
సల్మాన్ ఖాన్ , రష్మికా మందన్నా జంటగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సాజిద్ నడియాద్‌వాలా నిర్మించిన హిందీ చిత్రం ‘సికందర్’. ఈ సినిమా ఈ నెల 30న రిలీజ్ కానుంది. కాగా ఈ సినిమా ట్రైలర్‌లాంచ్ ఈవెంట్ ముంబైలో జరిగింది. ఈవెంట్‌లో సల్మాన్ ఖాన్ , రష్మికా మందన్నాల మధ్య 31 సంవత్సరాల వయసు వ్యత్యాసం విషయం ప్రస్తావనకు వచ్చింది. ఈ విషయంపై సల్మాన్ ఖాన్ స్పందిస్తూ–‘‘నాకు, హీరోయిన్ కు (రష్మికా మందన్నాను చూస్తూ..) మధ్య ఏ సమస్య లేదు. హీరోయిన్ తండ్రికీ ఏ ఇబ్బంది లేదు.
మరి.. మీకు సమస్య ఎందుకు భాయ్? (ఆడియన్స్, నెటిజన్లను ఉద్దేశిస్తూ కావొచ్చు). భవిష్యత్‌లో హీరోయిన్ కు వివాహం జరిగి, ఆమెకు ఓ కుమార్తె జన్మించి, ఆ అమ్మాయి కూడా ఇండస్ట్రీలో స్టార్ అయితే తనతోనూ కలిసి నటిస్తాను. వాళ్ల అమ్మ అనుమతి తీసుకుంటాను’’ అని పేర్కొన్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment