sarogacy
-
సరోగసీలో బిడ్డకు పాలివ్వలేం!..మరీ బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందా?
బిడ్డకు పాలు ఇవ్వకపోతే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని చదివాను. నిజమేనా? నా ఫ్రెండ్ కెరీర్ ఒత్తిడి వల్ల పిల్లల కోసం సరోగసీకి వెళదామనుకుంటోంది. దీనివల్ల బ్రెస్ట్ ఫీడ్ కుదరదు కదా! అందుకే బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదం ఉంటుందని చెప్పాను. అలా ఏమీ ఉడదు.. బిడ్డను కన్నా పాలు పడకపోతే కూడా అంతే రిస్క్ ఉంటుంది కదా అని వాదిస్తోంది. నా డౌట్ క్లియర్ చేయగలరు. – కె. పృథ్వీ దీప్తి, పుణె సరోగసీ ద్వారా పిల్లలను ప్లాన్ చేసినా.. కొంతమందికి మందుల సహాయంతో బ్రెస్ట్ ఫీడింగ్‌కి ట్రై చేయొచ్చు. దీన్ని లాక్టేషన్ ఇండక్షన్ అంటారు. సరోగసీ బేబీ డెలివరీ కన్నా ముందు నుంచి బ్రెస్ట్ ఫీడింగ్‌కి ట్రై చెయ్యడానికి ప్రిపరేషన్ చేసుకోవాలి. ఇది అందరిలోనూ విజయవంతం కావచ్చు. బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల ఉన్న ఉపయోగాలు దాదాపు అందరికీ తెలిసే ఉంటాయి. ఏడాది పాటు బిడ్డకు పాలు ఇవ్వడం వల్ల 4 నుంచి 5 శాతం వరకు బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది. బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ అనేది హార్మోన్స్, జన్యుపరమైన, జీవనశైలి వంటివాటి వల్ల పెరుగుతుంది. హార్మోన్స్ చేంజెస్ వల్ల 50 శాతం రిస్క్ పెరుగుతుంది. 5 నుంచి 10 శాతం జన్యుపరమైన కారణాలు ఉంటాయి. బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వనందు వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ స్వల్పమే. ఆరోగ్యకరమైన జీవనశైలి.. అంటే అధిక బరువు లేకుండా సరైన బీఎమ్ఐ (బాడీ మాస్ ఇండెక్స్)ని మెయిన్టేన్ చేస్తూ .. పోషకాహారం తీసుకుంటూంటే క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది. జన్యుపరమైన కారణాలతో హైరిస్క్‌లో ఉన్నవారికి స్క్రీనింగ్‌లో బీఆర్సీఏ జీన్ పాజిటివ్ అని తేలిన వారికి ప్రాఫిలాక్టిక్ సర్జరీల ద్వారా ఆ రిస్క్‌ని తగ్గించవచ్చు. బ్రెస్ట్ అల్ట్రాసౌండ్ లేదా మామోగ్రఫీ ద్వారా తేలిగ్గానే క్యాన్సర్ చేంజెస్‌ను కనిపెట్టవచ్చు. ఈరోజుల్లో కొన్ని మెడికేషన్స్ ద్వారా .. సరోగసీ ద్వారా పిల్లలు కన్న తల్లులతో కూడా బ్రెస్ట్ఫీడింగ్కి, బిడ్డతో స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్‌ని చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. (చదవండి: చర్మం ఆరోగ్యంగా కాంతివంతంగా కనిపించాలంటే..ఇలా చేయండి!) -
పిల్లలంటే ఇష్టం.. అందుకే పెళ్లికి ముందే అలా చేశా!: ప్రియాంక చోప్రా
గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా ప్రస్తుతం వార్తల్లో ఎక్కువగా నిలుస్తోంది. తాజాగా ఆమె నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్‌లో రొమాంటిక్ సన్నివేశాల్లో కనిపించి షాకిచ్చింది. అంతేకాదు ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్లో భాగంగా ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో బాలీవుడ్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. హిందీ చిత్ర పరిశ్రమలోని రాజకీయాలు తట్టుకోలేకే తాను హాలీవుడ్‌కు వచ్చానని చెప్పింది. దీంతో ప్రియాంక ప్రస్తుతం ఇండిస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది. చదవండి: 1997లో ప్రారంభమైన కమల్ చిత్రం షూటింగ్.. 26 ఏళ్ల తర్వాత సెట్‌పైకి! అలాగే అదే ఇంటర్య్వూలో మాట్లాడుతూ తన వ్యక్తిగత విషయం గురించి షాకింగ్ విషయం చెప్పింది. తనకు పిల్లలంటే ఇష్టమని, పెళ్లికి ముందే పిల్లల కోసం ప్లాన్ చేసుకున్నానంది. కాగా ప్రియాంక సరోగసికి వెళ్లడంపై ఆమెకు ప్రశ్న ఎదురవగా అసలు విషయం వెల్లడించింది. ‘నాకు పిల్లలు అంటే చాలా ఇష్టం. ఎక్కువ సమయంతో వారితో గడపడానికే ఇష్టపడతాను. అందుకే పెళ్లికి ముందే నా అండాలను దాచిపెట్టాను. అప్పట్లో నేను ఎవరితో పిల్లలను కనాలనుకున్నానో ఆ వ్యక్తిని కలవలేకపోయాను. అందుకే అండాలను దాచుకోమ్మని మా అమ్మ మధు చోప్రా (గైనకాలజిస్ట్) సలహా ఇచ్చారు. చదవండి: రానా నాయుడు వెబ్ సిరీస్‌పై నెట్‌ఫ్లిక్స్ షాకింగ్ నిర్ణయం! అమ్మ సలహా మేరకు 30 ఏళ్ల వయసులోనే నా అండాలను దాచిపెట్టుకున్నాను. అలా చేయడం వల్ల నాకు చాలా స్వేచ్చగా అనిపించింది. ఆ స్వేచ్చతోనే నా కెరీర్లో ముందుకు వెళ్లాను. అనుకున్నది సాధించగలిగాను. నా లక్ష్యాలను చేరుకోగలిగాను’ అంటూ చెప్పుకొచ్చింది. అదే విధంగా తనకు పిల్లలను కనాలనే ఆశ ఉండేదని, కానీ తన భర్త నిక్ జోనస్ వయసు తక్కువ ఉండుటంతో తనకి అప్పుడే పిల్లలను కనే ఇష్టం ఉందో? లేదో? అనే అనుమానం ఉండేదని పేర్కొంది. ఆ కారణం చేతనే పెళ్లికి ముందు నిక్‌తో డేటింగ్‌కి కూడా ఒప్పుకోలేదంటూ ప్రియాంక చెప్పుకొచ్చింది. -
కవల పిల్లల ఇష్యూ పై స్పందించిన విగ్నేష్ శివన్
-
సరోగసీ ద్వారా బిడ్డను కోల్పోయాం: స్టార్ హీరోయిన్
Amrita Rao RJ Anmol Share Pregnancy Struggles During Surrogacy: హీరోయిన్ అమృత రావు, ఆమె భర్త ఆర్జే అన్మోల్ తమ యూట్యూబ్ ఛానల్ 'కపుల్ ఆఫ్ థింగ్స్' ద్వారా తమ జీవితంలోని అనేక రహస్యాలను పంచుకుంటున్నారు. ఇటీవల ఓ వీడియోలో అమృత ఎదుర్కొన్న గర్భధారణ సమస్యల గురించి చెప్పుకొచ్చింది. అమృత, అన్మోల్ తల్లిదండ్రులు అయ్యేందుకు సరోగసీ, ఐయూఐ, ఐవీఎఫ్, హోమియోపతి, ఆయుర్వేద పద్ధతులను ఎంచుకున్నట్లు తెలిపారు. సరోగసీ పద్ధతి గురించి మాట్లాడుతూ వారు ఈ పద్ధతి ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే బిడ్డను కోల్పోయినట్లు వెల్లడించారు. 'ఈ విషయం ఇప్పటికీ ఎంతో బాధగానే ఉంది. తల్లిదండ్రులు కావాలన్న ఉత్సాహంతో మీరు అంత ఉద్వేగానికి లోనవాల్సిన అవసరం లేదు. ఇది మన చేతుల్లో ఉండదు.' అని అమృత ఆ వీడియోలో పేర్కొంది. అలాగే అమృత రావు, అన్మోల్ ఐవీఎఫ్ చికిత్స గురించి కూడా తెలిపారు. చాలా ఏళ్లు ప్రయత్నించిన తర్వాత అమృత 'మనకు కూడా బిడ్డ పుట్టాలా ? ఈ ఒత్తిడి జీవితాలతో పిల్లలను పెంచగలమా ? ఇది అంత ముఖ్యమా ?' అని ప్రశ్నించుకున్నట్లు పేర్కొంది. అనంతరం ఈ జంట హాలీడే కోసం థాయ్‌లాండ్‌కు వెళ్లారు. మార్చి 2020లో అమృత గర్భవతి కాగా నవంబర్‌లో వీర్‌కు జన్మనిచ్చింది. వీర్‌కు మొదటగా అనేక నిక్‌నేమ్స్ పెట్టి పిలిచేవాళ్లమని ఈ జంట పేర్కొంది. చదవండి: తన భర్తనే మళ్లీ పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్.. చదవండి: 'పెళ్లి చేసుకుందాం, సినిమాలు వదిలేయ్' ఏకధాటిగా ఏడ్చిన నటి! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1711356039.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
‘ఈతరం స్త్రీ పిల్లల్ని కనాలనుకోవడం లేదు’
బెంగళూరు: మనది పురుషాధిక్య సమాజం. ఇక్కడ చాలా మంది మగవారు మహిళ అంటే కేవలం ఇంటికే.. అందునా వంటింటికే పరిమితం కావాలని భావిస్తారు. వారికంటూ సొంత ఆలోచనలు, ఆశలు, కోరికలు ఉండకూడదని భావిస్తారు. ఇక సందర్భం దొరికిన ప్రతి సారి మహిళల గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడంలో ముందుంటారు. వీరిలో సామాన్యులు, ప్రముఖులు అనే తేడా లేదు. స్త్రీ అనగానే వారి నాలుకలు మడతపడతాయి.. మర్యాద వెనక్కి వెళ్తుంది. మహిళలను ఎంత తక్కువ చేసి మాట్లాడితే.. వారికి అంత సంతృప్తి కలుగుతుంది. ఈ కోవకు చెందిన వ్యక్తే కర్ణాటక ఆరోగ్య మంత్రి డాక్టర్ కే సుధాకర్. ఈతరం ఆధునిక భారతీయ మహిళ ఒంటరిగా జీవించాలని ఆశిస్తుంది.. పిల్లల్ని కనడానికి ఇష్టపడటం లేదు.. ఇది మంచి పరిణామం కాదంటూ అనుచిత వ్యాఖ్యలు చేసి.. విమర్శల పాలవుతున్నారు. ఆ వివరాలు.. ప్రపంచ మానసిక ఆరోగ్యం దినోత్సవం సందర్భంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోలాజికల్ నిర్వహించిన ఓ కార్యక్రమానికి డాక్టర్ సుధాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఈ రోజు నేను ఇలా మాట్లాడుతున్నందుకు నన్ను మన్నించండి. ఏంటంటే మన దేశ ఆధునిక మహిళ ఒంటరిగా ఉండాలని ఆశిస్తుంది. వివాహబంధానికి దూరంగా ఉండాలని కోరుకుంటుంది. ఒకవేళ పెళ్లి చేసుకున్నా.. పిల్లల్ని కనడానికి ఆమె ఇష్టపడటం లేదు. పిల్లల కోసం సరోగసి విధానాన్ని ఎంచుకుంటున్నారు. మన ఆలోచనలో వచ్చిన ఈ మార్పు మంచిది కాదు’’ అంటూ ఇష్టారీతిగా మాట్లాడారు. (చదవండి: ‘మగాళ్లకు, మీకు తేడా ఏంటి.. పెళ్లి ఎలా అవుతుంది’) అంతేకాక ‘‘ప్రస్తుతం మనం విదేశీ సంస్కృతిని అవలంబించడానికి ఉత్సహం చూపుతున్నాం. దానిలో భాగంగా తల్లిదండ్రులను మనతో పాటు ఉంచుకోవడానికి ఇష్టపడటం లేదు. ఇది చాలా దురదృష్టకరం’’ అన్నారు. ఆడవారి గురించి మంత్రి సుధాకర్ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. ఏ వేదిక మీద ఉన్నారు.. ఏ కార్యక్రమానికి హాజరయ్యారు.. ఏం మాట్లాడుతున్నారు. ముందు మీ మానసిక ఆరోగ్యం బాగుందా లేదా చెక్ చేసుకొండి అంటూ ట్రోల్ చేస్తున్నారు నెటిజనులు. చదవండి: రైల్లో లోదుస్తులతో ఎమ్మెల్యే చక్కర్లు.. నెటిజన్ల ట్రోలింగ్ #WATCH | ...Today we don't want our parents to live with us. A lot of modern women in India want to stay single. Even if they get married, don't want to give birth. Paradigm shift in our thinking,it's not good: Karnataka Health Min on World Mental Health Day,at NIMHANS, Bengaluru pic.twitter.com/LkX7Ab7Sks — ANI (@ANI) October 10, 2021 -
మాతృత్వం కోసం తన వీర్యాన్ని దాచుకున్న ‘దయారా’
గాంధీనగర్: గుజరాత్, అహ్మదాబాద్‌కు చెందిన డాక్టర్ జిస్నూర్ దయారా రాష్ట్రం నుంచి వైద్య విద్యనభ్యసించిన తొలి ట్రాన్స్ వుమెన్‌గా రికార్డు సృష్టించారు. తాజాగా ఆమె మరో సంచలన నిర్ణయం తీసుకుని మరో సారి వార్తల్లో నిలిచారు. త్వరలోనే శస్త్ర చికిత్స ద్వారా పూర్తిగా మహిళగా మారనున్న దయారా సంచలన నిర్ణయం తీసుకున్నారు. స్త్రీ జన్మకు పరిపూర్ణ అర్థాన్ని చేకూర్చే మాతృత్వాన్ని అనుభూతి చెందడం కోసం తన వీర్యాన్ని భద్రపరుచుకున్నారు. భవిష్యత్తులో దీన్ని ఉపయోగించి ఆమె బిడ్డను కనాలని భావిస్తున్నారు. ఇలా జన్మించే బిడ్డకు దయారానే తల్లి, తండ్రి అవుతారు. ఒకే జన్మలో ఆమె మగాడిగా, స్త్రీగా జీవించనున్నారు. అదే విధంగా తొలిసారి ఓ బిడ్డకు తల్లి, తండ్రి ఒక్కరే అవుతుండటం విశేషం. ఈ సందర్భంగా దయారా మాట్లాడుతూ.. ‘‘చిన్నప్పటి నుంచి నాకు ఆడవారిగా జీవించాలని ఉండేది. మా అమ్మ, అక్కలాగా చీర కట్టుకోవాలని.. లిప్‌స్టిక్ వేసుకోవాలని మనసు తహతహలాడేది. కానీ చుట్టూ ఉన్న సమాజానికి భయపడి.. నాలోని స్త్రీని బయటకు రానివ్వలేదు. ఇదిలా కొనసాగుతుండగానే.. ఎంబీబీఎస్ చదవడానికి నేను రష్యా వెళ్లాను. అక్కడ నాలాంటి వారు ఎంతో ధైర్యంగా.. తమకు నచ్చినట్లు బతకడం చూశాను. నాలో ధైర్యం వచ్చింది. భయాల్ని తొలగించుకున్నాను. నాకు నచ్చినట్లు బతకడం మొదలు పెట్టాను. చీర కట్టుకోవడం, లిప్‌స్టిక్ వేసుకోవడం నేర్చుకున్నాను. నన్ను చూసి మొదట నా తల్లిదండ్రులు ఇబ్బంది పడ్డారు. కానీ ప్రస్తుతం వారు నన్ను అర్థం చేసుకున్నారు. నా చుట్టు ఉన్న సమాజం కూడా నన్ను అంగీకరించడం ప్రారంభించింది’’ అంటూ చెప్పుకొచ్చారు దయారా. తల్లి అవ్వడం నా కల ‘‘ప్రస్తుతం ఇండియాలో ప్రాక్టీస్ చేయడం కోసం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్వహించే పరీక్ష రాయబోతున్నాను. ఆ తర్వాత శస్త్ర చికిత్స ద్వారా నేను పూర్తిగా స్త్రీగా మారతాను. ఆడవారికి లభించిన అద్భుతమైన వరం ఓ జీవికి జన్మనివ్వడం. నేను కూడా ఆ వరాన్ని అందుకోవాలని భావిస్తున్నాను. మాతృత్వాన్ని అనుభూతి చెందాలనుకుంటున్నాను. అందుకే లింగ మార్పిడి శస్త్రచికిత్సకు ముందే నా వీర్యాన్ని భద్రపరుచుకోవాలని భావించాను. ఇందుకు గాను అహ్మదాబాద్, ఆనంద్‌లోని ఓ ఐవీఎఫ్ ఆస్పత్రిని సంప్రదించి.. నా కోరికను వారికి చెప్పాను. నా నిర్ణయాన్ని గౌరవించిన వారు నా వీర్యాన్ని భద్రపరిచేందుకు అంగీకరించారు. వారికి ఎంతో రుణపడి ఉంటాను’’ అన్నారు దయారా. సరోగసి ద్వారా బిడ్డను కంటాను ‘‘కాళీ మాతా దయ వల్ల నేను ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్నాను. అలా జన్మించే బిడ్డకు బయాలజీకల్గా నేనే తల్లి, తండ్రి. ఈ విషయం తలుచుకుంటే నా మనసు గర్వంతో ఉప్పొంగిపోతుంది. బిడ్డను కనడం కోసం నేను సరోగసి విధానాన్ని ఎంచుకోబోతున్నాను. ఇందుకు నేనేం సిగ్గుపడటం లేదు. ట్రాన్స్ వుమెన్‌గా మారిన వ్యక్తి.. ఓ బిడ్డకు జన్మనివ్వడానికి ఎంతో ధైర్యం కావాలి. చుట్టూ ఉన్న సమాజం కూడా ట్రాన్స్‌జెండర్స్ పట్ల దయతో వ్యవహరించాలి’’ అని కోరారు. ఆస్పత్రి చరిత్రలో ఇదే ప్రథమం: నయనా పటేల్ ఇక దయారా వీర్యాన్ని భద్రపరిచిన ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ నయానా పటేల్ మాట్లాడుతూ.. ‘‘సాధారణంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న మగాళ్లు, ఇంటికి దూరంగా ఉంటున్న సైనికులు, చాలా కాలం వరకు బిడ్డలు వద్దనుకునే దంపతుల్లోని మగవారు తమ భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని వారి వీర్యాన్ని మా ఆస్పత్రిలో భద్రపర్చుకుంటారు. ఆ తర్వాత బిడ్డలు కావాలనుకున్నప్పుడు ఐవీఎఫ్, సరోగసి ద్వారా పిల్లల్ని కంటారు. కానీ మొదటిసారి ఓ ట్రాన్స్ఉమెన్ భవిష్యత్తులో తల్లి అవ్వడం కోసం తన వీర్యాన్ని మా ఆస్పత్రిలో భద్రపర్చుకోవడం మా ఆస్పత్రిలో ఇదే మొదటిసారి’’ అన్నారు. చదవండి: చిన్ని తండ్రీ నిన్ను చూడక... ట్రాన్స్... అప్డేట్ వెర్షన్ -
సరోగసీ కాదు.. నాతో గడిపి బిడ్డను కనివ్వు..
సాక్షి, హైదరాబాద్: లేటు వయస్సులో వారసుడిని కనాలని భావించాడు ఓ వృద్ధుడు. ఈ మేరకు సరోగసి ద్వారా బిడ్డను కనివ్వాలని.. ఓ మహిళతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇంతలో అతడికి వక్రబుద్ధి పుట్టింది. ‘సరోగసీ కాదు.. నాతో సహజీవనం చేసి బిడ్డను కనిస్తావా’ అంటూ ఆమెను వేధించసాగాడు. ఆఖరికి బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కటకటాలపాలయ్యాడు. వివరాలు... సోమాజిగూడ, ధృవతార అపార్ట్మెంట్లో ఉంటున్న సూరప్ప రాజు (64)కు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కుమారుడు కావాలన్న కోరికతో మధ్యవర్తి నూర్ అనే మహిళ ద్వారా పోచమ్మబస్తీకి చెందిన ఓ మహిళ(22)ను పరిచయం చేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సదరు మహిళ సరోగసి ద్వారా గర్భందాల్చి పుట్టిన బిడ్డను ఇచ్చేందుకు అంగీకరించింది. ఈ మేరకు రూ.4.5 లక్షలు ఇస్తానని, గర్భవతిగా ఉన్న సమయంలో ప్రతి నెల రూ.10వేలు పంపిస్తానని సూరప్ప రాజు గతేడాది డిసెంబర్ 24న ఆమెతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లి అవసరమైన పరీక్షలు చేయించాడు. ఈ నెల 11న రాజు సదరు మహిళను కారులో బిర్లామందిర్ తీసుకెళ్లాడు. దేవుని దర్శనం అనంతరం తనతో గడిపిన అనంతరం పిల్లల్ని కనాలని రూ.4.5 లక్షలకు అదనంగా మరో రూ. 50వేలు ఇస్తానని బలవంతం చేశాడు. అయితే ఆమె అందుకు అంగీకరించకుండా ఇంటికి వెళ్లిపోయింది. దీంతో గత వారం రోజులుగా రాజు ఆమెకు ఫోన్ చేసి తనతో గడిపేందుకు ఒప్పుకోవాలని వేధింపులు, బెదిరింపులకు గురిచేస్తున్నాడు. దీంతో బాధితురాలు ఈ విషయాన్ని తన భర్తకు దృష్టికి తీసుకెళ్లింది. బుధవారం రాత్రి ఇద్దరు కలిసి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు సూరప్ప రాజును అరెస్టు చేసి గురువారం రిమాండ్‌కు తరలించారు. -
కన్నకూతురి కోసం అద్దెతల్లిగా..
చెన్నై: కన్నకూతురుకి మాతృత్వపు మధురిమ పంచివ్వాలని నిర్ణయించిన ఓతల్లి అద్దె తల్లిగా మారిన ఘటన చెన్నైలో జరిగింది. టీనగర్‌కు చెందిన 28 ఏళ్ల యువతి గర్భవతిగా ఉన్న ఏడో నెలలో ప్లాసండల్ అబ్రప్షన్ వ్యాధికి గురైంది. వైద్యులు ఎంత ప్రయత్నించినా నయం కాకపోవడంతో గర్భంలోనే చనిపోయిన బిడ్డతో సహా గర్భసంచిని తొలగించారు. ఇక తనకు తల్లయ్యే భాగ్యం లేదని కుమార్తె కుమిలిపోతుండగా వైద్యులు సరోగసీ విధానాన్ని సూచించారు. కుమార్తెను తల్లిగా చూడడం కోసం తానే అద్దె తల్లిగా మారేందుకు సిద్ధమని 61 ఏళ్ల వృద్ధురాలు ముందుకు వచ్చింది. సరోగసీ విధానం ద్వారా నవ మాసాలు మోసి గత ఏడాది నవంబర్ 2వ తేదీన ఆడబిడ్డకు జన్మనిచ్చింది. సరోగసీ చికిత్సలు ఎన్నో చేశామని, అయితే కన్నతల్లే అద్దె తల్లిగా మారడం అరుదైన ఘటన అని చికిత్సచేసిన ఆకాశ్ ఫెర్టిలిటీ క్లినిక్ వైద్యులు కామరాజ్, జయరాణీ కామరాజ్ శుక్రవారం విలేకర్ల సమావేశంలో తెలిపారు. దేశంలో ఇది రెండో కేసని, తొలి కేసు గుజరాత్లో జరిగిందని తెలిపారు.