యూఎస్‌లో అన్మోల్‌ బిష్ణోయ్‌ అరెస్ట్‌.. కానీ హత్య కేసులో కాదు! | US Arrests Gangster Lawrence Bishnoi Brother Anmol Bishnoi But Not In India Murder Case, Check Details | Sakshi
Sakshi News home page

యూఎస్‌లో అన్మోల్‌ బిష్ణోయ్‌ అరెస్ట్‌.. కానీ హత్య కేసులో కాదు!

Published Wed, Nov 20 2024 1:46 PM | Last Updated on Wed, Nov 20 2024 2:55 PM

US Arrests Gangster Brother Anmol Bishnoi But Not In India Case

గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ సోదరుడు అన్మోల్‌ బిష్ణోయ్‌ను అమెరికాలో పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. కాలిఫోర్నియా రాజధాని శాక్రమెంటోలో అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ప్రస్తుతం అన్మోల్‌ను అయోవా రాష్ట్రంలో ఉన్న పొట్టావట్టమీ కౌంటీ జైలుకు తరలించింది. అయితే అక్రమ పత్రాలతో అమెరాకలోకి ప్రవేశించిన కేసులో అతడిని పోలీసీలు అరెస్ట్‌ చేశారు. అన్మోల్‌ బిష్ణోయ్‌ తమ నిర్భంధంలో ఉన్న విషయాన్ని కూడా అమెరికా ప్రభుత్వం భారత్‌కు తెలియజేసింది.

ఈ క్రమంలో ఇప్పటికే జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అమెరికాలోని ఎఫ్‌బీఐ, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీతో టచ్‌లో ఉంది. అతడిని తమకు అప్పగించాలని ఎన్‌ఐఏ అభ్యర్థించింది. అయితే యూఎస్‌ అధికారులు అరెస్ట్‌ చేసింది భారత ప్రభుత్వం ఆరోపిస్తున్న కేసులకు సంబంధించినది కాదు కాబట్టి అతడిని ఇప్పల్లో భారత్‌కు అప్పగించే అవకాశం లేదని ఇంటెలిజెన్స్‌ వర్గాలు సూచించారు.
కాగా అన్మోల్‌ బిష్ణోయ్‌ 2002లో పంజాబీ గాయకుడు సిద్దూ మూసేవాలా హత్య. మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ నేత బాబా సిద్దిక్‌ హత్య కేసుతో సహా అనేక కేసులలో నిందితుడిగా ఉన్నాడు. ఈ ఏడాది ఏప్రిల్ 14న సల్మాన్‌ఖాన్‌ ఇంటివద్ద కాల్పుల ఘటన చోటుచేసుకుంది. దానికి బాధ్యత వహిస్తూ అన్మోల్‌ సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టాడు.

బిష్ణోయ్ తరచుగా అమెరికా, కెనడా మధ్య ప్రయాణిస్తూ ఉంటాడు. పంజాబ్‌లోని ఫజిల్కాకు చెందిన బిష్ణోయ్ నకిలీ పాస్‌పోర్ట్‌తో భారత్‌ నుంచి పారిపోయి కెనడాలో ఉన్నట్లు గతంలో భావించారు. అతను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్‌ఐఏ), భారత యాంటీ టెర్రర్ యూనిట్ దాఖలు చేసిన రెండు కేసుల్లో అభియోగాలు ఎదుర్కొంటున్నాడు. ఎన్‌ఐఏ దాఖలు చేసిన కేసులో ఆన్మోల్‌ను అప్పగించాలని ముంబై పోలీసులు కేంద్ర ప్రభుత్వాన్నికోరారు. 

అతనిపై మహారాష్ట్ర కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో చేర్చింది. మనీ లాండరింగ్‌ చేస్తున్నాడనే అనుమానంతో అతడిపై ఈడీ కూడా దర్యాప్తు చేపట్టింది. అన్మోల్‌ బిష్ణోయ్‌పై జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏ రూ.10 లక్షల రివార్డు ప్రకటించింది. అంతేగాకుండా సిద్ధిఖీ హత్యకు ముందు సైతం షూటర్లతో అన్మోల్‌ చాటింగ్ చేసినట్లు ముంబయి పోలీసులు వెల్లడించారు. ఈక్రమంలో అతడి గురించి సమాచారం ఇచ్చినవారికి ఈ రివార్డు ఇస్తామని ఎన్‌ఐఏ తెలిపింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement