కాలిఫోర్నియా/ముంబయి:గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ తమ్ముడు అన్మోల్ బిష్ణోయ్ అమెరికాలో అరెస్టైనట్లు సమాచారం. సోమవారం(నవంబర్ 18) తెల్లవారుజామున అన్మోల్‌ను కాలిఫోర్నియాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
తొలుత అమెరికా పోలీసులు అన్మోల్‌ను విచారించిన తర్వాత ఖలిస్తానీ తీవ్రవాది హర్దీప్‌సింగ్‌నిజ్జర్ హత్య కేసులో కెనడా పోలీసులకు అప్పగించే అవకాశం ఉందని ముంబై క్రైమ్‌బ్రాంచ్ పోలీసులు చెబుతున్నారు. తర్వాతే భారత్‌కు అన్మోల్‌ను అప్పగిస్తారని ముంబై పోలీసులు భావిస్తున్నారు.
గతేడాది తన అన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్‌బిష్ణోయ్ అరెస్టయిన తర్వాత అన్మోల్ భారత్ వదిలి అమెరికా పారిపోయాడు. బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ ఇంటి బయట కాల్పుల ఘటనతో పాటు పంజాబ్ సింగర్ సిద్ధు మూసేవాలా హత్య సహా పలు కేసుల్లో అన్మోల్ నిందితుడిగా ఉన్నాడు.
ఇతడి సూచనల మేరకే ఇటీవల ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీని హత్య చేసినట్లు పట్టుబడ్డ నిందితులు వెల్లడించిన విషయం తెలిసిందే. అన్మోల్‌కు సంబంధించిన సమాచారమిస్తే రూ.10 లక్షలిస్తామని పోలీసులు ఇప్పటికే ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment