 పట్టణాలు, 3 లక్షల గ్రామాలకు సేవలందించాలనేది మా లక్ష్యం’’ అని ఇషా అంబానీ వెల్లడించారు. ప్రతి భారతీయుడి రోజువారీ అవసరాలను తీర్చే లక్క్ష్యంతో ఈ రంగంలోకి అడుగు పెడుతున్నట్టు ఆమె తెలిపారు. అంతేకాదు భారతదేశం అంతటా గిరిజనులు, ఇతర అణగారిన వర్గాలు ఉత్పత్తి చేసే నాణ్యమైన వస్తువుల మార్కెటింగ్ త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. తద్వారా ఆయా కమ్యూనిటీలకు ఉపాధి, వ్యవస్థాపకత కోసం లాభదాయకమైన అవకాశాలను అందించడమే కాకుండా, సాంప్రదాయ భారతీయ కళాకారులు, ముఖ్యంగా మహిళల అద్భుతమైన ప్రతిభ, నైపుణ్యం, వారి క్రియేటివిటీని సంరక్షించడంలో సహాయపడుతుందని భావిస్తున్నామన్నారు. తద్వారా రిలయన్స్ రిటైల్ హిందుస్తాన్ యూనిలీవర్, నెస్లే బ్రిటానియా వంటి ఎఫ్ఎంసిజి దిగ్గజాలకు గట్టి షాకే ఇవ్వనుంది. చదవండి: Reliance Industries AGM: జియో 5జీ కోసం 2 లక్షల కోట్ల పెట్టుబడి 'అల్ట్రా-అఫర్డబుల్' 5జీ స్మార్ట్‌ఫోన్ త్వరలో: ముఖేశ్ అంబానీ -
రిలయన్స్: అంబానీ కుమార్తె ఇషాకు బాస్‌గా ప్రమోషన్?
సాక్షి, ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) గ్రూప్ యాజమాన్యంలో తన వారసులకు బాధ్యతలను అప్పగించేందుకు భారీ మార్పులకు పారిశ్రామిక దిగ్గజం, బిలియనీర్ ముకేశ్ అంబానీ రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీకి టెలికం విభాగం రిలయన్స్ జియో చైర్మన్‌గా బాధ్యతలు అప్పగించారు. తాజాగా కుమార్తె ఇషాకు కూడా ప్రమోషన్ రానుంది. రిలయన్స్ రిటైల్ యూనిట్‌కు చైర్‌పర్సన్‌గా ఇషా ఎంపికైనట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ప్రకటన నేడు (బుధవారం) వెలువడనుందని అంచనా . ఆసియాలోని అత్యంత సంపన్న అంబానీ కుటుంబం వారసత్వ బాధ్యతల అప్పగింతలో ఒక ప్రణాళికతో ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా రిలయన్స్ రీటైల్ బిజినెస్ పగ్గాలను కుమార్తె ఈషా (30) చేతికి ఇవ్వనున్నట్లు పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం ఈమె రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్‌కి డైరెక్టర్‌గా ఉన్నారు. కాగా ముకేశ్, నీతా అంబానీ దంపతుల ముగ్గురు సంతానంలో ఆకాశ్, ఇషా ట్విన్స్ కాగా చిన్న కుమారుడు అనంత్. పిరమల్ గ్రూప్‌నకు చెందిన ఆనంద్ పిరమల్‌ను ఇషా వివాహం చేసుకున్న విషయం విదితమే. ఇషా యేల్ యూనివర్సిటీలో చదువుకున్నారు. -
ఆన్లైన్ కిరాణా బిజినెస్‌పై రిలయన్స్ భారీ డీల్..! ఏకంగా...!
దేశవ్యాప్తంగా ఆన్లైన్ కిరాణా వ్యాపారాన్ని మరింత వేగవంతం చేసేందుకుగాను ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన రిటైల్ చైన్ సంస్థ రిలయన్స్ రిటైల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్ డెలివరీ ప్లాట్‌ఫాం డంజోతో కలిసే పనిచేసేందుకు రిలయన్స్ రిటైల్ సిద్దమైంది. వాటాల కొనుగోలు....! ఆన్లైన్ కిరాణా డెలివరీ వ్యాపారంలో రిలయన్స్ రిటైల్ ఉనికిని విస్తరించేందుకుగాను ప్రముఖ ఆన్లైన్ డెలివరీ ప్లాట్‌ఫాం డంజోలో 25.8 శాతం వాటాలను రిలయన్స్ కొనుగోలుచేసినట్లు తెలుస్తోంది. ఈ డీల్ విలువ సుమారు రూ. 1,488 కోట్లు. తాజాగా రిలయన్స్ రిటైల్ నేతృత్వంలోని ఫండింగ్ రౌండ్లో డంజో సుమారు 240 మిలియన్ల డాలర్లను సేకరించింది. ఈ ఫండింగ్ రౌండ్లో ఇప్పటికే ఈ సంస్థకు ఇన్వెస్టర్లుగా ఉన్న లైట్‌బాక్స్, లైట్‌త్రాక్, 3ఎల్ క్యాపిటల్ , ఆల్టెరియా క్యాపిటల్ కూడా ఫండింగ్ రౌండ్లో పాల్గొన్నాయి. మరింత వేగవంతం..! డంజో భాగస్వామ్యంతో జియో మార్ట్, రిలయన్స్ రిటైల్ సేవలను మరింత వేగవంతంగా అందిస్తామని రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ డైరెక్టర్ ఇషా అంబానీ తెలిపారు. ఈ భాగస్వామ్యంతో డంజో తన సేవలను విస్తరించేందుకు ఎంతగానో ఉపయోగపడుతోందని కంపెనీ సహా వ్యవస్థాపకుడు కబీర్ బిశ్వాస్ అన్నారు. డంజో ఇప్పటివరకు భారత్‌లో 7 మెట్రో నగరాల్లో వేగవంతమైన డెలివరీ సేవలను అందిస్తోంది. కొద్ది రోజుల క్రితం డంజో డైలీ పేరుతో మరింత వేగవంతమైన డెలివరీ సేవలను ప్రారంభించింది. చదవండి: యూజర్ల ప్రైవసీతో చెలగాటం..! గూగుల్, మెటా సంస్థలకు దిమ్మతిరిగే షాక్..! -
నాయకత్వ మార్పిడి కసరత్తు నడుస్తోంది
న్యూఢిల్లీ: దేశంలో అత్యంత సంపన్నుడైన ముకేశ్ అంబానీ (64) తన వారసులకు ‘రిలయన్స్’ సామ్రాజ్యాన్ని అప్పగించే పనిని ప్రారంభించినట్టు ప్రకటించారు. తనతో సహా సీనియర్లతో కలసి ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. వారసత్వ ప్రణాళికల గురించి అంబానీ మాట్లాడడం ఇదే మొదటిసారి. ముకేశ్ అంబానీకి కవలలు ఆకాశ్, ఇషాతోపాటు అనంత్ ఉన్నారు. రిలయన్స్ కుటుంబ దినం సందర్భంగా ముకేశ్ అంబానీ మాట్లాడారు. రిలయన్స్ సామ్రాజ్య వ్యవస్థాపకుడు ధీరూభాయి అంబానీ వర్ధంతి నాడు కుటుంబ దినం జరుపుకుంటూ ఉంటారు. రానున్న సంవత్సరాల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రపంచంలోనే అత్యంత బలమైన, ప్రసిద్ధి చెందిన భారత బహుళజాతి సంస్థగా అవతరిస్తుందన్నారు. శుద్ధ, గ్రీన్ ఎనర్జీలోకి ప్రవేశించడంతోపాటు.. రిటైల్, టెలికం వ్యాపారాలతో అసాధారణ స్థాయికి రిలయన్స్ చేరుకుంటుందని చెప్పారు. సరైన నాయకత్వంతోనే సాధ్యం.. ‘‘పెద్ద కలలు, అసాధారణమనుకునే లక్ష్యాలు సరైన వ్యక్తులు, సరైన నాయకత్వంతోనే సాధ్యపడతాయి. రిలయన్స్ ఇప్పుడు ముఖ్యమైన, నాయకత్వ మార్పిడిలో ఉంది. సీనియర్లు అయిన నాతరం నుంచి.. యువ నాయకులైన తదుపరి తరానికి బదిలీ కానుంది. ఎంతో పోటీవంతమైన, ఎంతో అంకితభావం కలిగిన, అద్భుతమైన యువ నాయకత్వం రిలయన్స్‌లో ఉంది. మేము వారిని ప్రోత్సహించి నడిపించాలి. వారి వెనుకనుండి.. వారు మాకంటే మెరుగ్గా పనిచేస్తుంటే వెన్నుతట్టి ప్రోత్సహించాలి’’ అని అన్నారు. ఉన్నత శిఖరాలకు తీసుకెళతారు ‘‘ఆకాశ్, ఇషా, అనంత్ తదుపరి తరం నాయకులు. వారు రియలన్స్‌ను మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లే విషయంలో నాకు ఏ మాత్రం సందేహం లేదు. దిగ్గజ పారిశ్రామికవేత్త ధీరూభాయి అంబానీ మాదిరే వారిలోనూ ఎంతో చురుకుదనం, సామర్థ్యాలున్నాయి. రిలయన్స్‌ను మరింత విజయవంతంగా నడిపించాలని మనమందరం కోరుకుందాం’’ అని ముకేశ్ పేర్కొన్నారు. ప్రసంగంలో ఇషా భర్త ఆనంద్ పిరమల్, ఆకాశ్ భార్య శ్లోక, అనంత్‌కు కాబోయే భార్యగా ప్రచారంలో ఉన్న రాధిక పేర్లను అంబానీ ప్రస్తావించడం గమనార్హం. భవిష్యత్తుకు పునాది రాళ్లు రానున్న దశాబ్దాల్లో అపార అవకాశాలను సొంతం చేసుకునేందుకు వీలుగా రిలయన్స్ భవిష్యత్తు వృద్ధికి పునాదులు వేయాల్సిన సమయం ఇదేనని అంబానీ అన్నారు. ‘‘రిలయన్స్ తన స్వర్ణ దశాబ్దం రెండో భాగంలోకి అడుగుపెట్టింది. భవిష్యత్తు మరింత ప్రకాశవంతంగా ఉంటుందని చెప్పగలను. ప్రపంచ టాప్–3 ఆర్థిక వ్యవస్థల్లోకి భారత్ చేరుతుంది. రిలయన్స్ ప్రముఖ బహుళజాతి సంస్థగా అవతరిస్తుంది’’ అని అంచనాలను వ్యక్తీకరించారు. -
వాట్సాప్ ద్వారా నిత్యావసర సరుకులు డెలివరీ
నిత్యావసరాలు, కూరగాయలు మొదలైన వాటిని వాట్సాప్ ద్వారా ఆర్డరు చేస్తే ఇంటి వద్దకే అందించేలా రిటైల్ దిగ్గజం జియోమార్ట్ కొత్త సర్వీసు ప్రవేశపెడుతోంది. ఫ్యూయల్ ఫర్ ఇండియా పేరిట మెటా నిర్వహించిన కార్యక్రమంలో జియో ప్లాట్‌ఫామ్స్ డైరెక్టర్లు ఆకాశ్ అంబానీ, ఈషా అంబానీ దీన్ని ప్రయోగాత్మకంగా ప్రదర్శించారు. ‘బ్రెడ్, పండ్లు..కూరగాయలు, శీతలపానీయాలు ఇలా ఏ సరుకులైనా, ఆ రోజుకు కావాల్సినా లేక ఆ వారానికి కావాల్సినవైనా జియోమార్ట్‌కు వాట్సాప్ ద్వారా ఆర్డరు చేయొచ్చు. తరచుగా కావాలంటే సబ్స్క్రయిబ్ చేసుకోవచ్చు. మీ కొనుగోళ్ల చరిత్రను బట్టి వ్యక్తిగత సిఫార్సులు పొందవచ్చు‘ అని ఈషా అంబానీ పేర్కొన్నారు. ‘వాట్సాప్ ద్వారా కొనుగోలు ప్రక్రియ అత్యంత సరళంగా, సులభతరంగా ఉంటుంది‘ అని ఆకాశ్ తెలిపారు. రిలయన్స్ గ్రూప్‌లో భాగమైన రిలయన్స్ రిటైల్ నెట్వర్క్ ద్వారా ఆర్డర్ల డెలివరీ ఉంటుంది. దేశీయంగా రిటైల్ వ్యయాల్లో ఆహారం, కిరాణా సరుకుల వాటా భారీగా ఉంటుంది. 2025 నాటికి ఇది 1.3 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరవచ్చని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ అంచనా. జియోమార్ట్ నెట్‌వర్క్‌లో ప్రస్తుతం 5 లక్షల పైచిలుకు రిటైలర్లు ఉన్నారని, ఈ సంఖ్య గణనీయంగా పెరుగుతోందని ఆకాష్ వివరించారు. వాట్సాప్‌తో రీచార్జ్ కూడా.. టెలికం దిగ్గజం రిలయన్స్ జియో ప్రీపెయిడ్ యూజర్లు సైతం త్వరలో వాట్సాప్ ద్వారా రీచార్జి చేయించుకోవచ్చని ఆకాశ్ పేర్కొన్నారు. చెల్లింపులతో పాటు మొబైల్ రీచార్జింగ్లకు కూడా వాట్సాప్ ఉపయోగపడనుండటం ఆసక్తికరమని ఆయన తెలిపారు. 2022లో జియో ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టనుంది. రీచార్జింగ్ ప్రక్రియను ఇది మరింత సులభతరం చేస్తుందని, రీచార్జ్ వంటి అవసరాల కోసం బైటికి వెళ్లలేని సీనియర్ సిటిజన్లులాంటి వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఈషా అంబానీ తెలిపారు. 2021 సెప్టెంబర్ ఆఖరు నాటికి జియోకు 42.95 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. -
ఇక సులభంగా రిలయన్స్ జియో రీఛార్జ్ సేవలు..!
ముంబై: మెటా, రిలయన్స్ జియో చేతులు కలపడం వల్ల దేశీయంగా విప్లవాత్మక మార్పులు వస్తాయని జియో ప్లాట్‌ఫారమ్ లిమిటెడ్ డైరెక్టర్ ఆకాష్ అంబానీ అభిప్రాయపడ్డారు. జియో వినియోగదారులు తమ సబ్‌స్క్రిప్షన్‌ను వాట్సాప్ ఉపయోగించి రీఛార్జ్ చేసుకోవచ్చని బుధవారం తెలిపారు. మెటా ఫ్యూయల్ ఫర్ ఇండియా 2021 ఈవెంట్లో ఆకాష్ అంబానీ మాట్లాడుతూ.. రిలయన్స్ జియో, మెటా బృందాల పరస్పర సహకారంతో దేశంలో మరిన్ని మార్పులను వస్తాయని అన్నారు. "త్వరలో వాట్సాప్‌లో జియో వినియోగదారులకు 'ప్రీపెయిడ్ రీఛార్జ్' సేవలు అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. ఈ సేవలు అతి త్వరలో అందుబాటులోకి వస్తుంది" అని ఆయన చెప్పారు. ఈ ఫీచర్ 2022లో విడుదల కానుంది. జియో ప్లాట్‌ఫారమ్ డైరెక్టర్ ఇషా అంబానీ ఈ ఫీచర్ రీఛార్జ్ చేసే ప్రక్రియను మరింత సులభతరం చేస్తుందని పేర్కొన్నారు. ప్రత్యేకించి కొన్ని సమయాల్లో బయటికి వెళ్లడం కష్టంగా ఉండే వృద్ధులకు ఈ ఫీచర్ భాగ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.సెప్టెంబర్ 2021 త్రైమాసికం చివరి నాటికి రిలయన్స్ జియోకు 429.5 మిలియన్ల మంది వినియోగదారులు ఉన్నారు. (చదవండి: చైనాకు గట్టి షాక్!.. కీలక స్కీమ్‌కు కేంద్రం ఆమోదం) భారత దేశ ఆర్థిక వ్యవస్థకు ‘కిరాణా దుకాణాలు’ వెన్నెముక అని ఇషా అంబానీ అన్నారు. దేశంలో 40 కోట్ల మందికి వాట్సాప్ ద్వారా జియోమార్ట్‌ను అందుబాటులోకి వస్తుందన్నారు. తద్వారా రాబోయే రోజుల్లో కొనుగోళ్ల విషయంలో విప్లవాత్మక మార్పులు వస్తాయన్నారు. జియో రాకతో ఇంటర్నెట్ వినియోగం పెరిగిందని .. ఇది కంపెనీగా జియోకి కస్టమర్లకి ఎంతో ఉపయోగపడిందన్నారు. అదే పద్దతిలో జియోమార్ట్ వల్ల వినియోగదారులకు కొనుగులు ప్రక్రియ ఎంతో సులభం అవుతుందన్నారు. మెటా చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మార్నే లెవిన్ మాట్లాడుతూ.. భారతదేశం వేగంగా ఆవిష్కరణలకు గ్లోబల్ హబ్‌గా మారుతోందని.. అనేక ఇతర దేశాలు అనుసరించడానికి భారత్ దారి చూపుతుందని అన్నారు. (చదవండి: వర్క్ ఫ్రమ్ హోంపై ఐటీ కంపెనీల సంచలన నిర్ణయం..!) -
జియో మార్ట్‌తో విప్లవాత్మక మార్పులు - ఇషా అంబానీ
మెటా జియోమార్ట్ చేతులు కలపడం వల్ల దేశీయంగా విప్లవాత్మక మార్పులు వస్తాయని జియో ప్లాట్ఫార్మ్ డైరెక్టర్లు ఇషా అంబానీ, ఆకాశ్ అంబానీ అభిప్రాయపడ్డారు. మెటా ఛీప్ బిజినెస్ ఆఫీసర్ మార్నె లెవినేతో జరిగిన వర్చువల్ సమావేశంలో వారు అనేక విషయాలను చర్చించారు. భారత దేశ ఆర్థిక వ్యవస్థకు ‘కిరాణా దుకాణాలు’ వెన్నెముక అని ఇషా అంబానీ అన్నారు. దేశంలో 40 కోట్ల మందికి వాట్సాప్ ద్వారా జియోమార్ట్‌ను అందుబాటులోకి వస్తుందన్నారు. తద్వారా రాబోయే రోజుల్లో కొనుగోళ్ల విషయంలో విప్లవాత్మక మార్పులు వస్తాయన్నారు. జియో రాకతో ఇంటర్నెట్ వినియోగం పెరిగిందని .. ఇది కంపెనీగా జియోకి కస్టమర్లకి ఎంతో ఉపయోగపడిందన్నారు. అదే పద్దతిలో జియోమార్ట్ వల్ల వినియోగదారులకు కొనుగులు ప్రక్రియ ఎంతో సులభం అవుతుందన్నారు. వాట్సాప్‌లో మేసేజ్ చేస్తే చాలు పాలు, బిస్కట్, కూరగాయలు అన్ని ఇంటికే వస్తాయన్నారు. అంతేకాదు చెల్లింపులు సైతం వాట్సాప్ నుంచి చేయోచ్చన్నారు. -
ముఖేశ్ అంబానీ కూతురికి అరుదైన గౌరవం
Smithsonian’s National Museum: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ గారాల పట్టి ఇషా అంబానీకి అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన స్మిత్సోనియన్ నేషనల్ మ్యూజియం ఆఫ్ ఏషియన్ ఆర్ట్స్ బోర్డు సభ్యురాలిగా ఎంపికయ్యారు. 2021 సెప్టెంబరు 23 నుంచి నాలుగేళ్ల పాటు ఆమె ఈ పదవిలో కొనసాగుతారు. ఈ ట్రస్ట్ బోర్డులో ఇషా అంబానీయే అత్యంత పిన్న వయస్కురాలు. వందేళ్ల వేడుకలు స్మిత్సోనియన్ నేషనల్ మ్యూజియం ఆఫ్ ఏషియన్ ఆర్ట్స్‌ని 1923లో ప్రారంభించారు. రాబోయే 2023లో వందేళ్ల వేడుకలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ వేడుకలను నిర్వహించే బాధ్యత కొత్తగా ఎన్నికైన బోర్డు సభ్యుల మీదే ఉంది. ఇషా అంబానీ బోర్డు సభ్యురాలిగా చేరడంతో మ్యూజియం నిర్వాహాన మరింత బాగా ఉంటుందని చరిత్ర ప్రేమికులు నమ్ముతున్నారు. ప్రతిష్టాత్మక మ్యూజియం అమెరికాలో వాషింగ్టన్ డీసీలో ఉన్న స్మిత్సోనియన్ నేషనల్ మ్యూజియం ఆఫ్ ఏషియన్ ఆర్ట్స్‌లో అనేక అద్భుత కళాఖండాలు ఉన్నాయి. ఇందులో ఇండియా, మెసపోటనియా, జపాన్, చైనాలకు చెందిన 45,000లకు పైగా చారిత్రక చిత్రాలు, శిల్పాలు ఇక్కడ ఉన్నాయి. రాతి యుగం నుంచి నేటి అధునాత యుగం వరకు ఏషియా నాగరికతను పట్టిచ్చే కళాఖండాలు ఇక్కడ కొలువుతీరి ఉన్నాయి. -
మనీశ్ మల్హోత్రాతో రిలయన్స్ భారీ డీల్
Reliance Buys Manish Malhotra Stakes: వస్త్ర ప్రపంచంలో తన బ్రాండ్‌తో దూసుకుపోతున్న ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ బ్రాండ్స్ లిమిటెడ్.. భారీ ఒప్పందం దిశగా అడుగులు వేసింది. ప్రముఖ డిజైనర్ లేబుల్ ‘మనీశ్ మల్హోత్రా’లో 40 శాతం వాటా చేజిక్కించుకోబోతోంది. పదహారేళ్లుగా దేశం నుంచి ప్రపంచవ్యాప్తంగా పేరు విస్తరించుకున్న మనీశ్ మల్హోత్రా బ్రాండ్‌లో రిలయన్స్ మెజార్టీ వాటా కొనుగోలు చేయనుంది. మనీశ్ మల్హోత్రా బయటి కంపెనీతో ఒప్పందం చేసుకోవడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈ మేరకు మనీశ్‌తో ఒప్పందాన్ని గౌరవంగా భావిస్తున్నామని రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ డైరెక్టర్ ఇషా అంబానీ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఇక ఇప్పటికే ఢిల్లీ, హైదరాబాద్ లాంటి ప్రముఖ నగరాల్లో స్టోర్లను నడిపిస్తున్న మనీశ్ మల్హోత్రా.. దేశంలోనే మొదటి వర్చువల్ స్టోర్ తెరిచిన ఫీట్ సైతం సాధించారు. ‘భారత సంప్రదాయాల్ని ప్రతిబింబించేలా దుస్తుల్ని రూపొందించడం ఈ లేబుల్ ప్రత్యేకత. రియలన్స్తో ఒప్పందం ద్వారా దేశ, విదేశాలకు సేవలను విస్తరిస్తామ’ని ఈ సందర్భంగా మనీశ్ మల్హోత్రా(54) తెలిపారు. చదవండి: 14 ఏళ్లుగా ఆ జాబితాలో అగ్రస్థానంలో ముఖేష్ అంబానీ -
ప్రపంచంలో అత్యంత ఖరీదైన పెళ్లి.. ఏకంగా రూ.790 కోట్లు ఖర్చు
సాక్షి, వెబ్‌డెస్క్: దేశాలు, ప్రాంతాలతో సంబంధం లేకుండా మానవ సమాజంలో వివాహ వ్యవస్థ పెనవేసుకుపోయింది. రెండు మనసులను.. రెండు కుటుంబాలను.. మూడు ముళ్లతో పెనవేస్తుంది వివాహ బంధం. అందుకే ప్రతి ఒక్కరు తమ జీవితంలో పెళ్లికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. వివాహ వేడుక జీవితాంతం గుర్తిండిపోవాలని భావిస్తారు. అందుకోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనకాడరు. నిశ్చితార్థం వేడుక నుంచి పెళ్లి తంతు ముగిసేవరకు ప్రతి వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించుకోవాలని ఉవ్విళ్లురతారు. అందుకే తమ తమ స్థాయిలకు తగ్గట్లు.. కొన్ని సార్లు అంతకుమించే ఖర్చు చేస్తారు. అయితే కొన్ని పెళ్లి వేడుకలు ఖర్చు విషయంలో ఏకంగా చరిత్ర సృష్టించాయి. మరి ఆ వేడుకలు ఎక్కడ.. ఎవరింట జరిగాయి తదితర వివరాలు తెలియాలంటే ఇది చదవండి.. 1.ప్రిన్సెస్ డయానా-చార్లెస్ వివాహ వేడుక బ్రిటన్ రాజవంశంలోనే కాక.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వివాహ వేడుకగా నిలిచింది డయానా-చార్లెస్‌ల పెళ్లి. 1981లో జరిగిన వీరి వివాహ వేడుక కోసం మొత్తం నగరాన్ని లైట్లతో దేదీప్యమానంగా అలంకరించారు. అప్పట్లోనే వీరి పెళ్లి కోసం ఏకంగా 48 మిలియన్ డాలర్లు ఖర్చు చేశారు. ఇప్పటి లెక్కల్లో అది ఏకంగా 100 మిలియన్ డాలర్ల కన్న ఎక్కువ అనగా సుమారు 790 కోట్ల రూపాయలుగా ఉంటుంది. 2. వనిషా మిట్టల్-అమిత్ భాటియా వివాహం ప్రపంచ ఉక్కు రారాజు, ఇంగ్లండ్‌లోనే అత్యంత ధనవంతుడే కాక ప్రపంచ కుబేరుల జాబితాలో స్థానం సంపాదించుకున్న లక్ష్మి నివాస్ మిట్టల్ కుమార్తె వనిషా వివాహానికి ఏకంగా 55 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 408 కోట్లు) ఖర్చు చేశారు. 2004లో వనిషా-అమిత్ భాటియాల వివాహం పారిస్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. వీరి పెళ్లి 20వ శాతాబ్దపు అత్యంత ఖరీదైన వివాహ వేడుకగా చరిత్ర సృష్టించింది. 3. ప్రిన్స్ విలియం-కేట్ మిడిల్టన్ల పెళ్లి వేడుక ప్రపంచంలోనే మరో అత్యంత ఖరీదైన వివాహ వేడుక బ్రిటన్ రాజకుటుంబంలోనే జరిగింది. తల్లి డయానా బాటలోనే కుమారుడు ప్రిన్స్ విలియం వివాహం కూడా అత్యంత ఖరీదైన వేడుకగా నిలిచింది. ప్రిన్స్ విలియం-కేట్ మిడిల్టన్లు 29, ఏప్రిల్, 2011న వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి వేడుక కోసం 34 మిలియన్ డాలర్లు ఖర్చు చేశారు. మన కరెన్సీలో చెప్పాలంటే 244 కోట్ల రూపాయలన్నమాట. 4. ఇషా అంబానీ-ఆనంద్ పిరమాల్ వివాహం ఆసియా కుబేరుడు, భారతదేశపు అతిపెద్ద వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ వివాహ వేడుక ఎంత వైభవంగా జరిగిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దేశ విదేశాల నుంచి ప్రముఖులు, బాలీవుడ్ నటులు, రాజకీయ నాయకులు వీరి వివాహానికి అతిథులుగా హాజరయ్యారు. ఇషా-ఆనంద్ పిరమాల్‌ల వివాహం 12, డిసెంబర్, 2018 న జరిగింది. తన కుమార్తె వివాహం కోసం అంబానీ 100 మిలియన్ డాలర్లు ఖర్చు చేశారని వార్తలు వినిపించగా.. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, ఇషా-ఆనంద్ పిరమాల్‌ల వివాహ వ్యయం 15 మిలియన్ డాలర్లకు మించలేదని (దాదాపు 111 కోట్ల రూపాయలు) తెలిపింది. 5. లిజా మిన్నెల్లి-డేవిడ్ గెస్ట్‌ల వివాహం.. అమెరికన్ గాయని, నటి లిసా 2002 లో ఒక అమెరికన్ టీవీ షో నిర్మాత డేవిడ్ గెస్ట్‌ను వివాహం చేసుకున్నారు. ఆ సమయంలో వారిద్దరూ తమ వివాహానికి 3.5 మిలియన్ డాలర్లు (రూ .26 కోట్లు) ఖర్చు చేశారు. 6. ఎలిజబెత్ టేలర్-లారీ ఫోర్టెన్స్కీ హాలీవుడ్ ప్రసిద్ధ నటీమణులలో ఒకరైన ఎలిజబెత్ టేలర్ 1991 లో లారీ ఫోర్టెన్స్కీ అనే భవన నిర్మాణ కార్మికుడిని వివాహం చేసుకున్నారు. ఈ వివాహం ఎలిజబెత్ స్నేహితుడు, పాప్ మహారాజు మైఖేల్ జాక్సన్, నెవర్‌ల్యాండ్ రాంచ్లో జరిగింది. వీరి వివాహ వేడుక కోసం 1.5 నుంచి 2 మిలియన్ డాలర్లు (రూ. 11-14 కోట్లు) ఖర్చు చేశారు. అయితే, వివాహం అయిన 5 సంవత్సరాలకే వారు విడాకులు తీసుకున్నారు. -
ఫార్చ్యూన్ 40లో అంబానీ ట్విన్స్
సాక్షి, న్యూఢిల్లీ: రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ తరువాత అతని సంతానం కూడా తన ప్రత్యేకతను చాటుకుంటోంది. రిలయన్స్ జియో బోర్డు డైరెక్టర్లు ఇషా అంబానీ, ఆకాష్ అంబానీ (29) అరుదైన ఘనత సాధించారు. 2020 ఫార్చ్యూన్ 40 అండర్ 40 జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఫార్చ్యూన్ మేగజీన్ ప్రచురించిన ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావశీలురైన ′40 అండర్-40′ లో రిలయన్స్ చైర్మన్ బిలియనీర్ ముకేశ్ అంబానీ, నీతా అంబానీ ట్విన్స్ 28 ఏళ్ల ఇషా, ఆకాష్ నిలిచారు. టెక్నాలజీ జాబితాలో ఇషా అంబానీ, ఆకాష్ అంబానీ పేర్లను పొందుపరిచింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి సవాళ్లను ఈ యువ ఎగ్జిక్యూటివ్‌లు సమర్థంగా ఎదుర్కొన్నారని పేర్కొంది. సోదరుడు అనంత్, (25) తో కలిసి తమ తండ్రి సామ్రాజ్యాన్ని ముందుకు తీసుకెళ్లారని ఫార్చ్యూన్ మేగజీన్ ప్రశంసించింది. మరోవైపు కరోనా వైరస్ వ్యాక్సిన్ తయారీకి అనుమతి పొందిన ఫార్మా దిగ్గజం,ప్రపంచంలోని అతిపెద్ద టీకాల తయారీ సంస్థ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదార్ పూనవల్లా భారతదేశపు ప్రముఖ విద్యా సాంకేతిక సంస్థ బైజు సహ వ్యవస్థాపకుడు బైజు రవీంద్రన్ (39), ప్రపంచవ్యాప్తంగా ఉన్న 40 ఏళ్లలోపు ప్రభావవంతమైన ఫార్చ్యూన్ వార్షిక జాబితాలో నిలిచారు. ఫైనాన్స్, టెక్నాలజీ, హెల్త్‌కేర్, ప్రభుత్వ, రాజకీయాలు, మీడియా, వినోదం అనే ఐదు విభాగాలలో 40మంది ప్రభావవంతమైన వ్యక్తులను గుర్తించి ఈ వార్షిక జాబితాను రూపొందిస్తుంది. -
ఫార్చూన్ ‘40’లో అంబానీ వారసులు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ప్రభావశీలురైన ప్రముఖుల జాబితాలో పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ వారసులు ఆకాశ్ అంబానీ, ఈషా అంబానీ చోటు దక్కించుకున్నారు. అలాగే ఎడ్యుకేషన్ టెక్నాలజీ స్టార్టప్ సంస్థ బైజూస్ వ్యవస్థాపకుడు బైజు రవీంద్రన్‌కి కూడా స్థానం లభించింది. 40 ఏళ్ల లోపు వయస్సున్న 40 మంది ప్రముఖులతో ఫార్చూన్ మ్యాగజైన్ ఈ జాబితాను రూపొందించింది. ఈ ఏడాది ఆర్థికం, సాంకేతికత, వైద్యం, ప్రభుత్వం.. రాజకీయాలు, మీడియా.. వినోదరంగం అనే అయిదు కేటగిరీల నుంచి ప్రముఖులను ఎంపిక చేసింది. టెక్నాలజీ కేటగిరీలో ఈషా అంబానీ, ఆకాశ్ అంబానీ, బైజు రవీంద్రన్, షావోమీ ఇండియా ఎండీ మను కుమార్ జైన్ చోటు దక్కించుకున్నారు. బ్రౌన్ యూనివర్సిటీ నుంచి ఎకనమిక్స్ డిగ్రీ పొందిన తర్వాత 2014లో ఆకాశ్ కుటుంబ వ్యాపారమైన రిలయన్స్‌లో చేరారు. యేల్, స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయాల్లో విద్యాభ్యాసం చేసిన ఈషా ఆ మరుసటి ఏడాది కంపెనీలో చేరారు. రిలయన్స్‌లో భాగమైన జియో ప్లాట్‌ఫామ్స్‌లో ఫేస్బుక్ వంటి దిగ్గజాలు భారీగా ఇన్వెస్ట్ చేయడంలో జియో బోర్డు సభ్యులుగా వీరు తోడ్పాటు అందించినట్లు ఫార్చూన్ పేర్కొంది. అలాగే రిలయన్స్ సామ్రాజ్యాన్ని నడిపించేందుకు అవసరమైన శిక్షణ పొందుతున్నారని తెలిపింది. మరోవైపు, భారీ స్థాయిలో ఆన్లైన్ విద్యా సంస్థను నెలకొల్పడం సాధ్యమేనని రవీంద్రన్ నిరూపించారని ఫార్చూన్ పేర్కొంది. అటు స్టార్టప్స్ ఏర్పాటు చేసిన అనుభవం తప్ప స్మార్ట్‌ఫోన్స్ గురించి అంతగా తెలియని మను జైన్ .. చైనా కంపెనీ షావోమీ భారత్‌లో కార్యకలాపాలను భారీగా విస్తరించేందుకు తోడ్పడ్డారని తెలిపింది. చదవండి: బ్లూచిప్ షేర్ల దన్ను -
రిలయన్స్ : "నెట్‌మెడ్స్" డీల్
సాక్షి, ముంబై: ఒప్పందాల దూకుడును ప్రదర్శిస్తున్న ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తాజాగా ఆన్లైన్ ఫార్మసీ సంస్థ నెట్‌మెడ్స్ తో మరో డీల్ కుదుర్చుకుంది. 620 కోట్ల రూపాయల విలువైన మేజర్ వాటాను సొంతం చేసుకుంది. తన అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (ఆర్‌ఆర్‌విఎల్) వైటాలిక్ హెల్త్ ప్రైవేట్ లిమిటెడ్‌లో 60 శాతం మెజారిటీ ఈక్విటీ వాటాను కొనుగోలు చేసినట్లు ప్రకటించింది. అలాగే ట్రెసారా హెల్త్ ప్రైవేట్ లిమిటెడ్, నెట్‌మెడ్స్ మార్కెట్ ప్లేస్ లిమిటెడ్ దాదా ఫార్మా డిస్ట్రిబ్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్‌తో సహా దాని అనుబంధ సంస్థల 100 శాతం ప్రత్యక్ష ఈక్విటీ యాజమాన్యాన్ని సొంతం చేసుకుంది. దీంతో ఈ-కామర్స్ దిగ్గజ కంపెనీ అయిన అమెజాన్‌కి ఇకపై రిలయన్స్ ఇండస్ట్రీస్ గట్టి పోటీ ఇవ్వనుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. (అంబానీ సంచలన నిర్ణయం) భారతదేశం అంతటా అధిక నాణ్యత, సరసమైన ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులు, సేవల లభ్యతను పెంచడానికి కట్టుబడి ఉన్నామని ఆర్‌ఆర్‌విఎల్ డైరెక్టర్ ఇషా అంబానీ వెల్లడించారు. ఇంత తక్కువ సమయంలో దేశవ్యాప్తంగా డిజిటల్ ఫ్రాంచైజీకి నిర్మాణంలో నెట్‌మెడ్స్ కృషి తమను ఆకట్టుకుందని, దీన్ని మరింత వేగవంతం చేస్తామనే నమ్మకంతో ఉన్నామని తెలిపారు. డిజిటల్ వ్యాపారాన్ని మరింత విస్తరించగం. వినియోగదారులకు రోజువారీ కావాల్సిన వాటిని మరింత ఎక్కువగా అందించగలమని ఆమె తెలిపారు. “నెట్‌మెడ్స్” రిలయన్స్ కుటుంబంలో చేరడం, ప్రతి భారతీయుడికి నాణ్యమైన ఆరోగ్య ఉత్పత్తులను అందించే దిశలో కలిసి పనిచేయడం నిజంగా గర్వకారణమని నెట్‌మెడ్స్ వ్యవస్థాపకుడు, సీఈఓ ప్రదీప్ దాదా సంతోషం వ్యక్తం చేశారు. ప్రదీప్ దాదా స్థాపించిన నెట్‌మెడ్స్ (వైటాలిక్ అనుబంధ సంస్థలు ‘నెట్‌మెడ్స్’ అని పిలుస్తారు)ఇ-ఫార్మా పోర్టల్. వెబ్సైట్, యాప్ ద్వారా ఫార్మా ఉత్పత్తులను డెలివరీ చేస్తుంది. కాగా గత వారం అమెజాన్ ఇండియా బెంగళూరులో ఈ-ఫార్మసీ సర్వీసులు ప్రారంభించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ పోటీలో రిలయన్స్ కూడా చేరడం విశేషం. -
ఇషా హోలీ పార్టీ: ‘నా మొదటి హోలీ ఇదే’
ప్రముఖ వ్యాపారవేత్త అంబానీ ఇంట్లో శుక్రవారం రాత్రి హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖేష్ అంబానీ కూతురు ఇషా అంబానీ.. తన భర్త ఆనంద్ పిరమల్‌తో కలిసి ముంబైలో హోలీ పార్టీ ఏర్పాటు చేశారు ఈ వేడుకకు అంబానీ కుటుంబ సభ్యులు, పారిశ్రామిక వర్గానికి చెందిన ప్రముఖులతో పాటు బాలీవుడ్ తారలు హాజరైయ్యారు. భర్త నిక్ జోనాస్‌తో కలిసి ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్, విక్కీ కౌశల్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, సోనాలి బింద్రే, హ్యూమా ఖురేషి తదితరులు పార్టీలో పాల్గొన్నారు. కాగా కత్రినా ప్రస్తుతం విక్కీ కౌశల్‌తో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. పార్టీలో ప్రియాంక దంపతులు, కత్రినా ఫోటోలు, వీడియోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. (ప్రియాంక , నిక్ డ్యాన్స్ వీడియో వైరల్) రంగు నీళ్లలో తడుస్తూ.. ఒంటి నిండా రంగులు చల్లకుంటూ తారలంతా పార్టీలో ఎంజాయ్ చేశారు. ఈ సందర్భంగా తన జీవితంలో మొదటిసారి హోలీ వేడుకల్లో పాల్గొంటున్నట్లు నిక్ జోనాస్ తెలిపారు. ముఖం నిండా రంగులతో నిండిన ఇద్దరి ఫోటోను షేర్ చేస్తూ.. ‘నా మొదటి హోలీ (అయిదు రోజుల ముందు.) ఇండియాలో నా రెండవ ముఖ్యమైన ఇంటిలో అత్యంత దగ్గర వ్యక్తులతో జరుపుకోవడం సరదాగా ఉంది.’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నాడు. View this post on Instagram My first Holi! (Five days early)So much fun celebrating with such incredible people here in my second home in India. #holi @_iiishmagish @anandpiramal @priyankachopra A post shared by Nick Jonas (@nickjonas) on Mar 6, 2020 at 10:12am PST View this post on Instagram She makes me smile a lot. #holi A post shared by Nick Jonas (@nickjonas) on Mar 6, 2020 at 10:15am PST View this post on Instagram @katrinakaif @vickykaushal09 ❤ __________________________________________ #katrinakaif #sidharthmalhotra #hrithikroshan #ranbirkapoor #salmankhan #salkat #rankat #india #bollywood #aliabhatt #deepikapadukone #ranveersingh #shraddhakapoor #kareenakapoor #vickykaushal #sonamkapoor #akshaykumar #srk #катринакаиф #индийскиефильмы #салманкхан #шахрукхкхан #ранбиркапур #анушкашарма #ритикрошан A post shared by FAN ACCOUNT (@katrinamykaif) on Mar 6, 2020 at 12:19pm PST -
అంబానీ కుటుంబానికి ఐటీ నోటీసులు?!
సాక్షి, ముంబై: ఆదాయపు పన్ను శాఖ రిలయన్స్ చైర్మన్ ముకేశ్ అంబానీకు షాకిచ్చినిట్టు తెలుస్తోంది. తాజా నివేదికల ప్రకారం అంబానీ భార్య నీతా అంబానీ, వారి సంతానం అనంత్ అంబానీ, ఆకాష్ అంబానీ, ఇషా అంబానీలకు నోటీసులిచ్చింది. బ్లాక్‌మనీ యాక్ట్ 2015 కింద ఈ నోటీసులు ఇచ్చినట్లు నివేదికలు తెలిపాయి. అనేక దేశాల నుండి వచ్చిన సమాచారంపై దర్యాప్తు జరిపిన తరువాత ఆదాయపు పన్ను శాఖ వీరికి నోటీసులు పంపింది. అనంత్ అంబానీ, ఆకాష్ అంబానీ, ఇషా అంబానీ, నీతా అంబానీలు అనేక దేశాల్లో విదేశీ ఆదాయాన్ని, ఆస్తులను వెల్లడించలేదని సమాచారం. 2019, మార్చి 28న ఆదాయ పన్ను శాఖ ఈ నోటీసులు జారీ చేసింది. వ్యాపారవేత్తలపై దర్యాప్తు ప్రారంభించిన తరువాత 2011 లో, హెచ్ఎస్బీసీ జెనీవాలో 700 మంది భారతీయులకు ఖాతాలున్న వివరాలు భారత ప్రభుత్వానికి లభించాయి. 2015 లో, స్విస్ లీక్స్ గా పిలిచే ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్ (ఐసిఐజె) హెచ్ఎస్బీసీ జెనీవా ఖాతాదారుల సంఖ్య 1,195 అని పేర్కొంది. 601 మిలియన్ డాలర్ల బ్యాలెన్స్‌తో 14 హెచ్ఎస్బిసి జెనీవా బ్యాంక్ ఖాతాల క్లస్టర్‌ను ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదించింది. ఇవన్నీ అనేక మధ్యవర్తుల ద్వారా రిలయన్స్ గ్రూపుతో అనుసంధానించ బడ్డాయని తెలిపింది. ఈ 14 కంపెనీలలో ఒకదానిలో "అంతిమ లబ్ధిదారులు" గా అంబానీ కుటుంబం పేర్లు ఉన్నాయనీ, వివిధ విదేశీ, దేశీయ సంస్థల ద్వారా ఈ సంస్థలలో భారీ మొత్తాన్ని ఎలా అనుసంధానించబడి, ఎలా పెట్టుబడి పెట్టారో ఐటి నివేదిక వెల్లడించినట్టు పేర్కొంది. ముంబైలోని అదనపు ఆదాయ కమిషనర్ ద్వారా బ్లాక్ మనీ (అప్రకటిత విదేశీ ఆస్తులు, ఆదాయం) టాక్స్ యాక్ట్ 2015, సెక్షన్ 10 లోని సబ్ సెక్షన్ (ఐ) ప్రకారం ఈ నోటీసులు లిచ్చినట్టు నివేదిక పేర్కొంది. ఖండించిన రిలయన్స్ మరోవైపు ఈ ఆరోపణలపై స్పందించిన రిలయన్స్ ప్రతినిధి ఈ నివేదికలను పూర్తిగా ఖండించారు. అలాగే ఐటీ శాఖ నోటీసులేవీ తమకు అందలేదని పేర్కొన్నారు. -
నిజంగానే రెండు కళ్లు సరిపోవు..
ముంబై : నిజంగానే ఈ ఫోటోలు చూస్తే ఎవరికైనా ఇలానే అనిపిస్తుంది. ముఖేష్ అంబానీ గారాల పట్టి ఇషా అంబానీ నివాసం గులాటి ఫోటోలు చూస్తే మీరు కూడా ఇలానే అంటారు. మరి భారతీయ కుబేరుడి కుమార్తె నివాసం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు గదా. దాదాపు 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ. 450 కోట్ల విలువైన ఈ బంగాళను పిరమాల్ కుటుంబ సభ్యులు ఆరేళ్ల క్రితం హిందూస్థాన్ యూనిలీవర్ వారి నుంచి కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఈ ఇంటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. View this post on Instagram @Regran_ed from @velvety67 - Excl pics of #gulita bungalow 4 Isha Anand Piramal gifted by her In-laws Mr Mrs Piramal #ishaambani #isha #anandpiramal #worliseaface #worli #gulita #home #incredibleindia #indianblogger #toodles #bigfatindianwedding #bigfatwedding #udaipurtimes #jiogarden #jiophone #jio #umaidbhavanpalace #gujaratiwedding #desigirl #indianblogger #incredibleindia - #regrann A post shared by CafeT (@tea_villa_) on Dec 14, 2018 at 12:23am PST -
‘మీ ఇల్లు చాలా అద్భుతంగా ఉంది’
‘ఇంట్లో తయారు చేసిన ఐస్‌క్రీమ్ వావ్! నీ ఆతిథ్యానికి ధన్యవాదాలు. లవ్ యూ ఇషా. మీ ఇల్లు చాలా అద్భుతంగా ఉంది! నువ్వు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. గర్ల్స్‌నైట్‌లో ఈ అమ్మాయిలు. అలియా ఈ ఇంతటి ఎంజాయ్మెంట్ను నువ్వు మిస్సయిపోయాం! లవ్ యూ ఆల్ లేడీస్! అంటూ గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆమె అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోంది. తన బెస్టీ ఇషా అంబానీ పిరమాల్ ఇంట్లో కజిన్ పరిణీతి చోప్రా, రాధికా మర్చంట్ ఇతర స్నేహితులతో కలిసి దిగిన ప్రియాంక ఫొటో ప్రస్తుతం వైరల్‌గా మారింది. మీ ఫ్రెండ్షిప్ ఇలాగే కొనసాగాలి అంటూ లక్షల సంఖ్యలో లైకులు కొడుతున్నారు నెటిజన్లు. కాగా ఆసియా కుబేరుడు ముఖేష్ అంబానీ- నీతాల ఏకైక కుమార్తె ఇషా అంబానీ వివాహం పిరమాల్ గ్రూప్ వారసుడు ఆనంద్ పిరమాల్‌తో గతేడాది డిసెంబరు 12న జరిగిన సంగతి తెలిసిందే. దేశంలోనే అత్యంత ఖరీదైన వివాహ వేడుకగా ఇషా పరిణయం నిలిచింది. వివాహానంతం ఇషా, ఆనంద్ 50 వేల అడుగుల విస్తీర్ణం గల ‘గులితా’ అనే భారీ బంగ్లాలో నివసిస్తున్నారు. అరేబియా సముద్రం ఒడ్డున గల విలాసవంతమైన బంగ్లాను రూ.450 కోట్లు పెట్టి పిరమాల్ సంస్థ 2012లో కొనుగోలు చేసింది. ఆనంద్‌కు వెడ్డింగ్ గిఫ్ట్‌గా అతని తల్లి దండ్రులు స్వాతి, అజయ్ పిరమాల్ ఈ ఖరీదైన భవనాన్ని బహూకరించారు. ఇక ఈ ఇంటిలోనే ఇషా తన ఫ్రెండ్స్‌కు పార్టీ ఇచ్చారు. ఎంతో విలాసవంతమైన ఈ బంగ్లాను చూసి ముగ్ధురాలైన ప్రియాంక.. మీ ఇల్లు చాలా అద్భుతంగా ఉంది ఇషాకు కాంప్లిమెంట్ ఇచ్చింది. View this post on Instagram Making home made ice cream! Thank you to the hostess with the mostest. @_iiishmagish love u! Your home is amazing! I wish you love and laughter always. Here’s to many more girls nights!❤️💋 @aliaabhatt u Missed the madness by minutes! Love all u ladies! A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on Apr 28, 2019 at 3:19pm PDT -
అంబానీ ఇంటి వివాహం : మొదటి ఆహ్వానం ఆయనకే!
ముంబై : ఆసియా కుబేరుడు, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ- నీతా అంబానీల పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ వివాహ తేదీ ఖరారైంది. ఆకాశ్ అంబానీ- వజ్రాల వ్యాపారి రస్సెల్ మెహతా కుమార్తె శ్లోకా మెహతా నిశ్చితార్థం గతేడాది జూన్‌లో జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వచ్చే నెల(మార్చి) 9 నుంచి వీరి వివాహ వేడుకలు ప్రారంభం కానున్నట్లు సమాచారం. మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకలకు జియో వరల్డ్ సెంటర్ వేదిక కానున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. ఈ నేపథ్యంలో అంబానీ దంపతులు చిన్న కుమారుడు అనంత్ అంబానీతో కలిసి సోమవారం సాయంత్రం ముంబైలోని ప్రసిద్ధ సిద్ధి వినాయక ఆలయాన్ని సందర్శించారు. ఆకాశ్- శ్లోకాల వివాహ ఆహ్వాన మొదటి పత్రికను గణనాథుని పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా అంబానీల ఆడపడుచు ఇషా అంబానీ వివాహం గతేడాది డిసెంబరులో పిరమిల్ గ్రూపు వారసుడు ఆనంద్ పిరమాల్‌తో జరిగిన సంగతి తెలిసిందే. ఇషా- ఆనంద్‌ల వివాహ ఆహ్వాన తొలి పత్రికను కూడా ఇక్కడే ఉంచి పూజలు నిర్వహించారు. -
అప్పగింతలప్పుడు ఏడ్చేశాను : ఇషా అంబానీ
ముంబై : దేశంలోనే అత్యంత వైభవంగా జరిగిన వివాహ వేడుకగా నిలిచింది ముఖేశ్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ వివాహం. ఓ నెల రోజుల పాటు మీడియాలో వీరి పెళ్లి ముచ్చట్లే. ఇషా అంబానీ - ఆనంద్ పిరమాల్‌ల వివాహం జరిగి ఇప్పటికి రెండు నెలలవుతుంది. ఈ మధ్యే ఓ మ్యాగజీన్‌కు ఇచ్చిన ఇంటర్వూలో తన పెళ్లి వేడుక గురించి, అప్పగింతల కార్యక్రమం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు ఇషా. ఇషా మాట్లాడుతూ.. ‘మా కుటుంబంలో ప్రతి ఒక్కరితో నాకు గాఢమైన అనుబంధం ఉంది. ప్రతి ఒక్కరు నన్ను ఎంతో ప్రేమిస్తారు. పెళ్లి కార్యక్రమాలు ప్రారంభమైనప్పటి నుంచే అందరి కళ్లల్లో ఓ బాధ. అన్ని రోజులు నేను బాగానే ఉన్నాను. కానీ అప్పగింతలప్పుడు అందరూ ఏడుస్తున్నారు. ముఖ్యంగా మా అమ్మనాన్న ఏడవడం చూసి నాకు చాలా ఏడుపొచ్చింది. ఆ సమయంలో నేను చాలా ఒత్తిడికి గురయ్యాను’ అంటూ చెప్పుకొచ్చారు ఇషా. అంతేకాక ‘అందరి తల్లిదండ్రుల్లానే మా అమ్మనాన్న దగ్గరుండి నా పెళ్లి పనులన్ని చూసుకున్నారు. నేను ఊహించినదానికంటే ఎంతో అద్భుతంగా నా పెళ్లి చేశార’ని తెలిపారు ఇషా అంబానీ. గతేడాది డిసెంబరు 12న ఇషా అంబానీ- పిరమాల్ గ్రూప్ వారసుడు ఆనంద్ పిరమాల్‌ల వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ముంబైలోని అంబానీ నివాసం అంటిలియాలో జరిగిన వివాహ వేడుకకు అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ సహా పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు, క్రీడా ప్రముఖులు హాజరై సందడి చేశారు. -
అలాంటి వాళ్లంటే నాకు నచ్చదు: ఇషా అంబానీ
ముంబై: వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ కూతురు ఇషా అంబానీకి, పిరమాల్ సంస్థకు వారసుడైన ఆనంద్ పిరమాల్‌కు అంగరంగ వైభవంగా వివాహమైన సంగతి తెలిసిందే. ఇషా అంబానీ ఈ మధ్య వోగ్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన అంశాలను చెప్పుకొచ్చారు. తన భర్తకు ఆనంద్ పిరమాల్‌కు మంచి సెన్సాఫ్ హ్యుమర్ ఉందని, తనను బాగా నవ్విస్తారని చెప్పుకొచ్చారు. ఆహారం వృథా చేసేవారు తనకు నచ్చరని తెలిపారు. తాను సంప్రదాయ దుస్తుల్నే(కాటన్ సల్వార్ కమీజ్స్) ధరిస్తానని తెలిపారు. తాను ఎక్కువగా ఎవరితోనూ కలవలేనని, బాగా ఆలోచించి జడ్జ్ చేస్తానని చెప్పుకొచ్చారు. -
మేము టెస్ట్‌ట్యూబ్ బేబీలము : ఇషా అంబానీ
గత కొన్ని రోజులగా తన పెళ్లి విశేషాలతో వార్తల్లో నిలిచిన ఆసియా కుబేరుడు ముఖేష్ అంబానీ ముద్దుల తనయ ఇషా అంబానీ మరోసారి వార్తల్లోకెక్కారు. ఓ మ్యాగజీన్‌కు ఇచ్చిన ఇంటర్వూలో తన గురించి ఓ ఆసక్తికర విషయం వెల్లడించారు. ‘మా అమ్మానాన్నల పెళ్లి జరిగిన ఏడేళ్లకు నేను, నా కవల సోదరుడు ఆకాశ్ జన్మించాం. మేమిద్దరం ఐవీఎఫ్(ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్- టెస్ట్‌ట్యూబ్ బేబీ) పద్ధతి ద్వారా జన్మించాం. మాకు ఐదేళ్లు వచ్చే దాకా మా అమ్మ తన పూర్తి సమయాన్ని మాకోసమే వెచ్చించారు. అయితే తను చాలా స్ట్రిక్ట్‌గా ఉండేవారు’ అంటూ ఇషా చెప్పుకొచ్చారు. డబ్బు విలువ బాగా తెలుసు ‘ తన కలలను నెరవేర్చుకునేందుకు, రిలయన్స్‌ను మేటి సంస్థగా నిలిపేందుకు మా నాన్న పడ్డ కష్టాన్ని చూస్తూ పెరిగాను. ఎంత బిజీగా ఉన్నప్పటికీ మాకు తన అవసరం ఉందనిపిస్తే మాత్రం మా దగ్గరే ఉండిపోయేవారు. మా అమ్మానాన్నలు ఎలాంటి పరిస్థితుల్లో పెరిగారో మమ్మల్ని కూడా అలాగే పెంచారు. వారి పెంపకం వల్లే క్రమశిక్షణ, వినయ విధేయతలు అలవడ్డాయి. డబ్బు విలువ కూడా మాకు బాగా తెలుసు’ అని ‘జియో’ సృష్టికర్త ఇషా వ్యాఖ్యానించారు. కాగా గతేడాది డిసెంబరు 12న ఇషా అంబానీ- పిరమాల్ గ్రూప్ వారసుడు ఆనంద్ పిరమాల్‌ల వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ముంబైలోని అంబానీ నివాసం అంటిలియాలో జరిగిన వివాహ వేడుకకు అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ సహా పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు, క్రీడా ప్రముఖులు హాజరై సందడి చేశారు. దేశంలో అత్యంత ఖరీదైన వివాహ వేడుకగా నిలిచిన ఇషా పరిణయం నిలిచింది. భర్త ఆనంద్ పిరమాల్‌తో ఇషా అంబానీ -
అపర కుబేరుడు అయితేనేం!
ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా అవతరించి చరిత్ర సృష్టించిన భారతీయ కుబేరుడు ముఖేష్ అంబానీ కూతురు ఇషా అంబానీ- పిరమాల్ గ్రూప్ వారసుడు ఆనంద్ పిరమాల్‌ల వివాహం డిసెంబరు 12న వైభవోపేతంగా జరిగిన సంగతి తెలిసిందే. దేశంలోనే అత్యంత ఖరీదైన వివాహ వేడుకగా నిలిచిన ఈ శుభకార్యం జరిగి రెండు వారాలు గడిచినా.. అందుకు సంబంధించిన విశేషాలు, వీడియోలు సోషల్‌మీడియాలో హల్చల్ చేస్తూనే ఉన్నాయి. తమ గారాల పట్టి, ఇంటి ఒక్కగానొక్క ఆడపడుచు అప్పగింతల సమయంలో ముఖేష్ కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురైన వీడియో ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. వివాహానంతరం కుమార్తెను దేవుడి గదిలోకి తీసుకువెళ్లిన అంబానీ దంపతులు ఇషాను ప్రేమగా హత్తుకుని భర్త చేతిలో పెట్టారు. ఆ తర్వాత ఇంటి సంప్రదాయం ప్రకారం ఇషా ధాన్యం వెనక్కి జల్లుతూ తల్లిదండ్రులతో కలిసి కారు వద్దకు నడిచిరాగా... సోదరులు ఆకాశ్(కవల సోదరుడు), అనంత్‌లు, నానమ్మ కోకిలాబెన్ కూడా ఇషాను ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని వీడ్కోలు పలికారు. ఆ సమయంలో ముఖేష్ కన్నీళ్లు పెట్టుకుంటూ కూతురిని సాగనంపిన దృశ్యం ప్రతీ ఒక్కరిని హత్తుకుంటోంది. కాగా ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయినా అపర కుబేరుడు అయితేనేం ముఖేష్ అంబానీ కూడా ఓ ఆడపిల్ల తండ్రే కదా. ఇన్నాళ్లు అపురూపంగా పెంచుకున్న తన కూతురుని మెట్టింటికి పంపిస్తున్నపుడు ఆమాత్రం ఉద్వేగానికి గురవడం సహజమే. ఈ విషయంలో సగటు భారతీయ తండ్రికి తానేమీ అతీతుడిని కాదని నిరూపించుకున్నారు అంబానీ. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు... ‘ ఎంత ధనవంతులైనా కుటుంబ సంప్రదాయాలను తూచా తప్పకుండ పాటించిన అంబానీ కుటుంబం చాలా గొప్పది. నిజంగా వధువు తరఫు వారికి ఇది చాలా భావోద్వేగమైన సమయం’ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. View this post on Instagram #ishaambani wedding Budaai video #filmyhaiboss #ambaniwedding #mukeshambani #nitaambani #akashambani #anantambani #video #mumbai #anandpiramal #ishaambaniwedding A post shared by Filmy Hai Boss (@filmyhaiboss) on Dec 27, 2018 at 4:56am PST -
ఇంత బడ్జెట్లో మీరు పెళ్లి చేసుకోగలరా..?!
ఇస్లామాబాద్ : పెళ్లి ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే మధురమైన వేడుక. అందుకే చాలా మంది తమ స్థాయికి మించి.. భారీగా ఖర్చు చేసి మరీ అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంటారు. ధనవంతుల ఇళ్లలో అయితే ఈ వేడుకలు ఎంత అట్టహాసంగా జరుగుతాయో చెప్పాల్సిన పనిలేదు. ఈ మధ్య కాలంలో జరిగిన దీప్‌వీర్, ప్రియాంక - నిక్ జోనాస్‌ల వివాహం, ఇషా అంబానీ పెళ్లి వేడుక ఎంత వైభవంగా జరిగిందో తెలిసిన సంగతే. అట్టహాసంగా జరిగిన ఈ వివాహ వేడుకలకు.. భారీ మొత్తంలో ఖర్చు చేశారు. ఇషా అంబానీ పెళ్లికయితే ఏకంగా రూ. 700 కోట్లు ఖర్చు చేశారనే వార్తలు వినిపించాయి. లక్షల్లో ఖర్చు చేసి పెళ్లి చేసుకుంటున్న నేటి రోజుల్లో కేవలం రూ.10 వేలతో చాలా సాదా సీదాగా పెళ్లి చేసుకున్నాడో యువకుడు. దాంతో సెలబ్రెటీల పెళ్లి వేడుకల కంటే ఎక్కువగా ఇతని పెళ్లి ముచ్చట్లే తెగ వైరలవుతున్నాయిప్పుడు. వివరాలు.. పాకిస్తాన్‌కు చెందిన రిజ్వాన్ పెహెల్వాన్ తన పెళ్లి వేడుకను చాలా అంటే చాలా సింపుల్‌గా జరుపుకున్నాడు.ఇతని బంధువుల లిస్ట్‌లో ఉన్నది కేవలం 25 మంది మాత్రమే. వారు కూడా కుటుంబ సభ్యులు, స్నేహితులు. ఇక వివాహ వేదికగా తన ఇంటి మేడను ఎంచుకున్నాడు. మెను విషయానికోస్తే చికెన్ టిక్కా, సీక్ కబాబ్, స్ట్రాబెర్రిస్, ఐస్‌క్రీమ్ అంతే. Guys shaadi season hai so here's my wedding story in a thread so you guys know that having apni marzi ki shaadi is possible. My guest list had 25 names: friends and parents. The venue was my terrace. The menu was chicken tikka, seekh kabab, pathooray chanay halwa strawberries. — Rizwan. (@RizwanPehelwan) December 22, 2018 తన పెళ్లి వేడుకల గురించి రిజ్వాన్ ‘వంట విషయానికోస్తే.. వంటవ్యక్తిని నా స్నేహితుడు పంపించాడు. ఇక నా దగ్గర ఉన్న డబ్బులోంచి చికెన్, మసాలా కొనుగోలు చేశాను. ఇక నా భార్య స్టార్టర్‌గా ఖట్టే ఆలు తయారు చేసింది. ఇక మా నాన్న మేడ మీద అందమైన దీపాలను ఏర్పాటు చేశారు. ఇక పక్కనే ఉన్న ఆఫీస్ నుంచి 25 చైర్లను, టేబుల్‌ను తీసుకొచ్చాను. డిసర్ట్ తయారు చేయడం మరిచిపోయాను అందుకే స్ట్రాబెర్రీస్, ఐస్‌క్రీం తీసుకొచ్చాను. ఇక నేను, నా భార్య బ్లూ కలర్ సల్వాజ్ కమీజ్ వేసుకున్నాం. వీటిని మా అమ్మ, సోదరి మా పెళ్లి కానుకగా ఇచ్చార’ని తెలిపాడు. I set my max budget at Rs. 20,000. A friend lent his cooks, I bought the chicken and masalay from that money and helped prepare it all. Wife cooked khattay alu as a starter. Dad bought fairy lights n put them up on the terrace. — Rizwan. (@RizwanPehelwan) December 22, 2018 I borrowed 25 chairs from the neighborhood election committee lmao. I forgot dessert so @RizWanKenobi_ brought strawberries n ice cream. He also brought tables for the food. @HaseenaAtomBum and @hiranajam FLEW IN FOR THIS. — Rizwan. (@RizwanPehelwan) December 22, 2018 My wife and I wore plain blue shalwar kameez (mom n sis paid for this as a gift). We all ate and talked till midnight when wapda cut us off. The whole shaadi then moved to Manji Munch DHA and then bas. Khush! Done! — Rizwan. (@RizwanPehelwan) December 22, 2018 ‘ఇక అందరం తిని.. అర్థరాత్రి వరకూ కబుర్లు చెప్పుకుంటూ గడిపాము. ఇలా చాలా సింపుల్‌గా ఎంతో సంతోషంగా నా పెళ్లి తంతు పూర్తయ్యింది. పెళ్లి సింపుల్‌గా జరిగిందా.. గ్రాండ్‌గా జరిగింది అన్నది ముఖ్యం కాదు. జీవితాంతం సంతోషంగా కలిసి ఉండటం ముఖ్యం’ అంటూ ట్విటర్ ద్వారా తన పెళ్లి ముచ్చట్లు షేర్ చేశారు రిజ్వాన్. ప్రస్తుతం ఈ సింపుల్ షాదీ కహానీ తెగ వైరల్ అవుతోంది.. రిజ్వాన్ ఆలోచనను మెచ్చుకుంటూ అతనికి అభినందనలు తెలపుతున్నారు నెటిజన్లు. What I'm trying to say is. IT'S. OKAY. Sukoon karo. Do whatever you want ofc and whatever you can afford. But HAVE FUN. Be happy. Big or small, all weddings should just be HAPPY. Khush raho sab. Bye. (wedding pic added for saboot thanks) pic.twitter.com/xf2OJHqTVH — Rizwan. (@RizwanPehelwan) December 22, 2018 -
మనిషి సంతోషంగా ఉండాలంటే ఇంతకంటే ఏం కావాలి!
ఈ ఏడాది అత్యంత ఆకర్షణీయ పరిణయ వేడుక ఎవరిది అంటే ఎవరికైనా టక్కున గుర్తొచ్చేది బీ- టౌన్ స్టార్ కపుల్ దీపికా పదుకోన్- రణ్వీర్ సింగ్, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా- అమెరికన్ సింగర్ నిక్ జోనస్, భారతీయ కుబేరుడు ముఖేష్ అంబానీ కూతురు ఇషా అంబానీ- ఆనంద్ పిరమాల్‌ల పెళ్లి గురించే. అయితే రెండేసి సంప్రదాయ పద్ధతుల్లో వివాహం చేసుకుని... పలు రిసెప్షన్ పార్టీలతో సందడి చేసిన దీప్‌వీర్, ప్రియానిక్‌ల ఫొటోలు ఓవైపు.. దేశంలో అత్యంత ఖరీదైన వివాహ వేడుకగా నిలిచిన ఇషా పరిణయం విశేషాలు మరోవైపు సోషల్ మీడియాలో హల్‌చేశాయి. అయితే అత్యంత ఆడరంబరంగా జరిగిన ఈ పెళ్లి వేడుకల కంటే కూడా అతి సాధారణంగా జరిగిన రిజ్వాన్ అనే వ్యక్తి పెళ్లే తమ మనసులను దోచిందంటున్నారు కొందరు నెటిజన్లు. ట్విటర్లో రిజ్వాన్ రాసుకొచ్చిన వెడ్డింగ్ స్టోరీ చదివి ఫిదా అవుతున్నారు. నా పెళ్లి బడ్జెట్ రూ. 20 వేలు ‘గయ్స్ ఇది పెళ్లిళ్ల సీజన్ కదా. అందుకే నాకు నచ్చినట్టుగా జరిగిన నా పెళ్లి విశేషాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మా ఇంటి టెర్రస్ వేదికగా.. కుటుంబ సభ్యులు, స్నేహితులు ఇలా మొత్తం 25 మంది అతిథితుల మధ్య నా వివాహం జరిగింది. ఇక భోజనం విషయానికి వస్తే చికెన్ టిక్కా, సీఖ్ కబాబ్, పథూరీ చనాయ్ హల్వా, స్ట్రాబెర్రీస్ వడ్డించాం. అన్నింటికీ కలిపి మొత్తం దాదాపుగా 20 వేల రూపాయల బడ్జెట్ వేసుకున్నా. నా భార్య నేను అతి సాధారణమైన దుస్తులు ధరించాం. అవి కూడా మా అమ్మ, సోదరి మాకు కానుకలుగా ఇచ్చినవే. ఇంతకీ నేను చెప్పుచ్చేది ఏమిటంటే... సరే పర్లేదు. ఎలా అయితేనేం కావాల్సిన వాళ్ల మధ్య నాకు సాధ్యమయ్యే బడ్జెట్లో, సౌకర్యవంతమైన పద్ధతిలో ఆనందోత్సాహాల మధ్య ‘పెళ్లి వేడుక’ జరిగింది. ఒక మనిషి సంతోషంగా ఉండాలంటే ఇంతకంటే ఏం కావాలి. ఏదేమైనా పెళ్లిళ్లన్నీ ఆనందదాయక జీవితానికి చిరునామాగా నిలవాలి’ అంటూ రిజ్వాన్ తన ట్విటర్లో రాసుకొచ్చాడు. రిజ్వాన్ ట్వీట్‌కు స్పందించిన నెటిజన్లు... ‘ మనల్ని నిజాయితీగా ప్రేమించే వ్యక్తుల మధ్య... వారి ఆశీర్వాదాలతో జరిగే ఇలాంటి పెళ్లి నిజంగా ఎంతో బాగుంటుంది. ఆర్భాటాలతో సంబంధం లేకుండా కేవలం బంధానికి విలువనివ్వడం కొంతమందికే చెల్లుతుంది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ ఏడాది తమకు నచ్చిన, ఆకర్షణీయమైన పెళ్లి వేడుక నీదే అంటూ రిజ్వాన్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. -
ఇషా అంబానీ ఉండబోయే ఇంటిని చూశారా..?!
ముంబై : ఇషా అంబానీ - ఆనంద్ పిరమాల్‌ల వివాహం దేశంలోనే అత్యంత ఖరీదైన వివాహంగా నిలిచింది. భారతదేశ కుబేరుడైన ముఖేష్ అంబానీ తన కూతురు పెళ్లి కోసం ఏకంగా రూ. 700 కోట్లు ఖర్చుపెట్టినట్లు సమాచారం. అంగరంగ వైభవంగా జరిగిన ఇషా పెళ్లి వేడుకకు దేశ విదేశాల నుంచి ఎందరో ప్రముఖులు హజరయ్యారు. వారం రోజుల పాటు జరిగిన పెళ్లి తంతు పూర్తయ్యింది. ఇషా - ఆనంద్‌లు నివసింసచేబోయే ఇంటి గురించి ఇప్పుడు చర్చ నడుస్తోంది. ఇంద్రభవనాన్ని తలపించేలా ఉన్న ఈ సౌధం విస్తీర్ణం దాదాపు 50 వేల చదరపు అడుగులు. దక్షిణ ముంబైలోని వర్లీ ప్రాంతంలో అరేబియా సముద్ర ప్రాంత సమీపంలో ఉంది. ఆనంద్ పిరమాల్ తల్లిదండ్రులు ఈ ఇంటిని నూతన దంపతులకు కానుకగా ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ ఇంటిదగ్గర రిన్నోవేషన్ పనులు జరుగుతున్నాయి. దీనితో పోలిస్తే, ముఖేష్ అంబానీ ఇళ్లు యాంటిలియా దాదాపు 8 రేట్ల పెద్దదిగా ఉంటుంది. -
ఇంకేం కావాలి... ఇంకేం కావాలి
... అని కొసరి కొసరి వడ్డిస్తాం ఇంటికొచ్చిన అతిథులకు. అలాగే చేశారు బాలీవుడ్ బెస్ట్ కపుల్స్‌లో ఒకరైన ఐశ్వర్యారాయ్ అండ్ అభిషేక్ బచ్చన్. మరి.. బచ్చన్ ఇంటికి వచ్చిన ఆ అతిథి ఎవరై ఉంటారా? అనే ఊహలకు అర్జెంట్‌గా ఫుల్స్టాప్ పెట్టండి. ఎందుకంటే వీరిద్దరూ వడ్డించింది అంబానీ ఇంటి వేడుకలో. ఇషా అంబానీ, ఆనంద్ పిరమాల్ వెడ్డింగ్‌లో. ఓన్లీ అభిషేక్, ఐష్‌నే కాదు అమితాబ్, ఆమిర్ కూడా ఈ పెళ్లిలో వడ్డించారని బాలీవుడ్ సమాచారం. ఆ ఫొటోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. పెళ్లి కూతురు తరఫువాళ్లు పెళ్లి కొడుకు వాళ్లకు వడ్డించాలనే సంప్రదాయ మట ఇది. దీనిని ‘సజ్జన్ గోట్’ అని పిలుస్తారట. ఇషా–ఆనంద్ పెళ్లి వేడుకలకు అందరికంటే ముందే వచ్చారట బచ్చన్ ఫ్యామిలీ. ఆ తర్వాత ఒక్కొక్కరుగా బాలీవుడ్ సినీ సెలబ్రిటీలందరూ అక్కడికి చేరుకున్నారు. ఐశ్వర్యారాయ్, కరిష్మా కపూర్ కలిసి ఓ సాంగ్‌కు చిందేశారట. అలాగే అభిషేక్–ఐశ్వర్య వారిద్దరూ కలిసి నటించిన ‘గురు’లోని ‘తేరే బినా...’ సాంగ్‌కు డ్యాన్స్ చేయడం ఓ హైలైట్ అట. ఈ సంగతి అలా ఉంచితే... ఐష్, అభిషేక్ జంటగా ‘గులాబ్ జామున్’ అనే సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఈ చిత్రం షూటింగ్ స్టార్ట్ కానుంది. -
‘ఇషా అంబానీ పెళ్లిలో వడ్డించడానికి కారణమిదే’
ముంబై: భారతీయ కుబేరుడు ముఖేశ్ అంబానీ కూతురు ఇషా అంబానీ, పిరమాల్ గ్రూప్ చైర్మన్ అజయ్ పిరమాల్ తనయుడు ఆనంద్ పిరమాల్ వివాహం ఇటీవల ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ జంట వివాహ వేడుకలకు వచ్చిన అతిథులకు బాలీవుడ్ తారా గణం కొసరి కొసరి వడ్డించడం హాట్ టాపిక్‌గా మారింది. బాలీవుడ్ అగ్రతారలు అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, అమీర్‌ఖాన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్‌లతో పాటు ఏడేళ్ల ఆరాధ్య కూడా భోజనం వడ్డిస్తూ అతిథులకు మర్యాద చేశారు. అయితే ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో దీనిపై విపరీతమైన చర్చ జరుగుతుంది. ఇషా పెళ్లికి హాజరైన అతిథులకు బాలీవుడ్ తారలు మర్యాదలు చేయడంపై పలువురు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అయితే తాజాగా దీనిపై అభిషేక్ ట్విటర్లో స్పందించారు. ‘పెళ్లి వేడుకల్లో అతిథులకు భోజనం వడ్డించే సంప్రదాయాన్ని ‘సజ్జన్ ఘోట్’ అంటారు. వధువు తరఫు కుటుంబ సభ్యులు వరుడి తరఫు వారికి భోజనాలు వడ్డిస్తారు’ అని పేర్కొన్నారు. -
ఇషా అంబానీ పెళ్లి : కొసరి కొసరి వడ్డించిన హీరోలు
దేశంలోనే అత్యంత ఖరీదైన వివాహ వేడుకగా నిలిచింది ముఖేష్ అంబానీ కూతురు పెళ్లి. ఈ నెల 12న ఇషా అంబానీ - ఆనంద్ పిరమాల్‌ల వివాహం అత్యతం వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు దేశ, విదేశాల అతిథులే కాక బాలీవుడ్ తారాగణమంతా తరలి వెళ్లారు. పెళ్లి తంతు పూర్తయినప్పటికి ఈ రోజుకు కూడా ఇషా వివాహానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు అభిమానులను అలరిస్తూనే ఉన్నాయి. తాజాగా ఇషా అంబానీ పెళ్లికి సంబంధించిన వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. View this post on Instagram 📽️ #amitabhbachchan turns waiter #altamount #ishaambani #mukeshambani #nitaambani #mumbai_uncensored #udaivilas #udaipur #gujju #rajasthan #jiogarden #mumbai_ig #priyankachopra #toodles #taimuralikhanptaudi #kareenakapoor #muslims #pakistan #lollywood #marrakech #egypt #canada #chicago #newyork #videoviral #lucknow #haryanvi A post shared by Smile 😀 Why coz you can (@velvety67) on Dec 14, 2018 at 3:36am PST బాలీవుడ్ సూపర్ స్టార్, ‘బిగ్ బీ’ అమితాబ్ బచ్చన్, ‘మిస్టర్ పర్ఫేక్షనిస్ట్’ ఆమిర్ ఖాన్ ఇషా అంబానీ వివాహానికి వచ్చిన అతిథులకు స్వయంగా తమ చేతులతో వడ్డించారు. సంప్రదాయ గుజరాతీ వంటకమైన ఢోక్లాలను అతిథులకు వడ్డించి.. అంబానీ కుటుంబంతో తమకు గల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అంతేకాక అమితాబ్ కన్యాదాన సమయంలో బ్రాహ్మణునికి బదులు తానే ఆ మంత్రాల అర్థాన్ని వివరిస్తూ కన్యాదానం గొప్పదనాన్ని వివరించిన సంగతి తెలిసిందే. View this post on Instagram 📽️ @_aamirkhan turns #waiter #aamirkhan #antilia #ishaambani #isha #mukeshambani #nitaambani #bigfatindianwedding #bigfatindianweddings #bigfatwedding #bollywoodactor #silver #dinnerware #udaivilas #ambaniwedding #ambanis #videos #videoislam #videostar #pakistan #muslim #iraq #iran #saudiarabia #priyankachopra #priyankaandnick #deepveer A post shared by Smile 😀 Why coz you can (@velvety67) on Dec 14, 2018 at 3:34am PST -
ఈశా, ఆనంద్‌ల రిసెప్షన్ ఫోటోలు
-
బియాన్స్... బడ్జెట్ అదుర్స్
ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ కూతురి పెళ్లి సంబరాలు ఇటీవల జరిగిన విషయాన్ని వినే ఉంటారు. ఇండియన్ సెలబ్రిటీలను మాత్రమే కాకుండా ఇంటర్నేషనల్ సెలబ్రిటీలను కూడా ఆహ్వానించారు అంబానీ. కేవలం వెడ్డింగ్ పార్టీల కోసమే సుమారు వంద మిలియన్ డాలర్లను కార్లో పెట్రోల్లా ఖర్చు పెట్టారట ఆయన. ఈ ఫంక్షన్లో హాలీవుడ్ సింగర్ బియాన్స్ కనిపించడం విశేషం. ఎందుకంటే బియాన్స్ ఒక్క ప్రైవేట్ పార్టీకి సుమారు 3–4 మిలియన్ డాలర్స్ (దాదాపు 20 కోట్ల రూపాయలు) అందుకుంటారట. 2017లో మ్యూజిక్ ఇండస్ట్రీలో అత్యధికంగా సంపాదించిన సింగర్‌గా బియాన్స్ రికార్డ్ సొంతం చేసుకున్నారు. ఇంతకీ ఆమె అంబానీ పార్టీ కోసం ఎంత తీసుకున్నారంటే.. సుమారు 28 కోట్లు పుచ్చుకున్నారని టాక్. -
భావోద్వేగానికి లోనైన ముఖేష్ అంబానీ
సాక్షి, ముంబై : భారతీయ కుబేరుడు ముఖేష్ అంబానీ గారాల పట్టి ఇషా అంబానీ- పిరమాల్ గ్రూప్ వారసుడు ఆనంద్ పిరమాల్‌ల వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. బుధవారం రాత్రి ముంబైలోని అంబానీ నివాసం అంటిలియాలో జరిగిన వివాహ వేడుకకు అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ సహా పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు, క్రీడా ప్రముఖులు హాజరై సందడి చేశారు. గుజరాతీ సంప్రదాయం ప్రకారం జరిగిన ఇషా- ఆనంద్‌ల పెళ్లి తంతులో భాగంగా... పెళ్లికుమార్తె ఇషాను ఆమె సోదరులు ఆకాశ్, అనంత్, అన్మోల్ తదితరులు ముత్యాలతో అలంకరించిన ఛాదర్ పట్టి మండపానికి తీసుకురాగా.... నృత్య కళాకారులతో బారాత్ బృందం ముందు వస్తుండగా.. రోల్స్ రాయిస్ కారులో వరుడు ఆనంద్, తన కుటుంబసభ్యులతో కలిసి అంటిలియాకు చేరుకున్నారు. ఆ తర్వాత ఇషా-ఆనంద్‌లు పెళ్లి వేదిక వద్దకు చేరుకోగానే వధువు- వరుడి బంధువుల కోలాహలంతో అక్కడ సందడి నెలకొంది. ఇరువర్గాల ఆనందోత్సహాల మధ్య వారిద్దరు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కాగా కన్యాదానం సమయంలో బిగ్‌బీ అమితాబ్ బచ్చన్.. మంత్రాలకు సంబంధించిన పరమార్థం చెబుతుండగా... అంబానీ దంపతులు తమ ముద్దుల కూతురిని అల్లుడి చేతిలో పెట్టారు. అయితే ఈ సమయంలో ముఖేష్ అంబానీ భావోద్వేగానికి లోనయ్యారని ఆయన సన్నిహితులు పేర్కొన్నారు. అయినా అపర కుబేరుడు అయితేనేం ముఖేష్ అంబానీ కూడా ఓ ఆడపిల్ల తండ్రే కదా. ఇన్నాళ్లు అపురూపంగా పెంచుకున్న తన కూతురుని మెట్టింటికి పంపిస్తున్నపుడు ఆమాత్రం ఉద్వేగానికి గురవడం సహజమే. ఈ విషయంలో సగటు భారతీయ తండ్రికి తానేమీ అతీతుడిని కాదని నిరూపించుకున్నారు అంబానీ. View this post on Instagram @amitabhbachchan gave a sentimental speech at the #IshaAmbani's wedding exclusive from @filmyaccess . . . . . . . . . . #Bollywood #bigfatwedding #wedding #celebration #Bollywoodstars #Dance #EthnicLove #happiness #Indianwedding #performance #IshaAmbani #marriage #AnandPiramal #Groom #Bride #Marriage #weddingceremonies #love #couplegoals #lovelycouple #likeforlikeback #LikeForLike A post shared by FILMYACCESS (@filmyaccess) on Dec 12, 2018 at 11:15pm PST View this post on Instagram Here’s a glimpse from the Varmala Ceremony 🌟🌟🌟✨✨✨✨#IshaAmbaniWedding . . . . . . #theshaadico #anantambani #nitaambani #mukeshambani #akashambani #ishaambani #anantambani #shlokamehta #radhikamerchant #kokilabenambani #neetaambani #ambani #reliance #reliancejio #jio #reliancefoundation #dhirubhaiambani #antilia #akustoletheshlo #ambaniwedding #summerwedding#bridetobe#picoftheday#ishakishaadi#bigfatindianwedding#salmankhan#varundhawan#karishmakapoor#kiaraadvani A post shared by The Fashion Rid (@thefashionrid) on Dec 12, 2018 at 8:40pm PST -
ఇషా అంబానీ పెళ్లి వేడుక..!
ముంబై : పెళ్లంటేనే ఆకాశమంత పందిరి - భూదేవంత అరుగు, అతిథులు - ఆర్భటాలు, విందులు - వినోదాలు, సంతోషాలు - సరదాలు. మామూలు పెళ్లిలే ఓ రేంజ్లో జరుగుతున్న రోజుల్లో.. ఇక భారతీయ కుబేరుడు ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి వేడుక అంటే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. నీతా - ముఖేష్ అంబానీల ముద్దుల తనయ ఇషా అంబానీ, పిరమిల్ గ్రూప్ వారసుడు ఆనంద్ పిరమిల్ వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. దేశంలోని సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార ప్రముఖులు.. విదేశీ అతిథుల మధ్య అత్యంత వైభవంగా మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు ఇషా - ఆనంద్‌లు. పెళ్లి వేదికయిన ముకేశ్ అంబానీ స్వగృహం ‘అంటిలియా’ను దేశ విదేశాల నుంచి తీసుకొచ్చిన పూలు, విద్యుద్దీపాలతో అందంగా అలంకరించారు. అనంతరం పెళ్లికుమార్తె ఈశాను సోదరులు ఆకాశ్, అనంత్, అన్మోల్ తదితరులు ముత్యాలతో అలంకరించిన ఛాదర్ పట్టి మండపానికి తీసుకువచ్చారు. నృత్య కళాకారులతో బారాత్ బృందం ముందు రాగా.. ఆ వెనకనే రోల్స్ రాయల్ కారులో వరుడు ఆనంద్ పిరమాల్, తన కుటుంబసభ్యులతో కలిసి అంటిలియాకు చేరుకున్నారు. అంబానీ సోదరులు ముకేశ్, అనిల్‌లు పెళ్లి కొడుకు ఆనంద్ పిరమిల్‌ను సాదరంగా ఎదుర్కొని వేదిక వద్దకు తీసుకెళ్లారు. ఆ తర్వాత సంప్రదాయ పద్ధతిలో ఇశా, ఆనంద్‌ల వివాహం జరిగింది. ఈ వివాహ వేడుకకు హిల్లరీ క్లింటన్, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, అమితాబ్ దంపతులు, రజనీకాంత్ దంపతులు, ఐశ్వర్య-అభిషేక్ బచ్చన్, సచిన్ - అంజలి, ఆమీర్ ఖాన్ - కిరణ్ రావు, సల్మాన్‌ఖాన్, ప్రియాంకా చోప్రా-నిక్ జోనాస్, అనిల్‌కపూర్, సోనమ్‌కపూర్, రణ్‌వీర్‌సింగ్ - దీపికా పదుకొనే, కరీనాకపూర్ - సైఫ్, కైరా అద్వానీ తదితరులు హాజరయ్యారు. వీరేకాక ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు హాజరయ్యారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఈశా అంబానీ పెళ్లి వేడుక
-
ఇషా అంబానీ పెళ్లి సందడి ఫోటోలు
-
స్నేహమంత పందిరి
అంబానీ తన కూతురి పెళ్లికి ఆకాశం కంటే కూడా పెద్ద పందిరి వేశారు. పిరమల్ తన కొడుక్కి కోరుకున్న అమ్మాయిని ఇచ్చాడు. అయితే పిల్లల పెళ్లి కంటే కూడా ఇవాళ పెద్ద సెలబ్రేషన్.. ఆ పెద్దల మధ్య ఉన్న స్నేహమే! నిన్నంతా కౌంటింగ్ కళ. ఇవాళ కంట్రీకే పెళ్లి కళ! భారతదేశం సందడిగా ఉంది. ఎక్కడేం జరిగినా పాపం ప్రజలెప్పుడూ ‘నాకేంటి’ అని అనుకోరు. ఓటుంటే ఓటేసి వస్తారు. పిలుపొస్తే పెళ్లికి వెళ్లొస్తారు. ఓటు లేకపోయినా, ఉండీ వెయ్యలేకపోయినా ఎన్నికల్లో భాగస్వాములౌతారు. మనవి కాని పెద్దింటి పెళ్లిళ్లనూ ఓన్ చేసుకుంటారు. కుటుంబం అంతా భోజనానికి కూర్చున్నప్పుడు కేసీఆర్‌కి వచ్చిన సీట్ల గురించి, అంబానీ తన కూతురి పెళ్లికి ఖర్చుపెడుతున్న కోట్ల గురించి ఉత్సాహంగా మాట్లాడుకుంటారు. ఆరోగ్యకరమైన అలవాటే. ‘ఎవరొస్తే ఏముందిలే’ అనుకుంటూ ముద్ద మింగడం అనారోగ్యం. ‘దేశంలో ఇంతమంది నిరుపేదలుంటే పెళ్లికి అంతంత ఖర్చా’ అనుకోవడం మానసిక అస్వస్థత. పేపర్లలో అస్తమానం అవే వార్తలు, చానళ్లలో అవే దృశ్యాలు వస్తున్నా విసుగు అనిపించని మాంత్రికత ఏదో ఉంటుంది ఈ ఎన్నికల్లో, పెళ్లిళ్లలో! అనుష్క–విరాట్, రణ్వీర్–దీపిక, ప్రియాంక–నిక్ జోనస్.. ఏడాది పొడవునా పెళ్లి పెళ్లి అని ఎంత విసిగించారు! అయినా విసుగొచ్చిందా? అనుష్క, విరాట్ల పెళ్లి గత ఏడాది డిసెంబర్ 11న జరిగింది. అప్పుడే సంవత్సరం అయిందా అనిపించడం లేదూ! సెలబ్రిటీల పెళ్లిళ్లు పెళ్లింటికే కాదు, దేశంలోని ప్రతి ఇంటికీ కళే. సెలబ్రిటీల పెళ్లి ఫొటోలు వాళ్లింటికే కాదు, ప్రతి ఇంటికీ ఫ్యామిలీ ఆల్బమ్‌లే. మళ్లీ ఇప్పుడొక కొత్త ఆల్బమ్ మన చేతికి వస్తోంది. ముఖేశ్ అంబానీ, నీతా అంబానీల కూతురు ఇషా అంబానీ పెళ్లి ఇవాళ ముంబైలోని వారి స్వగృహం ‘యాంటిలియా’లో జరుగుతోంది. వరుడు ఆనంద్ పిరమల్. ఇషా పెళ్లి వేడుకలు రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఐదు రోజుల పాటు అక్కడి ‘ఒబెరాయ్ విలాస్’లో జరిగాయి. ఆ ఐదు రోజులకు అంబానీలకు అయిన ఖర్చు 720 కోట్ల రూపాయలు. అంటే వంద మిలియన్ డాలర్లు. అంతయిందని వాళ్లూ వీళ్లూ అనుకోవడం కాదు. ‘బ్లూమ్స్‌బర్గ్ క్వింట్’ అనే బిజినెస్ అండ్ ఫైనాన్షియల్ న్యూస్ ఆర్గనైజేషన్ వేసిన అంచనా. ముప్పై ఏడేళ్ల క్రితం ప్రిన్స్ చార్ల్స్, ప్రిన్సెస్ డయానాల పెళ్లికి అయిన ఖర్చు ఇప్పటి లెక్కల్లో 110 మిలియన్ డాలర్లు. ప్రపంచంలోని అతి ఖరీదైన పెళ్లిళ్లలో ప్రిన్స్ దంపతులది ఒకటని అప్పుడు అనుకున్నారు. ఇప్పుడు ఇషా పెళ్లి ఖర్చు కూడా అంతే. పది మిలియన్ డాలర్లు తక్కువ కదా అనుకోడానికి లేదు. ఇవాళ్టి వెడ్డింగ్ ఖర్చులు యాడ్ అవాల్సి ఉంది. మనిషికి జీవితం బోర్ కొట్టకుండా ఉండాలంటే పండుగలుండాలి. పండుగలు బోర్ కొట్టకుండా ఉండాలంటే పెద్దవాళ్ల పెళ్లిళ్లు ఉండాలి. పెళ్లి మాత్రమే ఆ పెళ్లిళ్లలో వేడుక కాదు. పెళ్లికి వచ్చేవాళ్లను కళ్ల నిండా చూడ్డమూ వేడుకే. ఇషా ఉదయ్‌పూర్ ప్రీ వెడ్డింగ్ ఉత్సవాలకు ఇండియా బయటి నుంచి హిల్లరీ క్లింటన్ వచ్చారు. ఇంకా, మనకు తెలిసిన వాళ్లలో గాయని బేయాన్స్ వచ్చారు. ‘సంగీత్’లో ఆమె ధగధగలాడారు. యు.ఎస్.లో స్వర దేవత ఆమె. గ్రామీ అవార్డు గ్రహీత కూడా. ఇక మనవాళ్లు ఎటూ ఉంటారు. సల్మాన్‌ఖాన్, షారుఖ్ ఖాన్, కరణ్ జోహార్, ఐశ్వర్యారాయ్. వీళ్లంతా ఇప్పటికే ఉదయ్‌పూర్ నుంచి ముంబై చేరుకున్నారు. అంబానీలు, పిరమల్లు ఐదు ఫైవ్‌స్టార్ హోటళ్లను అతిథుల కోసం బుక్ చేసి ఉంచారు. హోటల్ గదులను బుక్ చెయ్యడం కాదు. టోటల్‌గా హోటళ్లనే బుక్ చేశారు. అంత పెద్ద లిస్ట్ ఉంది పెళ్లికొచ్చేవాళ్లది. రాజస్తాన్ నచ్చి అక్కడే ఉండిపోతాం అన్నవారికి ఉదయ్‌పూరే విడిదిల్లు. అక్కడి నుంచి ముంబై లోని మహారాణా ఎయిర్‌పోర్ట్‌కు.. వేళల్తో పనిలేని వంద చార్టర్డ్ ఫ్లయిట్స్ వారం రోజులుగా షట్లింగ్ చేస్తున్నాయి. పెళ్లికి ప్రణబ్ ముఖర్జీ, మమతాబెనర్జీ వంటి పెద్ద నాయకులు వస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.ఉదయ్‌పూర్‌లో మొదటి నాలుగు రోజులు ‘అన్నసేవ’ జరిగింది. అన్నదానం అంటాం కదా మనం.. అదే అక్కడ అన్నసేవ. 5,100 మంది భోజనం చేశారు. వారిలో ఎక్కువమంది ‘స్పెషల్లీ ఏబుల్డ్’. భోజనానికి కూర్చున్న ఆ ‘స్పెషల్లీ ఏబుల్డ్’ అందర్నీ ప్రత్యేక అతిథుల్లానే చూసింది అంబానీ ఫ్యామిలీ. పెళ్లయ్యాక వధూవరులు ముంబైలోని వర్లీ ఏరియాలో అరేబియా సముద్రానికి అభిముఖంగా ఉన్న ‘గులిటా’ భవనంలో జీవితాన్ని ప్రారంభిస్తారు. వజ్రాకృతులతో నిర్మించిన ఆ భవంతిని వరుడి తల్లిదండ్రులు అజయ్ పిరమల్, స్వాతి పిరమల్ తమ కుమారుడికి పెళ్లి కానుకగా ఇచ్చారు. 64 మిలియన్ డాలర్ల విలువైన భవంతి అది. అంటే 460 కోట్ల రూపాయలు. రెండు కుటుంబాల వాళ్లూ ఉన్నవాళ్లే. వధువు తండ్రి ముఖేశ్ అంబానీ ‘ఆయిల్ అండ్ టెలికాం’ టైకూన్. వరుడి తండ్రి అజయ్ పిరమల్ బిలియనీర్ ఇండస్ట్రియలిస్ట్. అందుకని ఉన్నవాళ్లు కాదు. నలభై ఏళ్లుగా వాళ్లు పెంచుకుంటూ వస్తున్న సంపద వేరే ఉంది. స్నేహం! ఫ్యామిలీ ఫ్రెండ్షిప్. ఒడిదుడుకుల్లోనూ స్నేహం అనే ఆ ఓడ స్థిరంగా పయనించింది. ఇషా (27), ఆనంద్ (33) చిన్ననాటి స్నేహితులు. వాళ్ల కంటే ముందు నుంచీ అంబానీ జంట, పిరమల్ జంట.. స్నేహితులు. ముఖేష్.. నీతాకు మొదట ‘ఐ లవ్యూ’ చెప్పింది పిరమల్ ఇంట్లోనే! ఇప్పుడు అంబానీ తన కూతురి పెళ్లికి ఆకాశం కంటే కూడా పెద్ద పందిరి వేశారు. పిరమల్ తన కొడుక్కి కోరుకున్న అమ్మాయిని ఇచ్చి చేస్తున్నాడు. అయితే పిల్లల పెళ్లి కంటే కూడా పెద్ద సెలబ్రేషన్ ఇవాళ.. ఆ పెద్దల మధ్య ఉన్న స్నేహమే! - మాధవ్ శింగరాజు -
అంబానీ ఇంట.. బాలీవుడ్ తారల ధూమ్‌ధామ్!
బాలీవుడ్ తారలు అందరూ ధూమ్‌ధామ్ కార్యక్రమాలతో అదరగొట్టారు. ఇషా అంబానీ పెళ్లి వేడుకల్లో భాగంగా బాలీవుడ్ మొత్తం ఉదయ్‌పూర్‌కు తరలిపోయింది. బాలీవుడ్ స్టార్లు ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, కత్రినా కైఫ్, ప్రియాంక చోప్రా, కరణ్ జోహర్, కరీనా కపూర్, సోనమ్ కపూర్, జాన్వీ కపూర్ తదితరులు హాజరయ్యారు. ముకేష్ అంబానీ కూతురు ఇషా అంబానీ, పిరమాల్ వ్యాపారదిగ్గజ వారసుడు ఆనంద్ పిరమాల్ పెళ్లి వేడుకలు ఉదయ్‌పూర్‌లో జరుగుతున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 12న వీరిద్దరు ఒక్కటవ్వనున్నారు. ఆదివారం జరిగిన సంగీత్ కార్యక్రమంలో బాలీవుడ్ తారలు చిందులేశారు. కత్రినా, ప్రియాంక వేసిన స్టెప్పులు అదుర్స్ అనిపించాయి. అన్నింటికంటే ముఖ్యంగా షారుక్ తన భార్య గౌరీ ఖాన్‌తో చేసిన డ్యాన్స్ వీడియో వైరల్ అవుతోంది. ఇక ఈ కార్యక్రమానికి కరణ్ జోహర్ హోస్ట్ చేస్తూ.. తన టైమింగ్‌తో అందరికి వినోదాన్ని పంచారు. ముకేష్ అంబానీతో చేసిన ర్యాపిడ్ ఫైర్ అందర్నీ నవ్వుల్లో ముంచెత్తింది. ఆమిర్ దంపతుల డ్యాన్స్, సల్మాన్ ఖాన్-కత్రినాల ఎంట్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ ఈవెంట్‌కు టాలీవుడ్ నుంచి ప్రభాస్ హాజరయ్యాడు. -
ఇషా అంబానీ సంగీత్ వేడుక
-
అంబానీల పార్టీకి తరలివెళ్తోన్న తారగణం
జైపూర్ : భారతీయ కుబేరుడు ముఖేష్ అంబానీ గారాల పట్టి ఇషా అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలతో ఉదయ్‌పూర్ కళకళలాడుతోంది. ఇందులో భాగంగా అంబానీ దంపతులు ఇస్తున్న పార్టీకి అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ సహా పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు ఉదయ్‌పూర్‌కు చేరుకుంటున్నారు. దీంతో ఉదయ్‌పూర్ ఎయిర్‌పోర్టు వద్ద సందడి నెలకొంది. ప్రియానిక్ దంపతులు, ఆమిర్ ఖాన్- కిరణ్‌రావు, అమితాబ్ బచ్చన్ కుటుంబం, సల్మాన్ ఖాన్, విద్యాబాలన్ దంపతులు, బోనీ కపూర్, జాన్వీ, ఖుషీ కపూర్, వరుణ్ ధావన్, మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ దంపతులు సహా పలువురు సెలబ్రిటీలు ఇప్పటికే ఉదయ్‌పూర్ చేరుకున్నారు. కాగా ఈనెల 12న ఇషా- ఆనంద్ పిరమాల్‌ల వివాహం ముంబైలో అంగరంగ వైభవంగా జరుగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇరు కుటుంబాల్లో పెళ్లి సందడి మొదలైంది. ఈ నేపథ్యంలో శుక్రవారం నుంచే ఉదయ్‌పూర్‌లో సంబరాలు మొదలయ్యాయి. ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో భాగంగా డిసెంబర్ 7 నుంచి డిసెంబరు 10 వరకు నాలుగు రోజుల పాటు నిత్యాన్నదానం నిర్వహిస్తోంది. -
అంబానీ దంపతుల అన్నదాన కార్యక్రమం
-
కొసరి కొసరి వడ్డిస్తున్న అంబానీ కుటుంబం!
అన్నదాత సుఖీభవ, అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పది అనేవి మనం వింటూ ఉంటాం. మనం ఏం పని చేసినా.. జానెడు పొట్ట నిండటం కోసమే కదా. అలా పక్కవారి కడుపునిండా అన్నం పెట్టడంలో ఉండే సంతృప్తి ఎందులోనూ ఉండదు. ఇలాంటి గొప్పకార్యక్రమంతో అంబానీ ఇంట వివాహ మహోత్సవం ఘనంగా మొదలైంది. ఉదయ్‌పూర్‌లో అంబానీ కుటుంబసభ్యులు శుక్రవారం అన్నదాన కార్యక్రమం జరిపించారు. అంబానీ కుటుంబ సభ్యులు ముకేశ్ అంబానీ, నీతా అంబానీ, అజయ్, స్వాతి పిరమాల్, ఇషా, ఆనంద్ పాల్గొని.. 5,100 మందికి ఆహార పదార్ధాలను వడ్డించారు. ఇషా అంబానీ-ఆనంద్ పిరమాల్‌ల వివాహం డిసెంబర్ 12న ముంబయిలో ఘనంగా జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఇరు కుటుంబాల్లో పెళ్లి సందడి నెలకొంది. ఉదయ్‌పూర్ (రాజస్థాన్)లో ఈషా అంబానీ పెళ్లి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం నుంచే అక్కడ సంబరాలు మొదలయ్యాయి. ఉదయ్‌పూర్ వాసుల ఆశీర్వాదం తీసుకునేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది అంబానీ కుటుంబం. పెళ్లి వేడుకల్లో భాగంగా డిసెంబర్ 7 నుంచి డిసెంబరు 10 వరకు నాలుగు రోజుల పాటు నిత్యాన్నదానం చేస్తున్నారు. అందులో దివ్యాంగులే ఎక్కువగా ఉన్నారు. ఇలా నాలుగు రోజులు మూడు పూటలా వారికి భోజనం పెట్టనున్నారు. అన్నదానంతో పాటు భారతీయ వస్తు కళలను ప్రమోట్ చేసేందుకు స్వదేశీ బజార్ పేరుతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తోంది. దేశీయ కళా ఉత్పత్తులను అందులో ప్రదర్శిస్తారు. దీని ద్వారా స్థానిక వ్యాపారులకు లాభం చేకూరనుంది. ఈ ఎగ్జిబిషన్‌కు సినీ, రాజకీయ ప్రముఖులు, అంతర్జాతీయ అతిథులు తరలిరానున్నారు. కాగా, డిసెంబరు 8, 9న ఈషా-ఆనంద్ ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరగనున్నాయి. డిసెంబరు 12న అంగరంగ వైభవంగా వివాహ వేడుక జరగనుంది. (మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
పెళ్లి కళ వచ్చేసింది..
సాక్షి,ముంబై: మరికొద్ది రోజుల్లో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్న ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ ముద్దుల తనయ ఇషా అంబానీకి పెళ్లి కళ వచ్చేసింది. ప్రముఖ సెలబ్రిటీ డిజైనర్ సవ్యసాచి ముఖర్జీ డిజైన్ చేసిన సంప్రదాయ లెహంగ దుస్తులు, ఖరీదైన అన్‌కట్ సిండికేట్ డైమండ్స్, జాంబియన్ ఎమరాల్డ్స్ పొదిగిన నెక్లెస్, దానికి జతగా మ్యాచింగ్ చెవి రింగులతో పెళ్లి కళ వచ్చేసిందే బాలా అన్నట్టుగా తళుక్కున మెరిసింది. తాజాగా ఇషా అంబానీ ఈ అందమైన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన పోస్ట్ చేశారు. సాంప్రదాయకంగా వధువు నిర్వహించే గృహ శాంతి పూజకోసం ఈ అందమైన లెహంగాను, నెక్లెస్‌ను తయారు చేసినట్టు వెల్లడించారు. మరోవైపు తన కుమార్తె పెళ్లి వేడుక ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా జరగాలని కోరుతూ ఇటీవల తిరుపతి శ్రీవేంకటేశ్వర స్వామిని, కేరళలోని గురువాయూర్ దేవాలయం, రామేశ్వరంలోని రామనాథస్వామి ఆలయాలను దర్శించుకొని విలువైన కానుకలను సమర్పించుకున్నారు బిలియనీర్ , రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ. కాగా ఇషా అంబానీ, ఆనంద్ పిరామల్ వివాహం ముహూర్తం డిసెంబర్ 12వ తేదీగా నిర్ణయించారు. వీరి పెళ్లి వేడుకకు ముందు నిర్వహించే పూజా కార్యక్రమాలు, ఇతర వేడుకలు డిసెంబర్ 8నుంచి ప్రారంభం కానున్నాయని తెలుస్తోంది. సంప్రదాయ రాజస్థానీ శైలిలో ఉదైపూర్ ఒబెరాయ్ ఉదయ్‌విలాస్‌లో అత్యంత ఘనంగా నిర్వహించనున్నారని భావిస్తున్నారు. కాస్ట్లీ వెడ్డింగ్‌గా చెబుతున్న ఈ కార్పొరేట్ దిగ్గజాల వివాహప్రక్రియలో ప్రతీ అంశమూ ప్రత్యేకమే. ముఖ్యంగా ఇటలీలోని లేక్ కామోలో ఒక విలాసవంతమైన విల్లాలో జంట నిశ్చితార్థ కార్యక్రమంతోపాటు, వీరి వివాహ ఆహ్వాన పత్రికలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సంగతి తెలిసిందే. View this post on Instagram Isha Ambani @_iiishmagish for her Graha Shanti Pooja in a custom hand-painted, hand-embroidered tilla-work lehenga and antique bandhej dupatta. The outfit is a part of the India Revival Project by Sabyasachi. Her look is accessorised with a necklace and earring set featuring uncut Syndicate diamonds and Zambian emeralds. Jewellery Courtesy: Sabyasachi Heritage Jewelry @sabyasachijewelry Photo Courtesy: Tarun Vishwa #TarunVishwa Styled by: @stylebyami Makeup by: @subbu28 Hair by: @sangeetahairartist . #Sabyasachi #IshaAmbani #SabyasachiJewelry #TheWorldOfSabyasachi A post shared by Sabyasachi Mukherjee (@sabyasachiofficial) on Nov 27, 2018 at 6:38am PST -
వాళ్లుండేది అక్కడే.. రూ.450 కోట్ల బంగ్లాలో..!
ముంబై : ముఖేష్ అంబానీ, నీతా అంబానీల గారాల పట్టి ఇషా అంబానీ, పిరమాల్ గ్రూప్ వారసుడు ఆనంద్ పిరమాల్ వివాహం డిసెంబర్ 12న ముంబయ్‌లో జరునున్న సంగతి తెలిసిందే. వీరి ఎంగేజ్మెంట్ ఇటలీ లేక్ కోమోలో ఇటీవలే అట్టహాసంగా జరిగింది. బాలీవుడ్ తారాగణమంతా ఈ వేడుకకు హాజరై సందడి చేశారు. మరో నెల రోజుల్లో ఒక్కటి కాబోతున్న ఇషా, ఆనంద్‌ల పెళ్లికి సంబంధించిన ప్రతి చిన్న విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అత్యంత రిచ్‌గా రూపొందిన వీరి వెడ్డింగ్ కార్డు అందర్నీ ఔరా అనిపించగా.. తాజాగా.. ఈ సంపన్నుల పెళ్లి వేడుకకు సంబంధించి మరో విషయం వైరల్ అయింది. (ఇషా అంబానీ గ్రాండ్ వెడ్డింగ్‌కార్డు.. వైరల్) 2012లోనే కొనుగోలు వివాహానంతం ఇషా, ఆనంద్ 50 వేల అడుగుల విస్తీర్ణం గల ‘గులితా’ అనే భారీ బంగ్లాలో కాపురం ఉండబోతున్నారని సమాచారం. అరేబియన్ సముద్రం ఒడ్డున గల ఈ ‘గులితా’ బిల్డింగ్ హిందుస్థాన్ యునిలివర్ అధీనంలో ఉండగా.. రూ.450 కోట్లు పెట్టి పిరమాల్ సంస్థ 2012లో కొనుగోలు చేసింది. ఆనంద్‌కు వెడ్డింగ్ గిఫ్ట్‌గా అతని తల్లి దండ్రులు స్వాతి, అజయ్ పిరమాల్ ఈ ఖరీదైన భవనాన్ని కొనిపెట్టారట. ఇక బ్రిటీష్ రాయల్ ఫ్యామిలీ నివాసముండే బకింగ్‌హామ్‌లోని ప్యాలెస్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నివాసం. కాగా, భారత కుబేరుడు ముఖేష్ అంబానీ ‘అంటిల్లా’ ప్రపంచంలోనే రెండో ఖరీదైన ఇల్లుగా గుర్తింపు పొందిన విషయం విదితమే. ‘అంటిల్లా’నిర్మాణ వ్యయం 14 వేల కోట్లు. -
ఇషా అంబానీ ఖరీదైన శుభలేఖ
-
ఇషా అంబానీ గ్రాండ్ వెడ్డింగ్‌కార్డు.. వైరల్
వివాహ ఆహ్వాన పత్రికలను వినూత్నంగా తయారు చేయించడం ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. తమ సంపదను చాటుకోవడానికి, తమ గొప్పతనాన్ని నలుగురి ముందు ప్రదర్శించడానికి శుభలేఖలను గ్రాండ్‌గా రూపొందించడం తెలిసిందే. ఇటీవల ప్రముఖ వ్యాపారవేత్త ముకేష్ అంబానీ, నీతా అంబానీల తనయుడు ఆకాశ్ అంబానీ నిశ్చితార్థం వేడుక సందర్భంగా అత్యంత గ్రాండ్‌గా రూపొందించిన ఆహ్వాన పత్రిక వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా అంబానీ ఇంట మరో శుభకార్యం జరగబోతోంది. ముకేశ్, నీతాల కూతురు ఈషా అంబానీ, ఆనంద్ పిరమిల్‌ను పెళ్లి చేసుకోబోతున్నారు. అత్యంత రిచ్‌గా రూపొందిన వీరి వెడ్డింగ్ కార్డు ఇప్పుడు ఇంటర్నెట్ను ఊపేస్తోంది. అత్యంత అట్టహాసంగా భారీ వ్యయంతో రూపొందిన ఈ శుభలేఖను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. వెడ్డింగ్ కార్డు విశేషాలు.. రిచ్ లుక్‌తో అందంగా అలంకరించిన ఓ బాక్స్ రూపంలో ఉన్న వీరి వెడ్డింగ్ కార్డు వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. బాక్స్‌పైన ఇషా, ఆనంద్ పేర్లలోని మొదటి ఆంగ్ల అక్షరాలు ఉబ్బెత్తుగా ముద్రించారు. బాక్స్‌లో వధువరూల వివరాలు, వివాహ ముహూర్తంతోపాటు.. అందులోని పలు బాక్స్‌ల్లో కానుకలు ఉన్నాయి. డైరీ రూపంలో ఉన్న పేజీల్లో దేవతల ఫోటోలతోపాటు విలువైన గాజులు కూడా ఇందులో ఉన్నాయి. -
ఇషా - ఆనంద్ వెడ్డింగ్ కార్డ్ వైరల్ వీడియో
సాక్షి, ముంబై: రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ, నీతాల ముద్దుల తనయ ఇషా అంబానీల రాయల్ వెడ్డింగ్ వేడుక అంశం మరోసారి వార్తల్లోకొచ్చింది. త్వరలోనే అంగరంగ వైభవంగా జరగనున్న ఇషా, ఆనంద్ పిరామల్ (ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ పిరామల్ ఇండస్ట్రీస్ చైర్మన్ అజయ్ పిరామల్ తనయుడు) మూడుముళ్ల సంబరానికి శుభముహూర్తం దగ్గరపడుతోంది. అత్యంతఘనంగా నిశ్చాతార్థ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్న వీరి వివాహ ఈ వేడుక కోసం దేశీయ మీడియాతోపాటు అంతర్జాతీయ మీడియాకూడా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ నేపథ్యంలో వీరి పెళ్లి శుభలేఖకు సంబంధించిన వీడియో ఒకటి నెట్ లో చక్కర్లు కొడుతోంది. కార్పొరేట్ కుటుంబాలకు తగినట్టుగా నాలుగు చిన్న బంగారు బాక్సుల్లో, అందంగా అమర్చిన అమ్మవారి చిత్రంతో రూపుదిద్దుకున్న ఈ గోల్డెన్ కార్డు ఆహ్వానితులను ఆకట్టుకోనుంది. కాగా డిసెంబర్10న పెళ్లి పీటలెక్కనున్న ఇషా అంబానీ-ఆనంద్ పిరమల్ వివాహ వేడుకుకు సంబంధించి ఇప్పటికే పలు వార్తలు నెటిజనులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా డిసెంబర్ 8, 9 తేదీల్లో రెండు రోజులపాటు నిర్వహించనున్న సంగీత్ కార్యక్రమంలో ప్రముఖ ఇంటర్నేషనల్ పాప్ స్టార్ బియాన్సే ప్రదర్శన ఇవ్వనున్నారనీ, ఇందుకు ఆమెకు భారీగానే ( రూ.15 కోట్లు) పారితోషికం ఆఫర్ చేశారట. ఈ లవ్‌బర్డ్స్ నిశ్చితార్థ కార్యక్రమాన్ని గత నెలలో ఇటలీలో అధికారికంగా పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ईशा अंबानी-आनंद पीरामल की शाही शादी का कार्ड, खुलते ही होंगे इस देवी के दर्शन#IshaAmbani #Ambani #IshaAnandambani #WeddingInvite pic.twitter.com/CbCVR56djW — Whats In The News (@_whatsinthenews) November 5, 2018 -
ఇషా అంబానీ వివాహం : మొదటి ఆహ్వానం ఎవరికంటే
ముంబై : అంబానీ కుటుంబంలో సంతోషాలు వరుస కడుతున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ముఖేష్ అంబానీ, నీతా అంబానీల గారాల పట్టి ఇషా అంబానీ, పిరమాల్ గ్రూప్ వారసుడు ఆనంద్ పిరమాల్ ఎంగేజ్మెంట్ ఇటలీ లేక్ కోమో అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. డిసెంబర్లో వీరి వివాహ వేడుక జరగనున్నట్లు సమాచారం. అయితే ఇప్పటి వరకూ దీని గురించి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ ఇప్పటికే ఇరు కుటుంబాలు పెళ్లి పనులు ప్రారంభించారు. ఈ క్రమంలో నిన్న రాత్రి అంబానీ కుటుంబ సభ్యులు ముంబైలోని ప్రసిద్ధ సిద్ధి వినాయకుని ఆలయాన్ని సందిర్శించారు. ఇషా - పిరమిల్‌ల తొలి వివాహ ఆహ్వాన పత్రికను వినాయకుని పాదాల చెంత ఉంచి ఎటువంటి విఘ్నాలు లేకుండా తమ కుమార్తె వివాహం జరగాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముకేష్ అంబానీ దంపతులతో పాటు వారి కుమారుడు అనంత్ అంబానీ.. ముకేష్ అంబానీ తల్లి కోకిలా బెన్ కూడా హాజరయ్యారు. గతంలో ముకేష్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ - శ్లోకా మెహతాల తొలి నిశ్చితార్థపు ఆహ్వాన పత్రికను కూడా ఇదే ఆలయంలో ఉంచి పూజలు నిర్వహించారు. -
హ్యాపీ బర్త్‌డే ఇషా : ‘సంగీత్’ పై ఆసక్తికర వార్త
సాక్షి, ముంబై: రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ, నీతాల ముద్దుల తనయ ఇషా అంబానీ వివాహం వేడుక అంశం మరోసారి వార్తల్లో కిచ్చింది. త్వరలోనే అంగరంగ వైభవంగా జరగనున్న ఇషా, ఆనంద్ పిరామల్ (ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ పిరామల్ ఇండస్ట్రీస్ చైర్మన్ అజయ్ పిరామల్ తనయుడు)మూడుముళ్ల సంబరానికి ముందస్తు కార్యక్రమాలను ఘనంగా నిర్వహించేందుకు ఈ కార్పొరేట్ కుటుంబాలు ప్లాన్ చేశాయి. పెళ్లిలో ప్రధాన ఘట్టమైన సంగీత్ ను స్పెషల్ ఎట్రాక్షన్‌తో చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయనున్నాయని మీడియాలో పలు అంచనాలు గుప్పుమన్నాయి. డిసెంబర్ 8, 9 తేదీల్లో రెండు రోజులపాటు నిర్వహించనున్న సంగీత్ కార్యక్రమానికి ప్రముఖ పాప్ సింగర్ ప్రదర్శన ఇవ్వనున్నారట. అంతేకాదు ఇందుకు ఆమె భారీగా పారితోషికాన్ని కూడా ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. ఈ ప్రీ రాయల్ వెడ్డింగ్ బాష్‌ను ఉదయపూర్‌లో ప్లాన్ చేశారట. ప్రముఖ ఇంటర్నేషనల్ పాప్ స్టార్ బియాన్సే ఈ సంగీత్ కార్యక్రమంలో తన ప్రదర్శనతో హల్ చల్ చేయనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇందుకోసం ఆమెకు రూ.15 కోట్లు పారితోషికం ఆఫర్ చేశారని తెలుస్తోంది. కాగా డిసెంబర్10న ముంబైలో వీరు పెళ్లి పీటలెక్కనున్నారట. ఈ లవ్‌బర్డ్స్ నిశ్చితార్థ కార్యక్రమాన్ని గత నెలలో ఇటలీలో అధికారికంగా పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు అక్టోబర్ 23 ఇషా అంబానీ 27వ పుట్టిన రోజు. -
వారిద్దరిపైనే అందరి చూపులు
ముఖేష్ అంబానీ, నీతా అంబానీల గారాల పట్టి ఇషా అంబానీ, పిరమాల్ గ్రూప్ వారసుడు ఆనంద్ పిరమాల్ ఎంగేజ్మెంట్ ఇటలీ లేక్ కోమో అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ తారాగణం సందడితో, వీరి ఎంగేజ్మెంట్ ఎంతో మెమరబుల్‌గా నిలిచింది. పూల పందిరి కింద ఇషా, ఆనంద్‌లు ఒకరినొకరు రింగ్‌లు మార్చుకుని, సగం పెళ్లి వేడుకను పూర్తి చేసుకున్నారు. అచ్చం సినిమాల్లో చూసిన మాదిరి ముఖేష్ అంబానీ తన కూతురు ఇషాను నడిపించుకుంటూ వచ్చి, ఆనంద్‌కు అప్పజెప్పడం ఎంతో ముచ్చటగా కనిపించింది. ఇషా చేయి పట్టుకుని ముఖేష్ అంబానీ నడిపించుకుంటూ వస్తుంటే.. వారి వెనుకాలే అంబానీ పెద్ద కొడుకు ఆకాశ్ అంబానీ, త్వరలో పెళ్లి చేసుకోబోతున్న శ్లోకా మెహతా, చిన్న కొడుకు అనంత్ అంబానీ, రూమర్డ్ గర్ల్‌ఫ్రెండ్ రాధికా మెర్చంట్లు కూడా చేతిలో చేయి వేసుకుని నడుచుకుంటూ వచ్చారు. ఇప్పటి వరకు ఆకాశ్-శ్లోకా, ఇషా-ఆనంద్ పెళ్లిళ్లను మాత్రమే ముఖేష్ అంబానీ అధికారికంగా ప్రకటించారు. అనంత్, రాధిక పెళ్లి వార్త అప్పటి నుంచి చక్కర్లు కొడుతూనే ఉంది. కానీ ఇప్పటి వరకు అంబానీ కుటుంబం నుంచి కానీ, రాధిక ఫ్యామిలీ నుంచి ఎటువంటి సంకేతాలు రాలేదు. తాజాగా ఇషా ఎంగేజ్మెంట్ వేడుకలో వీరిద్దరూ జంటగా కనిపించడం, ప్రతి ఒక్కర్ని ఆశ్చర్యపరిచింది. అందరి చూపులు వారిపైనే నిలిచాయి. అనంత్, రాధికలు కూడా చిన్నప్పటి నుంచి స్నేహితులే. కొన్ని రోజులుగా వీరు డేటింగ్ చేస్టున్నట్టు తెలుస్తోంది. రాధిక యాంకర్ హెల్త్‌కేర్ సీఈవో, వైస్-చైర్మన్ విరేన్ మెర్చంట్ కూతురు. న్యూయార్క్ యూనివర్సిటీలో చదువుకుని భారత్‌కు తిరిగి వచ్చారు. ఇషా ఎంగేజ్మెంట్లో వీరిద్దరే స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. స్టన్నింగ్ రెడ్ డ్రెస్‌లో రాధిక మైమరిపించారు. అంతకముందు అనంత్ ఎంగేజ్మెంట్ వేడుకలో కూడా రాధిక, తన డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో అదరగొట్టారు. అప్పుడే అనంత్, రాధికల రిలేషన్ గురించి, బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ టీజ్ కూడా చేశారు. -
ఇషా ఎంగేజ్మెంట్లో రాధిక కూడా!!
భారతీయ కుబేరుడు ముఖేశ్ అంబానీ ఇంట త్వరలోనే పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఇప్పటికే ఆకాశ్ అంబానీ- శ్లోకా మెహతా, ఇషా- ఆనంద్ పిరమాల్‌ల ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. ఇక అంబానీ ఫ్యామిలీలో చిన్నవాడైన అనంత్ అంబానీ కూడా వివాహానికి సిద్ధమైనట్టుగానే కన్పిస్తోంది. యాంకర్ హెల్త్‌కేర్ సీఈవో, వైస్ చైర్మన్ విరైన్ మెర్చంట్ కూతురు రాధికా మర్చంట్‌తో అనంత్ ప్రేమలో ఉన్నాడంటూ వార్తలు వచ్చాయి. వీరిద్దరికి సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కానీ అంబానీ ఫ్యామిలీ మాత్రం ఈ వార్తలను ఖండించింది. అయితే లోకో కోమోలో జరిగిన ఇషా ఎంగేజ్మెంట్లో వీరిద్దరు చేతిలో చేయి వేసుకుని నడుస్తున్న వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారడంతో వీరి రిలేషన్ నెట్టింట మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. వీడియోలో ఏముందంటే.. ఇషా ఎంగేజ్మెంట్ వేడుకలో.. ఇషా చేయి పట్టుకుని ముఖేశ్ అంబానీ ఆనంద్ దగ్గరికి తీసుకువస్తున్న సమయంలో.. ఆయన వెనుకే నడుస్తున్న ఆకాశ్ అంబానీ కాబోయే భార్య శ్లోకా మెహతా చేయి పట్టుకుని నడుస్తుండగా.. అనంత్ రాధిక చేయి పట్టుకుని నడుస్తున్నాడు. దీంతో అనంత్- రాధికల ప్రేమకు కూడా అధికారికంగా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టే ఉందంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కాగా లోకో కోమోలో జరిగిన ఎంగేజ్మెంట్ పార్టీలో ఇషా పీచ్ కలర్ డిజైనర్ గౌన్‌లో మెరిసిపోగా.. ఆనంద్ పిరమాల్ గ్రీన్ కలర్ షేర్వానీలో వెలిగిపోయారు. మూడు రోజుల పాటు నిర్వహించిన ఈ వేడుకకు సోనమ్ కపూర్ దంపతులు, ప్రియాంక చోప్రా - నిక్ జోనాస్, జాన్వీ కపూర్, ఖుషీ కపూర్, కరణ్ జోహర్, మనీష్ మల్హోత్ర వంటి బాలీవుడ్ ప్రముఖలు హాజరయ్యారు. View this post on Instagram #IshaAnandEngagement In #LakeComo #Italy. #IshaAnand A post shared by salil sand (@salilsand) on Sep 22, 2018 at 12:13pm PDT -
‘ఇషూ.. నువ్వు ఇప్పటికి అలానే ఉన్నావ్’
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీల గారాల పట్టి ఇషా అంబానీ ఎంగేజ్మెంట్ పిరమాల్ గ్రూప్ వారసుడు ఆనంద్ పిరమాల్‌తో ఇటలీలోని లేక్ కొమో వద్ద ఆదివానం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా భరత్ అనే నేను ఫేం కియారా అద్వాని తన బెస్ట్ ఫ్రెండ్ ఇషాకు శుభాకాంక్షలు తెలుపుతూ అద్భుతమైన ఫోటోలను పోస్ట్ చేశారు. దాంతో పాటు ‘ప్రతి ఒక్కరి జీవితంలో కొందరు ప్రత్యేకమైన వ్యక్తులు ఉంటారు. వారు మనతో పాటు పెరుగుతూ మన జీవితాంతం కలిసి ఉంటారు. ఇషు.. నేను నిన్ను తొలిసారి కలిసినప్పుడు నువ్వు ఎంత వినయంగా ఉన్నావో ఇప్పటికి అలానే ఉంటూ అంతే శ్రద్దగా నన్ను చూసుకోవడం నిజంగా అద్భుతం. మన బాల్యాన్ని ఎన్నటికి మరవను.. ఇషా అంబానీ, ఆనంద్ పిరమాల్‌కు అభినందనలు ప్రేమతో నీ అలియూ’ అనే సందేశాన్ని పోస్టు చేశారు. View this post on Instagram There are some special people who are a part of your life and you grow up with. My oldest friend, still as caring, as humble and as amazing as you were when we first met! My to be bridey, Ishu never ever let the child in you grow up❤️ forever your Aliu 👯♂️ Congratulations @_iiishmagish @anandpiramal 💍🎉Comofomo🙃 A post shared by KIARA (@kiaraaliaadvani) on Sep 22, 2018 at 9:49pm PDT రిలయన్స్ అధినేత గారాల పట్టి ఇషా అంబానీ ఎంగేజ్మెంట్ పిరమాల్ వారసుడు ఆనంద్ పిరమాల్ జరిగింది. నిశ్చితార్థం వేడుకలో ఇషా పీచ్ కలర్ డిజైనర్ గౌన్‌లో మెరిసిపోగా ఆనంద్ పిరమాల్ గ్రీన్ కలర్ షేర్వానీలో వెలిగిపోయారు. మూడు రోజుల పాటు నిర్వహించిన ఈ వేడుకకు సోనమ్ కపూర్ దంపతులు, ప్రియాంక చోప్రా - నిక్ జోనాస్, జాన్వీ కపూర్, ఖుషీ కపూర్, కరణ్ జోహర్, మనీష్ మల్హోత్ర వంటి బాలీవుడ్ ప్రముఖలు హాజరయ్యారు. -
ఇషా ఎంగేజ్మెంట్ : తరలివెళ్తున్న తారాగణం
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీల గారాల పట్టి ఇషా అంబానీ ఎంగేజ్మెంట్ పిరమాల్ గ్రూప్ వారసుడు ఆనంద్ పిరమాల్‌తో నేడు ఇటలీలో అంగరంగ వైభవంగా జరగబోతుంది. ఇటలీ ఉత్తర ప్రాంతంలోని ఆల్ఫ్స్ పర్వత ప్రాంతాల్లో ఉన్న లేక్ కొమో వద్ద వీరి నిశ్చితార్థం గ్రాండ్‌గా జరగనుంది. వీరి ఎంగేజ్మెంట్ కోసం అతిరథ మహారథులు, బాలీవుడ్ తారాగణం తరలి వెళ్తోంది. ఇప్పటికే ప్రియాంక చోప్రా, ఆమె కాబోయే భర్త నిక్ జోనస్ ఇటలీకి చేరుకున్నారు. వీరితోపాటు డిజైనర్ మనీష్ మల్హోత్రా కూడా ఇషా ఎంగేజ్మెంట్ కోసం లేక్ కొమో వెళ్లారు. శ్రీదేవీ ముద్దు బిడ్డ, ధడక్ సినిమా హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా ఈ గ్రాండ్ వేడుకకు హాజరయ్యేందుకు ఇటలీకి పయనమయ్యారు. శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ ఇప్పటికే అక్కడికి వెళ్లారు. శుక్రవారమే మిలాన్ ఫ్యాషన్ వీక్ నుంచి వచ్చిన సోనమ్ కపూర్ కూడా ఈ వేడుకలో పాలుపంచుకోనున్నారు. సోనమ్ తండ్రి కూడా ఈ వేడుకలో సందడి చేయబోతున్నారు. బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ కూడా ఇటలీకి చేరుకున్నారు. మూడు రోజుల పాటు... ఈ వీకెంట్ అంతా ఓ పండుగలా ఇషా, ఆనంద్‌ల ఎంగేజ్‌మెంట్‌ను అంబానీ ఫ్యామిలీ నిర్వహిస్తోంది. సెప్టెంబర్ 21 నుంచి మొదలైన ఎంగేజ్మెంట్ వేడుకలు, రేపటి వరకు జరగనున్నాయి. హలీవుడ్ సెలబ్రిటీలకు లేక్ కోమో ఎంతో ఇష్టమైన ప్రదేశం. అక్కడే గ్రాండ్‌గా అతిథులకు అంబానీ పార్టీ ఇవ్వబోతున్నారు. డిసెంబర్లో ఇషా-ఆనంద్ వివాహం జరగనుంది. ఈ ఏడాది మే నెలలో ఆనంద్ ఇషాకు ప్రపోజ్ చేసిన ఫొటోలు బయటకు రావడం.. ఆ తర్వాత వారి పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించి లంచ్ పార్టీలు ఇవ్వడం జరిగాయి. ఇషా-ఆనంద్ నిశ్చితార్థం జరగనున్న లేక్ కొమో ఉత్తర ఇటలీలోని లాంబార్డీ ప్రాంతంలో ఉంది. అందమైన బీచ్‌లు, చూపుతిప్పుకోనివ్వని ప్రకృతి అందాలకు ఈ ప్రాంతం పెట్టింది పేరు. పురాతన చర్చిలు, ఫెర్రీలు, పర్యాటకుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన పడవలు.. ఇలా ఇక్కడ బోలెడు ఆకర్షణలున్నాయి. -
ఇషా అంబానీ ఎంగేజ్మెంట్ అక్కడే...
భారతీయ కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ గారాల పట్టి ఇషా అంబానీ వివాహం.. పిరమాల్ గ్రూప్ చైర్మన్ అజయ్ పిరమాల్ తనయుడు ఆనంద్ పిరమాల్ తో జరుగనున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ప్రారంభంలో మహాబలేశ్వర్‌లోని గుడిలో ఆనంద్ ఇషాకు ప్రపోజ్ చేశాడు. వీరివురి ప్రేమకు ఇరు కుటుంబాల నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దీంతో రెండు కుటుంబాలు కలిసి మే నెలలో ఓ ప్రైవేట్ పార్టీ నిర్వహించి ప్రేమజంటను ఆశీర్వదించారు. కాగా ప్రస్తుతం వీరిద్దరి ఎంగేజ్‌మెంట్‌ను సంప్రదాయబద్ధంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వేదిక ఎక్కడంటే.. జాతీయ మీడియా కథనం ప్రకారం.. ఇషా, ఆనంద్‌ల ఎంగేజ్మెంట్కు ఇటలీలోని ‘లేక్ కోమో’ వేదిక కానుంది. హాలీవుడ్ సెలబ్రిటీల ఫేవరెట్ ప్లేస్, అత్యంత ఖరీదైన హాలీడే స్పాట్ లేక్ కోమోలో.. సెప్టెంబరు 21 నుంచి 23 వరకు మూడు రోజుల పాటు నిశ్చితార్థ వేడుకలు అట్టహాసంగా జరుగనున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం అతిథులకు అంబానీ దంపతులు లావిష్ లంచ్, డిన్నర్ ఏర్పాటు చేయనున్నారు. ఇక ఆరోజు సాయంత్రం నుంచి లేక్ కోమోలోని విల్లా బల్బియానోలో నిశ్చితార్థ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. ఇక రెండో రోజు సంగీత్, డిన్నర్లతో ముగియనుంది. ఆదివారం లంచ్‌తో అతిథులకు వీడ్కోలు పలుకనున్నారు. మూడు రోజుల పాటు..కార్యక్రమాలు- డ్రెస్‌కోడ్ మొదటి రోజు : లంచ్- బెనవెంటో కోమో(కోమోకి స్వాగతం) డ్రెస్‌కోడ్- క్యాజువల్ చిక్, డిన్నర్- అమోర్ ఈ బెల్లోజా (లవ్ అండ్ బ్యూటీ) డ్రెస్‌కోడ్- ఇండియన్ ఫార్మల్స్ విత్ బ్లాక్ టై. రెండోరోజు : లంచ్- ఫీరా బెల్లా ఇటాలియా(బ్యూటిఫుల్ ఫేర్ ఇటలీ), డ్రెస్‌కోడ్- కోమో చిక్, సంగీత్- ట్రూలీ ఇటాలియన్ డ్రెస్‌కోడ్- కాక్టేల్ అట్టైర్ మూడోరోజు : లంచ్- గుడ్‌బై కోమో, డ్రెస్‌కోడ్- క్యాజువల్ డ్రెస్ కోడ్ -
కాబోయే భర్తతో కలిసి ఇషా సందడి
బిలీనియర్, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ గారాల పట్టి ఇషా అంబానీ స్టాన్ఫోర్డ్ నుంచి గ్రాడ్యుయేట్ డిగ్రీ పొందారు. యూనివర్సిటీ 127వ ప్రారంభోత్సవ వేడుకల్లో తన గ్రాడ్యుయేషన్ పట్టాను అందుకున్నారు. స్టాన్ఫోర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి ఇషా అంబానీ, మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్(ఎంబీఏ) పూర్తి చేశారు. తన గ్రాడ్యుయేషన్ డే వేడుకను కుటుంబ సభ్యులతో కలిసి పంచుకున్నారు. ఈ వేడుకలో తన కాబోయే భర్త ఆనంద్ పిరామల్, వారి కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. మొత్తం 2460 మంది విద్యార్థులు ఈ వేడుకలో పట్టాలు అందుకున్నారు. ఇషా అంతకముందు సైకాలజీలో డిగ్రీ పట్టా పుచ్చుకుని, యేల్ విశ్వవిద్యాలయంలో సౌత్ ఏషియన్ స్టడీస్ పూర్తిచేశారు. ఇషా తల్లికి తగ్గ తనయ మాదిరి, ఎంబీఏ చదువుకుంటూనే స్టాన్ఫోర్డ్ నర్సరీలో టీచర్ ఉద్యోగం కూడా చేసింది. ఇషా అంబానీ గ్రాడ్యుయేషన్ డే ఫోటోలు మీకోసం... -
పొద్దున లేవగానే ఇషాను చూడాల్సిందే!
ముంబై : ధీరుబాయి అంబానీగా పేరుపొందిన ధీరాజ్లాల్ హిరచాంద్ అంబానీ గురించి ప్రతి ఒక్కరికీ తెలిసే ఉంటుంది. పేదరికం నుంచి అత్యంత ధనికుడైన భారతీయుడు ఇతను. ఆయన స్థాపించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇప్పుడు ప్రపంచ వ్యాపారాల్లో ఒకటిగా ఉంది. ప్రపంచ అత్యంత ధనిక కుటుంబాలలో ప్రస్తుతం అంబానీలది కూడా ఒకటి. తొలిసారి 1977లో రిలయన్స్ పబ్లిక్ ఇష్యూకు వెళ్లింది. ఇక అప్పటి నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ తప్పకుండా ప్రతేడాది ఇన్వెస్టర్లతో ముచ్చటించడం, వారి సలహాలను, సూచనలను స్వీకరించడం, కొత్త కొత్త ఆవిష్కరణలను లాంచ్ చేయడం పరిపాటిగా వస్తోంది. రిలయన్స్ ఏజీఎం, ఇతర కంపెనీలలతో పోలిస్తే చాలా ప్రత్యేకమైనది. ఈ సమావేశంలో ఇన్వెస్టర్లతో ముచ్చటించడం జరుగుతుంది. పెట్టుబడిదారులు అడిగే ప్రశ్నలకు, చైర్మన్ ముఖేష్ సమాధానాలు ఇస్తూ ఉంటారు. ఇలా ఇన్వెస్టర్ల సలహాలు, సూచనలు, ప్రశ్నలతో ఈ సమావేశం ఎంతో ముచ్చటగా జరుగుతూ ఉంటుంది. గతవారంలో కూడా రిలయన్స్ తన 41వ వార్షిక సాధారణ సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశానికి కూడా చైర్మన్ ముఖేష్ అంబానీ, ఆయన భార్య నీతా అంబానీ, తల్లి కోకిలాబెన్, అంబానీల గారాలపట్టి ఇషా అంబానీ, పెద్ద కొడుకు ఆకాశ్ అంబానీ, ఆయనకు కాబోయే భార్య శ్లోకా మెహతా, చిన్న కొడుకు అనంత్ అంబానీ ఇలా అందరూ ఇన్వెస్టర్ల సమావేశానికి హాజరయ్యారు. దక్షిణ ముంబై ఆడిటోరియమంతా కంపెనీ పెట్టుబడిదారులతో నిండిపోయింది. ఈ సమావేశంలో ఓ స్పీకర్, ముఖేష్ తండ్రి ధీరూభాయ్ అంబానీ గురించి ఎవరికీ తెలియని ఓ విషయాన్ని రివీల్ చేశారు. ధీరూభాయ్ అంబానీ తన రోజును అంబానీల ప్రిన్సెస్ ఇషా అంబానీని చూసిన తర్వాతనే ప్రారంభించేవారని చెప్పారు. పొద్దున లేవగానే ధీరూభాయ్ అంబానీ తొలుత ఇషా అంబానీ ఫోటోను చూస్తారని, ఆ అనంతరమే టీ లేదా టిఫిన్ తీసుకుని తన రోజూవారీ కార్యకలాపాలకు సిద్ధమవుతారని తెలిపారు. ప్రస్తుతం ఇషా మన కళ్ల ముందే పెరిగి, టెలికాం రంగంలో పెను సంచలనమైన జియోను ఆవిష్కరించినట్టు ఇన్వెస్టర్ల సమావేశంలో కొనియాడారు. అంటే ధీరూభాయ్‌కి ఇషా అంటే అంత ఇష్టమనమాట. ముఖేష్ అంబానీకి కూడా ఇషా అంటే ప్రాణమని పలు సందర్భాల్లో వెల్లడైంది. పెద్ద కొడుకు ఆకాశ్ పెళ్లితో పాటు, వారి గారాల పట్టి ఇషా పెళ్లిని కూడా పిరమాల్ గ్రూప్ వారసుడు ఆనంద్ పిరమాల్‌తో నిశ్చయమైన సంగతి తెలిసిందే. ఇషా పెళ్లి ప్రకటన చేసిన అనంతరం నిర్వహించిన పార్టీల్లో ముఖేష్ తన కూతురితో కలిసి డ్యాన్స్‌లు కూడా వేశారు. ఇటీవల ఆకాశ్-శ్లోకాల ఎంగేజ్మెంట్లో కూడా ముఖేష్ తన కూతురి ఇషాతో వేసిన డ్యాన్స్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. -
ఆకాశ్, శ్లోకల ప్రీ-ఎంగేజ్మెంట్లో నీతా అంబానీ డ్యాన్స్
-
ఆకాశ్-శ్లోకా మెహతాల మెహందీ ఫంక్షన్