సీక్రెట్గా పెళ్లి చేసుకుంటున్న హీరోయిన్ | Mahesh babu Heroine amritha rao secreat marriage | Sakshi
Sakshi News home page

సీక్రెట్గా పెళ్లి చేసుకుంటున్న హీరోయిన్

May 15 2016 11:54 AM | Updated on Sep 4 2017 12:10 AM

సీక్రెట్గా పెళ్లి చేసుకుంటున్న హీరోయిన్

సీక్రెట్గా పెళ్లి చేసుకుంటున్న హీరోయిన్

అతిథి సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన టాలీవుడ్కి పరిచయం అయిన ముద్దుగుమ్మ అమృతా రావ్. బాలీవుడ్లోనూ మై హూనా, వివాహ్, ఇష్క్ విష్క్ లాంటి సినిమాలతో...

అతిథి సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన టాలీవుడ్కి పరిచయం అయిన ముద్దుగుమ్మ అమృతా రావ్. బాలీవుడ్లోనూ మై హూనా, వివాహ్, ఇష్క్ విష్క్ లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటి, తరువాత సరైన అవకాశాలు రాకపోవటంతో ప్రస్తుతం టీవి సీరియల్స్లో నటిస్తోంది. అయితే కొద్ది రోజులుగా ఈ ముద్దుగుమ్మ పెళ్లిపై బాలీవుడ్ సర్కిల్స్లో రూమర్స్ షికారు చేస్తున్నాయి.

చాలా కాలంగా రేడియో జాకీ అన్మోల్తో ప్రేమలో ఉన్న అమృత, ఆదివారం అత్యంత సన్నిహితుల మధ్య అతడిని పెళ్లి చేసుకోబోతోంది. అయితే గతంలో చేతికి ఉంగరంతో అమృత కనిపించటంతో ఇంతకు ముందే వీరిద్దరికీ పెళ్లి అయ్యిందన్న వార్తలు వినిపించాయి. ఆ వార్తలను ఖడించిన అమృత సన్నిహితులు ఈ రోజు అమృత, అన్మోల్ల వివాహం జరుగనుందని తెలిపారు. ఈ వివాహా వేడుకకు ఎవరినీ ఆహ్వానించకపోయినా.. త్వరలోనే బాలీవుడ్ ప్రముఖుల కోసం గ్రాండ్ రిసెప్షన్ను ప్లాన్ చేస్తున్నారట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement