హీరోయిన్ రష్మికా మందన్నా(Rashmika Mandanna ) కెరీర్‌లో రానున్న తొలి హారర్ మూవీ ‘థామా’. ఈ చిత్రంలో ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటిస్తున్నారు. హారర్ మూవీ ‘వంజ్య’తో హిట్ కొట్టిన దర్శకుడు ఆదిత్యా సర్పోత్తా ఈ సినిమాకు దర్శకుడు. ‘బాలీవుడ్ నిర్మాత దినేష్ విజన్ నిర్మిస్తున్న ఈ మూవీ చిత్రీకరణ గత ఏడాది విడుదలైంది. తొలి షెడ్యూల్‌ను ముంబైలో జరిపారు. సెకండ్ షెడ్యూల్‌ను గతేడాది డిసెంబరు చివరి వారంలో ఢిల్లీలో ప్రారంభించారు. న్యూ ఇయర్ బ్రేక్ తీసుకుని, మళ్లీ ఈ వారంలో ‘థామా’ చిత్రీకరణను ప్రారంభిస్తున్నారు.
‘థామా’ చిత్రీకరణ కోసం ఢిల్లీ బయలుదేరినట్లుగా తన ఇన్‌స్టా వేదికగా షేర్ చేశారు ఆయుష్మాన్ ఖురానా. అలాగే న్యూ ఇయర్ వేడుకలను పూర్తి చేసుకున్న రష్మికా మందన్నా కూడా ఢిల్లీలో జరిగే ‘థామా’ షెడ్యూల్‌లో ఆయుష్మాన్ ఖురానాతో కలిసి పాల్గొననున్నారని బాలీవుడ్ సమాచారం. జనవరి మూడో వారం వరకు ‘థామా’ షూటింగ్ షెడ్యూల్ జరుగుతుందట.
ఈ ఢిల్లీ షెడ్యూల్ పూర్తయిన తర్వాత ఈ సినిమా చిత్రీకరణ నెక్ట్స్ షెడ్యూల్ ఊటీలో జరగనుందని బీ టౌన్ టాక్. ఇక ‘థామా’ ఈ ఏడాది దీపావళికి రిలీజ్ కానుంది. అలాగే హిందీలో సల్మాన్ ఖాన్‌తో ‘సికందర్’, విక్కీ కౌశల్‌తో ‘ఛావా’ చిత్రాలు చేస్తున్నారు రష్మికా మందన్నా.
‘సికందర్’ సినిమా ఈ ఏడాది ఈద్‌కి, ‘ఛావా’ చిత్రం ఫిబ్రవరిలో రిలీజ్ కానున్నాయి. ఇలా హిందీలో రష్మికా మందన్నా నటించిన చిత్రాలు ఈ ఏడాది మూడు రిలీజ్ కానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment