
ప్రముఖ వ్యాపారవేత్త, భారతీయ కుబేరుడు ముఖేష్ అంబానీ కుమార్తె 'ఇషా అంబానీ' (Isha Ambani) ఇటీవల వోగ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ఐవీఎఫ్ ద్వారా కవలలకు జన్మనిచ్చినట్లు వెల్లడించారు.

తన తల్లి నీతా అంబానీ కూడా ఆకాష్‌కి గర్భం దాల్చినప్పుడు ఈ ప్రక్రియనే ఎంచుకున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

నేను ఐవీఎఫ్‌తో పిల్లలకు జన్మనిచ్చిన విషయాన్ని తొందరగానే వెల్లడించాను.

ఎందుకంటే ప్రస్తుతం చాలామంది ఈ ప్రక్రియనే ఎంచుకుంటున్నారు. ఈ విషయాన్ని చెప్పడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు.

టెక్నాలజీ వేగంగా డెవలప్ అవుతున్న తరుణంలో ఐవీఎఫ్ ఎందుకు ఎంచుకోకూడదు? అని ఇషా అంబానీ అన్నారు.

ఇషా అంబానీ 2018లో ఆనంద్ పిరమల్‌ను వివాహం చేసుకున్నారు.

ఆ తరువాత 2022లో ఆదిత్య, కృష్ణ అనే ఇద్దరు పిల్లలు జన్మించారు.






