amritha rao
-
సరోగసీ ద్వారా బిడ్డను కోల్పోయాం: స్టార్ హీరోయిన్
Amrita Rao RJ Anmol Share Pregnancy Struggles During Surrogacy: హీరోయిన్ అమృత రావు, ఆమె భర్త ఆర్జే అన్మోల్ తమ యూట్యూబ్ ఛానల్ 'కపుల్ ఆఫ్ థింగ్స్' ద్వారా తమ జీవితంలోని అనేక రహస్యాలను పంచుకుంటున్నారు. ఇటీవల ఓ వీడియోలో అమృత ఎదుర్కొన్న గర్భధారణ సమస్యల గురించి చెప్పుకొచ్చింది. అమృత, అన్మోల్ తల్లిదండ్రులు అయ్యేందుకు సరోగసీ, ఐయూఐ, ఐవీఎఫ్, హోమియోపతి, ఆయుర్వేద పద్ధతులను ఎంచుకున్నట్లు తెలిపారు. సరోగసీ పద్ధతి గురించి మాట్లాడుతూ వారు ఈ పద్ధతి ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే బిడ్డను కోల్పోయినట్లు వెల్లడించారు. 'ఈ విషయం ఇప్పటికీ ఎంతో బాధగానే ఉంది. తల్లిదండ్రులు కావాలన్న ఉత్సాహంతో మీరు అంత ఉద్వేగానికి లోనవాల్సిన అవసరం లేదు. ఇది మన చేతుల్లో ఉండదు.' అని అమృత ఆ వీడియోలో పేర్కొంది. అలాగే అమృత రావు, అన్మోల్ ఐవీఎఫ్ చికిత్స గురించి కూడా తెలిపారు. చాలా ఏళ్లు ప్రయత్నించిన తర్వాత అమృత 'మనకు కూడా బిడ్డ పుట్టాలా ? ఈ ఒత్తిడి జీవితాలతో పిల్లలను పెంచగలమా ? ఇది అంత ముఖ్యమా ?' అని ప్రశ్నించుకున్నట్లు పేర్కొంది. అనంతరం ఈ జంట హాలీడే కోసం థాయ్‌లాండ్‌కు వెళ్లారు. మార్చి 2020లో అమృత గర్భవతి కాగా నవంబర్‌లో వీర్‌కు జన్మనిచ్చింది. వీర్‌కు మొదటగా అనేక నిక్‌నేమ్స్ పెట్టి పిలిచేవాళ్లమని ఈ జంట పేర్కొంది. చదవండి: తన భర్తనే మళ్లీ పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్.. చదవండి: 'పెళ్లి చేసుకుందాం, సినిమాలు వదిలేయ్' ఏకధాటిగా ఏడ్చిన నటి! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1711356039.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
మగబిడ్డకు జన్మనిచ్చిన మహేష్ హీరోయిన్
నటి అమృతా రావు- ఆర్జే ఆన్మోల్ దంపతుల ఇంట్లోకి బుజ్జి పిల్లవాడు అడుగుపెట్టాడు. ఆదివారం ఉదయం అమృతా రావు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో నటి ఇంట్లో ఆనందాలు వెల్లువిరిశాయి. అదే విధంగా సెలబ్రిటీలు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లవెత్తుతున్నాయి. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఆరోగ్యం క్షేమంగా ఉన్నట్లు అమృతా టీం ఒక ప్రకటనలో తెలిపింది. ఇక అమృతా, ఆర్జే ఆన్మోల్ దంపతులకు ఇది మొదటి సంతానం. కాగా గత నెలలో(అక్టోబర్) తాము తల్లిదండ్రులు కాబోతున్న విషయాన్ని సోషల్ మీడియాలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక అమృతారావు, ఆర్జే అన్మోల్ ఏడేళ్ల పాటు ప్రేమించుకుని, 2016లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అత్యంత సన్నిహితుల సమక్షంలో నిరాడంబరంగా పెళ్లి చేసుకున్నారు. చదవండి: తల్లి కాబోతున్న హీరోయిన్! ఇక సినిమాల విషయానికొస్తే.. వివాహ్, ఇష్క్‌విష్క్, మై హూనా వంటి బాలీవుడ్ సినిమాలతో నటిగా గుర్తింపు తెచ్చుకున్న అమృతా రావు, సూపర్ స్టార్ మహేష్‌బాబు అతిథి సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను కూడా పలకరించిన సంగతి తెలిసిందే. ఇక మరాఠా నాయకుడు బాల్ ఠాక్రే జీవితం ఆధారంగా గతేడాది తెరకెక్కిన ఠాక్రే సినిమాలో ఆమె చివరిసారిగా నటించారు. విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ భార్య మీనా పాత్రలో జీవించి ప్రేక్షకుల నీరాజనాలు అందుకున్నారు. ప్రస్తుతం ఆమె బుల్లితెరపై ఓ ప్రముఖ ఛానెల్లో జమ్మీన్ అనే మ్యూజిక్ షోను హోస్ట్ చేస్తున్నారు. View this post on Instagram For YOU it’s the 10th Month... But for US, it's THE 9th !!! 🥳 🥰🕺💃 Surprise Surprise ..Anmol and I are in our NINE'th month Already !! Too excited to share this good news with You my Fans 🤗 And Friends ( sorry had to keep it tucked in my Belly All this long ) But It's True ... the Baby is Coming Soon 😃... An exciting journey for me, @rjanmol27 and our Families... ... Thank you universe 💫 And thank you ALL Keep blessing 😌🙏... #2020baby #2020mom #2020parents A post shared by AMRITA RAO🇮🇳 (@amrita_rao_insta) on Oct 18, 2020 at 9:28pm PDT View this post on Instagram NAVRATRI AND NINE'TH MONTH !! My Dear Instees, I feel blessed to witness my Nine'th month of pregnancy in the auspicious month of Navratri ! These 9 days are dedicated to Goddess Durga and her Nine Avatars. I am entering a New phase of embodying the Avatar of a Mother myself ! I bow to the Highest Female Energy in the Universe 🙏 as I surrender in good faith. May Goddess Durga bless ALL Mother's and Mommy's to be with strength and more power to gracefully carry on with the the many Devine Avatar's that comes along with the territory of motherhood !! 💫🤱🤰🌟 Wishing you ALL on Ashtami #HappyNavratri #navratri2020 A post shared by AMRITA RAO🇮🇳 (@amrita_rao_insta) on Oct 22, 2020 at 9:36pm PDT -
సీక్రెట్‌గా పెళ్లి చేసుకుంటున్న హీరోయిన్
అతిథి సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన టాలీవుడ్‌కి పరిచయం అయిన ముద్దుగుమ్మ అమృతా రావ్. బాలీవుడ్‌లోనూ మై హూనా, వివాహ్, ఇష్క్ విష్క్ లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటి, తరువాత సరైన అవకాశాలు రాకపోవటంతో ప్రస్తుతం టీవి సీరియల్స్‌లో నటిస్తోంది. అయితే కొద్ది రోజులుగా ఈ ముద్దుగుమ్మ పెళ్లిపై బాలీవుడ్ సర్కిల్స్‌లో రూమర్స్ షికారు చేస్తున్నాయి. చాలా కాలంగా రేడియో జాకీ అన్మోల్తో ప్రేమలో ఉన్న అమృత, ఆదివారం అత్యంత సన్నిహితుల మధ్య అతడిని పెళ్లి చేసుకోబోతోంది. అయితే గతంలో చేతికి ఉంగరంతో అమృత కనిపించటంతో ఇంతకు ముందే వీరిద్దరికీ పెళ్లి అయ్యిందన్న వార్తలు వినిపించాయి. ఆ వార్తలను ఖడించిన అమృత సన్నిహితులు ఈ రోజు అమృత, అన్మోల్‌ల వివాహం జరుగనుందని తెలిపారు. ఈ వివాహా వేడుకకు ఎవరినీ ఆహ్వానించకపోయినా.. త్వరలోనే బాలీవుడ్ ప్రముఖుల కోసం గ్రాండ్ రిసెప్షన్‌ను ప్లాన్ చేస్తున్నారట.