న్యూఢిల్లీ:గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ తమ్ముడు అన్మోల్ బిష్ణోయ్‌పై గురుగ్రామ్‌లో బెదిరింపుల కేసు నమోదైంది. భీమ్‌సేన చీఫ్ సత్పల్ తన్వర్‌ను విదేశాల నుంచి బెదిరించినందుకు అన్మోల్‌పై కేసు రిజిస్టర్ చేసినట్లు పోలీసులు తెలిపారు. తన్వర్‌ను ముక్కలుముక్కలుగా నరికేస్తామంటూ అన్మోల్ గ్యాంగ్ బెదిరించినట్లు సమాచారం.
అన్మోల్ జింబాబ్వే,కెన్యా ఫోన్ నెంబర్లను వాడుతూ అమెరికా, కెనడాల నుంచి బెదిరింపులకు పాల్పడుతున్నట్లు పోలీసులు చెప్పారు.ఈ కేసులో దర్యాప్తు కోసం పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అన్మోల్‌ను భారత్ తీసుకు రావడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
కాగా, అన్మోల్ బిష్ణోయ్ ప్రస్తుతం అమెరికాలో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.అతడి ఆచూకీ తెలిపితే రూ.10 లక్షల రివార్డు ఇస్తామని నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ(ఎన్‌ఐఏ) పోలీసులు ఇప్పటికే ప్రకటించారు.
ఇదీ చదవండి: భీమ్ ఆర్మీచీఫ్ ప్రయాణిస్తున్న వందేభారత్ రైలుపై దాడి
Comments
Please login to add a commentAdd a comment