Priyanka Chopra Reveals She Froze Her Eggs In Early 30s - Sakshi
Sakshi News home page

Priyanka Chopra: పిల్లలంటే ఇష్టం.. పెళ్లికి ముందే నా అండాలను దాచిపెట్టా!: ప్రియాంక చోప్రా

Mar 31 2023 8:32 AM | Updated on Mar 31 2023 9:32 AM

Priyanka Chopra Reveals She Froze Her Eggs in Early 30s - Sakshi

గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంకా చోప్రా ప్రస్తుతం వార్తల్లో ఎక్కువగా నిలుస్తోంది. తాజాగా ఆమె నటించిన సిటాడెల్‌ వెబ్‌ సిరీస్‌లో రొమాంటిక్‌ సన్నివేశాల్లో కనిపించి షాకిచ్చింది. అంతేకాదు ఈ వెబ్‌ సిరీస్‌ ప్రమోషన్లో భాగంగా ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో బాలీవుడ్‌ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. హిందీ చిత్ర పరిశ్రమలోని రాజకీయాలు తట్టుకోలేకే తాను హాలీవుడ్‌కు వచ్చానని చెప్పింది. దీంతో  ప్రియాంక ప్రస్తుతం ఇండిస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది.

చదవండి: 1997లో ప్రారంభమైన కమల్‌ చిత్రం షూటింగ్‌.. 26 ఏళ్ల తర్వాత సెట్‌పైకి!

అలాగే అదే ఇంటర్య్వూలో మాట్లాడుతూ తన వ్యక్తిగత విషయం గురించి షాకింగ్‌ విషయం చెప్పింది. తనకు పిల్లలంటే ఇష్టమని, పెళ్లికి ముందే పిల్లల కోసం ప్లాన్‌ చేసుకున్నానంది. కాగా ప్రియాంక సరోగసికి వెళ్లడంపై ఆమెకు ప్రశ్న ఎదురవగా అసలు విషయం వెల్లడించింది. ‘నాకు పిల్లలు అంటే చాలా ఇష్టం. ఎక్కువ సమయంతో వారితో గడపడానికే ఇష్టపడతాను. అందుకే పెళ్లికి ముందే నా అండాలను దాచిపెట్టాను. అప్పట్లో నేను ఎవరితో పిల్లలను కనాలనుకున్నానో ఆ వ్యక్తిని కలవలేకపోయాను. అందుకే అండాలను దాచుకోమ్మని మా అమ్మ మధు చోప్రా (గైనకాలజిస్ట్‌) సలహా ఇచ్చారు. 

చదవండి: రానా నాయుడు వెబ్‌ సిరీస్‌పై నెట్‌ఫ్లిక్స్‌ షాకింగ్‌ నిర్ణయం!

అమ్మ సలహా మేరకు 30 ఏళ్ల వయసులోనే నా అండాలను దాచిపెట్టుకున్నాను. అలా చేయడం వల్ల నాకు చాలా స్వేచ్చగా అనిపించింది. ఆ స్వేచ్చతోనే నా కెరీర్‌లో ముందుకు వెళ్లాను. అనుకున్నది సాధించగలిగాను. నా లక్ష్యాలను చేరుకోగలిగాను’ అంటూ చెప్పుకొచ్చింది. అదే విధంగా తనకు పిల్లలను కనాలనే ఆశ ఉండేదని, కానీ తన భర్త నిక్‌ జోనస్‌ వయసు తక్కువ ఉండుటంతో తనకి అప్పుడే పిల్లలను కనే ఇష్టం ఉందో? లేదో? అనే అనుమానం ఉండేదని పేర్కొంది. ఆ కారణం చేతనే పెళ్లికి ముందు నిక్‌తో డేటింగ్‌కి కూడా ఒ‍ప్పుకోలేదంటూ ప్రియాంక చెప్పుకొచ్చింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement