Anmol
-
ప్రిక్వార్టర్స్‌లో అన్మోల్
బెంగళూరు: డిఫెండింగ్ చాంపియన్ అన్మోల్ ఖర్బ్, గతేడాది రన్నరప్ తన్వీ శర్మ జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. మాజీ చాంపియన్లు మిథున్ మంజునాథ్, సౌరభ్ వర్మలు అలవోక విజయాలతో మూడో రౌండ్‌కు చేరారు. కానీ పురుషుల డిఫెండింగ్ చాంపియన్ చిరాగ్ సేన్‌కు మూడో రౌండ్లోనే చుక్కెదురైంది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ మూడో రౌండ్లో అన్మోల్ 21–14, 21–14తో కృషిక మహాజన్‌పై గెలుపొందగా, తన్వీ శర్మ 21–12, 21–8తో స్వాతి సోలంకిపై సునాయాస విజయం సాధించింది. రుజుల రాము 21–19, 19–21, 21–17తో పదో సీడ్ సూర్యచరిష్మ తమిరిపై, జియా రావత్ 25–27, 21–14, 21–10తో తొమ్మిదో సీడ్ శ్రుతి ముందాడపై గెలుపొందారు. పురుషుల సింగిల్స్ మూడో రౌండ్లో చిరాగ్ సెన్ను తమిళనాడు షట్లర్ రిత్విక్ కంగుతినిపించాడు. తొలి గేమ్‌ను సులువుగా గెలుచుకున్న చిరాగ్‌కు తర్వాతి గేముల్లో రితి్వక్ నుంచి ఊహించని పోటీ ఎదురవడంతో చేతులెత్తేశాడు. చివరకు రిత్విక్ 12–21, 21–19, 21–15తో చిరాగ్ సేన్‌పై విజయం సాధించాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో రిత్విక్... ఎమ్. రఘుతో తలపడనున్నాడు. మిథున్ మంజునాథ్ 21–9, 21–18తో మూడో సీడ్ భరత్ రాఘవ్‌ను, సౌరభ్ వర్మ 21–17, 21–17తో అభినవ్ గార్గ్‌ను ఓడించారు. రోహన్ గుర్బాని 21–15, 21–1తో 11వ సీడ్ లోకేశ్ రెడ్డిపై, రఘు 21–19, 21–16తో కార్తీక్ జిందాల్‌పై గెలిచారు. -
అమెరికాలో అన్మోల్ బిష్ణోయ్ అరెస్టు.. భారత్‌కు అప్పగించేది అప్పుడే..
కాలిఫోర్నియా/ముంబయి:గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ తమ్ముడు అన్మోల్ బిష్ణోయ్ అమెరికాలో అరెస్టైనట్లు సమాచారం. సోమవారం(నవంబర్ 18) తెల్లవారుజామున అన్మోల్ను కాలిఫోర్నియాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.తొలుత అమెరికా పోలీసులు అన్మోల్ను విచారించిన తర్వాత ఖలిస్తానీ తీవ్రవాది హర్దీప్సింగ్నిజ్జర్ హత్య కేసులో కెనడా పోలీసులకు అప్పగించే అవకాశం ఉందని ముంబై క్రైమ్‌బ్రాంచ్ పోలీసులు చెబుతున్నారు. తర్వాతే భారత్‌కు అన్మోల్ను అప్పగిస్తారని ముంబై పోలీసులు భావిస్తున్నారు. గతేడాది తన అన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్‌బిష్ణోయ్ అరెస్టయిన తర్వాత అన్మోల్ భారత్ వదిలి అమెరికా పారిపోయాడు. బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ ఇంటి బయట కాల్పుల ఘటనతో పాటు పంజాబ్ సింగర్ సిద్ధు మూసేవాలా హత్య సహా పలు కేసుల్లో అన్మోల్ నిందితుడిగా ఉన్నాడు.ఇతడి సూచనల మేరకే ఇటీవల ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీని హత్య చేసినట్లు పట్టుబడ్డ నిందితులు వెల్లడించిన విషయం తెలిసిందే. అన్మోల్కు సంబంధించిన సమాచారమిస్తే రూ.10 లక్షలిస్తామని పోలీసులు ఇప్పటికే ప్రకటించారు. -
అమెరికా నుంచి లారెన్స్‌బిష్ణోయ్ తమ్ముడి బెదిరింపులు
న్యూఢిల్లీ:గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ తమ్ముడు అన్మోల్ బిష్ణోయ్‌పై గురుగ్రామ్‌లో బెదిరింపుల కేసు నమోదైంది. భీమ్‌సేన చీఫ్ సత్పల్ తన్వర్‌ను విదేశాల నుంచి బెదిరించినందుకు అన్మోల్‌పై కేసు రిజిస్టర్ చేసినట్లు పోలీసులు తెలిపారు. తన్వర్‌ను ముక్కలుముక్కలుగా నరికేస్తామంటూ అన్మోల్ గ్యాంగ్ బెదిరించినట్లు సమాచారం.అన్మోల్ జింబాబ్వే,కెన్యా ఫోన్ నెంబర్లను వాడుతూ అమెరికా, కెనడాల నుంచి బెదిరింపులకు పాల్పడుతున్నట్లు పోలీసులు చెప్పారు.ఈ కేసులో దర్యాప్తు కోసం పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అన్మోల్ను భారత్ తీసుకు రావడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.కాగా, అన్మోల్ బిష్ణోయ్ ప్రస్తుతం అమెరికాలో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.అతడి ఆచూకీ తెలిపితే రూ.10 లక్షల రివార్డు ఇస్తామని నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ(ఎన్ఐఏ) పోలీసులు ఇప్పటికే ప్రకటించారు. ఇదీ చదవండి: భీమ్ ఆర్మీచీఫ్ ప్రయాణిస్తున్న వందేభారత్ రైలుపై దాడి -
లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ను పట్టిస్తే రూ.10 లక్షలు
ముంబై: గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేర్చింది. అలాగే అన్మోల్ను పట్టించిన వారికి రూ. 10 లక్షల రివార్డును కూడా ప్రకటించింది. కాగా గత ఏప్రిల్‌లో ముంబైలోని బాలీవుడ్ నటుడు సల్మీన్ ఖాన్ నివాసం వెలుపల జరిగిన కాల్పుల ఘటనలో అన్మోల్కు ప్రమేయం ఉన్నట్లు తేలిన సంగతి తెలిసిందే. ముంబై పోలీసులు అన్మోల్‌పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఆ ఫైరింగ్‌కు పాల్పడింది తామే అని అతను సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు.కాగా బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌పై బెదిరింపులు, మహారాష్ట్ర రాజకీయ నేత బాబా సిద్దిఖీ హత్య వంటి కారణాలతో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరు మారుమోగుతోంది. బాబా సిద్దిఖీ హత్యతో అన్మోల్ బిష్ణోయ్ పేరు కూడా ఉన్నట్లు భావిస్తున్నారు. సిద్ధిఖీ హత్యకు ముందు సైతం షూటర్లతో అన్మోల్ చాటింగ్ చేసినట్లు ముంబయి పోలీసులు వెల్లడించారుఅన్మోల్ బిష్ణోయ్‌ని అలియాస్ భానుగా పిలుస్తారు. గత ఏడాది నకిలీ పాస్‌పోర్ట్‌తో భారత్ నుంచి పారిపోయిన అన్మోల్.. అనంతరం కెన్యా, కెనడాలో గుర్తించారు. ప్రస్తుతం అతడు కెనడాలో నివసిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పంజాబీ సింగర్ సిద్దూ మోసేవాల్ హత్య కేసులో అన్మోల్ వాంటెడ్ జాబితాలో ఉన్నాడు. మరోవైపు లారెన్స్ బిష్ణోయ్ ప్రస్తుతం అహ్మదాబాద్‌లోని సబర్మతి సెంట్రల్ జైలులో ఉన్నారు. -
అన్మోల్కు తొలి అంతర్జాతీయ టైటిల్
భారత బ్యాడ్మింటన్ రైజింగ్ స్టార్ అన్మోల్ ఖరబ్ తన కెరీర్లో తొలి అంతర్జాతీయ టైటిల్‌ను సాధించింది. శనివారం ముగిసిన బెల్జియం ఓపెన్ ఇంటర్నేషనల్ చాలెంజ్ టోర్నీలో హరియాణాకు చెందిన 17 ఏళ్ల అన్మోల్ మహిళల సింగిల్స్ విభాగంలో చాంపియన్‌గా అవతరించింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 222వ స్థానంలో ఉన్న అన్మోల్ 59 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో 24–22, 12–21, 21–10తో ఏడో సీడ్ అమెలీ షుల్జ్ (డెన్మార్క్)పై గెలిచింది. -
UPSC Results 2024: టాపర్స్
ఆకాశంలో సగం అని చాటడం వేరు.. నిరూపించడం వేరు. నేటి అమ్మాయిలు చదువులో, మేధలో, సమర్థమైన అవకాశాలు అందుకోవడంలో తమ ఆకాశం సగం అని నిరూపిస్తున్నారు. యు.పి.ఎస్.సి. 2023 టాప్ 25 ర్యాంకుల్లో 10 మంది అమ్మాయిలు ఉన్నారు. మన తెలుగు అమ్మాయి అనన్య (3), రుహానీ (5), సృష్టి (6), అన్ మోల్ రాథోడ్ (7), నౌషీన్ (9), ఐశ్వర్యం ప్రజాపతి (10), మేధా ఆనంద్ (13), స్వాతి శర్మ (17), వార్దా ఖాన్ (18), రితికా వర్మ (25). వీరిలో అనన్య, సృష్టి, వార్దా ఖాన్ల కథనాలు ఇప్పటికే అందించాం. మిగిలిన ఏడుగురు ప్రతిభా పరిచయాల గురించిన ఈ కథనం. ‘స్వయం సమృద్ధి, ‘ఆర్థిక స్వాతంత్య్రం’, ‘నిర్ణయాత్మక అధికారిక పాత్ర’, ‘పరిపాలనా రంగాల ద్వారా జనావళికి సేవ’, ‘సామర్థ్యాలకు తగిన స్థానం’, ‘లక్ష్యాలకు తగిన సామర్థ్యం’... ఇవీ నేటి యువతుల విశిష్ట ఆకాంక్షలు, అభిలాషలు, లక్ష్యాలు. అందుకే దేశంలో అత్యంత క్లిష్టతరమైన సివిల్స్ ప్రవేశ పరీక్షల్లో వీరు తలపడుతున్నారు. గెలుస్తున్నారు. నిలుస్తున్నారు. యు.పి.ఎస్.సి. 2023 ఫలితాల్లో టాప్ 25లో పది ర్యాంకులు అమ్మాయిలు సాధించడం గర్వపడాల్సిన విషయం. మొత్తం 1016 మంది అభ్యర్థులు ఎంపిక కాగా వీరిలో అమ్మాయిలు 352 మంది ఉండటం ముందంజను సూచిస్తోంది. తల్లిదండ్రులకు భారం కాకుండా ఒకవైపు ఉద్యోగాలు చేస్తూ లేదా ఇంటి దగ్గర చదువుకుంటూ వీరిలో చాలామంది ర్యాంకులు సాధించారు. మహబూబ్‌నగర్‌కు చెందిన అనన్య రెడ్డి టాప్ 3 ర్యాంక్ సాధించి తెలుగు కీర్తి రెపరెపలాడించింది. కోచింగ్ సెంటర్ల మీద ఆధారపడకుండా సొంతగా చదువుకోవడం ఒక విశేషమైతే, మొదటి అటెంప్ట్‌లోనే ఆమె భారీ ర్యాంక్ సాధించడం మరో విశేషం. అలాగే ఢిల్లీకి చెందిన సృష్టి దమాస్ 6వ ర్యాంక్, వార్దా ఖాన్ 18వ ర్యాంక్ సాధించి స్ఫూర్తిగా నిలిచారు. మిగిలిన ఏడుగురు విజేతల వివరాలు. రుహానీ (5వ ర్యాంకు) హర్యానాకు చెందిన రుహానీ హర్యానాలోని గుర్గావ్లోనూ ఢిల్లీలోనూ చదువుకుంది. తల్లిదండ్రులు ఇద్దరూ లెక్చరర్లు. ఎకనమిక్స్‌లో గ్రాడ్యుయేషన్ చేసిన రుహానీ ‘ఇగ్నో’ నుంచి ΄ోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది. 2020లో ఇండియన్ ఎకనామిక్ సర్వీస్‌కు ఎంపికయ్యి నీతి ఆయోగ్‌లో మూడేళ్లు పని చేసింది. కాని ఐ.ఏ.ఎస్ కావడం ఆమె లక్ష్యం. మరో అటెంప్ట్‌లో ఆమె ఐ.పి.ఎస్.కు ఎంపికయ్యింది. హైదరాబాద్‌లో శిక్షణ ΄÷ందుతూ ఆఖరుసారిగా 6వ అటెంప్ట్‌లో టాప్ ర్యాంక్ సాధించింది. పేద వర్గాల ఆర్థిక స్థితిని మెరుగు పర్చడం తన లక్ష్యం అంటోంది రుహానీ. అన్మోల్ రాథోడ్ (7వ ర్యాంకు) జమ్ము నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉండే ఉద్రానా అనే మారుమూల పల్లె అన్మోల్ది. తండ్రి బ్యాంక్ మేనేజర్, తల్లి ప్రిన్సిపాల్. ఇంటర్ వరకూ జమ్ములో చదువుకున్నా గాంధీనగర్‌లో బి.ఏ.ఎల్.ఎల్.బి. చేసింది. 2021లో చదువు పూర్తయితే అదే సంవత్సరం సివిల్స్ రాసింది. కాని ప్రిలిమ్స్ దాటలేక΄ోయింది. 2022లో మళ్లీ ప్రయత్నిస్తే 2 మార్కుల్లో ఇంటర్వ్యూ వరకూ వెళ్లే అవకాశం ΄ోయింది. 2023లో మూడవసారి రాసి 7వ ర్యాంక్ ΄÷ందింది. అయితే ఈలోపు ఆమె ‘జమ్ము కశ్మీర్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్’ ΄ోటీ పరీక్ష రాసి ఉద్యోగానికి ఎంపికైంది. ఆ ఉద్యోగ శిక్షణ తీసుకుంటూనే సివిల్స్ సాధించింది.‘రోజుకు ఎనిమిది గంటలు చదివాను. చిన్నప్పటి నుంచి నాకు తగాదాలు తీర్చడం అలవాటు. రేపు కలెక్టర్‌ను అయ్యాక ప్రజల సమస్యలను తీరుస్తాను’ అంటోందామె. నౌషీన్ (9వ ర్యాంకు) ‘మాది ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్. కాని ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకోవడం వల్ల అక్కడి విద్యార్థుల రాజకీయ, సామాజిక అవగాహన స్థాయి నన్ను ఆశ్చర్యపరిచి సివిల్స్ రాసేలా పురిగొల్పింది. 2020 నుంచి ప్రయత్నించి నాలుగో అటెంప్ట్‌లో 9వ ర్యాంక్ సాధించాను. చరిత్రలో ఈ రెండు ఘటనలు జరగక΄ోయి ఉంటే బాగుండేదని వేటి గురించి అనుకుంటావ్ అంటూ నన్ను ఇంటర్వ్యూలో అడిగారు– రెండు ప్రపంచ యుద్ధాలు జరక్క΄ోయి ఉంటే బాగుండేదని, ఆసియా–ఆఫ్రికా దేశాలు వలసవాద పాలన కిందకు రాకుండా ఉంటే బాగుండేదని చె΄్పాను. నా జవాబులు బోర్డ్‌కు నచ్చాయి’ అని తెలిపింది నౌషీన్. ‘ఐ.ఏ.ఎస్. ఆఫీసర్‌గా పని చేయడం గొప్ప బాధ్యత. చాలా మంది జీవితాల్లో మార్పు తేవచ్చు’ అందామె. ఐశ్వర్యం ప్రజాపతి (10వ ర్యాంకు) లక్నోకు చెందిన ఐశ్వర్యం ప్రజాపతి రెండో అటెంప్ట్‌లో 10వ ర్యాంక్ సాధించింది. ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఉత్తరాఖండ్’లో చదువుకున్న ఐశ్వర్యం ఒక సంవత్సరం పాటు విశాఖపట్నం ఎల్ అండ్ టిలో ట్రయినీగా పని చేసింది. ‘నేను ఇన్ని గంటలు చదవాలి అని లెక్కపెట్టుకోని చదవలేదు. చదివినంత సేపు నాణ్యంగా చదవాలి అనుకున్నాను. నన్ను కలెక్టర్‌గా చూడాలన్నది మా అమ్మానాన్నల కల. సాధిస్తానని తెలుసుకాని ఇంత మంచి ర్యాంక్ వస్తుందనుకోలేదు. ఎవరైనా సరే తమకు ఏది నచ్చుతుందో ఆ దారిలో వెళ్లినప్పుడే సాధించాలన్న మోటివేషన్ వస్తుంది’ అని తెలిపిందామె. మేధా ఆనంద్ (13వ ర్యాంకు) ‘మా అమ్మ ఆగ్రాలో బ్యాంక్ ఉద్యోగం చేస్తుంది. కలెక్టర్ ఆఫీసు మీదుగా వెళ్లినప్పుడల్లా నా కూతురు కూడా ఒకరోజు కలెక్టర్ అవుతుంది అనుకునేది. నాతో అనేది. నా లక్ష్యం కూడా అదే. కాలేజీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పటి నుంచి సివిల్స్ రాయాలని తర్ఫీదు అయ్యాను. సెకండ్ అటెంప్ట్‌లో 311వ ర్యాంక్ వచ్చింది. కాని నేను సంతృప్తి చెందలేదు. ప్రస్తుతం నేను నార్త్ రైల్వేస్‌లో పని చేస్తున్నాను. పని చేస్తూనే 50 లోపు ర్యాంక్ కోసం కష్టపడ్డాను. కాని 13వ ర్యాంక్ వచ్చింది. నేటి మహిళల్లోని సామర్థ్యాలు పూర్తిగా సమాజానికి ఉపయోగపడటం లేదు. వారికి ఎన్నో అడ్డంకులున్నాయి. వాటిని దాటి వారు ముందుకు రావాలి. కలెక్టర్ అయ్యాక నేను స్త్రీలు ముఖ్యభూమికగా ఆర్థిక వికాసం కోసం కృషి చేస్తాను’ అని తెలిపింది మీరట్‌కు చెందిన మేధా ఆనంద్. స్వాతి శర్మ (17వ ర్యాంకు) జెంషడ్‌పూర్‌కు చెందిన స్వాతి శర్మ తను సాధించిన 17 ర్యాంక్‌తో జార్ఖండ్‌లో చాలామంది ఆడపిల్లలకు స్ఫూర్తిగా నిలుస్తానని భావిస్తోంది. ‘మా రాష్ట్రంలో అమ్మాయిలకు ఇంకా అవకాశాలు దొరకాల్సి ఉంది’ అంటుందామె. అంతేకాదు కలెక్టరయ్యి దిగువ, గిరిజన వర్గాల మహిళల అభ్యున్నతికి పని చేయాలనుకుంటోంది. ‘ఎం.ఏ. ΄÷లిటికల్ సైన్స్ చదివాను. ఆ చదువే ఐ.ఏ.ఎస్. చదవమని ఉత్సాహపరిచింది. ఢిల్లీలో సంవత్సరం ఆరు నెలలు కోచింగ్ తీసుకున్నాను. రెండు మూడుసార్లు విఫలమయ్యి నాకు నేనే తర్ఫీదు అయ్యి ఇప్పుడు 17వ ర్యాంక్ సాధించాను. మా నాన్న రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్, అమ్మ గృహిణి. బాగా చదువుకుని అనుకున్న లక్ష్యాన్ని సాధించడమే పిల్లలు తల్లిదండ్రులకిచ్చే కానుక’ అంది స్వాతి శర్మ. రితికా వర్మ (25వ ర్యాంకు) ‘ఎన్నో సమస్యలున్న బిహార్ రాష్ట్రం కోసం పని చేయాల్సింది చాలా ఉంది. మాది పాట్నా. మా నాన్న ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో మేనేజర్. ప్రస్తుతం మేము గుంటూరులో ఉంటున్నాం. ఢిల్లీలో బిఎస్సీ మేథ్స్ చదివిన నేను సివిల్స్ ద్వారా పేదల కోసం పని చేయాలని నిశ్చయించుకున్నాను. నాకు సాహిత్యం అంటే ఆసక్తి ఉంది. బిహార్‌లో పేదలకు భూమి సమస్య, పని సమస్య ఉన్నాయి. తక్కువ వేతనాల వల్ల పల్లెల నుంచి నిరవధికంగా వలస సాగుతోంది. కలెక్టర్‌గా నేను వీరి కోసం పని చేయాలనుకుంటున్నాను’ అని తెలిపింది రితికా వర్మ. -
చైనాను చిత్తు చేసిన భారత్..
బ్యాడ్మింటన్ ఆసియా టీమ్ చాంపియన్‌షిప్స్-2024 టోర్నీలో భారత మహిళా జట్టు అదరగొట్టింది. మలేషియాలో జరుగుతున్న ఈ ఈవెంట్లో టాప్ సీడ్ చైనా జట్టును ఓడించి టేబుల్ టాపర్‌గా క్వార్టర్ ఫైనల్స్‌లో అడుగుపెట్టింది. ఈ టోర్నమెంట్లో భాగంగా భారత్- చైనా మధ్య ఐదు మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో భాగంగా తొలుత పీవీ సింధు.. చైనా ప్లేయర్ హాన్ యేతో తలపడింది. దాదాపు మూడు నెలల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన ఈ ఒలింపియన్ 21-17, 21-15తో హాన్‌ను ఓడించి భారత్‌కు 1-0 ఆధిక్యం అందించింది. అయితే, ఆ తర్వాతి మ్యాచ్‌లో భారత బ్యాడ్మింటన్ జంట అశ్విన్ పొన్నప్ప- తనీషా క్రాస్టోలను ఓడించిన చైనా ద్వయం లూయీ- టాన్ 1-1తో స్కోరు సమం చేసింది. అనంతరం.. అష్మిత చలీహా వాంగ్ జీ యీ చేతిలో ఓడటం(21-13, 21-15)తో చైనా 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో భారత ద్వయం త్రెసా- గాయత్రి.. లి- లువోల(10-21, 21-18, 21-17)ను ఓడించి స్కోరును 2-2తో సమం చేశారు. ఇక చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో అన్మోల్ ఖర్బ్.. వూ లువో యూతో బుధవారం తలపడింది. భారత జట్టు టోర్నీలో ముందుకు సాగాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పదిహేడేళ్ల ఈ యువ ప్లేయర్ పట్టుదలగా పోరాడింది. 472వ ర్యాంకర్ అయిన అన్మోల్.. 172వ ర్యాంకర్ లువోను 22-20, 14-21, 21-18తో ఓడించి జట్టు తనకు అప్పగించిన బాధ్యతను నెరవేర్చింది. ఈ క్రమంలో చైనాను 3-2తో చిత్తు చేసిన భారత మహిళా జట్టు ఆసియా చాంపియన్‌షిప్స్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. ఈ నేపథ్యంలో భారత బ్యాడ్మింటన్‌లో ఇదొక చారిత్రక దినమంటూ అభిమానులు మురిసిపోతున్నారు. We enter quarterfinals as table toppers after beating 🇨🇳 3-2, let that sink in 🔥 Proud of you girls, keep it up! 👊#BATC2024#TeamIndia#IndiaontheRise#Badminton pic.twitter.com/ysFhXwICTw — BAI Media (@BAI_Media) February 14, 2024 -
సరోగసీ ద్వారా బిడ్డను కోల్పోయాం: స్టార్ హీరోయిన్
Amrita Rao RJ Anmol Share Pregnancy Struggles During Surrogacy: హీరోయిన్ అమృత రావు, ఆమె భర్త ఆర్జే అన్మోల్ తమ యూట్యూబ్ ఛానల్ 'కపుల్ ఆఫ్ థింగ్స్' ద్వారా తమ జీవితంలోని అనేక రహస్యాలను పంచుకుంటున్నారు. ఇటీవల ఓ వీడియోలో అమృత ఎదుర్కొన్న గర్భధారణ సమస్యల గురించి చెప్పుకొచ్చింది. అమృత, అన్మోల్ తల్లిదండ్రులు అయ్యేందుకు సరోగసీ, ఐయూఐ, ఐవీఎఫ్, హోమియోపతి, ఆయుర్వేద పద్ధతులను ఎంచుకున్నట్లు తెలిపారు. సరోగసీ పద్ధతి గురించి మాట్లాడుతూ వారు ఈ పద్ధతి ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే బిడ్డను కోల్పోయినట్లు వెల్లడించారు. 'ఈ విషయం ఇప్పటికీ ఎంతో బాధగానే ఉంది. తల్లిదండ్రులు కావాలన్న ఉత్సాహంతో మీరు అంత ఉద్వేగానికి లోనవాల్సిన అవసరం లేదు. ఇది మన చేతుల్లో ఉండదు.' అని అమృత ఆ వీడియోలో పేర్కొంది. అలాగే అమృత రావు, అన్మోల్ ఐవీఎఫ్ చికిత్స గురించి కూడా తెలిపారు. చాలా ఏళ్లు ప్రయత్నించిన తర్వాత అమృత 'మనకు కూడా బిడ్డ పుట్టాలా ? ఈ ఒత్తిడి జీవితాలతో పిల్లలను పెంచగలమా ? ఇది అంత ముఖ్యమా ?' అని ప్రశ్నించుకున్నట్లు పేర్కొంది. అనంతరం ఈ జంట హాలీడే కోసం థాయ్‌లాండ్‌కు వెళ్లారు. మార్చి 2020లో అమృత గర్భవతి కాగా నవంబర్‌లో వీర్‌కు జన్మనిచ్చింది. వీర్‌కు మొదటగా అనేక నిక్‌నేమ్స్ పెట్టి పిలిచేవాళ్లమని ఈ జంట పేర్కొంది. చదవండి: తన భర్తనే మళ్లీ పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్.. చదవండి: 'పెళ్లి చేసుకుందాం, సినిమాలు వదిలేయ్' ఏకధాటిగా ఏడ్చిన నటి! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1711356039.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
‘ప్లాన్ పేరు ‘టీ అండ్ ఎఫ్’ అంటే ట్యూస్ డేస్ అండ్ ఫ్రైడేస్.రూల్ నంబర్ వన్.. ఇద్దరం ప్రతి మంగళ, శుక్రవారాల్లో మాత్రమే కలుసుకోవాలి.రూల్ నంబర్ టూ.. మిగిలిన వారాల్లో ఎవరి ఇష్టం వారిది. నువ్వు వేరే అమ్మాయి తో డేట్ చేసినా.. నేను ఇంకో అబ్బాయితో డేట్ చేసినా నిలదీయొద్దు.రూల్ నంబర్ త్రీ.. థర్డ్ డేట్ వరకు నో కిసెస్, నో హగ్స్..ఇద్దరిలో ఎవరికిది వర్కవుట్ కావట్లేదు అనిపించినా తప్పుకోవచ్చు. ఎలాంటి సంజాయిషీలు, ప్రశ్నలు ఇచ్చిపుచ్చుకోవడాలు లేకుండా. తర్వాత ఎవరిదారి వారిది’ అంటూ అబ్బాయికి డేటింగ్ ప్లాన్ వినిపిస్తుంది అమ్మాయి. వెంటనే ఒప్పుకోవడానికి కాస్త తటపటాయించినా తర్వాత ఒప్పుకుంటాడు అబ్బాయి. ఆమె పేరు.. సియా (ఝటాలేకా), అతని పేరు వరుణ్ (అన్మోల్ టకారియా థిల్లాన్). సినిమా .. టీ అండ్ ఎఫ్. భన్సాలీ ప్రొడక్షన్స్ (సంజయ్ లీలా భన్సాలీ నిర్మాణ సారథ్యం). దర్శకుడు.. తన్వీర్ సింగ్. ప్రేమ, పెళ్లి పట్ల మిల్లేనియల్స్ ఆలోచనల తీరు, భద్రతాభద్రతల భావనలు, నమ్మకం– అపనమ్మకాల ప్రయాణాన్ని చూపించిన ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతోంది.కథ.. సియా.. వృద్ధిలోకి వస్తున్న న్యాయవాది. వరుణ్.. ఔత్సాహిక రచయిత. అతను రాసిన నవల సినిమా హక్కుల వివాదంలో ఒకరికొకరు పరిచయం అవుతారు. ఇద్దరి తల్లిదండ్రులు విడాకులతో వేరవుతారు. ఆ ఇద్దరూ తల్లుల దగ్గరే పెరుగుతారు. అయితే తన తల్లిదండ్రుల విడాకులతో ప్రేమ, పెళ్లి విషయంలో వరుణ్ ప్రతికూల అభిప్రాయాన్ని ఏర్పర్చుకుంటాడు. సియా.. కొంత ఆశావాహ ధోరణిలో ఉంటుంది. ప్రేమ, పెళ్లి తన తల్లిదండ్రుల విషయంలో విఫలమైనంత మాత్రాన అందరికీ అదే ఎదురవుతుందనే ఆలోచనలో ఉండడం తప్పు అనుకుంటుంది. సియాకు పూర్తి వ్యతిరేకం వరుణ్.తప్పు అనుకుంటుంది. సియాకు పూర్తి వ్యతిరేకం వరుణ్.తప్పు అనుకుంటుంది. సియాకు పూర్తి వ్యతిరేకం వరుణ్.తప్పు అనుకుంటుంది. సియాకు పూర్తి వ్యతిరేకం వరుణ్.ప్రేమ, పెళ్లికి సంబంధించిన అనుబంధానికి ఎక్స్‌పెయిరీ డేట్ ఉంటుందనేది అతను ఏర్పర్చుకున్న నమ్మకం. అది ఏడు వారాల తర్వాత బీటలు వారి గొడవలతో సమాప్తం అవుతుందని అతనికున్న అభద్రత. అందుకే సియా అంటే ఇష్టం ఉన్నా ఆ రిలేషన్ ఏడువారాలే సాగాలని.. జీవితాంతం తోడు అనే కాన్సెప్ట్‌తో ఆమెకు దగ్గరై.. తర్వాత గొడవలతో ఆమెకు దూరమయ్యే బాధను భరించలేనంటాడు. అతని ఆ దృక్పథాన్ని మార్చాలని.. ఒకరిపట్ల ఒకరు గౌరవంతో ఉంటే ఏ అనుబంధమైనా పదికాలాపాటు పదిలంగా ఉంటుందని అతనికి చెప్పే ప్రయత్నం చేస్తుంది.అందులో భాగమే ఆ ‘టీ అండ్ ఎఫ్’ డేటింగ్ ప్లాన్. ట్యూస్ డేస్ అండ్ ఫ్రైడేస్ ప్లాన్‌తో సియాను వదులుకోలేనంత ప్రేమలో కూరుకుపోతాడు వరుణ్. అయినా గొడవలతో విడిపోతామేమోనన్న అభ్రదత, భయంతో సియాను దూరం చేసుకుంటాడు. విపరీతమైన మానసిక సంఘర్షణ తర్వాత సియాతో జీవితాంతం ఉండిపోవడానికి సిద్ధమవుతాడు. ఏడు వారాల కాన్సెప్ట్ మళ్లీ అతని మెదడును వెతుక్కోకుండా ఉండడానికి ఏడాది గడువిచ్చి.. ఆ ఏడాది డేటింగ్లో వరుణ్ అభద్రతను, ప్రేమ, పెళ్లి పట్ల ఉన్న అపనమ్మకాన్ని పూర్తిగా పోగొట్టి.. పెళ్లికి ఓకే అంటుంది సియా.కామెంట్..కొత్త కథాంశాన్ని తీసుకున్నా కథనంలో భిన్నత్వాన్ని చూపించలేకపోయింది. మహిళా సాధికారతను స్పృశించినా ఫోకస్ చేయలేకపోయింది. కథకు మించిన పాత్రలతో కొంత గందరగోళానికి గురి చేసింది. హీరోహీరోయిన్లూ కొత్తవాళ్లే. అందంతో ఆకట్టుకుంటారు తప్ప నటనతో కాదు. అన్నట్టు హీరో అన్మోల్ .. బాలీవుడ్ ఒకప్పటి హీరోయిన్ పూనమ్ థిల్లాన్ కొడుకు. -
కొప్పుముడి ఖడ్గధారి
అమెరికన్ మిలటరీలో రాణీ రుద్రమ! ఫస్ట్ ‘అబ్జర్వెంట్’ సిక్కు గ్రాడ్యుయేట్. సైన్యానికి తన రూల్స్ ఉన్నాయి. ఆమెకు తమ ఆచారాలు ఉన్నాయి. ఆమె కోసం సైన్యం తనని మార్చుకుంది. ఖఢ్గం అమెరికాది. కొప్పు ఆమెది. వ్యక్తిగా తనని నిలుపుకుంటూనే..సైనిక శక్తిగా నిలబడింది అన్మోల్!! సైన్యం సైన్యంలా ఉండాలన్నది అమెరికన్ పాలసీ. సైన్యంలో స్త్రీలు ఉండొచ్చు. పురుషులు ఉండొచ్చు. ట్రాన్స్జెండర్లు ఉండొచ్చు. వివిధ మతాల వారు ఉండొచ్చు. ప్రధానంగా మాత్రం వారంతా సైనికులు. ఆచారాలు ఉంటే పక్కన పెట్టేయాలి. తలజుట్టు కత్తిరించుకోనంటే ఆర్మీలో చేరాలన్న ఆశల్ని కత్తిరించుకోవలసిందే. గడ్డం ఉండాల్సిందే అనుకుంటే ఆర్మీ కెరీర్‌కీ దూరంగా ఉండాల్సిందే. అయితే శనివారం న్యూయార్క్, వెస్ట్ పాయింట్‌లోని యు.ఎస్.మిలటరీ అకాడెమీలో జరిగిన ‘గ్రాడ్యుయేషన్ సెర్మనీ’లో హ్యాట్‌ను పైకి ఎగరేసిన పట్టుకున్న ఒక యువతి.. మిలటరీ డ్రెస్, చేతిలో ఖడ్గంతో పాటు కొప్పుముడితో సాక్షాత్కరించింది! అమెరికన్ ఆర్మీలో ఆచార పరాయణత్వాన్ని ప్రతిఫలింపజేసిన ఆ సిక్కు మహిళ.. అన్మోల్ నారంగ్ (23). అయితే తనేమీ నిబంధనలకు మినహాయింపు పొంది ఆకాడెమీలో చేరలేదు. మోకాళ్ల వరకు ఉండే తన జుట్టును నిబంధనలకు లోబడే మూడున్నర అంగుళాల చుట్టుకొలతను మించని కొప్పుగా ముడి వేసుకుని ‘క్యాడెట్’ శిక్షణ పూర్తి చేసింది. పట్టాతో పాటు, యు.ఎస్. మిలటరీ అకాడమీలో ‘ఫస్ట్ అబ్జర్వెంట్ ఫిమేల్ సిఖ్ గ్రాడ్యుయేట్’ గా గుర్తింపు పొందింది. 2017లో యు.ఎస్. మిలటరీ తన నిబంధనలను సడలించాక అబ్జర్వెంట్గా (ఆచారాలను వదలని సైనికురాలిగా) అకాడమీ నుంచి డిగ్రీతో బయటికి వచ్చిన తొలి సిక్కు మహిళ అన్మోల్ నారంగ్. ఇప్పటికే ఆమె అమెరికా సైన్యంలో ‘సెకండ్ లెఫ్ట్‌నెంట్’ హోదాలో ఉంది. ఇప్పుడిక కొత్తగా వచ్చిన డిగ్రీతో ‘బేసిక్ ఆఫీసర్ లీడర్షిప్ కోర్సు’ కూడా పూర్తి చేస్తే 2021 జనవరిలో జపాన్‌లోని ఓకినావాలో ఉన్న అమెరికన్ బేస్‌లో హై ర్యాంక్ ఆఫీసర్‌గా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించవచ్చు. అన్మోల్ అమెరికాలోనే పుట్టింది. జార్జియాలోని రాస్వెల్లో స్థిరపడిన రెండో తరం భారతీయ సంతతి కుటుంబంలోని అమ్మాయి అన్మోల్. తాతగారు (అమ్మవాళ్ల నాన్న) భారత సైన్యంలో చేశారు. అయితే సైన్యంలో చేరాలన్న అన్మోల్ ఆశలు ఆయన్నుంచి చిగురించలేదు. హైస్కూల్లో ఉండగా తల్లిదండ్రులతో కలిసి హానలూలు లోని ‘పెరల్ హార్బర్ నేషనల్ మెమోరియల్’ చూడ్డానికి Ðð ళ్లింది అన్మోల్. 1941 డిసెంబర్ 7 ఉదయం హానలూలు లోని పెరల్ హార్బర్లో ఉన్న అమెరికన్ నావికా స్థావర ంపై జపాన్ నౌకాదళం వైమానిక దాడులు జరిపింది. ఆ దాడిలో రెండు వేలమందికి పైగా అమెరికన్లు చనిపోయారు. మరో రెండు వేల మంది గాయపడ్డారు. అప్పటి వరకు తటస్థంగా ఉన్న అమెరికా పెరల్ హార్బర్‌పై జపాన్ దాడితో రెండో ప్రపంచ యుద్ధంలోకి దిగవలసి వచ్చింది. మెమోరియల్‌లో ఆనాటి యుద్ధ జ్ఞాపకాలను చూస్తున్న అన్మోల్ ఆ క్షణమే అనుకుంది అమెరికన్ ఆర్మీలో చేరాలని. చేరడమే కాదు, తన ‘శత్రుదేశం’ జపాన్ని హద్దులో ఉంచడానికి అమెరికా సైనికాధికారిగా కూడా వెళ్లబోతోంది. వెస్ట్ పాయింట్లో చేరడానికి ముందు జార్జియాలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అండర్గ్రాడ్యుయేట్ కోర్సు చేసింది అన్మోల్. న్యూక్లియర్ ఇంజినీరింగ్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఆమె సబ్జెక్టులు. ‘‘వెస్ట్ పాయింట్లో డిగ్రీ చెయ్యాలన్న నా కల ¯ð రవేరింది. నా తల్లిదండ్రుల ప్రోత్సాహం, మిలటరీలోని నిబంధనల సడలింపునకు అమెరికాలోని ‘సిక్కు కోఎలిషన్’ సంస్థ చేసిన పదేళ్ల పోరాటం నా కలను నెరవేర్చాయి’’ అంటోంది అన్మోల్ నారంగ్. పాసింగ్ అవుట్ పరేడ్‌లో శిక్షణ పూర్తి చేసుకున్న గ్రాడ్యుయేట్లకు వారి తల్లిదండ్రులకు బదులుగా సైనికాధికారులు, వారి సతీమణులు ‘మిలటరీ స్టార్’లు తొడిగారు. ఆఫీసర్లే అమ్మానాన్నలు! యు.ఎస్. మిలటరీ అకాడమీలో ‘గ్రాడ్యుయేట్ సెర్మనీ’ జరిగిన రోజే మన డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలటరీ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్ జరిగింది. అక్కడి అకాడమీలో అన్మోల్ నార ంగ్ తన మత సంప్రదాయాన్ని నిలబెట్టుకున్న తొలి సిక్కు మహిళా గ్రాడ్యుయేట్‌గా గుర్తింపు పొందితే.. ఇక్కడి అకాడమీ.. పాసింగ్ అవుట్ పరేడ్‌కు గ్రాడ్యుయేట్ల తల్లిదండ్రులను ఆహ్వానించే సంప్రదాయాన్ని కరోరా కారణంగా నిలుపుకోలేకపోయింది. తల్లిదండ్రులకు బదులుగా భారత సైనిక అధికారులు, వారి సతీమణులు పట్టభద్రులైన యంగ్ ఆఫీసర్ల భుజాలకు స్టార్లను తొడిగారు. అమెరికన్ మిలటరీ అకాడమీ నుంచి 1100 మంది, ఇండియన్ మిలటరీ అకాడమీ నుంచి 423 మంది శిక్షణ పూర్తి చేసుకుని బయటికి వచ్చారు. -
అమెరికాలో చరిత్ర సృష్టించిన సిక్కు యువతి
వాషింగ్టన్: భారత సంతతికి చెందిన ఆన్మోల్ నారంగ్ అరుదైన ఘనత సాధించింది. వెస్ట్‌పాయింట్‌లోని ప్రఖ్యాత అమెరికా మిలిటరీ అకాడమీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన మొదటి సిక్కు యువతిగా చరిత్ర సృష్టించింది. వెస్ట్‌పాయింట్‌లో నాలుగేళ్ల శిక్షణ పూర్తిచేసుకున్న అన్మోల్.. ఓక్లహామ్‌లోని లాటెన్ ఫోర్ట్ సిల్లో బేసిక్ ఆఫీసర్ లీడర్షిప్ కోర్పు అభ్యసించనుంది. ఈ శిక్షణ పూర్తైన తర్వాత వచ్చే ఏడాది జనవరిలో జపాన్‌లోని ఒకినావాలో ఆమెకు తొలి పోస్టింగ్ లభించే అవకాశం ఉంది. ఈ విషయం గురించి సెకండ్ లెఫ్టినెంట్ అన్మోల్ నారంగ్ మీడియాతో మాట్లాడుతూ.. వెస్ట్‌పాయింట్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేయాలన్న నా కల శనివారంతో తీరింది. (చదవండి: భూ అంతర్భాగంలో భారీ నిర్మాణం) నాకు దక్కిన ఈ గౌరవం నన్నెంతో ఉద్వేగానికి గురిచేస్తోంది. జార్జియాలోని సిక్కు కమ్యూనిటీ సభ్యులు నాకు మద్దతుగా నిలిచారు. ఈ లక్ష్యాన్ని సాధించడం ద్వారా సిక్కు అమెరికన్లు ఎలాంటి సవాలునైనా ఎదుర్కోగలరని నిరూపించాను. ఇష్టమైన కెరీర్లో ఎదగాలన్న బలమైన ఆకాంక్ష ఉంటే అసాధ్యం అనేది ఏదీ ఉండదు’’అని పేర్కొన్నారు. కాగా జార్జియాలోని రోస్వెల్లో పుట్టిపెరిగిన అన్మోల్.. తన తాతయ్య(భారత ఆర్మీలో పనిచేశారు) స్ఫూర్తితో మిలిటరీలో సేవలు అందించాలని నిర్ణయించుకున్నారు. జార్జియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో న్యూక్లియర్ ఇంజనీరింగ్ అండర్గ్రాడ్యుయేట్ అయిన ఆమె.. హవాయిలోని హోనలులులో ఉన్న పెరల్ హార్బర్ నేషనల్ మెమొరియల్ సందర్శించిన అనంతరం వెస్ట్‌పాయింట్‌లో చేరాలన సంకల్పించి తన ఆకాంక్ష నేటితో నెరవేర్చుకున్నారు.(హెచ్1బీ వీసా రద్దుకు ట్రంప్ ఆలోచన) -
అదంతా కొడుకు మహిమేనట...
-
అదంతా కొడుకు మహిమేనట...
ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ క్యాపిటల్ అధిపతి అనిల్ అంబానీ పుత్రోత్సాహంతో పొంగిపోతున్నారు. వాటాదారుల వార్షిక సాధారణ సమావేశంలో తన కుమారుడు, బోర్డ్ లో కొత్త డైరెక్టర్ అన్మోల్ అంబానీ (24) పరిచయం చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన రాక కంపెనీకి "అద్భుతమైన అదృష్టం" తెచ్చిపెట్టిందని అనిల్ పొంగిపోయారు. అన్మోల్ నియామకం తరువాత షేర్ ధర 40 శాతం పెరిగిందనీ, భవిష్యత్తులో కూడా ఆ ప్రభావం కొనసాగుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. మంగళవారం జరిగిన వాటాదారుల సమావేశంలో ఫుల్ టైం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా అన్మోల్ నియామకానికి ఆమోదం లభించింది. ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా అన్మోల్ యొక్క నియామకానికి ఓట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ చెప్పిన వాటాదారులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. భారతదేశ జనాభాలో 30 సంవత్సరాల సగటు వయస్సు గా ఉంటే, తమ రిలయన్స్ క్యాపిటల్ ఉద్యోగుల సగటు వయస్సు 34 సంవత్సరాలని అనిల్ పేర్కొన్నారు. అన్మోల్ రాక సంస్థకు అదృష్టం తెచ్చిపెట్టిందనీ, మెరుగైన పనితీరు, టీమ్ వర్క్ ఆధారంగా సంస్థ అభివృద్ధిలో 'అన్మోల్ ప్రభావం' ఇక ముందు కూడా కొనసాగుతుందని విశ్వసిస్తున్నానని చైర్మన్ చెప్పారు. కాగా లండన్ వార్విక్ బిజినెస్ స్కూల్ నుండి డిగ్రీ పొందిన అన్మోల్, రిలయన్స్ కాపిటల్ మండలిలో పూర్తి కాలపు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా నియామకమైన సంగతి తెలిసిందే. సుమారు రూ .4,000 కోట్ల ఆదాయంతో, రిలయన్స్ క్యాపిటల్ జీవిత భీమా, వాణిజ్య ఆర్ధిక, సెక్యూరిటీలు, సాధారణ ఫైనాన్స్ , మ్యూచువల్ ఫండ్స్ సేవలను అందిస్తోంది. కాగా అన్మోల్ నియామకానికి ముందు రూ.467 గా వున్న షేర్ ధర రూ.575 వద్ద ట్రేడవుతోంది. గత నెలలో సంభవించిన షార్ప్ ర్యాలీ ద్వారా గత ఏడాదిగా దాదాపు 70 శాతం వృద్ధిని నమోదు చేసింది. 2014నుంచి సంస్థకు సేవలందిస్తున్న అన్మోల్ .. రిలయన్స్ క్యాపిటల్ బోర్డులో ఛైర్మన్ అనిల్ అంబానీ తర్వాత ఆయన పెద్ద కుమారుడుగా ఏకైక ఇతర కుటుంబ సభ్యుడు కావడం విశేషం. -
సీక్రెట్‌గా పెళ్లి చేసుకుంటున్న హీరోయిన్
అతిథి సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన టాలీవుడ్‌కి పరిచయం అయిన ముద్దుగుమ్మ అమృతా రావ్. బాలీవుడ్‌లోనూ మై హూనా, వివాహ్, ఇష్క్ విష్క్ లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటి, తరువాత సరైన అవకాశాలు రాకపోవటంతో ప్రస్తుతం టీవి సీరియల్స్‌లో నటిస్తోంది. అయితే కొద్ది రోజులుగా ఈ ముద్దుగుమ్మ పెళ్లిపై బాలీవుడ్ సర్కిల్స్‌లో రూమర్స్ షికారు చేస్తున్నాయి. చాలా కాలంగా రేడియో జాకీ అన్మోల్తో ప్రేమలో ఉన్న అమృత, ఆదివారం అత్యంత సన్నిహితుల మధ్య అతడిని పెళ్లి చేసుకోబోతోంది. అయితే గతంలో చేతికి ఉంగరంతో అమృత కనిపించటంతో ఇంతకు ముందే వీరిద్దరికీ పెళ్లి అయ్యిందన్న వార్తలు వినిపించాయి. ఆ వార్తలను ఖడించిన అమృత సన్నిహితులు ఈ రోజు అమృత, అన్మోల్‌ల వివాహం జరుగనుందని తెలిపారు. ఈ వివాహా వేడుకకు ఎవరినీ ఆహ్వానించకపోయినా.. త్వరలోనే బాలీవుడ్ ప్రముఖుల కోసం గ్రాండ్ రిసెప్షన్‌ను ప్లాన్ చేస్తున్నారట. -
అన్మోల్ హత్య కేసులో బెయిల్ నిరాకరణ
న్యూఢిల్లీ: ప్రవాస భారతీయ విద్యార్థి అన్మోల్ సర్నా కేసులో నిందితులు నలుగురు పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను ఢి ల్లీ మెట్రోపాలిటన్ కోర్టు కొట్టివేసింది. నిందితులు శివాంక్ గంభీ ర్, మాధవ్ భండారీ, ప్రణీల్‌షా, రితమ్ గిర్హోత్రాలు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. శివాంక్, మాధవ్‌లకు కోర్టు గురువారనంనాడు జుడిషియల్ కస్టడీ విధిం చగా తక్కిన నిందితులను సెప్టెంబర్ 17న జుడిషియల్ కస్టడీ ప్రకటించింది. అన్మోల్కు వీడ్కోలు పార్టీ పేరుతో ప్రణీల్ షా పిలుపు మీద వెళ్లిన వీరు అక్కడ మోతాదుకు మించి మాదకద్రవ్యాలు సేవించా రు. ఈ క్రమంలో వారి మధ్య గొడవ చెలరేగి ఘర్షణకు దారి తీసింది. అదుపు తప్పిన స్థితిలో అన్మోల్ ఘర్షణకు దిగ గాస్నేహితులు, భవనం సెక్యూరిటీ గార్డులు దాడి చేయడంతో గాయపడి మరణించాడని పోలీసులు పేర్కొన్నారు. కాగా అన్మోల్ తల్లిదండ్రులు మాత్రం తమ కుమారుడి ది హత్యే అని ఆరోపిస్తున్నారు. అమెరికాలో నివిసించే అన్మోల్ తల్లిదండ్రులు అతను గాయపడిన ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడని ప్రణీల్ షా తండ్రి అందించిన సమాచారంతో రాజధానికి చేరుకున్నారు. మాదకద్రవ్యాలు సరఫరా చేసిన వ్యక్తుల అరెస్టు ప్రణీల్‌షా ఏర్పాటు చేసిన పార్టీకి మాదకద్రవ్యాలు సరఫరా చేసిన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశామని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. అయితే వారి వివరాలను తెల్పడానికి నిరాకరించారు. ఇప్పటితో ఈ కేసులో పోలీసులు మొత్తం తొమ్మిది మందిని అరెస్టు చేశారు. భవనం కాపాలదారులు ఇద్దరితో పాటు నలుగురు వ్యక్తులు జుడిషియల్ కస్టడీలో ఉన్నారు. తాజాగా అరెస్టు చేసిన వ్యక్తులను పూర్తిగా విచారణ చేసిన తరువాత కోర్టుకు హాజరుపరుస్తారని భావిస్తున్నారు.