అదిరి పోయే ఫైట్స్‌ చేసేందుకు రెడీ అవుతున్న ‘సికిందర్‌’ | Salman Khan Sikandar Movie Latest Update | Sakshi
Sakshi News home page

అదిరి పోయే ఫైట్స్‌ చేసేందుకు రెడీ అవుతున్న ‘సికందర్‌’

Published Tue, Jun 11 2024 11:34 AM | Last Updated on Tue, Jun 11 2024 1:51 PM

Salman Khan Sikandar Movie Latest Update

ముంబైలో అదిరి పోయే ఫైట్స్‌ చేసేందుకు సిద్ధం అవుతున్నాడు సికందర్‌. సల్మాన్‌ ఖాన్‌ హీరోగా ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ ‘సికందర్‌’. ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్‌గా నటించనున్నారు. ఇందులో సికందర్‌గా కనిపించనున్నారు సల్మాన్‌ ఖాన్‌. కాగా ఈ మూవీ చిత్రీకరణ ఈ నెల 18 నుంచి ముంబైలో ప్రారంభం కానుంది. 

తొలుత యాక్షన్‌  సన్నివేశాలను చిత్రీకరించేలా సన్నాహాలు చేస్తున్నారు ఏఆర్‌ మురుగదాస్‌. ముంబై షెడ్యూల్‌ తర్వాత విదేశాల్లో ఓ భారీ షెడ్యూల్‌ను జరపాలని ప్లాన్‌  చేస్తోందట యూనిట్‌. సాజిద్‌ నడియాడ్‌ వాలా నిర్మించనున్న ఈ సినిమా వచ్చే ఏడాది రంజాన్‌ సందర్భంగా విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement