IVF
-
ఐవీఎఫ్ తండ్రిని నేను: డొనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ మరో వివాదానికి తెరతీశారు. కృత్రిమ గర్భధారణ(ఐవీఎఫ్)కు తాను తండ్రి లాంటివాడినని చెప్పారు. తాను అధికారంలోకి వస్తే ఐవీఎఫ్(ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్)ను ఉచితం చేస్తానని ప్రకటించారు. తాజాగా జార్జియాలో ఫాక్స్ న్యూస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కృత్రిమ గర్భధారణకు తమ పార్టీ పూర్తి అనుకూలమని స్పష్టంచేశారు. ఈ విషయంలో డెమొక్రటిక్ పార్టీ నేతలు తమపై మాటల దాడి చేస్తారని తెలిసినప్పటికీ ఐవీఎఫ్‌కు మద్దతు ఇస్తూనే ఉంటామని అన్నారు. కొన్ని రాష్ట్రాల్లో గర్భవిచ్చిత్తి చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయని, వాటిని మార్చాల్సిన అవసరం ఉందని చెప్పారు. అబార్షన్ హక్కులను రాష్ట్రాలకే వదిలేయాలన్నది తన విధానమని స్పష్టంచేశారు. అత్యాచారం వల్ల గర్భం దాలిస్తే, గర్భం దాలి్చన తల్లి ప్రాణానికి ముప్పు ఉంటే గర్భవిచ్చిత్తికి అనుమతి ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. అయితే, ఉచిత ఐవీఎఫ్ పథకానికి నిధులు ఎలా సమకూరుస్తారో ట్రంప్ వెల్లడించలేదు. అలాగే చట్టపరమైన ఇబ్బందులను ఎలా ఎదుర్కొంటారని తెలియజేయలేదు. ఐవీఎఫ్ తండ్రిని అంటూ ట్రంప్ చేసిన ప్రకటనను ట్రంప్ ప్రత్యర్థి, డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ తప్పుపట్టారు. -
సిగ్గు పడేదేముంది? ఐవీఎఫ్ ద్వారానే పిల్లల్ని కన్నా: ఇషా అంబానీ
ప్రముఖ వ్యాపారవేత్త, భారతీయ కుబేరుడు ముఖేష్ అంబానీ కుమార్తె 'ఇషా అంబానీ' (Isha Ambani) ఇటీవల వోగ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ఐవీఎఫ్ ద్వారా కవలలకు జన్మనిచ్చినట్లు వెల్లడించారు. తన తల్లి నీతా అంబానీ కూడా ఆకాష్‌కి గర్భం దాల్చినప్పుడు ఈ ప్రక్రియనే ఎంచుకున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు.నేను ఐవీఎఫ్‌తో పిల్లలకు జన్మనిచ్చిన విషయాన్ని తొందరగానే వెల్లడించాను. ఎందుకంటే ప్రస్తుతం చాలా మంది ఈ ప్రక్రియనే ఎంచుకుంటున్నారు. ఈ విషయాన్ని చెప్పడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు. టెక్నాలజీ వేగంగా డెవలప్ అవుతున్న తరుణంలో ఐవీఎఫ్ ఎందుకు ఎంచుకోకూడదు? అని ఇషా అంబానీ అన్నారు.ఇషా అంబానీ 2018లో ఆనంద్ పిరమల్‌ను వివాహం చేసుకున్నారు. ఆ తరువాత 2022లో ఆదిత్య, కృష్ణ అనే ఇద్దరు పిల్లలు జన్మించారు. ప్రస్తుతం చాలా జంటలు ఐవీఎఫ్ ద్వారా పిల్లలను కంటున్నారు, సంతోషంగా ఉంటున్నారు.ఐవీఎఫ్ అంటే ఏమిటి?ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) అనేది ఒక వైద్య ప్రక్రియ. ఈ ప్రక్రియలో అండాన్ని, శుక్రకణాలను ఫలదీకరణం చేస్తారు. ఆ తరువాత ఫలదీకరణం చేసిందిం రెండు లేదా మూడు పిండాలను స్త్రీల గర్భాశయంలోకి ప్రవేశపెడతారు. ఆ పిండాలు గర్బాశయంలోనే పెరుగుతాయి. ఈ పద్దతిలో చాలామందికి ట్విన్స్ జన్మించే అవకాశం ఉంది. -
ఐవీఎఫ్ ద్వారా కవలలకు జన్మనిచ్చా.. తల్లి బాటలోనే ఈషా అంబానీ (ఫొటోలు)
-
భర్త చనిపోయిన 15 నెలలకు బిడ్డకు జన్మనిచ్చిన మోడల్.. ఎలాగో తెలుసా?
భార్యభర్తల్లో ఒకరు అనూహ్యంగా ప్రాణాలు కోల్పోతే ఈ విషాదాన్ని తట్టుకోవడం, దాన్నుంచి బయటపడటం రెండో వారికి చాలా కష్టం. తమ దాంపత్యానికి గుర్తుగా పుట్టిన పిల్లల్ని చూసుకుంటూ, వారికోసం జీవితాన్ని గడిపేసే వారు ఎక్కువగా ఉంటారు కదా. కానీ ఒక ఆస్ట్రేలియన్ మహిళ తన జీవిత భాగస్వామి చనిపోయిన 15 నెలలకు బిడ్డకు జన్మనిచ్చింది. ఏంటీ అర్థం కాలేదా? అయితే మీరీ స్టోరీ చదవాల్సిందే.ఆస్ట్రేలియన్ మోడల్ ఎల్లిడీ పుల్లిన్ స్పెర్మ్ రిట్రీవల్ ద్వారా బిడ్డను కన్నది. తన పోడ్కాస్ట్లో తన ప్రయాణాన్ని పంచుకుంది. మరణానంతరం భర్త వీర్యం ద్వారా గర్భం దాల్చడం, బిడ్డను కనడం గురించి పోడ్కాస్ట్లో వివరించింది. ఈ స్టోరీ ఇపుడు వైరల్‌గా మారింది. 2022లోనే ఇన్‌స్టాలో ఈ వివరాలను షేర్ చేసింది కూడా. View this post on Instagram A post shared by El Pullin (@ellidy_) 2020 జూలైలో ఎల్లిడీ పుల్లిన్ భర్త అలెక్స్ చుంప్ అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయాడు. స్పియర్ ఫిషింగ్‌లో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ప్రాణాలు విడిచిన తన భర్తకు గుర్తుగా బిడ్డను కనాలని ఆశపడింది. ఇందుకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ, పద్ధతుల గురించి స్డడీ చేసింది. భర్త నుంచి పోస్ట్‌మార్టం స్పెర్మ్ రిట్రీవల్ చేయాలని వైద్య నిపుణులను కోరింది. డాక్టర్లు మరణించిన భర్త నుంచి స్మెర్మ్ కలెక్ట్ చేశారు. తర్వాత ఐవీఎఫ్ విధానంలో ఎల్లిడీ గర్బం దాల్చింది.అలా భర్తను కోల్పోయిన 15 నెలలకు ఎల్లిడీ ఒక ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. అక్టోబర్ 2021లో మిన్నీ అలెక్స్ పుల్లిన్కు జన్మనిచ్చింది. తన పాప అచ్చం తన భర్తలానే ఉంది అంటూ మురిసిపోయింది. ఎల్లిడీ షేర్ చేసుకున్న వివరాల ప్రకారం. 2020 ఉదయం మాజీ వింటర్ ఒలింపియన్ అలెక్స్ స్పియర్ ఫిషింగ్‌కు వెళ్లాడు. ఎల్లిడీ అప్పుడు తమ కుక్కను బయటకు వాకింగ్‌కి తీసుకెళ్లింది. కానీ ఆమె భర్తను చూడటం అదే చివరిసారి అవుతుందని అస్సలు ఊహించలేదు. చివరికి ఫేస్బుక్ పోస్ట్ ద్వారా తన భర్త చనిపోయినట్టు గుర్తించింది. ఇంతలోనే పోస్ట్‌మార్టం స్పెర్మ్ రిట్రీవల్ గురించి తన స్నేహితులు చర్చించు కోవడం ఆమెను ఆకర్షించింది. ఎందుకంటే వారు ఒక బిడ్డను కనేందుకు అప్పటికే చాలా ఆశపడడ్డారు. చివరికి ఆరు నెలల తర్వాత ఐవీఎఫ్ ద్వారా తన కలను సాకారం చేసుకుంది. -
ఐవీఎఫ్ ట్రీట్మెంట్పై కేంద్రం ఫైర్!
పంజాబ్ ర్యాపర్, దివంగత సింగర్ సిద్దు మూసేవాలా 2022లో దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఒక్కగానొక్క కొడుకు మరణం జీర్ణించుకోలేని సిద్దు తల్లిదండ్రులు తమ కొడుకును మళ్లీ చూసుకోవాలని ఆరాటపడ్డారు. ఈ క్రమంలోనే సిద్దూ మూసేవాలే తల్లిదండ్రులు మరోసారి అమ్మనాన్నలయ్యారు. సిద్దూ బల్కౌర్ సింగ్ తండ్రి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తమకు ఒక బాబు పుట్టాడని, తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నట్లు కూడా పేర్కొన్నారు. అయితే ఇక్కడ సిద్దూ తల్లి 58 ఏళ్ల చరణ్ సింగ్ ఇన్-విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) టెక్నిక్ ద్వారా బిడ్డకు జన్మనివ్వడం జరిగింది. ఇప్పుడూ ఈ అంశం వివాదంగా మారింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ వయసులో పిల్లలను కనడం కరెక్టేనా అని ప్రశ్న లేవనెత్తింది. నిజానికి ఇలా ఐవీఎఫ్ ద్వారా బిడ్డను కనడానికి గల వయో పరిమితిపై ఆరా తీసింది. అంతేగాదు సిద్దు మూస్ వాలా తల్లి చరణ్ సింగ్‌క ఐవీఎఫ్ చికిత్సపై కూడా నివేదిక ఇమ్మని పంజాబ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ (రెగ్యులేషన్) యాక్ట్, 2021లోని సెక్షన్ 21(జీ)(i) ప్రకారం..21 నుంచి 50 ఏళ్లలోపు వయోపరిమితి ఉన్నవాళ్లు మాత్రమే ఐవీఎఫ్ ద్వారా బిడ్డకి జన్మనివ్వడం సురక్షితం అని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే పంజాబ్ ప్రభుత్వం సిద్దూ మూసే వాలే తండ్రిని శిశువుకి సంబంధించిన పత్రాలను సమర్పించాలని ఆదేశించింది. దీంతో సిద్దూ తండ్రి బల్కౌర్ సింగ్ ఇన్స్టాగ్రామ్ వీడియోలో.." జిల్లా అధికారులు నన్ను వేధిస్తున్నారు. చిన్నారికి సంబంధించిన డాక్యుమెంట్స్‌ని సబ్మిట్ చేశాను. అయినా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ముఖ్యమంత్రి, అధికారులు జోక్యం చేసుకోవాలి. ట్రీట్మెంట్ జరిగేంత వరకు మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. కావాల్సినప్పుడల్లా నేను అందుబాటులోనే ఉంటాను. లీగల్ డాక్యుమెంట్స్‌ని కచ్చితంగా సబ్మిట్ చేస్తాను" View this post on Instagram A post shared by Balkaur Singh (@sardarbalkaursidhu) (చదవండి: దిగ్గజ ర్యాపర్ మళ్లీ పుట్టాడు.. 58 ఏళ్ల వయసులో బిడ్డకు జన్మనిచ్చిన తల్లి -
బుల్లితెర నటి ఐవీఎఫ్.. నాలుగో ప్రయత్నంలో విజయం.. కానీ..
పెళ్లయిన ప్రతి దంపతులకు ఎదురయ్యే ప్రశ్న.. పిల్లల్నెప్పుడు కంటారు? లేదా ఎంతమంది పిల్లలు? ఈ ప్రశ్న నుంచి తప్పించుకోని దంపతులు లేరంటే అతిశయోక్తి కాదు. సామాన్యులకే కాదు సెలబ్రిటీలకు కూడా ఈ తిప్పలు తప్పవు. బుల్లితెర స్టార్స్ మహి విజ్-జై భానుశాలి కూడా పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నారు. పిల్లల్ని ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు? అన్న ప్రశ్న వారికీ ఎదురైంది. ఒకరకంగా చెప్పాలంటే వారు కూడా సంతానం కోసం ఎంతో ఎదురుచూశారు. కానీ పిల్లలు కావాలన్న వారి కోరిక ఫలించలేదు. సంతానం కోసం ఐవీఎఫ్ దీంతో 2019లో ఐవీఎఫ్(ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్)ను ఎంచుకున్నారు. ఈ విధానం ద్వారా మహి గర్భంలో కవలలను ప్రవేశపెట్టారు. తమ సంతోషం రెట్టింపు కానుందని సంబరపడేలోపే వారి ఆనందం ఆవిరైంది. ఒక పాపాయి గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. మరో పాప మాత్రం ఆరోగ్యంగా జన్మించింది. తాజాగా ఆనాటి పరిస్థితిని గుర్తు చేసుకుంది మహి విజ్. నాలుగో ప్రయత్నంలో సక్సెస్ ఆమె మాట్లాడుతూ.. 'సంతానం కోసం ఐవీఎఫ్ పద్ధతిని ఎంచుకున్నాం. తొలి ప్రయత్నం విజయవంతం కాలేదు. మూడుసార్లు విఫలమయ్యాక నాలుగో ప్రయత్నంలో విజయవంతమైంది. ఈ గుడ్‌న్యూస్ నాకు ముందుగా నా భర్త చెప్పాడు. అప్పటికే నేను పూర్తిగా బెడ్ రెస్ట్‌లో ఉన్నాను. సోనోగ్రఫీ కోసం మాత్రమే బయటకు వెళ్లేదాన్ని. మిగతా సమయాల్లో నర్సే ఇంటికి వచ్చి ఇంజక్షన్స్ ఇచ్చేది. నేను అప్పుడు చాలా సైలెంట్ అయిపోయాను. బయట ప్రపంచంతో సంబంధాన్ని కట్ చేసుకున్నాను. కవలల్లో ఒకరు కన్నుమూత ఐవీఎఫ్ వల్ల కవలలు పుట్టడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. నా విషయంలోనూ అదే జరిగింది. కానీ దురదృష్టవశాత్తూ ఒక పాప ఈ లోకాన్ని చూడకముందే కన్నుమూసింది. అయితే డాక్టర్లు ఒకరకంగా మంచే జరిగిందన్నారు. చాలా సందర్భాల్లో కవలల్లో ఒకరు చనిపోయేలా ఉంటే మిగతా ఒకరు కూడా మరణించే అవకాశాలే ఎక్కువన్నారు. కానీ మిగతా పాపకు ఏం కాకపోవడంతో అందరం ఊపిరి పీల్చుకున్నాం. కనీసం ఒక్కరైనా మాకు దక్కారని సంతోషించాం' అని చెప్పుకొచ్చింది. కాగా మహి-జై 2011లో పెళ్లి చేసుకున్నారు. వీరు 2019లో తారాకు జన్మనిచ్చారు. View this post on Instagram A post shared by Mahhi Vinod Vij (@mahhivij) చదవండి: విజయ్ దేవరకొండ షర్ట్‌తో కనిపించిన రష్మిక.. మళ్లీ దొరికిపోయిందిగా ఈ శుక్రవారం ఓటీటీలో 22 సినిమాలు -
నేడు ప్రపంచ ఐవీఎఫ్ దినోత్సవం..ఎన్నో జంటలను వేధించే సమస్య
నేడు ప్రపంచ ఐవీఎఫ్ దినోత్సవం.ఈ సందర్భంగా ఎన్నో జంటలను వేధించే వంధ్యత్వ సమస్య గురించి తెలుసుకుందాం. వంధ్యత్వం అనేది పిల్లలు కనలేని స్థితి. కొన్ని జంటలు ఈ సమస్య కారణంగా శారీరకంగా మానసికంగా చాలా క్షోభని అనుభవిస్తారు. ఈ సమస్య ఎందువల్ల వస్తుంది. దీని నుంచి ఎలా బయపడొచ్చో చూద్దాం. నిజానికి నూటికి 50 శాతం జంటలు ఈ సమస్యను అనుభవిస్తున్నావారే. దీనికి ఇద్దరిలో ఒకరి వల్ల కావచ్చు లేదా ఇద్దరిలోనూ సమస్య ఉండవచ్చు. ముందుగా మగవారిలో ఎందుకు ఈ సమస్య వస్తుందో చూద్దాం. మగవారిలో ఈ సమస్య ఎలా తలెత్తుతుందంటే.. వారిలో స్పెర్మ కౌంట్ సరిగా లేకపోవడం. వృషణాలలో సమస్య గవదబిళ్లలు వంటి ఇన్ఫెక్షన్లు అకాల స్ఖలనం సిస్టిక్ ఫైబ్రోసిస్ వంటి జన్యుపరమైన రుగ్మత పునరుత్పత్త అవయవాలకుగాయలు ఎక్కువగా ఆవిరి పట్టడం, వేడి నీటి స్నానాలు కారణంగా స్పెర్మ్ కౌంట్‌పై ప్రభావం ఏర్పడుతుంది స్మోకింగ్, మద్యపానం, డ్రగ్స్ వంటివి వాడినా క్యాన్సర్‌కి సంబంధించిన చికిత్స రేడియోషన్ లేదా కీమోథెరఫీ వంటి వాటివల్ల సమస్య వచ్చే అవకాశం ఉంది. ఇక స్త్రీలలో ఎలా ఎదురవుతందంటే.. పీసీఓఎస్, హైపర్ప్రోలాక్టినిమియా లేదా హైపోథైరాయిడిజం వంటి హార్మోన్ల అసమతుల్యత గర్భాశయ అసాధారణతలు, గర్భాశయ పాలిప్స్, ఫైబ్రాయిడ్లు తదితర కారణాలు ఫెలోపియన్ ట్యూబ్ దెబ్బతినడం, అండాలు ప్రయాణానికి ఆటంకం కలిగంచే సంశ్లేషణలు ఎండోమెట్రియోసిస్, టర్నర్ సిండ్రోమ్, పెల్విక్ సర్జరీలు, క్యాన్సర్ చికిత్సలు సంతానోత్సత్తిపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. ఇగ మగవారిలోనూ, స్త్రీలలోనూ కామన్‌గా ఎదురయ్యే సమస్యలు ⇒30వ దశకం దాటిని స్త్రీలలో సంతానోత్పత్తి తగ్గిపోతుంది ⇒అలాగే పురుషులలో 40 ఏళ్లు పైబడిన వారికి సంతాన సామర్థ్యం తగ్గుతుంది ⇒పురుషులకు మద్యం, సిగరెట్ తాగే అలవాటు ఉంటే గర్భస్రావం అయ్యే సమస్య ఎక్కువగా ఉంటుంది. ⇒ఇద్దరిలో ఎవరు అధిక బరువు ఉన్నా ఈ సమస్య ఎదురవుతుంది. ఈ దినోత్సవాన్ని ప్రతి ఏటా ఘనంగా జరుపుకోవడానికి ప్రధాన కారణం స్త్రీ, పురుషులకు దీనిపై అవగాహన కల్పించాలనే ప్రధాన ఉద్దేశ్యంతోనే దీన్ని జరుపుకుంటున్నాం. ఒకవేళ్ల ఇరువురికి ఎలాంటి చెడు అలవాట్లు ఉన్నా.. ఇలాంటి కార్యక్రమాల ద్వారా అవగాహన కలిగి ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఒక చక్కని మార్గంలా ఈ కార్యక్రమాలు ఉపయోగపడతాయి. అదేవిధంగా జంటలు ఒకరినొకరు నిందించుకోకుండా సమస్యను సానుకూల దృష్టితో చూసే అవకాశం, అవగాహన ఏర్పడుతుంది. ఇక చక్కటి కుటుంబం కోసం ఆరాటపడే జంటలు పైన చెప్పిన విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యకు చెక్ పెట్టడమేగాక ఆనందమయ జీవితాన్ని మీ సొంతం చేసుకోవచ్చు. (చదవండి: ప్రెగ్నెంట్‌గా ఉండగానే..మరోసారి ప్రెగ్నెంట్ కాగాలరా?.. ఇది సాధ్యమేనా!) -
అరుదైన ప్రయోగం.. ముగ్గురి డీఎన్ఏతో జన్మించిన శిశువు.. పోలికలు వాళ్లవే!
లండన్: బ్రిటన్ శాస్త్రవేత్తలు సంచాలనాత్మక శాస్త్రీయ ప్రయోగంలో విజయం సాధించారు. ఆ దేశంలో తొలిసారి ఓ శిశువు ముగ్గురి డీఎన్ఏలతో జన్మించింది. ఇందులో 99.8 శాతం డీఎన్ఏ తల్లిదండ్రలదే కాగా.. మిగతా శాతం మహిళా దాతది. వినాశకరమైన మైటోకాండ్రియల్ వ్యాధులతో పిల్లలు పుట్టకుండా నిరోధించే ప్రయత్నంలో భాగంగా బ్రిటన్ శాస్త్రవేత్తలు ఈ సాంకేతికతను ఉయోగిస్తున్నారు. దీనికి మైటోకాండ్రియల్ డోనేషన్ ట్రీట్మెంట్(ఎండీటీ)గా నామకరణం చేశారు. ఈ పద్ధతిలో ఆరోగ్యవంతమైన మహిళా దాత అండాల కణజాలన్ని ఉపయోగించి ఐవీఎఫ్ పిండాలను సృష్టిస్తారు. తద్వారా పిల్లలకు తల్లుల ద్వారా మైటోకాండ్రియా సోకకుండా నిరోధిస్తారు. మైటోకాండ్రియా వ్యాధులు అత్యంత ప్రమాదకరమైనవి. వీటితో పుట్టిన బిడ్డలు గంటల్లో లేదా కొన్ని రోజుల తర్వాత చనిపోయే ప్రమాదం ఉటుంది. తల్లుల ద్వారా మాత్రమే పిల్లలకు ఈ వ్యాధులు సోకుతాయి. అందుకే వీటిని నిరోధించేందుకు ఇతర మహిళల అండాల కణజాలాన్ని ఉపయోగిస్తున్నారు. ఫలితంగా పిల్లలు మైటోకాండ్రియా వ్యాధుల బారినపడకుండా చేస్తున్నారు. పోలికలు తల్లిదండ్రులవే.. ఈ పద్ధితిలో జన్మించిన శిశువు తన తల్లిదండ్రుల ద్వారా వచ్చే న్యూక్లియర్ డీఎన్ఏను కలిగి ఉంటుంది. అందుకే శిశువు వ్యక్తిత్వం, కంటి రంగు వంటి ముఖ్యమైన లక్షణాలు తల్లిదండ్రుల లాగే ఉంటాయి. అయితే ఈ విధానంలో పుట్టిన బిడ్డ తల్లిదండ్రుల వివరాలను మాత్రం గోప్యంగా ఉంచుతున్నారు. ఈ ఫలితాలు చాలా ఆశాజనకంగా ఉన్నాయని, ఇప్పటివరకు అతికొద్ది మంది మాత్రమే ఇందులో భాగమయ్యారని శాస్త్రవేత్తలు తెలిపారు. అందుకే దీని భద్రత, ప్రభావశీలత గురించి ఇప్పుడే ఓ అంచనాకు రాలేమన్నారు. ఎండీటీ పద్ధతి ద్వారా శిశువు జన్మించిన ఘటన యూకేలో ఇదే తొలిసారి అయినప్పటికీ.. అమెరికాలో మాత్రం 2016లోనే ఈ ప్రయోగం జరిగింది. జోర్డాన్‌కు చెందిన ఓ జంట ఈ సాంకేతికతతోనే ఆ ఏడాది పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. చదవండి: ట్రంప్‌కు బిగ్ షాక్.. లైంగిక వేధింపుల కేసులో దోషిగా తేల్చిన జ్యూరీ.. రూ.410 కోట్లు చెల్లించాలని ఆదేశం -
వైద్య చరిత్రలో సంచలనం.. రోబో సాయంతో ఐవీఎఫ్.. ఆడ పిల్లల జననం!
వైద్య రంగంలో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. ప్రపంచంలోనే తొలిసారిగా ఓ రోబో సాయంతో చేసిన ఐవీఎఫ్ విజయవంతమైంది. పండంటి ఇద్దరు ఆడ పిల్లలు జన్మించారు. స్పెయిన్ దేశం బార్సిలోనా నగరానికి చెందిన ఇంజినీర్ల బృందం రోబోటిక్స్ సాయంతో మానవ అండంలోకి శుక్రకణాలను ప్రవేశపెట్టింది. ఈ రోబోటిక్ ఐవీఎఫ్ టెక్నాలజీ వినియోగాన్ని అమెరికా న్యూయార్క్ సిటీకి చెందిన న్యూహోప్ ఫర్టిలిటీ సెంటర్లో జరిపారు. ఫలితంగా పండంటి ఇద్దరు ఆడపిల్లలు జన్మించినట్లు ఎంఐటీ టెక్నాలజీ రివ్యూ తెలిపింది. సోనీ ప్లేస్టేషన్ 5 కంట్రోలర్ సాయంతో రిపోర్ట్ ప్రకారం.. రోబోటిక్ ఐవీఎఫ్ విధానంపై ఏ మాత్రం అనుభవం లేని ఓ ఇంజినీర్ ఉన్నట్లు తెలుస్తోంది. అయినప్పటికీ అండంలోకి శుక్రకణాల్ని పంపించేందుకు సోనీ ప్లేస్టేషన్ 5 కంట్రోలర్‌ను వినియోగించారు. కెమెరా ద్వారా మానవ అండాన్ని చూసిన రోబో.. తనంతట తానే ముందుకు చొచ్చుకెళ్లి.. అండంపై స్పెర్మ్‌ను జారవిడిచినట్లు నివేదిక తెలిపింది. 9 నెలల తర్వాత ఇద్దరు ఆడపిల్లలు జన్మించినట్లు ఎంఐటీ టెక్నాలజీస్ తన నివేదికలో పేర్కొంది. ఖర్చు తగ్గుతుంది ఇక అత్యాధునిక టెక్నాలజీ కారణంగా ప్రస్తుతం వైద్యులు చేసే ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) ఖర్చు గణనీయంగా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. రోబోట్‌ను అభివృద్ధి చేసిన స్టార్టప్ కంపెనీ ఓవర్చర్ లైఫ్ ప్రతినిధులు మాట్లాడుతూ.. రోబోట్ సాయంతో ఐవీఎఫ్ పరీక్ష ప్రారంభ దశలో ఉందని తెలిపారు. పూర్తి స్థాయిలో వినియోగంలోకి వస్తే ఈ విధానంతో ఖర్చు సైతం తగ్గే అవకాశం ఉందని చెప్పారు. ఐవీఎఫ్ ద్వారా 5 లక్షల మంది పిల్లలు ప్రతి సంవత్సరం దాదాపు 5,00,000 మంది పిల్లలు ఐవీఎఫ్ ద్వారా పుడుతున్నారు. కానీ చాలా మందికి సంతానోత్పత్తి కోసం ఉపయోగించే సరైన మెడిసిన్ అందుబాటులో లేకపోవడంతో పాటు చాలా ఖర్చుతు కూడుకున్నది. చదవండి👉 అప్పుల్లో తమిళనాడు టాప్.. ఏ రాష్ట్రానికి ఎంత అప్పు ఉందంటే? -
చైనా షాకింగ్ నిర్ణయం..పెళ్లి కాకుండానే తల్లి అయ్యేలా..
ఆరు దశాబ్దాల్లో తొలిసారిగా చైనాలో వేగవంతంగా జనాభా క్షీణించడంతో దాన్ని నియంత్రించేలా పలు చర్యలు ఇప్పటికే తీసుకుంది చైనా. ఇప్పుడు ఇంకాస్త ముందడుగు వేసి.. యావత్ ప్రపంచం విస్తుపోయేలా సంచలన నిర్ణయం తీసుకుంది. అవివాహితలు, ఒంటరి మహిళలు ఐవీఎఫ్ ద్వారా పిల్లలను కనే వెసులుబాటుని ఇస్తోంది. పెళ్లైన జంటలకు మాత్రమే ఉండే పిల్లల సబ్సిడీలను అవివాహిత గర్భిణీలు కూడా పొందవచ్చునని చెబుతోంది. అవివాహిత స్త్రీల పిల్లల జనన నమోదును చట్టబద్ధం చేసింది. వారు కూడా వేతనంతో కూడిన ప్రశూతి సెలవులు కూడా తీసుకోవచ్చు అంటూ ఆఫర్లు ఇస్తోంది. ఈ మేరకు చైనాలోని అవివాహిత స్త్రీలు ప్రైవేట్ లేదా పబ్లిక్ ఆస్పత్రుల్లో ఐవీఎఫ్ చికిత్సను పొందవచ్చు. ఈ నేపథ్యంలోనే నైరుతి సిచువాన్ ప్రావిన్స్ రాజధాని చెంగ్డులో విడాకులు తీసుకున్న 33 ఏళ్ల మహిళ దీన్ని ఆశ్రయించే తల్లి కాబోతోంది. ప్రస్తుత ఆమె 10 వారాల గర్భవతి. చాలా మంది ఒంటరి మహిళలు దీన్ని ఆశ్రయిస్తున్నట్లు సమాచారం. దేశ వ్యాప్తంగా ఐవీఎఫ్‌ని సరళీకృతం చేస్తే గనుక ఇదొక పెద్ద మార్కెట్‌గా విస్తరించే అవకాశం ఉందంటున్నారు నిపుణలు. సాధారణ సంతానోత్పత్తి సేవలపై ప్రభావం పడుతుందని, భవిష్యత్తులో ఐవీఎఫ్ చికిత్సకు డిమాండ్ పెరిగే అవకాశం ఉందని ఆసియా పసిఫిక్ వ్యాపార అభివృద్ధి డైరెక్టర్ వైవ్ లిప్పెన్స్ హెచ్చరించారు. ప్రభుత్వాస్పత్రల్లో మహిళలందరికీ ఐవీఎఫ్ చికిత్స అందిస్తారనేది స్పష్టత లేదు. ఇప్పటివరకు ఎంత మంది మహిళలు దీన్ని ఉపయోగించుకున్నారనేది కూడా స్పష్టం కాలేదు. కానీ చాలా మంది మహిళలు ఐవీఎఫ్ సెంటర్లకు క్యూ కడుతున్నట్లు సమాచారం. జాతీయ ఆరోగ్య కేంద్రం మరిన్ని ఐవీఎఫ్ సెంటర్లను అందుబాటులో తీసుకొచ్చే యోచనలో ఉన్నట్లు చైనా వర్గాలు చెబుతున్నాయి. కాగా, ఇంతకు మునుపు చైనా పెళ్లికాని మహిళలకు ఐవీఎఫ్ సేవలను నిషేధించింది. ఎప్పుడైతే జనాభా క్షీణించడం ప్రారంభించిందో అప్పటినుంచి చైనా పిల్లలను కనేలా ప్రజలకు బారీ ఆఫర్లు అందిస్తూ ప్రోత్సహించింది. ఈ క్రమంలో పలు నిబంధనలు ఎత్తి వేసి కొత్త సంస్కరణలు తీసుకొచ్చింది. అందులో భాగంగానే ఈ ఐవీఎఫ్ చికిత్సా విధానం తెరమీదకు వచ్చింది. (చదవండి: ఎయిర్‌పోర్ట్‌లో యాపిల్ జ్యూస్ వివాదం..యువతి అరెస్టు) -
ఆడబిడ్డల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
దిల్సుఖ్నగర్: రాష్ట్రంలోని ఆడబిడ్డల సంక్షేమం, అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవీఎఫ్) తెలంగాణ స్టేట్ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఆదివారం ఆర్కేపురంలోని కిన్నెర గ్రాండ్ హోటల్ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత మహిళలు, యువతుల్లో భయాన్ని పోగొట్టి, వారిలో ధైర్యం నింపేందుకు షీ–టీమ్స్ ఏర్పాటు చేసిందన్నారు. మహిళలను తమను తాము రక్షించుకునేందుకు సిద్ధం కావాలన్నారు. అన్ని రంగాల్లో రాణించి తల్లిదండ్రులకు, దేశానికి, రాష్ట్రానికి పేరు తీసుకురావాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించడమే కాకుండా జీహెచ్ఎంసీలో అదనంగా మరో పది సీట్లు కేటాయించారన్నారు. మార్కెట్ కమిటీల్లోనూ మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిం చి రాజకీయంగా, ఆర్థికంగా ఎదిగేందుకు అవకాశం కల్పిం చారన్నారు. ఐవీఎఫ్ తెలంగాణ అధ్యక్షుడు, రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ ప్రతి మగవాడి విజయం వెనుక మహిళ ఉంటుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆడబిడ్డల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రత్యేక పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి మహిళ ఒక మొక్క నాటాలని కోరారు. సామాజిక సేవా కార్యక్రమాలకు ఐవీఎఫ్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ మహిళ రక్షణకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుదీర్‌రెడ్డి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత రెడ్డి, ఆర్కేపురం కార్పొరేటర్ రాధా ధీరజ్ రెడ్డి, యాంకర్ రవి, బిగ్ బాస్ ఫేమ్ హిమాజా రెడ్డి, లహరి , ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఐవీఎఫ్ స్టేట్ జనరల్ సెక్రటరీ పబ్బ చంద్ర శేఖర్, ఐవీఎఫ్ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు చందా భాగ్యలక్ష్మి, ఐవీఎఫ్ మహిళా విభాగం ప్రథమ మహిళ ఉప్పల స్వప్న, స్టేట్ ట్రెజరర్ కోడిప్యాక నారాయణ గుప్తా, యూత్ విభాగం నరేష్ గుప్తా, మహిళా విభాగం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
పేరెంట్స్ కాబోతున్న 'గే' జంట.. ఎలా సాధ్యం?
న్యూజెర్సీ: అమిత్ షా, ఆదిత్య మదిరాజు. 2019లో అమెరికా న్యూజెర్సీ వేదికగా ఒక్కటైన ఈ స్వలింగ సంపర్కులు అప్పట్లో ఇంటర్నెట్లో ప్రకంపనలు సృష్టించారు. హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్న ఈ జంట గురించి అందరికీ తెలిసింది. అయితే ఇప్పుడు వీళ్లు చేసిన చేసిన ప్రకటన మరోసారి సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశమైంది. తామిద్దరం పేరెంట్స్ కాబోతున్నామని అమిత్ షా, ఆదిత్య సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. స్వలింగ సంపర్కులైన వీళ్లు సహజంగా పేరెంట్స్ కావడం అసాధ్యం. అయితే ఓ మహిళ వీళ్లకు అండాన్ని దానం చేసింది. దీంతో ఐవీఎఫ్(ఇన్ విట్రో ఫర్టిలైజేషన్) పద్ధతిలో వీళ్లు ఓ బిడ్డకు పేరెంట్స్ కాబోతున్నారు. మే నెలలో తాము పేరెంట్స్ కాబోతుండటం ఎంతో సంతోషంగా ఉందని ఈ గే జంట ఆనందం వ్యక్తం చేసింది. అందరిలాగే తమకు కూడా ఓ బిడ్డ ఉంటుందని పేర్కొంది. తమను చూసి ఎంతో మంది స్వలింగ సంపర్కులు ధైర్యం చేసి ఇంట్లో తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకున్నారని, ఇప్పుడు వాళ్లు పిల్లలను కనే మార్గం కూడా ఉందని తాము నిరూపిస్తున్నామని అమిత్ షా, ఆదిత్య వివరించారు. 4 రౌండ్ల ఐవీఎఫ్ తర్వాత తాము పేరెంట్స్ కాబోతున్నామనే విషయం ఖరారైందని చెప్పారు. ఇకపై స్వలింగ సంపర్కులు కూడా పెళ్లి, పిల్లల విషయంపై ఆందోళన చెందకుండా సంతోషంగా అందరిలాగే సాధారణ జీవితాన్ని ఆస్వాదించవచ్చని ఈ గే జంట చెబుతోంది. అమిత్ షా గుజరాత్‌కు చెందిన వాడు. న్యూజెర్సీలో స్థిరపడ్డాడు. ఆదిత్య తెలుగు రాష్ట్రాలకు చెందినవాడు ఢిల్లీలో నివసించేవాడు. 2016లో ఓ ఫ్రెండ్ ద్వారా వీరిద్దరూ పరిచయమయ్యారు. ఆ తర్వాత మూడేళ్లకు 2019లో న్యూజెర్సీలో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. చదవండి: 25 దేశాల్లో ఒమిక్రాన్ ఎక్స్‌బీబీ వేరియంట్ .. డబ్ల్యూహెచ్ఓ అలర్ట్.. -
సరోగసీ ద్వారా బిడ్డను కోల్పోయాం: స్టార్ హీరోయిన్
Amrita Rao RJ Anmol Share Pregnancy Struggles During Surrogacy: హీరోయిన్ అమృత రావు, ఆమె భర్త ఆర్జే అన్మోల్ తమ యూట్యూబ్ ఛానల్ 'కపుల్ ఆఫ్ థింగ్స్' ద్వారా తమ జీవితంలోని అనేక రహస్యాలను పంచుకుంటున్నారు. ఇటీవల ఓ వీడియోలో అమృత ఎదుర్కొన్న గర్భధారణ సమస్యల గురించి చెప్పుకొచ్చింది. అమృత, అన్మోల్ తల్లిదండ్రులు అయ్యేందుకు సరోగసీ, ఐయూఐ, ఐవీఎఫ్, హోమియోపతి, ఆయుర్వేద పద్ధతులను ఎంచుకున్నట్లు తెలిపారు. సరోగసీ పద్ధతి గురించి మాట్లాడుతూ వారు ఈ పద్ధతి ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే బిడ్డను కోల్పోయినట్లు వెల్లడించారు. 'ఈ విషయం ఇప్పటికీ ఎంతో బాధగానే ఉంది. తల్లిదండ్రులు కావాలన్న ఉత్సాహంతో మీరు అంత ఉద్వేగానికి లోనవాల్సిన అవసరం లేదు. ఇది మన చేతుల్లో ఉండదు.' అని అమృత ఆ వీడియోలో పేర్కొంది. అలాగే అమృత రావు, అన్మోల్ ఐవీఎఫ్ చికిత్స గురించి కూడా తెలిపారు. చాలా ఏళ్లు ప్రయత్నించిన తర్వాత అమృత 'మనకు కూడా బిడ్డ పుట్టాలా ? ఈ ఒత్తిడి జీవితాలతో పిల్లలను పెంచగలమా ? ఇది అంత ముఖ్యమా ?' అని ప్రశ్నించుకున్నట్లు పేర్కొంది. అనంతరం ఈ జంట హాలీడే కోసం థాయ్‌లాండ్‌కు వెళ్లారు. మార్చి 2020లో అమృత గర్భవతి కాగా నవంబర్‌లో వీర్‌కు జన్మనిచ్చింది. వీర్‌కు మొదటగా అనేక నిక్‌నేమ్స్ పెట్టి పిలిచేవాళ్లమని ఈ జంట పేర్కొంది. చదవండి: తన భర్తనే మళ్లీ పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్.. చదవండి: 'పెళ్లి చేసుకుందాం, సినిమాలు వదిలేయ్' ఏకధాటిగా ఏడ్చిన నటి! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1711356039.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
వీటికి కూడా ఈఎంఐ ఉందా?
-
ఏంటీ.. వీటికి కూడా ఈఎంఐ ఉందా?
సాక్షి, వెబ్‌డెస్క్: ఈక్వెటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్.. అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ ఈఎంఐ అంటే అందరికీ ఇట్టే అర్థమవుతుంది. మనం పెద్ద వస్తువులు ఏం కొనాలన్నా ఇప్పుడు ఈఎంఐ అందుబాటులో ఉంది. ఇంట్లో వినియోగించే టీవీ, వాషింగ్ మిషన్ నుంచి ప్రయాణానికి వాడే వాహనాల వరకు ఈఎంఐతో కొనుక్కోవచ్చు. అంతేకాదు చదువులు, పెళ్లిళ్లు వంటి కుటుంబ అవసరాలకు కూడా ఈఎంఐ అక్కరకొస్తోంది. తాజాగా ఐవీఎఫ్, సరోగసీకి కూడా ఈఎంఐ రుణాలు దొరుకుతున్నాయి. సంతానలేమితో బాధ పడుతున్న దంపతులకు ఈఎంఐ ఎలా వరంగా మారుతుందో ఈ వీడియో చూసి తెలుసుకోండి. -
ఏడాది క్రితం లవర్ మృతి.. ప్రస్తుతం ఆమె కడుపులో అతని బిడ్డ
కాన్బెర్రా: ప్రస్తుత కాలంలో పిల్లలు కలిగే అవకాశం లేని వారు.. పెళ్లి, భాగస్వామితో పని లేకుండా.. బిడ్డకు జన్మనివ్వాలనుకునే వారు ఎక్కువగా ఎంచుకుంటున్న పద్దతులు ఐవీఎఫ్(ఇన్ వెట్రో ఫెర్టిలైజేషన్), సరోగసి(అద్దె గర్భం). మన దగ్గర బాలీవుడ్ బాద్ షా షారుక్, ఆమిర్ ఖాన్ మొదలు తుషార్ కపూర్ వరకు పలువురు ప్రముఖులు ఐవీఎఫ్ పద్దతి ద్వారా బిడ్డను పొందారు. తాజాగా ఈ జాబితాలోకి ఆస్ట్రేలియాకు చెందిన దివంగత ఒలింపిక్ స్నోబోర్డర్ అలెక్స్ పుల్లిన్ చేరారు. గతేడాది ఆయన మరణించారు. కానీ ప్రస్తుతం అలెక్స్ గర్ల్‌ఫ్రెండ్ ఆయన బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఇదేలా సాధ్యం అంటే ఐవీఎఫ్ ద్వారా. ఆ వివరాలు... ఆస్ట్రేలియాకు చెందిన అలెక్స్ పుల్లింగ్ గతేడాది క్వీన్స్లాండ్ పామ్ బీచ్‌లోని రీఫ్లో స్పియర్ ఫిషింగ్ చేస్తున్న సమయంలో ప్రమాదశావత్తు అందులో ముగినిపోయాడు. రెస్క్యూ టీం ఆయనను వెలికి తీసి ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూనే అతడు మరణించాడు. విషయం తెలిసి అలెక్స్ గర్ల్‌ఫ్రెండ్ ఎల్లిడి వ్లగ్ ఎంతో బాధపడింది. ప్రమాదానికి కొన్ని రోజుల ముందే వారు బిడ్డను కనాలని నిర్ణయించుకున్నారు. దాంతో అలెక్స్ మరణించిన విషయం తెలిసిన వెంటనే ఆమె అతడి నుంచి వీర్యం సేకరించి భద్రపరిచారు. ఆ తర్వాత ఐవీఎఫ్ విధానం ద్వారా, అలెక్స్ వీర్యంతో ఎల్లిడి గర్భం దాల్చారు. త్వరలోనే తాను అలెక్స్ బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు ఎల్లిడి. ఈ సందర్భంగా ఎల్లిడి మాట్లాడుతూ.. ‘‘అలెక్స్‌కి ప్రమాదం జరగడానికి కొన్ని రోజుల ముందే మేం పిల్లలను కనాలని ప్లాన్ చేసుకున్నాం. ఆ నెలలలో నేను గర్భవతిని అవుతానని ఆశించాను. కానీ కుదరలేదు. అదే సమయంలో తాను ప్రమాదానికి గురై మరణించాడు. దాంతో వేరే మార్గం లేక అతడి వీర్యాన్ని సేకరించి.. ఇలా ఐవీఎఫ్ ద్వారా గర్భవతిని అయ్యాను. నేను ఈ విధానాన్ని ఆశ్రయిస్తానని.. అది కూడా అలెక్స్ లేకుండా ఒంటరిగా ఇలా చేస్తానని కలలో కూడా అనుకోలేదు. ఇది అంత సులభమైన పనేం కాదు. పుట్టబోయే బిడ్డకు నేనే తల్లితండ్రి. ఇద్దరి బాధ్యతలను నేను ఒక్కదానే నేరవేర్చాల్సి ఉంటుంది’’ అని తెలిపారు. క్వీన్స్లాండ్ చట్టం ప్రకారం, మరణించిన వ్యక్తి అభ్యంతరం చెప్పలేడని ప్రభుత్వం చేత నియమించబడిన అధికారి ప్రకటించిన తర్వాత మాత్రమే వీర్యాన్ని సేకరిస్తారు. ఇలా చేయడానికి ముందు సదరు వ్యక్తి కుటుంబం అనుమతి అవసరం తప్పనిసరి. ఐవీఎఫ్ స్పెషలిస్ట్ వీర్యం తీసే ప్రక్రియకు సహాయం చేస్తారు. మరణం తరువాత 24 మరియు 36 గంటల వ్యవధిలో వీర్యం సేకరించాల్సి ఉంటుంది. చదవండి: మాతృత్వం కోసం తన వీర్యాన్ని దాచుకున్న ‘దయారా’ -
పెరిగిపోతున్న కవలల సంఖ్య
సంతానం కోసం ఎంతో మంది దంపతులు ఎదురు చూస్తుంటారు. ఒకరు పుడితే ఓకే.. అదే ఒకేసారి ఇద్దరు పుడితే.. వారికి ఆ సంబరమే వేరు. మొదటిసారే అయినా, ఇప్పటికే పిల్లలున్నా.. మళ్లీ కవలలు పుడితే అదో ఆనందం, ఆశ్చర్యం.. మరి ఇలా ఏటా ప్రపంచవ్యాప్తంగా జన్మిస్తున్న కవల పిల్లల సంఖ్య పెరిగిపోతోందని తెలుసా? ఒకరిద్దరు కాదు ప్రపంచవ్యాప్తంగా ఏటా 16 లక్షల మంది కవలలు పుడుతున్నారు. ఇది మరింతగా పెరుగుతోంది. ముఖ్యంగా ఆఫ్రికా, ఆసియా ఖండాల్లో కవలల బర్త్ రేటు ఎక్కువగా ఉంటోంది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. ప్రస్తుతం ఆఫ్రికాలో కవలల సంఖ్య ఎక్కువగా ఉంటున్నా.. భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా కవలల పుట్టుకలో భారత్, చైనాలే టాప్కు చేరే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 165 దేశాల్లో 1980–1985 మధ్య, 2010–2015 మధ్య పుట్టిన కవలలకు సంబంధించి డేటాను ఆక్స్ఫర్డ్ శాస్త్రవేత్తలు సేకరించి విశ్లేషించారు. మొత్తం ప్రసవాల్లో పుట్టిన కవలల శాతాన్ని.. అప్పటికి, ఇప్పటికి పోల్చి చూశారు. ఏయే ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉందన్నది లెక్కించి ఒక నివేదికను రూపొందించారు. ఉత్తర అమెరికా, ఆసియాలోనే ఎక్కువ ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా కవలలు జన్మిస్తున్న శాతం పెరిగినట్టు శాస్త్రవేత్తలు తేల్చారు. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఈ రేటు ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. 1980 దశకంతో పోలిస్తే ప్రధానంగా ఉత్తర అమెరికా (అమెరికా, కెనడా, మెక్సికో తదితర దేశాలు)లో ఏకంగా 71 శాతం పెరిగిందని, యూరప్‌లో 60 శాతం, ఆసియా ప్రాంతంలో 32 శాతం పెరిగిందని తెలిపారు. ఒక్క దక్షిణ అమెరికా ఖండంలో మాత్రమే కవలల బర్త్‌రేటు తగ్గిందని వెల్లడించారు. కవలల సంఖ్యాపరంగా చూస్తే.. ఆఫ్రికా, ఆసియా ఖండాల్లో ఎక్కువ మంది జని్మస్తున్నారు. అంతేకాదు సహజంగా పుడుతున్న కవలలు ఈ రెండు ఖండాల్లోనే ఎక్కువ. సాధారణంగా రెండు రకాలుగా కవలలు పుడుతుంటారు. మహిళల్లో అండం ఫలదీకరణ చెందాక రెండుగా విడిపోయి వేర్వేరు శిశువులుగా ఎదగడం ఒక రకమైతే.. ఒకేసారి రెండు అండాలు విడుదలై (డైజైగోటిక్), ఫలదీకరణ ద్వారా కవలలు పుట్టడం రెండో రకం. ఆఫ్రికా మహిళల్లో జన్యుపరంగా డైజోగోటిక్ పరిస్థితి ఉంటుందని, ఆసియా ఖండంలోని కొన్ని దేశాల్లోనూ ఈ పరిస్థితి ఉందని ఈ పరిశోధనలో భాగమైన ఆక్స్ఫర్డ్ వర్సిటీ ప్రొఫెసర్ క్రిస్టియన్ మోండెన్ తెలిపారు. ఇక యూరప్, ఉత్తర అమెరికా, మరికొన్ని చోట్ల ఐవీఎఫ్, హార్మోన్ చికిత్స, ఇతర కృత్రిమ గర్భధారణ పద్ధతుల ద్వారా ఎక్కువగా కవలలు పుడుతున్నారు. వైద్యం, పోషణ లేక మరణాలు పేద, మధ్య ఆదాయ దేశాల్లో కవలలు ఎక్కువగా జన్మిస్తున్నా చిన్నతనంలోనే చనిపోతున్నారని ఆక్స్ఫర్డ్ ప్రొఫెసర్ జెరోన్ స్మిత్ చెప్పారు. ఆఫ్రికాలో పుడుతున్న కవలల్లో చాలా వరకు ఇద్దరిలో ఎవరో ఒకరు మరణిస్తున్నారని.. తల్లికి పోషకాహారం లేక చిన్నారులు సరిగా ఎదకపోవడం, పుట్టిన తర్వాత కూడా సరైన పోషణ, వైద్యం అందకపోవడం దీనికి కారణమని పేర్కొన్నారు. ఇలా ఆఫ్రికాలో పుడుతున్న కవలల్లో ఏటా రెండు లక్షల మంది చనిపోతున్నారని తెలిపారు. కవలలు పుట్టడానికి కారణాలివీ.. కృత్రిమ గర్భధారణ (ఐవీఎఫ్) వినియోగం పెరిగిపోవడం కవలలు పెరగడానికి కారణాల్లో ఒకటి. పిల్లలు లేని దంపతులు ఐవీఎఫ్ చేయించుకునేప్పుడే కవలల కోసం ప్రయతి్నస్తున్నారు. మరోవైపు ఈ విధానంలో ఫెయిల్యూర్ రేటు సగం దాకా ఉండటంతో.. డాక్టర్లు ఎక్కువ పిండాలను ఫలదీకరణం చెందించి మహిళల గర్భంలో ప్రవేశపెడుతున్నారు. మహిళలు ఆలస్యంగా పిల్లల్ని కనడం కవలల పుట్టుకలో మరో కారణం. ఉద్యోగాలు, కెరీర్‌కు ప్రాధాన్యం ఇస్తున్న దంపతులు లేటు వయసులో పెళ్లి చేసుకోవడం, ఇంకా లేటుగా పిల్లల్ని కనడం జరుగుతోంది. 35, 40 ఏళ్ల వయసు దాటిన మహిళల్లో కవలలు పుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. ► 30% -1980వ దశకంతో పోలిస్తే పెరిగిన కవలల పుట్టుక శాతం ► 16 లక్షలు ప్రపంచవ్యాప్తంగా ఏటా జన్మిస్తున్న కవల పిల్లల సంఖ్య ► 42లో ఒకరు సగటు ప్రసవాల్లో కవల పిల్లలు జన్మించే అవకాశం ► 80% ప్రపంచంలోని కవలల డెలివరీల్లో ఆఫ్రికా, ఆసియాలో జన్మిస్తున్నవారి శాతం -
మాతృత్వం కోసం తన వీర్యాన్ని దాచుకున్న ‘దయారా’
గాంధీనగర్: గుజరాత్, అహ్మదాబాద్‌కు చెందిన డాక్టర్ జిస్నూర్ దయారా రాష్ట్రం నుంచి వైద్య విద్యనభ్యసించిన తొలి ట్రాన్స్ వుమెన్‌గా రికార్డు సృష్టించారు. తాజాగా ఆమె మరో సంచలన నిర్ణయం తీసుకుని మరో సారి వార్తల్లో నిలిచారు. త్వరలోనే శస్త్ర చికిత్స ద్వారా పూర్తిగా మహిళగా మారనున్న దయారా సంచలన నిర్ణయం తీసుకున్నారు. స్త్రీ జన్మకు పరిపూర్ణ అర్థాన్ని చేకూర్చే మాతృత్వాన్ని అనుభూతి చెందడం కోసం తన వీర్యాన్ని భద్రపరుచుకున్నారు. భవిష్యత్తులో దీన్ని ఉపయోగించి ఆమె బిడ్డను కనాలని భావిస్తున్నారు. ఇలా జన్మించే బిడ్డకు దయారానే తల్లి, తండ్రి అవుతారు. ఒకే జన్మలో ఆమె మగాడిగా, స్త్రీగా జీవించనున్నారు. అదే విధంగా తొలిసారి ఓ బిడ్డకు తల్లి, తండ్రి ఒక్కరే అవుతుండటం విశేషం. ఈ సందర్భంగా దయారా మాట్లాడుతూ.. ‘‘చిన్నప్పటి నుంచి నాకు ఆడవారిగా జీవించాలని ఉండేది. మా అమ్మ, అక్కలాగా చీర కట్టుకోవాలని.. లిప్‌స్టిక్ వేసుకోవాలని మనసు తహతహలాడేది. కానీ చుట్టూ ఉన్న సమాజానికి భయపడి.. నాలోని స్త్రీని బయటకు రానివ్వలేదు. ఇదిలా కొనసాగుతుండగానే.. ఎంబీబీఎస్ చదవడానికి నేను రష్యా వెళ్లాను. అక్కడ నాలాంటి వారు ఎంతో ధైర్యంగా.. తమకు నచ్చినట్లు బతకడం చూశాను. నాలో ధైర్యం వచ్చింది. భయాల్ని తొలగించుకున్నాను. నాకు నచ్చినట్లు బతకడం మొదలు పెట్టాను. చీర కట్టుకోవడం, లిప్‌స్టిక్ వేసుకోవడం నేర్చుకున్నాను. నన్ను చూసి మొదట నా తల్లిదండ్రులు ఇబ్బంది పడ్డారు. కానీ ప్రస్తుతం వారు నన్ను అర్థం చేసుకున్నారు. నా చుట్టు ఉన్న సమాజం కూడా నన్ను అంగీకరించడం ప్రారంభించింది’’ అంటూ చెప్పుకొచ్చారు దయారా. తల్లి అవ్వడం నా కల ‘‘ప్రస్తుతం ఇండియాలో ప్రాక్టీస్ చేయడం కోసం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్వహించే పరీక్ష రాయబోతున్నాను. ఆ తర్వాత శస్త్ర చికిత్స ద్వారా నేను పూర్తిగా స్త్రీగా మారతాను. ఆడవారికి లభించిన అద్భుతమైన వరం ఓ జీవికి జన్మనివ్వడం. నేను కూడా ఆ వరాన్ని అందుకోవాలని భావిస్తున్నాను. మాతృత్వాన్ని అనుభూతి చెందాలనుకుంటున్నాను. అందుకే లింగ మార్పిడి శస్త్రచికిత్సకు ముందే నా వీర్యాన్ని భద్రపరుచుకోవాలని భావించాను. ఇందుకు గాను అహ్మదాబాద్, ఆనంద్‌లోని ఓ ఐవీఎఫ్ ఆస్పత్రిని సంప్రదించి.. నా కోరికను వారికి చెప్పాను. నా నిర్ణయాన్ని గౌరవించిన వారు నా వీర్యాన్ని భద్రపరిచేందుకు అంగీకరించారు. వారికి ఎంతో రుణపడి ఉంటాను’’ అన్నారు దయారా. సరోగసి ద్వారా బిడ్డను కంటాను ‘‘కాళీ మాతా దయ వల్ల నేను ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్నాను. అలా జన్మించే బిడ్డకు బయాలజీకల్గా నేనే తల్లి, తండ్రి. ఈ విషయం తలుచుకుంటే నా మనసు గర్వంతో ఉప్పొంగిపోతుంది. బిడ్డను కనడం కోసం నేను సరోగసి విధానాన్ని ఎంచుకోబోతున్నాను. ఇందుకు నేనేం సిగ్గుపడటం లేదు. ట్రాన్స్ వుమెన్‌గా మారిన వ్యక్తి.. ఓ బిడ్డకు జన్మనివ్వడానికి ఎంతో ధైర్యం కావాలి. చుట్టూ ఉన్న సమాజం కూడా ట్రాన్స్‌జెండర్స్ పట్ల దయతో వ్యవహరించాలి’’ అని కోరారు. ఆస్పత్రి చరిత్రలో ఇదే ప్రథమం: నయనా పటేల్ ఇక దయారా వీర్యాన్ని భద్రపరిచిన ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ నయానా పటేల్ మాట్లాడుతూ.. ‘‘సాధారణంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న మగాళ్లు, ఇంటికి దూరంగా ఉంటున్న సైనికులు, చాలా కాలం వరకు బిడ్డలు వద్దనుకునే దంపతుల్లోని మగవారు తమ భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని వారి వీర్యాన్ని మా ఆస్పత్రిలో భద్రపర్చుకుంటారు. ఆ తర్వాత బిడ్డలు కావాలనుకున్నప్పుడు ఐవీఎఫ్, సరోగసి ద్వారా పిల్లల్ని కంటారు. కానీ మొదటిసారి ఓ ట్రాన్స్ఉమెన్ భవిష్యత్తులో తల్లి అవ్వడం కోసం తన వీర్యాన్ని మా ఆస్పత్రిలో భద్రపర్చుకోవడం మా ఆస్పత్రిలో ఇదే మొదటిసారి’’ అన్నారు. చదవండి: చిన్ని తండ్రీ నిన్ను చూడక... ట్రాన్స్... అప్డేట్ వెర్షన్ -
తీరిన కల.. 52 ఏళ్ల వయసులో కవలలకు జననం
టవర్‌సర్కిల్ (కరీంనగర్): ఆమె అమ్మమ్మ.. అయినప్పటికీ వారసత్వం కోసం మళ్లీ పిల్లలు కనాలని తపించింది. ఆమె ఆశయానికి కరీంనగర్‌లోని డాక్ట ర్ పద్మజ సంతానసాఫల్య కేంద్రం అండగా నిలిచింది. 52 ఏళ్ల వయసులో కూడా పండంటి కవలలకు జన్మనిచ్చింది. భద్రాచలంకు చెందిన ఆరె సత్యనారాయణ, రమాదేవి దంపతులకు ఇద్దరు సంతానం. కూతురు వివాహం కాగా, కుమారుడు 2013లో 13 ఏళ్ల వయసులో ప్రమాదవశాత్తు మరణించా డు. (చదవండి : ఇది చాలా అనైతికం) ఒంటరితనం బరించలేక ఐవీఎఫ్ ద్వారా పిల్లలు కనాలనే ఆలోచనకు వచ్చి కరీంనగర్‌లోని పద్మజ సంతాన సాఫల్య కేంద్రాన్ని సంప్రదించారు. డాక్టర్ పద్మజ ఐవీ ఎఫ్ చికిత్సను ప్రారంభించి, ఈ నెల 11న సాధారణ ప్రస వంచేశారు. రమాదేవి కవలలకు జన్మనిచి్చంది. ఐవీఎఫ్ పద్ధతిలో 55 ఏళ్ల లోపు వయసున్న ఎవరికైనా టెస్ట్‌ట్యూబ్ ద్వారా పిల్లలను కనే అవకాశం ఉందని సంతాన సాఫల్య కేంద్రం నిర్వాహకురాలు డాక్టర్ పద్మజ తెలిపారు. (చదవండి : లేటు వయసులో... ఎంతటి మాతృత్వ అనుభూతులో) -
74 ఏళ్ల వయసులో మాతృత్వం.. తీవ్ర విమర్శలు
సాక్షి, అమరావతి: కృత్రిమ గర్భధారణ వైద్య రంగంలో అద్భుతం. ఎంతోమంది సంతానలేమితో బాధపడే వారు కృత్రిమ గర్భధారణ (ఐవీఎఫ్..ఇన్ విట్రో ఫెర్టిలిటీ) ద్వారా పిల్లలను కని మాతృత్వ మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్న విషయం తెలిసిందే. కానీ, తాజాగా తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం నెలవర్తిపాడుకు చెందిన మంగాయమ్మ 74 ఏళ్ల వయస్సులో ఐవీఎఫ్ విధానం ద్వారా కవలలకు జన్మనివ్వడం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ వయసులో కృత్రిమ గర్భధారణ చేసి బిడ్డలను పుట్టేలా చేయడంపై ఇప్పుడు పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గుంటూరులోని అహల్య ఆస్పత్రి వైద్యులు అనైతిక చర్యలకు పాల్పడ్డారని ఆ రంగానికే చెందిన వైద్య నిపుణులు తప్పుబడుతున్నారు. ఇది పూర్తిగా అనైతిక చర్య అని.. ఇండియన్ ఫెర్టిలిటీ సొసైటీ ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించింది. సైన్సు పది మందికీ ఉపయోగపడాలి గానీ, సంచలనం కోసం ఎప్పుడూ చేయకూడదని పలువురు వైద్యులు ఘాటుగా వ్యాఖ్యానిస్తున్నారు. ఒక మహిళ ఏ వయసులో అయినా పిల్లల్ని కనే యంత్రం కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని మరికొంతమం తీవ్రంగా స్పందించారు. లీగల్.. ఎథికల్ అంశాలతో ముడిపడినది ఇందులో న్యాయపరమైన, నైతికపరమైన అంశాలు ముడిపడి ఉన్నాయి. ఈ రెండింటినీ కూలంకషంగా పరిశీలించిన తర్వాత, మా కార్యవర్గంలోనూ చర్చించి ఎలాంటి చర్యలు తీసుకోవాలో నిర్ణయిస్తాం. – డా. బి.సాంబశివారెడ్డి, భారతీయ వైద్య మండలి ఏపీ అధ్యక్షులు ఆ వయస్సులో సరికాదు సాధారణంగా 18 ఏళ్ల నుంచి మొదలయ్యే పునరుత్పత్తి ప్రక్రియ 45 ఏళ్ల వరకూ బావుంటుంది. ఆ తర్వాత అండం విడుదల క్షీణిస్తుంది. కానీ, 74 ఏళ్ల వయసులో అనేది చాలా కష్టమైన పని. ఈ దశలో పిల్లలను కృత్రిమంగా పుట్టించడమనేది మంచిది కాదు. – డా. రాజ్యలక్షి్మ, ప్రొఫెసర్ ఆఫ్ గైనకాలజీ, ఉస్మానియా వైద్య కళాశాల విదేశాల్లో చట్టాలు కఠినం కృత్రిమ గర్భధారణ అంశంలో విదేశాలలో చట్టాలు కఠినంగా ఉంటాయి. బిడ్డలు కావాలనుకునే వారికి కొన్ని అంశాల్లో అవగాహన ఉండకపోవచ్చు. అలాంటి వారికి తెలియజెప్పడం వైద్యుల బాధ్యత. తాజా ఉదంతంతో ఇప్పుడు వయసు బాగా పైబడిన వారు కూడా తాము బిడ్డలకు జన్మనివ్వవచ్చా అని ఫోన్లలో సంప్రదిస్తున్నారు. ఇది అంత మంచి పరిణామం కాదు. – డా. వై.స్వప్న, వైద్య నిపుణురాలు, విజయవాడ వృద్ధాప్యంలో పిల్లల్ని కనడం సరైంది కాదు... ఎలాంటి విధానంలో అయినా సరే యాభై ఏళ్లు దాటిన మహిళ గర్భం నుంచి పిల్లల్ని పుట్టించడమనేది సరైన విధానం కాదనేది వైద్య వర్గాలు స్పష్టంగా చెబుతున్నాయి. డెబ్భై ఏళ్ల వయసులో మధుమేహం, రక్తపోటు, గుండెజబ్బులకు ఆస్కారం ఉంటుందని.. రక్తనాళాలు బలంగా ఉండకపోవడం వంటి కారణాలవల్ల ఆ మహిళకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుందంటున్నారు. మన దేశంలో ఐవీఎఫ్, సరోగసీ వంటి విధానాలకు సరైన చట్టం లేకపోవడం.. సంతాన సాఫల్య కేంద్రాలపై సరైన పర్యవేక్షణ లేకపోవడంవల్లే ఇలాంటి ఉదంతాలు చోటుచేసుకుంటున్నాయని మరి కొందరు చెబుతున్నారు. ముందుముందు ఇలాంటివి ఎవరూ చేయకూడదు ‘పలు వార్తా పేపర్లు, టీవీ ఛానెళ్ల, సామాజిక మాధ్యమాల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్నాం. ఇది పూర్తిగా అనైతిక చర్యగా భావిస్తున్నాం. ఏఆర్టీ (అసిస్టెడ్ రీ ప్రొడక్టివ్ టెక్నాలజీ) నిబంధనలను పూర్తిగా దుర్వినియోగ పరిచారని భావిస్తున్నాం. ఇలాంటివి భవిష్యత్‌లో ఎవరూ చేయకూడదని కూడా సూచిస్తున్నాం. దీనివల్ల అనర్థాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. దీనికి మా సంఘాల తరఫున క్షమాపణలు కోరుతున్నాం’. – ఐఎస్‌ఏఆర్ (ఇండియన్ సొసైటీ ఆఫ్ రీ ప్రొడక్షన్) – ఐఎఫ్ఎస్ (ఇండియన్ ఫెర్టిలిటీ సొసైటీ) – ఏసీఈ (అకాడెమీ ఆఫ్ క్లినికల్ ఎంబ్రాలజిస్ట్స్) -
ఇంత లేటు వయసులో... ఎంతటి మాతృత్వ అనుభూతులో
ఒక జీవి మరో జీవికి జన్మనివ్వడం సహజం.సంతానానికి జన్మనివ్వకపోవడాన్ని మనిషి అసంపూర్ణత్వంగా భావిస్తాడు.సంతానం కోసం ప్రయత్నిస్తూనే ఉంటాడు.అయితే అలాంటి అన్ని ప్రయత్నాలూ సరైనవేనా? లేక చర్చకు ఆస్కారమిచ్చేవా? మాతృత్వంలోని మధురిమలు అనిర్వచనీయమైనవి. తల్లి కావడం ఒక తీయని అనుభూతే. కానీ బిడ్డకు జన్మనివ్వడం తల్లికి పునర్జన్మ అన్న వాడుక కూడా మనలో ఉంది. ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా నెలపర్తిపాడుకు చెందిన 74 ఏళ్ల మంగాయమ్మ గురువారం కవల పిల్లలకు జన్మనిచ్చారు. పుట్టిన ఆడ శిశువులు ఇద్దరూ 1.5 కిలోల బరువుతో ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యవర్గాలు చెబుతున్నాయి. ఇది చాలా సంతోషదాయకమైన అంశం. అయితే ఇంత లేటు వయసులో గర్భధారణ అన్నది చాలా రకాలైన ముప్పులతో కూడి ఉంటుంది. డెబ్బయి నాలుగేళ్ల వయసును పక్కన ఉంచితే... గర్భధారణ విషయంలో అసలు 35 ఏళ్లు దాటిన దగ్గర్నుంచి అనేక రకాల సమస్యలు పొంచి ఉంటాయి. ఇందులోని కొన్ని వైద్యపరమైన అంశాలతో పాటు అటు నైతిక, ఇటు సామాజిక అంశాలనూ ఒకసారి పరికిద్దాం. వయసు పెరుగుతున్న కొద్దీ మహిళల అండాల సంఖ్య, నాణ్యత తగ్గుతుంటుంది. అందుకే రక్తపరీక్ష, అల్ట్రాసౌండ్ పరీక్షల ద్వారా ఒక మహిళలో ఇంకా మిగిలి ఉన్న అండాల సంఖ్యను (ఒవేరియన్ రిజర్వ్) తెలుసుకుంటారు. దాన్ని బట్టి వారికి అవసరమైన సంతాన సాఫల్య ప్రక్రియ ఏమిటన్నది నిర్ణయిస్తారు. అయితే ఇక్కడ ఒక అంశాన్ని గమనించాలి. ఇలా చేసే పరీక్షల ఫలితాలన్నీ ఉజ్జాయింపుగా ఉంటాయే తప్ప... నిర్దిష్టంగా ఏ పరీక్ష కూడా వంద శాతం కచ్చితత్వంతో ఉండదు. ఇక గర్భధారణ జరిగినా పిండంలో వైకల్యాలు ఏర్పడే అవకాశాలూ పెరుగుతాయి. అంతేకాదు... గర్భస్రావం అయ్యే అవకాశాలూ హెచ్చుతాయి. సాధారణంగా వయసు పెరుగుతున్న కొద్దీ ఆలస్యంగా గర్భధారణ జరిగే వారిలో గర్భస్రావాలు అయ్యే అవకాశాలు ఎక్కువ. గర్భస్రావం అయ్యే అవకాశాలు 35 ఏళ్ల కంటే చిన్నవయసు ఉన్నవారిలో 13 శాతం ఉంటాయి. అదే 45 ఏళ్ల వయసు పైబడిన వాళ్లలో అవి 54 శాతానికి పెరగవచ్చు. గర్భధారణకు పురుషుడి లోపాలూ దోహదం ఇక ఆలస్యంగా గర్భధారణ జరిగే ప్రక్రియలో పురుషుడి వీర్య సంబంధమైన లోపాలు కూడా గర్భధారణను సంక్లిష్టం చేస్తాయి. వయసు మీరిన పురుషుడికి సెమన్ అనాలసిస్ పరీక్ష చేసినప్పుడు అందులో పురుష బీజకణాలు తక్కువగా ఉండటం, వాటి రూపంలో లోపం, వాటి కదలికలు సరిపడనంతగా లేకపోవడం వంటి అసాధారణ పరిస్థితులు కనిపిస్తుంటాయి. అదే జరిగితే... అడ్వాన్స్డ్ స్పెర్మ్ అనాలిసిస్, టెస్టిక్యులార్ బయాప్సీ, జనెటిక్ టెస్ట్, స్క్రోటల్ అల్ట్రాసౌండ్, కేరియోటైప్ టెస్ట్ వంటి మరికొన్ని పరీక్షలూ అవసరమవుతాయి. పుట్టే పిల్లలకూ ఏర్పడే ముప్పులు ఆలస్యంగా గర్భధారణ జరిగిన మాతృమూర్తులకు పుట్టే పిల్లల్లోనూ జన్యుపరమైన కొన్ని లోపాలు తలెత్తేందుకు అవకాశం ఉంది. అదెలా జరుగుతుందో చూద్దాం.తల్లిదండ్రుల తాలూకు ఈ లక్షణాలన్నింటినీ బిడ్డలకు వచ్చేలా చేసే మౌలిక అంశాలను క్రోమోజోములు అంటారు. తల్లి నుంచి ఒక 23, తండ్రి నుంచి మరో 23... ఇలా ఈ రెండు 23 జతలు కలగలసి 46 క్రోమోజోములు పిండంలోకి చేరితేనే అది పూర్తిస్థాయిలో లోపాలు లేని ఒక మానవ పిండంగా ఎదుగుతుంది. పుట్టబోయే బిడ్డలందరిలోనూ ఇవే 23 జతల క్రోమోజోములుంటాయి. ఉండాలి కూడా. అయితే దురదృష్టవశాత్తు కొంతమంది పిల్లల్లో మాత్రం ఈ క్రోమోజోముల సంఖ్యలో తేడా వస్తుంది. అప్పుడు ఆ బిడ్డలో దేహనిర్మాణపరమైన లోపాలు, ఇతరత్రా లోపాలు రావచ్చు. అలా ఆ లోపాలతోనే బిడ్డ పుట్టేందుకు అవకాశం ఉంది.బిడ్డ పుట్టాక లోపాలను కనుగొంటే చేయగలిగేందేమీ ఉండకపోవచ్చు. అయితే బిడ్డ పుట్టకముందే వాటిని కనుగొనగలిగితే తల్లిదండ్రులకూ, కొన్నిసార్లు పుట్టబోయే బిడ్డకు ఉపయోగకరమైన నిర్ణయం తీసుకోడానికి వీలవుతుంది. ఇలా బిడ్డలోని క్రోమోజోముల సంఖ్యలో తేడా వచ్చినప్పుడు బిడ్డకు వచ్చే వ్యాధుల్లో ఒక ప్రధానమైన సమస్యే ‘డౌన్స్ సిండ్రోమ్’. ఏమిటీ డౌన్స్ సిండ్రోమ్? మానవుల్లో 23 జతల క్రోమోజోములకు బదులు ఒక క్రోమోజోము అదనంగా వచ్చి చేరినప్పుడు పెరిగే పిండం బిడ్డగా రూపొందితే అప్పుడు పుట్టే బిడ్డ కొన్ని లోపాలతో పుడుతుంది. అలా పుట్టే బిడ్డను ‘డౌన్ సిండ్రోమ్’తో పుట్టిన బిడ్డగా చెబుతారు. ఈ లోపాన్నే ‘ట్రైజోమీ 21’ అని కూడా అంటారు. బిడ్డలోని 21వ క్రోమోజోముకు అదనంగా మరో క్రోమోజోము చేరడం వల్ల ఇలా డౌన్ సిండ్రోమ్‌తో బిడ్డ పుడతాడు. ఇలా డౌన్స్ సిండ్రోమ్‌తో పుట్టిన బిడ్డలో మెదడు ఎదుగుదల తక్కువ. కాబట్టి ఆ బిడ్డలో నేర్చుకునే శక్తి, మానసిక ఎదుగుదల ఇవన్నీ తక్కువగా ఉంటాయి. కొందరిలో గుండె లోపాలు కూడా రావచ్చు. తల్లిలో గర్భధారణ చాలా ఆలస్యంగా జరిగినప్పుడు ఇలా డౌన్స్ సిండ్రోమ్‌తో బిడ్డ పుట్టే అవకాశం ఉంది. ఉదాహరణకు 20 ఏళ్ల వయసులో గర్భధారణ జరిగినప్పుడు ప్రతి 1140 మంది మహిళల్లో ఒకరికి డౌన్స్ సిండ్రోమ్‌తో బిడ్డ పుట్టే అవకాశం ఉండగా... 30 ఏళ్ల వయసులో గర్భధారణ జరిగినప్పుడు ప్రతి 720 మహిళల్లో ఒకరికీ, అదే 40 ఏళ్ల వయసు తర్వాత గర్భధారణ జరిగితే ప్రతి 65 మందిలో ఒకరికి ఇలా డౌన్స్ సిండ్రోమ్‌తో బిడ్డ పుట్టవచ్చు. కవలల తండ్రి డౌన్స్ సిండ్రోమ్‌ను ముందుగానే తెలుసుకోవచ్చా? కొన్ని పరీక్షలతో డౌన్స్ సిండ్రోమ్, మరికొన్ని జన్యుపరమైన సమస్యలను తెలుసుకోవచ్చు. ఇందులో మొదటిది స్క్రీనింగ్ పరీక్ష. ఈ స్క్రీనింగ్ పరీక్షలో.. సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తేలితే, ఆ తర్వాత చేసేది నిర్ధారణ పరీక్ష. ఇందులో స్క్రీనింగ్ పరీక్షను హైరిస్క్ ఉన్న ప్రతి గర్భవతీ చేయించుకోవడం మంచిది. గర్భిణి పిండంలో ఏదైనా ముప్పు (హైరిస్క్) ఉందా అని తెలుసుకోవడం కోసం ఈ పరీక్ష ఉపయోగపడుతుంది. ఇది చాలా చిన్న సాధారణ రక్త పరీక్ష మాత్రమే. కాకపోతే కొంచెం ఖర్చుతో కూడుకున్నది.ఒకవేళ ఈ స్క్రీనింగ్ పరీక్ష (డబుల్ మార్కర్ టెస్ట్, క్వాడ్రపుల్ టెస్ట్)లో ఏదైనా సమస్య ఉండే అవకాశమున్నట్లు ఫలితం వస్తే అప్పుడు పూర్తి స్థాయి నిర్ధారణ కోసం మరో పరీక్ష అంటే కోరియానిక్ విల్లస్ బయాప్సీ, అమ్నియోసెంటైసిస్ పరీక్ష (ఉమ్మనీరు పరీక్ష) అవసరమవుతాయి.ఇవేగాక ఆలస్యంగా గర్భధారణ జరిగిన తల్లిదండ్రులకు పుట్టే బిడ్డలు చాలా రకాల అవయవ లోపాలతోనూ, ఇంకా అనేక రకాల జన్యుపరమైన సమస్యలు, మెటబాలిక్ సిండ్రోమ్స్‌తో పుట్టవచ్చు. మూగ, చెవుడు, ఆటిజమ్ వంటి సమస్యలు రావడం కూడా ఎక్కువే. ఇలాంటి చాలా సమస్యలు ఎంత అడ్వాన్స్డ్ పరీక్షలు అందుబాటులోకి వచ్చినప్పటికీ అవన్నీ కచ్చితంగా తెలియకపోవచ్చు. పుట్టిన తర్వాత, బిడ్డ ఎదుగుతున్న క్రమంలో తెలుస్తాయి. ఇక ఇంత లేట్ వయసులో తల్లిలో క్యాల్షియం తగ్గడం, ఎముకలు అరిగిపోవడం, రక్తం గూడు కట్టుకుపోయే ముప్పు, గర్భధారణ సమయంలో సాధారణంగా రక్తపోటు పెరగడం, జెస్టెషనల్ డయాబెటిస్ వంటి అనేక ముప్పులు కలుగుతాయి. ఇవన్నీ వైద్యపరమైన ముప్పుల్లో కొన్ని మాత్రమే. కాగా ఇక నైతికంగా, సామాజికంగానూ, ఆర్థికపరమైన ముప్పులు కూడా ఉంటాయి.ఈ ముదిమి వయసులో పిల్లలు కలగాలనే తమ గాఢమైన తాపత్రయాన్ని నెరవేర్చుకుని సేఫ్‌గా ఆరోగ్యకరమైన పిల్లలను కన్న తల్లిదండ్రులనూ, బిడ్డలనూ అభినందించి తీరాలి. అలాగే ఈ వయసులో ప్రపంచ రికార్డు నెలకొల్పే ఫీట్‌ను అత్యంత సురక్షితంగా నెరవేర్చిన వైద్యబృందానికీ అభినందన దక్కాలి. అయితే... బిడ్డలను ఏ వయసులో కనాలి, అంత వయసు వారికి గర్భధారణ కోసం కృత్రిమ ప్రక్రియలు అవలంబించవచ్చా, ఏ వయసు వారి వరకు గర్భధారణ ప్రక్రియలు పాటించవచ్చు అనే విషయంలో స్పష్టమైన చట్టాలేమీ లేవు. నైతికతలను స్వచ్ఛందంగా పాటించే మనలాంటి దేశాల్లో ఉండవు కూడా. కాబట్టి ఇందులో ఎదురయ్యే సమస్యలూ, వాటి పరిష్కారాలు, వాటి ఆధారంగానే ముందుకు వెళ్లడం... ఇవన్నీ వారి వారి విచక్షణ మేరకే ఉంటాయి. కాబట్టి అటు వైద్యులూ, ఇటు తల్లిదండ్రులూ ఈ విషయంలో ఎవరికి వారే విచక్షణతో మెలగాలి. అలాంటి విచక్షణలతో కూడినది కనుకనే ఈ వార్త ఇప్పుడు మనందరిలోనూ, వైద్యవర్గాల్లోనూ చర్చనీయాంశమైంది. ఏమైనా అద్భుతాలు అరుదుగా మాత్రమే జరుగుతాయి. అద్భుతాలతో పాటు కాంప్లికేషన్లు ముడిపడి ఉంటాయి. సఫలమైనప్పుడు మాత్రమే అది అద్భుతం అవుతుంది. అందరూ ప్రతిసారీ తమ విషయంలో అద్భుతాన్ని ఆశించడం అంత సమంజసం కాకపోవచ్చు. అందుకే సాధ్యమైనంత వరకు ప్రకృతి ధర్మాన్ని అనుసరించే ముందుకెళ్లాలి. ఆర్థికపరమైనఅంశాలు సాధారణంగా తల్లిదండ్రులు పెద్ద వయసులో ఉన్న వారు కావడం, కృత్రిమ గర్భధారణ ద్వారా పిల్లలు పుట్టినందున, కవలలు అయినందున కొన్ని రకాల వైద్యపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇది అటు తల్లిదండ్రులకూ, ఇటు బిడ్డలకూ రావచ్చు. వారు బాగా కలిగినవారే అయినప్పటికీ ఇప్పుడు వైద్యం చాలా ఖరీదైన నేపథ్యంలో ఇది ఖర్చు పరంగా కాస్తంత ఆర్థిక భారంగా పరిణమించేందుకే అవకాశాలు ఎక్కువ. నైతికపరమైన అంశాలు పిల్లలను పొందడం అన్నది ఒక భావోద్వేగపరమైన అంశం. ప్రతివారికీ తమ రక్తం పంచుకు పుట్టిన పిల్లలపై అపేక్ష, ప్రేమ, అనిర్వచనీయమైన అనుబంధం ఉంటాయి. ఆ హక్కును కాదనలేం. కానీ గర్భధారణ జరిగిన మహిళకు ఏదైనా ముప్పు వచ్చి, తల్లీబిడ్డలిద్దరిలో తల్లిని రక్షించాలా, బిడ్డను రక్షించాలా అన్న సంశయం వస్తే... పెద్దప్రాణానికే విలువనివ్వడం మన గమనానికి వచ్చే అంశమే. అలాంటప్పుడు 74 ఏళ్లు వయసులో బిడ్డ ఆరోగ్యంగానే పుడతాడా... ఒకవేళ పుట్టినా ఈ కేసులో అవసరమైనట్లే సిజేరియన్ అవసరమైతే ఆ మహిళకు శస్త్రచికిత్సలకు తట్టుకునే శక్తి ఉంటుందా... తల్లికి గండంగా పరిణమించే ఇంత రిస్క్ అవసరమా అన్నది ఆలోచించాల్సిన అంశం. ఇక మన మంగాయమ్మ గారి విషయంలో అదృష్టవశాత్తూ బిడ్డల్లో జన్యుపరమైన లోపాలేవీ తలెత్తలేదు. కానీ ఒకవేళ ఇంత పెద్ద వయసులో డౌన్స్ సిండ్రోమ్‌కు స్పష్టమైన అవకాశాలు ఉన్నందున అదేజరిగితే అది అటు తల్లిదండ్రులతో పాటు ఇటు సమాజంపై కూడా భారం పడేదే. ఇక ఇప్పుడు తల్లి వయసు 74 ఏళ్లు, మరి తండ్రి వయసు తప్పక అంతకంటే ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ తండ్రి వయసు కూడా కాసేపు అంతే అనుకుందాం. ఉదాహరణకు ఆ పిల్లలను సాకే విషయంలో ఎదురయ్యే ఒక చిన్న అంశాన్ని చూద్దాం. ఆ పిల్లలిద్దరూ పదవ తరగతి, ఇంటర్‌కు చేరే సమయానికి వారి వయసు 89, 92కి చేరుతుంది. దాదాపు 90 ఏళ్ల నాటికి కూడా టీనేజీకి చేరని ఆ పిల్లలను ఆ తల్లిదండ్రులు సమాజానికి భారం కాకుండా బాధ్యతగా సాకగలరా అనేది మరో అంశం. డా‘‘ వేనాటి శోభ,సీనియర్ గైనకాలజిస్ట్‌బర్త్‌రైట్ బై రెయిన్బో,హైదర్‌నగర్, హైదరాబాద్ -
ఆ అమ్మకు కవలలు..
గుంటూరు మెడికల్/రామచంద్రాపురం రూరల్: బామ్మ వయసులో ఆమె అమ్మ అయింది. సంతానం కావాలన్న ఆమె కల కవలల రూపంలో నెరవేరింది. 73 ఏళ్ల వయసులో ఆమె మాతృత్వపు మధురిమలను ఆస్వాదిస్తోంది. సంతానం కోసం ఏళ్ల తరబడి నిరీక్షించిన ఆమె కల ఎట్టకేలకు గురువారం నెరవేరింది. దేశం అంతా నివ్వెరపోయేలా 73 ఏళ్ల వయసులో గర్భం దాల్చడం.. వివాహమైన 57 సంవత్సరాలకు కడుపు పండి ఒకేసారి ఇద్దరు ఆడ శిశువులకు జన్మనివ్వడం అందరినీ ఆశ్చర్యపడేలా చేసింది. గుంటూరు కొత్తపేటలోని అహల్య ఐవీఎఫ్ సెంటర్లో గురువారం మంగాయమ్మకు విజయవంతంగా ఆపరేషన్ చేసి శిశువులను బయటకు తీశారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆస్పత్రి అధినేత, ఐవీఎఫ్ స్పెషాలిటీ వైద్య నిపు ణులు డా. శనక్కాయల ఉమాశంకర్ ఆస్ప త్రిలో మీడియాకు వివరించారు. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం నెలపర్తిపూడి గ్రామానికి చెందిన మంగాయమ్మ, రామ రాజారావు దంపతులకు 57 ఏళ్లుగా పిల్లలు పుట్టలేదన్న బాధతో 2018 నవంబర్‌లో తమను సంప్రదించారన్నారు. వయసు పెద్దది కావటంవల్ల ఆమెకు కౌన్సెలింగ్ చేసి, మెడికల్ బోర్డు అనుమతి తీసుకున్న అనంతరమే ఆమెకు వైద్యం ప్రారంభించామని ఆయన చెప్పారు. తమ వద్దకు వచ్చిన నెలరోజులకు నెలసరి వచ్చిందన్నారు. రెండో నెలలో ప్రణాళిక ప్రకారం ఐవీఎఫ్ చేయడంతో అదే నెలలో గర్భ నిర్ధారణ అయిందన్నారు. 2019 జనవరి 28న గర్భం దాల్చినట్లు నిర్ధారించుకుని ఆమెకు ఆసుపత్రిలోనే ప్రత్యేక గదిలో వైద్య సేవలు అందించామన్నారు. బీపీ, సుగర్ లేకపోవడంతో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా గర్భంలో బిడ్డ ఎదిగిందన్నారు. పుట్టిన శిశువులు ఒకొక్కరు 1.8 కేజీలు ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం వీరిద్దరినీ ఎన్ఐసీయూలో ఉంచామని, 21 రోజుల తర్వాత ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేస్తామని ఉమాశంకర్ తెలిపారు. దేశంలో మొట్టమొదటిసారిగా 73 ఏళ్ల వయస్సులో గర్భం దాల్చడం ఇదే మొదటిసారి అని ఆయనన్నారు. ఆపరేషన్‌కు ముందు సీమంతం ఇదిలా ఉంటే.. ఆపరేషన్ థియేటర్లోకి వెళ్లే ముందు మంగాయమ్మకు ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది సీమంతం చేశారు. మంగాయమ్మ భర్త రామరాజారావు, తల్లి దేవళ్ల తులసమ్మ (93) అక్షింతలు వేసి ఆశీర్వదించారు. -
‘మంగాయమ్మ, పిల్లలు క్షేమంగా ఉన్నారు’
సాక్షి, గుంటూరు : 74 ఏళ్ల వయసులో కవలపిల్లలకు జన్మనిచ్చిన మంగాయమ్మ ప్రస్తుతం క్షేమంగా ఉన్నారని ఆమెకు ప్రసవం చేసిన డాక్టర్ ఉమాశంకర్ తెలిపారు. ఐవీఎఫ్ ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చిన అతి పెద్ద మహిళగా మంగాయమ్మ రికార్డు నెలకొల్పారు. ఆమెకు గుంటూరు అహల్యా ఆస్పతిలో ఉమాశంకర్ నేతృత్వంలోని వైద్యుల బృందం గురువారం విజయవంతంగా ఆపరేషన్ నిర్వహించింది. అనంతరం ఉమాశంకర్ మీడియాతో మాట్లాడుతూ.. సంతానం కోసం మంగాయమ్మ దంపతులు గతేడాది నవంబర్ 12న తమ ఆస్పత్రికి వచ్చినట్టు చెప్పారు. మంగాయమ్మ ఆరోగ్యంగా ఉండటంతో ఐవీఎఫ్ ద్వారా గర్భం కోసం ప్రయత్నించినట్టు వెల్లడించారు. అయితే గర్భం దాల్చిన తరువాత మంగాయమ్మకు ఆహారం విషయంలో కొంత ఇబ్బంది ఎదురైందని చెప్పారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆమెకు ప్రత్యేక వైద్యం అందించినట్టు వివరించారు. 10 మంది వైద్యులు మూడు బృందాలుగా విడిపోయి.. రాత్రింబవళ్లు కష్టపడి విజయం సాధించినట్టు పేర్కొన్నారు. ఒక పద్దతి ప్రకారం చికిత్స చేయడం వల్లే వైద్య రంగంలో అద్భుతమైన విజయం సాధించామన్నారు. నేడు గురుపూజోత్సవం కావడంతో ఈ విజయాన్ని తన గురువులకు అంకితం ఇస్తున్నట్టు ప్రకటించారు. చదవండి : కవలలకు జన్మనిచ్చిన 74 ఏళ్ల బామ్మ -
కవలలకు జన్మనిచ్చిన బామ్మ
-
కవలలకు జన్మనిచ్చిన 74 ఏళ్ల బామ్మ
గుంటూరు : 74 ఏళ్ల వయసులో గర్భం దాల్చిన బామ్మ కవలలకు జన్మనిచ్చారు. గురువారం ఆమెకు సిజేరియన్ ద్వారా వైద్యులు ప్రసవం చేశారు. గుంటూరు అహల్యా ఆస్పతిలో నలుగురు వైద్యుల పర్యవేక్షణలో ఈ ఆపరేషన్ జరిగింది. ప్రస్తుతం తల్లి, పిల్లలు క్షేమంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. పండంటి ఇద్దరు ఆడపిల్లలు జన్మించడంతో.. 57 ఏళ్లుగా పిల్లల కోసం తపనపడ్డ ఆ దంపతుల కల నెరవేరింది. దీంతో వారి కుటుంబంలో సంతోషం నెలకొంది. కాగా, తూర్పుగోదావరి జిల్లా నెలపర్తిపూడికి చెందిన యర్రమట్టి రామరాజారావుతో మంగాయమ్మకు 1962లో వివాహమైంది. రైతు కుటుంబానికి చెందిన రామరాజారావు దంపతులు వివాహమైన నాటి నుంచి సంతానం కోసం ప్రయత్నించారు. గత ఏడాది మంగాయమ్మ ఇంటి పక్కనే ఉన్న ఓ మహిళ ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చింది. ఆ మహిళ వయసు 55 ఏళ్లు ఉండటంతో మంగాయమ్మ ధైర్యం తెచ్చుకుని.. ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చేందుకు సిద్ధమైంది. 2018 నవంబర్‌లో ఆ దంపతులు గుంటూరు అహల్యా ఆస్పత్రిని సంప్రదించగా.. ఐవీఎఫ్ పద్ధతిలో మంగాయమ్మ గర్భం దాల్చింది. దీంతో ఆమెకు ఆస్పత్రిలోనే ప్రత్యేక గదిని ఏర్పాటుచేసి వైద్యసేవలందించారు. బీపీ, షుగర్ లేకపోవడంతో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా గర్భంలో బిడ్డ ఆరోగ్యంగా ఎదిగింది. గుండె వైద్య నిపుణుడు పీవీ మనోహర్, జనరల్ మెడిసిన్ వైద్య నిపుణుడు శనక్కాయల ఉదయ్‌శంకర్ పర్యవేక్షణలో రోజూ వైద్య పరీక్షలు నిర్వహిస్తూ తల్లి, గర్భంలో ఉన్న బిడ్డ ఆరోగ్యంగా ఉండేలా చర్యలు తీసుకున్నారు. దీంతో మంగాయమ్మ ప్రపంచంలో ఐవీఎఫ్ చేయించుకున్న అతి పెద్ద మహిళగా రికార్డు నెలకొల్పారు. ఇప్పటివరకు రాజస్తాన్‌లో దల్జీందర్ పేరిట ఈ రికార్డు ఉంది. దల్జీందర్ 72 ఏళ్ల వయస్సులో మగ బిడ్డకు జన్మనిచ్చారు. తాజాగా దల్జీందర్ రికార్డును అధిగమించి మంగాయమ్మ కవలలకు జన్మనిచ్చారు.