అన్‌మోల్ హత్య కేసులో బెయిల్ నిరాకరణ
Published Sat, Sep 21 2013 1:42 AM | Last Updated on Fri, Sep 1 2017 10:53 PM
న్యూఢిల్లీ: ప్రవాస భారతీయ విద్యార్థి అన్‌మోల్ సర్నా కేసులో నిందితులు నలుగురు పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను ఢి ల్లీ మెట్రోపాలిటన్ కోర్టు కొట్టివేసింది. నిందితులు శివాంక్ గంభీ ర్, మాధవ్ భండారీ, ప్రణీల్‌షా, రితమ్ గిర్హోత్రాలు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. శివాంక్, మాధవ్‌లకు కోర్టు గురువారనంనాడు జుడిషియల్ కస్టడీ విధిం చగా తక్కిన నిందితులను సెప్టెంబర్ 17న జుడిషియల్ కస్టడీ ప్రకటించింది.
అన్‌మోల్‌కు వీడ్కోలు పార్టీ పేరుతో ప్రణీల్ షా పిలుపు మీద వెళ్లిన వీరు అక్కడ మోతాదుకు మించి మాదకద్రవ్యాలు సేవించా రు. ఈ క్రమంలో వారి మధ్య గొడవ చెలరేగి ఘర్షణకు దారి తీసింది. అదుపు తప్పిన స్థితిలో అన్‌మోల్ ఘర్షణకు దిగ గాస్నేహితులు, భవనం సెక్యూరిటీ గార్డులు దాడి చేయడంతో గాయపడి మరణించాడని పోలీసులు పేర్కొన్నారు. కాగా అన్‌మోల్ తల్లిదండ్రులు మాత్రం తమ కుమారుడి ది హత్యే అని ఆరోపిస్తున్నారు. అమెరికాలో నివిసించే అన్‌మోల్ తల్లిదండ్రులు అతను గాయపడిన ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడని ప్రణీల్ షా తండ్రి అందించిన సమాచారంతో రాజధానికి చేరుకున్నారు.
మాదకద్రవ్యాలు సరఫరా చేసిన వ్యక్తుల అరెస్టు
ప్రణీల్‌షా ఏర్పాటు చేసిన పార్టీకి మాదకద్రవ్యాలు సరఫరా చేసిన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశామని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. అయితే వారి వివరాలను తెల్పడానికి నిరాకరించారు. ఇప్పటితో ఈ కేసులో పోలీసులు మొత్తం తొమ్మిది మందిని అరెస్టు చేశారు. భవనం కాపాలదారులు ఇద్దరితో పాటు నలుగురు వ్యక్తులు జుడిషియల్ కస్టడీలో ఉన్నారు. తాజాగా అరెస్టు చేసిన వ్యక్తులను పూర్తిగా విచారణ చేసిన తరువాత కోర్టుకు హాజరుపరుస్తారని భావిస్తున్నారు.
Advertisement
Advertisement