సరోగసీ ద్వారా బిడ్డను కోల్పోయాం: స్టార్ హీరోయిన్‌ | Amrita Rao RJ Anmol Share Pregnancy Struggles During Surrogacy | Sakshi
Sakshi News home page

Amrita Rao RJ Anmol: సరోగసీ ద్వారా బిడ్డను కోల్పోయాం: స్టార్ హీరోయిన్‌

Published Fri, Apr 22 2022 2:51 PM | Last Updated on Fri, Apr 22 2022 2:53 PM

Amrita Rao RJ Anmol Share Pregnancy Struggles During Surrogacy - Sakshi

Amrita Rao RJ Anmol Share Pregnancy Struggles During Surrogacy: హీరోయిన్‌ అమృత రావు, ఆమె భర్త ఆర్‌జే అన్మోల్‌ తమ యూట్యూబ్‌ ఛానల్‌ 'కపుల్‌ ఆఫ్‌ థింగ్స్‌' ద్వారా తమ జీవితంలోని అనేక రహస్యాలను పంచుకుంటున్నారు. ఇటీవల ఓ వీడియోలో అమృత ఎదుర్కొన్న గర్భధారణ సమస్యల గురించి చెప్పుకొచ్చింది. అమృత, అన్మోల్‌ తల్లిదండ్రులు అయ్యేందుకు సరోగసీ, ఐయూఐ, ఐవీఎఫ్‌, హోమియోపతి, ఆయుర్వేద పద్ధతులను ఎంచుకున్నట్లు తెలిపారు. సరోగసీ పద్ధతి గురించి మాట్లాడుతూ వారు ఈ పద్ధతి ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే బిడ్డను కోల్పోయినట్లు వెల్లడించారు. 

'ఈ విషయం ఇప్పటికీ ఎంతో బాధగానే ఉంది. తల్లిదండ్రులు కావాలన్న ఉత్సాహంతో మీరు అంత ఉద్వేగానికి లోనవాల్సిన అవసరం లేదు. ఇది మన చేతుల్లో ఉండదు.' అని అమృత ఆ వీడియోలో పేర్కొంది. అలాగే అమృత రావు, అన్మోల్‌ ఐవీఎఫ్‌ చికిత్స గురించి కూడా తెలిపారు. చాలా ఏళ్లు ప్రయత్నించిన తర్వాత అమృత 'మనకు కూడా బిడ్డ పుట్టాలా ? ఈ ఒత్తిడి జీవితాలతో పిల్లలను పెంచగలమా ? ఇది అంత ముఖ్యమా ?' అని ప్రశ్నించుకున్నట్లు పేర్కొంది. అనంతరం ఈ జంట హాలీడే కోసం థాయ్‌లాండ్‌కు వెళ్లారు. మార్చి 2020లో అమృత గర్భవతి కాగా నవంబర్‌లో వీర్‌కు జన్మనిచ్చింది.  వీర్‌కు మొదటగా అనేక నిక్‌నేమ్స్‌ పెట్టి పిలిచేవాళ్లమని ఈ జంట పేర్కొంది. 

చదవండి: తన భర్తనే మళ్లీ పెళ్లి చేసుకున్న స్టార్‌ హీరోయిన్‌..



చదవండి: 'పెళ్లి చేసుకుందాం, సినిమాలు వదిలేయ్‌' ఏకధాటిగా ఏడ్చిన నటి!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement