మేలో రైడ్‌ | Ajay Devgn Raid 2 to release on May 1 | Sakshi
Sakshi News home page

మేలో రైడ్‌

Published Wed, Mar 26 2025 12:16 AM | Last Updated on Wed, Mar 26 2025 12:16 AM

Ajay Devgn Raid 2 to release on May 1

అజయ్‌ దేవగన్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘రైడ్‌ 2’. రాజ్‌కుమార్‌ గుప్తా దర్శకత్వం వహించారు. వీరిద్దరి కాంబినేషన్‌లో రూపొందిన సూపర్‌ హిట్‌ మూవీ ‘రైడ్‌’ (2018)కి సీక్వెల్‌గా ‘రైడ్‌ 2’ రూపొందింది. ఈ మూవీలో వాణీ కపూర్, రితేష్‌ దేశ్‌ముఖ్‌ ఇతర పాత్రలు పోషించారు. అభిషేక్‌ పాఠక్, కుమార్‌ మంగత్‌ పాఠక్, భూషణ్‌ కుమార్, గౌరవ్‌ నంద, క్రిషణ్‌ కుమార్, ప్రగ్యా సింగ్‌ నిర్మించారు.

ఈ చిత్రాన్ని మే 1న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్‌. ‘‘వాస్తవ ఘటనల నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘రైడ్‌ 2’. ఈ మూవీలో ఐఆర్‌ఎస్‌ అధికారి అమయ్‌ పట్నాయక్‌గా అజయ్‌ దేవగన్‌ నటించారు. వాస్తవ ఘటనలకి సస్పెన్స్, థ్రిల్లింగ్‌ అంశాలు జోడించి తనదైన శైలిలో ఈ మూవీని తీర్చిదిద్దారు రాజ్‌కుమార్‌ గుప్తా. ‘రైడ్‌’ సినిమాలా ‘రైడ్‌ 2’ కూడా ప్రేక్షకులను అలరించేలా ఉంటుంది’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement