అమెరికాలో చరిత్ర సృష్టించిన సిక్కు యువతి | She Is The First Observant Sikh To Graduate From US Military Academy | Sakshi
Sakshi News home page

అమెరికాలో సిక్కు యువతి అరుదైన ఘనత

Published Sat, Jun 13 2020 3:17 PM | Last Updated on Sat, Jun 13 2020 3:55 PM

She Is The First Observant Sikh To Graduate From US Military Academy - Sakshi

వాషింగ్టన్‌: భారత సంతతికి చెందిన ఆన్‌మోల్‌ నారంగ్‌ అరుదైన ఘనత సాధించింది. వెస్ట్‌పాయింట్‌లోని ప్రఖ్యాత అమెరికా మిలిటరీ అకాడమీ నుంచి గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన మొదటి సిక్కు యువతిగా చరిత్ర సృష్టించింది. వెస్ట్‌పాయింట్‌లో నాలుగేళ్ల శిక్షణ పూర్తిచేసుకున్న అన్‌మోల్‌.. ఓక్లహామ్‌లోని లాటెన్‌ ఫోర్ట్‌ సిల్‌లో బేసిక్‌ ఆఫీసర్‌ లీడర్‌షిప్‌ కోర్పు అభ్యసించనుంది. ఈ శిక్షణ పూర్తైన తర్వాత వచ్చే ఏడాది జనవరిలో జపాన్‌లోని ఒకినావాలో ఆమెకు తొలి పోస్టింగ్‌ లభించే అవకాశం ఉంది. ఈ విషయం గురించి సెకండ్‌ లెఫ్టినెంట్‌ అన్‌మోల్‌ నారంగ్‌ మీడియాతో మాట్లాడుతూ.. వెస్ట్‌పాయింట్‌ నుంచి గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేయాలన్న నా కల శనివారంతో తీరింది. (చదవండి: భూ అంతర్భాగంలో భారీ నిర్మాణం)

నాకు దక్కిన ఈ గౌరవం నన్నెంతో ఉద్వేగానికి గురిచేస్తోంది. జార్జియాలోని సిక్కు కమ్యూనిటీ సభ్యులు నాకు మద్దతుగా నిలిచారు. ఈ లక్ష్యాన్ని సాధించడం ద్వారా సిక్కు అమెరికన్లు ఎలాంటి సవాలునైనా ఎదుర్కోగలరని నిరూపించాను. ఇష్టమైన కెరీర్‌లో ఎదగాలన్న బలమైన ఆకాంక్ష ఉంటే అసాధ్యం అనేది ఏదీ ఉండదు’’అని పేర్కొన్నారు. కాగా జార్జియాలోని రోస్‌వెల్‌లో పుట్టిపెరిగిన అన్‌మోల్‌.. తన తాతయ్య(భారత ఆర్మీలో పనిచేశారు) స్ఫూర్తితో మిలిటరీలో సేవలు అందించాలని నిర్ణయించుకున్నారు.  జార్జియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో న్యూక్లియర్‌ ఇంజనీరింగ్‌ అండర్‌గ్రాడ్యుయేట్‌ అయిన ఆమె.. హవాయిలోని హోనలులులో ఉన్న పెరల్‌ హార్బర్‌ నేషనల్‌ మెమొరియల్‌ సందర్శించిన అనంతరం వెస్ట్‌పాయింట్‌లో చేరాలన సంకల్పించి తన ఆకాంక్ష నేటితో నెరవేర్చుకున్నారు.(హెచ్‌1బీ వీసా రద్దుకు ట్రంప్‌ ఆలోచన)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement