'నువ్వే నా జీవితంలో గొప్ప ఆనందం'.. ప్రియాంక ఎమోషనల్ పోస్ట్! | Priyanka Chopra Kisses Nick Celebrating Greatest Joy Of My Life | Sakshi
Sakshi News home page

Priyanka Chopra: భర్తకు బర్త్‌ డే విషెస్.. ప్రియాంక ఎమోషనల్ పోస్ట్ వైరల్!

Published Sun, Sep 17 2023 5:10 PM | Last Updated on Sun, Sep 17 2023 5:40 PM

Priyanka Chopra Kisses Nick Celebrating Greatest Joy Of My Life - Sakshi

ప్రియాంక చోప్రా భర్త నిక్ జోనాస్ గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. హాలీవుడ్‌లో సింగర్‌గా గుర్తింపు తెచ్చుకున్న నిక్.. బాలీవుడ్‌ భామ  ప్రియాంక చోప్రాను ప్రేమపెళ్లి చేసుకున్నాడు. ఈ ఏడాది తన భార్య, బేబీతో కలిసి ఇండియాకు కూడా వచ్చాడు. గతంలో ముంబయిలో జరిగిన ఓ ఈవెంట్‌కు తమ కూతురితో తొలిసారి ఇండియా వచ్చారు నిక్, ప్రియాంక చోప్రా.  తాజాగా నిక్ బర్త్‌ డే సందర్భంగా ప్రియాంక విష్ చేసింది. భర్తకు ముద్దు పెడుతున్న ఫోటోను షేర్ చేస్తూ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చింది.  జోనాస్‌ తన జీవితంలో దొరికిన  గొప్ప ఆనందం అని తెలిపింది. నిక్‌తో పాటు తన కుమార్తె మాల్టీ మేరీ ఫోటోను కూడా జతచేసింది. 

(ఇది చదవండి: ఏడుసార్లు అబార్షన్ అంటూ నటి ఫిర్యాదు.. అంతలోనే బిగ్‌ ట్విస్ట్! )

ఇన్‌స్టాలో ప్రియాంక రాస్తూ.. 'నీ పుట్టిన రోజు జరుపుకోవడం నా జీవితంలో చాలా సంతోషమైంది. నాకు సాధ్యం కానీ మార్గంలో నడిపించారు. నీ ప్రపంచంలో నన్ను నీలా ప్రేమించేవారు లేరు. ఐ లవ్‌ యూ బర్త్‌ డే గాయ్. నీ కలలన్నీ భవిష్యత్తులో నిజమవ్వాలని కోరుకుంటున్నా.  హ్యాపీ బర్త్ డే బేబీ.' అంటూ పోస్ట్ చేసింది. ఇది చూసిన ప్రియాంక అభిమానులు సైతం నిక్ జోనాస్‌కు బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు. ప్రియాంక షేర్ చేసిన ఫోటోల్లో నిక్ గోల్ఫ్ ఆడుతున్న ఫోటో, తన కూతురు మాల్టీ పాలు తాగిస్తున్న అందమైన ఫోటోలు ఉన్నాయి. 

కాగా.. ప్రియాంక, నిక్ 2018లో జోధ్‌పూర్‌లోని ప్యాలెస్‌లో క్రిస్టియన్, హిందూ సంప్రదాయంలో వివాహం చేసుకున్నారు. ఆ తరువాత ఢిల్లీ, ముంబ రెండు రిసెప్షన్స్‌ కూడా నిర్వహించారు. జనవరి 2022లో సరోగసీ ద్వారా  మాల్టీ మేరీని స్వాగతించారు. 

(ఇది చదవండి: సర్జరీ కోసం ఇంటిని అమ్మేసింది.. అప్పుడే సొంతింటికి!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement